కాల్‌మనీలో చంద్రబాబు, ఆయన మంత్రుల డబ్బు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాల్‌మనీలో చంద్రబాబు, ఆయన మంత్రుల డబ్బు

కాల్‌మనీలో చంద్రబాబు, ఆయన మంత్రుల డబ్బు

Written By news on Tuesday, December 15, 2015 | 12/15/2015


'కాల్‌మనీలో చంద్రబాబు, ఆయన మంత్రుల డబ్బు'
హైదరాబాద్ :
కాల్‌మనీ వ్యవహారంలో చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డబ్బు కూడా ఉందని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అక్రమాలపై నిలదీసినందుకు గిరిజన మహిళా ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను మంగళవారం కలిసి ఈ రెండు అంశాలపై ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
 • గవర్నర్‌ను కలిసి రెండు ప్రధానాంశాలపై ఆయనను జోక్యం చేసుకోవాలని కోరాం
 • ఒకటి.. గిరిజన సలహా కమిటీ అన్నది గిరిజన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు హక్కుగా రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ఇచ్చిన వరం.
 • అలా తప్పనిసరిగా వేయాల్సిన కమిటీ విషయంలో.. చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు తాను అన్యాయంగా, గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలకు అడ్డువస్తుందని కమిటీ వేయడం లేదు.
 • ఆ కమిటీలో మూడు వంతులు గిరిజన ఎమ్మెల్యేలే సభ్యులుగా ఉండాలి. ఇది రాజ్యాంగం ప్రకారం జరగాలి
 • ఏడు గిరిజన స్థానాలుంటే, అందులో ఆరింటిలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి, వాళ్లు బాక్సైట్ విషయంలో అడ్డు తగులుతారని కమిటీ నియామకాన్నే వదిలేశారు
 • ఇది రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా వేయాల్సిన కమిటీ
 • అందుకే గవర్నర్ గారికి నేరుగా ఈ విషయాన్ని వివరించి, ఆయనను జోక్యం చేసుకోవాలని కోరాం.
 • గిరిజన మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో.. ప్రతి గిరిజనుడు తమ సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల నరుకుతారని అన్నందుకు 307 హత్యాయత్నం కేసు పెట్టి గిరిజన మహిళను వేధిస్తున్నారు.
 • ఆ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.
 • చంద్రబాబు ఎన్నిసార్లు వేలు చూపిస్తూ నీ అంతుచూస్తా అని అన్నాడు? అంటే మా అందరినీ చంపేస్తామనే కదా అర్థం.. మరి ఆయనమీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టడంలేదు?
 • రాజశేఖరరెడ్డి తనను వ్యతిరేకించారని, ఆయన పావురాల గుట్టలో పావురం అయిపోయిందని చంద్రబాబు ఓ సందర్భంలో అన్నారు. అంటే రాజశేఖరరెడ్డిని చంద్రబాబే చంపించాడని అనుకోవాలా? ఆ కోణంలో ఎందుకు విచారణ జరిపించలేదు? ఆయనమీద 307 సెక్షన్ కింద ఎందుకు కేసు పెట్టలేదు?
 • అసెంబ్లీకి నువ్వొస్తే కదా అని అంతకుముందు కూడా చంద్రబాబు అన్నారు.. సరిగ్గా రెండు రోజుల తర్వాత రాజశేఖరరెడ్డి చనిపోయారు. అంటే, చంద్రబాబు చంపించినట్లు కాదా?
 • ప్రజల మనోభావాలకు అనుకూలంగా గిరిజనుల గురించి మాట్లాడితే, గిరిజన మహిళ అని కూడా చూడకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారు
 • ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏమీ ఉండదు
 • తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్లను అణిచేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు
 • విమానాశ్రయంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు
 • 19 మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే, వాళ్లకు తోడుగా నిలబడి, ఎయిర్‌పోర్టు మేనేజర్‌ను నిలదీస్తే కూడా తప్పు
 • తర్వాత ఆ మేనేజర్ ఆ 19 మందిని పంపుతూ, ఎంపీకి, ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పారు
 • అయినా.. మళ్లీ ఆరోజు రాత్రి తిరిగి వచ్చిన చంద్రబాబు.. ఎయిర్‌పోర్టు మేనేజర్‌తో దొమ్మీ కేసు పెట్టించారు.
 • నిజంగా వాళ్లు కొడితే సీసీ టీవీ కెమెరాలో రికార్డు కాదా.. దాన్ని ఎందుకు చూపించలేదు?
 • అంటే అది దొంగ కేసు అనే కదా.. 19 మంది ప్రయాణికులు ఫిర్యాదుచేసిన విషయం ఎందుకు బయటపెట్టలేదు?

రెండో విషయం 
 • విజయవాడ - గుంటూరు నగరాలను మాఫియా నగరాలుగా మార్చేశారు
 • ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, చివరకు కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియా కూడా అక్కడే
 • సీఎం చంద్రబాబు అక్కడే ఉండి ప్రోత్సహించి ఈ మాఫియాలు నడిపిస్తున్నారు
 • ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియా చేస్తూ ఎమ్మార్వో జుట్టు పట్టుకు లాగినా కేసు ఉండదు
 • చివరకు ఎమ్మార్వోనే చంద్రబాబు మందలించారు
 • ఇదే ప్రభాకర్.. కొల్లేరులోకి అడ్డగోలుగా రోడ్డు వేయించారు
 • మీడియా మొత్తం, ప్రజలు ఇందుకు సాక్ష్యం. అయినా కేసులుండవు
 • ఇదే చింతమనేని ప్రభాకర్ సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తారు. ఆయన అంగన్‌వాడీలను నోటికి వచ్చినట్లు తిడతారు
 • ఆడవాళ్లను ఏ మనిషీ తిట్టని తిట్లు తిడితే, అంగన్‌వాడీలు చంద్రబాబుకు, ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తే కనీసం ఎమ్మెల్యేను తిట్టే కార్యక్రమం కూడా చేయరు
 • సాక్షాత్తు చంద్రబాబే లిక్కర్ మాఫియా నడుపుతూ ఎమ్మార్పీపైన అధిక ధరకు లిక్కర్ అమ్ముకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు
 • చివరకు అక్కడితో ఆగకుండా కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేయిస్తున్నారు
 • అయినా కేసులుండవు.. నామమాత్రంగా ఒక కానిస్టేబుల్‌నో, ఎస్ఐనో సస్పెండ్ చేస్తారు
 • యావత్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం కాల్ మనీ
 • చంద్రబాబు డబ్బు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డబ్బు కూడా అందులో ఉంది
 • అధిక వడ్డీలు కట్టలేకపోతే మహిళల మానప్రాణాలతో కూడా ఆటలు ఆడుకున్నారు
 • పోలీసులు సోదాల చేస్తే.. 200 వీడియోలు దొరికాయి
 • అంటే వాళ్లతో బలవంతంగా కొనసాగించాలన్న దుర్మార్గమైన ఆలోచన
 • అయినా ఆ ఎమ్మెల్యే షికార్లు చేస్తారు, ఫొటోలు వస్తాయి, కేసులుండవు
 • ఎమ్మెల్సీ కేసులో దొరికినా కేసులు ఉండవు
 • ఎమ్మెల్సీ సొంత అన్న, తమ్ముడు కలిసే ఉన్నా కేసులు పెట్టరు
 • చివరకు ఇది ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే.. వాళ్లో సర్వే చేశామని చెప్పారు
 • అది చూసి నేనే ఆశ్చర్యపోయా
 • అందులో ఓ ప్రశ్న.. డ్వాక్రా రుణమాఫీ బాగుందంటే 35 శాతం అన్నారట
 • అసలు రుణమాఫీయే జరగకపోయినా బాగుందని అంతమంది అన్నారంటున్నారు
 • అబద్ధాన్ని ఇంత చక్కగా రాస్తారా.. శాంతిభత్రతలు బాగున్నాయని 75 శాతం చెప్పారు
 • రోజుకో స్కాం, రోజూ మాఫియా, దొంగ కేసులు, వేధింపులు.. మద్యం ఉదయం 6 నుంచి తెల్లవారుజామున 3 దాకా దొరుకుతుంది
 • ఆడవాళ్లు తిరగలేని పరిస్థితి
 • ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా, వీళ్లు వేయించుకునే సర్వేలు ఇలా ఉంటాయి
 • ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తారు
 • ఈ విషయాలన్నీ గవర్నర్‌కు వివరించాం, వీటిపై అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాం
Share this article :

0 comments: