
ప్రజలకు టీడీపీ దూరమైపోయింది: సాంబయ్య
సాక్షి, హైదరాబాద్:వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేసిన దొమ్మాటి సాంబయ్య శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. జగన్ ఆయనకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ... ఒకప్పుడు బడుగుల పార్టీగా పేరున్న టీడీపీ ఇప్పుడు హైజాక్ అయిందని... బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజనులకు దూరమైందని చెప్పారు.
టీడీపీలోని కొందరు నాయకులు టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని.. ఆ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రజల నమ్మకం, విశ్వాసం కోల్పోయిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించి వేసే పనిలో కొందరు నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పొంగులేటిల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment