అంబేద్కర్‌ను కూడా వాడుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంబేద్కర్‌ను కూడా వాడుకుంటున్నారు

అంబేద్కర్‌ను కూడా వాడుకుంటున్నారు

Written By news on Thursday, December 17, 2015 | 12/17/2015


'అంబేద్కర్‌ను కూడా వాడుకుంటున్నారు'
హైదరాబాద్ :
కాల్‌మనీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు అంబేద్కర్‌ను కూడా అధికారపక్షం వాడుకుంటోందని, దీనివల్ల ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందని అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ''అంబేద్కర్ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఆయనను కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు. ఒక ఎమ్మెల్యే నిందితుడితో పాటు విదేశాలకు వెళ్లాడు. ఎమ్మెల్యే తిరిగొచ్చినా నిందితుడు మాత్రం రాలేదు. అయినా ఎమ్మెల్యేను పోలీసులు విచారణ కూడా చేయరు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంది'' అన్నారు.

అంతకుముందు కాల్‌మనీ అంశంపై చర్చించాలన్న వైఎస్ఆర్‌సీపీ డిమాండును స్పీకర్, అధికారపక్షం పట్టించుకోకపోవడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు తీవ్ర గందరగోళం కొనసాగింది. చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడంతో.. వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. 344 నిబంధన కింద చర్చకు రేపు అనుమతిస్తామని, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందువల్ల ఈ అంశాన్ని వదిలిపెట్టాలని స్పీకర్ అన్నారు. ఈ సమయంలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు.

అయితే, వైఎస్ జగన్‌కు అసెంబ్లీ సంప్రదాయాలు తెలియవని, వాటికి వ్యతిరేకంగా సభను అడ్డుకోవాలని అనుకుంటున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. పార్లమెంటులో రెండు రోజుల పాటు అంబేద్కర్ - రాజ్యాంగం అన్న అంశంపై వివరంగా చర్చ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత శాసనసభ మొదలైందని, సంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా చర్చించాలని తాము అనుకున్నామని చెప్పారు. ఆ విషయాలు తెలియకుండా ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నిందితుడని అంటున్నారని, కానీ అసలు ఓ కేసులో నిందితుడే ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కంటే దురదృష్టకరం మరోటి ఉండదని ఆయన చెప్పారు.

చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు కూడా బీఏసీలో అంబేద్కర్ గురించిన చర్చకు అంగీకరించి, ఇప్పుడు ప్రొసీడింగ్స్‌ను అడ్డుకుంటున్నారని అన్నారు. సభ్యులపై చర్యలు తీసుకోకపోతే సభకు గౌరవం ఉండదని ఆయన చెప్పారు. శాసన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Share this article :

0 comments: