25 January 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్ రైతు దీక్ష మొదటి రోజు ఫోటోలు

Written By news on Saturday, January 31, 2015 | 1/31/2015

అండగా నిలబడేందుకే దీక్ష: వైఎస్ జగన్


అండగా నిలబడేందుకే దీక్ష: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
తణుకు : చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలతో దారుణంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అండగా ఉండేందుకే తాను దీక్ష చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దూరాన్ని, ఎండను సైతం లెక్కచేయకుండా దీక్షకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు ఎలా అబద్దాలు చెప్పారో అందరికీ తెలుసునని, ఆయన మాటలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని అన్నారు. వారందరికి అండగా నిలబడేందుకే తాను దీక్ష చేపట్టినట్లు చెప్పారు. అంతకు ముందు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మండల, జిల్లా కేంద్రాలు ముట్టడి కార్యక్రమం చేపట్టామని, అందులో భాగంగానే రెండురోజుల పాటు రైతుదీక్ష చేస్తున్నామన్నారు. రుణమాఫీ సాకుతో చంద్రబాబు .. రైతులు, డ్వాక్రా మహిళలను ఎలా మోసం చేశారనే విషయాన్ని వాళ్లు వేదికపైకి వచ్చి చెప్పాలని వైఎస్ సూచించారు.

మరోవైపు  వైఎస్ జగన్‌ రైతుదీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు, మహిళలు తణుకు పట్టణానికి చేరుకున్నారు. రైతులు, మహిళలతోపాటు మరోవైపు యువకులు కూడా భారీఎత్తున తణుకు తరలి వచ్చారు. దీంతో కనీవినీ ఎరుగనిరీతిలో తణుకు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

మధురపూడిలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తణుకు వెళతారు.

రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు ఇచ్చి చివరకు వారిని ఘోరంగా వంచించిన చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తణుకులో రెండు రోజుల పాటు దీక్ష చేపడుతున్నారు.

రాజధాని ప్రణాళిక.. ఓ ‘రియల్’ కుంభకోణం!


రాజధాని ప్రణాళిక.. ఓ ‘రియల్’ కుంభకోణం!
  • చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన  మాజీ ఐఏఎస్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళిక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆయా విషయాలను ప్రజలకు, పాత్రికేయులకు వివరించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తాను పేర్కొంటున్న విషయాలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘రాజధాని పథకం-సమస్యలు’ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.
     
రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇప్పటికే 3 వేల ఎకరాలు చేతులు మారాయని,రూ. 4 వేల కోట్ల ఆదాయం కొంత మంది ధనికులకు చేరిందన్నారు.ఇది కేంద్ర ఆదాయ పన్ను శాఖ దృష్టికి కూడా వచ్చినట్టు తెలిసిందన్నారు.  ఈ నిధులు విదేశాలకు అప్పుడే తరలించి ఉండవచ్చని శర్మ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలకు, అధికారులకు ప్రమేయం ఉందా? అనే విషయాన్ని కేంద్రం పరిశీలించి వెలికి తెస్తుందనే నమ్మకం ఉందన్నారు.
     
ఏపీ సీఆర్‌డీఏ ప్రకారం నగర నిర్మాణానికి తీసుకునే భూముల్లో 5 శాతం భూమిని మాత్రమే నగరంలో పనిచేసే పేదవారికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారని, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ ప్రణాళికలో ఇప్పుడున్న నగరాభివృద్ధి ప్రణాళికలో పేద వారికి కనీసం 20 నుంచి 25 శాతం వరకు ఇళ్ల స్థలాలను కేటాయించాలనే నిబంధన ఉందని తెలిపారు.ఏపీ సీఆర్‌డీఏ ఈ నిబంధనను ఉల్లంఘించి.. పేదలకు హాని చేసే పరిస్థితి కల్పిస్తోందని పేర్కొన్నారు.
     
ఒక వైపు స్మార్ట్ సిటీలని ప్రచారం గుప్పిస్తూ.. మురికివాడలను సృష్టించే ప్రణాళిక ఎంతవరకు ప్రజాహితమో ప్రజలే చెప్పాలని కోరారు.
 
జనాభా పెరుగుదల వలన తలసరి భూ పరిమితి తగ్గుతోంది. ఆ దృష్ట్యా రాజధాని బహుళ అంతస్థుల భవనాలే నిర్మిస్తే 2 వేల ఎకరాలకు మించి భూములక్కరలేదు.  50 వేల ఎకరాలను ప్రజల నుంచి లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ వల్ల కేంద్ర భూ సేకరణ చట్టం ద్వారా కలిగిన హక్కులను ప్రజలకు అందకుండా చేశారని అన్నారు.

తుళ్లూరుకు యూరియా కట్

హైదరాబాద్: రాజధానికి భూములివ్వని రైతులపై ప్రభుత్వం కత్తిగట్టింది. భూ సమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు గత నెలలో పంట భూముల్లో మం టల పేరిట అమాయకుల్ని పోలీసు స్టేషన్లకు రప్పించి హడలెత్తించింది. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఠాణాల చుట్టూ తిప్పుతోంది. అది మరువక మునుపే ఏప్రిల్ నుంచి పంటలు వేయవద్దని హుకుం జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి ప్రతిఘటనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న ప్రాంతాలకు ఎరువుల సరఫరా నిలిపివేసి.. చేలల్లో ఉన్న పంటల్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. అదేంటని అడిగితే తుళ్లూరు మండలానికి యూరియా సరఫరాను నిలిపివేశారని సమాధానం ఇస్తున్నారు. అక్కడ అరటి, జామ, మొక్కజొన్న తదితర పంటలను వేస్తుంటారు. వీటికి యూరియా అవసరం. ఈ పంట చేతికందిన తర్వాత మళ్లీ వేసే అవకాశం లేకుండా చేయడం , రైతుల  భూముల్ని ఖాళీ చేయించాలన్నది అధికారుల ఉద్దేశం.

తుళ్లూరు, తాడికొండ మండలాలకు యూరియా సరఫరాను మంత్రులే నిలిపివేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారాన్ని ఇటీవల వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లినప్పుడు  విషయం బయటపడింది.  ప్రత్తిపాటి వ్యవసాయ శాఖ జేడీకి ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు.ఆ అధికారి బదులిస్తూ.. ‘ఈ వ్యవహారం మీకు తెలియందా? మంత్రివర్గంలో వారు చెబితేనే అలా చేయాల్సివచ్చింది’ అని చెప్పడంతో  మంత్రి అవాక్కయ్యారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/cut-urea-tulluru-208414

జననేత కోసం ఎదురుచూస్తున్న రైతులు, మహిళలు


నీ రాక కోసం..వీడియోకి క్లిక్ చేయండి
రైతు దీక్షకు తణుకులో సర్వం సిద్ధం
పాలకులకు చెంపపెట్టులా వైఎస్ జగన్ దీక్ష
వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం
జననేత కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రైతులు, మహిళలు

 
ఏలూరు : సర్కారుపై రణభేరికి సర్వం సిద్ధమైంది. టీడీపీ నయవంచక పాలనలో నిలువునా దగాపడిన రైతులు, మహిళలు, యువకులతోపాటు అన్నివర్గాల ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు తణుకులో దీక్ష బూనుతున్నారు. జాతీయ రహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో శని, ఆదివారాల్లో చేపట్టనున్న రైతు దీక్షకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ మోసపూరిత విధానాలను  ఎండగట్టేందుకు, సీఎం చంద్రబాబు నాయుడు నయవంచక స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ జగన్ చేపట్టే దీక్ష చరిత్రాత్మకంగా నిలిచిపోయేలా పార్టీ నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేశారు. దగాకోరు పాలనపై ‘పశ్చిమ’ నుంచే మడమ తిప్పని పోరు మొదలు పెట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు తలంచారు. ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచామని విర్రవీగుతున్న టీడీపీ నేతలకు చెంపపెట్టులా ఉండే విధంగా రైతు దీక్షను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న నేతలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 8 నెలల ప్రజాకంటక పాలనపై విసుగెత్తిన ప్రజల ఆగ్రహావేశాలను ఈ దీక్ష ద్వారా సర్కారుకు చూపిం చాలని నేతలు భావిస్తున్నారు.

మా కోసమే జగన్ నిరశన  పశ్చిమ రైతులు, మహిళల భావోద్వేగం

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ఆందోళనలు, దీక్షలు కొత్తకాదన్న విషయంప్రజలందరికీ తెలిసిందే. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకునేందుకు, ఓదార్పునిచ్చేం దుకు ఆయన ఎంతదూరమైనా వెళ్తారన్నది జగద్విదితం. ఇప్పుడు కూడా అదే రీతిలో చంద్రబాబు పాలనలో దారుణంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన నిలిచేందుకు రెండు రోజుల నిరశన దీక్ష చేపట్టారు.  ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షకు ఈ జిల్లాను ఎంచుకోవడం పశ్చిమ ప్రజల గుండెలను తాకింది. తమ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న రైతు దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉండాలనేది జిల్లా ప్రజల ఆకాంక్ష. నమ్మక ద్రోహానికి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుకు ఈ దీక్ష ద్వారా గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే స్వచ్ఛం దంగా దీక్షకు మద్దతు పలికేందుకు తరలివస్తున్నారు.

రాష్ట్రానికే అన్నపూర్ణగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో తాము మోసపోయినంతగా చంద్రబాబు చేతిలో ఎవరూ మోసపోలేదని రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టి కాల్పించిన చంద్రబాబు తాను మారానంటే నమ్మిన జిల్లా రైతులు, ప్రజలు టీడీపీకి పట్టం కడితే కనీసం ఇక్కడి ప్రజలకు కూడా బాబు ఒరగబెట్టిందేమీ  లేదని కొద్ది నెలల్లోనే గ్రహించారు. ఎన్నికల్లో బ్రహ్మరథం పడితే అధికారంలోకి వచ్చాక బ్యాంకుల ద్వారా నోటీసులు పంపి తీవ్రంగా అవమానించడాన్ని రైతులు, డ్వాక్రా మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ చేపట్టనున్న దీక్ష వారిలో జవసత్వాలను కూడగట్టి కార్యోన్ముఖులను చేస్తోంది. ప్రభుత్వంపై పోరాటానికి దిగిన వైఎస్ జగన్‌కు మద్దతుగా తామూ ఈ దీక్షలో పాల్గొని జిల్లా రైతుల సత్తాను చంద్రబాబుకు చూపేందుకు సన్నద్ధమవుతున్నారు.

కదంతొక్కిన నేతలు.. విస్తత ఏర్పాట్లు

రైతు దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మూడు రోజులుగా నియోజకవర్గ కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. దీక్షా స్థలి ఎంపిక నుంచి అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విజయసాయిరెడ్డి స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిందిగా నేతలు, కార్యకర్తలను సూచనలు చేశారు. వారం, పది రోజులుగా పార్టీ జిల్లా సారథి ఆళ్ల నాని జిల్లావ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ విస్తృతంగా పర్యటించి శ్రేణులతో భేటీ అయ్యారు. రైతుదీక్ష సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఐదు రోజులుగా తణుకులోనే మకాం వేసి దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు బైక్ ర్యాలీలు, పడవల ర్యాలీలతో క్యాడర్‌లో ఓ ఊపు తీసుకువచ్చారు. ఇక  తాను పార్టీ సమన్వయకర్తగా ఉన్న తణుకులో వైఎస్ జగన్ దీక్ష చేపట్టడంతో కారుమూరి నాగేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మతంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. తణుకులో వైఎస్ జగన్ దీక్ష  చారిత్రాత్మకంగా నిలిచిపోవాలనే లక్ష్యంతో ఆయన దీక్ష విజయవంతం కోసం అహరహం శ్రమిస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు తమ తమ ప్రాంతాల నుంచి భారీ జన సమీకరణతో దీక్షాస్థలికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

బాబొచ్చే.. మరి జాబేది!

‘వైద్య’ నిరుద్యోగుల ఆగ్రహం
చంద్రబాబు సీఎం అయితే జాబొస్తుందంటూ ఎన్నికల్లో టీడీపీ ప్రచారం
ఎనిమిది నెలలైనా ఒక్క వైద్యుడి పోస్టునూ భర్తీ చేయని వైనం
22 వేల మంది వైద్యుల ఎదురుతెన్నులు
రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగానే పారామెడికల్ అభ్యర్థులు
నోటిఫికేషన్ల జారీపై సర్కారు నిర్లక్ష్యం


సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఎన్నికల సందర్భంగా ’బాబొస్తే జాబొస్తుంది‘ అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఎనిమిది నెలలు గడిచాయి. ఇతర కోర్సులు చేసిన అభ్యర్థుల మాటెలా ఉన్నా.. వైద్య విద్య చదువుకున్న అభ్యర్థులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం దొరకని పరిస్థితి. ప్రభుత్వాసుప త్రుల్లో ఖాళీలు లేక కాదు.. చంద్రబాబు ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేసేందుకు పూనుకోక పోవడమే ఇందుకు కారణం. అమలుకు నోచని బాబు అనేక వాగ్దానాల జాబితాలో ఉద్యోగ ఖాళీల భర్తీ కూడా ఒకటి. ప్రభుత్వం అనేక విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా వేలాది మంది వైద్యులు, పారామెడికల్ అభ్యర్థులు, నర్సులు, టెక్నీషియన్లు లక్షలాదిమంది జాబు కోసం పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. ఇదిగో నోటిఫికేషన్ అదిగో ఉద్యోగం అంటూ మభ్యపెడుతున్న ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబా బు మాట తప్పడంతో వారు సైతం ప్రభు త్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాకు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2003 నుంచి సుమారు 4 వేల మంది పారామెడికల్ ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా రు. వీళ్లందరినీ క్రమబద్ధీకరిస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి ప్రత్యేకంగా వెయిటే జీ మాత్రం ఇచ్చి ప్రవేశ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని మంత్రి వర్గ సంఘం భావి స్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయం తేలేవరకు పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల 1,700 స్టాఫ్ నర్సుల పోస్టులు, సుమారు 3 వేల వరకు పారామెడికల్ పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయాయి.

ఇక వివిధ రకాల టెక్నీషియన్ల (ఈసీజీ, అనస్థీషియా, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్) పోస్టుల ను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులు చేసి నిరుద్యోగులుగా ఉన్నవారు ఇప్పటికి 3 లక్షల మందికి పైగానే ఉన్నట్టు తేలింది. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించా లని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుండగా, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వినతుల న్నిటినీ పెడచెవి న పెట్టింది. వీరికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడి ఆరేడేళ్లు అవుతోందనే వాస్తవాన్ని విస్మరించి వ్యవహరిస్తోంది.

వైద్యుల ఖాళీలు గుర్తించినా జాప్యమే
పీజీ వైద్యులకు సంబంధించి 2010 తర్వాత నోటిఫికేషన్ వెలువడలేదు. ఎంబీ బీఎస్‌కు సంబంధించి 2013లో కొన్ని వైద్య ఖాళీలు భర్తీ చేసినా ఇంకా 600 వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రజారోగ్య శాఖలో (డీపీహెచ్) సుమారు 600 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్-ఎంబీబీఎస్ అర్హత) పోస్టుల ను, వైద్యవిధాన పరిషత్‌లో 258 సీఏఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ-డిప్లొమా లేదా పీజీ అర్హత)తో ఖాళీలను గుర్తించారు. అంతేగాకుండా బోధనాసుపత్రుల్లో 324 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీజీ అర్హత)ల ఖాళీలను గుర్తించారు. కానీ నోటిఫికేషన్లు జారీ చేయ కుండా జాప్యం చేస్తున్నారు.

బోధనాసుపత్రుల్లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వైద్యవిధాన పరిషత్ వైద్యుల భర్తీ కూడా ఇందులోనే కలిపి ఉమ్మడి నోటిఫి కేషన్ ఇవ్వాలని కుటుంబ సంక్షేమశాఖ కమిష నర్ ఆదేశించడంతో మళ్లీ జాప్యం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వా రు 15వేల మంది, పీజీ పూర్తి చేసిన వారు  7వేల మంది వరకూ ఉన్నట్టు తేలింది. ఐ దేళ్లుగా ఏ బోధనాసుపత్రి లోనూ పీజీ వైద్యుల భర్తీ జరగలేదు. దీంతో బోధనాసుపత్రుల్లో భారీగా వైద్యుల కొరత ఉంది.

రోగుల ఇబ్బందులన్నా చూడండి
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలు భర్తీ చేయకపోవడంలో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 20 మంది రోగులను చూడాల్సిన వైద్యుడు 70 మందిని చూడాల్సి వస్తోంది. పైగా ఖాళీల భర్తీలో జాప్యం జరిగే కొద్దీ ఎక్కువమంది వైద్యులు నిరుద్యోగులుగా మారుతు న్నారు. 2010 నుంచి ఇప్పటివరకు భర్తీ జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ పరిస్థితిని గుర్తించాలి.
- డాక్టర్ కె.వి.పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏపీ జూనియర్ వైద్యుల సంఘం

http://www.sakshi.com/news/andhra-pradesh/paramedical-posts-not-fiiled-in-andhra-pradesh-208452

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి


ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి
ప్రధానికి ఎంపీ బుట్టా రేణుక లేఖ
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న మేరకు ట్యాక్స్ మినహాయింపు, సబ్సిడీ, ఇన్సెంటీవ్స్, కొత్త ప్యాకేజీలు, ప్రాజెక్టుల  ఏర్పాటు వంటి అంశాలను వెంటనే పరిశీలించి రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని కోరారు. వీటిని ఐదేళ్ల పాటు కొనసాగించాలన్నారు.

ఫిబ్రవరి బడ్జెట్‌లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ హాలిడేస్, కొత్త ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు ప్రకటించాలని, రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టేందుకు అనేక మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని, అయితే ప్రభుత్వ రాయితీల కోసమే వారు నిరీక్షిస్తున్నారని తెలియజేశారు. లేఖ ప్రతిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జెట్లీకి కూడా పంపారు.
 

రైతు దీక్షకు బయల్దేరిన వైఎస్ జగన్


రైతు దీక్షకు బయల్దేరిన వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం తణుకు రైతు దీక్షకు బయల్దేరారు. లోటస్ పాండ్ నుంచి ఆయన హైదరాబాద్ నుంచి విమానమార్గంలో రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన తణుకు చేరుకుంటారు.

ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, చంద్రబాబు మాటలతో  మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహళలు, ప్రజలకు అండగా  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిరాహార దీక్ష చేపడుతున్నారు.

ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం పదిన్నర నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జగన్ దీక్ష కొనసాగిస్తారు.  మరోవైపు వైఎస్ జగన్ దీక్ష కోసం భారీగా జనసందోహం తరలి వస్తోంది. తణుకు పట్టణం జనసంద్రమైంది.

జగన్ దీక్షకు సర్వం సిద్ధం


తణుకులో నేడు, రేపు కొనసాగనున్న దీక్ష.. పూర్తయిన ఏర్పాట్లు
చంద్రబాబు మోసపూరిత చర్యలను ప్రజల పక్షాన ప్రశ్నించనున్న ప్రతిపక్ష నేత
జననేత కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు, ప్రజలు
జనసంద్రమైన తణుకు పట్టణం.. శుక్రవారం నుంచే తరలి వస్తున్న జనసందోహం

సాక్షి ప్రతినిధి, ఏలూరు, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు ప్రజలను మోసపుచ్చుతూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షను చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జగన్ దీక్ష కొనసాగిస్తారు.

చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మిహ ళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నేత ఈ దీక్షకు దిగుతున్నారు. ఈ సందర్భంగా గత ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టనున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాల్లో ప్రభుత్వ కప్పదాటు వైఖరితో ఇతరత్రా సర్కారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై వైఎస్సార్‌సీపీ గత నవంబర్‌లో మూడు దశల ఆందోళనలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే.

మొదటి దశలో భాగంగా నవంబర్ మొదటివారంలో పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించగా.. రెండవ దశలో డిసెంబర్ మొదటివారంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. మూడవ దశలో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా శనివారం రెండు రోజుల దీక్షకు దిగుతున్నారు. దీక్షలో పాల్గొనేందుకుగాను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి విమానమార్గంలో రాజమండ్రికి చేరుకుని.. రోడ్డుమార్గాన తణుకు చేరుకుంటారు.

అభిమానులతో నిండిపోయిన తణుకు
స్వాతంత్య్రోద్యమం నుంచి ఎన్నో ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన తణుకు నుంచే ప్రజానేత టీడీపీ ప్రభుత్వంపై ఎడతెగని పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నారు. తణుకులో జాతీయ రహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో శని, ఆదివారాల్లో చేపట్టనున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రుణమాఫీ కొర్రీలతో రైతులను, మహిళలను, నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను, మరోవైపు రూ.వెయ్యి పెన్షన్ ఇస్తామని చెప్పి.. సగానికి సగం మంది లబ్ధిదారులను తగ్గించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దారుణంగా వంచించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్ చేపడుతున్న దీక్షకు ప్రజలనుంచి భారీ మద్దతు లభిస్తోంది.

శుక్రవారం నుంచే భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నమ్మి నిండా మునిగిన రైతన్నలు జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తణుకు పట్టణానికి చేరుకున్నారు. ఎటుచూసినా జగన్ దీక్షకు స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులే కనిపిస్తున్న పరిస్థితి. రైతులతోపాటు మరోవైపు యువకులు కూడా భారీఎత్తున తణుకు చేరుకున్నారు. దీంతో కనీవినీ ఎరుగనిరీతిలో తణుకు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని లాడ్జీలు, కల్యాణ మండపాలు, ఆడిటోరియాలు, హాళ్లు నిండిపోవడంతో ఇతరప్రాంతాల నుంచి వచ్చినవారు సభావేదికవద్దే సేదతీరుతున్నారు.

రాజధాని ప్రాంతం నుంచీ..
రైతు దీక్షకు రాజధాని ప్రాంత రైతులూ పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతులు ఇప్పటికే అక్కడి వైఎస్సార్‌సీపీ నేతల అండతో ఆందోళన చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన దీక్షకు భారీఎత్తున తరలివెళ్లడం ద్వారా పాలకులకు తమ నిరసనల తీవ్రతను తెలపాలన్నది అక్కడి రైతుల ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతేగాక ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమకు అండగా ఉన్నారన్న సంకేతాన్ని పంపాలన్నది ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, రాయపూడి, వెంకటాపురం, ఉద్దండరాయపాలెం తదితర గ్రామాల రైతుల ఆలోచన.

దీక్షతో పాలకుల్లో వణుకు పుడుతోంది: ఆళ్ల నాని
తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని శుక్రవారం తెలిపారు. దీక్షావేదికపైనుంచి జగన్ ఏం మాట్లాడతారోనంటూ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పాలకుల్లో వణుకుపుడుతోందన్నారు.

ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదే

Written By news on Friday, January 30, 2015 | 1/30/2015


'ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదే'
అనంతపురం : తణుకులో జరుగనున్న రైతుదీక్షకు వెళ్లే వాహనాలను అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద  మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి శుక్రవారం జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు.

ఎన్నికల ముందు 200 హామీలిచ్చిన చంద్రబాబు ... సీఎం అయ్యాక వాటిని విస్మరించారని ఆయన ఆరోపించారు. హామీలు అమలు చేయని కారణం వల్ల ప్రజలు బాబుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రైతు దీక్షకు మద్దతు తెలుపుతున్నారని గుర్నాథ్ రెడ్డి అన్నారు.

అన్నదాతకు అండగా..


అన్నదాతకు అండగా..
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తలపెట్టిన రైతుదీక్ష వివిధ వర్గాల్లో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. మహిళలు మరొకడుగు ముందుకేసి ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆడపడుచులను దీక్షను విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నారు. యువకులు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల కోసం చేస్తున్న దీక్షకు జిల్లాను ఎంచుకోవడం వెనుక ఇక్కడి ప్రజలపై ఆయనకున్న అచంచల విశ్వాసం, అవ్యాజమైన ప్రేమే కారణమని వివరిస్తున్నారు.

 గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువకుల ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. కాగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీక్షా శిబిరాన్ని పరిశీలించి రైతు దీక్షను విజయవంతం చేయడానికి వచ్చేవారికి అవసరమై సౌకర్యాలు కల్పించే విషయంలో నాయకులకు సూచనలు చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రి నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ముఖ్య నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, వంక రవీంద్రనాథ్, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా తణుకు పట్టణంలో ముస్లింలు ఇంటింటికీ తిరిగి రైతు దీక్షపై ప్రచారం నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని నారాయణపురం, ఉప్పాకపాడు, కంసాలికుంట, నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు.

 బుట్టాయగూడెంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు పోల్నాటి బాబ్జి, ఆరేటి సత్యనారాయణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. జన సమీకరణపై సమీక్షించారు.పోలవరంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు వందనపు సాయిబాల పద్మ విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యధిక సంఖ్యలో దీక్షకు హాజరై దీక్షను బలపరచాలని పిలుపునిచ్చారు. మొగల్తూరులో పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో సానబోయిన వెంకటరమణ ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి రైతు దీక్షకు ఆహ్వానించారు.

 పెరవలి మండలంలో నిడదవోలు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ స్థానిక నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, గంధం చంటి, మారిశెట్టి జగన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోల్నాటి బాబ్జి చింతలపూడి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి జన సమీకరణపై ఆరా తీశారు. కార్యకర్తలకు, నాయకులకు రూట్ మ్యాప్‌ను వివరించారు. ఆకివీడులో పార్టీ నాయకుడు గుండా సుందర రామినాయుడు ఇంటింటా ప్రచారం నిర్వహించగా, పాలకోడేరులో చిగురుపాటి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు విప్పాలి


ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు విప్పాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్

కదిరి(అనంతపురం జిల్లా): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  నోరు మెదపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ‘హంద్రీ-నీవా’కు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు ఉరవకొండ వెళ్తూ గురువారం మార్గం మధ్యలో అనంతపురం జిల్లా కదిరిలో స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పకనే చెప్పారని, దీనిపై ముఖ్యమంత్రి  కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు ‘‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు. ఆయన మాటకు కట్టుబడే నేత. చంద్రబాబు లాగా పూటకో అబద్ధం చెప్పే నేత కాదు’’ అన్నారు. బాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఉసురు చంద్రబాబుకు తగలకతప్పదన్నారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి యుద్ధప్రాతిపదికన చేయించారని, మిగిలిన 10 శాతం పనులు చేయించడానికి ఇప్పటి సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబుకు ఏం దోషముందో తెలియదు కానీ.. సంక్రాంతికి శనగలు పంపిణీ చేశారన్నారు. హెరిటేజ్ కంపెనీలో ఎన్నో రోజుల నుంచి ముగ్గిపోయిన నెయ్యిని ప్రజలకు అందివ్వడం సరికాదన్నారు. ఎలాంటి టెండర్ పిలవకుండా వాటిని పంపిణీ చేయడం మరో మోసమన్నారు. ముస్లిం మైనార్టీలు ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఎనిమిది నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోందన్నారు. ఈ విషయూన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఒప్పుకుంటున్నారని చెప్పారు.  

ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి?


ఈ పొలాలే లేకుంటే..  ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి?
రాజధాని రైతులకు ఎమ్మెల్యే ఆర్కే బాసట ...
 
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పంట నిషేధంపై మంగళగిరి
ఎమ్మెల్యే ఆర్కే గురువారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
రైతులు, వ్యవసాయ కూలీలతో కలసి పొలం పనులు చేశారు.
కూలీల్లో ఒకరై ఉల్లిపాయల గంపలు, టిక్కీలు, అరటి గెలలు మోశారు.
ఉల్లిపాయలలోడు లారీ నడిపారు. గేదెల వద్ద పనిచేశారు.
తానూ రైతునేనని, వికృత పోకడలు పోతున్న ప్రభుత్వంపై కలసికట్టుగా పోరాడదామని రైతులు, కూలీల్లో మనోధైర్యం నింపారు.

 
మంగళగిరి/తాడేపల్లి రూరల్ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ప్రస్తుత పంటతో ఆపేయాలని ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) గురువారం వినూత్న నిరసన తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో, మంగళగిరి మండలం నిడమర్రు, కురగల్లు, బేతపూడి గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులు, వ్యవసాయ కూలీలతో కలిసి పొలం పనుల చేశారు. కూలీల్లో ఒకరై ఉల్లిపాయ టిక్కీలు, గంపలు మోసారు. అరటి గెలలు భుజానికి ఎత్తి, ఉల్లిపాయ లోడుతో వెళ్తున్న లారీని నడిపారు. గేదెలకు ఆహారాన్ని అందించారు. తాను రైతు కుటుంబానికి చెందిన వాడినే అని, కూలీలతో మమేకమై వారి అభిప్రాయాలును, ఆవేదనని పంచుకున్నారు.

‘మాకు పొలం పనులు, పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. కూలోనాలో చేసుకుని ఆత్మామాభిమానంతో ప్రశాంత జీవితాలు గడుడపుతున్నాం.. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం భూములను లాక్కుంటే తాము మరోచోటకు వలస వె ళ్లి బతకలేం..’ అని నిడమర్రు, కురగల్లు, బేతపూడి రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంకా తమ ఆవేదనను ఇలా పంచుకున్నారు..

 పొలాన్ని నమ్ముకుని బతుకుతున్నాం..


మేము తరతరాలు నుంచి పొలాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. తెల్లవారుజామున నాలుగ్గంటలకు లేచి పిల్లలకు వంట చేసి క్యారేజీలు పెట్టుకుని వస్తాం. రోజుకు నాలుగైదువందలు సంపాందించుకుంటూ పిల్లలను చదివించుకుంటూ జీవిస్తున్నాము. మాకు రుణమాఫీ వద్దు.. డ్వాక్రా రుణాలు వద్దు.. మా భూములను వదిలిపెడితే చాలు. ఒక వేళ కాదని భూములును లాక్కుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిందే.         

- కొప్పుల సాంబ్రాజ్యం, బేతపూడి
 
 ఎట్టా బతకాలి..

పూలతోటలో కూలీకి వెళితే వచ్చే సంపాదనపై ఆరుగురం బతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏదైనా ఇబ్బంది అయితే రైతులు ఆదుకుంటారు. ఎందుకంటే మరలా కూలీ చేసైనా తీరుస్తారనే నమ్మకం. వారి పొలాలే పోతే వారితో పాటు మేమెలా బతకాలి.
- సంకూరు సబ్బులు, రైతు కూలీ, నిడమర్రు
 
ఇలా అనుకుంటే వాళ్లకు ఓటేసేవాళ్లమే కాదు..

పొలాలను రైతులు ఇచ్చినా మేము ఒప్పుకోం. ఉదయం నాలుగుగంటలకు లేచి వంట చేసుకుని వచ్చి కూలీ చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాము. పొలాలు ఇచ్చే రైతులకు ఇక నుంచి కూలీకి పోబోం. ఇలాంటి మోసం చేస్తాడనుకంటే ఓటు వేసేవాళ్లమే కాదు. కాదు. తెలుగుదేశం నాయకులు కాని కార్యకర్తలు కాని గ్రామాల్లో తిరగనియ్యకుండా చేయాలి.
 - పార్వతి, రైతు కూలీ, కురగల్లు
 
ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి..

మూడెకరాలు కౌలుకు చేస్తూ మా కుటుంబంతోపాటు మరి కొంతమంది పొలంపై బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం భూములు తీసుకుంటే ఎలా బతకాలి. 365 రోజు లు పంటలు పండే పొలాలపై కూలీ చేసుకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక పొలాలు లేకపోతే ఎలా బతకాలి..?
 - కర్నాటి నాగమణి, కౌలు రైతు, కురగల్లు
 
మూడునెలల నుంచి నిద్ర లేదు..

రెండకరాల పొలంలో పూలతోట వేసి మాతో పాటు పది కుటుంబాలవాళ్లం బతుకుతున్నాం. పొలాలు పోతే ఏం చేసి బతుకుతాం. చంద్రబాబు మా భూములు తీసుకుని మాకు పరిహారం ఇచ్చేది ఏంటి. ఈ పొలాలను వదిలిపెట్టి రాజధాని కట్టుకుని పరిహారం ఎంతకావాలో అడిగితే మేమే ఇస్తాం. మూడు నెలల నుంచి నిద్రాహారాలు లేకుండా బతుకుతున్నాం.
 - ఒగ్గు వెంకటరత్నం, రైతు, నిడమర్రు

‘బాబు’ విధానాలపై ప్రజలే తిరగబడతారు


‘బాబు’ విధానాలపై ప్రజలే తిరగబడతారు
  • వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
  • తణుకులో రైతు దీక్ష ప్రాంగణ పరిశీలన  
తణుకు: ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగ బడి ఆయన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రైతు దీక్ష ప్రాంగణాన్ని గురువారం విజయసాయిరెడ్డి పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మందికి పూర్తి స్థాయిలో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కనీసం వడ్డీలో  మూడోవంతు కూడా మాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసగించార ని పేర్కొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్షను చేపడుతున్నట్టు తెలిపారు.

రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా వైఎస్ జగన్ ఈనెల 31న ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆయన వివరించారు. మాజీ మంత్రి  కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు స్వచ్ఛందంగా తరలిరావడానికి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు  ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆస్పత్రులలో స్వైన్ ఫ్లూ మందులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.అంతకుముందు దీక్షాస్థలిలో ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఎస్.రాజీవ్‌కృష్ణ, పార్టీ సీఈసీ సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తణుకు అసెంబ్లీ  నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర రైతు కార్యదర్శి చెలికాని రాజబాబు, సుంకర చిన్ని పాల్గొన్నారు.

తణుకులో రేపటి నుంచి రెండు రోజులు వైఎస్ జగన్ దీక్ష

ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల పక్షాన ప్రశ్నించనున్న ప్రతిపక్ష నేత
నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలకు అండగా నిలవడమే లక్ష్యం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయని చంద్రబాబు
పైగా సంక్షేమ పథకాలకు కోత..ప్రజలపై ఆర్థిక భారం
సర్కారు వైఖరిని ఎండగ ట్టనున్న వైఎస్ జగన్


సాక్షి, హైదరాబాద్: గడిచిన ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పాటు నిరాహార దీక్ష  చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ఆయన దీక్ష కొనసాగించనున్నారు.

చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజున చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. పైగా ఎనిమిది నెలల పాలనలో వరుసగా సంక్షేమ పథకాల్లో కోత విధించడమే కాకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న వైనాన్ని ఈ దీక్ష సందర్భంగా జగన్ ఎండగట్టనున్నారు.

2014 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలు అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే కేవలం పంట రుణాలకు మాఫీ అంటూ అందులోనూ కోతలు పెట్టి గడిచిన ఎనిమిది నెలలుగా రకరకాల సాకులతో కాలయాపన చేస్తున్న కారణంగా రైతాంగంపై మోయలేనంత అపరాధ వడ్డీ భారం పడింది. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయనితీరును ఎత్తిచూపడంతో పాటు అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోని తీరును ఈ దీక్ష ద్వారా జగన్ ఎండగడతారని పార్టీ నేతలు చెప్పారు.

ప్రజల పక్షాన గొంతెత్తడానికి జగన్ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై చంద్రబాబు మాట మార్చినందుకు నిరసనగా 2014 జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు నరకాసుర వధ పేరిట ఆందోళనను వైఎస్సార్‌సీపీ నిర్వహించింది. అదే ఏడాది నవంబర్ 5న ప్రభుత్వ విధానాలకు నిరసనగా 661 మండల  కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు జరిగాయి. డిసెంబర్ 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరిగాయి. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో జగన్ నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు..
జగన్ గతంలో ప్రజల పక్షాన లక్ష్యదీక్ష, జలదీక్ష, రైతు దీక్ష, ఫీజుపోరు వంటి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ పలు సందర్భాల్లో ప్రజా సంక్షేమ పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. చంద్రబాబు సంక్షేమ పథకాల్లో కోత విధించడం, హామీలను అమలు చేయకపోవడం వంటివి ఒక ఎతై్తతే, కొత్త రాష్ట్రంలో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టీ పట్టక ముందునుంచే.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై హింసాకాండ ప్రారంభమైంది. తొలి మూడు నెలల్లోనే డజను మందికిపైగా వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ హింసకు బలైతే, వందలాది మంది గాయపడ్డారు. వీటితో పాటు అక్రమ కేసుల బనాయింపునకు పాల్పడుతున్న సమయాల్లో పార్టీ తీవ్ర నిరసన గళం వినిపించింది.

ఇక 1,300 గజాల కేటాయింపు లాటరీ కోసం ఎదురు చూడాల్సిందే..


రాజధాని భూముల్లో సర్కారు వారి ఉరుకులు, పరుగులు
సమీకరణకు అంగీకరించిన రైతుల భూ రికార్డులను మార్చేందుకు సన్నాహాలు.. సీఆర్‌డీఏ పేరుతో భూ రికార్డుల్లో, అడంగల్‌లో నమోదు..
అంగీకారం తెలిపిన రైతుల పేర్లు ఆన్‌లైన్ నుంచి తొలగింపునకు రంగం సిద్ధం
రెవెన్యూ యంత్రాంగానికి ఉన్నత స్థాయి ఆదేశాలు
రైతులు తమ భూములపై బ్యాంకు రుణాలు తీసుకోకుండా వ్యూహం
ఇక 1,300 గజాల కేటాయింపు లాటరీ కోసం ఎదురు చూడాల్సిందే..


సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ సమీకరణలో మరో కొత్త అంకానికి రాష్ట్ర సర్కారు తెరలేపింది. రాజధాని ప్రాంత రైతులకు వారి భూములపై ఉన్న హక్కులను హరించేలా పావులు కదుపుతోంది. రైతులు అంగీకార పత్రాలు ఇచ్చిన తర్వాత సదరు భూములపై సర్వహక్కులు ఇక తమవేనని చెబుతూ వాటిని వీలైనంత త్వరగా లాగేసుకునేందుకు చర్యలు చేపడుతోంది. భూములిచ్చే రైతులతో ఏ ఒప్పందం జరగకుండానే.. వారికిచ్చే నివాస, కమర్షియల్ ప్రాంతంపై ఎలాంటి నిర్దిష్ట చర్యల్లేకుండానే సదరు భూములపై రైతుల హక్కులను హరించేందుకు చురుగ్గా కదులుతోంది. నోటిఫికేషన్ ఇచ్చాం.. వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకునేందుకు అనుమతులు లేవని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం భూ సమీకరణకు అంగీకార పత్రాలిచ్చిన రైతుల భూములకు సంబంధించి వివరాలన్నింటినీ మార్చేందుకు కసరత్తు చేపట్టింది.

విశ్వసనీయ సమాచారం మేరకు రైతుల నుంచి సమీకరించిన భూములకు సంబంధించి రికార్డుల్లో(ల్యాండ్ రికార్డుల్లో) రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పేరిట మార్చేందుకు రంగం సిద్ధమైంది. అడంగల్‌లోనూ ఎంజాయ్‌మెంట్(అనుభవదారుడు)లో ఉన్న రైతుల పేర్లను తొలగించి సీఆర్‌డీఏ పేరుతోనే నమోదు చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగానికి ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందాయి. తద్వారా రాజధాని ప్రాంతంలోని రైతులు తమ భూములపై సర్వహక్కులను కోల్పోనున్నారు.

భూములు కోల్పోయిందిగాక అందుకు ప్రతిగా లభించే ప్రతిఫలం కోసం వారిక  ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మాస్టర్‌ప్లాన్ రూపొందించిన తర్వాత లాటరీ విధానంలో ప్రభుత్వం ప్లాట్లు కేటాయించేంతవరకు నివాస, కమర్షియల్ ప్రాంతంలో 1,300 గజాల హక్కుల కోసం ఎదురు చూడాల్సిన అగత్యం రైతులకు కలగనుంది.

రైతులు తమ భూములపై రుణాలు తీసుకోకుండా ఉండేందుకే..
ఇప్పటివరకు రైతులకుండే భూముల వివరాలను సర్వే నంబర్లతో ‘సర్కారు వెబ్‌ల్యాండ్’లో కంప్యూటరీకరణ చేయడం జరిగింది. సాధారణంగా అడంగల్‌లో ఎంజాయ్‌మెంటు(అనుభవదారుడు) పేరుతో వివరాలన్నింటినీ రెవెన్యూ సిబ్బంది పొందుపరుస్తారు. ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించిన తర్వాత ఆన్‌లైన్‌లో భూమి సర్వే నంబర్లు నమోదు చేస్తే.. రైతుల పేర్లతోపాటు 1 బి ఖాతా నంబరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ వివరాలతోనే రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరణ పత్రాలు ఇస్తే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేస్తాయి.

అయితే రాజధాని ప్రకటిత 29 గ్రామాల్లోని రైతులు ఇకమీదట భూమి తనఖాతో రుణాలు పొందకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సదరు భూములను సీఆర్‌డీఏ పేరుతో అడంగల్‌తోపాటు ఆన్‌లైన్‌లో చేర్చాలంటూ అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంత రైతులకు రుణాలు మంజూరు చేయవద్దని ఇప్పటికే బ్యాంకులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే ఒకవేళ రైతులు భూమిపై ఉన్న హక్కులతో ధ్రువీకరణ పత్రాలిస్తే బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశమున్నందున.. వారి భూ హక్కులను హరించేందుకుగాను సర్కారు ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పాస్ పుస్తకాల స్వాధీన ప్రక్రియకు శ్రీకారం..
రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రారంభించి ఈ గురువారానికి 29 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 8,500 ఎకరాలకు రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు సేకరించారు. మరోవైపు ఈ భూములకు సంబంధించి పాస్ పుస్తకాల స్వాధీన ప్రక్రియ మొదలైంది. భూ సమీకరణకు పూర్తి సుముఖత వ్యక్తం చేసిన రైతుల దగ్గర్నుంచి పాస్ పుస్తకాలను సేకరిస్తున్నారు.

రెండ్రోజుల్లో పదివేల ఎకరాలకు భూ సమీకరణ అంగీకార పత్రాలు సేకరించిన వెంటనే భూముల హక్కుల ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో ఏకకాలంలో రూ.లక్షన్నర రుణమాఫీ కార్యక్రమం కూడా రైతుల భూములపై ఎలాంటి రుణాలు లేకుండా చేసేందుకేనని, తద్వారా సమీకరించిన భూములు ఎలాంటి తనఖాలు లేకుండా ఉండేందుకేనని స్పష్టమౌతోంది.

రైతుల ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలరాస్తారు?


పంటలు వద్దనడానికి మీరెవరు?
సీఆర్‌డీఏ కమిషనర్‌పై వైఎస్సార్‌సీపీ ధ్వజం
ఏ అధికారంతో రైతులను శాసిస్తున్నారు?
రైతుల ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలరాస్తారు?
భూములివ్వనివారిని అణగదొక్కేందుకే శ్రీకాంత్‌ను చంద్రబాబు తెచ్చారు
సోంపేట, కాకరాపల్లి రైతుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర ఆయనది
వచ్చే సీజన్ నుంచి పంటలేయవద్దని శాసిస్తే.. చూస్తూ ఊరుకోం
రైతుల పక్షాన పోరాడుతాం.. న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తాం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకోవడానికి అనుమతి లేదన్న ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. పంటలు వేసుకోవద్దని నిషేధం విధించడానికున్న అధికారాలేంటని ప్రశ్నించింది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకోవడానికి అనుమతి లేదంటూ సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు.

‘‘ఏపీ రాజధాని ప్రాంతంలో రైతులను పంట వేసుకోవద్దని చెప్పడానికి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఎవరు? ఏ అధికారంతో రైతులను శాసిస్తున్నారు? దమ్ముంటే రైతులు పంట వేసుకోవద్దని జీవో ఇమ్మనండి. ఆయన ఏమైనా రాష్ట్రపతా? లేక రాజ్యాంగేతర శక్తా? రైతుల ప్రాథమిక హక్కులు ఎలా కాలరాస్తారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు భూములివ్వకపోతే, ఉద్యమిస్తే అణగదొక్కడమేగాక.. వారిని శవాలుగా మార్చయినాసరే రాజధాని నిర్మించాలనే సంకల్పంతోనే సీఎం చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ కమిషనర్‌గా శ్రీకాంత్‌ను నియమించారని దుయ్యబట్టారు.

శ్రీకాంత్‌కు గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉన్నపుడు నరహంతకుడుగా మారి సోంపేట, కాకరాపల్లి రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఉందని తమ్మినేని నిప్పులు చెరిగారు. యాజమాన్యాలిచ్చిన లంచాలకు అమ్ముడుబోయి రైతుల్ని కాల్పించింది శ్రీకాంతేనని, ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఆనాటి రక్తపు మరకలు ఆరలేదని అన్నారు.

‘‘ఇలాంటి వ్యక్తిని రాజధాని ప్రాంతానికి కమిషనర్‌గా వేస్తారా? చంద్రబాబూ... అఖిలభారత స్థాయిలోనే నంబర్‌వన్ అవినీతిపరుడైన అధికారిగా శ్రీకాంత్ గణుతికెక్కిన విషయం మీకు తెలియదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. వచ్చే సీజన్ నుంచి పంటలు వేయవద్దని శ్రీకాంత్ శాసిస్తే.. తాము న్యాయస్థానాలకు వెళ్లి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాత ముత్తాతల నాటినుంచీ పొలాలతో తమ మనోభావాలు పెనవేసుకుని జీవిస్తున్న రైతులనుంచి బలవంత ంగా వాటిని లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. వారిపక్షాన పోరాడుతామన్నారు. తన కుమారుడిని ఇంకా కోటీశ్వరుడిని చేసి.. సీఎంగా చేయాలని తాపత్రయపడుతున్న చంద్రబాబుకు తన సొంత సంస్థ హెరిటేజ్‌ను ఇవ్వమంటే ఎంత బాధ కలుగుతుందో.. రైతులకూ అంతేకదా అని ఆయన అన్నారు.

ప్రజాపక్షాన పోరాటానికే జగన్ దీక్ష
టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయి పోరాటాలకు సిద్ధమవుతున్న ప్రజల తరఫున ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేస్తున్నారని సీతారాం వివరించారు. జగన్ చేయబోయే ఈ దీక్ష ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పడుతుందని అంటూ.. ‘తణుకు సభతో టీడీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోంది’ అని అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్ర ప్రజలంతా మద్దతునివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు

హంద్రినీవా పూర్తయ్యేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తా

Written By news on Thursday, January 29, 2015 | 1/29/2015


'హంద్రినీవా పూర్తయ్యేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తా'
అనంతపురం:హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గురువారం నిరహారదీక్ష విరమించిన అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు.  హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తానని తెలిపారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.
 
హంద్రినీవా ప్రాజెక్టు చేయాలనే డిమాండ్ తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.  ఆయన 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి


'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి'
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న రైతు దీక్ష  ఏర్పాట్లను గురువారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శనివారం ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. రైతు దీక్షకు ప్రజలు భారీగా తరలి వచ్చి మద్దతు పలకాలని ఆయన కోరారు.

వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడు నైజం అన్నారు. అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ ను, నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. మోసపూరిత వాగ్ధానాలపై ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే వరకు ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు.

శ్రీకాంత్ నీవు రాష్ట్రపతివా...రాజ్యాంగేతర శక్తివా?


'శ్రీకాంత్ నీవు రాష్ట్రపతివా...రాజ్యాంగేతర శక్తివా?'
హైదరాబాద్‌ :
సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ పై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రెండో పంట వేయొద్దని చెప్పడానికి శ్రీకాంత్ ఎవరని ప్రశ్నించారు. 'శ్రీకాంత్ నీవు రాష్ట్రపతివా... లేక రాజ్యాంగేతర శక్తివా? నీకు దమ్ముంటే రెండో పంట వేయవద్దని జీవో ఇవ్వు.

'సోంపేట, కాకరాపల్లి నరమేధం సృష్టించింది నీవుకాదా?. ఈ నరహంతకుడికి చంద్రబాబు సీఆర్ డీఏ బాధ్యతలు ఇస్తారా? చంద్రబాబు నీ హెరిటేజ్ మూసివేస్తే ఊరుకుంటావా?. రాష్ట్రంలో ఉంది ప్రభుత్వమా...లేక రాక్షస పాలనా? ఔరంగజేబు కూడా ఇలా పాలించలేదు' అంటూ తమ్మినేని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తణుకు దీక్షతో ప్రభుత్వంలో వణుకు ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజానికం తరలి వస్తున్నారని తమ్మినేని తెలిపారు.

మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష


మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఎదురుచూసి మోసపోయిన రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచేందుకే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ప్రతిపక్ష నేత నిరాహారదీక్షకు పూనుకుంటున్నారని ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారని టీడీపీ మంత్రులు, నేతలు ఏమీ తెలియనట్లు నటిస్తూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.  వ్యవసాయ రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఎన్నికల సమయంలో ప్రకటించి ఆ తరువాత మోసగించడంతో గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. డ్వాక్రా రుణాలు రద్దు కాకపోవడంతో మహిళా సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు. చంద్రబాబు చేసిన నమ్మకద్రోహంపై ప్రజలను జాగృతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేతిలో ప్రజలు మోసపోయినపుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ముందుండి పోరాడుతుందనే విషయం తాము రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.

‘‘ఎన్నికల నాటికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు, డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14 వేల కోట్లు. ఈ రెండింటిపై వడ్డీ సుమారు మరో రూ. 14 వే ల కోట్లు. ఇవన్నీ కలిపితే రూ. 1.14 లక్షల కోట్లు అవుతాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం ఇంత భారీగా ఉంటే టీడీపీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కేవలం రూ. 5 వేల కోట్లు. అందులోనూ ఇప్పటికి విడుదల చేసింది రూ. 3,900 కోట్లు మాత్రమే. ఇది వడ్డీ మొత్తంలో సగానికి కూడా సరిపోదు. బాబు మోసంపై ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేతగా జగన్ ఈ దీక్ష చేస్తున్నారు. తన దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, టీడీపీ చేసిన వాగ్దానాలను మళ్లీ వారికి గుర్తు చేయాలన్నదే ఆయన సంకల్పం’’ అని ధర్మాన చెప్పారు.

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
రైతు రుణాలు మాఫీ కాకపోవడం వల్ల బ్యాంకుల నుంచి వారికి అప్పులు ఇచ్చే వ్యవస్థ కుప్పకూలిందని, ఫలితంగా రుణాల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పులు పుట్టక, బీమా సౌకర్యం లేక కనీసం మద్దతుధర లభించక రైతులు దిగాలు పడి గ్రామాల్లో కూర్చుని ఉంటే చంద్రబాబు దావోస్, జపాన్ గురించి చెబుతూ వారిని రంగుల లోకంలో విహరింప జేయాలని చూస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. మంత్రులు జగన్ దీక్ష గురించి ఏం మాట్లాడినాగానీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతునివ్వాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు.

29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు


పంటలపై పిడుగు!
రాజధాని ప్రాంత రైతులు ఇక సాగుకు దూరం
29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు
ప్రస్తుత రబీ సీజన్ వరకే పంటల సాగును అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం
ఏడాదిలో మూడు పంటలు పండించే రైతన్నలకు శరాఘాతం
ఎకరాకు సగటున రూ. లక్ష వరకు ఆర్జిస్తున్న అన్నదాతలు
భూ సమీకరణ కొలిక్కి రాకుండానే సర్కారు తీసుకున్న నిర్ణయంపై విస్మయం


సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం శ్రమిస్తూ, కంటికి రెప్పలా పంటల్ని కాపాడుకుంటూ.. సాగులో సిరులు కురిపిస్తున్న కృష్ణానది పరీవాహక రాజధాని ప్రాంత రైతుల పాలిట పిడుగుపాటు లాంటి వార్త ఇది. ఏడాదికి మూడు పంటలు పండే ఆయా గ్రామాల్లో తదుపరి సీజన్ నుంచి సాగును అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న పంటల సాగును రైతులకు దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది రైతుల భవితను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

రాజధాని ప్రాంతంలో పంటల సాగుకు ఈ సీజన్ (రబీ) వరకే అనుమతి ఉందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ బుధవారం ప్రకటించడంతో మూడు మండలాల పరిధిలోని 29 గ్రామాల రైతుల్లో ఒక్కసారిగా అలజడి, ఆందోళన మొదలైంది. రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో భూ సమీకరణ సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో.. ఆ ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. ఆ మొత్తం ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి ప్రభుత్వం పంటల సాగును నిషేధించడం రైతులకు విస్మయం కలిగిస్తోంది.

సాగుకు దూరంగా ఉండాలనే ఊహతోనే రైతన్నలు కుమిలిపోతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఇక దయనీయంగా మారనుంది. ఎన్నో ఏళ్లుగా సాగునే నమ్ముకుని స్వాభిమానంతో జీవనం కొనసాగిస్తున్న అన్నదాతలకు భూ సమీకరణ శరాఘాతంలా తగిలింది.

రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాకు చెందిన మూడు మండలాల పరిధిలో 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా గుర్తించింది. ఈ గ్రామాల్లో పట్టా, అసైన్డ్, దేవాదాయ, అటవీ, పోరంబోకు భూములన్నీ కలిపి 51,788 ఎకరాలున్నట్టుగా అప్పట్లో నివేదికలు సిద్ధం చేసింది. ఈ 29 గ్రామాల పరిధిలో రైతులు సాగు చేస్తున్న భూములు మొత్తం 41,750 ఎకరాలు. అయితే రాజధాని నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో 34 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు నిర్ణయించి ఈ నెల 2 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పంటలు వేసుకునేందుకు అవకాశమే లేదని తాజాగా తేల్చి చెప్పడంతో బ్యాంకు రుణాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ప్రాంత రైతులకు రుణాలు మంజూరు చేయరాదని బ్యాంకర్లకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖికంగా తెలియజేసింది. ఇలావుండగా ప్రభుత్వం భూ సమీకరణకు ప్రతిపాదించిన 29 గ్రామాలన్నింటిలో రైతులు ఏడాది పొడవునా మూడు పంటలు పండిస్తున్నారు. అరటి, పసుపు, కంద, మొక్కజొన్న, అన్ని రకాల పూలతోటలు, అన్ని రకాల కూరగాయలు, ఉల్లి, మునగ పంటలు సాగు చేస్తున్నారు.

మార్కెట్ సౌకర్యం కూడా రైతులకు అందుబాటులో ఉండటంతో నికర లాభాలను ఆర్జిస్తున్నారు. కృష్ణా పరివాహక జరీబు భూముల్లో అంతర పంటలు (అరటిలో కంద, పసుపు, పూలతోటలు) సాగు చేసి ఒకేసారి రెండు పంటల ఫలసాయాన్ని కూడా రైతన్నలు పొందుతున్నారు. మెట్ట పైర్లు అరటి, పసుపు, కంద సాగుతో రూ.90 వేలు నుంచి రూ.లక్ష వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ ప్రాంతంలో కౌలు రేట్లే ఏడాదికి ఎకరాకు రూ.50 వేల వరకు ఉన్నాయంటే పంటల సాగు ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కౌలు రైతులు భూముల్ని సాగు చేసి ఎకరాకు పెట్టుబడి ఖర్చులన్నీ పోనూ రూ.70 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇక్కడున్న 12 వేల మంది కౌలు రైతులు జరీబు భూముల్ని సాగు చేసి నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

పరిహారం ఊసెత్తని ప్రభుత్వం
రాజధానికి భూములిచ్చే రైతులకు పరిహారంగా ఎకరాకు మెట్ట భూములకైతే రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదీ పదేళ్ళ పాటు మాత్రమే. మధ్యలో అభివృద్ధి చేసిన భూమి అమ్ముకుంటే ప్రకటించిన పరిహారం ఇవ్వరు. ఇక పరిహారం ఎప్పుడిస్తారన్న దానిపై స్పష్టత లేదు. తాజాగా పంటల సాగుకు అనుమతి లేదని చెప్పారే కానీ పరిహారం విషయం ప్రస్తావించలేదు. అయినా ఏడాది పొడవునా సాగు చేస్తే తమకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ పాటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Popular Posts

Topics :