01 March 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జాబ్ మేళాలో వెయ్యిమందికి ఉద్యోగాలు

Written By news on Saturday, March 7, 2015 | 3/07/2015


జాబ్ మేళాలో వెయ్యిమందికి ఉద్యోగాలు
ఒంగోలు : జాబ్ మేళాకు అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులో శనివారం నిర్వహించిన జాబ్ మేళా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మేళాకు సుమారు 4 వేల మంది వరకు హాజరయ్యారని, వాళ్లలో దాదాపు వెయ్యిమందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన తెలిపారు.

అయితే ఈసారికి ఉద్యోగం రానివాళ్లు మాత్రం నిరుత్సాహపడొద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. అలాంటివారి కోసం త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసి, వారికి తగిన శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు.

పవన్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలి: వైఎస్ జగన్


పవన్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలతో నిండి ఉందని శాసనసభా ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.

రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నది అర్థసత్యమో లేక అబద్దమో చెప్పాలన్నారు. రాజధాని భూముల్లో 3 నుంచి 4  పంటలు పండుతున్నాయన్నారు. రాజధాని ప్రాంతంలోని పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదవుతున్నారని చెప్పారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లో  ఫీజులు కట్టడం ఒకరోజు ఆలస్యమైతే  పిల్లల తల్లిదండ్రులకు పాతికసార్లు ఫోన్ చేసి అడుగుతున్నారని వెల్లడించారు. అధర్మం ఎప్పుడూ ఓడిపోతుందన్నారు.

మానవత్వంతో తమ పార్టీ రాజధాని రైతులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలన్నారు. పవన్ మొన్న ఏం చెప్పారు, నిన్న ఏం చెప్పారు. రేపు ఏంచెప్తారో తెలియదని వ్యంగ్యంగా అన్నారు.

రూ. 20 వేల కోట్లకుపైగా నిధులకు సంబంధించిన జీవో 22 గురించి ఎవరూ మాట్లాడడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ అబయెన్స్ లో పెట్టిన వివాదస్పద జీవోను అమలు చేయడం అవినీతి కాదా అని జగన్ ప్రశ్నించారు. పట్టిసీమకు 22 శాతం ఎక్సెస్ టెండర్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడం అవినీతి కాదా అని అడిగారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం నిరాశపరిస్తే... సీఎం చంద్రబాబు తన మంత్రులను కేంద్ర కేబినెట్ లో ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీకి చెందిన వారిని రాష్ట్ర మంత్రివర్గంలో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ సన్నాయి నొక్కులు, డ్రామాలు ఎవర్ని మోసం చేయడానికి సూటిగా ప్రశ్నించారు.

ఆ ఘనత వైఎస్ ఆర్ దే: ఆర్కే


ఆ ఘనత వైఎస్  ఆర్ దే: ఆర్కే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగించే సమయంలో వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)  మీడియా పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.  పోలవరానికి రూ.4వేల కోట్లు కేటాయించిన ఘనత వైఎస్ కే దక్కుతుందని చెప్పారు. 

కాగా,  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం


రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం
రాజమండ్రి/ భీమవరం:  రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో ఉన్న రెండు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు సరిపోతాయని, మూడు పంటలు పండే రైతుల భూములు లాగేసుకోనక్కరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజధాని పేరిట రైతుల పంట పొలాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం చాలా దారుణమన్నారు. ‘బుద్ధున్న వారెవరైనా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం రైతుల నుంచి లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమని జగన్ తెలిపారు. వైఎస్ ఆశయ సాధన కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మిల జ్యేష్ట పుత్రుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన రాజా వివాహం సందర్భంగా.. జగన్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఆయన 10 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రాజమండ్రి ప్రకాష్‌నగర్‌లోని జక్కంపూడి నివాసానికి వచ్చారు. రాజాను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. జక్కంపూడి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం బయలుదేరి వెళ్లారు. అక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, రెడ్డి గ్రూపు సంస్థల యజమాని గొలుగూరి శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యరెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రారెడ్డి, భారతి దంపతులు, గొలుగూరి శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులతో ముచ్చటించారు.
 
వైఎస్ తప్ప ఏ సీఎం పోలవరాన్ని పట్టించుకోలేదు
రాజమండ్రిలో రాజా నివాసం వద్ద, తర్వాత భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత గానీ, అంతకుముందుగానీ ముఖ్యమంత్రులెవరూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పట్టించుకోలేదని జగన్ చెప్పా రు. ముఖ్యమంత్రిగా వైఎస్ మాత్రమే రూ.4 వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు అడ్డు తగిలినా ప్రజలు క్షమించరన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాను స్వయంగా 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజధాని నిర్మాణంపై తమ వైఖరి ఏమిటో చెప్పామని, ఇప్పటికీ అదే మాటై పె నిలబడి ఉన్నామన్నారు.
అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రంలో బోలెడు ప్రజా సమస్యలు ఉన్నాయని, తమ పార్టీ వాటిపై చర్చించి, ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడుతుందని చెప్పారు.

ఎమ్మెల్యే సునీల్ దీక్ష భగ్నం

ఐరాల: పూతలపట్టు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ నిరవధిక నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నంచేశారు. ఐరాల మండలంలో వివిధ వర్గాల పింఛన్ల తొలగింపును నిరసిస్తూ సునీల్‌కుమార్ గురువారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించిన  విషయం విదితమే. రెండో రోజు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా సునీల్ కుమార్‌ను దీక్ష శిబిరం నుంచి అంబులైన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చిత్తూరు ఆస్పత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కుటుంబ సభ్యుల అనుమతితో సునీల్ కుమార్‌కు ఫ్లూయిడ్స్ పెట్టారు.  వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికారి ప్రతినిధి  బాబు రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆస్పత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉదయం దీక్ష శిబిరాన్ని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరె డ్డి భాస్కర్‌రెడ్డి సందర్శించారు. సునీల్ దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ
నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న  పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా?


అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా?
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తోందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ విపక్ష స్థానంలో ఉన్నప్పుడు రూ. 22 వేల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపించగా ఆగిపోయిన జీఓను... అధికారంలోకి రాగానే అమలుకు చేయాలనుకుంటోందన్నారు. దీని వెనుక ఎంత అవినీతి దాగి ఉందని ఆయన ప్రశ్నించారు. ఈపీసీ విధానంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అధిక రేట్లు (ప్రైస్ ఎస్కలేషన్) చెల్లించేలా గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో జీవో నెం 13 జారీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింద ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ నరసింహన్ ఈ జీవో అమలును నిలిపి వేశారన్నారు. గవర్నర్ నిలిపివేసిన జీవోను తిరిగి అమలు చేసేందుకు బాబు ప్రభుత్వం గత నెల 23వ తేదీన కొత్తగా 22 నంబర్ జీఓను జారీ చేసిందన్నారు.
 
 మంత్రి మాటల సీడీ ఇదిగో
 
 గతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఈ జీఓను జారీ చేసినపుడు రూ. 22 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ మంత్రి ఉమామహేశ్వరరావు ఆరోపించారన్నారు. ఇందుకు సంబంధించిన సీడీని మీడియా ముందు ప్రదర్శించారు. ఈ జీవో జారీ వెనుక అవినీతి దాగి ఉందంటూ అప్పటి టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత ముద్దుకృష్ణమనాయుడు కూడా విమర్శించారన్నారు. ఏ ఆర్థిక ప్రయోజనాల్ని ఆశించి టీడీపీ ప్రభుత్వం అప్పడు ఆరోపణలు చేసిన జీవోను తిరిగి అమలు చేసేందుకు పూనుకుందని ప్రశ్నించారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే బాబు సర్కారు దీనిపై కొత్తగా జీవో జారీ చేసిందా? అని ప్రశ్నించారు. రూ. 100 కోట్ల కన్నా ఎక్కువగా చెల్లింపులు జరపాల్సిన  సందర్భంలో తప్పనిసరిగా కేబినెట్‌లో చర్చించాలనే నిర్ణయం ఉందని, అటువంటపుడు ఇంత పెద్ద విషయాన్ని మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన జవాబివ్వాలని ధర్మాన డిమాండ్ చేశారు.
 
 
 మా ఆరోపణలే నిజమవుతున్నాయి!
 
 రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూ ముల్లో 1,000 ఎకరాల్ని రెండు సింగపూర్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని  ఈ సందర్భంగా ధర్మాన ప్రస్తావించారు. పైకి తియ్యటి మాటలు చెబుతున్నా... రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేదే చంద్రబాబు సర్కారు ఉద్దేశమని తమ పార్టీ ఆదినుంచీ చెబుతూనే ఉందన్నారు. అదే నిజమనే విషయం క్రమంగా తేలుతోందన్నారు. రాజధాని నిర్మాణంవల్ల ప్రభుత్వం ఉన్న వారికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లనే రాజధాని కోసం అటవీ భూములను డీనోటిఫై చేస్తామని  కేంద్రం ప్రకటించినా రాష్ర్ట ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చెబుతూ వచ్చారని, అయితే సింగపూర్ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా చెప్పారన్నారు. సింగపూర్ ప్రభుత్వం మాత్రం కాదని, తమ దేశానికి చెందిన రెండు ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందమని చె ప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పాలకుల్లో కొందరికి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, అందువల్లనే సీఆర్‌డీఏ బిల్లులో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించే భూమి ఇతరులకు బదిలీ చేయవచ్చనే నిబంధన పెట్టారన్నారు. రెండు సింగపూర్ కంపెనీలకు కేవలం నామినేషన్ పద్ధతిన ప్రభుత్వం 1,000 ఎకరాల భూమి ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో  అంతర్జాతీయ బిడ్డింగ్ పిలవగలదా ప్రశ్నించారు. రాజదాని భూముల విషయంలో పవన్‌కల్యాణ్ ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వగానే ఆయనకు అవగాహన లేదని కొందరు మంత్రులు మాట్లాడారని, అలాంటి వారిని ఎన్నికల సమయంలో పక్కన పెట్టుకొని ఎలా ప్రచారం చేశారో వాళ్లే జవాబు ఇవ్వాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కలెక్టర్ చీకటి పాలన


కలెక్టర్ చీకటి పాలన
అనారోగ్యం పాలవుతున్న  అధికారులు
మర్యాద కూడా తెలియని అధికారి
ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శలు
 

ఐరాల : మిట్ట మధ్యాహ్నం లేచి... సాయంత్రం కార్యాలయానికి వచ్చి... అర్ధరాత్రి చీకట్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ పాలనసాగిస్తున్నారని  చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని  ఆయన సందర్శించారు. దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ చీకట్లో పాలన చేస్తున్న కలెక్టర్ వ్యవహార శైలివల్ల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలను చెప్పుకునే వీలుపడడం లేద న్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న సిబ్బంది కూడా కలెక్టర్ ప్రవర్తన వల్ల తిండిలేక , నిద్రలేక అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. కొందరు ఉద్యోగులు ఇక భరించలేక వేరే జిల్లాకు బదిలీ చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని చెప్పారు.  జిల్లా స్థాయి అధికారులను సైతం కలెక్టర్ మర్యాద లేకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. మంచి, మర్యాద లేని వ్యక్తి జిల్లా కలెక్టర్  ఎలా అయ్యారో ఆ దేవుడేకే  తెలియాలన్నారు. పచ్చికబయళ్లతో నందనవనంలా ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని శ్మశానవాటిక వాతావరణంలా మార్చిన ఘనత కలెక్టర్‌కే దక్కుతుందన్నారు.

విజయవంతమైన కార్యక్రమాన్ని ఆయన గొప్పగాను, తేడా వస్తే తప్పు అధికారులదంటూ తోసివేసే సంస్కృతి కలిగిన వ్యక్తి సిద్ధార్థ్‌జైన్ అని విద్యార్థులు వాపోతున్నారన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసుకోలేని దీనస్థితిలో జిల్లా యంత్రాంగం ఉందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని తెలుగుతమ్ముళ్లు సైతం బహిరంగంగా విమర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో అస్తవ్యస్తపాలన నడుస్తున్నా కాకిలెక్కలు, కాకమ్మ కబుర్లతో ముఖ్యమంత్రిని సైతం తప్పుదారిపట్టిస్తూ పదవులను కాపాడుకునేందుకు ఐఏఎస్‌లు ప్రయత్నించడం దారుణమన్నారు. కొందరు అధికారుల వల్ల ఐఏఎస్ వ్యవస్థకే మచ్చ ఏర్పడుతోందన్నారు. కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు దీక్షకు దిగుతున్నారంటే పరిస్థితి తీవ్రతకు అర్థంపడుతుందని, త్వరలోనే ప్రజలు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపే దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతున్నామని, ఆయన అయినా జిల్లాను కాపాడుతారా అని ముఖ్యమంత్రి విజ్ఞతకే వదలివేస్తున్నామని తెలిపారు.
 
సెలవుపై వెళ్లిన కలెక్టర్

చిత్తూరు (సెంట్రల్): జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం సెలవుపై వెళ్లారు. శుక్రవారం హోలీ పర్వదినం, ఆదివారం జాతీయ సెలవుదినం కావడంతో పైఅధికారుల అనుమతితో సెలవుపై వెళ్లారు. తిరిగి ఆయన సోమవారం జిల్లాలో విధులకు హాజరుకానున్నారు.  కలెక్టర్ వచ్చేంత వరకు ఇన్‌చార్జ్ కలెక్టర్ జేసీ నారాయణభరత్‌గుప్త వ్యవహరించనున్నారు.

వైఎస్సార్‌సీపీఎల్పీ నేతగా పాయంను ప్రకటించాలి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా పాయం వెంకటేశ్వర్లును వెంటనే ప్రకటించాలని అసెంబ్లీ కార్యద ర్శి రాజా సదారాంకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకు పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. పార్టీ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్, పార్టీనేతలు నాయుడు ప్రకాశ్, బీష్వ రవీందర్ ఈ లేఖను సదారాంకు అందజేశారు. అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన సమావేశంలో దీని అమలుపై చర్యలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపినట్లు శివకుమార్ మీడియాకు చెప్పారు.

ఏపీ ఉభయసభలు సోమవారానికి వాయిదా

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి.  మరోవైపు సభ నిర్వహణ అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)  ఉదయం పది గంటలకు సమావేశం కానుంది.  ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు. సెలవుదినాలు పోను సభ 16 రోజులు జరిగే అవకాశముంది.

పోలవరం కోసం పోరాడిన ఏకైక సీఎం వైఎస్ ఆర్

Written By news on Friday, March 6, 2015 | 3/06/2015


'పోలవరం కోసం పోరాడిన ఏకైక సీఎం వైఎస్ ఆర్'
పోలవరానికి ఎవరు అడ్డుతగిలినా క్షమించం: వైఎస్ జగన్
భీమవరం: 'పోలవరం ప్రాజెక్ట్ కోసం దశాబ్దకాలం పాటు పోరాడిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే వైఎస్ ఆర్ పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 4వేల కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  వైఎస్ జగన్ శుక్రవారం ఉభయగోదారి జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై ఆయన మాట్లాడారు.

పోలవరం కోసం తానే స్వయంగా 100కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశానని ఆయన చెప్పారు. పోలవరానికి ఎవరు అడ్డుతగిలినా క్షమించమన్నారు. దీనిపై గట్టిగా పోరాటం చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అంతకముందు రాజమండ్రిలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కావాలంటే మంగళగిరిలో 2,3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే రాజధాని నిర్మించుకోవచ్చన్నారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవటం అన్యాయమన్నారు.

మంగళగిరి వద్ద ప్రభుత్వ భూమి వాడుకోండి

ఆంధ్రప్రదేశ్ రాజధానికి మంగళగిరి వద్ద ఉన్న రెండు,మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి వాడుకోవచ్చని విపక్ష నేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ని వదలిపెట్టి మూడు పంటలు పండే భూములు బలవంతంగా తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నామని,ప్రజల సమస్యలపై నిలదీస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఉంటే సింగపూర్ కాకపోతే జపాన్..కాకుంటే అమెరికా లాంటిది కూడా కట్టుకోవచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బుద్ది ఉన్న వారు మూడు పంటలు పండే భూమిని లాక్కోవడాన్ని హర్షించరని జగన్ ధ్వజమెత్తారు.రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

జీవో 22ను ఎలా అమల్లోకి తెస్తారు: ధర్మాన

హైదరాబాద్ : అభయన్స్ లో ఉన్న జీవో 22ను తెలుగుదేశం సర్కార్ ఎందుకు అమల్లోకి తెచ్చిందో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు  ప్రశ్నించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్ట్ లలో రూ.22వేల కోట్ల దోపిడీకి బరితెగించారా ధ్వజమెత్తారు. గవర్నర్ నిలుపుదల చేసిన జీవోను మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా అమల్లోకి తెస్తారని ధర్మాన సూటిగా అడిగారు.

ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిందని గగ్గోలు పెట్టిన టీడీపీ...ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తోందని  ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధాని నిర్మాణంలో రెండు ప్రయివేట్ కంపెనీలకు 10వేల ఎకరాల భూమి ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, దీని వెనుక మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ బిడ్డింగ్ లకు ప్రభుత్వం ఎందుకు వెళ్లడం లేదని ధర్మాన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు అవగాహన లేదన్న టీడీపీ నేతలు ఎన్నికల ముందు పొత్తు ఎందుకు పెట్టుకొన్నారో చెప్పాలన్నారు.

జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి


'జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి'
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో మాట్లాడిన మాటలకు... మీడియా సమావేశానికి పొంతన లేదని ఆరోపించారు.
రాజధాని ప్రాంతంలో పర్యటన సందర్భంగా టీడీపీ మంత్రులను తిట్టిన పవన్... హైదరాబాద్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ మీద విమర్శలు చేస్తున్నారని... ఈ విమర్శలు చేయడానికి ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయారని అమర్నాధ్... పవన్ ను సూటిగా ప్రశ్నించారు.
జనసేన పార్టీని ధనసేన అని పేరు మార్చుకుంటే బాగుంటుందని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్నలు వేశారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెరవెనక చంద్రబాబు డైలాగ్స్ రాస్తుంటే తెర ముందు పవన్ డైలాగ్స్ చెబుతున్నారని విమర్శించారు.

జక్కంపూడి రాజాకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు


రాజమండ్రి : మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల కుమారుడు, పార్టీ కార్యదర్శి రాజా వివాహ వేడుకకు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన మధురపూడి విమానాశ్రయం చేరుకున్న అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. జక్కంపూడి నివాసంలో నూతన వరుడు రాజను ఆశీర్వదింది శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయల్దేరి వెళ్లారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నాం.. నిలదీస్తాం: వైఎస్ జగన్


ప్రతిపక్షంలో ఉన్నాం.. నిలదీస్తాం: వైఎస్ జగన్
రాజమండ్రి :  బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నామని...ప్రజల సమస్యలపై నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కావాలంటే మంగళగిరిలో 2,3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే రాజధాని నిర్మించుకోవచ్చన్నారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవటం అన్యాయమన్నారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అన్యాయమని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వ భూమి ఉంటే సింగపూర్ కాకపోతే జపాన్..కాకుంటే అమెరికా లాంటిది కూడా కట్టుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం బుద్ధి ఉన్నవారెవరూ హర్షించరని వైఎస్ జగన్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల జీవితాలతో చెలగాటాలాడుకోవడం సరికాదన్నారు

ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం


మబ్బు వదిలిద్దాం
వీరపునాయునిపల్లె: ‘ఇది మొద్దు ప్రభుత్వం. నిద్ర మత్తు నుంచి ఇంకా లేవలేదు. ప్రజలందరూ సమష్టిగా ఉద్యమంచి ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం’ అని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం సాయంత్రం అఖిలపక్ష నాయకుల కోరిక మేరకు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు రవీంద్రనాథ్‌రెడ్డిని అభినందించి ప్రభుత్వం తీరును ఎండ గట్టారు. రాయలసీమ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
 
 చీమ కుట్టినట్టు కూడా లేదు
 కమలాపురం నియోజకవర్గ ప్రజలకు సాగు-తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో కమలాపురం ఎమ్మెల్యే ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేశారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత కంటే దారుణం లేదు. కనీసం జిల్లా యంత్రాంగం వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇది నియోజకవర్గ ప్రజలను అవమానించడమే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష చేసిన తరువాతే సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు.
 - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి,
 
 వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
 ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. నాడు వైఎస్, మైసూరారెడ్డి చేసిన ఉద్యమాల ఫలితంగానే ‘గాలేరు-నగిరి’కి పునాది పడింది. ప్రజలను మభ్య పెట్టడమే చంద్రబాబు నైజం.
 -చంద్ర మౌళీశ్వర్‌రెడ్డి,
 
 జిల్లా రైతు నాయకుడు
 దీక్ష అభినందనీయం
 ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి దీక్ష చేయడం అభినందనీయం. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదు. ఇది ప్రజా ప్రతినిధులను, ప్రజలను అవమానించడమే. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారు.
 - శివారెడ్డి, ఆప్ జిల్లా నాయకుడు
 
 రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
 సాగు-తాగు నీటి కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టారు. వైఎస్ హయాంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించేది. నేటి టీడీపీ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవడం కాదు కదా కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోక పోవడం దుర్మార్గం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
 -నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు
 
 ప్రభుత్వాన్ని నిలదీస్తాం
 జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కమలాపురం ప్రాంతాభివృధ్ధికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టారు. దీక్ష ఎందకు చేస్తున్నారో తెలుసుకొని హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలి.
 - జయరాములు, ఎమ్మెల్యే, బద్వేలు
 
 టీడీపీ తొత్తుగా జిల్లా యంత్రాంగం
 జిల్లా యంత్రాంగం టీడీపీ తొత్తులుగా పని చేస్తోంది. ఐదు రోజులుగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేస్తున్నా జిల్లా యంత్రాంగం కనీసం సమస్యను తెలుసుకొనే ప్రయత్నం చేయకపోవడం దారుణం. ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండ గట్టి ప్రాజెక్టులకు నిధులు సాధించుకుంటాం.
 -అంజద్ బాషా, ఎమ్మెల్యే కడప.
 
 ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?
 ప్రజల కోసం దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. అయినా జిల్లా యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోక పోవడం సిగ్గు చేటు. ఇలాంటి జిల్లా యంత్రాంగం ప్రజలకు ఏమి న్యాయం చేస్తుంది? ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలంతా పోరాడుతాం.
 -కొరముట్ల శ్రీనివాసులు,
 
 ఎమ్మెల్యే, రైల్వే కోడూరు
 ఉద్యమం తీవ్రతరం చేస్తాం
 తాగు-సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న దీక్ష కేవలం ఆరంభం మాత్రమే. బడ్జెట్ సమావేశాల్లో ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే తిరిగి అఖిల పక్షంతో కలిసి ఉద్యమాలు చేపడుతాం.
 - దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ
 
 ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది
 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, తాగు-సాగు నీటి సమస్య తీర్చాలని అఖిల పక్ష సమావేశంలో తీర్మానించాం. సాగు నీటి కోసం రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం. టీడీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. అయినా సమస్యను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండ గట్టాలి.
 -నారాయణ, సీపీఎం రాష్ట్ర నేత
 
 రాజకీయాలు చేసేది ప్రభుత్వం కాదు:
 ప్రజల సమస్యల గురించి పట్టించుకునేదే నిజమైన ప్రభుత్వం. ప్రాజెక్టులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దీనిని కూడా రాజకీయంగానే చూస్తోంది. ఇప్పటికైనా స్పందించి ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి.
 - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కార్మిక నాయకుడు
 
 రాజీనామాలకైనా సిద్ధమే
 జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసేందుకు రాజీనామాలకైనా సిద్ధమే. ఒక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. కరువు పీడిత ప్రాంతానికి గాలేరు-నగరి అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తి కావాలంటే ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వానికి ప్రాజెక్టులపై చిత్త శుద్ధి లేదు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మెడలు వంచి నిధులు ఇచ్చేంత వరకు పోరాడుతాం.
 
 -రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే,  మైదుకూరు.
 ప్రజలు కూడా ఉద్యమించాలి
   సమస్యల పరిష్కారానికి ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల ప్రాజెక్టులు చివరి దశకు వచ్చాయి. గతంలో ఆయన అధికంగా నిధులు కేటాయించారు. ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేక ఏనాడు ఆయన నిధులు కేటాయించలేదు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. దురదృష్టవశాత్తు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, అఖిల పక్ష నాయకులు చంద్రబాబును కలిసేందుకు గండికోటకు వెళ్తే కనీసం ఆయన మాట్లాడేందుకు కూడా నిరాకరించారు. ఇది జిల్లా ప్రజలను అవమానించడమే. ఇలాంటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జరిగే ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
 
 -వైఎస్ వివేకానంద రెడ్డి, మాజీ మంత్రి
 ప్రాణ త్యాగానికైనా సిద్ధమే: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
 గాలేరు-నగరి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపు కోసం తాను ప్రాణ త్యాగానికైనా, పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేయాలని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆయన అఖిల పక్షం నాయకుల కోరిక మేరకు గురువారం సాయంత్రం దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల సాధనకు, నిధుల మంజూరుకు తాను చేపట్టిన నిరవధిక దీక్ష ఆరంభం మాత్రమేనన్నారు. ప్రాజెక్టుల సాధన కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
 
 ఎన్‌టీ రామారావు మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో 80 శాతం పూర్తి అయిందన్నారు. మిగిలిన పనులు పూర్తి అయ్యేందుకు ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమాత్రం నిధులు కేటాయించలేదన్నారు. నిధులు కేటాయించి ఉంటే నేటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయి నికర జలాలు వచ్చి ఉండేవన్నారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు రూ.1500 కోట్లు కేటాయించాలని దీక్ష చేస్తే ఈ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడం దారుణం అన్నారు. జూలై నాటికి గండికోటకు నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎమ్మెల్యేలంతా కలసి అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కమలాపురం నియోజకవర్గానికి గాలేరు-నగరి ప్రాణాధారమని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నియోజకవర్గంలో 81 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపాలన్నారు. భావి తరాల కోసం పోరాడాలని, లేకపోతే వారు క్షమించరని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఉద్యమంచే అఖిల పక్షానికి ప్రజలు అండగా నిలవాలన్నారు.

ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం


'ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం'
కడప:  ఉద్యమనేతలు, సహచర ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష సభ్యుల సూచన మేరకు దీక్షను విరమిస్తున్నానని, మెట్ట ప్రాంతం ఉన్నతి కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 'గాలేరు-నగరి'కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా ఆయన వీరపునాయుని పల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్ష నేతల సూచనతో గురువారం ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమకు జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ జీవనాధారమని, వాటి కోసం అన్ని పక్షాలతో కలిసి అవిశ్రాంత పోరాటం చేస్తామన్నారు. కాగా ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వ స్పందన లేకపోవడంపై వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు గురువారం జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు  చేపట్టాయి.

నేడు భీమవరం కు వైఎస్ జగన్


నేడు వైఎస్ జగన్ రాక
భీమవరం :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భీమవరం రానున్నారు. రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ సంస్థల యజమాని గొలుగూరి శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యరెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి వివాహం శుక్రవారం భీమవరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడకు రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు కుమారుడు వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా భీమవరం చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు.

వివాహానికి హాజరుకానున్న షర్మిల

శుక్రవారం రాత్రి జరగనున్న లేఖ్యరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి వివాహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల హాజరుకానున్నారు. జువ్వలపాలెం రోడ్డులోని వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దనరెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం.

రాజమండ్రికి జగన్


నేడు జగన్ రాక
జక్కంపూడి రాజా వివాహ వేడుకకు హాజరు
అనంతరం భీమవరం పయనం


రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాజమండ్రి రానున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధురపూడి  విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని, మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల కుమారుడు, పార్టీ కార్యదర్శి రాజా వివాహ వేడుకకు హాజరవుతారు.

జక్కంపూడి ఇంటికి వెళ్లి నూతనవరుడైన రాజాను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేస్తారు. అనంతరం జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయలుదేరి వెళతారు.

‘ఆ విధంగా ముందుకు’ వెళ్తున్న అవినీతి చంద్రిక

Written By news on Thursday, March 5, 2015 | 3/05/2015


‘ఆ విధంగా ముందుకు’ వెళ్తున్న అవినీతి చంద్రిక
కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి రంగం సిద్ధం
వారి నుంచి దండుకోవడానికి ప్రణాళిక
దొడ్డిదారిన జీవో నం 22ను జారీ చేసిన ప్రభుత్వం
గతంలో గవర్నర్ పక్కనబెట్టిన జీవో అది
దీంతో ఖజానాపై అదనపు భారం రూ.20 వేల కోట్లు
22 శాతం అధికానికి పట్టిసీమ కాంట్రాక్టు
కాసుల కోసం కక్కుర్తితోనే ‘పట్టిసీమ’పై పట్టు


 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కొత్త పుంతలు తొక్కుతోంది. బాబు సర్కారు బరితెగించి మరీ అడ్డగోలు దోపిడీకి కొత్త దారులు వేస్తోంది. రాష్ట్ర విభజనతో అనాథలమయ్యామంటూ ఒకవైపు బీద అరుపులు అరుస్తూనే.. మరోవైపు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా ‘అయినవారి’ చేతుల్లో పోస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ దందాను చేపట్టి రైతులను రోడ్డుపాలు చేస్తుంది సరిపోక.. తాజాగా దొడ్డిదారి నిర్ణయాలతో ఖజానాను ఖాళీ చేసి కావాల్సిన వారి కడుపు నింపేం దుకు రంగం సిద్ధం చేస్తోంది. అవినీతి దారుల్లో ఏపీ సర్కారు ‘ఆ విధంగా ముందుకుపోతోంది’.

 జీవో 22.. ఉద్దేశం 420
 నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి అడ్డగోలుగా దోచుకోవడానికి అవకాశం కల్పించే జీవో నంబర్ 22ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. ఈ జీవో వెనుక ఒక నేపథ్యం ఉంది. ఇలాంటి ఉత్తర్వునే(జీవో నంబర్ 13) గతంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జారీ చేశారు. దాన్ని ఆయన మంత్రివర్గ సహచరులే తీవ్రంగా వ్యతిరేకించారు. కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున ముడుపులు దోచుకోవడానికే ఆ జీవో అంటూ విమర్శలు రావడంతో.. ఆ జీవో అమలును గవర్నర్ తాత్కాలికంగా పక్కనబెట్టారు (అబెయన్స్‌లో పెట్టారు).

 ఇప్పుడు ఆ జీవోను మళ్లీ పునరుద్ధరిస్తే ఇబ్బందులు వస్తాయేమోనన్న ఆలోచనతో.. ప్రభుత్వం దొడ్డిదారిన అలాంటి జీవోను మళ్లీ జీవోనెంబర్ 22గా జారీ చేసింది. గవర్నర్ నిర్ణయంతో తెరవెనక్కు వెళ్లిన ఆ జీవోను ఇలా మళ్లీ తెరపైకి తేవడంలో అక్రమ సంపాదనే అసలు ఉద్దేశమని అధికారులే చెబుతున్నారు. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానం స్ఫూర్తికి విరుద్ధంగా.. కార్మికుల వ్యయాన్ని(లేబర్ కాంపోనెంట్) కూడా కాలానుగుణంగా పెంచడానికి వీలు కల్పించి, ఆమేరకు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవడానికి ఈ జీవో ద్వారా అవకాశం కల్పించారు. మిషనరీ, మెటీరియల్‌కు అయ్యే ఖర్చును కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి ఈ జీవో వల్ల కాంట్రాక్టర్‌కు అవకాశం లభించింది. అది కూడా 2013 ఏప్రిల్ 1 నుంచి ఈ జీవో అమలయ్యే విధంగా ఇచ్చారు. ఫలితంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు దాదాపు రెట్టింపవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


 అదనపు భారం 20 వేల కోట్లు
 కేబినెట్ నోట్ ప్రకారమే.. జీవో-22 వల్ల కాంట్రాక్టర్లకు అదనంగా దాదాపు రూ. 7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన పనుల ఒప్పందాలు ఉన్నాయి. అవన్నీ 2006-07 నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరాల వరకు జరిగిన ఒప్పందాలు. అప్పటి నుంచి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగినప్పుడు.. ఆమేరకు ఒప్పందం విలువా పెరుగుతుంది. అంచనా వ్యయం పెరిగిన మేరకు చూస్తే.. ప్రస్తుతం దాదాపు రూ. 20 వేల కోట్ల మేర ఒప్పందాలున్నాయి. లేబర్, మిషనరీ, మెటీరియల్, కంట్రోల్ బ్లాస్టింగ్, డీవాటరింగ్.. పలు కాంపొనెంట్స్‌కు కూడా పెరిగిన ధరల మేరకు చెల్లించాలని జీవో- 22 చెబుతోంది.

 ఫలితంగా ఒప్పందాల విలువ రెట్టింపవుతుందని అంచనా. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఖజానా మీద అదనంగా రూ. 20 వేల కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారిన నేపథ్యంలోనే కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే ఈ జీవో జారీ అయ్యిందని, ఈ జీవోతో ప్రత్యక్ష ప్రయోజనం కాంట్రాక్టర్లకయితే.. పరోక్ష ప్రయోజనం ప్రభుత్వంలోని పెద్దలకే అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

 22 శాతం అధికానికి పట్టిసీమ కాంట్రాక్టు మంజూరు
 పట్టిసీమపై ప్రభుత్వం పట్టు విడవక పోవడానికి కూడా ముఖ్య కారణం కాసుల కక్కుర్తేనని వస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును 22% అధికానికి ఒక కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టకుండా, పట్టిసీమను ప్రధానంగా పట్టించుకోవడంపై అన్ని వర్గాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమైనా..అవినీతే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తినా.. దున్నపోతు మీద వాన’ సామెతను గుర్తు చేస్తూ.. రూ. 1300 కోట్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టును 22 శాతం అధికానికి మెగా కంపెనీకి కట్టబెట్టింది.

 ఈ ‘22 శాతం అధికం’ విలువ రూ. 286 కోట్లు. 22 శాతం అధికానికి టెండర్ వేసి ఎల్-1గా నిలిచినా తప్పకుండా కాంట్రాక్టు మంజూరు చేయాలనే నిబంధనేం లేదు. టెండర్లు రద్దు చేసి మరిన్ని సంస్థలకు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయకుండా, తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పని కట్టబెట్టి కాసులు దండుకోవడానికే మొగ్గుచూపింది. నిధల్లేవంటూ బీద అరుపులు అరిచే చంద్రబాబు.. 22 శాతం అధికానికి మారు మాట్లాడకుండా కాంట్రాక్టు మంజూరు చేయడం అంటే.. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

 నిబంధనలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్
 అధికారం చేపట్టిన వెంటనే.. నిబంధనలకు విరుద్ధంగా పోలవరం కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను చంద్రబాబు చెల్లించారు. కాంట్రాక్టు ఒప్పందానికి విరుద్ధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అడుగుతున్నారని, కాంట్రాక్టర్ విజ్ఞప్తికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టంగా ఫైల్ మీద రాసినా.. రూ. 200 కోట్లు చెల్లించే దిశగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన మేరకు.. మిషనరీని ప్రభుత్వం తాకట్టు పెట్టుకోవాలని సీఎం సూచించారు.

 బ్యాంకుల్లో తీసుకున్న రుణాలతో కొన్న మిషనరీని ఆయా బ్యాంకుల తనఖాలో ఉన్నాయని, వాటిని మళ్లీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం కుదరదని.. ఆ తర్వాత అధికారులు తేల్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు తీసుకున్న తర్వాత.. ఒక్క అడుగు పని కూడా కాంట్రాక్టర్ చేయకపోయినా, ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష


ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష
కడప: తాగు, సాగు నీటి కోసం వైఎస్‌ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఐదో రోజుకు చేరింది. ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని గత అయిదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
 
ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు ఆయనకు సూచించారు. పార్టీ నేతల దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

రవీంద్రనాథ్ రెడ్డికి పడిపోయిన బీపీ, షుగర్

Written By news on Wednesday, March 4, 2015 | 3/04/2015


రవీంద్రనాథ్ రెడ్డికి పడిపోయిన బీపీ, షుగర్
కడప : కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగోరోజు కూడా కొనసాగుతోంది. తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని కోరుతూ ఆయన వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు.

బుధవారం నాడు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రవీంద్రనాథ్ రెడ్డికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్య బృందం తెలిపింది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వారు సూచించారు.

తిరుగులేని శక్తిగా ఎదుగుదాం

హైదరాబాద్: దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డికి రంగారెడ్డి జిల్లా మానసపుత్రిక లాంటిదని, అలాంటి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా బలోపేతం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కె.శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా వైఎస్సార్ పనిచేశారన్నారు. రైతుల క్షేమం కోరి సీఎం పదవి చేపట్టిన మరుక్షణమే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు.

జిల్లాలో దాదాపు 78 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంగారు తెలంగాణ, డబుల్ బెడ్‌రూంలు.. అంటూ కాలం వెల్లదీస్తున్నారని, ముందు రాజీవ్ గృహకల్ప కింద పేదలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తేచాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి కాలనీలకు మంజీరా నీరు సరిగా రావడం లేదని, ఇంట్లో నలుగురుంటే ఇద్దరికే రేషన్ వస్తోందని విమర్శించారు. ఒక ఉన్న పింఛన్లు సైతం తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. అంగన్‌వాడీ, డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోవడం లేదని అన్నారు. మున్ముందు రోజుల్లో హామీల సీఎంగా కేసీఆర్ ఖ్యాతికెక్కుతారని విమర్శించారు. రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవేనని జోష్యం చెప్పారు.
 
జగనన్న ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నారని, వాడవాడలా కమిటీలు వేసుకుని ప్రజా సమస్యలపై పోరాడుదామని అన్నారు. గ్రేటర్‌లో పాదయాత్రకు షర్మిల సిద్ధంగా ఉన్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 25 స్థానాలకు తక్కువ లేకుండా గెలుచుకోవాలని సూచించారు. సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.అమృతసాగర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి ఆదరణ ఉందని, అందరం కలిసికట్టుగా సురేష్ రెడ్డి నాయకత్వంలో పనిచేద్దామని అన్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చారు. మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, శంషాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పార్టీ నాయకులు ఎం.కుమార్ రెడ్డి, సీహెచ్ త్రిపాఠి, ఆర్.సతీష్ రెడ్డి, టి.ఇన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి, టి.ఆరోగ్యరెడ్డి, శ్రీధర్, బి.సంతోష్ కుమార్ నేత, విద్యార్థి నాయకుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 తీర్మానాలివే..
     
జిల్లాలోని రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం  వెంటనే స్పందించాలి.
ప్రభుత్వం కరువు ప్రాంతాల్లోని రైతులకు పెట్టుబడి రాయితీతోపాటు వివిధ దశల్లో ఆర్థిక సాయం చేయాలి.
 రబీ సీజన్‌లో జిల్లాలో 14వేల ఎకరాల్లో వరిపంట ఎదిగే దశలో ఉంది. నీటి అవసరం అధికంగా ఉంది. కూరగాయల పంటలు కూడా దాదాపు 10వేల హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇవన్నీ బోరునీటిపైనే ఆధారపడ్డాయి. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి.
 వేసవి సీజన్ మొదలైంది. గ్రామాల్లో, నగర శివారు ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దటి తీవ్రంగా ఉంటుంది. తక్షణమే నీటి ఎద్దడి తీర్చాలి.
 వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా మారుస్తానన్న కేసీఆర్ ఎన్నికల హామీ నెరవేర్చుకోవాలి.

క్షీణించిన రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం

కడప : కమాలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. ఆయన చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ ఎస్ ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు, నీరు అందించాలనే డిమాండ్ తో రవీంద్రనాథ్ రెడ్డి వీరపునాయునిపల్లెలో ఆదివారం నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో ఉన్న  ఆయనను పలువురు నేతలు పరామర్శించి వెళ్లారు.  ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవెల్స్, రక్త పీడనం మెలమెల్లగా పడిపోతున్నాయని చెప్పారు.

ఎందాకైనా పోరాడతా


ఎందాకైనా పోరాడతా
రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
 బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమే
 చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు.. ఈ సర్కారు కూలిపోవడం ఖాయం
 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు
 వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ భూములున్నాయి.. అక్కడ కట్టుకోవచ్చు కదా!
 సన్న, చిన్నకారు రైతుల పొట్టలు కొట్టడం ఎందుకు?
 మా పార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను వెనక్కు ఇచ్చేస్తాం
 సర్కారుపై ప్రతిపక్ష నేత నిప్పులు.. రాజధాని గ్రామాల్లో విస్తృత పర్యటన
 
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమేనని స్పష్టంచేశారు. ‘‘ముఖ్యమంత్రి రకరకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. రాజధాని పేరుతో రైతుల ఇష్టానికి భిన్నంగా సాగు భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ విధానాన్ని గట్టిగా నిలదీస్తాం. ఈ అన్యాయంపై అందరం కలిసికట్టుగా ఎందాకైనా పోరాటం చేద్దాం. బలవంతంగా భూములు తీసుకోవడం సాధ్యం కాదు. న్యాయస్థానాలున్నాయి. ఏం భయపడొద్దు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయంపై రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని విజ్ఞులంతా ఆలోచించాలి’’ అని కోరారు. మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
 
 పలుచోట్ల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఆవేదనాభరితంగా చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామంటూ రైతులకు భరోసా కల్పించారు. బహుళ పంటలు పండించే భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ప్రాంత రైతులకు అండగా నిలుస్తామని, పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ‘‘రైతుల ఇష్టం లేకుండా భూములను తీసుకోవడం అన్యాయం. దీన్ని మొదట్నుంచీ మేం ఒప్పుకోవడం లేదు. ముఖ్యమంత్రి మోసాలు ఇంకా తగ్గలేదు. ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అది రెండేళ్లకో, మూడేళ్లకో చెప్పలేను కానీ ఇన్ని దాష్టీకాలు సాగిస్తున్న ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుంది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇప్పుడు బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం’’ అని జగన్ అన్నారు. ‘‘మనసున్న వాడెవడూ భూములు తీసుకోవడానికి ఒప్పుకోడు. చంద్రబాబుకు నిజంగా మానవత్వం లేదు. ఇటువంటి పనిని ఏకంగా ఒక ముఖ్యమంత్రే చేస్తే ఆ మనిషిని ఏమనాలి. రాజధానిని ఇక్కడే కట్టాలి. వాస్తు బాగుంటుందని, రివర్ ఫ్రంట్ రాజధాని కావాలనే దిక్కు మాలిన ఆలోచనతో మూడు, నాలుగు పంటలు పండించే రైతుల పొట్ట గొట్టడం అన్యాయం. రైతు కూలీ కుటుంబంలో భర్త రోజుకు 500, భార్య రూ 300 చొప్పున నెలకు రూ.24 వేలు సంపాదిస్తున్నారు. వీరికి నెలకు 1,500, రెండు వేలు ముష్టి వేస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. నిర్దాక్షిణ్యంగా వారి కడుపు కొడుతున్నారు. చంద్రబాబు పుణ్యమా అని రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ కాలేదు. ఇవన్నీ జరక్క పోగా ఇప్పుడు భూములు కూడా లాక్కుంటున్నారు’’ అనిదుయ్యబట్టారు.
 
 సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
 
 రైతుల భూమితో ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా అని జగన్ నిలదీశారు. ‘‘ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ఇంతకుముందు వైఎస్సార్‌సీపీ నాలుగుసార్లు ఇక్కడ పర్యటించింది. 42 మంది ఎమ్మెల్యేలు ధర్నా, పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే ఆర్‌కే నిరాహారదీక్ష కూడా చేశారు. చంద్రబాబును ఇంకా గట్టిగా నిలదీస్తాం. ఇక్కడ ఆయనకు ఒకటి అర్థం కావాలి. రాజధాని కోసమని 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో సగం రోడ్లు, ఇతర అవసరాలకు పోతాయి. 12 వేల ఎకరాలు మాత్రమే రైతులకు చిల్లర వేసినట్లు పడేస్తామంటున్నారు. మిగిలిన 13 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా..? ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది. రాజధానికి నీక్కావాల్సిన వెయ్యో, రెండు వేల ఎకరాలో తీసుకో. మిగిలిన దాన్ని జోనింగ్ చేసి రోడ్లు వేసి వదిలేయ్. ఆ భూముల్లో రైతులు  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో, ఏమి చేసుకుంటారో వారిష్టం. రైతులకు స్వాతంత్య్రం ఇవ్వు. మీరెందుకు రైతుల భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి? ఇంతమంది రైతుల కడుపుకొట్టి బలవంతంగా భూములు తీసుకుంటారా? ఇదే జిల్లా వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ ఫారెస్ట్ భూములున్నాయి. సింగపూర్, జపాన్ లాంటి రాజధానులు కడతానని చెబుతున్న చంద్రబాబు ఇంకా అవసరమైతే ఆ భూముల్లో అమెరికా లాంటి రాజధాని కట్టుకోవచ్చు. ఎవరూ ఏమీ అడగరు. కానీ ఇక్కడే రాజధాని కట్టుకోవాలనుకోవడం సరికాదు. ఇక్కడ మీరు తీసుకోవాలనుకుంటున్న 50 వేల ఎకరాల్లో 20 వేల మంది రైతులున్నారు. అందులో 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 10 వేల మంది ఉన్నారు. 3 ఎకరాల లోపు రైతులు 10 వేల మంది ఉన్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే. వాళ్ల భూములు లాక్కోవడం అన్యాయం కాదా’’ అని జగన్ ప్రశ్నించారు.
 
 ఉన్న జాబులు ఊడగొడుతున్నాడు..
 
 బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. గద్దెనెక్కాక ఉన్న జాబులను ఊడగొడుతున్నారని జగన్ మండిపడ్డారు. ‘‘ఇక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి. ఉండవల్లి గ్రామంలోని భూముల్లో సంవత్సరానికి నాలుగు పంటలు పండుతాయి. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే రెండు వేల ఎకరాలున్నాయి. ఎకరానికి 4 లక్షల చొప్పున ఈ గ్రామం నుంచే సుమారు రూ.80 కోట్లు జమ అవుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో చెప్పారు. కానీ మూడు పంటలు పండే మంచి భూములను లాక్కుని వారి జాబులు ఊడగొడుతున్నారు. ఎకరం మీద రైతులు నాలుగు లక్షలు సంపాదించుకునే  పరిస్థితిలో వారి భూములు లాగేసుకుంటే తర్వాత వాళ్లంతా ఎక్కడికి వెళ్తారు? మీ నుంచి భూములు బలవంతంగా తీసుకోలేరు. మీ వెంట మేముంటాం. ఎన్నికలకు ముందు మోసాలు, అబద్ధాలతో సీఎం కుర్చీ ఎక్కాడు చంద్రబాబు. ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కుంటూ వీధి గూండాలా తయారయ్యాడు. ఒకవైపు డబ్బుల్లేవంటూనే మరోవైపు సింగపూర్‌లా చేస్తానంటున్నాడు. కేంద్రం కూడా నిరాశపరిచింది. కేంద్ర బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదు. బాబును నేనొక్కటే  అడుగుతున్నా... సీఎంగా పరిపాలన చేస్తాడా? రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిపాలన సాగిస్తాడా? నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. చంద్రబాబు మెడలు వంచైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. మీరెవ్వరూ అధైర్యపడొద్దు’’ అని రైతులకు జగన్ ధైర్యం చెప్పారు.
 
 
 బినామీల భూముల ధరలు పెంచేందుకే..
 
 ‘‘చంద్రబాబు.. సుజనా చౌదరి వంటి బినామీల చేత భూములు కొనిపించారు. బాబు రాజధాని లైన్ ఎక్కడ గీస్తే దానికి ఆనుకుని సుజనా చౌదరి భూములు కొన్నారు. తన దగ్గర డబ్బులు ఉన్నాయనీ, భూములు కొంటే తప్పేంటని సుజనా చౌదరి నిస్సిగ్గుగా చెబుతున్నారు. సీఎం తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బినామీలకు మేలు చేయడం కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం ఎంత వరకు న్యాయం. చంద్రబాబు.. ఆయన బినామీల భూములకు ధరలు పెంచుకునేందుకే ఇక్కడ రాజధాని కడుతున్నారు. అందుకే రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు. చంద్రబాబు ఒత్తిడికో, భయానికో భూములిచ్చిన వారెవరైనా ముందుకు రావొచ్చు. తమ నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ముందుకొస్తే వారి తరపున మేం కోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం చేస్తాం. మీ ఎమ్మెల్యే ఆర్కే ఇక్కడే ఉంటారు. ఆయనను కలిసి మీ ఇబ్బంది చెప్పవచ్చు. ఆర్కే మీ తరఫున కోర్టుల్లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తారు’’ అని జగన్ చెప్పారు. ‘‘ఈ గ్రామాల్లో రైతుల రుణాలు మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి వచ్చిందా అని అడిగితే బంగారం కాదు వేలం నోటీసులు ఇంటి కొచ్చాయని మహిళలు చెబుతున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు. పర్యటనలో జగన్ వెంట ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కొడాలి నాని, కోన రఘుపతి, జ్యోతుల నెహ్రూ, మేకా వెంకట ప్రతాప అప్పారావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రక్షణనిధి, జలీల్ ఖాన్, షేక్ ముస్తఫా, ఉప్పులేటి కల్పన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు,  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, ఎంవీఎస్ నాగి రెడ్డి, మేరుగ నాగార్జున, బాలశౌరి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, తలశిల రఘురాం, పుత్తా ప్రతాపరెడ్డి, ఈవీ మహేశ్వరరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన photos


Popular Posts

Topics :