తండ్రీకొడుకులు కోట్లు గడిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రీకొడుకులు కోట్లు గడిస్తున్నారు

తండ్రీకొడుకులు కోట్లు గడిస్తున్నారు

Written By news on Tuesday, December 8, 2015 | 12/08/2015


తండ్రీకొడుకులు కోట్లు గడిస్తున్నారు
బెజవాడ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత: వైఎస్సార్‌సీపీ నేత అంబటి

 గుంటూరు (పట్నంబజారు): రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకే శ్‌లు మద్యం, మైనింగ్‌లను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని కోట్లు గడిస్తున్నారని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపిం చారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పెద్ద అవినీతిపరుడు కావడంతో ప్రభుత్వ శాఖలన్నీ లంచాల శాఖలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించిన కొందరు మృత్యువాత పడటం, మరికొందరు అస్వస్థతకు గురైన ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు.

ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తన పదవికి రాజీనామా చేసి విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు. విజయవాడ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గేషియా ప్రకటించాలని డి మాండ్ చేశారు.
Share this article :

0 comments: