
పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి నాలుగు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నట్లు కడప ఎంపీ వై.ఎస్ అవినాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 7.30 గంటలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఓపెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని అవినాష్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 25, 26, 27 తేదీల్లో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.
0 comments:
Post a Comment