22 February 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

3న రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Saturday, February 28, 2015 | 2/28/2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూములను కోరిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చి 3న రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ ఆర్ సీపీ నేతలు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మర్రి రాజశేఖర్ లు పేర్కొన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయం మేరకే రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారని చెప్పారు.

రైతులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వాధికారులు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజస్వామ్యంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం సమంజసమా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇది ప్రజస్వామ్యమా? లేక రాజరికమా? అంటూ మండిపడ్డారు. రైతాంగానికి వైఎస్ఆర్ సీపీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల కోసం ప్రాణాలిస్తున్న చంద్రబాబు ఇప్పుడు రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, కౌలురైతుల తరపున మహోద్యమం చేస్తామని వైఎస్ ఆర్ సీపీ నేతలు అంబటి, ఆర్కే, మర్రి రాజశేఖర్ లు తెలిపారు.

రాజధాని ఒప్పందం ఎవరితో?


బాబు నైజమేంటో తెలుస్తోంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అన్నాహజారే వంటివారు ఆందోళనలు చేస్తుండడంతోపాటు మరోవైపు దీనిపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ఆ చట్టాన్ని రైతులపై ప్రయోగిస్తానని చెప్పడాన్నిబట్టే ఆయన వైఖరేంటో తెలిసిపోతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు.  ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సైతం భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో రాజధాని గ్రామాల రైతులపై ఈ చట్టం ప్రయోగించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో స్పష్టత వచ్చేవరకైనా దీనిని ఆపివేయాలన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడితే.. తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. అవసరమైతే తమపార్టీ రైతులపక్షాన కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు.
 
 ల్యాండ్‌పూలింగ్ విధానంలో ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన భూమి, అక్కడనున్న ప్రభుత్వ భూములన్నీ కలపి దాదాపు 40 వేల ఎకరాల వరకు అవుతున్నాయని, అలాంటప్పుడు అదనంగా రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరమేంటని ఆర్కే ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఆ 40 వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని సూచించారు.  వైఎస్సార్‌సీపీ రైతులపక్షాన ఉండి పోరాడబట్టే ప్రభుత్వం భూసమీకరణ గడువు ముగిసే సమయంలో అదనపు పరిహారాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. రైతులకు ఒక సెంటు పరిహారం కూడా అదనంగా పెంచేది లేదని మంత్రి నారాయణ ఫిబ్రవరి మొదటివారంలో చెప్పారని, ఇప్పుడు సీఎం ప్రకటన చేశారంటే అందుకు తమ పార్టీ ఒత్తిడే కారణమన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 30 వేలమంది వరకు ఉన్న రైతులకు పరిహారం పెంచింది కానీ... 3 లక్షలమంది కౌలురైతులు, కూలీలకు పరిహారం పెంచలేదని ఆర్కే తప్పుపట్టారు.
 
 రాజధాని ఒప్పందం ఎవరితో?
 రాజధాని నిర్మాణంకోసం సింగపూర్‌తో ఒప్పందం విషయంలో ఆ దేశ మంత్రి మాటలు, మన సీఎం మాటలు భిన్నంగా ఉంటున్నాయని రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది తమ దేశానికి చెందిన సంస్థలతోనేనని సింగపూర్ మంత్రి చెబుతుంటే,  చంద్రబాబు ఇన్నాళ్లూ సింగపూర్ ప్రభుత్వంతో  చేసుకున్నట్టు చెబుతూ వచ్చారన్నారు.ఈ విషయంలోనూ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టించిందన్నారు.

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి


చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ పొంగులేటి
ఖమ్మం: పర్యావరణం అనుమతుల పేరుతో గ్రానైట్ పరిశ్రమలపై ఆంక్షలు విధించడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న గ్రానైట్ పరిశ్రమలను పర్యావరణ అనుమతుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం పరిశ్రమలు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయన్నారు.

ఈ పరిశ్రమల ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాధి మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో చిన్నతరహా పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని, పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదన్నారు. మేజర్ ఖనిజా లు, మైనింగ్ ప్రాజెక్టుల లీజు ప్రాంతం 5 హెక్టార్లలోపు ఉంటే సుప్రీం కోర్టు పరిధిలో సడలించే అవకాశం ఉందన్నారు. అందువల్ల నిబంధనలు సడలించి గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు.
 
ప్రశ్నలు సంధించిన ఎంపీ
మందులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాల పర్యవేక్షణకు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఆ వివరాలను వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ పలు ప్రశ్నలను లిఖితపూర్వకంగా సంధిం చారు. దేశంలో నకిలీ మందుల ప్రభావం ఎక్కువ గా ఉండటం వల్ల వాటి తయారీ కేంద్రాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగారు. వాటిని పర్యవేక్షించడానికి ఎన్ని కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయన్నారు.  వాటిలో ఎన్నింటికి అనుమతులిచ్చారో వివరించాలని కోరారు.

అలాగే పై పరిణామం వల్ల పరిశ్రమల నుంచి ఉత్పత్తి ఏమైనా తగ్గిందా..? తగ్గితే వాటి వివరాలు వెల్లడించాలని అడిగారు. కంపెనీలు దరఖాస్తు చేసుకునే ముందు డ్రగ్ రెగ్యులారిటీ అథారిటీ- వినియోగదారులకు మధ్య ఏమైనా చర్చలు జరుపుతుందా... అని ప్రశ్నించారు. దరఖాస్తులను పరిశీలించి త్వరతగతిన ఆమోదించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరారు.

సంబంధిత శాఖామంత్రి జగత్ ప్రకాశ్ అడ్డా సమాధానమిస్తూ 2012లో 480 దరఖాస్తులకు ప్రభుత్వం 253 ఆమోదించిందని, 2013లో 207 దరఖాస్తులకు 73కి ఆమోదం తెలిపిందని, 2014లో 230 దరఖాస్తులకు గాను 198కి అనుమతిచ్చిందని, ప్రస్తుత ఏడాదికి సంబంధించి 17 దరఖాస్తులు రాగా గత ఏడాది పెండింగ్‌లో ఉన్న వాటితో సహా మొత్తం 27 దరఖాస్తులను ఆమోదించిందని తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ అథారిటీ అసోసియేషన్ ద్వారా ఒక వెబ్‌సైట్‌ను నడుపుతున్నామని, అందులో దరఖాస్తు దారులకు పూర్తి సమాచారం లభ్యమవుతుందని వివరించారు. అలాగే మందుల తయారీ పరిశీలకులుగా చాలామంది అనుభవజ్ఞులను ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్స్ అథారిటీలోకి చేర్చుకుందన్నారు.
 
ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలేంటి.?
ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కంపెనీల విధి విధానాల గురించి వివరించాలని ఎంపీ పొంగులేటి కోరారు. కంపెనీల విధి విధానాల పర్యవేక్షణలో భాగంగా ఏమైనా రివ్యూలు నిర్వహించడానికి ప్రతిపాదనలు చేశారా..? చేస్తే వాటి వివరాలను వెల్లడించాలని అడిగారు. కంపెనీల పనివిధానం మెరుగుపడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని కోరారు.

సంబంధిత శాఖామంత్రి జయంత్ సిన్హా సమాధానమిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం విధివిధానాలను పొందుపరిచిందన్నారు. అందులో సెక్షన్ 20 ఐఆర్‌డీఏ యాక్ట్ ప్రకారం లైఫ్, జనరల్, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను సంవత్సరాల వారీగా పొందుపరుస్తున్నామన్నారు. అప్రైజల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్‌పైన, అథారిటీ ఇన్సూరెన్స్, అనాథరిటీ ఇన్సూరెన్స్‌లతోపాటు మార్కెట్ డెవలప్‌మెంట్ విధివిధానాలు పొందుపరచడం జరిగిందన్నారు. ఐఆర్‌డీఏ ఆధ్వర్యంలో అవగాహన పెంపొందించి వినియోగదారులను పెంచడానికి వివిధ రకాల విధివిధానాలను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
 
వాణిజ్య పరంగా ఏయే దేశాలతో సంబంధాలున్నాయి..?
వాణిజ్యపరంగా ఏయే దేశాలతో భారతదేశం సత్సంబంధాలను కొనసాగిస్తుందో తెలపాలని ఎంపీ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రాధాన్యత వాణిజ్యాలకు సంబంధించి ఏఏ దేశాలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారో... ప్రస్తుత సంవత్సరంతోపాటు గత మూడేళ్ల సమాచారం అందించాలని కోరారు. అలాగే ఇజ్రాయల్‌తోపాటు మరే దేశాల్లో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందా..? అలాగే దేశానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించారు.

ఒకవేళ చర్యలు తీసుకుంటే వాటి వివరాలను వెల్లడించాలని, చర్చలు జరిపేటప్పుడు స్థానిక వ్యాపారవేత్తల ప్రమేయం ఎంతవరకు ఉంటుందన్నారు. సంబంధిత శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ గత మూడేళ్లలో భారతదేశంలో ఎలాంటి వ్యాపారాలకు అగ్రిమెంట్‌లు కాలేదన్నారు. ఏషియన్ దేశాలతో మాత్రం 2014 సెప్టెంబర్ 9న ఒక అగ్రిమెంట్ జరిగిందని, దాన్ని 2015 జూలై 1న అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఇజ్రాయల్‌తో పాటు మరిన్ని దేశాలతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం నిరంతర ప్రక్రియ కాబట్టి దానికి అగ్రిమెంట్ ఉండదన్నారు. అలాగే చర్చలు జరిపే ముందు స్థానిక వ్యాపారవేత్తలను సంప్రదిస్తున్నామన్నారు. ఏదైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు.
 
రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు ?
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని, దేశ వ్యాప్తంగా వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ కేంద్రాల వివరాలు వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు. కొత్తగా వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ కేం ద్రాలకోసం ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఈ అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి రాధాకృష్ణ సమాధానమిస్తూ ఫిట్‌నెస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని వివరించారు. అందులో ఆంధ్రప్రదేశ్, బీహార్, చంఢీఘర్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మ హారాష్ట్ర, మిజోరాం ఒ డిస్సా, పంజాబ్, తమిళనాడు, పశ్చిబెంగాల్ రాష్ట్రాల నుంచి సమాధానం వచ్చిందన్నారు. కానీ తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానమూ రాలేదన్నారు. సెంట్రల్ మానిటరింగ్ వెహికిల్ రూల్62 ప్రకారం ఫిట్‌నెస్ తనిఖీ కేంద్రాల ద్వారా రహదారుల ఫిట్‌నెస్ కూడా పరిశీలిస్తామని చెప్పారు.

ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం

Written By news on Friday, February 27, 2015 | 2/27/2015


ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం
హైదరాబాద్ : చరిత్రలో ఒకేసారి ఒకే అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ముందుగా వచ్చేనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్ల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నారు.

గేట్-1 నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను అనుమతించాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే గేట్-2 నుంచి రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతించాలని భావించారు. ఇలా ఇప్పటివరకు ఎప్పుడూ ఒకేసారి ఒకే సమయంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే భవనంలో జరిగిన దాఖలాలు లేవు.

మా పార్టీ అండగా ఉన్నందునే రైతులకు పరిహారం పెంపు

)
'మా పార్టీ అండగా ఉన్నందునే రైతులకు పరిహారం పెంపు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం పరిహారం పెంచడానికి వైఎస్సార్ సీపీనే కారణమని ఆ పార్టీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పాతికవేల ఎకరాలను సేకరించగా, ప్రభుత్వ భూములు దాదాపు 15 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఆ నలభై వేల ఎకరాలు ఏపీ రాజధాని నిర్మాణానికి సరిపోయే నేపథ్యంలో మళ్లీ భూసేకరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈనెల 28 తర్వాత భూసేకరణ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనకు కట్టుబడి ఉంటారా?అని నిలదీశారు.

భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచనలో పడిన విషయం మీకు గుర్తు లేదా?అని ఆర్కే ప్రశ్నించారు. భూసేకరణపై ఏపీ సర్కార్ మొండిగా ముందుకెళ్తే కోర్టును ఆశ్రయిస్తాని ఆయన హెచ్చరించారు. పరిహారం విషయంలో కౌలు రైతులు, రైతు కూలీల ప్రస్తావనే లేదని ఆయన విమర్శించారు. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల జోలికి వెళ్లవద్దన్నారు.

జగన్‌కు వీడ్కోలు పలికిన ‘అనంత’ నేతలు


రైతుకు భరోసా
 రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ మోస పూరిత వైఖరితో బలవన్మరణాలకు పాల్పడుతున్న ‘అనంత’ రైతులకు అండగా నిలిచి వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ైవె ఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మొదటి విడత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
 
 ఈ నెల 22న హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యాత్ర పుట్టపర్తి, ఉరవకొండ, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో సాగింది. ఐదు రోజుల్లో 781 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్.. ఆత్మహత్య చేసుకున్న 11 మంది రైతుల కుటుంబాలను పరామర్శించారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద మొదలైన యాత్ర గురువారం సాయంత్రం పామిడి మండలం రామరాజుపల్లితో ముగిసింది. ఐదో రోజు యాత్రలో భాగంగా ఉదయం 9.50 గంటలకు జగన్ పామిడి వీరాంజనేయులు అతిథి గృహం నుంచి బయలుదేరారు. పి. కొండాపురం చేరుకుని సుంకమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
 
 గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కే. శివారెడ్డి(46) కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామస్తులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. రోడ్లపై బంతిపూలు పరిచారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం అక్కడి నుండి రామరాజుపల్లికి చేరుకున్నారు. పామిడి- గుత్తి హైవేకు సమీపంలోని గ్రామాల ప్రజలు జగన్‌ను చూసేందుకు రోడ్డుపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రావడంతో చివరి రోజు పర్యటన 4 గంటలు ఆలస్యంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ముగించాలని షెడ్యూలు ఉంటే సాయంత్రం 6 గంటల దాకా సాగింది. రామరాజుపల్లిలో రైతులతో జగన్ చర్చా వేదిక నిర్వహించారు. రైతు భరోసా యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది.. ప్రభుత్వం చేసిన మోసాలు తదితర అంశాలను జగన్ వివరించారు. ప్రభుత్వంతో తాము ఎలా మోసపోయామో రైతులు జగన్‌కు ససాక్ష్యాలతో వివరించారు. రుణమాఫీపై ఆశపడ్డామని, అయితే చంద్ర బాబు వైఖరి చూసి తాము మోసపోయామని తెలుసుకున్నామని చెప్పారు. ఇకపై మీతోపాటు నడుస్తున్నామని, తమకు అండగా ఉండాలని జగన్‌కు రైతులు విన్నవించారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఉద్యమం ఆగదని, ‘అనంత’ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పుల్లారెడ్డి (64)కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
 
 జగన్‌కు వీడ్కోలు పలికిన ‘అనంత’ నేతలు:
 తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత జగన్‌కు జిల్లా నేతలు జిల్లా సరిహద్దులో వీడ్కోలు పలికారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, సీజీసీ సభ్యుడు బి. గురునాథరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరలు వీడ్కోలు పలికారు. ఐదో రోజు యాత్రలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్తలు రమేశ్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నదీమ్ అహ్మద్, మీసాల రంగన్న, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ప్రధాన కార్యదర్శి ఉష, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, సిద్దారెడ్డి, పెన్నోబులేసు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ రవీంద్రారెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఆనందరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, యువజన విభాగం నగర అధ్యక్షుడు మారుతీ నాయుడు, పసుపుల బాలకృష్ణారెడ్డి, ప్రమీల, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రజలకు ధన్యవాదాలు : శంకర్‌నారాయణ, జిల్లా అధ్యక్షుడు,
 రైతులు, ప్రజలు కష్టాలను తెలుసుకుని మోసం చేసిన ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ యాత్ర చేపట్టాం. మొదటి విడత యాత్ర దిగ్విజయంగా ముగిసింది. యాత్ర విజయవంతమవడానికి సహకరించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు. రెండో విడత యాత్రలో తక్కిన రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.

బడ్జెట్ నిరాశ పరిచింది: మేకపాటి


బడ్జెట్ నిరాశ పరిచింది: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో చేస్తారని ఆశించామని, అయితే బడ్జెట్ నిరాశపర్చిందని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకతో కలసి ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని.. ఉమ్మడి ఏపీకి సంబంధించి దాదాపు రూ.29 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘‘అవన్నీ ఈ బడ్జెట్‌లో చేరుస్తారనుకున్నాం. ఏపీకి ఆరునెలల్లోనే కొత్త రైల్వేజోన్ ఇస్తామని విభజన చట్టంలో ఉన్నా దాని ఊసే లేదు.’’ అని అన్నారు.

రుణమాఫీతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు


‘మాఫీ’ మాయపై అసెంబ్లీలో నిలదీస్తా
- రుణమాఫీతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు
- రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ‘ఉపాధి’ చూపడం లేదు
- ‘హంద్రీ-నీవా’ను తానే పూర్తి చేశానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు
- రైతు సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తా
- ఐదోరోజు రైతు భరోసా యాత్రలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- ముగిసిన మొదటి విడత భరోసా యాత్ర


రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
‘ఎన్నికలకు ముందు ఒకమాట.. తర్వాత మరోమాట చెప్పి రైతులను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. బాబు వైఖరితో బ్యాంకుల్లో అప్పు తీరకపోగా రైతులపై 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. దీంతో రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల కష్టాలు, ఆత్మహత్యలపై అసెంబ్లీలో చంద్రబాబు సర్కారును నిలదీస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లాలో గురువారం ఐదో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా పామిడి మండలం రామరాజుపల్లిలో రైతుల చర్చావేదిక నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
‘‘రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా, బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలన్నా.. జాబు కావాలన్నా.. బాబు రావాలన్నారు. జాబు లేకపోతే నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయ్యి తొమ్మిది నెలలవుతోంది. ఒక్క హామీని అమలు చేయలేదు. 87 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఉండేవి. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో 99 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. అంటే వ్యవ సాయ రుణాలపై 12 వేల కోట్ల రూపాయల వడ్డీ భారం పడింది. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 4,600 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తామంటోంది. ఇది కనీసం వడ్డీకి కూడా సరిపోదు.

రాష్ట్రం కరువుతో అల్లాడుతున్నా ఉపాధి లేదు
రాష్ట్రంలో ఈ ఏడాది 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కరువుతో రాష్ట్రం అల్లాడుతోంది. రుణమాఫీ పుణ్యమా అని ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరె న్స్ వచ్చే పరిస్థితి లేదు. పనుల్లేక ప్రజలు వలస బాట పట్టారు. అనంతపురం జిల్లా నుంచే కర్ణాటకకు నాలుగు లక్షల మంది వలస పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ప్రజలకు ఉపాధి పనులు చూపడం లేదు. డ్వాక్రా రుణాల పరిస్థితి మరీ దారుణం.

రాయలసీమపై బాబుకు ప్రేమ లేదు
రాయలసీమపై తనకు చాలా ప్రేమ ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ‘హంద్రీ-నీవా’ను తానే పూర్తి చేశానంటున్నారు. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో కేవలం 13 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వైఎస్ సీఎం అయిన తర్వాత 5,800 కోట్ల రూపాయలు విడుదల చేసి 85 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశారు. కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు వైఎస్ పూర్తి చేసిన ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఆ ఘనత తనదే అని అబద్ధాలు చెబుతున్నారు.
రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు విషయంలోనైనా చంద్రబాబు చేసింది సున్నా. పల్లెల్లో పిక్ పాకెటింగ్ చేస్తే 420 కేసు పెడతారు. మరి అబద్ధాలు ఆడి ఏకంగా సీఎం అయిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి? ప్రజలను చంద్రబాబు ఒకసారి మోసం చేశారు. మళ్లీ మోసపోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి డిపాజిట్లు కూడా రావు. ఢిల్లీలో ఆప్‌కు 70 సీట్లకు 67 వచ్చినట్లు ఇక్కడా అవే ఫలితాలు వస్తాయి’’ అని చెప్పారు.

ఐదో రోజు రెండు కుటుంబాలకు పరామర్శ
ఐదో రోజు యాత్రలో జగన్ రెండు కుటుంబాలను పరామర్శించారు. పామిడి మండలం పి.కొండాపురం, రామరాజుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతులు శివారెడ్డి (46), పుల్లారెడ్డి (64) కటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. గురువారం ఐదో రోజుతో తొలి విడత రైతు భరోసా యాత్ర ముగిసింది. ఈ నెల 22న ప్రారంభమైన యాత్ర ఐదు రోజుల్లో ఐదు నియోజకవర్గాల్లో 781 కిలోమీటర్లు సాగింది.

ఆత్మహత్య చేసుకున్న 11మంది రైతుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. యాత్ర ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమైన ఆయనకు ‘అనంత’ నేతలు జిల్లా సరిహద్దు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు. యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, తాడిపత్రి అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది..

వేదికలో వైఎస్ జగన్‌తో మొరపెట్టుకున్న రైతులు
 
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి : ‘‘రైతులందరూ ఆన్‌లైన్ పేపర్లు తీసుకుని ససాక్ష్యాలతో రుణమాఫీపై మోసాన్ని వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు. రైతులకు జరిగిన మోసంపై ఉద్యమాన్ని ఆపేది లేదు. చంద్రబాబు దిగివచ్చేదాకా అందరం కలసికట్టుగా నడుం బిగించి పోరాడదాం’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లిలో నిర్వహించిన సదస్సులో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, జగన్ మధ్య సాగిన సంభాషణ..
 
రూ.60 వేలు అప్పునకు గాను రూ.3,642 మాఫీ అయింది
కేశవరెడ్డి: సార్ నాకు బ్యాంకులో 60 వేల రూపాయల అప్పుంది. అయితే నాకు 3,642 రూపాయలు మాఫీ అయిందని ఇదో ఈ పత్రంలో ఉంది. (మీ సేవా సెంటర్‌లో తీసుకున్న రుణమాఫీ పత్రం చూపిస్తూ)
జగన్: (ఆ పత్రం తీసుకుని) ఇది నా దగ్గరే పెట్టుకుని అసెంబ్లీలో చంద్రబాబుకు చూపిస్తా
 
99 వేలు అప్పుంటే రూపాయి పోలేదు
సుబ్బమ్మ: సార్ 99 వేల రూపాయలు బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకున్నా. ఎనిమిది వేల రూపాయలు పోయింది అన్నారు. అది కూడా పోలేదు సార్.
జగన్: (పత్రాలు చేతికి తీసుకుని) మా సుబ్బమ్మ పరిస్థితి ఇది. 99 వేల రూపాయలు తీసుకుంది. వడ్డీతో కలిపి 1,07,362 రూపాయలైంది. అయితే 8,312 రూపాయలు మాఫీ అయిందని చెబుతున్నారు. అది కూడా పోలేదు. అది వచ్చినా కనీసం వడ్డీకి కూడా సరిపోదు. ఏ విధంగా రుణమాఫీ చేశావు అని చంద్రబాబును నిలదీస్తా అవ్వా..
 
మొదటి సంతకం దీనికే అని మోసం చేశారు
రోశన్న: సార్.. నేను బ్యాంకులో 72 వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నా. రూపాయి పోలేదు. మొదటి సంతకం రుణమాఫీపై పెడతా అన్నారు. ఇప్పుడు పావలా ఇవ్వలేదు సార్.
జగన్: రోశన్నకు 4.56 ఎకరాలు ఉంది. 72 వేల రూపాయలు తీసుకుంటే దమ్మిడీ కూడా మాఫీ కాలేదని అసెంబ్లీలో చెబుతాను.
 
చౌడమ్మ: సార్.. నేను డ్వాక్రాలో ఉన్నా. మా ఆయనకు అనారోగ్యం కావడంతో 50 వేల రూపాయలు తీసుకున్నా. నెలకింత కట్టుకుందామనుకున్నా. రుణమాఫీ చేస్తామన్నారు. డబ్బులు కట్టలేదు. ఇప్పుడు అంతా కట్టాలంటాండారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తాడు. కట్టేది లేదన్నాను. అయితే చంద్రబాబునే అడుగండంటున్నారు. మాకు మాత్రం బాకీ కట్టాల్సిందే అని బ్యాంకర్లు నిలదీత్తన్నారు. మాకు పొలం లేదు. ఏం చేసేది మందుతాగి సావాలా?
జగన్: అయ్యో.. అంత మాట అనొద్దు చౌడమ్మవ్వా..
చౌడమ్మ: నాయనా.. మా బిడ్డలాంటోడివి. దేవుడి లెక్క ఈడకి వచ్చినావు. నువ్వు బస్సు పెట్టు. మేమంతా హైదరాబాద్‌కు వస్తాం. చంద్రబాబు ఇంటిముందు ధర్నా చేద్దాం.
జగన్: నువ్వు చేసిన మోసంతో చౌడమ్మవ్వ ఇలా బాధపడుతోందని నేను అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తా అవ్వా.
 
 
చంద్రబాబు కాలర్ పట్టుకుని అడుగుతా
సుధాకర్: సార్.. మేం బ్యాంకులో 36 వేల రూపాయల రుణం తీసుకున్నాం. వడ్డీతో కలిపి దాదాపు 47 వేల రూపాయలైంది. నాకు ఆ రుణ మొత్తం మాఫీ అయినట్లు అప్లికేషన్ స్టేటస్‌లో ఉంది. చంద్రబాబు సంతకంతో రుణ విముక్తి పత్రం కూడా పంపారు. ఫీల్డ్ ఆఫీసర్ మాత్రం రుణమాఫీ కాలేదంటున్నారు సార్..
జగన్: మాఫీ అయిందని చంద్రబాబు లెటర్ పంపినాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ కాలేదంటున్నారు. రెండూ నాకివ్వు. అసెంబ్లీలో చంద్రబాబును అడుగుతాను.
సుధాకర్: నన్నూ తీసుకుపోండి సార్.. కాలర్ పట్టుకుని అడుగుతా. నేను ఎంఏ బీఈడీ చేశా. బీఈడీ వాళ్లకు ఎస్జీటీ అవకాశం ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. ఇప్పుడు మోసపోయాం. చేతకానప్పుడు తప్పుడు హామీలు ఇవ్వకూడదు సార్.. (ఆవేదనతో ఏడుస్తూ) నా మాదిరి చాలామంది మోసపోయారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దమ్మిడీ ఇవ్వలేదు. పోనీ కాంట్రాక్టు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే టీడీపీ నేతల సిఫార్సు కావాలంటున్నారు సార్. ఏం వాళ్లకు తప్ప మిగతా వాళ్లు అర్హులు కాదా సార్..
జగన్: సుధాకర్.. నీలాగే రాష్ట్రంలో కోటీ డెభ్భైఐదు లక్షల కుటుంబాలు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయి. నీకు రుణమాఫీ కాలేదు. నీ తరఫున నేను అసెంబ్లీలో బాబును నిలదీస్తా. ఆ లెటర్లు నాకు ఇవ్వు.
 
వెంకిరెడ్డి: సార్. నేను 28 వేల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకున్నా. కానీ రూపాయి మాఫీ కాలేదు. 3.5 తులాలు బంగారు పెట్టి మరో 43 వేల రూపాయలు తీసుకున్నా. అదీ మాఫీ కాలేదు. పంటల్లేవు. పనుల్లేవు. డబ్బులు కట్టలేక నిలబడిపోయినా. ఏం చేసేది సార్..
జగన్: ఎన్ని ఎకరాలు ఉంది తాతా..
వెంకటరెడ్డి: ఐదు ఎకరాలు
జగన్: ఆ కాగితాలు నాకు ఇవ్వు వెంకటరెడ్డి తాతా.. పరిస్థితి ఇదీ అని నేను అసెంబ్లీలో బాబును నిలదీస్తా.
జగన్ : మీ అందరి తరఫున నేను అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తాను. న్యాయం జరిగే వరకు అందరం కలసికట్టుగా పోరాడదాం.
 
ఆ వడ్డీ ఎవరు కట్టాలి సార్
సార్.. నేను 3.60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా. 2013 డిసెంబర్ 31 నాటికే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తామంటోంది. 2014కు, ఈ మూణ్ణెళ్లు ఎవ్వరు వడ్డీ కట్టాలి? రైతులు 15 నెలల వడ్డీ చెల్లించాలి. మీరు అసెంబ్లీలో అడగాలి.     - రామచంద్రారెడ్డి, ఆకులేడు
 
రూపాయి మాఫీ చేయలేదు
మాది దేవి మహిళా సంఘం సార్. 4.50 లక్షల రూపాయల లోను తీసుకున్నాం. మాఫీ అవుతాదని 5 నెలలు కంతులు కట్టలేదు. ఐదు నెలలకు 55 వేల రూపాయలు వడ్డీ అయింది. అట్టాగే నాపేరు, మా ఆయన పేరు మీద 45 వేల రూపాయల క్రాప్‌లోను, 3.5 తులం బంగారం పెట్టి 35 వేలు గోల్డ్‌లోను తీసుకున్నాం. ఇద్దరికీ 11 వేలు పోయిందన్నారు. రూపాయి కూడా మాఫీ కాలేదు. అప్పులు మాఫీ చేస్తానని సీఎం చెప్పారు కదా అంటే ఆయన్నే అడుగు పో అంటున్నారు. ఎన్నికలొచ్చేదాకా ఆయప్ప ఈపక్కకు రారు. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఎట్టా చేసేది?     - కమలాక్షి, వెదురూరు
 
చేసేది లేక వడ్డీ.. కొంత అసలు కట్టినా
నాకు ఐదెకరాలు ఉంటే ఈ మధ్యనే రెండెకరాలు అమ్మినా. 46 వేల రూపాయలు క్రాప్‌లోను తీసుకున్నా. రూపాయి కూడా మాఫీ కాలేదు. వేలం వేస్తామని నోటీసులు పంపినారు. వడ్డీ, కొంత అసలు కట్టినా సార్. ఏం చేసేది?     - సుంకిరెడ్డి కాసేపల్లి

మేమంతా అండగా ఉంటాం


ధైర్యంగా ఉండండి..
- రైతు కొండూరు శివారెడ్డి కుటుంబంతో జగన్
 
పామిడి: ‘కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా అందరం కలసికట్టుగా పోరాడదాం. మేమంతా అండగా ఉంటాం’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి.. పామిడి మండలం పి.కొండాపురంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కొండూరు శివారెడ్డి,  రామరాజుపల్లికి చెందిన రైతు వి.పుల్లారెడ్డి (64) కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఆయన గురువారం రెండు కుటుంబాల వారిని వేర్వేరుగా పరామర్శించారు.
ఈ సందర్భంగా శివారెడ్డి భార్య రంగమ్మతో మాట్లాడి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. ఎంమేర అప్పులు పాలయ్యారు. వారి పిల్లలు ఏం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని రంగమ్మ చిన్న కుమార్తె స్వాతి చదువుకు సాయమందించాలని స్థానిక నేతకు సూచించారు.అదే విధంగా పుల్లారెడ్డి కుటుంబీకులతో మాట్లాడుతూ వారి కుటుంబ స్థితి గతులను తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందిందా లేదా అని ఆరా తీశారు.


http://img.sakshi.net/images/cms/2015-02/81424989558_Unknown.jpgపుల్లారెడ్డి కుమారుడు లక్ష్మి రెడ్డి తమ స్థితి గతులను తెలియజేస్తూ... మూడేళ్లుగా వర్షాల్లేక పంటలు పండక ఎకరాకు ఒక క్వింటా దిగుబడి రావడం గగనమైందని తెలిపాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పాడు. వారి సమస్యను విన్న జగన్‌మోహన్ రెడ్డి రైతుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. అంతా ధైర్యంగా  ఉండాలని, కలసి కట్టుగా సమస్యలను ఎదుర్కొందామని చెప్పారు.

పజలకు ఇబ్బంది కలిగే అంశాలను ఎత్తిచూపుతాం


అంశాలవారీగా మా మద్దతు ఉంటుంది...
అంశాలవారీగా మా మద్దతు ఉంటుంది..
- పజలకు ఇబ్బంది కలిగే అంశాలను ఎత్తిచూపుతాం
- రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో
- వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్


సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు మేలుచేసే పనుల్లో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ తరఫున అంశాలవారీగా మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాల్లో వేలెత్తి చూపుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై కేంద్రం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం మీద గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో వరప్రసాద్ మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్‌భారత్, మేక్ ఇన్ ఇండియా, జన్‌ధన్ యోజన, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే స్కిల్ ఇండియా, ఆడ పిల్లలకు విద్యనందించే ఉద్దేశంతో చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌ను అభినందించారు. అయితే కొన్ని అంశాల్లో ఎన్నో లోపాలున్నాయని పేర్కొన్నారు.

దేశంలో దాదాపు 30 శాతం మంది దళితులు, 50 శాతం మంది బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని, దేశ అభివృద్ధి కేవలం 20 శాతం మంది జనాభాకే చేరుతున్నదని అన్నారు. పేదలు గౌరవంగా బతికేలా వారి ఆర్థికస్థితిని మార్చేలా పథకాలను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కోరారు. కేంద్రం పారిశ్రామిక అభివృద్ధి పేరిట భూసేకరణ చేపట్టాలని చూస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో యూరప్ తరహాలో భారత్‌లోనూ వ్యవసాయం చేసేవారే లేకపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఏ ఒక్క చర్యా తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

రేణిగుంట లో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

చిత్తూరు :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్  ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
 
అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు చేరుకుంటారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజరు అవుతారు. వధూవరుల్ని ఆశీర్వదించి వైఎస్ జగన్ తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.

పీజీ చేసినా.. నిరుద్యోగ భృతి రావట్లేదు!

Written By news on Thursday, February 26, 2015 | 2/26/2015


పీజీ చేసినా.. నిరుద్యోగ భృతి రావట్లేదు!
అనంతపురం : పీజీ చేసినా తనకు నిరుద్యోగ భృతి మాత్రం అందడం లేదని సుధాకర్ అనే రైతు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వడ్డీతో కలిపి రూ. 47వేల రుణం ఉన్నా, రుణమాఫీ మాత్రం వర్తించలేదని కన్నీరు పెట్టుకున్నారు. మనోధైర్యంతో ఉండాలని సుధాకర్ కు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతు భరోసాయాత్రలో భాగంగా ఐదోరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆకులేడు రామచంద్రారెడ్డి అనే రైతు కూడా తన సమస్యను చెప్పుకొన్నాడు. రుణమాఫీ అనడం వల్లే చంద్రబాబుకు రైతులు మద్దతు తెలిపారని, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 10 మాసాలైనా రుణమాఫీ కాలేదని ఆవేదన చెందారు.

రుణాలు బాగా చెల్లించే రైతులకు 4 శాతం వడ్డీ మాఫీ అమలయ్యేదని, చంద్రబాబు హామీవల్లే రుణం కట్టకపోవడంతో ఇప్పుడు 14 శాతం వడ్డీ కట్టాలంటున్నారని చెప్పారు. తామేం చెయ్యాలంటూ వైఎస్ జగన్ వద్ద రైతు రామచంద్రారెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. రామరాజపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పుల్లారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హిందూపురం, పుట్టపర్తి, ఉరవకొండ, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఆయన గురువారం పర్యటించారు.

రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్సీపీ నిరసన

విశాఖపట్నం (అల్లిపురం): కేంద్ర రైల్వే బడ్జెట్‌లో విశాఖకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. గురువారం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవు

అనంతపురం : ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచి ఘనవిజయం సాధించిందని, అదే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురంలో రైతు ఐదో రోజు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదని, దాంతో వారిపై వడ్డీభారం రూ. 12 వేల కోట్లు పడిందని, దీనంతటికీ కారణం బాబేనని చెప్పారు. రుణాలు మాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు ఆందోళనలో ఉన్నారని, డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును బ్యాంకులు రుణాల ఖాతాలకుజమ చేసుకుంటున్నాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు రూ. 57 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ రుణాలు మాఫీ కాకపోవడంతో కేవలం రూ. 13 వేల కోట్లే ఇచ్చారని చెప్పారు. రైతన్నలు నూటికి 2, 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల రుణాలు రెన్యువల్ కాలేదని, దాంతో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ దక్కలేదని చెప్పారు. ఏపీలో గత సీజన్ లో వర్షాలు 36 శాతం తక్కువగా నమోదయ్యాయని, కరువు వచ్చినా చంద్రబాబు మాత్రం స్పందించరని మండిపడ్డారు. హంద్రీనీవాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5,800 కోట్లు ఖర్చుచేస్తే, చంద్రబాబు కేవలం రూ. 13కోట్లే ఖర్చుపెట్టారని గుర్తుచేశారు.

ఆ జీవోలతో తెలుగు తమ్ముళ్లకే లబ్ధి!


ఆ జీవోలతో తెలుగు తమ్ముళ్లకే లబ్ధి!
- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు సదరు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని, టీడీపీ శ్రేణులకు ప్రయోజనం కలిగించేలా జీవోలు జారీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు సర్కారు జారీ చేసిన 135, 101, 535 జీవోలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ‘పచ్చచొక్కాల పందికొక్కులకు లబ్ధి చేకూర్చేందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ జీవోలు జారీ అయ్యాయి’ అని నిప్పులు చెరిగారు.
 
పింఛన్లతో సహా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారానే జరగాలని నిర్దేశించడం దారుణమన్నారు. వీటిలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించామని చెప్పారని అయితే ఏ గ్రామ కమిటీలో చూసినా టీడీపీకి చెందిన వారే నియమితులయ్యారని, దీంతో కింది నుంచి పైస్థాయి వరకు పాలనంతా రాజకీయమయంగా మారిందని అన్నారు. నేరస్తులు, రౌడీలే ఈ కమిటీల్లో ఉన్నారన్నారు. ఏ ఒక్క కమిటీలో నైనా టీడీపీ వారు కాకుండా ఒక్క స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి ఉన్నా తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని, దీనిపై చర్చకు రావాలని సీతారాం సవాలు విసిరారు. ‘టీడీపీ ఆధ్వర్యంలోని కమిటీలే అన్నీ నిర్ణయిస్తే ఇక పాలనాధికారులెందుకు? వారిని రద్దు చేయండి’ అని తమ్మినేని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. సర్పంచుల అధికారాలను గ్రామకమిటీల మాటున టీడీపీ వారికి దత్తం చేశారని అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పలికిన వారికి పింఛన్లు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను రద్దు చేయడం దారుణమన్నారు.
 
ఆ 500 కోట్లు ఎవరు బొక్కారు?
తూర్పు గోదావరిలో జరిగిన ఇసుక కుంభకోణంలో రూ.500 కోట్లు ఎవరు తిన్నారో చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలే ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్నారని చెప్పి వారి మాటున టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారన్నారు. ఆ జిల్లాలో ఈ భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ శాఖ కలెక్టర్‌కు నివేదిక సమర్పించిందని తెలిపారు.

ఉపాధి ఊసేది చంద్రబాబూ?


ఉపాధి ఊసేది చంద్రబాబూ?అనంతపురం జిల్లా పామిడి మండలం పాళ్యంలో వైఎస్ జగన్ కోసం వచ్చిన జనసందోహం. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న జగన్
- అనంతపురం జిల్లాలో 4 లక్షల మంది వలస వెళ్లారు
- ఖరీఫ్, రబీల్లో రైతులకు రుణాలు ఇవ్వలేకపోయారు
- బతికేందుకు ఉపాధి లేక.. అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు
- అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు
- నాలుగోరోజు రైతు భరోసా యాత్రలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
 ‘‘వర్షాలు లేవు.. పంటలు లేవు.. చేసేందుకు ఉపాధి హామీ పథకం పనులు లేవు. చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన మోసపూరిత వైఖరితో రైతులు, డ్వాక్రా మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆత్మాభిమానం చంపుకోలేక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఇంకొందరు బతికేందుకు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
ఒక్క అనంతపురం జిల్లా నుంచి మాత్రమే నాలుగు లక్షలమంది రైతులు వలసెళ్లారు. అయినా ప్రభుత్వం మాత్రం రైతులు, రైతు కూలీలకు దన్నుగా నిలవలేదు’’ అని విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగోరోజు బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలంలోని పాళ్యంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

 ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు
 ‘‘ఎన్నికలకు ముందు టీవీ ఆన్‌చేస్తే.. బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి. రుణాలు మాఫీ కావాలన్నా బాబు రావాలి. జాబు కావాలంటే బాబు రావాలి. లేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలైం ది. అయినా ఎందుకు హామీలు అమలు చేయలేదని అసెంబ్లీలో నిలదీశా. ‘అయ్యో నేనెప్పుడు చెప్పాను ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని’ అని చంద్రబాబు అంటున్నారు.
ప్రజలతో పనైపోయినాక చెబుతున్న మాటలు ఇవి. సీఎం కాకముందు 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. డిసెంబర్‌లో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ మీటిం గ్‌లో రూ.99 వేల కోట్ల  వ్యవసాయ రుణ  బకాయిలు ఉన్నాయని బ్యాంకర్లు తేల్చారు. అంటే చంద్రబాబు చేసిన మోసానికి రైతులు రూ.12 వేల కోట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 4,600 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామంటోంది. ఇది కనీసం వడ్డీకి కూడా సరిపోదు’’ అన్నారు.

పొదుపు సొమ్ము బకాయిలకు జమ
‘‘డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు అందేవి. కానీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో 6-7 నెలలుగా బకాయిలు చెల్లించలేదు. అప్పు చెల్లించాలని, లేదంటే ఇంట్లో ఆస్తులు వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని మహిళలు చెబుతున్నారు. మహిళలకు తెలీకుండా పొదుపు డబ్బులను పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారు.’’ అని తెలిపారు. హంద్రీ-నీవా, ఘనత వైఎస్‌దైతే చంద్రబాబు తనదని చెప్పుకోవడం అబద్ధాలు కావా అని ప్రశ్నించారు.

ఢిల్లీ ఫలితాలు ఏపీలో పునరావృతం
‘‘ప్రజలు నమ్మి ఓట్లేశారు. దాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని వమ్ము చేస్తే బంగాళాఖాతంలో కలుపుతారు. ప్రజలను బాబు ఒకసారి మోసం చేశారు. మరోసారి వారు మోసపోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఢిల్లీలో ఆప్‌కు 70 సీట్లకు 67 వచ్చినట్లుగా ఏపీలో మనకూ అవే ఫలితాలు వస్తాయి.’’ అన్నారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు
‘‘ప్రభుత్వ వైఖరితో కష్టాలున్నాయి. నష్టాలున్నాయి. అయితే ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. రాత్రిపోయాక పగలు వస్తుంది. మనకూ మంచి రోజులు వస్తాయి. అందరం చేయిచేయి కలిపి కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడదాం’’ అన్నారు.

నాలుగో రోజు రెండు కుటుంబాలకు పరామర్శ
 నాలుగోరోజు భరోసా యాత్రలో పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నూరప్ప (38) కుటుంబాన్ని, అదే మండలంలోని అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఓబన్న (30) కుటుంబాన్ని  జగన్ పరామర్శించారు. యాత్రలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, కార్యదర్శులు బోయ తిప్పేస్వామి, ఎల్.ఎం.మోహన్‌రెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రైతు భరోసా యాత్ర  ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే..
‘‘అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నేను గట్టిగా నిలదీశా. ప్రజల ఓట్లతో అవసరం ఉన్నపుడు ఏం చేస్తామని చెప్పారు.. ప్రజలు ఓట్లేసి అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని గట్టిగా అడిగాను. మీ అబద్ధాలు న మ్మి ప్రజలు మీ కు ఓట్లేసి గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెట్టా రు. కానీ ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. రైతులు, చేనేతలు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. మీరాడిన పచ్చి అబద్ధాలతో మోసపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రు.
దీనంతటికీ మీరు కారణం కాదా.. అని అడి గా. 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా వివరాలను చూపించా. కానీ చంద్రబాబు రైతు ఆత్మహత్యలను అవహేళన చేశారు. రైతులు సుఖ సంతోషాలతో, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎవరూ చనిపోలేదన్నారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే ఎక్కడ రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని ఒప్పుకోలేదు.
అయ్యా.. నేను ప్రతీ ఇంటికీ వెళ్లి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చూపిస్తా.. అని చెప్పా. ప్రభుత్వం నుంచి ఆదరణ లభించని క్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరో సా కల్పించి వారికి అండగా నిలిచేందుకే రైతు భరోసా యాత్ర చేపట్టాను’’ అని జగన్ చెప్పారు.

అండగా ఉంటా.. ఆందోళన వద్దు.


అండగా ఉంటా.. ఆందోళన వద్దు..
- ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

పామిడి: ‘మీకు అండగా నేనుంటాను. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. లేదంటే కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మీరెవ్వరూ ఆందోళన పడవద్దు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లిలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వన్నూరప్ప భార్య లక్ష్మీదేవితో  జరిపిన సంభాషణ ఇలా...
 
 జగన్: ఎందుకమ్మా.. మీ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు?
     అప్పులు ఎంతయ్యాయి తల్లీ?
 లక్ష్మీదేవి: వర్షాలు కురవక పంట మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. దీంతో అప్పులపాలయ్యాం. అప్పులు ఎలా తీర్చాలో తెలియని నా భర్త  వన్నూరప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రూ.3 లక్షల 9 వేల అప్పు ఉంది. అందులో ఎద్దులపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.9 వేల క్రాప్‌లోన్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.3 లక్షల అప్పు ఉంది సార్.
 
 జగన్: ప్రభుత్వ సాయం అందిందామ్మా? వితంతు పింఛన్ అయినా ఇచ్చారా?
 లక్ష్మీదేవి: ప్రభుత్వ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు, ఫించన్ ఇవ్వలేదు సార్
 అనంతరం జగన్ వన్నూరప్ప కుమారుడు ఎర్రిస్వామి, కుమార్తె పావనిలతో మాట్లాడి చక్కగా చదువుకోవాలని సూచించారు. లక్ష్మీదేవి తన ఆర్ధిక స్థితి సహకరించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా అక్కడ చేరిన డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్..  మాట్లాడారు. అక్కడే ఉన్న కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..కేన్సర్ చికిత్స కోసం రూ.6 లక్షల దాకా అప్పు చేశానని తనను ఆదుకోవాలని జగన్‌కు విన్నవించింది.  జగన్ స్పందిస్తూ వన్నూరప్ప పిల్లల  పై చదువులకు, కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మినీ ఆదుకోవాలని  వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వెంకట్రామిరెడ్డికి సూచించారు.

మీ కోసం పోరాడతా...


మీ కోసం పోరాడతా...
- న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తాం
- ఓబన్న కుటుంబాన్ని పరామర్శించిన జగన్


అనుంపల్లి (పామిడి): ‘అప్పుల బాధ తట్టుకోలేక ఓబన్న ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యగా గుర్తించలేదు. ప్రభుత్వం నుంచి మీకు 5 లక్షల రూపాయల పరిహారం అందాలి. కచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అవసరమైతే మీతో పాటు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వారందరినీ కలిపి కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నా చేద్దాం. నేను వచ్చి ధర్నాలో పాల్గొంటా’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓబన్న కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారిని పరామర్శిస్తూ పంటసాగు, పెట్టుబడి, అప్పులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు.  ఓబన్న భార్య సునీతతో జగన్ జరిపిన సంభాషణ ఇలా...
 
 జగన్: పొలం ఎంత ఉందమ్మా? పట్టాదారు పాసుపుస్తకం పెట్టి రుణాలేమైనా తీసుకున్నారా తల్లీ?
 సునీత: రెండెకరాలు ఉంది సార్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 30 వేల రూపాయలు తీసుకున్నాం. బయట 1.50 లక్షల అప్పులున్నాయి. బంధువుల వద్ద చేతి బదులుగా రూ. 50 వేల రూపాయలు తెచ్చుకున్నాం సార్.
 
 జగన్: ప్రభుత్వ అధికారులు ఏమైనా ఇంటి దగ్గరికి వచ్చారామ్మా?
 సునీత: ఎవ్వరూ రాలేదు సార్. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదు సార్
 జగన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతోంది. ఆదుకోవాలనే ఆలోచన ఉండి మీకు పరిహారం ఇవ్వాలంటే ఇవ్వొచ్చమ్మా. కానీ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఇస్తే మంచిది. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతాం. నేనూ కూడా వస్తా.
 ఇప్పుడు నేను రావడంతో మీకు జరిగిన అన్యాయం రాష్ట్రమంతా తెలుస్తుంది. మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వచ్చా తల్లీ. ఏం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. ఏమన్నా ఉంటే వెంకట్రామిరెడ్డితో పాటు మన పార్టీ జిల్లా నేతలు అంతా అండగా ఉంటారు. పిల్లలను బాగా చదివించుకోవాలమ్మా.. బాగా చదివించుకుంటే అదే మనకు పెద్ద ఆస్తి. ధైర్యంగా ఉండండి.

బాబుపై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్ : ట్విట్టర్ లోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తొలి ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానలపై ఆయన  ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబుదా...పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
Who is responsible for the murders of these farmers? CBN who cheated? His govt which failed? Or a society which didn't question enough?

ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్

Written By news on Wednesday, February 25, 2015 | 2/25/2015


 ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్తో ఆయన డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్లుగా ప్రజలతో మమేకం అవుతూ.. నేరుగా వారితోనే సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్న విపక్షనేత.. ఇప్పుడు నేరుగా సంప్రదించడానికి వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు.

యువతీ యువకులు, ఎన్నారైలు, ఇతరులు ఎవరైనా సరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ అభిప్రాయాలు తెలియజేయడానికి, వివిధ అంశాలపై ఆయన తన మనోభావాలను పంచుకోడానికి వేదికగా ఈ ట్విట్టర్ ఖాతా ఉపయోగపడనుంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యింది.

ఆప్ తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్


'ఆప్ తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కానున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆయన వెల్లడించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా మార్తాడులో మాట్లాడుతూ...  చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదే అంశంపై  అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశామని.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా ఆయనకు అందజేశామని తెలిపారు. కానీ తామిచ్చిన జాబితాను చంద్రబాబు అపహాస్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు వెటకారం చేసిన సంగతిని వైఎస్ జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల వల్లే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాగే మరికొంతమంది జీవచ్ఛావాల్లా బతుకుతున్నారన్నారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటనలు చేశారు.
జాబు రావాలంటే బాబు రావాలన్నారు... జాబు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు... బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామన్నారు... కానీ సీఎం అయ్యాక ఆయన ఏమీ చేయలేదంటూ బాబుపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులపై రూ. 12 వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు.  ఎన్నికల సమయంలో రూ. 87 వేల కోట్లు ఉన్న రైతు రుణాలు... ఇప్పుడు రూ. 99 వేల కోట్లకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు రుణాలు కట్టలేదు... ఫలితంగా వడ్డీ లేని రుణాలు నుంచి 14 శాతం నగదు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 
రూ. 57 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ఉంటే రైతులకు రూ. 13 వేల కోట్లు మాత్రమే అందాయని చెప్పారు. ఎవరైనా మోసం చేస్తే 420 కేసు నమోదు చేస్తారు... ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలని వైఎస్ జగన్ ఈ సందర్బంగా ప్రశ్నించారు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడే నైజం చంద్రబాబుదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రుణమాఫీకి రూ. 4600 కోట్లు మాత్రమే ఇచ్చి సన్మానాలు చేయించుకున్న ఘనత చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులకు క్రాప్ ఇన్స్యూరెన్స్, ఇన్ పూట్ సబ్సిడీ, కొత్త రుణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా ధరలు అమాంతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనివా ప్రాజెక్ట్ తొలిదశ పనులు రూ. 5800 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయితే ఆ పనులు తానే చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

Popular Posts

Topics :