టీడీపీ ఎమ్మెల్యే పై బిగిస్తున్న ఉచ్చు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ఎమ్మెల్యే పై బిగిస్తున్న ఉచ్చు!

టీడీపీ ఎమ్మెల్యే పై బిగిస్తున్న ఉచ్చు!

Written By news on Sunday, December 13, 2015 | 12/13/2015


టీడీపీ ఎమ్మెల్యే పై బిగిస్తున్న ఉచ్చు!
విజయవాడ : కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై ఉచ్చు బిగుస్తుంది. 'కాల్ మనీ' ప్రధాన సూత్రధారితో కలసి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇప్పటికే ఐదు సార్లు విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.

అలాగే ఎమ్మెల్యే హోదాలో బోడె ప్రసాద్ కొన్ని సెటిల్ మెంట్లలో కూడా జోక్యం చేసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయని తెలిసింది. అంతేకాకుండా కాల్ మనీలో బోడె ప్రసాద్ రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం అందుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యే కాల్ మనీ సూత్రధారుడితో విదేశాల్లో దిగిన ఫొటోలు మీడియాలోని వివిధ చానళ్లలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు

మరోవైపు గుంటూరు జెడ్సీలోని ఓ నేతతోపాటు కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన మరో టీడీపీ నేత కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన సదరు నేత సోదరుడి ఫైనాన్స్ వ్యాపారంపై కూడా పోలీసులకు కాల్ మనీ బాధితులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ పాత్రపై కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు.

http://www.sakshi.com/news/top-news/bode-prasad-key-role-in-call-money-297631?pfrom=home-top-story
Share this article :

0 comments: