ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణం

ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణం

Written By news on Thursday, December 17, 2015 | 12/17/2015


హైదరాబాద్ : బీసీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ... దాడిశెట్టి రాజా ఏం తప్పు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం ద్వారా బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. బీసీలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి.
అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పట్టుపట్టింది. అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి చర్చకు పట్టుపట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ క్రమంలో కెమెరాలకు అడ్డువస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు శివప్రసాద్ రెడ్డితోపాటు దాడిశెట్టి రాజాలను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
Share this article :

0 comments: