లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్?

లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్?

Written By news on Thursday, December 17, 2015 | 12/17/2015


చంద్రబాబుకు డాక్టరేటా?
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఏం సాధించారని షికాగో యూనివర్సిటీ చంద్రబాబునాయుడుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. 19 నెలల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్ అని ధ్వజమెత్తారు. ఇలాంటి డాక్టరేట్‌లు ఇక్కడి పాలనలో మగ్గుతున్న ప్రజలు ఎలాగో ఇవ్వరు, అందుకే సప్త సముద్రాల అవతల ఉన్న వర్సీటీ నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు 300కి పైగా వాగ్దానాలు చేసి , ఏ ఒక్క హామీ నెరవేర్చనందుకు డాక్టరేట్ ఇచ్చారా అని రోజా ప్రశ్నించారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ లాంటిది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు కాబట్టి ఈ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నారా అన్నారు.. ఓటుకు నోటు కేసులో దొరికినందుకు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వడంతో షికాగో విశ్వవిద్యాలయ స్థాయి ఇంతగా తగ్గిపోయిందా అన్న అనుమానం, బాధ కలుగుతోందని రోజా వ్యాఖ్యానించారు. మూడు వందలకు పైగా వాగ్దానాలు  చేసి ఏ ఒక్కటీ అములు చేయకపోవటం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏనాడూ కనీవినీ ఎరుగని సంఘటన అని అందుకే ఈ డాక్టరేట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.  
Share this article :

0 comments: