ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా?

ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా?

Written By news on Wednesday, December 9, 2015 | 12/09/2015


మేం రాగానే సంపూర్ణ మద్యనిషేధం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటన

 సాక్షి, విజయవాడబ్యూరో: తమ ప్రభుత్వం రాగానే రాష్ర్టంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని విపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన విజయ వాడలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని వివిధ ఆసు పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులనూ ఆయన పరామర్శించారు. సంఘటన వివరాలను వారిని అడిగి తెలుసు కున్నారు. అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి స్తుండడం విచారకరమన్నారు. షాపుల్లో ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరలను అనుమతి స్తూ కల్తీని ప్రోత్సహిస్తు న్నారని, అందుకోసం కిందిస్థాయి నుంచి సీఎం వరకు మామూళ్లు అందుతున్నాయని జగన్ విమర్శించారు.... వివరాలు ఆయన మాటల్లోనే...

 వచ్చేది ప్రజాప్రభుత్వమే.. వెంటనే నిషేధం
 ‘‘చంద్రబాబుకు బుద్ధి ఉంటే మద్య నిషేధం అమలు చేయాలి. రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వమే వస్తుంది. ప్రజల ప్రభుత్వం వస్తుంది. అపుడు రాష్ర్టంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో పర్మిషన్ ఇస్తే పరవాలేదు. బాగా డబ్బులున్నోడు.. సూట్లు బూట్లు వేసుకుని స్టార్ హోటల్‌లో తాగి పడిపోయినా ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా చదువుకునే పిల్లల చదువు నాశనమౌతోంది. దారి తప్పుతున్నారు. పదో తరగతి పాసవుతూనే పిల్లలు మద్యం షాపుల వైపు చూస్తున్నారు. పిల్లలు చదువుకునే చోట ఎదురుగా మద్యం షాపులు పెడుతున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.  రాష్ర్టంలో ఎక్కడా మద్యం లేకుండా పూర్తిగా నిషేధం విధిస్తామని చెబుతున్నా.

 ఆరింటికే షాపులు రెడీ...
 ఇంత దారుణమైన పరిస్థితి మధ్య మాట్లా డాలంటేనే బాధ అనిపిస్తోంది.. సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదో కానీ మద్యం షాపుల తాళాలు మాత్రం కరెక్ట్‌గా ఆరింటికి తెరుస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట, తెల్లవారుజామున 3 గంటల వరకూ మద్యంషాపులు తెరిచి అమ్ముతున్నారు.. ప్రజలతో ఎంత ఎక్కువ తాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండటం మన దౌర్భాగ్యం.. తాగించడం ఎలా అని ప్రభుత్వం లెక్కలు కడుతోంది.. ఈ నెల ఇంతే తాగారా? వచ్చే నెల ఇంకా ఎక్కువ తాగించాలంటే ఎలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది.. మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తుంటే దానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా?.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలను, కల్తీని ప్రోత్సహిస్తున్నారు.. ఇందుకు ప్రతీ షాపు నుంచి అధికారులు, పై అధికారులు, మంత్రులు, సీఎం, ముఖ్యమంత్రి కొడుక్కి మామూళ్లు అందుతున్నాయ్.. సాక్షాత్తూ సీఎం ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలుచేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మిస్తున్నారంటే పాలన ఎలా ఉందో తెలుస్తోంది. కల్తీ మద్యం వ్యవహారాలపై అసెంబ్లీలోనూ నిలదీస్తాం.

 బెల్టుషాపులనూ వేలం వేస్తున్నారు..
 బెల్ట్‌షాపులు తొలగిస్తామని ప్రమాణస్వీకారం నాడు సంతకం చేసిన సీఎం ఇప్పుడు అదే బెల్ట్‌షాపుల కోసం వేలంవేసే పరిస్థితిని తీసుకొచ్చారు. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి సొంత నియోజకవర్గంలోని కరఅగ్రహారంలో బెల్ట్‌షాపునకు వేలం నిర్వహించారు. రాష్ట్రంలో 4,300 మద్యం షాపులు ఉంటే ఒక్కో మద్యం షాపునకు ఏకంగా 15 నుంచి 20 బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఆడవాళ్లు బయట తిరిగే పరిస్థితి లేదు. అన్నింట్లోనూ చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఆయన చెప్పేదొకటి  చేసేదొకటి. రూ.87 వేల కోట్ల రైతు రుణమాఫీ, బాబొస్తే జాబొస్తుంది, రూ.2వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ.. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు మోసం చేశాడు. బెల్ట్‌షాపులు తీస్తానంటాడు.. యూటర్న్ తీసుకుంటాడు. ఇసుక మొదలుకొని అన్ని ఆదాయాలూ చంద్రబాబు, ఆయన కొడుకుకే చేరుతున్నాయి.

 రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి
 కేవలం ఐదులక్షలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదం. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చెవులుపట్టుకుని ఈ ప్రభుత్వం గుంజీలు తీయాలి. అపుడే ఆ బాధిత కుటుంబాలు కాస్తో కూస్తో ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తాయి. ఐదుగురు చనిపోయి 24 గంటలు గడిచినా ఆ మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం కాలేదు. రికార్డులు తిరగరాసి, మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోవడం, మరెంతోమంది ఆస్పత్రిపాలు కావడానికి పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన ఐదు మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబసభ్యులను జరిగిన ఘటనపై ఆరా తీశారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్యం బాధితులను పరామర్శించారు. సెంటిని, ఆంధ్రా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న వారిని కలిసి వారికి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా ప్రతాప అప్పారావు, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, సామినేని ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

 వీఆర్‌ఏల డిమాండ్లు న్యాయమైనవి
 దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన వైఎస్‌జగన్

 ‘పే స్కేల్ కావాలని, రెగ్యులరైజ్ చేయాలని వీఆర్‌ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్దమైనవి, వారికి పూర్తిగా మద్దతిస్తున్నా’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో 37 రోజులుగా వీఆర్‌ఏలు ఆందోళనలు, రిలే దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షా శిబిరాన్ని జగన్ మంగళవారం సందర్శించి మద్దతు ప్రకటించారు.

 ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా?

 గుజరాత్‌లో మద్యం అమ్మకాలు లేక పోయినా ఆ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. బిహార్‌లో నితీష్ కుమార్ కూడా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. మన రాష్ర్టంలో మాత్రం ప్రజలతో విచ్చల విడి గా తాగించి ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన దారుణంగా ఉంది. డిస్టి లరీ లెసైన్సులు తమ వాళ్లకే సెలక్టివ్‌గా ఇస్తున్నారు. మద్యం అమ్మకాల్లో 2014లో రూ.6,632 కోట్లు వస్తే. ఈ ఏడాది అక్టోబర్ వరకు 7 నెలల్లోనే రూ.7,050 కోట్లు దాటిం ది. ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు మద్యం ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రజలతో తాగిస్తోంది. రానున్న 5 నెలలకు రూ.5 వేల కోట్లు కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.12వేల కోట్లు మద్యం తాగించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది.
Share this article :

0 comments: