
వాస్తవానికి 2009 ఆగస్టు 13న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఒక క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.40లు చెల్లించాలని పేర్కొందన్నారు. దీన్ని పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్థానికంగానే ఇసుక ధరను నిర్ణయించి డ్వాక్రా సంఘాల ద్వారా అమ్మకాలు చేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు. అలా పలు జిల్లాల్లో ఆదాయం లెక్కిస్తే సుమారు రూ. 1,000 కోట్లు చంద్రబాబు, ఆయన వందిమాగధులు దోచుకుతిన్నారనేది స్పష్టం అవుతోందన్నారు.
ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించాలి
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా అధికారిణి వనజాక్షిపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేను వెంటేసుకొని సీఎం చంద్రబాబు జనచైతన్యయాత్ర చేస్తున్నారని విమర్శించారు. సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన ఆ ఎమ్మెల్యేతో బహిరంగ క్షమాపణ చెప్పించాలని బొత్స డిమాండు చేశారు.
చెన్నై బాధితులను ఆదుకోవాలి
చెన్నై వరదలు, వర్షాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తెలుగువారిని తక్షణం టీడీపీ ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర మంత్రి ఒకరి నేతృత్వంలో అక్కడికి ఒక ఉన్నతాధికారుల బృందాన్ని పంపి వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందని బొత్స తెలిపారు.తమిళనాడులోనూ, రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సంభవించిన వరదలపైనా తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో సమావేశమై చర్చించారని తెలిపారు. ఈ అంశాలను బుధవారం తమ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారన్నారు.
ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా?
నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాలని చూస్తే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బొత్స తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? ప్రజా సమస్యలపై గళం విప్పే స్వాతంత్య్రం కూడా లేదా? అని బొత్స ప్రశ్నించారు.
0 comments:
Post a Comment