19 April 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్‌సీపీ అమెరికా శాఖకు కొత్త కమిటీ

Written By news on Saturday, April 25, 2015 | 4/25/2015

నలుగురు కన్వీనర్లు, నలుగురు అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతోపాటు ఆరుఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా (ఎన్నారై) శాఖకు కొత్త కమిటీని నియమించారు. ఇందులో మొత్తం స ఉప ప్రాంతీయ కమిటీలతో కూడిన కొత్త కమిటీకి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మధులిక సీ, గురువారెడ్డి పుణ్యాల, రత్నాకర్ పండుగాయల, రాజశేఖర్ కేశిరెడ్డిలు కమిటీ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. డాక్టర్ రాఘవరెడ్డి (డల్లాస్), ర మేష్ వల్లూరు, డాక్టర్ రాఘవరెడ్డి (ఫిలా), చప్పిడి విజయభాస్కర్‌లు అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
 
 రామి.ఆర్. ఆళ్ల (నార్త్ ఈస్ట్), రమేష్ వల్లూరు (మిడ్ అట్లాంటిక్), డాక్టర్ వాసుదేవ నలిపిరెడ్డి (సౌత్), హరిప్రసాద్ లింగాల( మిడ్ వెస్ట్), సురేంద్ర బత్తినపట్ల (సెంట్రల్), పవన్ నారం (వెస్ట్)లను అమెరికాలో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన ఆరు ప్రాంతీయ కమిటీలకు ఇన్‌చార్జులుగా నియమించారు. ఎనిమిది మందితో ఏర్పాటు చేసిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సుబ్బారెడ్డి చింతగుంట, డాక్టర్ రామి. ఆర్. బూచిపూడి, డాక్టర్ ధనుంజయ గడ్డం, రంగరాజు ఓంకారం, శ్రీనివాస్ వంగాల, రాజశేఖర్ చప్పిడి, విశ్వనాథ్ కిచ్చిల, డాక్టర్ దర్గా నాగిరెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. నార్త్ ఈస్ట్ ప్రాంతీయ కోర్ టీంలో 25, మిడ్ వెస్ట్ ప్రాంతీయ కోర్ టీంలో ఎనిమిది, సెంట్రల్ ప్రాంతీయ కోర్ టీంలో ఎనిమిది, వెస్ట్ ప్రాంతీయ కోర్‌టీంలో 16, మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ కోర్ టీంలో 14, సౌత్ ప్రాంతీయ కోర్‌టీంలో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు.

ముడుపులు తీసుకుని రాయితీలు: అంబటి


ముడుపులు తీసుకుని రాయితీలు: అంబటి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ హామీల అమలుకు నిధుల్లేవని చెప్పే సీఎం చంద్రబాబు.. ముడుపులు ముట్టే చోట మాత్రం వేల కోట్లు నిధులిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాక మార్చిలో పారిశ్రామికవేత్తలకు రూ. 2,060 కోట్లు రాయితీ రూపేణా చెల్లించారన్నారు. ఆ రాయితీ పొందిన వారిలో 99 శాతం మంది నిత్యం బాబు చుట్టూ ఉండే వారు, టీడీపీకి అనుకూలురేనన్నారు. ఈ రాయితీల్లో రూ. 600-700 కోట్లు చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు ముడుపులుగా ముట్టాయనే ప్రచారం పారిశ్రామికవర్గాల్లో జోరుగా సాగుతుందన్నారు. పరిశ్రమలకు రాయితీలివ్వడాన్ని వ్యతిరేకించడంలేదని, అయితే ఎన్నికల హమీలను పక్కన పెట్టి ముడుపులు వచ్చే చోటే నిధులు కేటాయిస్తున్న తీరును తప్పుపడుతున్నామని అంబటి పేర్కొన్నారు.
 
 భూ కేటాయింపులోనూ ఇదే తంతు
 పరిశ్రమలకు, రాజధాని, ఎయిర్‌పోర్టు అంటూ రైతుల నుంచి వేలాది ఎకరాలు లాక్కుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. యోగా గురువులకు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెడుతోందని మండిపడ్డారు. యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు 400 ఎకరాలు కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబుది ఎక్కడి మాట అక్కడ మాట్లాడే నైజమని, మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఆయన మాటలే అందుకు నిదర్శనమని అంబటి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు తానే మొదటి లేఖ రాశానని తెలంగాణలో చెప్పిన బాబు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమంటున్నారని అంబటి దుయ్యబట్టారు.
 
 ‘హోదా’ రాకపోవడం బాబు వైఫల్యమే
 ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా చెప్పడం దురదృష్టకరమని అంబటి వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ ప్రకటనతో చంద్రబాబు, టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోవడంలో బాబు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోరినా.. కేంద్రం తప్పనిసరిగా ఇస్తుందని చంద్రబాబు మాయ మాటల చెప్పి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే టీడీపీ- బీజేపీకి ఓటు వేయాలని ఎన్నికల సమయంలో ప్రతి సందులో ప్రచారం చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ వైఫల్యం చెందిందా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ఇందులో చంద్రబాబు సఫలమయ్యారని, జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారన్నది మీ ఉద్దేశమైతే తామీ జవాబు చెప్పగలమని బదులిచ్చారు.

శోభమ్మను ఎప్పటికీ మరువలేం


శోభమ్మను ఎప్పటికీ మరువలేం
 ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు
 శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో వైఎస్ జగన్
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ శోభా నాగిరెడ్డి ముందుండేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శోభాఘాట్ వద్ద శుక్రవారం నిర్వహించిన దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం.. ప్రత్యేకంగా తయారు చేయించిన శోభా నాగిరెడ్డి విగ్రహాలు రెండింటిని వైఎస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు ఆవిష్కరించారు. అలాగే శోభానాగిరెడ్డిపై రచించిన పాటల సీడీని కూడా జగన్ ఆవిష్కరించారు. వర్ధంతి సభలో జగన్ మాట్లాడుతూ ఎండలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది ఇక్కడకు వచ్చారని.. అభిమానం ఉంటే దేనినీ ఖాతరు చేయరని, సమస్యలను లెక్కపెట్టరని ఇక్కడికొచ్చిన అభిమానుల్ని చూస్తే అర్థమవుతోందన్నారు. భూమా కుటుంబానికి మేమందరం తోడుగా ఉన్నామని ఇక్కడికొచ్చిన ప్రతి స్వరం చెబుతోందన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు 65 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలం మేనమామలుగా తోడుగా ఉంటామన్నారు.శోభమ్మను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆమెపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ‘ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటారు.
 
 అందులో మంచి ఎమ్మెల్యేలు కొందరే ఉంటారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నవాళ్లు మంచి ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారు. శోభానాగిరెడ్డి అలాంటి నేత’ అని జగన్ కొనియాడారు. జగన్ మీద ఈగ వాలనీయకుండా శోభమ్మ చూసిందన్న సాయన్న(ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి) మాటల్లో నిజముందన్నారు. ‘నాకు షర్మిల అనే ఒక చెల్లెలు ఉంది.. శోభమ్మ అనే అక్క కూడా ఉంది’ అని గద్గద స్వరంతో అన్నారు. ‘అన్యాయంగా నన్ను జైల్లో పెట్టి’... నాలుగైదు నెలల తర్వాత విచారణకోసం కోర్టుకు తీసుకువచ్చినప్పుడు సొంత అక్క తమ్ముడికోసం బాధపడినట్టు శోభమ్మ నా చేయి పట్టుకుని ‘నీకు ఎందుకు ఇన్ని బాధలు అని ఎంతో బాధపడింది’ అని జగన్ గుర్తుచేసుకున్నారు. శోభమ్మను పోగొట్టుకుని కుటుంబం ఎంత బాధపడిందో.. తనకూ అంతే బాధ ఉందన్నారు. ఆమెను ఏ ఒక్కరూ మర్చిపోలేరన్నారు.
 
 మాట్లాడలేకపోతున్నా...
 రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగేళ్లపాటు శోభమ్మ తనకు ఎంతో చేదోడువాదోడుగా నిలిచిందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. ప్రతీ నిమిషం, ప్రతీ సెకను ప్రజాసమస్యల గురించి ఆలోచించేదని... ఆమె చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఆమె గురించి మాట్లాడలేకపోతున్నానని దుఃఖస్వరంతో విజయమ్మ విలపించారు. ఆమె లేని లోటు తీరనిదన్నారు. ఆమె సహాయం చేసే గుణం, సమయస్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయమన్నారు.  ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.
 
 పిల్లల కోసమే బతుకుతున్నా...
 శోభమ్మ లేని జీవితం నరకప్రాయంగా ఉందని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గద్గద స్వరంతో చెప్పారు. కేవలం పిల్లలకోసమే బతికి ఉన్నానంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఆమె ఆశయాలను కొనసాగించేందుకు శోభమ్మ ట్రస్టు పేరుతో ఏటా జయంతి, వర్ధంతుల రోజున సహాయ కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు. శోభమ్మది అనుకున్నది సాధించేతత్వమని ఆమె తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజద్ బాషా, విశ్వేశ్వరరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, చాంద్ బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కుటుంబ సభ్యులు.. నాగమౌనిక(చిన్నకుమార్తె), జగత్ విఖ్యాత్‌రెడ్డి(కుమారుడు), భూమా నారాయణరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ

Written By news on Friday, April 24, 2015 | 4/24/2015


వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ



















హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో వైఎఆర్‌స్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ శుక్రవారం ఏర్పాటయ్యింది. మొత్తం 103 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులను వివిధ పదవులలో నియమించినట్లు ఆ ప్రకటన తెలియజేసింది.

సి. మధులిక, పి. రత్నాకర్, పి. గురవా రెడ్డి, కె. రాజశేఖర్ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సి. సుబ్బారెడ్డి (ట్రెజరర్), డా. రామి ఆర్ బుచ్చిపూడి (సోషల్ రెస్పాన్సిబిలిటీ), డా. జి. ధనుంజయ (మీడియా), రంగరాజు (వెబ్ కంటెంట్), వి.శ్రీనివాస్ (సోషల్‌మీడియా), సి. రాజశేఖర్ (ఎంటర్‌ప్రెన్యూర్స్), కె. విశ్వనాథ్(వెబ్‌సైట్), డా.డి.నాగిరెడ్డి (ఐటీ) నియమితులయ్యారు. నలుగురితో సలహా సంఘం, ఆరుగురితో గవర్నింగ్ కమిటీ ఏర్పాటయ్యాయి. ప్రాంతాల వారీగా ఏర్పడిన టీమ్‌లలో మిగిలినవారు బాధ్యతలు నిర్వర్తిస్తారు.




ఆ కుటుంబానికి రూ. 700 కోట్ల ముడుపులు


'ఆ కుటుంబానికి రూ. 700 కోట్ల ముడుపులు'
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సన్నిహితుల పరిశ్రమలకు రూ. 2,060 కోట్ల రాయితీలు ఇచ్చారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కోటరీలో ఉన్న పారిశ్రామికవేత్తలకే ప్రోత్సాహకాలు దక్కాయని, ఈ ప్రోత్సాహకాల వెనుక చంద్రబాబు కుటుంబానికి రూ. 700 కోట్లు అందినట్లు ఆధారాలున్నాయని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర ఖజానాను దోచిపెట్టే కార్యక్రమమని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి, కమీషన్ల కోసం ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు కమీషన్లు రావనే రుణమాఫీ చేయలేదని అంబటి అన్నారు.

ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారని జాతీయపత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని రాంబాబు గుర్తుచేశారు. పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుచేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి చెప్పిన సమాధానం సిగ్గుతో తలదించుకునేలా ఉందని అంబటి రాంబాబు మండిపడ్డారు. నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.

శోభమ్మ కళ్లలో ఆ బాధను చూశా: వైఎస్ జగన్


శోభమ్మ కళ్లలో ఆ బాధను చూశా: వైఎస్ జగన్
ఆళ్లగడ్డ: తనకు షర్మిల అనే చెల్లెలే కాదని, శోభమ్మ అనే అక్క కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. శోభా నాగిరెడ్డి ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ శోభమ్మ భౌతికంగా లేకపోయినా.. అందరి హృదయాల్లో ఉన్నారన్నారు.  

తాను జైలులో ఉన్నప్పుడు కోర్టుకు హాజరు పరిచిన సందర్భంగా తన అమ్మ, తన భార్య భారతితో పాటు శోభమ్మ కూడా వచ్చారని, ఆ సందర్భంగా ఆమె తన చేయి పట్టుకుని, 'నీకే ఇన్ని సమస్యలు ఎందుకుని' బాధపడిందని, ఆ సమయంలో తమ్ముడి కోసం పడుతున్న బాధను శోభమ్మ కళ్లల్లో చూశానని వైఎస్ జగన్ అన్నారు. శోభమ్మను పోగొట్టుకోవటం ఆ కుటుంబంతో పాటు, అందరికీ తీరని నష్టమన్నారు.

ఇక రాజకీయాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారని,అయితే మంచి ఎమ్మెల్యేల కోవలో శోభా నాగిరెడ్డి ముందుంటారన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని రుజువు చేశారని అన్నారు. అనంతరం వైఎస్ జగన్.. శోభా నాగిరెడ్డిపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు.

చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం

Written By news on Thursday, April 23, 2015 | 4/23/2015


చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం
విశాఖపట్నం: గ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
గత ఎన్నికల అనుభవంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజల విశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటుచేశామని తెలియజేశారు. మరో రెండు నెలల్లో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడతామని అన్నారు.

ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదు


ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదు: వైఎస్ జగన్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అనంతపురం: ఆడబిడ్డలు కన్నీరుపెడితే మంచిదికాదని, తాను అండగా ఉంటానని అంగన్ వాడీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంగన్ వాడీ కార్యకర్తలు ఈరోజు కదిరిలో వైఎస్ జగన్ ను కలిశారు. తమ సమస్యలు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయిస్తుందని తెలిపారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు నాయుడు సభలో ఫ్లకార్డులు ప్రదర్శించిన 15 మంది అంగన్ వాడీ కార్యకర్తలను తొలగించారని తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయమని వారు వైఎస్ జగన్ ను కోరారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇప్పటికే అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసినట్లు చెప్పారు. ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదన్నారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై పోరడతామని జగన్ చెప్పారు.

ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి

న్యూఢిల్లీ: అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను సంరక్షించి, వాటి సంతతిని పెంచాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువుల సంతతి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఒంగోలు జాతి పశువుల సంతతిని బ్రహ్మణ పేరుతో విదేశాలు అభివృద్ధిచేశాయనీ నేషనల్ బయో డైవర్సిటీ యాక్ట్ ప్రకారం ఈ పశువుల జీవద్రవ్యాన్ని విదేశాలు తీసుకునేందుకు అనుమతి లేదన్నారు. అయితే ఇటీవల బ్రెజిల్ ఒంగోలు గిత్తల వీర్యాన్ని సేకరించేందుకు కేంద్రాన్ని కోరినట్టు తెలిసిందనీ కేంద్రం ఇందుకు అనుమతించరాదని  సుబ్బారెడ్డి కోరారు.

నేడు జగన్ పర్యటన


నేడు జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కడప:  ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుని ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి రానున్నారు.
 
 ఆ గ్రామంలో నిర్వహిస్తున్న చావలి ఎల్లమ్మ, గంగమ్మ తిరునాలలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడపకు బయలుదేరి వెళతారు. కామెర్ల వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జిఎన్ మూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం పలువురు నూతన దంపతులకు ఆశ్వీరాదాలు, పరామర్శ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
 
 ఇటీవల అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి కుమారుడి వివాహమైంది. నూతన జంటను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించనున్నారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో ప్రముఖ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి నూతనంగా ప్రారంభించిన మోహన్ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అలాగే జయరాజ్ గార్డన్‌లో బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మేనకోడలు రేష్మారెడ్డి వివాహమైంది. ఆ జంటను కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలో బసచేసి శుక్రవారం ఉదయాన్నే ఆళ్లగడ్డకు బయలుదేరి వెళతారు. అక్కడ దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి వేడుకలకు ఆయన హాజరు కానున్నారు

సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం


సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
  • ఈ సంస్థకు ట్రస్టీలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్
  • నాలుగేళ్లకు పైగా సేవా పన్ను చెల్లించని వైనం
...........శ్రీరంగం కామేష్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కన్నేసింది. ఆ ట్రస్ట్ పన్ను ఎగవేసినట్టుగా గుర్తిం చింది. నాలుగేళ్ళకు పైగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి సేవల పన్ను చెల్లించకుండా వ్యవహారాలు నడిపిన వైనంపై సదరు విభాగానికి ఉప్పందించింది. తాజాగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం.. ఆ ట్రస్ట్‌కు తుది తాఖీదులు జారీ చేసింది.  
టీడీపీ నుంచి అద్దె వసూలు చేస్తున్న ట్రస్ట్
1997లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు లోకే శ్‌తో పాటు డాక్టర్ వి.జయరామిరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్ట్ ఆధీనంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (బంజారాహిల్స్)ను వీరే నిర్వహిస్తున్నారు. ఇందులోని 35 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2009లో నెలకు రూ.10.5 లక్షల చొప్పున టీడీపీకి అద్దెకు ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు తమ స్థలాలు, భవనాలను అద్దెకు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు.. అద్దెకు ఉంటున్న వారి నుంచి నిర్ణీత అద్దెతో పాటు అదనంగా 12.36 శాతం (ఈ బడ్జెట్‌లో దీన్ని 14 శాతానికి పెంచారు) చొప్పున సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేసి.. ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎకై్సజ్‌కు చెల్లించాలి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అలా చేయకుండా 2014 వరకు కార్యకలాపాలు సాగించింది.


ఈడీ దర్యాప్తులో వెలుగులోకి: గత సాధారణ ఎన్నికల అనంతరం.. టీడీపీకి వచ్చిన విరాళాలు, ఆ పార్టీ చేసిన ఖర్చులపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో టీడీపీ-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య ఉన్న అద్దె చెల్లింపు ఒప్పందం, ట్రస్ట్ సేవా పన్ను చెల్లించకపోవడం వెలుగులోకి వచ్చా యి. ఈ విషయాన్ని ఈడీ జాయింట్ డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 23న సర్వీస్ ట్యాక్స్ విభాగానికి రహస్య లేఖ (ఎఫ్ నెం. టి-3/44/హెచ్‌జెడ్0/2011/2350) ద్వారా తెలియజేశారు. దీం తో సర్వీస్ ట్యాక్స్ విభాగం గత ఏడాది అక్టోబర్‌లో ట్రస్టీలకు నోటీసు జారీ చేసింది. దీంతో.. అద్దె స్వీకరిస్తున్నప్పటికీ అప్పటివరకు సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేసుకోని ట్రస్ట్.. వెనువెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసింది.
అరెస్టు తప్పించుకునేందుకు
ట్రస్ట్ ప్రతినిధులు సదరు డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించినప్పుడు అద్దె ఒప్పంద పత్రం లో ఎక్కడా సర్వీస్ ట్యాక్స్ ప్రస్తావన లేకపోవడం, ఒప్పందం కమ్ వాల్యూ (చెల్లించిన అద్దెలోనే సేవల పన్ను కూడా కలిపి ఉండటం) విధానంలో ఉందని నిర్ధారించిన అధికారులు.. అద్దె ద్వారా వచ్చే ఆదాయం లో 10.3 శాతం (కమ్ వాల్యూ విధానంలో 12.36% కాకుండా 10.3% వసూలు చేస్తారు) చొప్పున సేవా పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ విధంగా 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ.70 లక్షల వరకు కట్టాలని మరో నోటీసు జారీ చేశారు. రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసే అధికారం ఉంటుందని తెలుసుకున్న ట్రస్టీలు.. వెంటనే రూ.30 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ట్రస్ట్ నుంచి స్పందన లేకపోవడంతో సర్వీస్ ట్యా క్స్ అధికారులు.. ఇటీవల తుది తాఖీదులు సైతం జారీ చేశారు. సరైన స్పందన రానిపక్షంలో ట్రస్ట్ భవన్‌పై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/denial-of-service-tax-ntr-trust-232425?pfrom=home-top-story

పక్క రాష్ట్రాల్లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల విస్తీర్ణం 2 వేల ఎకరాలు మించలేదు


ఎయిర్‌పోర్టుకు15 వేల ఎకరాలా?బుధవారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • ‘భోగాపురం’పై ప్రభుత్వాన్ని నిలదీసిన
  • ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
  • రైతుల పొట్టకొట్టేందుకే ల్యాండ్‌పూలింగ్ పేరుతో భూసమీకరణ
  • ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలు
  • పక్క రాష్ట్రాల్లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల విస్తీర్ణం
  • 2 వేల ఎకరాలు మించలేదు
  • సీఎం వైఖరి మారేంత వరకూ రైతుల పక్షాన పోరాడుతాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:  విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రైతులనుంచి 15 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌పూలింగ్ కింద సమీకరించడం అన్యాయమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతుల పొట్టకొట్టి వేల ఎకరాల భూమిని సమీకరించడం ఎంతవరకు ధర్మమని సీఎంను ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలుగా మండిపడ్డారు. జిల్లాలో రెండురోజుల పర్యటనకోసం బుధవారం విజయనగరం వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని స్థానిక జిల్లాపరిషత్ అతిథిగృహంలో జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు కలిశారు.

ఈ సందర్భంగా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కోసం అన్యాయంగా భూసేకరణ చేస్తున్న విషయాన్ని స్థానిక నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తదితరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతులనుంచి భూములను పెద్ద మొత్తంలో సేకరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1,283 ఎకరాల్లో, కొచ్చి విమానాశ్రయాన్ని 800 ఎకరాల్లో, ముంబై విమానాశ్రయాన్ని 2000 ఎకరాల్లో ఏర్పాటు చేశారంటూ.. భోగాపురం మండలంలో వేల ఎకరాల భూమిని సేకరించటం అన్యాయమన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ అందుకు సరిపోతుందా? లేదా? అన్నవిషయాన్ని అధ్యయనం చేయాలన్నారు.

ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్ మధ్యాహ్నం వేళల్లో వెలవెలబోతున్నదన్న ఆయన.. అక్కడి 350 ఎకరాలు చాలవనుకుంటే మరో 1000 ఎకరాల భూమిని సేకరించి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విశాఖ జిల్లా భీమిలికి అత్యంత సమీపంలో, సముద్రతీరంలో ఉన్న భోగాపురం మండలంలో ఎకరా విలువ రూ.2కోట్ల మేర పలుకుతుందని, అటువంటి భూముల్ని ల్యాండ్‌పూలింగ్ పేరుతో లాక్కొని 1000 లేదా 1500 గజాల భూమినిస్తే వారంతా ఎక్కడికెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు సరికదా.. ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేస్తున్నారని జగన్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి మారాలంటూ.. అప్పటివరకు రైతులపక్షాన పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను కలసిన వారిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులున్నారు.
అజ్మీర్ వేడుకలకోసం చాదర్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖలోని మర్రిపాలెంలో ముస్లింలు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 25న అజ్మీర్‌లో జరగనున్న హజ్రత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా ఉరుసు(చందనోత్సవం) వేడుకలకు నగరం నుంచి చాదర్(పవిత్ర వస్త్రాన్ని) సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఆయన  చేతుల మీదుగా చాదర్‌ను ముస్లిం పెద్దలకు అందజేశారు.
నేడు కడపకు వైఎస్ జగన్.. 24న శోభా నాగిరెడ్డి వర్థంతికి హాజరు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆ మరుసటి రోజు 24వ తేదీన ఆళ్లగడ్డలో జరిగే దివంగత శోభా నాగిరెడ్డి తొలి వర్థంతికి హాజరవుతారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారని బుధవారం పార్టీ వర్గాలు తెలిపాయి.
వైఎస్సార్‌సీపీలోకి కర్నూలు కాంగ్రెస్ నేతలు
కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు పలువురు నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలోకి అడుగుపెట్టారు. వారందరికీ జగన్.. పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

ఎనిమిది నెలల పాలనలో అంతా కాపీ రాయుడిలా


జగన్ బాటలో చంద్రబాబు
‘నేనే మోనార్క్‌ని ... అంతా నాకే తెలుసు...నన్నే అందరూ అనుసరించాలి. దేశమే నన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ’ అప్పుడప్పుడూ గొప్పలకు పోతున్న చంద్రబాబు గత ఎనిమిది నెలల పాలనలో అంతా కాపీ రాయుడిలా సాగింది. మోడీ చీపురు పట్టుకుంటే ఇక్కడ రెండు చీపుర్లు, పిల్లల్ని ఎక్కువ మందిని కనండహో అని కేకేస్తే ఏపీలో కూడా సంతానం పెంచండని పిలుపునిచ్చారు. తెలంగాణాలో రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడా ‘నక్క వాతలు పెట్టుకున్నట్టు’గా  అంటించుకున్నా అసలు రంగు బయటపడుతూనే ఉంది.

ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ అంటే నేను కూడా అంటూ ఎగిరి గంతేశారు. షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడితే బాబు కూడా బూట్లు తొడిగారు. తాజాగా జగన్ ప్రాజెక్టు బాట పడితే నారా వారు ‘నేనూ’ అంటూ సమాయత్తమవుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టును జగన్ సందర్శించడంతో హడావుడిగా సీఎం షెడ్యూల్‌లో ‘ప్రాజెక్టు’ కొత్తగా వచ్చి చేరింది.


⇒ గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల ఏర్పాట్లు
⇒ జగన్ పర్యటన మరుసటి రోజునే ముంపు బాధితులతో కలెక్టర్ సమావేశం
⇒ వెనువెంటనే మంత్రి దేవినేని ఉమా కూడా పరిశీలనలు
⇒ తాజాగా బాబు కూడా...
⇒ వైఎస్సార్ సీపీ కన్నెర్రతోనే ఈ ముచ్చెమటలంటున్న రైతులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పట్టిసీమ పేరుతో మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలను నుంచి అనూహ్య స్పందన రావడంతో అధికారపక్షంలో గుబులు మొదలైంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కూడా ప్రాజెక్టులను సందర్శించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. మొదట ముండ్లమూరు మండలం  పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, తాజాగా గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన కూడా ముఖ్యమంత్రి పర్యటనలో వచ్చి చేరింది.

ఈ నెల 16న విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పునరావాస పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తి చూపించారు. దీంతో జగన్ పర్యటన ముగిసిన వెంటనే కలెక్టర్ మంపు బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతున్నట్లు ప్రకటించారు.

నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి ఖరీఫ్‌కు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మద్దిపాడు మండలం మల్లవరంలో రూ. 592.18 కోట్లు వ్యయంతో 11,177 ఎకరాల విస్తీర్ణంలో 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరంచేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 2004లో వైఎస్ రాజశే ఖరరెడ్డి అధికారంలోకి రాగానే మూడు విడతలుగా విడుదల చేసిన నిధులతో 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.

మద్దిపాడు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చీమకర్తి, ఒంగోలు, అద్దంకి, ఇంకొల్లు మండలాల పరిధిలోని సుమారు 30 గ్రామాల పరిధిలోని 80,060 ఎకరాలను సాగులోకి తీసుకురావడం, ఆయా ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 21.795 కి.మీ పొడవున నిర్మించిన ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 50 వేల ఎకరాలు, 27.262 కి.మీ పొడవున నిర్మించిన కుడి ప్రధాన కాలువ పరిధిలో 30 వేల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణం గడువు ఈ సంవత్సరం జూన్ 30వ తేదీతో ముగియనున్నప్పటికీ భూవివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నాగులుప్పలపాడు, ఇంకొల్లు మండలాల పరిధిలో దుద్దుకూరు, చదలవాడ, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు పరిధిలో 62 ఎకరాల భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఎలైన్‌మెంట్ మార్చాలని రైతులు పట్టుబడుతుండటంతో ఇవి ఇంకా పరిష్కారం కావలసి ఉంది. అధికారులు చొరవ తీసుకొని ఈ మధ్య కొన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించినప్పటికీ దుద్దుకూరులో ఇంకా 37 ఎకరాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటిని పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే ప్రాజెక్టు పూర్తయినా సాగునీరు అందించలేని స్థితిలో ఉంది.

ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఖరీఫ్‌కు నీరు ఇస్తామని చెప్పించడం ద్వారా రైతుల పక్షాన తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం అధికార పక్షం నుంచి జరుగుతోంది. నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారం రోజుల్లో వెలుగొండ పనులు ప్రారంభమవుతాయని చెప్పినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు పెంచకుండా, రైతులను పక్కదారి పట్టించేందుకే గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు రైతులు విమర్శిస్తున్నారు.

24న శోభా నాగిరెడ్డి వర్ధంతి

Written By news on Wednesday, April 22, 2015 | 4/22/2015


24న శోభా నాగిరెడ్డి వర్ధంతిశోభా నాగిరెడ్డి (ఫైల్ ఫొటో)
హైదరాబాద్: ఈ నెల 24న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత భూమా శోభా నాగిరెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు.

 2014  ఏప్రిల్ 23న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలైన శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడి, 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1997లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి శోభానాగిరెడ్డి ప్రజాసేవకు అంకితమయ్యారు.

ప్రభుత్వానికి దిక్కుమాలిన ఆలోచనలు: వైఎస్ జగన్


ప్రభుత్వానికి దిక్కుమాలిన ఆలోచనలు: వైఎస్ జగన్
విజయనగరం : విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ప్రభుత్వానిది దిక్కుమాలిన ఆలోచనలు అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ  విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో 15వేల ఎకరాల సేకరణ ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలోనే అధ్యయన సమయంలో ఈగలు తోలుకునే పరిస్థితి ఉందన్నారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న 350 ఎకరాలు చాలకుంటే వెయ్యి ఎకరాల వరకూ అక్కడే స్థల సేకరణ పరిశీలిస్తే బాగుంటుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

అలా కాకుండా భోగాపురంలో 15వేల ఎకరాలు సేకరించి రైతుల పొట్ట కొట్టడం ఎంతవరకూ న్యాయమన్నారు. విశాఖ సమీపంగా ఉన్న భోగాపురంలో ఎకరా రూ.2కోట్ల ధర పలుకుతోందని, భూములు సేకరించి 1000 లేదా 1500 గజాల స్థలం ఇస్తే వారంతా ఎక్కడికి వెళతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను అస్తవ్యస్థ పరిస్థితు్లోకి నెట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు.

వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ

 హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలువురిని నియమిస్తూ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాష్ర్ట కార్యదర్శులుగా కె. రుక్మారెడ్డి (రంగారెడ్డి), సయ్యద్ అలీ సయ్యద్ (హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా మహ్మద్ అష్వఖ్ అలీఖాన్, జేఎల్ మేరీ, డా. ఎం.వరలక్ష్మి, మహ్మద్ అజ్మేరీ ఖురేషి, రాష్ట్ర కార్యాలయంలో 10 జిల్లాల సమన్వయకర్తగా ఆరె లింగారెడ్డి (నల్లగొండ) నియమితులయ్యారు.

అలాగే పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా జాలా మహేశ్ యాదవ్ (హైదరాబాద్ జిల్లా), రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా కుక్కల హనుమంతరెడ్డి (నల్లగొండ  జిల్లా)లను నియమించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిరారెడ్డి (కరీంనగర్ జిల్లా), కార్యదర్శులుగా కట్టా సంధ్యారాణి (కరీంనగర్ జిల్లా), ఎస్‌కే బీబీజాన్ (హైదరాబాద్) నియమితులయ్యారు.

రాయలసీమను ఎడారి చేసే కుట్ర


రాయలసీమను ఎడారి చేసే కుట్ర
 శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిని ఎడాపెడా వాడేయడం ద్వారా రాయలసీమను ఎడారి చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పరిస్థితికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లే కారణమని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందన్నారు. జలాశయాల నీటిని తాగు, సాగునీటి అవ సరాలు తీరాక, విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాల్సి ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ దీన్ని విస్మరించి సీమకు ద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. రిజర్వాయర్‌లో కనీసం 854 అడుగులైనా నీళ్లు లేకుంటే సీమకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. బాబుకు రాయలసీమపై ప్రేమ లేదని, ఆయనదంతా కపట ప్రేమేనని విమర్శిం చారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లిస్తామంటున్న వ్యక్తి ఆ ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు భారీగా నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సీమ అభివృద్ధి కోసమే తాను అనంతపురంలో పుట్టిన రోజు పండుగ చేసుకున్నానని సీఎం చెబితే చాలదని, ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించాలన్నారు.

పుట్టినరోజులు, బారసాలలు నిర్వహించుకుంటే సీమ అభివృద్ధి జరుగుతుందా? అని ఆయన ఎద్దేవాచేశారు. రాయలసీమలో వచ్చే ఆదాయంతో రాజధాని నిర్మాణాన్ని నిర్మించడంపై మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాయలసీమలో లభించే ఎర్రచందనం వేలం ద్వారా రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోందని, ఆ మొత్తాన్ని రాజధానికి కాకుండా తమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వమే మద్యం అమ్మడమా?


ప్రభుత్వమే మద్యం అమ్మడమా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచుకోవాలనే మత్తు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు  బయటకు రావాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మద్యం విషయంలో సీఎం ఎన్నికలకు ముందు చెప్పినదానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేపట్టాలనేది ఒక దగుల్బాజీ విధానమని, అలాంటి ఆలోచనను మానుకోవాలని సూచించారు.

తమిళనాడులో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం వల్ల సమాజంపై పడుతున్న దుష్ర్పభావంపై అక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు. ఎన్నికలపుడు చంద్రబాబు ఏ వేదిక ఎక్కినా మహిళలవైపు చూసి బెల్ట్‌షాపులు రద్దు చేస్తానని, మద్యం మహమ్మారి వల్ల ఆడపడుచులు ఎన్ని బాధలు పడుతున్నారో తనకు తెలుసునంటూ ఆవేదన ఒలకబోశారని, తీరా అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను ప్రోత్సహించే  చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘తొలి ఐదు సంతకాల్లో నాలుగోదిగా మద్యం బెల్ట్‌షాపులను రద్దు చేశామని చెప్పారు. కానీ ఆ తరువాత అది అమలైందో లేదో పట్టించుకోలేదు. రైతుల రుణాలను మాఫీ చేసేశాం.. డ్వాక్రా మహిళలకు ఆర్థికసాయం చేసేశాం అని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లుగానే బెల్ట్‌షాపుల రద్దుపై సంతకం చేసి రద్దు చేసేశామని చెప్పుకుంటున్నారు’’ అని పద్మ విమర్శించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్న సీఎం, మంత్రులు మద్యం ఆదాయం పెంపుదలపై అధికారులకు టార్గెట్ల(లక్ష్యాల)ను నిర్దేశిస్తున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఎంతసేపూ ఆదాయం పెరగాలి, పెరగాలంటూ మద్యం ఆకర్షణలో పడిపోయి.. మత్తులో పడిపోతున్నారని, ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళల బతుకులను ఇదెంత దుర్భరం చేస్తోందో గుర్తించట్లేదని ఆమె విమర్శించారు.

మెట్రో రైలు విదేశీ కంపెనీలకే!

 రాజధాని నిర్మాణం కోసం విదేశాలపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం పరాయి దేశాల కంపెనీలకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగపూర్, జపాన్, చైనా దేశాల కంపెనీలతో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు, కనబరుస్తున్న ఆసక్తిని బట్టి విదేశీ కంపెనీలకే మెట్రో ప్రాజెక్టును అప్పగించవచ్చని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.

ప్రాజెక్టు డీపీఆర్(సమగ్ర నివేదిక)ను రూపొందిస్తున్న డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు) మాత్రం మెట్రో నిర్మాణ బాధ్యతను చేపట్టాలనే ఉత్సాహంతో ఉంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, నిధుల సమస్య కారణంగా డీఎంఆర్‌సీ ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ లేదా బీఓటీ పద్ధతిలో విదేశీ కంపెనీలకే ప్రాజెక్టును అప్పగించే అవకాశాలున్నాయి.
http://www.sakshi.com/news/andhra-pradesh/metro-train-contract-to-foriegn-contries-companys-232215

ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?

Written By news on Tuesday, April 21, 2015 | 4/21/2015


ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?
రాజధాని’లో చంద్రబాబు కూరుకుపోయారు
నిపుణుల కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ విమర్శ

    వీజీటీఎం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం.. దేశంలోనే ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి
    సారవంతమైన పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ స్పష్టంచేసింది
    రెండు, మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకోవటం దురదృష్టకరం
    కొత్త రాజధాని నగరంలో ఐదేళ్లలోనే నగరాన్ని, సదుపాయాలను నిర్మిస్తామనటం అతిశయోక్తి
    రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ మొత్తం సమతుల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంది
    ఇప్పటికైనా బాబు పునరాలోచించుకోవాలి:
‘ద హిందూ’లో రాజధానిపై నిపుణుల కమిటీ చైర్మన్ వ్యాసం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారంగా పరిగణించే ప్రాంతంలో వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసేసుకోవడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హ్రస్వదృష్టికి నిదర్శనమని.. ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన కె.సి.శివరామకృష్ణన్ తప్పుపట్టారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక విస్తృత సవాళ్లపై దృష్టిసారించాల్సి ఉండగా.. చంద్రబాబు కేవలం రాజధాని నిర్మాణం అంశంలోనే కూరుకుపోతున్నారని ఆయన విమర్శించారు. సాధ్యమైనంత వరకూ సారవంతమైన, పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. చంద్రబాబు దానిని విస్మరించి ఏడాదికి రెండు, మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని కోసం సేకరించబూనటం దురదృష్టకరమని అభివర్ణించారు. శివరామకృష్ణన్ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందు’లో సోమవారం రాసిన ఒక వ్యాసంలో ఈ విమర్శలు చేశారు. వ్యాసంలోని ముఖ్యాంశాలివీ...
  •  విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారం. మొత్తం భారతదేశంలోనే అతి ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఏటా రెండు పంటలు, మూడు పంటలు పండే 30,000 ఎకరాలకు పైగా పంట భూములను రాజధాని కోసం తీసేసుకోవటం.. హ్రస్వ దృష్టికి నిదర్శనం. ఈ చర్య ఫలితంగా తాత్కాలిక ఆర్థిక లబ్ధి కోసం రైతులు భూనిర్వాసితులవుతారు.
  •  భూగర్భ నీటిమట్టం అధికంగా గల ప్రాంతంలో నేలను గట్టిపరచటం, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటానికి, నిర్మించటానికి చాలా సమయం పడుతుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో నిర్మించిన గాంధీనగర్, చండీగడ్, భువనేశ్వర్, ఉక్కునగరాలైన బొకారో దుర్గాపూర్, రూర్కెలా తదితర దాదాపు 100 కొత్త పట్టణాలకు.. కనీస మౌలిక సదుపాయాల నిర్మాణానికే ఏడెనిమిదేళ్లు పట్టింది. ఏపీలో ఇవన్నీ ఐదేళ్ల కాల వ్యవధిలో చేయవచ్చన్నది పూర్తి అతిశయోక్తి.
  •  ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్‌పై పనిచేస్తున్న సింగపూర్ కంపెనీలు.. రాజధాని ప్రాంతానికి వెలుపల, వీజీటీఎం ప్రాంతం లోపల 3,000 ఎకరాల భూమి కావాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు. అదే జరిగితే సింగపూర్ కోటాలోకి వెళ్లే భూమి వ్యవసాయ భూమి.
  •  రాష్ట్ర రాజధాని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అంతర్జాతీయంగా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ విషయంలో ఏపీకి తాము అందించగల సాయంపై పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది.
  •  చిత్తూరు, తిరుపతిల్లో ప్రధానంగా ప్రయివేటు రంగ సంస్థల సాయంతో కొన్ని వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు మొదలవుతుండటం ఆహ్వానించదగ్గ విషయం. అయితే.. రాయలసీమ సామర్థ్యానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరం.
  •  ఆర్థిక రాజధాని కూడా వీజీటీఎం ప్రాంతానికి బదిలీ అవుతుందన్న విషయం తెలుస్తోంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తుతాయనేది ఖచ్చితం. ఏపీ సీఎంగా సమతుల్యమైన అభివృద్ధిపై దృష్టిసారించాల్సి ఉందని, కేవలం వీజీటీఎం ప్రాంతం అభివృద్ధి గురించి మాత్రమే కాదని నిపుణుల కమిటీ పదేపదే చెప్పింది.
  •  ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పంచుకోవటానికి పదేళ్ల సమయం ఇచ్చింది. చంద్రబాబు పునరాలోచించుకోవటానికి ఇంకా సమయముంది.
'రాజధాని ప్రాజెక్టు వల్ల నేరుగా ప్రభావితమయ్యే వారే కాకుండా.. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సొంత వ్యవసాయ భూమి లేని, ఆదాయం లేని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల భద్రతకు, సంక్షేమానికి భరోసా ఇవ్వటం ఆచరణాత్మకంగా అసాధ్యం'

'ఏపీ ఎదుటనున్న అతి తీవ్రమైన సవాలు.. ఏటా మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించటమని నిపుణుల కమిటీ పదే పదే స్పష్టంగా చెప్పింది. కానీ ఈ ఉద్యోగాలేవీ కనిపించటం లేదు. ఇటీవలి తుపానులతో దెబ్బతిన్న పట్టణాలను పునర్మించాల్సి ఉంది. హైకోర్టు వంటి ముఖ్యమైన సంస్థలను రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచించిన విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంది.'

http://www.sakshi.com/news/andhra-pradesh/shivarama-krishnan-critisized-chandrababu-naidu-231836?pfrom=home-top-story

ఈరోజు, రేపు విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్


విశాఖ చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఈరోజు, రేపు విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. ఈ రాత్రికి ఆయన  విజయనగరం వెళతారు. పట్టణ సమీపంలోని ఆర్కే లేఅవుట్‌లో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.

రాత్రికి విజయనగరం జెడ్పీ అతిథి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు మనవడి వివాహ కార్యక్రమంలో భాగంగా జరిగే ఉపనయనానికి హజరవుతారు.  ఆ తరువాత 11 గంటలకు నెల్లిమర్ల నుంచి బయలుదేరి విశాఖ మీదుగా హైదరాబాద్ వెళతారు.

జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ జగన్ సంతాపం


హైదరాబాద్ : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.  పట్నాయక్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జేబీ పట్నాయక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జేబీ పట్నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

రైతులను ఆదుకోవాలి


రైతులను ఆదుకోవాలి
- ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు అన్ని రాయితీలు ఇవ్వాలి
- లోకసభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్నదాతలను ఆదుకోవాలని రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభలో సోమవారం గళమెత్తారు. రైతు సమస్యలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రధానంగా అన్నదాతల సమస్యలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు.

ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించిన మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాలోని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర *780కు ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. హుదూద్ బాధితులను ఇంతవరకు ఆదుకోలేదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు.

దీంతో సుమారు 35 ఏళ్లకు పైబడిన మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందంగా ఇటీవల కురిసిన అకాలవర్షం, వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 5 కిలోల వడగండ్లు పడిన విషయాన్ని సభ దృష్టికి  తెచ్చారు.

తీవ్ర సంక్షోభంలో ఉన్న అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని రాయితీలు ప్రభుత్వం రైతులకు అందించాలన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

సర్కారు నైజం బట్టబయలు


సర్కారు నైజం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన శివరామకృష్ణన్ తాజాగా వెల్లడించిన అంశాలు చంద్రబాబునాయుడు ప్రభుత్వ నైజాన్ని బట్టబయలు చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనా తీరును శివరామకృష్ణన్ ఎండగట్టారని చెప్పారు.

ఒక ఆంగ్ల పత్రికలో శివరామకృష్ణన్ రాసిన కథనాన్ని ఆయన ఉటంకిస్తూ.. చంద్రబాబు సర్కారు ఆలోచన తీరును వాస్తవాలతో బట్టబయలు చేశారని తెలిపారు. ఆ కథనం ప్రభుత్వం, ముఖ్యమంత్రి బట్టలు ఊడతీసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోను, బయట ఇన్నాళ్లు చెబుతున్న విషయాలను శివరామకృష్ణన్ తన కథనంలో పేర్కొన్నారని చెప్పారు.
నిధులిచ్చారనే నారాయణకు  ప్రాధాన్యత
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులు సమకూర్చారన్న కారణంతోనే మంత్రి నారాయణకు రాజధాని నిర్మాణంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని సీతారాం ఆరోపించారు.

పంట నష్టంపై ఉన్నతస్థాయి బృందం

పంట నష్టంపై ఉన్నతస్థాయి బృందం
కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కు ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: అకాల వర్షాలు, వడగండ్లతో తెలంగాణలో అపారపంట నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను ఆదుకోడానికి కేంద్రం సత్వరమే సహా యం చేయాలని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌కాం గ్రెస్ పార్టీ  అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. నష్టం అంచనావేయడానికి ఉన్నతస్థాయి బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు. సోమవారం ఆయన కేంద్రమంత్రిని కలిసి తెలంగాణలోని అకాలవర్షాల పరిస్థితులు, పంటనష్టం వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. తెలంగాణ వ్యవసాయ విభాగం ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రంలో కనీసం 35,175 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 40,131 హెక్టార్ల వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం కలిగిందని మంత్రికి వివరించారు.

నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 30 వేల హెక్టార్ల పంట దెబ్బతిందన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.100 కోట్లు నష్టం జరిగినట్టు మంత్రికి వివరించారు. అకాల వర్షాల ప్రభావం పౌ ల్ట్రీ రైతులపై కూడా పడిందన్నారు. భారీ వర్షాలకు జగిత్యాలతో 50వేల కోళ్లు మృత్యువాతపడ్డాయన్నారు. రైతులు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ధాన్యం, ఇతర పంటల దిగుబడి లేక ఆహార సంక్షోభంతో రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.  

విజయవాడలో రైల్‌నీర్ ప్లాంట్


విజయవాడలో రైల్‌నీర్ ప్లాంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో 2016 సెప్టెంబర్‌లోపు రైల్‌నీర్ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించినట్టు తెలిపారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన ‘రైల్ నీర్’ అందించేందుకు తీసుకుంటున్న చర్యలు, విజయవాడ డివిజన్‌లో రైల్‌నీర్ ప్లాంట్ ఎప్పటిలోపు పూర్తి చేయనున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న ఆరు రైల్‌నీర్ ప్లాంట్‌లకు అదనంగా విజయవాడ సహా మరో ఆరు కొత్త ప్లాంట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.


త్వరలో ఏపీ ఎక్స్‌ప్రెస్: రైల్వే సహాయ మంత్రి
విజయవాడ- న్యూఢిల్లీ  ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ప్రతి రోజు నడిచే ఈ రైల్లోని అన్ని కోచ్‌లు పూర్తి ఎయిర్ కండిషన్డ్‌గా ఉంటాయని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏవైనా ప్రతిపాదనలు వచ్చాయా’ అని ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సిన్హా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ఈ ఏడాది రైల్వే కోచ్‌లెన్ని
తయారు చేశారు: ఎంపీ మేకపాటి
‘ఈ ఏడాది అవసరమైన రైల్వే కోచ్‌ల సంఖ్య, ఇప్పటి వరకు ఎన్ని అందుబాటులో ఉన్నాయి’ అని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో 3,314 కోచ్‌లను తయారు చేసినట్టు మంత్రి మనోజ్ సిన్హా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2013-14 ఏడాదిలో 3,658 కోచ్‌లు, 13,162 వ్యాగన్లు అవసరం ఉన్నట్టు అంచనా వేసినట్టు తెలిపారు.
 

నేడు, రేపు విజయనగరంలో జగన్ పర్యటన


నేడు, రేపు విజయనగరంలో జగన్ పర్యటన
విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాలు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం విజయనగరం చేరుకోనున్న జగన్ సాయంత్రం పట్టణ సమీపంలోని ఆర్కే లేఅవుట్‌లో జరగనున్న ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు.

రాత్రికి పట్టణంలోని జెడ్పీ అతిథి గృహంలో బస చేయనున్నారు. బుధవారం ఉదయం నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు మనవడి వివాహ కార్యక్రమంలో భాగంగా జరిగే ఉపనయనానికి హజరుకానున్నారు. 11గంటలకు నెల్లిమర్ల నుంచి బయలు దేరి విశాఖ మీదుగా ైెహ దరాబాద్ వెళ్లనున్నారు.
 

వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం

Written By news on Monday, April 20, 2015 | 4/20/2015

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ధర్మవరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, సీపీఐ నేతలని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఎస్పీ కార్యలయం ఎదుట ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళ చేస్తున్నారు.

అసెంబ్లీని శాసించబోయేది మనమే


అసెంబ్లీని శాసించబోయేది మనమే
⇒ ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నంత వరకు పార్టీని ఏమీ చేయలేరు
⇒ ఇద్దరు చంద్రుల పాలన ఫెయిల్యూర్
⇒ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో ఎంపీ పొంగులేటి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  

కరీంనగర్‌లోని కళాభారతిలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గాదె నిరంజన్, మతిన్, గున్నం నాగిరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర నాయకులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కెనపెల్లి కుమార్, ముస్తాక్, డాక్టర్ నగేష్, సెగ్గం రాజేష్, సందమళ్ల నరేష్, జగతి, సంతోష్‌రెడ్డి, ముల్కల గోవర్దన్, మందా రాజేష్‌కుమార్, ఎండీ.వాజీద్ తదితరులు హాజరయ్యారు.

సమావేశం ప్రారంభంలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది రైతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.తర్వాత పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి ఏమన్నారంటే..
 
సీఎం అంటే వైఎస్సే..
‘‘2004కు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను 15 మంది, ఆ తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలుపుకొని ముగ్గురు ముఖ్యమంత్రులు పాలించారు. కానీ సీఎం అంటే వైఎస్‌లా ఉండాలి. జనం గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్. కాబట్టే ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలోనూ 30 మంది చనిపోయారు. ఆ కుటుంబాలను పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చాల్సి ఉన్నా కొన్ని కారణాలవల్ల ఖమ్మంలో మినహా ఎక్కడా పర్యటించలేకపోయారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక షర్మిల రెండు జిల్లాల్లో పర్యటించారు. త్వరలోనే కరీంనగర్‌లోనూ పర్యటించి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారు. ఎన్నికలకు ముందు సీమాంధ్రలో రుణమాఫీ పేరుతో ఎడాపెడా హామీలిస్తుంటే... మనం కూడా కనీసం రూ.50 వేల వరకైనా రుణమాఫీ చేద్దామని జగన్ వద్ద ప్రతిపాదించాను. అప్పుడాయన ‘టీడీపీ వాళ్లు లక్ష కాదు కదా.. రూ.5 వేలు కూడా మాఫీ చేయలేరు’ అని చెప్పారు. ఆనాడు జగన్ చెప్పిందే నేడు జరుగుతోంది.
 
ఆర్భాటమే తప్ప ఆచరణ ఏది?
వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలపై ఆర్భాటపు మాటలతో పత్రికలు, టీవీల ప్రకటనలకే పరిమితమవుతున్నారు.  దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించినా ఏ జిల్లాలోనూ 20 కుటుంబాలకు మించి భూ పంపిణీ జరగలేదు. పింఛన్లలోనూ కోత విధిస్తున్నారు. కొత్తగూడెంలో వైఎస్ హయాంలో 6 వేల మందికి పింఛన్లు ఇస్తే...  సగం ఆపేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును వైఎస్ 90 శాతం పూర్తి చేస్తే.. నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.

ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన కేసీఆర్.. మాట నిలబెట్టుకుంటే 119 అసెంబ్లీ స్థానాలకు 118 సీట్లు వస్తాయి. కానీ అది సాధ్యమేనా? రైతాంగానికి సాయమందేవరకు పోరాడతా, పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావిస్తా. ఇచ్చిన హామీలను అమలు చేయలేని టీఆర్‌ఎస్ పరిస్థితి 2019లో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భవిష్యత్తులో తెలంగాణ అసెంబ్లీలో శాసించేది వైఎస్సార్ కాంగ్రెస్సే. కాబట్టి కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలి. ప్రజల పక్షాన పోరాడాలి. మీకు అండగా జగన్, మేము ఉంటాం.’’

సమావేశం తీర్మానాలు

⇒ కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాలవర్షం,  వల్ల పాడైన పంట నష్టంపై నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధాన నిర్ణయం ప్రకటించకపోవడంపై వైఎస్సార్‌సీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. బాధితులకు పరిహారం చెల్లించాలి.
⇒ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలనే ప్రభుత్వ ఆలోచనపై పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
⇒ వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన బహుళార్థ సాధక ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. పూర్తయిన ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించాలి.
⇒ ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాల్వ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిడ్‌మానేర్, ఓబులాపూర్, గౌరవెల్లి రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలి.
⇒ అకాల వర్షాలతో నష్టపోయిన కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
⇒ దళితులకు, ఆదివాసీల కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయూలి. డబుల్  బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి.
⇒ తక్షణమే చేనేత కార్మికులను ఆదుకోవాలి.
⇒ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్లు ఇవ్వాలి.
⇒ మైనార్టీలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ వాగ్దానాన్ని అమలు చేయాలి.
⇒ డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాల్ని ఇచ్చి, పాత రుణాలను మాఫీ చేయాలి.
⇒ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా  తక్షణమే ఉద్యోగాల భర్తీని చేపట్టాలి.
⇒ తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద నిధులు విడుదల చేయాలి.

22న వైఎస్‌ఆర్‌సీపీలోకి చెరుకులపాడు నారాయణరెడ్డి


పత్తికొండ: అధికారం ఉన్నా.. లేకున్నా నిరంతరం తన వెంట నడిచిన కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు లక్ష్మీ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండలంలో న్యాయవాది ఎల్లారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల సహకారంతో 32 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థుల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచానన్నారు.
 
 తనను నమ్ముకున్న కార్యకర్తలకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలు సలహా మేరకు, తనను నమ్ముకున్న వారి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 30వ తేదీన పత్తికొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. పార్టీలోకి చేరిన మరుక్షణమే హంద్రీ నీవా నుంచి సాగు, తాగునీరు సరాఫరా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
 
  తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చెర్మన్ మల్లికార్జున యాదవ్, మాజీ సర్పంచ్ కృష్ణ, సర్పంచ్ హనుమంతు, ఆస్పరి బోయ రవిచంద్ర, శ్రీనివాసులు, పెద్ద తిమ్మయ్య, శంకర్‌రెడ్డి, నాయీ బ్రహ్మణుల సంఘం డివిజన్ అధ్యక్షుడు రవికుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు జాఫర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహనికి  ఎన్నికల్లో కనుమరుగైందన్నారు. రాష్ట్ర విభజనతో తమ నాయుడు నారాయణరెడ్డికి కాంగ్రెస్ ఓట్లు పడలేదని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారం చేసినందుకు వ్యక్తిగతంగా ఓట్లు పడ్డాయన్నారు.
 
  పదవులు, కాంట్రాక్టు పనులు కోసం టీడీపీలో చేరకుండా ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరుతుండటంతో ఆనందంగా ఉందంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాందిరెడ్డి, బాబుల్‌రెడ్డి, మేకల సత్యం, ఖజావలి, శ్రీనివాసులు, నాగప్ప  తదితరులు పాల్గొన్నారు. ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిసింది.  

త్వరలో కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర

Written By news on Sunday, April 19, 2015 | 4/19/2015


'త్వరలో కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర'
కరీంనగర్:త్వరలో కరీంనగర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నట్లు  తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ కోసం ప్రాణాలు కోల్పోయిన 30 మంది కుటుంబాలను  షర్మిల పరామర్శిస్తారని ఆయన తెలిపారు.
 
ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పొంగులేటి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీలను విస్మరించిందని పొంగులేటి విమర్శించారు. ఏపీలో కూడా టీడీపీ సర్కార్ మాటలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలకు సిద్ధ శుద్ధి ఉంటే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి నుంచి జరిగి పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ శాసన సభను శాసిస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నేటి తీర్మానంలో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా జాతీయ హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తీర్మానించింది.

Popular Posts

Topics :