ఆ ఒప్పందాలను బయటపెట్టండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ఒప్పందాలను బయటపెట్టండి

ఆ ఒప్పందాలను బయటపెట్టండి

Written By news on Tuesday, December 29, 2015 | 12/29/2015


'ఆ ఒప్పందాలను బయటపెట్టండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో రూ. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు బొత్స సత్యానారాయణ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, టీడీపీ దోపీడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రజలంతా తెలుసుకోవాలని కోరారు. సామాన్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్ లోని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ ప్రతినిధులు ఇప్పుడు రాజీనామా చేసి ప్రైవేటు కంపెనీలక సీఈవోలుగా వెళ్తున్నారని చెప్పారు. ధనదాహంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

నారా లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందేనని అన్నారు. చంద్రబాబు ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రవర్తన మార్చుకోవాలని ముందు లోకేశ్ కు చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, నిజాయితీ గల పోలీసు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Share this article :

0 comments: