హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా!

హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా!

Written By news on Tuesday, December 8, 2015 | 12/08/2015


హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా!
పాల వ్యాన్‌ను సీజ్ చేసిన పోలీసులు

 తిరుపతి రూరల్: ఎర్రచందనం తరలించేందుకు అనువుగా ఏర్పాటుచేసిన అరలతో కూడిన పాలవ్యాన్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్యాక్టరీ లోగో ఉండటం చర్చనీయాంశంగా మారింది. తిరుపతికి సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఎంఆర్ పల్లి పోలీసులు సోమవారం తనిఖీ చేస్తుండగా హెరిటేజ్ లోగో ఉన్న పాల వ్యాను నడుపుతున్న వ్యక్తులు పోలీసుల్ని చూిసి వాహనాన్ని వదిలి పారిపోయారు. అందులో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలున్నాయి. దీంతో వ్యానును ఎం.ఆర్.పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న వ్యాన్‌పై ఎపీ 03టీ 4959 అని నంబర్ ఉంది. ఇంజన్ నంబర్‌తో ట్యాలీ చేయగా వ్యాన్ నంబర్ దొంగదని తేలింది. ఈ వ్యాన్ చిత్తూరు వ్యక్తిదిగా గుర్తించారు. సమగ్ర విచారణ కోసం ఎస్‌ఐ ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఏర్పాట్లను చూస్తేపాలవ్యానులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానంగా ఉందని ఎం.ఆర్.పల్లి సీఐ తమ్మిశెట్టి మధు తెలిపారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పాలవ్యాన్‌కు హెరిటేజ్ కంపెనీతో సంబంధం లేదని కాశిపెంట్ల  హెరిటేజ్ ఫుడ్స్ డీజీఎం వంశీధర్‌రెడ్డి ఖండించారు.

http://www.sakshi.com/news/district/red-sandalwood-smuggling-behind-the-name-of-heritage-296381
Share this article :

0 comments: