తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..?

తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..?

Written By news on Friday, December 11, 2015 | 12/11/2015


తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..?
బహిరంగ సభావేదికపై గిరిపుత్రుల హెచ్చరిక
వైఎస్ జగన్‌తో ముఖాముఖి


 సాక్షి, విశాఖపట్నం: ‘‘లక్షల గొంతులు ఒక్కటై మాకొద్దీ బాక్సైట్ అంటున్నా చంద్రబాబుకి జ్ఞానోదయం కావడం లేదు. బాక్సైట్ మైనింగ్ ఎందుకు వద్దో మీరే చెప్పండి.’’అంటూ విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో గురువారం జరిగిన బాక్సైట్ వ్యతిరేక సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులను అడిగారు. ‘ఆనాడు తెల్లదొరల్నే తరిమికొట్టిన జాతి మాది.. మా జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న చంద్రబాబుకు కూడా అదే శాస్తి చేస్తాం’ అని గిరిపుత్రులు హెచ్చరించారు. బాక్సైట్ జోలికొస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. బహిరంగ సభా వేదికపై వైఎస్ జగన్‌తో వారి ముఖాముఖి విశేషాలు...

 (కోండ్రుపల్లికి చెందిన వృద్ధుడు మండలం చిన్నబ్బాయి జగన్ పిలుపునందుకుని ప్రసంగించారు.)
 ‘‘నా తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే బతికారు.. ఇక్కడే చచ్చారు. నేను ఇక్కడే కొండపై వ్యవసాయం చేసుకుంటూ దుంపలు తిని జీవిస్తున్నా..రైతు బిడ్డలం. మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో పెడతామంటే అక్కడ ఏం చేసి బతకాలి.’’
 (జర్రెల పంచాయతీ సర్పంచ్ అడపా విజయకుమారితో జగన్ మాట్లాడారు.)
 జగన్: మీరే కదా జర్రెల సర్పంచ్
 కుమారి: అవునండి
 జగన్: మీ పేరు
 కుమారి: విజయకుమారి
 జగన్: బాక్సైట్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారమ్మా.?
 కుమారి: బాక్సైట్ తవ్వితే మా బతుకులు పోతాయండి.
 జగన్: జర్రెల గ్రామ సభలో బాక్సైట్‌కు అనుకూలంగా తీర్మానం చేశారని చంద్రబాబు చెబుతున్నారు. 2011లో గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తీర్మానం చేయలేదని చెప్పారు. ఇప్పుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో తీర్మానం చేశారని అంటున్నారు. అసలు తీర్మానం చేశారా తల్లీ.!
 కుమారి: ప్రజలందరూ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాల రికార్డులు మా పంచాయతీ పుస్తకాల్లో ఉన్నాయి. అంతేకాని అనుకూలంగా చేసినట్లుగా ఎలాంటి తీర్మాన పత్రాలు ఎక్కడా లేవు.
 విష్ణుమూర్తి(గిరిజన నాయకుడు): శ్వేతపత్రం విడుదల కాగానే పంచాయతీ రికార్డులు తిరగేశాం. చంద్రబాబు చెబుతున్నట్లు అక్టోబర్ 2న జర్రెల పంచాయతీలో గ్రామసభ జరిగినట్లు, తీర్మానం చేసినట్లు ఎక్కడాలేదు.
 జగన్: గ్రామ సభ జరగలేదు.. తీర్మానం జరగలేదు అయినా అబద్ధాలతో చంద్రబాబు ముం దుకువెళుతున్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు వేయలేదు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే దానిలో మూడో వంతు గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలని చట్ట ం చెబుతోంది. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాల్లో ఆరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. కమిటీ వేస్తే వాళ్లే సభ్యులుగా ఉంటారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌వారు బాక్సైట్‌ను వ్యతిరేకిస్తారు కాబట్టి కమిటీ వేయటం లేదు. ఇది ఎంతోకాలం సాగదు. గట్టిగా ఒత్తిడి చేస్తాం. కమిటీ వేయిస్తాం.
 (తర్వాత గిరిజన మహిళ రత్నాబాయి జగన్‌తో మాట్లాడారు)
 జగన్: తల్లీ బాక్సైట్ తవ్వితే మీకు కలిగే నష్టం ఏమిటి?
 రత్నాబాయి: మేం అంతరించిపోతాం జగన్ బిడ్డా..మా అడవి తల్లి ఇచ్చిన కూరలు, దుంపలు ఉడకబెట్టి తిని, చెంబుడు నీళ్లు తాగి బతుకుతున్నాం. వందల కిలోమీటర్లు కొండ తవ్వేస్తే మేము ఏం తినాలి. చంద్రబాబు నాయుడు వచ్చేసి మా అడవిని తవ్వేసుకుంటాడా, తెల్లదొరల్నే తరిమికొట్టాం. ఈ చంద్రబాబు లెక్కకాదు. మా జోలికొస్తే ఊరుకోం. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 10 ఎకరాలిస్తానని ఆనాడు దేవుడు వైఎస్ అన్నారు. ఆయనే ఉంటే ఈ కష్టాలు వచ్చేయే కాదు.

 (బూదరాళ్ల సర్పంచ్ సుమర్ల సూరిబాబుతో జగన్ మాట్లాడారు)
 జగన్: బాక్సైట్ తవ్వితే  ఏమవుతుంది?
 సూరిబాబు: ప్రజల మనుగడ దెబ్బతింటుందన్నా. ఇదే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 1/7 చట్టం ప్రకారం నీ భూమి మీద నీకే హక్కు చూసుకో బిడ్డా అని మాట ఇచ్చిన వ్యక్తి వైఎస్. ఇప్పుడు చంద్రబాబు మా బతుకులు బుగ్గి చేయాలనుకుంటున్నారు. అదే జరిగితే ఎంతటికైనా తెగించి పోరాడతాం.

 (అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును జగన్ అడిగారు)
 జగన్: సర్వేశ్వరరావును అడుగుదాం..అన్నా బాక్సైట్ తవ్వితే ఇక్కడ నీటికి, ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది.
 సర్వేశ్వరరావు: బాక్సైట్ కొండలు తవ్విన గోతుల్లో పడిన వర్షం నీరు కలుషితమవుతుంది. ఇక్కడ గోపురం, చింతపల్లి, సీలేరు,అరకు వేలి కొండల్లో పడిన నీరు రిజర్వాయర్లకు వెళుతోంది. 21 నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. గిరిజనులకే కాకుండా విశాఖ, తూర్పు, విజయనగరం జిల్లాల ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇవి కలుషితమైతే కొత్త కొత్త జబ్బులు వస్తాయి. జాతి అంతరించిపోతుంది. డయాబెటిస్‌ను నయం చేసే పాతాళగరడ అనే వేరు ఇక్కడే దొరుకుతుంది. ఇలాంటి మూలికలు దూరమవుతాయి. సీలేరు, మాచ్‌ఖండ్‌లలో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అది కూడా పోతుంది.

 జగన్: చంద్రబాబు నాయుడికి, ఈ మీటింగ్ చూస్తున్న దేశానికి తెలియాలి. బాక్సైట్ మైనింగ్‌ను వ్యతిరేకించేవాళ్లంతా చేతులు పెకైత్తండి. చంద్రబాబుకు అర్థం కావాలి మన్యం ఏమంటోందని..(సభలో ఉన్న అశేష జనవాహిని చేతులు పెకైత్తి బాక్సైట్ తవ్వకాలను తాము వ్యతిరేకిస్తున్నామంటూ నినదించారు.)
Share this article :

0 comments: