Home »
» ఏవిధంగా రోజాను సస్పెండ్ చేస్తారు?
ఏవిధంగా రోజాను సస్పెండ్ చేస్తారు?
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏవిధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఇంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని, ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారని నిలదీశారు. ఆదివారం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాని, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును కానీ దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కామ అంటే కాల్ మనీ అనే ఉద్దేశంతో రోజా వ్యాఖ్యలు చేశారని అన్నారు.టీడీపీ ప్రభుత్వం తమ పనులను స్పీకర్ చేత చేయిస్తోందని, స్పీకర్ ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం వాదనను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. కాల్ మనీ సమస్యను స్టేట్ మెంట్ ద్వారా క్లోజ్ చేసే కుట్ర జరుగుతోందని అన్నారు.
0 comments:
Post a Comment