22 March 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్ ను కలిసిన కోలగట్ల

Written By news on Saturday, March 28, 2015 | 3/28/2015


వైఎస్ జగన్ ను కలిసిన కోలగట్ల
విజయనగరం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ  కోలగట్ల. వీరభద్రస్వామి తన చిన్న కుమార్తె శ్రావణితో  పాటు శుక్రవారం కలిశారు. వచ్చే నెల 22వ తేదీన తమ పెద్ద కుమార్తె సంధ్య వివాహానికి హాజరు కావాలని కోటగట్ల ఆహ్వానిస్తూ జగన్‌ మోహన్ రెడ్డికి శుభలేఖను అందజేశారు.
గత బుధవారం జరిగిన  సంధ్య నిశ్చితార్థ వేడుకుల గురించి, వివాహానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌ మోహన్‌ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ ముఖ్యనాయకులు, ప్రముఖులకు ఆహ్వానం అందించినట్లు కోలగట్ల చెప్పారు.  ఇందుకు స్పందించిన వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చే 22వ తేదీన విజయనగరంలో జరిగే సంధ్య వివాహ వేడుకలకు హాజరవుతానని  చెప్పినట్లు కోలగట్ల తెలియజేశారు.

తప్పుడు లెక్కలే


బాబువన్నీ తప్పుడు లెక్కలే
హైదరాబాద్: కేంద్రం నుంచి అధిక నిధులను రాబట్టడానికి బడ్జెట్‌లో మాయ చేసి లేనిది ఉన్నట్లుగా చూపించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలు కూడా అధికారపక్షం ఇంత గొప్పగా చెబుతుందనుకోలేదని మండిపడ్డారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ గురించి ప్రభుత్వం చెబుతున్న విషయాలకు, వాస్తవాలకు పొంతనే లేదని గణాంకాలతో సహా వివరించారు. ‘‘2011-12లో వ్యవసాయ రుణాలుగా రూ. 31,877 కోట్లను రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే రూ. 35,611 కోట్లు ఇచ్చామనీ, 2012-13లో రూ. 35,854 కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ. 50,060 కోట్లు ఇచ్చామని.. 2013-14లో  వ్యవసాయ రుణాలుగా రూ. 47,017 కోట్లను ఇవ్వాలనుకుంటే రూ. 49,774 కోట్లను పంపిణీ చేశామని చంద్రబాబుకు బ్యాంకర్లు వివరించారు. కానీ.. 2014-15 పరిస్థితి చూస్తే రూ. 56,019 కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 30 సెప్టెంబర్ 2014 నాటికి కేవలం రూ. 13,789 కోట్లను మాత్రమే పంపిణీ చేశామని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు సీఎంకు చెప్పారు’’ అని గుర్తుచేశారు.


‘‘సీఎం అధ్యక్షతన జరిగిన 188వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో.. 31 మార్చి 2012 నాటికి రూ. 65,217 కోట్లు, 31 మార్చి 2013 నాటికి రూ. 78,916 కోట్లు, 31 మార్చి 2014 నాటికి రూ. 87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు 30 సెప్టెంబరు 2014 నాటికి తడిసిమోపెడై రూ. 99,555 కోట్లకు చేరుకున్నాయి అని బ్యాంకర్లు చెప్పారు’’ అని జగన్ వెల్లడించారు. రుణమాఫీకి గత ఏడాది రూ. 4,600 కోట్లు కేటాయించగా... అవి కనీసం వడ్డీలకూ సరిపోవని జగన్ విమర్శించారు. ఈ ఏడాది రూ. 4,700 కోట్లు కేటాయించామని చెబుతున్నా చంద్రబాబు మాటలను బట్టిచూస్తే రూ. 2,100 కేటాయించారని అర్థమవుతోందని, ఇవి కూడా వడ్డీకి సరిపోవన్నారు.


బంగారం వేలం నోటీసులే..
ఏ పత్రిక జిల్లా ఎడిషన్ చూసినా బంగారం వేలం వేస్తున్నట్లు బ్యాంకులు ఇచ్చిన ప్రకటనలే ఎక్కువగా కనపడుతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని.. ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతిగా నెలకు రూ. రెండు వేలు చొప్పున పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనకు పూర్తిగా అవగాహన ఉండే ఆ హామీలను ఇచ్చానని 11 ఏప్రిల్, 2014న ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. ప్రతి మీటింగ్‌లోనూ ఇదే హామీలు ఇచ్చారు.


టీవీ ఆన్ చేస్తే చాలు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి.. జాబు రావాలంటే బాబు రావాలి.. అనే ప్రకటనలు వచ్చేవి. ఏ గోడ మీద చూసినా ఇదే రకమైన రాతలు కన్పించేవి. అంతే కాదు.. ‘దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి. అందుకే వ్యవసాయ రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తాను. కుటుంబం సంతోషంగా ఉండాలంటే అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. అందుకే డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తాను. జాబు కలలను సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కింది నెలకు రూ. రెండు వేలు ఇస్తాం’ అని రాసి, చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అందించారు. ఆ మాటలను ప్రజలు నమ్మి చంద్రబాబును సీఎంను చేశారు. అధికారం వచ్చాక.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. చంద్రబాబు అఫిషియల్ గెజిట్ ఈనాడు పేపరుకు ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. దాంట్లో.. 1. వ్యవసాయ రుణాల రద్దు 2. డ్వాక్రా రుణాల రద్దు 3. ఇంటికో ఉద్యోగం అనే హామీలకు ప్రముఖ స్థానం కల్పించారు. కానీ ఇప్పుడు.. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని అధికారపక్షం గమనించాలి. ఇదీ.. మీరు (టీడీపీ) రైతులకు చేసింది’’ అని విపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.


ఢిల్లీలో పరువు పోదా?
ఢిల్లీలో కూడా బాగా చదువుకున్నవారు, తెలివైనవారు ఉంటారని, బడ్జెట్‌లో చేసిన మాయను గుర్తిస్తే రాష్ట్రం పరువు పోతుందని హెచ్చరించారు. నాయకులుగా ఉన్న వారు ప్రజలకు మోసం, వంచన, వెన్నుపోటు నేర్పకూడదని హితవు పలికారు. ప్రణాళికేతర వ్యయం విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. 11 నెలల 27 రోజులకు సంబంధించిన మొత్తం వ్యయం వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దాని ప్రకారం 2014-15లో మొత్తం బడ్జెట్ రూ. 85 వేల కోట్లకు మించే అవకాశం లేదన్నారు. కానీ రివైజ్డ్ బడ్జెట్‌లో రూ. 1.12 లక్షల కోట్లుగా చూపించడంలో అంతరార్థమేంటని ప్రశ్నించారు. కేవలం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసమే 2014-15లో ప్రణాళికేతర వ్యయాన్ని ఎక్కువ చేసి చూపారని, ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టే 2015-16లో దీన్ని రూ. 11 వేల కోట్ల మేర తగ్గించారన్నారు. న్యాయంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల్ని రాబట్టడానికి కలిసొస్తామని తాము చెబుతున్నామని, పోరాడి హక్కులను సాధించుకుందామని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.


ఆగిపోయిన 5.6 లక్షల ఇళ్లు
బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన శాంపిల్ సర్వే చేశామని, అందులో 4 శాతం అనర్హులున్నారని గుర్తించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలో సభలో చెప్పిన విషయాన్ని విపక్ష నేత గుర్తు చేస్తూ.. ఇప్పుడేమో మాటమార్చి జియోట్యాగింగ్ చేసిన తర్వాత 41 శాతం ఇళ్లు కనిపించడం లేదంటున్నారని విమర్శించారు. ఇంతగా అబద్ధాలు చెబితే ఎలా? అని ప్రశ్నించారు. మొత్తం ఇళ్లే లేవని చెప్పేస్తే పోలా? అని ఎద్దేవా చేశారు.


2014 ఆగస్టు 12న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు (ఈవో నోట్) ప్రకారం.. మంజూరైనా ఇంకా ప్రారంభం కాని 7.9 లక్షల ఇళ్లను రద్దు చేస్తున్నామని, 5.6 లక్షల ఇళ్లకు చెల్లింపులు చేయవద్దని అందులో ఆదేశించారని చెప్పారు. ఒక్కో ఇంటికి రూ. 50 వేలు ఇవ్వాల్సి వచ్చినా, 5.6 లక్షల ఇళ్లకు కనీసం రూ. 2,800 కోట్లు కావాలని, కానీ బడ్జెట్‌లో దానికి కేటాయించింది కేవలం రూ. 656 కోట్లేనన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 520 కోట్లు కేటాయించి, ఒక్క ఇంటినీ నిర్మించని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాది కేటాయింపులు నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఒక విడత బిల్లులు చెల్లించడానికీ సరిపోవన్నారు.
 

పెన్షన్ల సంఖ్యను వైఎస్ పెంచారు
సామాజిక పెన్షన్ల కోసం కేంద్రం రూ. 400 ఇస్తే, వైఎస్ రూ. 200 ఇచ్చారని ఆర్థిక మంత్రి చేస్తున్న విమర్శలకు ప్రతిపక్ష నేత స్పందించారు. రోజుకు రూ. 27 పైబడిన సంపాదన ఉన్న కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు కాదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను దివంగత నేత రాజశేఖరరెడ్డి సవరించారని, వార్షిక ఆదాయం రూ. 60 వేలు ఉన్న వారిని కూడా పేదలుగానే గుర్తించి పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని అధికారపక్షం ఉద్దేశపూర్వకంగా మరిచిపోతోందని జగన్ విమర్శించారు. మార్గదర్శకాలను మార్చి పెన్షన్ల సంఖ్యను 17 లక్షల నుంచి 78 లక్షలకు వైఎస్ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రంలో 43,13,292 పెన్షన్‌దారులు ఉన్నారు. పెన్షన్ల కోసం జన్మభూమిలో 4,10,278 దరఖాస్తులు వచ్చాయి.


అందులో 3,85,892 పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సీఎం కోర్ డాష్ బోర్డు చెబుతోంది. వీటన్నింటినీ కలుపుకుంటే.. రాష్ట్రంలో 47 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలి. మార్చి నెలలో 37,85,376 మందికి రూ. 402 కోట్లను పెన్షన్‌గా మంజూరు చేశారు. అంటే.. పది లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. పోనీ.. ఆ 37 లక్షల మందికైనా పంపిణీ చేయడానికి బడ్జెట్‌లో సక్రమంగా నిధులు కేటాయించారా అంటే అదీ లేదు. నెలకు రూ. 402 కోట్ల లెక్కన 12 నెలలకు రూ. 4,800 కోట్లు పైబడి అవసరం. కానీ.. బడ్జెట్‌లో కేవలం రూ. 3,741 కోట్లే కేటాయించారు. అంటే.. పెన్షన్లకు అవసరమైన మొత్తంలో కూడా రూ. 1,100 కోట్లు కోతపెట్టారు’’ అని ప్రభుత్వంపై విపక్ష నేత విమర్శలు గుప్పించారు.
 

డ్వాక్రాల విషయంలో గతం పునరావృతం
డ్వాక్రా సంఘాలకు ఆధ్యులమని టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకోవడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. ‘‘గతంలో చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలకు 14-18 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే వారు. అప్పుడు 1,26,717 డ్వాక్రా సంఘాలు ఉండగా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. వైఎస్ హయాంలో 2,86,780 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గత పాలన పునరావృతమవుతోంది. డ్వాక్రా అక్కచెల్ల్లెమ్మలు 14-18 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది’’ అని వివరించారు. ‘‘మార్చి 31, 2014 నాటికి డ్వాక్రా మహిళలు రూ. 14,204 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు.


డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి అక్కచెల్లెమ్మలు మోసపోయారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాల్లో రూ. 3,542 కోట్లు నిరర్థక ఆస్తులు (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్స్)గా మిగిలిపోయాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2014-15లో డ్వాక్రా మహిళలకు రూ. 13,791 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని 184 ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు చంద్రబాబుకు వివరించారు.


కానీ, 30 సెప్టెంబర్ 2014 నాటికి డ్వాక్రా మహిళలకు రూ. 2,028 కోట్లను మాత్రమే రుణాలుగా పంపిణీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో తెలుస్తోంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. దాని కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా కనిపించ లేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం.. ఈ ఏడాది రుణంగా పంపిణీ చేసిన రూ. రెండు వేల కోట్లకు ఏడు శాతం వడ్డీపై రూ. 140 కోట్లు, రూ. 12 వేల కోట్ల పాత రుణాలపై 14 శాతం వడ్డీ లెక్క వేస్తే రూ. 1,680 కోట్లు కలిపి కనీసం రూ. 1,820 కోట్లను కేటాయించాలి. కానీ.. వడ్డీ లేని రుణాల కోసం బడ్జెట్‌లో కేటాయించింది సున్నా’’ అని జగన్ దుయ్యబట్టారు.

లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారులో ...

Written By news on Friday, March 27, 2015 | 3/27/2015


రాష్ట్ర పరువు బజారులో పడేస్తున్నారు
హైదరాబాద్ : లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారులో పడేస్తున్నారని అసెంబ్లీలో విపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ పలు విషయాల్లో ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ఇది కంప్యూటర్ యుగమని, అందరికీ అన్ని విషయాలూ తెలిసిపోతున్నాయని ఆయన అన్నారు. అందువల్ల ఇప్పుడు ఏమైనా చేయచ్చు, మోసం చేయచ్చు, అబద్ధాలు చెప్పచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అనుకుంటే కుదరదని ఆయన అన్నారు. సీఎం కార్యాలయంలో ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలుస్తోందని వైఎస్ జగన్ చెప్పారు.

గతంలో రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు తక్కువ వడ్డీ ఉండటంతో సంతోషంగా ఉండేవారని, ఇంతలో మన ఖర్మ కొద్దీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో డ్వాక్రా గ్రూపుల అక్కా చెల్లెమ్మలు 18 శాతం వడ్డీ కట్టుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఇక గృహనిర్మాణం విషయానికి వస్తే.. 5.60 లక్షల ఇళ్లు సగంలో ఆగిపోయి ఉన్నాయని, ఇవి వేర్వేరు దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటికి బిల్లులు ఆపేయాలని ఒక జీవో విడుదలైందని అన్నారు. వీటి గురించి ఒక్కసారి ఆలోచించి, ఒక్కో ఇంటికి రూ. 50 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ కేవలం 650 కోట్లే కేటాయించారని, అంటే ఒక్క కొత్త ఇల్లు కూడా రాదేమో అని చెప్పినట్లు కాదా అని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

''మంత్రిగారు పింఛన్ల గురించి మాట్లాడారు. రోజుకు 27 రూపాయలు మించి ఆదాయం ఉన్నవాళ్లు పేదలు కారని కేంద్రం చెబుతోంది. కానీ ఏడాదికి 60వేలు వచ్చినా వాళ్లు పేదలేనని దివంగత నేత వైఎస్ చెప్పారు. కేంద్రం చాలీచాలని విధంగా 10 శాతం మందికి కూడా సరిపోని విధంగా ఇచ్చారు. అప్పటివరకు 15 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే, వైఎస్ హయాంలో అవి 38 లక్షలకు వెళ్లాయి. పుష్కరాల గురించి మాట్లాడుతూ రూ. 1400 కోట్లు బడ్జెట్ లో కేటాయించామని చెప్పారు. కానీ రూ. 200 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబుగారు సభలో చెప్పారు. ఈ లెక్కల్లో తేడాలేంటో మాకు అర్థం కావట్లేదు.''

చందాల సొమ్ముతో సోకులా!


చందాల సొమ్ముతో సోకులా!
చంద్రబాబు దుబారాపై  సర్వత్రా విమర్శలు
ఏపీ రాజధాని కోసం విరాళాలకు సర్కారు పిలుపు
ఇష్టానుసారం ఖర్చు చేయడంపై సర్వత్రా విస్మయం

 
హైదరాబాద్:  ఒకపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ ప్రతి కార్యక్రమానికీ విరాళాలు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మరోపక్క చేస్తున్న దుబారా వ్యయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయాల ముస్తాబుకు, కన్సల్టెన్సీలకు, ప్రత్యేక విమానాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది. విరాళాలు అడుగుతున్నందున ఆ నిధుల వ్యయంపై జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా రాజధాని కోసం ప్రతి నెలా ఒకరోజు వేతనం ఇవ్వాలని, ఉగాది సందర్భంగా గత శనివారం చంద్రబాబు పిలుపునివ్వడంపై ఉద్యోగవర్గాల్లో ఆందోళన నెలకొంది. ఒక చేత్తో పీఆర్సీ ఇచ్చినట్టే ఇచ్చి.. మరోచేత్తో రాజధాని చందాల పేరుతో పెరిగే వేతనాన్ని లాగేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని ఉద్యోగులు అంటున్నారు.

ప్రతినెలా ఒకరోజు వేతనానికి సంబంధించి ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతామని కూడా సీఎం ప్రకటించడంతో.. ప్రతి నెలా ఒకరోజు వేతనాన్ని అధికారికంగానే లాగేసుకుంటారేమోనని వారు భయపడుతున్నారు. ఒకపక్క విరాళాలు కోరుతూ మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం, ప్రత్యేక విమానాల కోసం వృథాగా చేస్తున్న వ్యయంపై ఉన్నతస్థాయి వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్ వార్డు లు, స్మార్ట్ గ్రామాలకు విరాళాలివ్వాలంటూ.. వాటి ప్రచారం కోసం జిల్లాకు కోటి చొప్పున రూ.13 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను భారీ ఖర్చుకు సిద్ధమై విదేశీ కన్సల్టెంట్లకు అప్పగించడంపై కూడా ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో అభ్యం తరాలున్నాయి. ప్రజల నుంచి విరాళాల రూపంలోనైనా, లేదా పన్నుల రూపంలోనైనా వచ్చే ప్రతి పైసాను ప్రజలకు ఆస్తుల కల్పనకు, వారికి మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలి కానీ.. ఈ విధంగా దుబారా చేయడం ఏమిటని అధికార యంత్రాంగమే ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12,921 గ్రామాల్లో 1,384 గ్రామాలను, 3,463 మున్సిపల్ వార్డుల్లో 279 వార్డులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. స్మార్ట్ వార్డులు, గ్రామాలకు విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను రాయితీ ఇప్పించేందుకు సైతం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను మాత్రం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని అధికారులు విమర్శిస్తున్నారు.  ఎమ్మెల్యే లకు బడ్జెట్ సమావేశాల కానుక కింద అత్యాదునిక ఐ ఫోనులు ఇవ్వడానికి కోటిన్నర రూపాయలను వ్యయం చేస్తున్నారు. అసెంబ్లీకి కేటాయించిన నిధుల్లో మిగుళ్ల నుంచి ఐ ఫోన్లను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి పేర్కొనడం గమనార్హం.
 
 

విరాళాల  వసూలు ఇలా..

 
రాజధానితో పాటు గ్రామాలు, వార్డులు బాగు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు కోరుతోంది. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరివిగా విరాళాలు ఇవ్వాలని సర్కారు పిలుపునిచ్చింది.ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమానికి కూడా ప్రభుత్వం విరాళాలు వసూలు చేస్తోంది. తాజాగా రాజధాని కోసం ఉద్యోగులు ప్రతి నెలా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

ఇలా దుబారా..

 
సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేశారు.రాష్ట్రంలో జిల్లాల పర్యటనలకు, ఢిల్లీ, సింగపూర్ పర్యటనలకు రెగ్యులర్ విమానాలున్నా.. ప్రత్యేక విమానాల్లో కేవలం 63 సార్లు చేసిన ప్రయాణాలకే ఏకంగా రూ.15 కోట్లు వెచ్చించారు.స్మార్ట్ వార్డులు, గ్రామాల ప్రచారం కోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేశారు.ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకోసం నియమించిన కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్‌లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది.ముందస్తు బడ్జెట్ సమావేశాలంటూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించడం ద్వారా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు.

{పజా ప్రతినిధులు, అధికారులకు యోగా పేరుతో ప్రైవేట్ హోటల్‌లో మూడు రోజుల ఏర్పాట్లకు కోటిన్నర రూపాయలు వ్యయం చేశారు.   విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెజర్స్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ అందుకు గాను రూ.12.62 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విచిత్రంగా ఈ సంస్థకు రూ.1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు.    నీరు-చెట్టు కార్యక్రమం ప్రచారం కోసం ఏకంగా రూ.5 కోట్లు కేటాయించారు.

రైతులను అక్రమంగా వేధిస్తున్నారు..

హైదరాబాద్ : రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు అంశాలపై అధికార పక్షాన్ని శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు.  అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల సమస్యలతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు.

రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...

Written By news on Thursday, March 26, 2015 | 3/26/2015


రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
హైదరాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్ లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఆమె  గురువారం అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ పెంపు గురించి మాట్లాడారు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రప్రభుత్వం వ్యాట్‌ విధించడం సామాన్యులపై పెనుభారం పడుతోందన్నారు.  దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా వ్యాట్‌ విధిస్తున్నారని అన్నారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్నిను అఖిలప్రియ సభలో ప్రస్తావించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని...ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని... ఆ సందపను సంపన్నులకు పెడుతోందని అన్నారు.
 
సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే...మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్ పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులతో పాటు    ప్రత్యేకహోదా కోసం  అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా ...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి  సాధించుకుందామని అఖిలప్రియ కోరారు

నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే....


నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే....
హైదరాబాద్ : రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు, డ్వాక్రా  మహిళల సమస్యలపై కచ్చితంగా చర్చించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు.  చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలేనని అన్నారు.
 
రైతులు ఎట్లా పోయినా ప్రభుత్వానికి ఫరవాలేదనట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు.  రుణమాఫీపై చర్చ అయిపోయింది... సీఎం స్టేట్ మెంట్ ఇచ్చేసారు అని చెబుతున్నారని, ప్రతిపక్షం సభలో లేకుండానే ...మీకు మీరే మాట్లాడుకుని, మీకు మీరు అనుకుని చర్చ అయిపోయిందనటం సరైన పద్ధతేనా అని అడిగారు. అయిదు కోట్ల మంది అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలపై చిత్తశుద్ధి ఉంటే చర్చకు అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు.

ప్రజా సమస్యలు మాట్లాడటానికే అసెంబ్లీ ఉందని, డ్వాక్రా, రైతు రుణమాఫీ కంటే పెద్ద సబ్జెక్ట్ ఏముందని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కేటాయింపులు వడ్డీలకే సరిపోవటం లేదన్నారు. ఓవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వక, మరోవైపు అప్పులు పుట్టక రైతులు అల్లాడుతున్నారన్నారు.  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు.

డ్వాక్రా, రైతు రుణమాఫీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  గురువారం డ్వాక్రా, రైతు రుణమాఫీపై వాయిదా తీర్మానం ఇచ్చింది.  కాగా ఏపీ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) నేడు జరగనుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్ లో ఈ సమావేశం జరుగుతుంది. స్పీకర్ పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఇందులో నిర్ణయిస్తారు.

బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్

Written By news on Wednesday, March 25, 2015 | 3/25/2015


బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్
హైదరాబాద్: సభను మంత్రులు పక్కదోవ పట్టిస్తున్నారని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం రూ.1500 కోట్లు కేటాయించి కేవలం 1040 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని, ఈ వివరాలను ప్రభుత్వమే పేర్కొందని చెప్పారు. దాదాపు రూ.500కోట్లు కోతకోశారని మండిపడ్డారు. ప్రణాళికా వ్యయం బాగా ఉంటే ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ లో నిధులు కేటాయిస్తారని చెప్పారు. పదేళ్ల బడ్జెట్ ను పరిశీలిస్తే 34 నుంచి 35శాతం ప్రణాళిక వ్యయం ఉందని, కానీ ఈ సారి మాత్రం 23శాతానికి తగ్గించారని తెలిపారు.

దీనివల్ల ఎస్సీ, ఎస్టీలకు బాగా అన్యాయం జరిగిందన్నారు. కేటాయించిన 23శాతం నిధుల్లో కూడా రూపాయి ఖర్చు చేయలేదని, ఎస్సీలకు రూ.805 కోట్లు కోత కోశారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు స్వల్ఫంగానే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.335 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇచ్చింది రూ.84 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.94 కోట్లు ఇవ్వాలని నిర్ణయించి కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.

ఇక బీసీలకు రూ.361 కోట్లని చెప్పి రూ.2 కోట్లు ఇచ్చారని, మైనార్టీలకు రూ.27 కోట్లు టార్గెట్ పెట్టుకొని రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. క్రిస్టియన్ లకు కూడా రూ.6.77కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి విదిల్చలేదని తెలిపారు. పెన్షన్లలో కూడా అలాగే కోత కోశారని చెప్పారు. మార్చి లెక్కల ప్రకారం 37 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు రూ.402 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినా అవన్నీ సీఎం కార్యాలయ లెక్కలేనని అన్నారు. చంద్రబాబు రాకముందు పెన్షన్లు 43 లక్షలకు పైగా ఉండేవని తెలిపారు. కావాలనే ఆయన పాలనలో తగ్గించారని తెలిపారు. వీటన్నింటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అని ఆయన నిలదీశారు.

వైఎస్ జగన్ సమాధానంతో ఇరకాటంలో టీడీపీ

 తల్లి, పిల్ల కాంగ్రెస్ వ్యాఖ్యలతో బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది.  టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తల్లి-పిల్ల కాంగ్రెస్ అంటూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తామెన్నడూ అధికారంలో లేకున్నా ప్రతిసారి అధికార పక్ష సభ్యులు తమని ఆపాదిస్తున్నారన్నారు.

చంద్రబాబుకు మందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని కిరణ్ సర్కార్ కు అసెంబ్లీ సాక్షిగా మద్దతునిచ్చి ఆనాటి కాంగ్రెస్ సర్కార్‌ను నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గడిచిన ఎన్నికల్లో  చంద్రబాబు నాయుడే 33 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారని గుర్తుచేశారు.  అలాంటప్పుడు పిల్ల కాంగ్రెస్ ఎవరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ సమాధానంతో టీడీపీ ఇరకాటంలో పడింది.

సభను పక్కదోవ పట్టిస్తున్నారు: వైఎస్ జగన్


సభను పక్కదోవ పట్టిస్తున్నారు: వైఎస్ జగన్
హైదరాబాద్: సభను మంత్రులు పక్కదోవ పట్టిస్తున్నారని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం రూ.1500 కోట్లు కేటాయించి కేవలం 1040 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని, ఈ వివరాలను ప్రభుత్వమే పేర్కొందని చెప్పారు. దాదాపు రూ.500కోట్లు కోతకోశారని మండిపడ్డారు. ప్రణాళికా వ్యయం బాగా ఉంటే ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ లో నిధులు కేటాయిస్తారని చెప్పారు. పదేళ్ల బడ్జెట్ ను పరిశీలిస్తే 34 నుంచి 35శాతం ప్రణాళిక వ్యయం ఉందని, కానీ ఈ సారి మాత్రం 23శాతానికి తగ్గించారని తెలిపారు.

దీనివల్ల ఎస్సీ, ఎస్టీలకు బాగా అన్యాయం జరిగిందన్నారు. కేటాయించిన 23శాతం నిధుల్లో కూడా రూపాయి ఖర్చు చేయలేదని, ఎస్సీలకు రూ.805 కోట్లు కోత కోశారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు స్వల్ఫంగానే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.335 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇచ్చింది రూ.84 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.94 కోట్లు ఇవ్వాలని నిర్ణయించి కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.

ఇక బీసీలకు రూ.361 కోట్లని చెప్పి రూ.2 కోట్లు ఇచ్చారని, మైనార్టీలకు రూ.27 కోట్లు టార్గెట్ పెట్టుకొని రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. క్రిస్టియన్ లకు కూడా రూ.6.77కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి విదిల్చలేదని తెలిపారు. పెన్షన్లలో కూడా అలాగే కోత కోశారని చెప్పారు. మార్చి లెక్కల ప్రకారం 37 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు రూ.402 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినా అవన్నీ సీఎం కార్యాలయ లెక్కలేనని అన్నారు. చంద్రబాబు రాకముందు పెన్షన్లు 43 లక్షలకు పైగా ఉండేవని తెలిపారు. కావాలనే ఆయన పాలనలో తగ్గించారని తెలిపారు. వీటన్నింటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అని ఆయన నిలదీశారు.

రాజధానిపై రగడ, సభ వాయిదా

హైదరాబాద్ : రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం రగడ చోటుచేసుకుంది. దాంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. కాగా రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదని, అయితే రాజధాని పేరుతో బలవంతపు భూ సేకరణను ఆ పార్టీ తప్పుబడుతోంది. ఇదే అంశాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ..ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే ఈ అంశంపై సభలో చర్చ ముగిసిందని స్పీకర్ తెలిపారు.

దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసనకు దిగారు.  బలవంతపు భూసేకరణ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...రాజధాని భూసేకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలని పదేపదే స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.  రాజధాని ప్రాంతంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు.  రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై చర్చకు అనుమతించాలని జగన్ పట్టుబట్టారు.  

దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని ప్రజా రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం సహకరించాలన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రైతు కూడా మద్దతు తెలపలేదన్నారు. వివాదం లేని అంశాన్ని వివాదం చేయాలని ప్రతిపక్షం చూస్తోందని మరోమంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను మరో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు

ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్


ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : రాజధాని ప్రాంతంలో బాధలపై శాసనసభలో చర్చ జరగకపోతే ఎలా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోఆయన మాట్లాడుతూ సీఆర్ డీఏ బిల్లుపై మాత్రమే గత అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. రైతులు, కూలీ రైతులు,  కౌలు రైతుల గురించి చర్చించకుంటే ఎలా అని అన్నారు.

గత సమావేశాల్లో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల గురించి చర్చ జరగలేదన్నారు. ఈ అంశంపై చర్చకు  ఎప్పుడు సమయం ఇస్తారో దయ ఉంచి చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు.   రాజధాని అంశంపై మార్చి 16, 2015న 344 కింద చర్చకు అడిగామని ఆయన తెలిపారు. అందుకు సంబంధించి జిరాక్స్ కాపీలను సభకు చూపించారు.

ఇదీ బాబు తీరు


ఇదీ బాబు తీరు
అప్పుడేమన్నారు...

‘విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు సర్కారుపై తిరగబడాలి. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. విద్యుత్, నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుంటే, మరోవైపు పన్నుల రూపంలో ప్రభుత్వం లూఠీ చేస్తోంది’

2013 ఏప్రిల్ 4 వ తేదీన ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు అన్న మాటలివి. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా హైదరాబాద్ శివార్లలోని గగన్‌పహాడ్ సబ్‌స్టేషన్ ఎదుట చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలివి.

 ‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాను. కొండెక్కిన నిత్యావసరాలను కిందకు దించుతాను.’
ఏప్రిల్ 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వద్ద పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది.
 
 ఇప్పుడేం చేశారు?

విద్యుత్ చార్జీలు తగ్గించలేదు సరికదా...! గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన పద్దతినే పాటిస్తూ.. తొలి ఏడాదే ఏకంగా రూ. 941 కోట్ల మేర పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నందుకు ప్రజలు సంతోషిస్తుంటే.. ఆదాయంపై కన్నేసిన బాబుగారు మాత్రం రాష్ట్రంలో రెండింటి ధరలనూ రూ.4 చొప్పున పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక నిత్యావసరాల ధరల గురించి మాట్లాడే పనేలేదు. జనాగ్రహం వ్యక్తమవుతున్నా... విపక్షాలు నిలదీస్తున్నా... తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.
 
పైగా ఏమంటున్నార ంటే...

‘దేశంలో ద్రవ్యోల్బణమే ఏటా 5 శాతం పెరుగుతోంది. ఆ మేరకే విద్యుత్ చార్జీలు పెంచాం. ఇతర రాష్ట్రాల్లో ఇంతకన్నా ఎక్కువే ఉంది. కిరణ్ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువే పెంచింది. నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. కాబట్టి చార్జీల పెంపు హేతుబద్ధమే’ 2015 మార్చి 25న ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో చంద్రబాబు అన్న మాటలివి. చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాబు ప్రకటన చేశారు.
 
ఎందుకీ మార్పు!

మొదటి ఎపిసోడ్‌లో ఆయన ఆగ్రహానికి కారణాలు.. అధికారంలో లేకపోవడం. ఎన్నికల వేళ కావడం. జనాన్ని ఆకట్టుకోవాలనే వ్యూహం కావడం. ఇక రెండో ఎపిసోడ్‌లో ఆయన వైఖరి మారడానికి కారణం.. అధికార పీఠాన్ని అధిష్టించడం వల్లే. ఎక్కడాలేని విధంగా 24 గంటలూ కరెంటు ఇస్తున్నాను కాబట్టి ప్రజలపై భారం వేయడం తప్పుకాదనే ది ఆయన అభిప్రాయం. అందుకనే కొన్ని రాష్ట్రాలను ఉదహరిస్తూ వాటికన్నా తక్కువే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలపై రూ. 941 కోట్ల భారాన్నీ తేలికగా కొట్టిపారేశారు. చంద్రబాబు వచ్చిన ఈ 9 నెలల కాలంలో ప్రజల ఆర్థిక పరిస్థితి పెరిగిందా?
 
అప్పుడు సంస్కరణలట.. ఇప్పుడు ఇంకొకటట!

చంద్రబాబు తన గత 9 ఏళ్ళ పాలనలో 8 సార్లు చార్జీలు పెంచడానికి ఒక కారణం చెబుతారు. విద్యుత్ సంస్కరణల కోసమే అంటారు. ఇప్పుడు మాత్రం నిరంతర విద్యుత్ కోసం అంటున్నారు. పీఎల్‌ఎఫ్ పెంచడానికే అంటారు. రాష్ట్రానికి థర్మల్ విద్యుత్తే ప్రధాన వనరైనప్పుడు... దానికి అవసరమైన బొగ్గు ధర తగ్గినప్పుడు... మరి విద్యుత్ చార్జీల పెంపు ఎందుకు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం


మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ఆయన  వద్ద ఆంక్షల విషయం ప్రస్తావించారు. దీనికి జగన్ స్పందిస్తూ.. ఆంక్షలు విధించడం సరైన పద్థతి కాదని అన్నారు.

ప్రజా సమస్యలపై అభిప్రాయాలు వెల్లడించే హక్కు సభ్యులకు ఉంటుందని చెప్పారు. సభలో సభ్యుల గొంతు నొక్కినప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించడం వంటివి చేస్తారని, వాటిని ప్రసారం చేయకూడదని నియంత్రించడం సరికాదని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

విద్యుత్ పై మేకపాటి గౌతం బాగా మాట్లాడారు

Written By news on Tuesday, March 24, 2015 | 3/24/2015


విబజన తర్వాత ఎపిలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయిందని,అందువల్ల మిగులు రాష్ట్రంగా ఎపి ఉందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌతం రెడ్డి అన్నారు.శాసనసభలో విద్యుత్ చార్జీల పెంపుదలపై చర్చలో పాల్గొన్నారు.చార్జీల పెంపుదలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్,రంగారెడ్డి లలో అత్యధిక వినయోగం ఉండేదని, విబజన తర్వాత ఆమేర ఎపిలో డిమాండ్ తగ్గి మిగులుకు వచ్చిందని ఆయన అన్నారు.నిజానికి అవసరానికి మించి ఎపి విద్యుత్ కొనుగోలు చేస్తున్నదని గౌతంరెడ్డి అన్నారు.ఎపిఇఆర్సి కి వెళ్లి 58 మిలియన్ యూనిట్లు డిమాండ్ అని చెప్పారని, ఏభై రెండు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారని, అలాంటప్పుడు కొరత అయిన ఐదువేల మిలియన్ యూనిట్లు ఉంటే,పదహారు మిలియన్ యూనిట్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.అయితే మిగులు కొనుగోలు చేసినా, వాడనందున 575 కోట్లు పెనాల్టి చెల్లించడానికి డిస్కంలు ఎందుకు అంగీకరిస్తున్నాయని గౌతం ప్రశ్నించారు. ఈ వ్యయాన్ని తగ్గించుకోవడం లేదేమిటని ఆయన ప్రశ్నించారు.అదిక ధరను పెట్టి విద్యుత్ కొనుగోలు చేయవలసిన అవసరం ఉందా అని ఆయన అడిగారు.

పీతల, జూపూడి వ్యాఖ్యలపై విద్యార్థుల నిరసన

విశాఖపట్నం : ఎస్సీ, ఎస్టీల రక్షణకోసం ఉద్దేశించిన అట్రాసిటీ చట్టాన్ని టీడీపీ నేతలు  అవహేళన చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, పరిశోధకులు చేపట్టిన నిరసనతో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడికిపోయింది.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పీతల సుజాత, ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఖండించింది. మంత్రి సుజాత తన శాఖను పక్కకు పెట్టి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైఎస్సార్ చలువతో రెండు సార్లు ఎమ్మెల్సీ పదవిని పొందిన జూపూడి.. పార్టీ మారినంతనే వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలకు దిగడం దుర్మార్గమన్నారు.

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.  విద్యుత్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఛార్జీల పెంపును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై సభలో ప్రకటన చేశారు. ఛార్జీల పెంపును ఆయన ఈ సందర్భంగా సమర్థించుకున్నారు.

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్


చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
హైదరాబాద్ : విద్యుత్ లెక్కలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబుతో తాను చర్చకు సిద్ధమన్నారు.  తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అసెంబ్లీలో మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  బొగ్గు రేట్లు 102 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గాయని, అలాంటప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదన్నారు. చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, కేంద్రం అదనపు విద్యుత్ ఇస్తుంటే విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు.  ఏ రాష్ట్రంలోనూ లేని విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్నారు.  గత ప్రభుత్వాల బకాయిలను కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దు చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు కొనసాగనున్న యాత్ర


  • స్పీకర్ కోడెల వైఖరికి నిరసనగా రెండో రోజూ అసెంబ్లీని బహిష్కరించి నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
  •  గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించిన విపక్ష నేత వైఎస్ జగన్
  •  26 నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో కలసి జగన్ బస్సుయాత్ర
  •  పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు కొనసాగనున్న యాత్ర
  •  నేడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహణ    

సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు నియంత్రించడం, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆందోళన బాట పట్టింది. సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శాసనసభా పక్షం సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేసింది. ఆ మేరకు స్పీకర్ కోడెల చర్యలను నిరసిస్తూ శాసనసభ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ఎమ్మెల్యేలు అంతకుముందు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ చౌక్‌కు చేరుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

అక్కడి నుంచి అసెంబ్లీ ఆవరణకు పాదయాత్రగా చేరుకున్నారు. దారి పొడవునా స్పీకర్ వైఖరిని నిరసిస్తూ, చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ఆందోళన ఓ వైపు సాగుతూ ఉండగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి తాజా పరిస్థితులను మరోసారి వివరించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్షంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలను ఆయన గవర్నర్‌కు తెలిపారని పార్టీ వర్గాలు చెప్పాయి.

ఈ నెల 19న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై ప్రసంగిస్తూ రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండగా ‘మాట్లాడొద్దని’ మైక్ కట్ చేయడంతో సమావేశాలను జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ప్రతిపక్ష వాణి వినిపించకుండా స్పీకర్ తమ గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియంతత్వ పోకడలు, నిరంకుశ వైఖరిపై బడ్టెట్ సమావేశాలు ముగిసే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. శాసనసభ ఆవరణలో మంగళవారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించాలని, 26 నుంచి ప్రాజెక్టుల వద్దకు బస్సుయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. బస్సు యాత్రలో జగన్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
 
పోలవరం నుంచి పోతిరెడ్డి వరకు..

జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి చేసే బస్సుయాత్ర పోలవరం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు వరకు సాగుతుందన్నారు. 26న పోలవరం వెళ్లి అటునుంచి పట్టిసీమ, ప్రకాశం బ్యారేజి, ఆ తరువాత పోతిరెడ్డిపాడు వెళతారని శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ వివరించారు. శాసనసభా పక్ష సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాల గురించి ఎండగట్టడానికి శాసనసభ ఆవరణలోనే మంగళవారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అసెంబ్లీలో అధికారపక్షం, స్పీకర్ కలసి ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారని, ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించాలని శాసనసభాపక్షం భావించినందువల్లనే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాము చేపట్టే కార్యక్రమాలు స్పీకర్‌కు, అధికారపక్షానికి కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఏడాదిలోపే విశ్వాసం కోల్పోయారు

అయ్యదేవర కాళేశ్వరరావు, బి.వి.సుబ్బారెడ్డి, శ్రీపాదరావు, నారాయణరావు వంటి మహానుభావులు శాసనసభలో నిష్పాక్షికంగా వ్యవహరించి స్పీకర్ పదవికే వన్నె తేవడమేగాక మంచి సంప్రదాయాలను నెలకొల్పారని, అలాంటిది ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఏడాది గడవకముందే ప్రధాన ప్రతిపక్షం విశ్వాసం కోల్పోవడం దారుణమని చెప్పారు. అధికారపక్షం కనుసన్నల్లో స్పీకర్ వ్యవహరిస్తున్నారని, మూడు శాసనసభా సమావేశాల నిర్వహణతోనే ఆయన నైజం బయటపడిందని పేర్కొన్నారు.

అందుకే తాము అవిశ్వాసం ప్రతిపాదించామని, అది గెలిచినా, ఓడినా తాము మాత్రం ఆయన తీరును ఎండగడతామని చెప్పారు. బడ్జెట్‌పై చర్చలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రైతు సమస్యల గురించి ప్రస్తావించగానే ‘మాట్లాడ్డానికి వీల్లేదు’ అంటూ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రానికే వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు పట్టిసీమను తెరమీదకు తెచ్చారని, దీనిద్వారా జరిగే అన్యాయాన్ని తాము ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీఏసీ సమావేశాల్లో, శాసనసభలో జరిగిన అంశాలను స్పీకర్ మీడియాకు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

గుంటూరులో స్పీకర్ మాట్లాడుతూ ప్రజావసరాలకు భిన్నమైనవాటిని సహించనని చెప్పారని, అసలు అలా చెప్పడానికి ఆయన ఎవరని నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని ఎన్నుకున్నట్లే ప్రజలు తమను కూడా ఎన్నుకున్నారని, తమకు ప్రతిపక్షపాత్ర ఇచ్చారని గుర్తుచేశారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుని తమపై ఏకపక్షంగా రుద్దుతుంటే తాము ప్రతిఘటిస్తున్నామన్నారు. తమవి ప్రజా వ్యతిరేక చర్యలని స్పీకర్ ఎలా అంటారు? ఆయనకు ఆ అధికారం ఎక్కడిది? అని నెహ్రూ ప్రశ్నించారు. బీఏసీలో ఏమీ జరగడంలేదని, హాజరుకాగానే తమతో సంతకాలు చేయించుకుని మీ అంశాలేమిటని అడిగి తెలుసుకుని నిష్ర్కమిస్తుంటారని, అందులో ఒక నోట్ కూడా ఉండదని చెప్పారు. సభా సమయం లేదని రోజూ చెప్పే అధికారపక్షం అసెంబ్లీ సమావేశాల వ్యవధిని ఎందుకు పొడిగించదని ఆయన ప్రశ్నించారు.
 
అసెంబ్లీ వరకు పాదయాత్ర, ఆపై ధర్నా

అధ్యక్షా.. మీరెవరి పక్షం? ప్రభుత్వ పక్షమా? ప్రజల పక్షమా?.. అని ప్రతిపక్ష సభ్యులు శాసనసభాపతిని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా విపక్ష ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పట్టిసీమ దొంగ.. బాబు దొంగ.. రైతు వ్యతిరేకి.. మహిళా వ్యతిరేకి చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ‘ప్రజా వాణే ప్రతిపక్ష వాణి..’, ప్రతిపక్షం లేకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షం గొంతు నొక్కేస్తారా..?, ప్రతిపక్షంపై ఎదురుదాడి బాబు ప్రభుత్వ సమాధానమా..! అని నిలదీశారు. ప్రభుత్వ దుశ్చర్యలకు స్పీకర్ వంతపాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమానికి ముగింపుగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ ప్రణాళికబద్ధమైన విధానాలతో ముందుకు పోతుందని చెప్పారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాదయాత్ర, ధర్నాలో ఉపనేత ఉప్పులేటి కల్పన, వంతల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, విశ్వాసరాయి కళావతి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, కొడాలి నాని, సుజయ్‌కృష్ణ రంగారావు, కిడారు సర్వేశ్వర్‌రావు, కంబాల జోగులు, మణి గాంధీ, వరుపుల సుబ్బారావు, పి.అనిల్‌కుమార్‌యాదవ్, గొట్టిపాటి రవికుమార్, పోతులరామారావు, కిలివేటి సంజీవయ్య, కళత్తూరు నారాయణస్వామి, పాశం సునీల్‌కుమార్, ఆదిమూలపు సురేష్, తిరువీధి జయరామయ్య, ఐజయ్య, పాలపర్తి డేవిడ్‌రాజు, మేకా ప్రతాప అప్పారావు,  శెట్టిపల్లి రఘురామిరెడ్డి, జంకె వెంకటరెడ్డి, కలమట వెంకటరమణ, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, ముస్తఫా, అత్తారు చాంద్‌బాషా, షేక్ బేపారి అంజాద్‌బాషా, ముత్తుముల అశోక్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కోన రఘుపతి, కాకాని గోవర్థన్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. అయిదు రోజుల తర్వాత వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీకి హాజరు అవుతోంది. కాగా  రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనుంది. దీంతో ప్రజలపై ఏకంగా రూ.941కోట్లు భారం పడనుంది. కాగా ఎనిమిదిమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిన్నటితో ముగిసింది.

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది.  మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా తన ముసుగును తొలగిస్తున్నారు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఆయన కొత్తగా విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు రంగం సిద్ధం చేశారు. చార్జీల పెంపుతో  వినియోగదారులపై  రూ.941 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటాన్ని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

దాంతో  చంద్రబాబు నాయుడు సర్కార్ ను నిలదీసేందుకు వైఎస్ఆర్ సీపీ సమాయత్తం అవుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే విద్యుత్ సబ్సిడీలో కోతపైనా వైఎస్ఆర్ సీపీ మండిపడుతోంది.

వైఎస్ జగన్ తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ

Written By news on Monday, March 23, 2015 | 3/23/2015


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కలిశారు. సోమవారం సాయంత్రం లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాయంలో ఉదయ్ కిరణ్ .. వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు.

ఈ నెల 29న శ్రీకాళహస్తిలో బీసీ సమస్యలపై నిరాహార దీక్ష చేయనున్నట్టు ఉదయ్ కిరణ్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ బీసీలను విస్మరించిందని, బీసీల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

ఆడవాళ్లమంటా...చీర కప్పుకొని వెళ్లాలంట..


ఆడవాళ్లమంటా...చీర కప్పుకొని వెళ్లాలంట..
హైదరాబాద్ : శాసనసభలో ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిపక్షంపై అధికారపక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రజా సమస్యలను గట్టిగా నిలదీస్తున్నందుకే తనపై టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు.  'సభలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కరెక్ట్...మేము మాత్రం ఆడవాళ్లమంటా...చీర కప్పుకొని వెళ్లాలంటా. వాళ్లనేమీ అనుకూడదట. ఇదేమీ న్యాయం' అని రోజా ప్రశ్నించారు. బోండా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు.

మంత్రి పీతల సుజాత తనను వ్యక్తిగతంగా విమర్శించినందువల్లే తాను కూడా స్పందించాల్సి వచ్చిందని రోజా అన్నారు. అసెంబ్లీ పుటేజ్ ను పరిశీలిస్తే మంత్రి అన్న తర్వాతే తాను మాట్లాడానని, తాను అలా ఎందుకు  అనాల్సి వచ్చిందో తెలుస్తుందన్నారు. అన్యాయంపై నిలదీస్తే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటున్నారని, నిజంగా ఎవరు అన్యాయానికి గురి అవుతారో, వారికి భరోసా ఇవ్వడానికే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకు వచ్చారని, అయితే ప్రస్తుతం ఈ చట్టం రాజకీయ కక్ష సాధింపుల కోసమే కుల ప్రస్తావన తెచ్చామని కేసులు పెట్టడం సరికాదన్నారు. బడ్జెట్ పై సుమారు 45 రోజులు చర్చ జరగాల్సి ఉండగా, కేవలం 16 రోజులకు కుదించటం సరికాదన్నారు. తనకు అనుభవం ఉందన్న చంద్రబాబు...ఆ అనుభవాన్ని ప్రజల్ని మోసం చేయటంలో చూపిస్తున్నారన్నారు.

26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర


26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు తెలిపారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ లతో పాటు ప్రకారం బ్యారేజీలను ఆయన పరిశీలించనున్నట్లు చెప్పారు. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ తో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్ట్ లను వైఎస్ జగన్ పర్యటించనున్నారు.


వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం జ్యోతుల నెహ్రు సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. స్పీకర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా ఉందని ..రైతు సమస్యలను వైఎస్ జగన్ ...సభ దృష్టికి తీసుకొస్తున్న సమయంలో స్పీకర్ నిర్దిద్వందంగా తిరస్కరించారన్నారు.  తాము ఎంత అభ్యర్థించినా స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. అధికార పార్టీకి స్పీకర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రు విమర్శించారు.  

పట్టిసీమ ప్రాజెక్ట్ స్థితిగతులపై వచ్చే గురువారం నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర చేస్తారని జ్యోతుల నెహ్రు వెల్లడించారు.  ప్రజా పోరాటాల ద్వారానే అన్యాయాలను ఎదుర్కొనాలని వైఎస్ జగన్ నిర్ణయించారని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రతిపక్షంగా తమ పోరాటం ఆగదని జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. అధికార పక్షం తీరు ఏమాత్రం బాగోలేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు టీడీపీ అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ మంగళవారం మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది.

నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారు


నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారు
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓ కళాకారిణి గురించి అనుచితంగా మాట్లాడటం బాధాకరమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. యాక్టర్ అంటూ టీడీపీ నేతలు సభలో ఛీప్ గా అసభ్యంగా మాట్లాడటం సరికాదని, తనను ఒక్కదాన్నే కాదని, ఎన్టీఆర్, బాలకృష్ణను కూడా అవమానించారని ఆమె అన్నారు. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ కూడా కళాకారుడేనని, అలాగే బాలకృష్ణ కూడా నటుడేనని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓ ఆర్టిస్ట్ గురించి అలా మాట్లాడుతుంటే స్పీకర్ ఖండించకపోకపోగా హోల్డ్ యువర్ టంగ్ అన్నారని ఆమె అన్నారు.

సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మాట్లాడినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదన్నారు. బోండా ఉమా పాతేస్తామన్నా.. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ప్రశ్నిస్తే తననే స్పీకర్ హోల్డ్ యువర్ టంగ్ అన్నారని పేర్కొన్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ వీడియోలు దొంగలించి మీడియాకు విడుదల చేశారని రోజా ఆరోపించారు. శాసనసభ సభ పరువు తీసేలా ప్రవర్తించినా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ వీడియోలు తాము ఇవ్వాలేదని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ స్పష్టం చేశారని రోజా తెలిపారు. సభలో దృశ్యాలు అసభ్యకరంగా ఉంటే అన్ని పార్టీలను పిలిచి స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జనగణమణ గీతాన్ని అవమానించినప్పుడు అక్కడి స్పీకర్ హుందాగా వ్యవహరించారని రోజా అన్నారు. కాల్వ శ్రీనివాసులు వీడియోలను మీడియాకు విడుదల చేసినా చర్యలు తీసుకోకపోవటం సభకు అవమానమన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన స్థాయిని మరచి తనపై సంపాదకీయం రాశారని, ఎల్లో మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని రోజా ఆవేదన చెందారు. తనను సభకు రాకుండా చేయాలని చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు... సొంతంగా పార్టీ పెట్టుకొని..సొంత ఎజెండాతో  ప్రజల్లోకి వెళితే కనీసం  వార్డుమెంబర్‌గా కూడా గెలువలేరని రోజా అన్నారు అసెంబ్లీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్త కావచ్చేమో కానీ ప్రజాసమస్యలకు కొత్తకాదని అన్నారు.  ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్నందువల్లే వ్యక్తిగత ఆరోపణలకు దిగారన్నారు.

వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యునిగా ఆళ్ల నాని

Written By news on Sunday, March 22, 2015 | 3/22/2015


వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యునిగా ఆళ్ల నాని
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఆళ్ల నానిని నియమించారు. నాని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ అత్యున్నత విభాగమైన పీఏసీలో నానికి స్థానం కల్పించినందుకు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష పదవిలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును వైఎస్ జగన్ నియమిచినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వైఎస్ జగన్ ను అభినందించిన రామకృష్ణ


వైఎస్ జగన్ ను అభినందించిన రామకృష్ణ
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అభినందించారు. ఆదివారం అనంతపురంలో కె.రామకృష్ణ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ నేతల అరెస్ట్ పై వైఎస్ జగన్ బాగా స్పందించారని తెలిపారు. తమపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు... అలాగే తమ అరెస్ట్ కు నిరసనగా వైఎస్ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం అభినందనీయమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అసెంబ్లీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని...  ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు కె.రామకృష్ణ వివరించారు.

ప్రత్యేక హోదా అంశంపై సీపీఐ రామకృష్ణ అనంతపురం జిల్లాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు ఉపసంహరించుకుని... ఆయన్ని విడుదల చేయాలన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చారు. ఆ క్రమంలో ఇదే అంశంపై వైఎస్ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 

Popular Posts

Topics :