నిరుద్యోగులపై టీడీపీ గూండాల దాడి దారుణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిరుద్యోగులపై టీడీపీ గూండాల దాడి దారుణం

నిరుద్యోగులపై టీడీపీ గూండాల దాడి దారుణం

Written By news on Saturday, December 12, 2015 | 12/12/2015


నిరుద్యోగులపై టీడీపీ గూండాల దాడి దారుణం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

 హైదరాబాద్: నర్సారావుపేటలో శుక్రవారం సీఎం చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో తమ గోడు వెళ్ల బోసుకోవడానికి వచ్చిన నిరుద్యోగులపై టీడీపీ గూండాలు కిరాతకంగా దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై వెంటనే న్యాయవిచారణ జరిపి, దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ‘బాబు వస్తేనే జాబు వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. అది వచ్చే వరకూ ప్రతి ఇంటికీ రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని ప్రచారం చేసి చంద్రబాబు మాట తప్పారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
Share this article :

0 comments: