
కువైట్ లో ఘనంగా జన నేత జగన్ గారి పుట్టిన రోజు వేడుకలు కువైట్: మలియా ప్రాంతములో వైకాపా కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో జననేత వై.యస్. జగన్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమములో వైకాపా కో కన్వీనర్లు గోవింద్ నాగరాజు, యం.వి నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రేహామాన్ ఖాన్, యన్. మహేశ్వర్ రెడ్డి, యం. చంద్రశేఖర్ రెడ్డి, సలహాదారులు నాగరెడ్డి చంద్ర, అబుతురాబ్, సభ్యులు ఎ. ప్రభాకర్ రెడ్డి, మర్రి కల్యాణ్, పి. సురేష్ రెడ్డి, ఎ.వి. సుబ్బారెడ్డి, దుగ్గి గంగాధర్, ఆకుల చలపతి, రమణ యాదవ్, జి. ప్రవిణ్ కుమార్ రెడ్డి, సయ్యద్ సజ్జద్, రమణ రెడ్డి, షా హుస్సేన్, రఫీఖ్ ఖాన్, రాకెట్ రఫీ, బాలకృష్ణ రెడ్డీ, యు. శివకుమార్ రెడ్డి, మహాబుబ్ బాష, మరియు సి. చంద్రశేఖర్ రెడ్డీ, కె. సురేంద్ర రెడ్డి, బి. శివారెడ్డి, వాసు, శ్రీనివాసులు, మల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోరకు పోరాడుతున్నా ఏకైక నాయకుడు జగన్ గారని తన తండ్రి ఆశయ సాధన పనిచేస్తున్న జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి పేద బడుగు బలహీన మైనారిటి సోదరులకు మంచి జరుగుతుందని 2019లో జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే బాధ్యత మనందరి అని తెలిపారు. కమిటి సభ్యులు మరియు అభిమానులు కేక్ కట్ చేసి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
0 comments:
Post a Comment