ప్రత్యేక హోదా ఇవ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా ఇవ్వండి

ప్రత్యేక హోదా ఇవ్వండి

Written By news on Wednesday, December 16, 2015 | 12/16/2015


ప్రత్యేక హోదా ఇవ్వండి
♦ కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
♦ ఇది టీడీపీ-బీజేపీ ఎన్నికల హామీ అన్నది మరువొద్దని సూచన

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న ఇతర అంశాల్నీ అమలు చేసేందుకు సత్వర కార్యాచరణ చేపట్టాలని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభలో ‘అనుబంధ పద్దుల’పై జరిగిన చర్చలో మాట్లాడారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమనే అంశం ఎంతో ముఖ్యమైందన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో అది మొదటి అంశంగా ఉన్నవిషయాన్ని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టు తమ రాష్ట్రానికి ఎంతో కీలకమని, తమ రైతులకు జీవరేఖని మిథున్‌రెడ్డి చెప్పారు. అందువల్ల పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడం తమకెంతో అవసరమన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులు తగిన రీతిలో ఉండట్లేదన్నారు. పెరుగుతున్న వ్యయాన్ని సర్దేందుకూ సరిపోవట్లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగితే అంచనా వ్యయం చాలా పెరుగుతుందని, దీనివల్ల అంతిమంగా ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. ఉపాధి కూలీలకు పనిదినాల్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని 50 శాతం జిల్లాలు కరువులో ఉన్నాయని, ఏపీ కూడా కరువులో చిక్కుకుందని, ఈ నేపథ్యంలో ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రస్తుతమున్న వందరోజుల పనిదినాల్ని 200 రోజులకు పెంచాలని కోరారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) ఖరారులో స్వామినాథన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు.
Share this article :

0 comments: