ఎన్ని లక్షల గొంతులు వద్దంటున్నా. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్ని లక్షల గొంతులు వద్దంటున్నా.

ఎన్ని లక్షల గొంతులు వద్దంటున్నా.

Written By news on Thursday, December 10, 2015 | 12/10/2015

ఎన్ని లక్షల గొంతులు తమకు బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా.. చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఆయన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేంద్రం చెబితే ఒకసారి కాస్త వెనక్కి తగ్గిన చంద్రబాబు.. ఆ తర్వాత మళ్లీ గ్రామసభలు జరిగాయంటూ అబద్ధాలు చెప్పి బాక్సైట్ తవ్వకాల విషయంలో ముందుకెళ్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • ఈవాళ ఎన్నివేల మంది ఎంతో దూరం నుంచి నడిచైనా సరే ఇక్కడకు వచ్చి.. ఆ కష్టాన్ని మాత్రం ఏ ఒక్కరి మొహంలో ఎక్కడా చూపించకుండా, కష్టం అనిపించినా, దూరం నుంచి వచ్చామన్న తలంపును సైతం పక్కనపెట్టి, ఎండను లెక్క చేయకుండా, భోజనానికి వెళ్లాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను పంచిపెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
  • ఈవాళ బాక్సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ లక్షల గొంతులు ఒక్కటై ఇక్కడ బాక్సైట్ మైనింగ్ మాకొద్దని గట్టిగా చెబుతున్నా కూడా చంద్రబాబు నాయుడికి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు
  • బాక్సైట్ ఎందుకు వద్దంటున్నాం, దానివల్ల మనకు జరిగే నష్టాలేంటో నేను మాట్లాడే ముందు మీకు మైకిస్తా.. చంద్రబాబుకు అర్థం అయ్యేలా మీ నోట్లోంచి మీరే చెప్పండి. చంద్రబాబుకు గట్టిగా బుద్ధొచ్చేలా గడ్డిపెట్టేలా మాట్లాడండి.
  • ఇన్నివేల మంది ముందుకొచ్చి బాక్సైట్‌పై పోరాటానికి గొంతుకలిపారు. అయినా చంద్రబాబుకు మాత్రం కనిపించడం లేదు.
  • మన్యం ఏమంటోందో చంద్రబాబుకు అర్థం కావాలి.
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి ప్రయత్నం చేసి, తర్వాత వెనకడుగు వేశారు.
  • ఎన్నికలు అయిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని చెప్పారు
  • ఇక్కడ గ్రామసభలు కూడా జరగలేదని, గ్రామసభలు ఒప్పుకోలేదని 2011లో గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు
  • ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక మొన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసి, అందులో మాట మార్చేశారు. గ్రామసభలు జరిగాయని, అవి బాక్సైట్ మైనింగ్ కావాలంటూ తీర్మానించాయని అన్నారు.
  • ఇంతకుముందు సర్పంచిగా ఉన్న వెంకటరమణ గ్రామసభలో తీర్మానం చేశారా.. (లేదంటూ ప్రజలు చేతులు ఊపారు).
  • తాను తీర్మానం చేయలేదని వెంకటరమణ చెబుతున్నా, చంద్రబాబు మాత్రం ఆరోజే తీర్మానం జరిగిపోయిందని చెబుతున్నారు.
  • గ్రామసభ జరిగి ఉంటే పుస్తకాల్లో ఉండాలి.. అవి కూడా ఏమీ లేవని ప్రస్తుత సర్పంచి చెప్పారు.
  • గ్రామాలు ఏవీ అంగీకరించకపోయినా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్లిపోతున్నారు.
  • ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా
  • కారణం ఏమిటంటే, రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు 5లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియామకం రాజ్యాంగ హక్కు. అందులో మూడొంతుల మంది గిరిజన శాసన సభ్యులు అయి ఉండాలని చెబుతున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన స్థానాలుంటే ఆరింటిలో వైఎస్ఆర్‌సీపీ సభ్యులున్నారు. కమిటీ వేస్తే, అందులో అంతా వైఎస్ఆర్‌సీపీ సభ్యులే ఉంటారు కాబట్టి, బాక్సైట్‌కు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి గిరిజన సలహా కమిటీ నియామకాన్ని కూడా వాయిదా వేస్తున్నారు
  • కానీ మీరు చేసేదేమీ ఎక్కువ రోజులు సాగదు. ఒత్తిడి తెచ్చి, గిరిజన సలహా కమిటీ వేయించి, అందులో గట్టిగా వ్యతిరేకిస్తాం
  • చంద్రబాబు జారీ చేసిన జీవోను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలని ఇన్ని గొంతులు పోరాడుతున్నాయి
  • చంద్రబాబు ఏం చేశారో, రాజశేఖరరెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసు. తర్వాతి సీఎంలు ఏం చేశారో, అధికారంలోకి మళ్లీ వచ్చాక చంద్రబాబు.. ఏం చేశారో కూడా తెలుసు.
  • రాజశేఖరరెడ్డి చనిపోయి ఆరేళ్లవుతున్నా.. ఆయనను తప్పుపడుతూ కొత్తగా బాక్సైట్ తవ్వకాలకు జీవో విడుదల చేస్తున్నారు
  • చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, లేదా జగన్ మోహన్ రెడ్డి లేదా మరే ముఖ్యమంత్రి అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ల గుండెల్లో స్థానం ఉంటుంది.
  • బాక్సైట్ గనులు ఇచ్చే క్రమంలో చంద్రబాబు గిరిజన సలహా కమిటీచేత అడ్డగోలు నిర్ణయాలు తీయించే కార్యక్రమాలు చేయించాడు
  • బాక్సైట్ గనులు ఏమైనా చేయాల్సి వస్తే గిరిజనులు మాత్రం, లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేయాలి.
  • కానీ అప్పట్లో, 24.5.200న చంద్రబాబు.. బలవంతంగా గిరిజన సలహా కమిటీ నియమించి తన ఎమ్మెల్యేలతో బలవంతంగా రుద్దించే ప్రయత్నం చేశాడు
  • అందులో.. ఇక్కడ గనులు వీళ్లు కాదు.. ఎవరైనా తవ్వుకోవచ్చని దుబాయ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబు తీర్మానం చేయించాడు
  • ఈవాళ అదే చంద్రబాబు ఆరోజు అంతటి గట్టి ప్రయత్నాలు చేసి, మైనింగ్ చట్టాలను కూడా మార్చాలని కేంద్రంమీద ఒత్తిడి తెచ్చారు
  • గిరిజనులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని కేంద్రం చెప్పడంతో మనం బతికిపోయాం
  • తర్వాత చంద్రబాబుకు అధికారం పోయింది.. రాజశేఖరరెడ్డి వచ్చారు.
  • ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపడితే గిరిజనులు ఇబ్బంది పడతారని, ప్రభుత్వంతో చేయించాలని.. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని.. ఒక అడుగు ముందుకేశారు.
  • తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పాలి. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఆరోజు కాస్త ముందుకు వెళ్లినా, తర్వాత దాన్ని ఆపించేశారు.
  • తానేం చెప్పినా పార్టీ ఒప్పుకొంటుందని తెలిసినా, గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని అర్థమైన తర్వాత నుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే ఆయన హయాంలో జరగలేదు..
  • ఆయన మరణించిన ఆరేళ్ల తర్వాత, చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పుడు జరుగుతోంది.
  • చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు చెప్పాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడాడు.
  • రాజశేఖరరెడ్డి గారు చనిపోయాక.. ఇప్పుడు మళ్లీ ఆయన గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
  • 2011 సంవత్సరంలో ఇదే గిరిజన ప్రాంతానికి జేసీ కాలా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్ వేసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాను.
  • వాళ్లిచ్చిన నివేదికను కేంద్రం కూడా పక్కన పెట్టేస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఒకటి కాదు, రెండు కాదు.. 10.2.2015న ఒకటి, 23.2.2015, 21.7.2015, 5.8.2015న ఇంకోటి లేఖలు కేంద్రానికి రాసి, ఒత్తిడి తెస్తే కేంద్రం అనుమతి ఇచ్చింది.
  • ఇదే చంద్రబాబు కాలా కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్‌కు లేఖ రాశాడు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తవ్వకాలకు తానూ వ్యతిరేకం అన్నారు.
  • సీఎం అయిన తర్వాత బాక్సైట్ గనులకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్లేటు ఫిరాయించాడు.
  • ఒక శ్వేతపత్రం విడుదల చేశాడు. అందులో రకరకాల మాటలు మాట్లాడాడు. అన్నీ అబద్ధాల పుట్ట.
  • జేరాల గ్రామ పంచాయతీ ఆరోజే తీర్మానం చేసిందని అంటాడు.
  • అప్పుడు గవర్నర్‌కు చెప్పేది ఈయనే, ఇప్పుడు ఈ మాట అనేదీ ఈయనే.
  • తనకు అనుకూలంగా ఉంటే ఒకమాట, లేకపోతే మరోమాట చెబుతాడు.
  • ఈ గ్రామానికే అప్పట్లో వెంకటరమణ సర్పంచి. ఆయనే గ్రామసభ జరగలేదని స్వయంగా చెబుతున్నాడు. అయినా చంద్రబాబు మాత్రం సభ జరిగిందని శ్వేతపత్రంలో రాస్తున్నాడు.
  • ఇదే చంద్రబాబు జీవో 97 అని కేంద్రం నుంచి క్లియరెన్సు వచ్చాక విడుదల చేశాడు.
  • గిరిజన ప్రాంతంలో అలజడి మొదలయ్యేసరికి ఈ జీవో ఎలా వచ్చిందో తనకు తెలియదని, దాన్ని అబెయెన్స్‌లో పెట్టానని అంటాడు
  • ప్రభుత్వం జీవో ఇస్తే చేస్తుంది, ఉపసంహరించుకుంటే చేయదు. మధ్యలో పెండింగులో పెట్టడం ఏ ముఖ్యమంత్రి దగ్గరా వినలేదు
  • ఈరోజు కూడా చంద్రబాబు కనీసం ఒకటి చేసినా... చేశానని చెప్పుకొనే దమ్ము, ధైర్యం లేవు.
  • చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను ఎందుకు ఉపసంహరించుకోవట్లేదని గట్టిగా అడుగుతున్నా.
  • 15.8.2015న కేంద్రం రెండోస్థాయి పర్యావరణ అనుమతి ఇస్తూ.. గ్రామసభలు మళ్లీ జరగాలని ఒక క్లాజు పెట్టింది. గిరిజన సలహా మండలి సిఫార్సు కూడా ఉండాలని మరో క్లాజు పెట్టింది.
  • అయినా గిరిజన సలహా మండలిని ఎందుకు వేయడం లేదని చంద్రబాబును అడుగుతున్నా
  • చంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం.. అన్న మూడు పదాల చుట్టే తిరుగుతుంది.
    ఎన్నికలకు ముందు టీవీలు ఆన్ చేస్తే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇళ్లకు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా లేదా, జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా.. లేదా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారా లేదా?
  • ప్రతి విషయంలో మోసం, దగా, అబద్ధాలు. ఈరోజు చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పాలి.
  • చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతున్నాం.
  • బాక్సైట్ తవ్వకాలకు ఆయన అనుమతి ఇచ్చినా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు
  • నువ్వు నిజంగా మంచోడివైతే, మాటమీద నిలబడే తత్వం ఉంటే వెంటనే జీవోను రద్దు చేసి, మాట నిలబెట్టుకోండి.
  • కనీసం ఈ మాటైనా నిలబెట్టుకోవాలని గట్టిగా అడుగుతున్నాం.
  • అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం.
  • చంద్రబాబు మన వెంట్రుక కూడా పీకలేడని చెబుతున్నాం
  • మీకు అన్నిరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
  • అన్ని రకాలుగా మనం గట్టిగా పోరాడుదాం.

    ఇక్కడున్న యువకులు డీఎస్సీ పరీక్షలు రాసి సంవత్సరం అయిపోయింది. పిల్లలు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ప్రభుత్వోద్యోగాలు కదా అని చెప్పి, ఇంట్లో నుంచి తల్లిదండ్రులు పుస్తెలమ్మి డబ్బులు పంపితే హాస్టళ్లలో ఉండి చదువుకుని డీఎస్సీ రాస్తే.. వాళ్లకు ఉద్యోగాల మాట దేవుడెరుగు, క్లస్టర్ స్కూళ్లని కొత్త విధానం తెస్తున్నాడు. దాంతో ఉన్న స్కూళ్లు కూడా మూసేసి.. 7వేల మంది టీచర్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా బుద్ధి రావాలి, బుద్ధి వచ్చేవరకు పోరాడుదాం.
Share this article :

0 comments: