బాబు భరోసాతోనే అరాచకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు భరోసాతోనే అరాచకాలు

బాబు భరోసాతోనే అరాచకాలు

Written By news on Sunday, December 13, 2015 | 12/13/2015


బాబు భరోసాతోనే అరాచకాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

 సాక్షి, హైదరాబాద్: సెక్స్ రాకెట్‌తో సహా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా తమను కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే అండగా ఉంటారన్న భరోసా కొందరు అధికార పార్టీ నేతలలో బలంగా ఉండడం వల్లే  విజయవాడ నేరాల నగరంగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సెక్స్ రాకెట్ ఉదంతంలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల భాగస్వామ్యం ఉందని తేటతెల్లమవుతోందని.. వారిని  తప్పించాలని ఇప్పటికే పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు.

 అధికారపార్టీ నేతలను తప్పించే యత్నం...
 ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ఇసుక మాఫియా ఉదంతంలో ఒక మహిళా తహసీల్దార్‌పై దాడికి పాల్పడితే..  తమ పార్టీ ఎమ్మెల్యేకి సీఎం కొమ్ము కాసి ఆ అధికారిదే తప్పు అన్నట్టు వ్యవహరించారని గుర్తు చేశారు.అప్పుడే చింతమనేనిని కంట్రోలు చేసి ఉంటే ఇప్పుడు విజయవాడలో మరొక అధికార పార్టీ ఎమ్మెల్యే సెక్స్ రాకెట్ వంటి తప్పుడు వ్యవహారాలకు పాల్పడి ఉండే వారు కాదన్నారు. ఈ ఉదంతంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని పద్మ డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే ఈశ్వరి ఏదో మాట్లాడారన్న అభియోగంపై ప్రభుత్వం కేసు పెట్టదలిస్తే.. అలాంటి మాట లు మాట్లాడిన సీఎం సహా ఎందరో టీడీపీ నేతలపైనా కేసులు పెట్టాలని పద్మ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో  తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారనీ, వారందరి పైనా కేసులు పెడతారా అని ప్రశ్నించారు.

 బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి: సామినేని
 నూతన రాజధాని ప్రాంతం విజయవాడ కేంద్రంగా జరుగుతున్న కాల్‌మనీ వ్యాపారం ఉదంతంలో అధికార పార్టీ నేతల ప్రమేయంపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిగ్గుతేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమేయం ఉంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న 15 ఏళ్లుగా వన్‌టౌన్‌లో నూటికి ఎంత వడ్డీకి అప్పులు ఇస్తున్నారో  అందరికీ తెలుసు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌బృందం అంతా కాల్ మనీ వ్యాపారంలో ఉన్నారు. సీఎం విజయవాడ వస్తున్నారంటే పెద్దపెద్ద హోర్డింగ్ పెట్టేది  ఈ వ్యాపారులే. ఆ పర్యటనల్లో పాల్గొనేది, వాహనాలు ఏర్పాటు చేసేది, పేపర్ ప్రకటనలిచ్చేది వారే. ’ అని ఉదయభాను అన్నారు.
Share this article :

0 comments: