అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి

అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి

Written By news on Sunday, December 27, 2015 | 12/27/2015


 కార్యకర్తల కుటుంబసభ్యులతో వైఎస్ జగన్
 బెంగళూరులో అనుమానాస్పదంగా మృతి
 చెందిన నలుగురి కుటుంబాలకు పరామర్శ

 
కడప: పోలీసుల చర్యలకు భయపడి బెంగళూరుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన నలుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అధైర్య పడవద్దని పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. వైఎస్‌ఆర్ జిల్లా తొండూరు మండలం భద్రంపల్లె గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, లింగాల మండలం అంకేవానిపల్లెకు చెందిన వీరచంద్రారెడ్డిలు ఇటీవల బెంగళూరు సమీపంలోని కోళ్ల ఫారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ శనివారం ఉదయం భద్రంపల్లెలోని మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు అరుణ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరుణ్‌కుమార్‌రెడ్డి భార్య గంగాదేవి జగన్‌ను చూడగానే కన్నీటిపర్యంతమయ్యారు. అరుణ్‌కుమార్‌రెడ్డి పిల్లలు దుష్యంత్‌రెడ్డి, కృష్ణవేణిలను జగన్ దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉంటామన్నారు. అనంతరం సమీపంలోనే రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి పద్మావతి, కుమారుడు అనిల్, కుమార్తె అనితలను ఓదార్చారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని భార్య వెంకటలక్షుమ్మ, కుమారులు మునిరెడ్డి, పక్కీరారెడ్డిలను ఓదార్చారు.
అనంతరం లింగాల మండలం అంకేవానిపల్లెకు చెందిన వీరచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య విజయమ్మ, కుమారుడు శివప్రకాష్‌రెడ్డి, కుమార్తె దీప్తిలను ఓదార్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. ఆందోళన చెందవద్దని ధ్యైర్యం చెప్పారు. ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: