టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?

టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?

Written By news on Tuesday, December 22, 2015 | 12/22/2015


'టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, కళావతి, పుష్పశ్రీవాణి, రాజేశ్వరి ఆరోపించారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.

అసెంబ్లీలో ఈ రోజు కన్నీరు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  కాల్ మనీ సెక్స్ రాకెట్ ను పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై చర్చకు నిరాకరించడం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేయనందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: