12 April 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పట్టిసీమ పునాదితో టీడీపీ సమాధి

Written By news on Saturday, April 18, 2015 | 4/18/2015


'పట్టిసీమ పునాదితో టీడీపీ సమాధి'
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు పునాది టీడీపీకి సమాధిగా మారబోతోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్ లో అంబటి రాంబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పై బురద జల్లడం మానుకోవాలని ఆయన ఈ సందర్భంగా టీడీపీ నేతలకు హితవు పలికారు.
రూ. 300 కోట్ల ముడుపులకు కక్కుర్తి పడి ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు టీడీపీకి శనిగా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా పట్టిసీమను పక్కన పెట్టి పోలవరాన్ని పూర్తి చేయాలని అంబటి రాంబాబు టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేషాచలం ఎన్ కౌంటర్ పై సీఎం చంద్రబాబు నోరు మెదపకపోవడానికి కారణమేంటో అర్థంకావడం లేదన్నారు. దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అలాగే బాధ్యత గల సీఎం ఈ అంశంపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు... చంద్రబాబుకు సూచించారు.

అడుగులో అడుగులై.. కదన సింహాలై..


అడుగులో అడుగులై..  కదన సింహాలై..
జనం తోడుగా.. అన్నదాత వెంట నడవగా..అభిమాన సంద్రం ఉప్పొంగింది. ప్రభుత్వ  తీరును ఎండగట్టగ ఊరూవాడా ఒక్కటైకదిలింది. ఆ ఒక్క అడుగుకు వేలాది అడుగులు జతకట్టగా.. ‘పట్టి’సీమ వెనుక ధనయజ్ఞాన్ని జనం గొంతుక ఎలుగెత్తింది.రైతన్న వెన్నెముకగా.. ప్రజల కష్టాలను పాల్పంచుకునే నేస్తంగా.. జగమంత కుటుంబంలో ఒకనిగా సీమ వాకిట కాలిడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా  నీరాజనం లభించింది.  జల‘విఘ్నా’లపై  బాణం ఎక్కుపెట్టిన నేత ఆశయ సిద్ధికి
 అశేష జనం సలాం చేసింది.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. యాత్ర ప్రకటించిన తర్వాత రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం జిల్లాలో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైంది. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన అడుగడుగునా ఎండగట్టారు. ప్రతి ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరం? బడ్జెట్‌లో ఎంత కేటాయించారనే వివరాలను ఆయన మాట్లాడిన ప్రతీ చోట వివరించే ప్రయత్నం చేశారు.
 
  రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని ఆయన విశదీకరించారు. జిల్లాలోని సిద్దాపురం, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో పాటు మల్యాల వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి(ఏవీఆర్‌హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టులను ఆయన శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ సందర్శించారు. అక్కడున్న రైతులతో ముచ్చటించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం యాత్రలో రోడ్డుపొడవునా జనం నీరాజనం పలికారు.
 
 హడావుడిగా మంత్రి పర్యటన
 జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారనే ప్రకటన వెలువడగానే రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే నిధుల కేటాయింపుపై ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేకపోయింది. కేవలం మంత్రి పర్యటనలతో లాభం లేదనుకున్న ప్రభుత్వం.. హడావుడిగా ప్రాజెక్టుల వద్ద పెండింగ్ పనులను ప్రారంభించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కెనాల్ విస్తరణ పనులను నామమాత్రంగా రెండు జేసీబీలు, మూడు ట్రిప్పర్లతో హడావుడి చేసింది.
 తెలివితక్కువోళ్లం కాదన్న రైతులు
 జగన్ పర్యటన సందర్భంగా మాట్లాడిన రైతులు ప్రాజెక్టులపై చంద్రబాబు చూపిన అలసత్వం, నిర్లక్ష్యాన్ని తమ అనుభవ పూర్వకంగా ఎండగట్టారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం.. పట్టిసీమ నుంచి సీమకు నీళ్లు ఇస్తామంటే నమ్మేందుకు తెలివితక్కువోళ్లమా అని ప్రశ్నించారు. రాయలసీమపై చంధ్రబాబుది కపట ప్రేమ అని రైతులు ఘాటుగా విమర్శించారు.
 
  వైఎస్ ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌బీసీ నుంచి మూడుకార్లు పంట పండించుకున్నామని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగ్గా నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై చేసే పోరాటంలో కలిసి వస్తామని ఆయన పర్యటన మొత్తం కదలివచ్చిన జిల్లా ప్రజలు హామీనిచ్చారు. ఉదయం 11 గంటలకు సిద్ధాపురం చెరువు వద్ద మొదలైన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు హంద్రీనీవా వద్ద ముగిసింది. అనంతరం ఆయన బ్రహ్మణకొట్కూరులోని గౌరు వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు.
 
 అక్కడి నుంచి నేరుగా ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, భూమా అఖిలప్రియ, మణిగాంధీ, ఐజయ్య, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్ రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి కాటసాని రాంరెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, సీఈసీ సభ్యుడు హఫీజ్ ఖాన్, తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, డీకే రాజశేఖర్, నర్శింహులు యాదవ్, కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భరత్‌కుమార్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మహా సమరశంఖం


మహా సమరశంఖం
► జీవీఎంసీ ఎన్నికల దిశగా  వైఎస్సార్‌సీపీ  కసరత్తు
► పరిశీలకులుగా విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి
► గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన
 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ ఎన్నికల దిశగా సన్నాహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ తెరతీసింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేపట్టింది. అందుకోసం  ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర పా లకమండలి సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఎన్నికలకు సంబంధించినంతవరకు ఈ కమిటీకి స్పష్టమైన విధివిధానాలను అధిష్టానం నిర్దేశించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, నేతలు-కార్యకర్తలతో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల వ్యూహాన్ని ఈ ద్విసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. త్వరలో వీరిద్దరూ నగరంలో పర్యటించి కార్యాచరణకు ఉపక్రమిస్తారు.

సంస్థాగత బలోపేతం : జీవీఎంసీ పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ కమిటీ మొదటగా  దృష్టిసారిస్తుంది. ఇప్పటికే నియమించిన నగర కమిటీతోపాటు డివిజన్,  అనుబంధ సంఘాల కమిటీల నియామకాలపై కసరత్తు చేస్తుంది. పార్టీలోకి అవసరమైన కొత్త నేతల చేరికలు, పార్టీ బలోపేతం కోసం ఇతరత్రా చర్యలపై చర్చించి నిర్ణయిస్తుంది.   ప్రాథమిక సమాచారంపై ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించింది.

ప్రజాసమస్యలపై పార్టీని పోరుబాటు పట్టించాలని కమిటీ నిర్ణయించింది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, హుద్‌హుద్ బాధితులకు పునరావాసంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఇప్పటికే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తూనే ఉంది. గాజువాక నియోజకవర్గ సమస్యల పరిష్కారించాలన్న డిమాండుతో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిం చారు. దీంతోపాటు మరింత విసృ్తతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు జరపాలని పార్టీ భావిస్తోంది.

మరింత సమన్వయం: విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు పార్టీలో సమన్వయాన్ని మరింత పెంపొందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కమిటీల సభ్యులు, కార్యకర్తలు అందరి మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా పార్టీని బలోపేతం చేస్తారు. అందరికి అందుబాటులో ఉంటూ అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఎన్నికల వ్యూహ రచన చేస్తారు.  కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడం ద్వారా పార్టీని ఎన్నికల దిశగా సమరసన్నద్ధం చేయడంపై దృష్టిసారిస్తారు.

అభ్యర్థుల ఎంపిక: కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి చేపడతారు. మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేస్తారు.సున్నితమైన వ్యవహారమైనందున అత్యంత జాగురకతతో వ్యవహరిస్తారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం, పార్టీ కోసం కష్టించినవారికి గుర్తింపునకు పెద్దపీట వేస్తూ అంతిమంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారు. అందుకు సన్నాహకంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విసృ్తతంగా సంప్రదింపులు జరుపి అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు.

ప్రచారం- ఎన్నికల వ్యూహం :  సంస్థాగత బలోపేతం, సమన్వయం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలకు సమాంతరంగా విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి జీవీఎంసీ ఎన్నికల వ్యూహం, ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఓ ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తారు. దాంతోపాటు నియోజకవర్గాలు, డివిజన్లవారీగా స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ కూడా ఎన్నికల కసరత్తు జరుపుతారు. స్థూలంగా చెప్పాలంటే జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆద్యంతం అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిల కమిటీ పర్యవేక్షించి కార్యాచరణ రూపొందిస్తుంది.

పార్టీ విజయమే లక్ష్యం
టీడీపీ ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు గుణపాఠంచెప్పాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఈ అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని జీవీఎంసీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను సన్నద్ధం చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పార్టీని సమరసన్నద్ధం చేస్తాం. జిల్లా పార్టీ, నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు అందర్ని అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. పార్టీ విజయానికి అన్ని చర్యలను తీసుకుంటాం. త్వరలో విశాఖలో పర్యటిస్తాం.
  -చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎన్నికల పరిశీలకుడు

కాంట్రాక్టర్ చంద్రబాబు మనిషే!


నిధులివ్వకుండా నీళ్లెలా ఇస్తారు?
సర్కారుకు జగన్‌మోహన్‌రెడ్డి సూటిప్రశ్న
 
రాయలసీమకు దశాబ్దాల నుంచి నీళ్లిచ్చేందుకు ఎస్‌ఆర్‌బీసీ ఉంది. కేసీ కెనాల్ ఉంది. తెలుగుగంగ ప్రాజెక్టు ఉంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. ఏ రోజూ హంద్రీ-నీవా కట్టాలన్న ఆలోచన చేయులేదు. పైగా హంద్రీ నీవాకు 40 టీఎంసీల నీరు ఎందుకు..  5.5 టీఎంసీల నీళ్లు చాలన్నారు. హంద్రీ-నీవాకు అన్ని లిఫ్టులు ఎందుకన్నారు. ఇదే బాబు హంద్రీ-నీవాకు 5.5 టీఎంసీల నీళ్లు చాలంటూ 1998 మే 6న జీవో నంబరు 68ను కూడా తీసుకొచ్చారు. దీనికి రూ.63 కోట్లు చాలన్నారు. అప్పుడు రాయులసీవు మీద ప్రేవు ఏవురుు్యంది? తాజా బడ్జెట్‌లోనూ రాయులసీవులోని ప్రాజెక్టులకు నిధులివ్వలేదు ఎందుకు?    
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 

రాయులసీవులోని ప్రాజెక్టులకు నిధులు కేటారుుంచని చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడి ప్రాజెక్టులకు నీళ్లిస్తావుంటూ నాటకమాడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు కళ్లవుుందు కనిపిస్తున్నా.. రాయులసీవుకు నీళ్లిస్తావుంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమపై ఇచ్చిన జీవోలో ఎక్కడా రాయులసీవు పేరును చేర్చని ప్రభుత్వం... సీవుకు నీళ్లిస్తావుంటే జగన్ అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్నదని ఆయున ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడుపై ఇప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా గతంలో విజయువాడలో, ఇక్కడ ధర్నాలు చేశారని, ఇప్పుడు అదేవుంత్రి పోతిరెడ్డిపాడును పూర్తిచేసి నీళ్లిస్తావుని దొంగప్రేవు చూపిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో వైఎస్సార్ జిల్లాలో బ్రహ్మసాగర్ రిజర్వాయుర్‌లో వైఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు 12-13 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని... బాబు అధికారంలోకి వచ్చి ఏడాది కాకవుుందే చుక్కనీరూ లేకుండా పోయూయుని వివుర్శించారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం వుుందుకు తీసుకెళ్లి నిలదీసే కార్యక్రవుం చేపడతావుని ఆయన స్పష్టం చేశారు. రానున్నరోజుల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తావుని ప్రకటించారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయున కర్నూలు జిల్లాలో పర్యటించారు.

ముందుగా ఆత్మకూరు నియోజకవర్గంలోని సిద్ధాపురం చెరువును.. అనంతరం బానకచర్ల క్రస్ట్‌గేట్లను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయున పరిశీలించారు. బానకచర్ల క్రస్ట్‌గేట్లను పరిశీలించాక రైతులతో వుుఖావుుఖి నిర్వహించారు. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘ప్రాజెక్టులు కళ్లవుుందు కనబడుతున్నారుు. అరకొరగా ప్రాజెక్టులు కట్టారు. పెండింగ్ పనులు అలాగే ఉన్నారుు. ఈ ప్రాజెక్టులు పూర్తికావడం లేదు. కరువు ప్రాంతం కావడంతో నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నారుు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వుుందుకు తీసుకెళ్లి నిలదీసే కార్యక్రవుం చేపట్టేందుకే ప్రాజెక్టుల యూత్ర చేపట్టాం’’ అని వివరించారు. ఆయన ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..

హంద్రీ నీవాకు ఖర్చు చేసింది రూ.13 కోట్లే..

చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హంద్రీనీవాకు కేవలం రూ.13 కోట్లే ఖర్చు చేశారు. దివంగత నేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు రూ.6,800 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణరుుంచారు. ఆయున కాలంలో, ఆ తర్వాతి ప్రభుత్వాలకాలంలో కలపి రూ.5,800 కోట్లు ఖర్చు చేశారు. ఇంక రూ.1100 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అరుుతే చంద్రబాబు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు కేటారుుంచారు. ఇలా కేటారుుంపులు చేస్తే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ప్రాజెక్టులకు నిధులు కేటారుుంచేందుకు బాబుకు వునసు రావట్లేదు. నిజంగా రాయులసీవుపై ప్రేవు ఉంటే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటారుుంచాలి. పట్టిసీవులో డబ్బులు గుంజుకునేందుకు రాయులసీవుపై ప్రేవు ఒలకబోస్తున్నారు.

గాలేరు-నగరికి బాబు ఇచ్చింది రూ.17 కోట్లే!

రాయులసీవులోని వురో ప్రాజెక్టు గాలేరు-నగరిపైనా చంద్రబాబుకు ఏవూత్రం ప్రేవు లేదు. తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు కేటారుుస్తే.. వైఎస్‌ఆర్ హయాం, తర్వాతి ప్రభుత్వాల హయాంలో రూ.4,600 కోట్లు ఖర్చు చేశారు. వురో రూ.2,600 కోట్లు కేటారుుస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అరుుతే తాజాబడ్జెట్‌లో రూ.169 కోట్లే కేటారుుంచారు. గాలేరు-నగరిలో ఎంత పెండింగ్ పనులు ఉన్నాయో చూస్తే అర్థవువుతుంది. అయినా వుంత్రి దేవినేని ఉమా... కళ్లకు గంతలు కట్టుకున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. వుంత్రి ఇక్కడకు వచ్చి పడుకుంటానంటూ...గండికోటలో 30 టీఎంసీల నీటిని నిల్వ చేస్తానని అంటున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఇంత పచ్చిగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. 5-6 టీసీఎంల నీటినే నిల్వ చేసుకోలేని పరిస్థితుల్లో 30 టీఎంసీల నీటిని నిల్వ చేస్తానని.. రాయులసీవుపై ప్రేవు ఉందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఒకవైపు రాయులసీవులోని ప్రాజెక్టులకు నిధులు కేటారుుంచకుండా అన్యాయుం చేస్తూ.. పైగా జగన్‌కు రాయులసీవుపై ప్రేవు లేదని వివుర్శిస్తున్నారు. శ్రీశైలంలో నీటివుట్టం 803 అడుగులకు పడిపోరుుంది. ఇప్పుడు వరదలొచ్చినా శ్రీశైలంలో నీటివుట్టం 854 అడుగులకు వచ్చేదాకా రాయులసీవుకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు.

వెలిగొండదీ అదేదారి..: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 1996లో వెలిగొండ ప్రాజెక్టును నిర్మిస్తానని బాబు టెంకాయు కొట్టారు. ఎన్నికల తర్వాత ప్రాజెక్టును గాలికొదిలేశారు. బాబు తొమ్మిదేళ్లలో కేవలం రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఏడాదికి రూ.2 కోట్లు కూడా ఖర్చు చేయులేదన్నవూట. వైఎస్‌ఆర్ ఏకంగా రూ.3 వేల కోట్లు కేటారుుంచారు. ఇంకా రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. చంద్రబాబు బడ్జెట్‌లో కేవలం రూ.150 కోట్లు కేటారుుంచారు.

 పోలవరాన్ని అడ్డుకునే కుట్ర!

బంగారంలాంటి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టే ప్రయుత్నం చేస్తోంది. పట్టిసీమ పేరుతో దారుణానికి పాల్పడుతోంది. పోలవరం నిర్మిస్తే గోదావరి వరద జలాల్ని 200 టీఎంసీల మేరకు నిల్వ చేసుకునే అవకాశముంది. ఇందులో 80 టీఎంసీలను  కృష్ణాడెల్టాకు వుళ్లిస్తే.. ఆ మేరకు నీటిని వునం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరికి వుళ్లించుకుని రాయులసీవు ప్రాజెక్టులకు నీళ్లు పారించుకోవచ్చు. అరుుతే ఈ పని చేయుకుండా పట్టిసీవు పేరుతో చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. వాస్తవానికి గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఈ) అని క్లాజు ఉంది. దానిప్రకారం పోలవరం పనులు మొదలుపెట్టిన వెంటనే 35 టీఎంసీల మేరకు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, వుహారాష్ట్రలు వున వాటాలో వాడుకునే అవకాశముంది. మరో క్లాజు 7(ఎఫ్) ప్రకారం.. గోదావరిపై ఏ ప్రాజెక్టు కట్టినా కర్ణాటక, వుహారాష్ర్టలు ఆ మేరకు నీటిని వుళ్లించుకునే అవకాశముంది. పట్టిసీవు వల్ల రాయులసీవులోని ప్రాజెక్టులకు రావాల్సిన నీరు రాకుండా పోతుందన్నవూట. పట్టిసీవు ప్రాజెక్టుకు కేటారుుంచే నిధులు రాయులసీవులోని ప్రాజెక్టులకు కేటారుుస్తే ఇక్కడి ప్రాజెక్టులను పూర్తిచేయువచ్చు. పట్టిసీవుకు టెండరు పిలిచినప్పుడు బోనస్ క్లాజు లేదు. పట్టిసీవుపై ఇచ్చిన జీవోలో ఎక్కడా రాయులసీవు పేరు లేదు. అరుుతే అసెంబ్లీలో ప్రతిపక్షంగా మేవుు నిలదీశాక రాయులసీవుకు నీళ్లిస్తావుని అంటున్నారు.
 
వైఎస్ ఉంటే కోనసీవు వూదిరిగా అయ్యేది...!
 
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే వూ ప్రాంతం కోనసీవు వూదిరిగా అయ్యేదని బనగానపల్లె నియోజకవర్గ రైతు శివరాం సుబ్బారెడ్డి అభిప్రాయుపడ్డారు. బానకచర్ల క్రస్ట్‌గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ‘రైతులతో వుుఖావుుఖీ’ కార్యక్రవుంలో ఆయున వూట్లాడారు. ‘‘బాబు సీఎంగా ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌బీసీలో చుక్కనీరు పారలేదు. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆయున తీసుకున్న చర్యలతో 2013 వరకూ నిరాటంకంగా నీళ్లొచ్చాయి. వుళ్లీ బాబు అధికారంలోకి వచ్చాక 2015 జనవరి వరకే నీరొచ్చింది. శ్రీశైలంలో 854 అడుగుల వరకూ నీరు తీసుకోవచ్చునని వైఎస్ జీవో తెస్తే... దానిని చంద్రబాబు 834కు తగ్గించారు. ఇప్పుడు శ్రీశైలంలో 803 అడుగులకు పడిపోరుుంది. రాయులసీవులోని ప్రాజెక్టులకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. గోరుకల్లు రిజర్వాయుర్‌లో ఐదు రకాల పనులు నిలిచిపోయూరుు. ఈ పనులను చేసేందుకు నిధులివ్వట్లేదు. ఇప్పుడు పట్టిసీవు ద్వారా సీవుకు నీళ్లిస్తావుంటే నమ్మేందుకు మేమేమైనా తిక్కోళ్లవూ? వూ చెవిలో పూలున్నాయూ?’ అని వివుర్శించారు.  కాగా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్‌ఆర్‌బీసీ ద్వారా కేవలం ఒక పంటకే నీరందుతోందని నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన రైతు రవుణారెడ్డి వాపోయూరు.

కాంట్రాక్టర్ చంద్రబాబు మనిషే!

 
కర్నూలు: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో 70-80 శాతం పనులు పూర్తయిన హంద్రీనీవా ప్రాజెక్టుకు అవసరమైన మేరకు మిగతా నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబుకు చేతులు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘చంద్రబాబు, ఆయనకు చెందిన కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తున్నంత కాలం ఈ ప్రాంత ప్రజల బతుకులు ఇంతే’- అని నిప్పులు చెరిగారు. హంద్రీనీవాకు సంబంధించి మొత్తం 12 పంపులు ఆన్ చేసి నీరు ఎక్కువగా తీసుకుపోయి రైతులకు మేలు చేయొచ్చు కదా అని ఇంజనీర్లను అడిగితే ఆ స్థాయిలో పంపులు ఆన్ చేస్తే అసలు కెనాలే తెగిపోతుందని చెప్పారని అన్నారు. కెనాల్ తెగిపోతుందని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయి ఆ పనులు చేసిన కాంట్రాక్టర్ ఎవరని వాకబు చేస్తే బాబు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అని తేలిందన్నారు. ఆయన చంద్రబాబు మనిషి కాబట్టి ఇక మన బతుకులు ఇంతే అని ఎండగట్టారు. నందికొట్కూరు సమీపంలోని మల్యాల వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని రాత్రి 9 గంటల ప్రాంతంలో జగన్ పరిశీలించారు.  రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘వైఎస్ చలవతోనే హంద్రీనీవా తొలిదశ పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 70 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు చంద్రబాబు నిధులు కేటాయించడం లేదు. వైఎస్ చలవవల్లే అనంతపురం దాకా తీసుకుపోయాం. ఈ నీళ్లు తీసుకునిపోడానికి కరెంటు బిల్లు ఎంత అయ్యింది అని ఇంజనీర్లను అడిగాను. కరెంటు బిల్లు రూ.272 కోట్లు అయ్యిందన్నారు. రూ.272 కోట్లు కరెంటు బిల్లు అయితే అందులో రూ.50 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. మరి చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఎంత కేటాయించారో తెలుసా?  రూ.200 కోట్లే!. ఈ నిధులు కరెంటు బిల్లులకూ సరిపోవు. అంటే ఈ స్థాయి నుంచి హంద్రీనీవా ప్రాజెక్టును చంద్రబాబు ముందుకు తీసుకుపోరు. హంద్రీనీవాలోని అన్ని పంపులూ బాగా పని చేస్తున్నాయా అని ఇంజనీర్లను అడిగితే బ్రహ్మాండంగా చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఎన్ని పంపులు పనిచేశాయని అడిగితే.. 4 పంపులన్నారు. మరి మిగిలిన 8 పంపులతోనూ పని చేయించి ఎక్కువ నీళ్లు తీసుకపోయి రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేయవచ్చు కదా అని అడిగాను. వాస్తవం ఏమిటంటే.. మొత్తం 12 పంపులు ఆన్ చేస్తే.. ఈ కెనాల్ తెగిపోతుంది. ఆ కాంట్రాక్టరు ఎవరు అంటే..  బాబు పార్టీకి చెందిన సీఎం రమేష్. ఆ కాంట్రాక్టర్ బాబు మనిషి కాబట్టి.. మన బతుకులు ఇంతే.’

అధైర్య పడొద్దు అండగా ఉంటాం..


అధైర్య పడొద్దు అండగా ఉంటాం..
  • ఆదుకుంటే సర్కార్‌కు సెల్యూట్ చేస్తాం... లేకుంటే పోరాటమే
  • వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
  • కరీంనగర్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని,  పదిరోజుల్లో ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.  ఈనెల 20 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ అకాల వర్షాల వల్ల తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టంపై చర్చిస్తామన్నారు. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నూటికి నూరుశాతం నష్టపరిహారం అందేలా ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలోని మల్యాల, చొప్పదండి, జగిత్యాల, వేములవాడ ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ తెలంగాణలోని ఏడు జిల్లాల్లో వరి, మామిడి, అరటి, పసుపు, నువ్వులు, జొన్న, సజ్జ పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అన్నదాతను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విపత్తులో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇచ్చేవారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వైఎస్ తరువాత వచ్చిన పాలకులెవరూ అన్నదాతకు అండగా నిలవడం లేదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 600 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైఎస్ మాదిరిగా అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. 10 రోజుల్లోగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించబోదన్నారు. 10 రోజుల్లో అన్నదాతను ఆదుకుంటే ప్రభుత్వానికి  సెల్యూట్ చేస్తామని... లేనిపక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడటంలో తామే ముందుంటామని స్పష్టం చేశారు.  పర్యటనలో పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు నల్లా సూర్యప్రకాష్‌రావు, గాదె నిరంజన్‌రెడ్డి, మతిన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి.రవీందర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ తదితరులు ఉన్నారు.

రూ.1000 కోట్ల భూ దందా!


రూ.1000 కోట్ల  భూ దందా!
► విద్యాసంస్థల స్థాపన పేరుతో జగ్గీ వాసుదేవ్‌కు నజరానా
► కారుచౌకగా త్రిలోచనాపురం అటవీ భూముల విక్రయానికి సిద్ధం
► ఇషా ఫౌండేషన్‌కు కట్టబెట్టేందుకు యత్నాలు
► ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్న మంత్రి గంటా
► కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడమే తరువాయి


నగర సమీపంలో రూ.1000 కోట్ల భూదందాకు రంగం సిద్ధమైంది. విద్యాసంస్థల స్థాపన పేరుతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు దగ్గరుండి మరీ ఈ తంతు నిర్వహిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ : వెయ్యి కోట్ల రూపాయల విలువైన అటవీ భూమిని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహం పన్నారు. ఇందుకు విద్యా సంస్థల స్థాపన పేరు సాకుగా చెబుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూమిని ఇందుకు ఎంచుకున్నారు. చదునైన భూమి కావడం, పచ్చని చెట్ల మధ్య ఉండడం, చల్లని వాతావరణానికి అనుకూలమైన ప్రాంతం కావడంతో ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు.

నాలుగు రోజుల కిందట పరిశీలన...
త్రిలోచనాపురంలోని అటవీ భూములను ఈ నెల 15న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బాబు.ఎ, అటవీ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్‌తో పాటు పలువురు రెవెన్యూ, అటవీ అధికారులు, యోగా గురువు జగ్గీ వాసుదేవ్ కలిసి పరిశీలించారు. వాసుదేవ్ ఈ భూమిని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గంటా ప్రకటించారు. ఆయన ఇషా ఫౌండేషన్ పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో పలు విద్యా సంస్థలు నడుపుతున్నారు.

విద్యా సంస్థలు కొత్త రాజధాని ప్రాంతానికి కావాలని, అందుకు వాసుదేవ్ ముందుకు వచ్చారని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఇంత మొత్తంలో స్థలం ఇస్తే కాలేజీలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. పైగా ఇషా ఫౌండేషన్ వారు పెడుతున్నది కొత్త కోర్సులేమీ కావు. లా కాలేజీ, ఎంబీఏ, సీఏ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్వయంగా వాసుదేవ్ చెప్పుకొన్నారు.

500 ఎకరాలు అప్పగించేందుకు ప్రతిపాదనలు...
ఇక్కడ చదునైన భూమి 400 ఎకరాలు ఉంది. మరో 100 ఎకరాలు కొండ ప్రాంత భూమి కలిపి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రి గంటా శ్రీనివాసరావు అటవీ భూమిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయించే పనిలో ఉండడంతో ఎలాగైనా వాసుదేవ్‌కు ఈ భూమిని అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. అటవీ భూముల్లో అనుమతుల్లేకుండా చెట్లు కొట్టకూడదు. త్రిలోచనాపురం అటవీ ప్రాంతంలో భూమిని మాత్రం పూర్తిస్థాయిలో చెట్లు కొట్టి చదును చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటే అటవీ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు.

ఎకరా రూ.2 కోట్లు...
ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఇబ్రహీంపట్నానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంది. ఇంత విలువైన భూమిని ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనేది సుస్పష్టమని పలువురు పేర్కొంటున్నారు.

ఇంకా ఫైనల్ కాలేదు -డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు
త్రిలోచనాపురంలోని అటవీ భూములను ప్రైవేటు వారికి ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు చెప్పారు. ఇషా ఫౌండేషన్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. మంత్రి, ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్లారని తెలిపారు. అటవీ భూములు తీసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని  వివరించారు.

కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయి

Written By news on Friday, April 17, 2015 | 4/17/2015


'కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పక్కకు పెట్టి.. పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రేమ కురిపిస్తున్నబాబుకు ఆ ప్రాజెక్టుతో భారీగా ముడుపులు ముడుతున్నాయని విమర్శించారు. శుక్రవారం రాత్రి వైఎస్ జగన్ చేపట్టిన బస్సుయాత్ర హంద్రీనీవా చేరుకుంది. అక్కడ హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఆయన..రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చంద్రబాబు అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. రూ.1600 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు అందుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకు రాలేదా? అని జగన్ ప్రశ్నించారు.
 
బాబుకు రాయలసీమపై నిజమైన ప్రేమే ఉంటే గాలేరు, నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు ముందు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును గాలికి వదిలేసిన బాబు.. ఇప్పడు రాయలసీమకు నీళ్లు అంటూ కొత్త రాగం అందుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని జగన్ నిలదీశారు. ఇంకా రూ.11 కోట్లు కేటాయిస్తే హంద్రీనీవా పూర్తవుతుందని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ దివంగత నేత వైఎస్సార్ హయాంలో హంద్రీనీవా రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. బాబు ఆ ప్రాజెక్టు రూ13 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. చంద్రబాబు ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయని జగన్ విమర్శించారు.
 
రాయలసీమ నీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ తపించారన్నారు. ఆయన హయాంలో 85 శాతం పనులు పూర్తయ్యాయని జగన్ తెలిపారు. నిధులు కేటాయింపులు ప్రస్తుత ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి రూ,1100కోట్ల కావాల్సి వస్తే.. చంద్రబాబు బడ్జెట్ లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రైతు రుణాలు మాఫీ సంగతి అటుంచితే.. వడ్డీలు కూడా ఇప్పటివరకూ మాఫీ కాలేదని.. చివరకు డ్వాక్రా మహిళలను కూడా బాబు మోసం చేశారని జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.  అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదామని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముగిసిన వైఎస్సార్ సీపీ ప్రాజెక్టుల బస్సుయాత్ర..
మూడు రోజుల పాటు సాగిన వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర ముగిసింది. ధవళేశ్వరం, పోలవరం,పట్టిసీమ, కృష్ణా బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల, పోతిరెడ్డి పాడు, హంద్రీనీవా ప్రాజెక్టులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు.ఈ యాత్రలో ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు


'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా వైఎస్ జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ఇక్కడ నీళ్లు ఇస్తానంటాడు.. అక్కడ నీళ్లు ఇస్తానంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సీమ ప్రజల కష్టాలు తీరుస్తానంటూ బాబు చెప్పే మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. గాలేరు - నగరి ప్రాజెక్టు గోవింద అవుతుదేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నిరర్థక ఆస్తులగా మారతాయని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం ఉండదన్నారు.
పట్టిసీమ ప్రాజెక్ట్ ను గోదావరి, కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని మైసూరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేయాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టులన్నీ చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పోలవరం కట్టండి... పట్టిసీమను ఆపండి... రాయలసీమను ఆదుకోండి అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బాబు సీమ ప్రాజెక్టులను విస్మరించారు: వైఎస్ జగన్


బాబు సీమ ప్రాజెక్టులను విస్మరించారు: వైఎస్ జగన్
కర్నూలు: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.  చంద్రబాబు నాయుడు గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు గుర్తుకురాలేదని వైఎస్ జగన్ అన్నారు.

ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ బృందం పోతిరెడ్డిపాడు చేరుకుంది. వైఎస్ జగన్ పోతిరెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్ తో మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్సు యాత్రకు బ్రహ్మరథం


బస్సు యాత్రకు బ్రహ్మరథం
♦ విజయవాడలో వైఎస్ జగన్ బస్సు యాత్ర
♦ ప్రకాశం బ్యారేజీ పరిశీలన
♦ ప్రాజెక్ట్ సందర్శనలో పాల్గొన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
♦ రాష్ట్ర అతిథి గృహంలో జగన్‌ను కలిసిన నేతలు
♦ జగన్ దృష్టికి సీతారామ కల్యాణమండపం వివాదం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రకు విజయవాడలో అపూర్వ స్వాగతం లభించింది. నగరంలోని రాష్ట్ర అతిథిగృహం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జననేత జగన్‌మోహన్‌రెడ్డికి అభివాదం చేశారు. అందరినీ ఆప్యాయంగా బస్సులో నుంచే పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు బస్సు యాత్రకు ముందు బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన బస్సు యాత్ర గుంటూరు మీదుగా ప్రకాశం జిల్లాకు చేరింది.

సాక్షి, విజయవాడ : బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరానికి బుధవారం రాత్రి చేరుకుని స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నగరానికి వచ్చారు. గురువారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జగన్‌మోహన్‌రెడ్డిని అతిథిగృహంలో కలిశారు. పలు ప్రజా సంఘాలు, మహిళలు, వివిధ సంఘాల నేతలు ఆయన్ని కలిసి తమ సమస్యలను విన్నవించారు. తొలుత పార్టీ ముఖ్యులతో జగన్‌మోహన్‌రెడ్డి కొంతసేపు సమావేశమయ్యారు.

అనంతరం ఆయన్ని బ్రాహ్మణ సంఘ నేతలు కలిశారు. సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణమండపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడ అనుసరిస్తూ మండపాన్ని స్వాధీనం చేసుకుందని, తమ పక్షాన పోరాడాలని కోరారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ మీ పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి స్థానిక నేతలు మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పలువురు నిరుపేద మహిళలు తమకు ఇళ్లు లేవని, పింఛన్లు రావటం లేదని తదితర సమస్యలు వివరించి ఆయన వినతిపత్రం అందజేశారు.

దీనికి ఆయన స్పందిస్తూ.. మీకు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ అండగా ఉండి మీ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసి సమస్యలను పరిష్కరిస్తారని మహిళలకు సూచించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి బందరురోడ్డు మీదుగా వంగవీటి రాధాకృష్ణ నివాసానికి చేరింది. అక్కడ తన కోసం వేచి ఉన్న పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్, ఫ్లైవోవర్ మీదుగా ప్రకాశం బ్యారేజీ సెంటర్‌కు చేరింది. ఈ సందర్భంగా అక్కడ వేలాది మంది జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అందరికీ అభివాదం చేస్తూ అందరినీ పలకరిస్తూ ఆయన ఎమ్మెల్యేల బృందంతో  ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నారు.

బ్యారేజీ పరిశీలన...
వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి బ్యారేజీ చరిత్రను ఆయనకు వివరించారు. బ్యారేజీ ఎప్పుడు నిర్మించారు, ఎంత నీటిని ఇక్కడ నిల్వ చేసే సామర్థ్యం ఉంది, ఎంత నీరు ఏటా సముద్రంలో కలుస్తుంది, దీని పరిధిలో ఎంత ఆయకట్టు ఉంది తదితర అంశాలు తెలిపారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడ రైతులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం వారధి మీదుగా గుంటూరు జిల్లా వైపు జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర సాగింది.

పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, గిడ్డి ఈశ్వరి, రవీంద్రనాధ్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, మహ్మద్ ముస్తాఫా, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చీర్ల జక్కిరెడ్డి, వరుపుల సుబ్బారావు, నారాయణ స్వామి, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు, కృష్ణాజిల్లా నేతల హాజరు...
కొలుసు పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, పూనూరి గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పేర్ని నాని, పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, మొండితోక జగన్మోహనరావు, మొండితోక అరుణ్ కుమార్, పుప్పాల రాంప్రసాద్, సామినేని ఉదయభాను, దూలం నాగేశ్వరరావు, కాజా రాజ్‌కుమార్, పార్టీ నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, ఆతుకూరి ఆంజనేయులు హాజరయ్యారు.

వైఎస్సార్‌సీపీ ‘స్థానిక’ ఎన్నికల పరిశీలకులు వీరే


వైఎస్సార్‌సీపీ ‘స్థానిక’  ఎన్నికల పరిశీలకులు వీరే
 హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న పలు నగరపాలక, పురపాలక సంస్థలకు వైఎస్సార్‌సీపీ.. ఎన్నికల పరిశీలకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు కార్పొరేషన్‌కు పార్టీ ఎంపీలు ైవె వీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, షేక్ మహ్మద్ ముస్తఫా, సామినేని ఉదయభాను, లేళ్ల అప్పిరెడ్డి, ఒంగోలుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, తిరుపతికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, కర్నూలుకు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కాకినాడకు మాజీ మంత్రి కొలుసు పార్థసార థి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పేర్ని నాని, చలమశెట్టి సునీల్, విశాఖపట్నానికి వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.

ఇక మున్సిపాలిటీలకు పరిశీలకుల విషయానికొస్తే శ్రీకాకుళంకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు, రాజాంకు ఎమ్మెల్యే కంబాల జోగులు, ఆర్వీఎస్‌కెకె రంగారావు (బేబి నాయన), నెల్లిమర్లకు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్, అనపర్తికి  ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కందుకూరుకు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, కాకాని గోవర్థన్‌రెడ్డి, రాజంపేటకు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.సురేష్‌బాబు (మేయర్) నియమితులయ్యారు. పరిశీలకులుగా నియమితులైన వారు అభ్యర్థుల ఎంపిక మొదలు, పార్టీ ప్రచార వ్యూహాలను, ఎన్నికలను పర్యవేక్షిస్తారు.  

రూ.30 వేల రుణానికి రూ.302 మాఫీ!

Written By news on Thursday, April 16, 2015 | 4/16/2015


రూ.30 వేల రుణానికి రూ.302 మాఫీ!వెలిగొండ ప్రాజెక్టు వద్ద రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
వెలిగొండ ప్రాజెక్టు(ప్రకాశం జిల్లా): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేయడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో   భాగంగా గురువారం రాత్రి  ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు టెన్నెల్ లోపలికి వెళ్లి  పరిశీలించిన అనంతరం  రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ తాను  30వేల రూపాయల రుణం తీసుకుంటే  302 రూపాయలు మాత్రమే మాఫీ అయినట్లు తెలిపారు.

చంద్రబాబు మాటలు నమ్మలేం అని రైతులు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు పోరాటం:వైఎస్ జగన్


ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు పోరాటం:వైఎస్ జగన్వెలిగొండ ప్రాజెక్టుని పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్న వైఎస్ జగన్
వెలిగొండ ప్రాజెక్టు(ప్రకాశం జిల్లా): సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు పోరాటం చేస్తామని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.  ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో   భాగంగా గురువారం రాత్రి ఆయన  ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు టెన్నెల్ లోపలికి వెళ్లి  పరిశీలించిన అనంతరం  వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు రైతులు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వహస్తాలతో వెలిగొండ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తీ అవుతుందా అని ఎదురు చూస్తున్నామని ఆవుల రెడ్డి అనే  రైతు చెప్పారు. సాగుకు నీరులేక పాలు అమ్ముకోని బతుకుతున్నట్లు తెలిపారు. వైఎస్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారని చెప్పారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. 1996లో ఎంపీ ఎన్నికల సమయంలో  చంద్రబాబు ఇక్కడకు వచ్చి శంకుస్థాపన చేశారన్నారు.  ఎన్నికల తరువాత ఈ ప్రాజెక్టు గురించి మర్చిపోయారు. 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం 13.5 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఏడాదికి కోటిన్నర రూపాయలు కూడా కేటాయించలేదు. ఈ ప్రాజెక్టుకు 4500 కోట్ల రూపాయలు కావలసి ఉండగా, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఉపయోగపడుతుంది. 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరాంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అయితే చంద్రబాబు మొన్నటి బడ్జెట్ లో 150 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. నామ మాత్రంగా నిధులు కేటాయిస్తూ రాయలసీమ అంటే ప్రేమ అని కపట నాటకం ఆడుతున్నరని ఆయన విమర్శించారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే నీరు 200 నుంచి 400 టీఎంసీల ఉంటుంది. గత ఏడు సంవత్సరాలుగా ఇలాగే జరుగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో నీరు సముద్రంలో కలుస్తున్నట్లు చెప్పారన్నారు. 60 నుంచి 80 రోజులు వరదలు వస్తాయి. జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలలో నీరు సముద్రంలో కలుస్తుంది. ఆ సమయంలోనే నీటిని నిల్వ చేయవలసిన అవసరం ఉందన్నారు. నీరు నిల్వ చేసే సామర్ధ్యం ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. నదులు వరదలుగా మారే సమయంలో నీటి నిల్వ కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని మన పెద్దలు నిర్ణయించారని చెప్పారు. దీని ద్వారా 200 టీఎంసీల నీరు  నిల్వ చేసి,  ఆ తరువాత కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వవచ్చుని తెలిపారు. ఇటువంటి పోలవరం ప్రజెక్టుని వదిలి, పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని చెప్పారు. కాం ట్రాక్టర్ల నుంచి డబ్బు గుంజుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్టు మొదలు పెట్టారని విమర్శించారు. ఆ ప్రాజెక్టు  టెండర్ నిబంధనలు కూడా వారికి అనుకూలమైనవారికి, అనుకూలంగా  ఉండేవిధంగా రూపొందించారని చెప్పారు.  ఆ కాంట్రాక్టర్లు అదనంగా కోట్ చేసినా,  ఆ అదనపు డబ్బుని కూడా బోనస్ గా ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు 1600 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లు తెలిపారు.

పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు


'పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు'
విజయవాడ : పట్టిసీమ ప్రాజెక్టుతో సీఎం చంద్రబాబు నాయుడుకు రూ. 300 కోట్ల ముడుపులు అందుతున్నాయని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద పర్యటించి, ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుని.. అనంతరం రైతులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే...

''ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం ఎంతని ఇంజనీర్లను అడిగితే 3 టీఎంసీలని చెప్పారు. అంటే, దానర్థం.. గోదావరి నది నీటిని ఇక్కడకు మళ్లిస్తే పట్టిసీమ దగ్గరనుంచి ప్రకాశం బ్యారేజి వరకు ఎక్కడా కనీసం నీళ్లు నిల్వచేసే సామర్థ్యం కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడి నుంచి నీళ్లు ఎన్ని రోజులు సముద్రంలో కలుస్తాయని అడిగాను. కృష్ణానది మాత్రమే గత ఏడేళ్లుగా దాదాపు 80-90 రోజులు పొంగుతోంది, సముద్రంలోకి నీళ్లు కలుస్తాయని చెప్పారు. ఈ నీళ్లు కలిసేది కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రమే. నిన్న ధవళేశ్వరం, పోలవరం దగ్గర అడిగితే.. అక్కడ కూడా ఇంచుమించు ఇదే నెలల్లోనే నీళ్లు సముద్రంలో కలుస్తాయన్నారు. రెండు నదులూ కూడా ఇంచుమించు ఒకే సమయంలో పొంగుతాయ. మన రుతుపవనాల కాలంలోనే నదులు పొంగి సముద్రంలోకి కలుస్తాయి. రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలంటే ఆ నదులు సముద్రంలో కలిసే సమయంలో.. నీళ్లు నిల్వచేసుకుని, తర్వాత వరద అయిపోయాక అవేనీళ్లు వాడుకునే ప్రాజెక్టే.. పోలవరం ప్రాజెక్టు. అక్కడ 124 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వరద తగ్గిన తర్వాత కూడా కుడికాల్వ ద్వారా 80 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా విశాఖ ప్రాంతానికి సుమారు 24 టీఎంసీల నీళ్లు ఇస్తుంది. అలాంటి ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజిలో పడేసే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సిన పనిలేదు, పనులు మొదలైతే చాలని అంటున్నారు. పట్టిసీమ మొదలైతే 35 టీఎంసీల నీళ్లు మనకు రాకుండా పోతాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు పంపకుండా కట్టడి చేసే ప్రమాదం ఉందని తెలిసికూడా కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడానికే పట్టిసీమను చేపడుతున్నారు. పక్కనే పులిచింతల ప్రాజెక్టు ఉంది. దీని పనులు వైఎస్ఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. దానికి చంద్రబాబు తొమ్మిదేళ్లలో కేవలం 24 కోట్లు మాత్రమే కేటాయించారు. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తిచేశారు. దానికి మరో 290 కోట్లు మాత్రమే అవసరం. అది పూర్తయితే 40 టీఎంసీల నీళ్లు నిల్వచేసుకోవచ్చు. అలాంటి ప్రాజెక్టుకు చంద్రబాబు కేటాయించింది కేవలం 20 కోట్లు మాత్రమే. ఈ 290 కోట్లలో భూసేకరణకు, ఆర్అండ్ఆర్ కు 170 కోట్లు అవసరం అవుతాయి. కృష్ణానది నుంచి 200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి. సగటున 80-90 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుంది. పట్టిసీమను ఏడాదిలో పూర్తిచేయాలని టెండర్లు పిలిచారు. చివరకు కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లను మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చేశారు. వాళ్లిద్దరూ కూడా 21.9 శాతం ఎక్సెస్ కు కోట్ చేశారు. మళ్లీ అందులో 5 శాతం ఎక్సెస్, మరో 16.9 శాతం బోనస్ గా ఇస్తామని చెప్పారు. పట్టిసీమ వల్ల చంద్రబాబుకు 300 కోట్ల ముడుపులు అందుతున్నాయి. వాటి కోసం చంద్రబాబు రాష్ట్ర రైతాంగాన్ని హోల్ సేల్ గా అమ్మేస్తున్నారు. రాయలసీమపై చంద్రబాబు కపటప్రేమ చూపిస్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా.. కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం రాయలసీమ పేరును వాడుకుంటున్నారు.''

చుక్క నీరు రాకముందే.. 70 టీఎంసీలు కోల్పోతాం.


  • వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
  • ఏడాదికి రూ. 4,000 కోట్ల పనులు చేస్తే పూర్తయ్యే పోలవరానికి బాబు సర్కారు 11 నెలల్లో రూ. 100 కోట్ల పనులే పూర్తి చేసింది
  • పోలవరాన్ని విస్మరిస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు
  • ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పాలి
  • పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోతుంది
  • పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తామన్న మాటల్లో వాస్తవం లేదు
  • జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే రాయలసీమపై బాబు బూటక ప్రేమ
  • పట్టిసీమలో రచ్చబండలో రైతులతో ముఖాముఖిలో జగన్ ధ్వజం
  • పార్టీ ప్రజాప్రతినిధులతో కలసి పోలవరాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు.. గోదావరి డెల్టా రైతులకు అండగా ఉంటామని భరోసా
  • పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోతుంది
  • గోదావరి నుంచి చుక్క నీరైనా కృష్ణా డెల్టాకు చేరకముందే 70 టీఎంసీల కృష్ణా నికర జలాలను రాష్ట్రం కోల్పోయే ప్రమాదముంది
  • 21.9 శాతం ఎక్కువకు టెండరు కోట్ చేసిన పట్టిసీమ కాంట్రాక్టరుకు..
  • ఏడాదిలో పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్ హామీ డబ్బులెత్తే కార్యక్రమమే
 ‘‘పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని గోదావరి డెల్టాకు రెండో పంటకు నీళ్లు ఇచ్చుకునే వెసులు బాటు ఉన్నపుడు పట్టిసీమ వల్ల ఏం ప్రయోజనం ఉందో అర్థం కావడం లేదు? నిల్వ సామర్థ్యం లేని పట్టిసీమ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోవడం ఖాయం. రెండో పంటకు నీళ్లు అందకపోతే భూములు ఉప్పుతేలి చౌడుబారతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే పట్టించుకునే స్థితిలో బాబు లేరు. ... గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చింది కాబట్టి 35 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా కుడికాల్వకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న 80 టీఎంసీల్లో మరో 35 టీఎంసీలు.. మొత్తం 70 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్రానికి దక్కే కృష్ణా నికర జలాల నుంచి తీసుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే.. గోదావరి నుంచి చుక్కనీరు కృష్ణా డెల్టాకు చేరకముందే.. 70 టీఎంసీల కృష్ణా నికర జలాలను ఎగువ రాష్ట్రాలకు కోల్పోయే ప్రమాదం ఉంది.’’

సాక్షి, విజయవాడ బ్యూరో: కాంట్రాక్టర్ల ద్వారా దక్కే కోట్ల రూపాయల కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని.. రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా ముందుకు పోతున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలవరం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరితే.. పట్టిసీమ వల్ల కాంట్రాక్టర్ల ద్వారా లబ్ధి పొందే చంద్రబాబుకు మాత్రమే ప్రయోజనమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు.

చంద్రబాబుకు బుద్ధొచ్చేలా పట్టిసీమపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగానే ప్రాజెక్టుల యాత్ర చేపట్టామని చెప్పారు. జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ సర్ అర్థర్ కాటన్, వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంత రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు పట్టిసీమ రేవు దగ్గర ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు.

డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోతుంది...
పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా పట్టిసీమను భుజాన వేసుకోవడం వెనుక బాబు ధనార్జన దాగి ఉందని ధ్వజమెత్తారు. పట్టిసీమపై పెట్టిన శ్రద్ధలో పదో వంతైనా పోలవరంపై పెడితే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని పేర్కొన్నారు. ఏడాదికి రూ. 4,000 కోట్ల పనులు చేస్తే పూర్తయ్యే పోలవరం పనులను చంద్రబాబు ప్రభుత్వం 11 నెలల్లో రూ. 100 కోట్ల పనులే పూర్తి చేసిందని.. దీన్నిబట్టి పోలవరంపై బాబుకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందని విమర్శించారు. నెలనెలా పోలవరం గడువును పెంచుతూ పోతున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తే భవిష్యత్తులో చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని గోదావరి డెల్టాకు రెండో పంటకు నీళ్లు ఇచ్చుకునే వెసులు బాటు ఉన్నపుడు పట్టిసీమ వల్ల ఏం ప్రయోజనం ఉందో అర్థం కావడం లేదని జగన్ పేర్కొన్నారు. నిల్వ సామర్థ్యం లేని పట్టిసీమ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోవడం ఖాయమన్నారు.

చుక్క నీరు రాకముందే.. 70 టీఎంసీలు కోల్పోతాం...
‘‘గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లభించిన వెంటనే, కుడికాల్వకు ఎప్పుడు నీటిని మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా.. 80 టీఎంసీల్లో 35 టీఎంసీల కృష్ణా నీటిని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వాడుకొనే స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా 7(ఎఫ్) ప్రకారం.. కుడికాల్వకు మళ్లించే 80 టీసీఎంలకు అదనంగా మళ్లించే నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అదనంగా మళ్లించే నీటిలోనూ 7(ఇ)లో పేర్కొన్న దామాషా ప్రకారం వాటా పొందే హక్కు ఎగువ రాష్ట్రాలకు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే.. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చింది కాబట్టి 35 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా కుడికాల్వకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న 80 టీఎంసీల్లో మరో 35 టీఎంసీలు.. మొత్తం 70 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్రానికి దక్కే కృష్ణా నికర జలాల నుంచి తీసుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే.. గోదావరి నుంచి చుక్కనీరు కృష్ణా డెల్టాకు చేరకముందే.. 70 టీఎంసీల కృష్ణా నికర జలాల్ని ఎగువ రాష్ట్రాల కు కోల్పోయే ప్రమాదం ఉందని’’ ఆందోళన వ్యక్తంచేశారు.

టెండర్లలోనూ డబ్బులెత్తే మోసమే...
పట్టిసీమ టెండర్లలోనూ మోసాలే జరిగాయని జగన్ దుయ్యబట్టారు. కేవలం ఇద్దరే ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారనీ, దగ్గరుండి మిగతా కాంట్రాక్టర్లు రాకుండా భయపెట్టారని ధ్వజమెత్తారు. 21.9 శాతం ఎక్కువకు టెండరు కోట్ చేసిన పట్టిసీమ కాంట్రాక్టరుకు.. ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తే 16.9 శాతాన్ని బోనస్‌గా ఇస్తామని సర్కారు హామీ ఇవ్వడం మమ్మూటికీ డబ్బులెత్తే కార్యక్రమాన్ని తేటతెల్లం చేస్తోందని వివరించారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదన్నారు. మిగిలి ఉన్న పోలవరం కుడికాల్వ పనులు, 1,800 ఎకరాల భూ సేకరణ, రామిలేరు, తమ్మిలేరు వాగులపై ఆక్విడెక్టుల నిర్మాణం వంటి మేజర్ పనులకే రెండేళ్ల సమయం పడుతుందన్నారు.

గోదారి ఎడారే..
గోదావరి మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే 70 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తారని, పట్టిసీమ ద్వారా మరో 8,500 క్యూసెక్కుల నీటిని తోడితే.. మొత్తం 80 వేల క్యూసెక్కుల నీటిని తోడినట్లువుతుందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వివరించారు. వరద లేనప్పుడు గోదావరిలో 5,000 క్యూసెక్కుల ప్రవాహమే ఉంటుందని.. అలాంటపుడు భారీగా నీరు తోడిస్తే గోదారి ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుడికాల్వ ద్వారా పారి శ్రామిక అవసరాలకు నీరిస్తామని బాబు ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమరు. ఇది తప్పకుండా చంద్రబాబు నీటిచౌర్యమేనని, మన ఇళ్లల్లో దొంగలు పడితే ఎలా కాచుకుంటామో, ఇప్పు డూ నీటి దొంగను కాచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడం వైఎస్ పుణ్యమేనని చెప్పారు. గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమను సంఘటితంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు తెల్లం బాలరాజు, కారుమూరు నాగేశ్వరరావు, రైతు సంఘం నేత త్రినాథరెడ్డి తదితరులు ప్రసంగించారు.

సీమపై కపట ప్రేమ...
జగన్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే రాయలసీమకు నీరంటూ ప్రభుత్వం లేనిపోని ప్రేమను ఒలకబోస్తోందని ఆయన విమర్శించారు. ‘‘వాస్తవంగా సీమకు నీరిచ్చే వారైతే పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న పెండింగ్ పనులకు ఇప్పటి వరకూ దమ్మిడీ ఖర్చు పెట్టలేదేం?’’ అని ప్రశ్నించారు. గాలేరు - నగరి ప్రాజెక్టుకు వాస్తవంగా రూ. 2,600 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో కేవలం రూ. 169 కోట్లు కేటాయించడం ఏమిటని జగన్ అడిగారు. రూ. 5,800 కోట్లతో పూర్తి చేయాల్సిన హంద్రీ - నీవా ప్రాజెక్టుకు 9 ఏళ్ల చంద్రబాబు హయాంలో కేవలం రూ. 13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారనీ, మిగతా పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుతం రూ. 1,100 కోట్లు అవసరమైతే, బడ్జెట్‌లో కేవలం రూ. 200 కోట్లు కేటాయించారని ఎండగట్టారు. దీన్నిబట్టి సీమపై ప్రేమ ఏపాటిదో ప్రజలకు తెలుస్తూనే ఉందన్నారు. అసలు పట్టిసీమకు కేటాయింపులను బడ్జెట్‌లో చూపనే లేదన్నారు. పట్టిసీమకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన జీవోలో రాయలసీమ గురించి కనీస ప్రస్తావన కూడా లేదని, రైతుల పేరూ లేదని పేర్కొన్నారు. రుణ మాఫీ సంగతెలాగున్నా వడ్డీ మాఫీ కూడా జరగలేదని.. కానీ రైతులు, డ్వాక్రా మహిళలకు అన్నీ చేసేశాననీ, అందుకే శాలువాలు కప్పుతున్నారని బాబు సంబరపడిపోవడం విస్మయం కలిగిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు.

పట్టిసీమతో మాకు కష్టాలే
విపక్ష నేతవద్ద గోడు వెళ్లబోసుకున్న రైతులు
పట్టిసీమ నుంచి సాక్షి ప్రతినిధి: బస్సుయాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పట్టిసీమకు చేరుకున్నారు. రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రతిపక్ష నేతకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రెండో పంటకు నీళ్లందవు
పోలవరం వస్తే ఉభయగోదావరి జిల్లాలకు సాగు, తాగు నీరు సమృద్ధిగా అందుతాయి. రెండో పంటకూ పుష్కలంగా నీరొస్తుంది. పట్టిసీమ ఎత్తిపోతల వల్ల రెండోపంటకు నీళ్లందవు. కయ్యల్లో ఉప్పు తేలుతుంది. అలా జరిగితే మా భూములు సాగుకు పనికిరావు.    - రామకృష్ణ, ఉంగుటూరు నియోజకవర్గం

గోదావరి డెల్టా రైతుల పొట్ట కొట్టినట్టే
నాకు ఐదెకరాల పొలం ఉంది. సీలేరు నుంచి వస్తున్న నీరు రెండోపంటకు చాలడం లేదు. పట్టిసీమ ప్రాజెక్టుకట్టి ఉన్న ఈ కాసిని నీళ్లూ తీసుకెళితే.. గోదావరి డెల్టా రైతుల పొట్టగొట్టినట్లే. ఉభయగోదావరి ఎమ్మెల్యేలకు సిగ్గుంటే.. పట్టిసీమను ఆపండి.     - శ్రీనివాస్, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా

కడదాకా పోరాడతాం
ఎత్తిపోతల పథకం కావాలా? ఎత్తుకొనిపోయే మూటలు కావాలా చంద్రబాబూ? రాయలసీమను రతనాలసీమ చేస్తానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను కరువు సీమగా మార్చడం మాత్రం నిజం. తుది వరకు పోరాడి పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటాం.
     - రామచంద్ర, బంగారంపేట, పట్టిసీమ

సరైన పద్ధతి కాదు
 పట్టిసీమ జీవో బూటకం. 11 మీటర్ల వద్ద ఫుట్‌వాల్వ్ వేసి నీటిని లిఫ్ట్ చేస్తే ధవళేళ్వరం వద్ద నిల్వ ఉన్న 3 టీఎంసీల నీటిలో 2.5 టీఎంసీల నీటిని తోడేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు.
 - రాజేశ్వరరావు, రిటైర్డ్ ఈఎన్‌సీ

ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి


వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ప్రకాశం బ్యారేజిని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడనున్న సందర్భంగా ముందుగానే అక్కడికి వచ్చిన ఆర్కే.. మీడియాతో మాట్లాడారు.

రైతులు, ప్రజలు ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మొండిగా వెళ్తున్న ప్రభుత్వ వైఖరిని రైతులు తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు ఏదో పోలవరం ప్రాజెక్టుపై పెడితే కాస్త ఉపయోగం ఉంటుందని, దాన్ని త్వరగా పూర్తిచేస్తే అన్ని ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుందని అక్కడున్న రైతులు కూడా అభిప్రాయపడ్డారు.

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్

Written By news on Wednesday, April 15, 2015 | 4/15/2015


జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే జూన్ లేదా జూలైలో పవిత్రస్థలం జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేం వెళ్లేందుకు వైఎస్ జగన్ కోర్టు అనుమతి కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

ఎత్తిపోతలా.. ఎత్తుకుపోయే డబ్బు మూటలా?


ఎత్తిపోతలా.. ఎత్తుకుపోయే డబ్బు మూటలా?
పట్టిసీమ : 'ప్రాజెక్టుల బాట' లో భాగంగా బుధవారం సాయంత్రం పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత రైతులతో సమావేశమయ్యారు. రాష్ట్రమంతటికీ మేలుచేసే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి పట్టిసీమకు ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును జగన్ కు మొరపెట్టుకున్నారు. 'మీరు వస్తే న్యాయం జరుగుందని' నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


పట్టిసీమ ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన రైతు రామకృష్ట మాట్లాడుతూ బహుళార్థ ప్రాజెక్టు పోలవరాన్ని వదిలి పట్టిసీమను ముందుకు తేవడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాల్ని వివరించారు. 'పట్టిసీమ ప్రతిపాదన దశ నుంచే ఆందోళనలు నిర్వహిస్తున్నాం. నవంబర్ 15 నుంచి మార్చి 15 వరకు దీక్ష కూడా చేశాం. ఎవరెన్నిరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టిసీమ ప్రాజెక్టు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. నిజానికి ఇది పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకాదు.. డబ్బుల మూటలు ఎత్తుకుపోయే ప్రాజెక్టు' అంటూ రామకృష్ణ.. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృద్ధరైతు తైలం రాంబాబు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వకముందే భూమిని వదులోకోవాల్సిందిగా కలెక్టర్ తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. 'ఏది అడిగినా ఆర్డినెన్స్ ఉందంటున్నారు. రెండు మూడు నెలలదాకా మీకు డబ్బులు రావని చెబుతున్నారు. అలాంటప్పుడు డబ్బులిచ్చిన తర్వాతే భూములు అడగాలి కానీ, ముందే లాక్కోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుంది. న్యాయం కోసం మూడు నెలలనుంచి దీక్షలు చేస్తున్నాం' అంటూ వేధింపుల పర్వాన్ని చెప్పారు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించనున్న వైఎస్ జగన్


ప్రకాశం బ్యారేజీని పరిశీలించనున్న వైఎస్ జగన్
పట్టిసీమ : రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు తలపెట్టిన ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం బ్యారేజిని పరిశీలించనున్నారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టు వద్దకు వెళతారు.

'పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీని పరిశీలించిన పిదప స్థానిక రైతులతో వైఎస్ జగన్ సమావేశమవుతార'ని వైఎస్సార్ సీసీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మూడురోజుల పాటు సాగే ప్రాజెక్టుల బాటలో తొలిరోజు (బుధవారం) ధవళేశ్వరం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతాల్ని వైఎస్ జగన్ బృందం సందర్శించింది.  స్థానిక రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వెళ్లగక్కుతూ సీఎం చంద్రబాబు తీరును నిరసించారు.

పోలవరం పూర్తైపోయిందంటాడేమో!


పోలవరం పూర్తైపోయిందంటాడేమో!
పోలవరం : 'ప్రాజెక్టుల బాట'లో భాగంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. నిర్మాణం పనులపై అధికారులను ప్రశ్నించారు. గడిచిన 11 నెలల కాలంలో కేవలం రూ.100 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే జరిగాయని అధికారులు వైఎస్ జగన్ కు వివరించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజి లోకి నెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని,  కాసుల కోసం పట్టిసీమ ప్రాజెక్టును మాత్రం పరుగెత్తిస్తోందని విమర్శించారు. 'మ్యానిఫెస్టోలో మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న బాబు.. ఆ మధ్య నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇప్పుడేమో ఐదేళ్లని అంటున్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తారా లేదా' అని వైఎస్ జగన్ మండిపడ్డారు. దీంతో పక్కనే ఉన్న కొందరు.. 'ఐదేళ్లు కాదు సార్.. మీరు ప్రశ్నించకుంటే బాబుగారు పోలవరం పూర్తయిందని ప్రకటించేవారే' అనడంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్, అధికారుల మధ్యజరిగిన సంవాదం ఇది..


వైఎస్ జగన్: పనులు జరుగుతున్నాయ్?
అధికారులు: ఫర్వాలేదు సార్.. బాగానే నడుస్తున్నాయి.

వైఎస్ జగన్: పని ఏమేరకు పూర్తయింది?
అధికారులు: గడిచిన 11 నెలల్లో రూ.100 కోట్లతో దాదాపు కోటిన్నర క్యూబిక్ మీటర్ల నిర్మాణం జరిగింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం మరో 100 కోట్లు వెచ్చించాం.

వైఎస్ జగన్: అదేంటి? 16 వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టులో  సంవత్సరానికి కనీసం 4 వేల కోట్ల రూపాయల పని పూర్తికావాలికదా!
అధికారులు: మీరన్నది నిజమేసార్.. కానీ ఆర్ ఆర్ ప్యాకేజీపై స్పష్టత రాలేనందున జాప్యం జరుగుతోంది!

వైఎస్ జగన్: అదేంటి? పట్టిసీమ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రెండు రోజుల్లో ప్రకటించారు. మరి పోలవరం విషయంలో మాత్రం ఇంత దారుణమా?

ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం


'ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం'
రాజమండ్రి: దివంగత మహానేత వైఎస్సార్ చేపట్టిన ఆరికరేవుల ఎత్తిపోతల ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తామని ఆయన హామీయిచ్చారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో జగన్ మాట్లాడారు.

5 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో ఆపేసిందని జగన్ కు అన్నదాతలు ఫిర్యాదు చేశారు.  9 ఎకరాల భూసేరణకు రూ. 4.5 కోట్లు సిద్ధంగా ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో చేపట్టినందునే ఈ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపించారు. బస్సుయాత్రలో జగన్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా


సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా
విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీ పురంలో ఐటీడీఏ సమావేశం బుధవారం ఉదయం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అధికారపక్షాన్ని పలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ సమావేశాలప్పుడు మాత్రమే ఎమ్మెల్యే గుర్తొస్తున్నారని అధికార పక్షాన్ని విమర్శించారు. పర్నీచర్ కొనుగోలు టెండర్ల విషయాన్ని సభ్యులకు ఎందుకు తెలపలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి. శ్రీవాణి కూడా ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టారు. గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్ స్కూల్ విధానంతో డ్రాప్‌అవుట్ శాతం పెరుగుతుందని ఆమె కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు తెలిపారు. రాష్ట్ర మంత్రి మృణాళిని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్ స్కూల్ విధానాన్ని అమలు చేయకుండా చూడాలని సూచించారు.
(పార్వతీపురం)

పట్టిసీమకు బయల్దేరి వెళ్లిన వైఎస్ జగన్


వీడియోకి క్లిక్ చేయండి
రాజమండ్రి : కాటన్ బ్యారేజి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభమైంది. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి ప్రాంతానికి చేరుకున్నారు.
(ప్రాజెక్టుల యాత్ర ప్రారంభం)

అక్కడ ఆయన సర్ ఆర్థర్ కాటన్, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పట్టిసీమ ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు బస్సు యాత్రలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పలువురు ఉన్నారు.

వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర ప్రారంభం


వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర ప్రారంభంవీడియోకి క్లిక్ చేయండి
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తన బస్సు యాత్రను బుధవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాదద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వెళ్లారు.

ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.

పోటెత్తిన అభిమానం


పోటెత్తిన అభిమానం
♦ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం
♦ రేణిగుంట నుంచి నెల్లూరు జిల్లా వరకు జై జగన్ నినాదాలు
♦ రెపరెపలాడిన వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు
♦ శ్రీకాళహస్తిలో అంబేద్కర్‌కు జగన్ నివాళి
♦ ఆత్మీయ కరచాలనం కోసం ఎగబడ్డ జనం


వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హజరుకావడానికి ఆయన రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయ ప్రాంగణం జగన్‌మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడింది. రేణిగుంట నుంచి నెల్లూరు వరకు మార్గంలో ఆయనను చూసేందుకు రోడ్లపై జనం బారులు తీరారు.

తిరుపతి మంగళం/శ్రీకాళహస్తి/రేణిగుంట : మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆది మూలం, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆప్కో డెరైక్టర్ మిద్దెలహరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుక్షుడు ఆదికేశవులు రెడ్డి, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు బి.మమత స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి బాలకృష్ణయ్య, మైనారిటీసెల్ కార్యదర్శి షేక్ సిరాజ్‌బాషా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్‌రెడ్డి, బీరేంద్రవర్మ, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్‌కే.బాబు, మల్లం రవిచంద్రారెడ్డి, కొమ్ము చెంచయ్యయాదవ్, ఈశ్వర్‌రెడ్డి, పీ.అమరనాథ్‌రెడ్డి, కేతం జయచంద్రారెడ్డి(రామారావు), బొమ్మగుంట రవి, కట్టా గోపీయాదవ్, వెంకటేష్, తాల్లూరి ప్రసాద్, సుబ్బు, పుణీత, గీతాయాదవ్, పుష్పలత, సాయికుమారి, లక్ష్మి, మిట్టపల్లె జీవరత్నం రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్లకార్డులతో ప్రత్యేక స్వాగతం
విమానాశ్రయం వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు శ్రీరాములు, బాలరాజు, రఘు, మస్తాన్, సుభాన్ ప్లకార్డులతో ప్రత్యేకంగా స్వాగతం పలికారు.

బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో..
శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు రేణిగంట విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ఏర్పేడులో జగనన్నను చూడడం కోసం పెద్దసంఖ్యలో  తెల్లవారుజాము నుంచే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ సర్కిల్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలితో నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజ్యంగ నిర్మాతగా బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిదన్నారు.

పార్టీ జిల్లా అధికారప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు అంబేద్కర్  జీవిత చరిత్ర పుస్తకాన్ని జగన్‌మోహన్ రెడ్డికి అందజేశారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు, పట్టణ  వుున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, పట్టణ అధ్యక్షుడు కొట్టెడి వుధుశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గువ్ముడి బాలకృష్ణయ్యు 52 వుంది సద్గురువులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు.  అప్పటికే పెద్దసంఖ్యలో ఏపీసీడ్స్ సర్కిల్ వద్దకు చేరుకున్న పార్టీ అభిమానులు జై జగన్.. జైజై జగన్ అంటూ  నినాదాలు చేశారు. పలువురు రుణాల మాపీ.. నత్తనడకన సాగుతున్న మన్నవరం ప్రాజెక్టు అంశాలను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. పలువురు నేతలు ఆయనను సన్మానించారు.

Popular Posts

Topics :