ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ బహిరంగ లేఖ

Written By news on Thursday, December 31, 2015 | 12/31/2015


ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా?
► ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ బహిరంగ లేఖ
► చంద్రబాబు చేసిన 15 వాగ్దానాలపై సూటి ప్రశ్నలు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 15 వాగ్దానాలపై జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే మూడోవిడత జన్మభూమి కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని వైఎస్‌ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది. రెండు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో మొత్తంగా 13 జిల్లాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు 33,27,506. ఇందులో 28,52,938 పెండింగులో ఉన్నాయని కోర్‌ డాష్‌బోర్డు డిసెంబర్‌ 31న స్పష్టం చేసింది. మూడో విడత జన్మభూమి అంటూ డ్రామా ఎందుకు మొదలుపెడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించాలని వైఎస్‌ఆర్‌సీపీ పేర్కొంది.

మూడో జన్మభూమి డ్రామా ఆడటానికి వచ్చే టీడీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, మంత్రుల్ని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ కింది 15 వాగ్దానాలూ ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీయాల్సిందిగా వైఎస్‌ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది.

బాబూ.. ఒక్క వాగ్దానాన్ని అయినా అమలు చేశారా?
1. మీ వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? కనీసం వడ్డీ అయినా మాఫీ అయిందా?
2. డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా?
3. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం, నిరుద్యోగులకు రూ. 2 వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?
4. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించారా?
5. బెల్టు షాపులు రద్దు అయ్యాయా?
6. పేదలందరికీ హైటెక్‌ ఇళ్లు అన్నారు.. ఎవరికైనా ఇచ్చారా?
7. గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తున్నారా?
8. ఇంటింటికీ రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇచ్చారా?
9. బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టారా?
10. కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు.. చేర్చారా?
11. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు.. కొంచెమైనా ముందుకు కదిలిందా?
12. నేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ ఏమైంది?
13. భూమిలేని పేదవారికి రెండు ఎకరాల భూమి ఇచ్చారా?
14. లారీ, ట్యాక్సీ, ఆటో డ్రైవర్ల వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇచ్చారా?
15. అవినీతి లేని పరిపాలన అందిస్తామన్నారు... అందిస్తున్నారా?
Share this article :

0 comments: