ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న టీడీపీ నేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న టీడీపీ నేత

ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న టీడీపీ నేత

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015

రేపల్లె (గుంటూరు) : ప్రభుత్వ అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె పురపాలక సంఘంలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై తెలుగు దేశం పార్టీ నేత, కాంట్రాక్టర్ గోగినేని శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం దాడికి దిగారు.

బిల్లులకు సంబంధించిన విషయంలో ఏఈతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాసరావు.. ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అధికారిని అడ్డుకుని ఆయనపై దాడి చేశాడు. దీంతో ఆయన కణత వద్ద గాయం అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ వర్గాలు అక్కడికి చేరుకుని ఇద్దరికి రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నాయి.

http://www.sakshi.com/news/home-latest-news/tdp-leader-attacks-government-officer-298884?pfrom=home-latest-story
Share this article :

0 comments: