వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య

వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య

Written By news on Saturday, December 5, 2015 | 12/05/2015


వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య
హైదరాబాద్ : వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య శనివారం తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ వైఎఎస్ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా దొమ్మాటి మాట్లాడుతూ... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అన్నారు. వైఎస్ జగన్, పొంగులేటి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పుడు బడుగుల పార్టీ అయిన టీడీపీ ఇప్పుడు హైజాక్ అయిందని, ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందని దొమ్మాటి సాంబయ్య వ్యాఖ్యానించారు.  బడుగు, బలహీన వర్గాలకు దళిత, గిరిజనులకు టీడీపీ దూరమైందన్నారు. తెలంగాణ టీడీపీలో కొంతమంది నాయకులు టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని దొమ్మాటి విమర్శించారు. టీఆర్ ఎస్ కు కోవర్టులుగా తెలంగాణ టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  టీడీపీ నేతలంతా ...ఆ పార్టీని కూకటి వేళ్లతో పెకలించే పనిలో ఉన్నారని అన్నారు. కాగా దొమ్మాటి సాంబయ్య ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: