బొండా బూతులు తిట్టినా పట్టించుకోలేదు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొండా బూతులు తిట్టినా పట్టించుకోలేదు..

బొండా బూతులు తిట్టినా పట్టించుకోలేదు..

Written By news on Thursday, December 24, 2015 | 12/24/2015


బొండా బూతులు తిట్టినా పట్టించుకోలేదు..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన వాస్తవ ఫుటేజ్ ను బయటపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే టీడీపీ సభ్యులు...వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర సభలోనే వినడానికి వీల్లేని భాషలో తిట్ల పురాణం లంకించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.  

'చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు దారుణం. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జుగుప్సాకరంగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేల ఫుటేజ్ ను కూడా విడుదల చేస్తే ప్రజలు ఛీ కొడతారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలంటే...ముందు చంద్రబాబుపైనే పెట్టాలి. చంద్రబాబు పోటీ పెట్టి మరీ వారి సభ్యుల చేత మమ్మల్ని తిట్టిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ్య సమాజం తలదించుకునేలా సభలో వ్యవహరిస్తున్నారు. మా అధ్యక్షుడిని మా ఎదుటే దారుణంగా తిడుతున్నారు. దానికి చర్యలు ఏవి.
 
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ...పచ్చి బూతులు తిడుతూ నీచంగా మాట్లాడినా అతడిపై కనీస చర్యలు తీసుకోలేదు. మేము మైక్ అడిగితే స్పీకర్ ఇవ్వరు, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు తిడుతుంటే మాత్రం మైక్ కట్ చేయడం లేదు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతోనే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. స్పీకర్ అలా వ్యవహరించడం లేదు కాబట్టే అవిశ్వాసం పెట్టాం. టీడీపీ సభ్యులు మాట్లాడిన ఫుటేజ్ ను కూడా వెంటనే విడుదల చేయాలి' అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: