ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్

ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015


ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు  సస్పెండ్ చేశారు. శుక్రవారం ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి ప్రతిపాదన మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రోజమ్మ ఏ తప్పు చేసిందని సస్పెండ్ చేశారని ప్రశ్నించారు.


రోజాపై సస్పెన్షన్ వేటు వేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజాను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి తమను దూషిస్తే చర్యలు తీసుకోరా  అని నిలదీశారు. శాసనసభలో కాల్ మనీ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు, అధికార పక్ష సభ్యులు నేరుగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు.
Share this article :

0 comments: