26 April 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఎల్లుండి గవర్నర్ తో భేటీ కానున్న వైఎస్ జగన్

Written By news on Saturday, May 2, 2015 | 5/02/2015


ఎల్లుండి గవర్నర్ తో భేటీ కానున్న వైఎస్ జగన్
హైదరాబాద్:వైఎస్సార్ సీపీ నేతలపై వరుసగా జరుగుతున్నదాడుల ఘటనలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. ఈ మేరకు  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ తో  సమావేశం కానున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
 
గత కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుతహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వైఎస్సార్ సీపీ విన్నవించే అవకాశం ఉంది. 

ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి


ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి
హైదరాబాద్ : ఏపీ సర్కారుకు ధైర్యం ఉంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి చూడాలని, ఫలితం ఎలా ఉంటుందో చూడాలని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాలు చేశారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగిస్తామంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతుల పిటిషన్ లో న్యాయం ఉందని కోర్టు భావించినందువల్లే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు.

ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం ఎందుకు దగా చేసిందని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని డిసెంబర్ నెలలోనే ఎందుకు ఉపయోగించలేదని అడిగారు. మేథాపాట్కర్, అన్నాహజారే, శివరామకృష్ణన్ తదితరులు ఏ పార్టీకి చెందినవారని ఆర్కే నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ప్రభుత్వం గనక భూసేకరణ చట్టం ప్రయోగిస్తే.. న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది


'చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది'
విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమో అనే అనుమానం కలుగుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించడం వల్లే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదని కొయ్య ప్రసాదరెడ్డి శనివారమిక్కడ మీడియా సమావేశంలో అన్నారు.

లోకేష్ ఏ హోదాలో విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకు వస్తానంటున్నారో అర్థం కావటం లేదని కొయ్య ప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను లోకేష్ ద్వారా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటీవల పారిశ్రామిక సదస్సులు పెట్టి పనికిరాని ఎంవోయూలు చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసింది రైతు రుణమాఫీ కాదని, రైతు మాఫీ అని కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు.

కడప నగరంలో నీటి ఎద్దడి ఇక ఉండబోదు


కడప కార్పొరేషన్: కడప నగరంలో తాగునీటి ఎద్దడి తీర్చడానికే 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భజలాశయం నిర్మిస్తున్నామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బండికనుమపై రూ. 3.08 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధులతో భూగర్భజలాశయం, పంపింగ్‌మెయిన్ పనులకు మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా, డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, కమీషనర్ చల్లా ఓబులేసులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో ఎక్కువ సమయం నీరు ఇస్తున్నా అది చివరి ఇంటి వరకూ చేరడం లేదన్నారు. ఇంత ఎత్తులో నిర్మిస్తున్న ఈ భూగర్భజలాశయంతో గ్రావిటీ ఆధారంగా ప్రతి ఒక్కరికీ తాగునీరు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎనిమిది నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వీలైనంత త్వరగా నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఎంపీ అధికారులను కోరారు.
 
 నిరుపయోగంగా ఉన్న జలాశయం అందుబాటులోకి..
 ఆసియా ఖండ ంలోనే అతిపెద్దదైన ఈ భూగర్భజలాశయం సుమారు 8 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని కడప శాసన సభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం, వారు మంజూరు చేసి పంపడం చకచకా జరిగిపోయాయన్నారు. తమ హయాంలో జలాశయ పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రావిటీ అధారంగా డెడ్ ఎండ్ వరకూ నీరు అందించాలన్నదే దీని లక్ష్యమని చెప్పారు.
 
  24 గంటల తాగునీరు..
 ఆసియాలోనే పెద్దదైన ఈ జలాశయాన్ని 1970లో ఏపీఐఐసీ వారు నిర్మించారని మేయర్ కె. సురేష్‌బాబు తెలిపారు. నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకూడదనే సదుద్దేశంతో తమ పాలకవర్గం దీన్ని పునర్నిర్మించాలని సంకల్పించిందన్నారను. సామాన్యుడికి 24 గంటలు తాగునీరు అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. అలగనూరు, వెలుగోడు రిజర్వాయర్ల నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేయించి 43 డివిజన్లలో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. అంతకుముందు వారు జలాశయ పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జున, కార్పొరేటర్లు పాకాసురేష్, బోలా పద్మావతి, నాగమల్లిక, శ్రీలేఖ, అందూరి రాజగోపాల్‌రెడ్డి, ఎంఎల్‌ఎన్ సురేష్, చైతన్య, ఆదినారాయణ,  రామలక్ష్మణ్‌రెడ్డి, కె. బాబు, చినబాబు, బండి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు టీపీ వెంకట సుబ్బమ్మ, నాగమల్లారెడ్డి, ఎంపీ సురేష్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, పాండురంగా రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, షేక్ అల్తాఫ్, నిత్యానందరెడ్డి, పులిసునీల్, పత్తిరాజేశ్వరి, ఎస్‌ఎండీ షఫీ, జి. క్రిష్ణ, బాలస్వామిరెడ్డి, సూర్యనారాయణరావు, ఎన్. ప్రసాద్‌రెడ్డి, కిరణ్, రెడ్డిప్రసాద్, శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గభేటీ


నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గభేటీ
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యాలయంలో శనివారం ఉదయం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఏడాది కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు ఇతర ముఖ్యాంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. వైఎస్సార్‌సీపీ టికెట్‌పై గెలుపొంది టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారంకూడా చర్చకు రానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.


ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలతోపాటు సంస్థాగత అంశాలపైకూడా చ ర్చిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ర్టకార్యవర్గ సభ్యులు, అధికార ప్రతిని ధులు, పదిజిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధవిభాగాల అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు.

గతంలో ఎప్పుడూ లేదు..


చినబాబా.. మజాకా
    సీఎం కుమారునితో వెళుతున్న ఇండస్ట్రీస్ డెరైక్టర్ కార్తికేయమిశ్రా, సీఎం ఓఎస్‌డీ అభీష్ట
     అధికారుల పర్యటన ఖర్చు భారం పరిశ్రమలశాఖ, ఐటీ శాఖలపై..
     ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ


హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుపుతున్న అమెరికా పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులు కూడా వెళుతున్నారు. ముఖ్యమంత్రి కుమారుని అమెరికా పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. ఆయన ప్రభుత్వంలో ఎటువంటి పదవిలోనూ లేరు. అయినప్పటికీ ఆయనతోపాటు ఇద్దరు అధికారులను పంపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి మంజూరు చేశారు.


ఆ మేరకు పరిశ్రమల శాఖ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కార్తికేయ మిశ్రా, అలాగే సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్న అభీష్ట కూడా లోకేష్‌తో కలసి అమెరికా వెళుతున్నారు. కార్తికేయ మిశ్రా అమెరికా పర్యటన వ్యయాన్ని పరిశ్రమలశాఖ, అభీష్ట పర్యటన వ్యయాన్ని ఐటీ శాఖ భరించనున్నాయి. సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ అభీష్టల అమెరికా పర్యటనకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


గతంలో ఎప్పుడూ లేదు..
గతంలో ఏ సీఎం అయినా విదేశీ పర్యటనకు వెళితే ఆయన వెంట కుటుంబ సభ్యులు వెళ్లడమనేది జరిగేది. అయితే ముఖ్యమంత్రి వెళ్లకుండా ఆయన కుమారుడు వెళ్లే ప్రైవేట్ పర్యటనకు అధికారులను పంపించడం గతంలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇదిలా ఉండగా లోకేష్ ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. తనకు అవసరమైన పనులకు సంబంధించిన ఫైళ్లను నడిపించడానికి సచివాలయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించారు.

మంత్రి గారికి కోపం వచ్చింది

Written By news on Friday, May 1, 2015 | 5/01/2015

వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను వీఆర్ కు పంపడంపై మంత్రి పరిటాల సునీత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్ మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపేశారు.

ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని కూడా ఆమె చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సీఐలను డీఐజీ బాలకృష్ణ వీఆర్ కు పంపిన విషయం తెలిసిందే. ఈ విషయమే మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది.

అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రసాద్ రెడ్డి హత్య కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ లను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్‌) కు పంపుతూ జిల్లా ఎస్పీ రాజేశేఖరబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  కాగా ప్రసాద్ రెడ్డి హత్య నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా  రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)ని బుధవారం రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపిన విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన


గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరానికి  విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా గుంటూరు నగరానికి బయలుదేరి   వెళతారు.

అనంతరం అక్కడ సన్నిధి కల్యాణ మండపంలో మాజీ కేంద్రమంత్రి, పార్టీ ముఖ్యనేత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనుమరాలు, పార్టీ నేత కిలారి రోశయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం గన్నవరం చేరుకుని 2.40 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని రఘురామ్ వివరించారు.

రాప్తాడులో సర్కారీ వేట!

Written By news on Thursday, April 30, 2015 | 4/30/2015


‘అనంత’లో తహసీల్దార్ ఆఫీస్‌లోనే వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
⇒ పోలీస్‌స్టేషన్‌కు పక్కనే పథకం ప్రకారం ఘాతుకం
⇒ ఘటనాస్థలంలో రాప్తాడు ఎస్‌ఐ నేమ్‌బ్యాడ్జీ లభ్యం
⇒ మంత్రి పరిటాల సునీత కుటుంబీకులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మరోసారి రక్తసిక్తమైంది. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)పై రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్‌లోనే ప్రసాదరెడ్డి ఉసురు తీశారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో జరిగిన ఈ ఘటన వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.

హత్య జరిగిన ప్రాంతం రెవెన్యూ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్ కావడం, అక్కడి బీరువాలోనే హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను దాచి ఉంచడం, ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడం, ఘటనా ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ.నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి లభ్యం కావడం, హత్య జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్‌లో అధికారులు సహా సిబ్బంది ఉండడం, అయినా ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా హత్య చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దారుణం జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనా లుగా కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని వైఎస్సార్ సీపీ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.  

జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనతో ప్రసాదరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పుపెట్టారు. మరోపక్క ప్రసాదరెడ్డి హత్యతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, పరిటాల మురళిల అండతోనే హత్య జరిగిందని విరుచుకుపడ్డారు.  

పక్కా ప్రణాళికతో.. మూడు నిమిషాల్లోనే..
రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రి భర్త ప్రసాదరెడ్డి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల మండల కేంద్రానికి వస్తూ వెళ్తుండేవారు. ప్రత్యర్థులు దీనిని అవకాశంగా తీసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో ప్రసాదరెడ్డిని తహశీల్దార్, ఆర్‌ఐలే బుధవారం పని ఉందంటూ ఫోన్ చేసి పిలవడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలసి రాప్తాడు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.అప్పటికే 8 మంది ప్రత్యర్థులు అక్కడ మాటు వేసి ఉన్నారు.

ప్రసాదరెడ్డి ఆర్‌ఐ దివాకర్ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే రెప్పపాటు కాలంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి, శివయాదవ్‌ను కంప్యూటర్ గదిలోకితోసి తలుపులు మూసి, ఆర్‌ఐ చాంబర్ లోపల గడియపెట్టి ప్రసాదరెడ్డిపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. మెడపై విచక్షణా రహితంగా నరికారు. చేతిని తెగ్గొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సాక్షిగా మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ ఘాతుకం జరిగిపోయింది. ప్రసాదరెడ్డికి భార్య, కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానం

హత్యకు పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది సహకరించారని ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి ఆరోపించారు. నాగేంద్రప్రసాద్ ఇటీవల పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను ఇక్కడికి బదిలీ చేయిం చినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఘటన స్థలంలో ఎస్‌ఐ నేమ్‌బ్యాడ్జి
ప్రసాదరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. నేమ్‌బ్యాడ్జీ ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్‌ఐ కూడా హత్య జరిగిన సందర్భంలో ఘటనా స్థలంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు.ఈయన టీడీపీ వారికి సహకరిస్తూ.. వైఎస్సార్‌సీపీ వారి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుంటారనే విమర్శలున్నాయి. కాగా, ఇటీవల పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే ప్రత్యర్థులు హత్యచేశారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది.

ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రసాదరెడ్డి మృతదేహాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. మరోదారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్పీ రాజశేఖరబాబు  వచ్చి 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాదరెడ్డి నివాసానికి తీసుకెళ్లారు.

రాప్తాడులో తీవ్ర ఉద్రిక్తత
హత్య సమాచారం తెలిసిన వెంటనే ప్రసాదరెడ్డి బంధువులు, అనుచరులు రాప్తాడుకి చేరుకుని ఆర్‌ఐ చాంబర్‌లో రక్తపు మడుగులో పడివున్న ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆయన అనుచరులు ఆవేశానికిగురై.. తహశీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పంటించారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలకు నిప్పంటించారు. ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించగా.. అనుచరులు అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ రాజశేఖరబాబు.. మహానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పాతకక్షలతోనే హత్య: డీఐజీ
పాత కక్షల నేపథ్యంలోనే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని డీఐజీ బాలకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. 2003లో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో జరిగిన ఉప్పర చలపతితో పాటు మరో ఇద్దరి హత్య కేసులో ప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు మహానందరెడ్డితో పాటు గోపాల్‌రెడ్డి నిందితులన్నారు. కాగా, ప్రసాదరెడ్డి హత్య కేసులో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: వైఎస్సార్ సీపీ నేతలు
ప్రసాదరెడ్డిది రాజకీయహత్య అని, పథకం ప్రకారమే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హత్యకు సహకరించారని, మంత్రి పరిటాల సునీతతో పాటు పరిటాల మురళి, శ్రీరామ్ పాత్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంలు ప్రభుత్వాస్పత్రిలో ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసాదరెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పథకం ప్రకారమే..
⇒ వైఎస్సార్‌సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి దారుణహత్య
⇒ రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో నరికి చంపిన ప్రత్యర్థులు
⇒ పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో మంత్రి పరిటాల సునీత హత్య చేయించారని బంధువుల ఆరోపణ
⇒ తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు నిప్పు.. రాప్తాడులో ఉద్రిక్తత
⇒ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
⇒ 13 మందిపై కేసు.. నిందితుల్లో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులు

 
(సాక్షి ప్రతినిధి, అనంతపురం): రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన  వైఎస్సార్‌సీపీ కీలక నేత భూమిరెడ్డి శివ  ప్రసాదరెడ్డిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ చూస్తుండగానే  వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో మంత్రి పరిటాల సునీత ఈ హత్య చేయించారని ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యతో రాప్తాడుతో పాటు అనంతపురంలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రసాదరెడ్డి మొన్నటిదాకా వైఎస్సార్‌సీపీ రాప్తాడు మండల కన్వీనర్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన భార్య సావిత్రి ప్రసన్నాయపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. ప్రసాదరెడ్డి ఓ వ్యక్తిగత పని కోసం తహశీల్దార్ కార్యాలయానికి కొన్నిరోజులుగా వస్తూ పోతూ ఉండేవారు. దీన్ని గమనించిన ప్రత్యర్థులు హత్యకు పక్కా వ్యూహం రచించారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆర్‌ఐ దివాకర్ గదిలో కూర్చొన్నారు.

అప్పటికే ఎనిమిది మంది దుండగులు అక్కడ మాటు వేసివున్నారు. ప్రసాదరెడ్డి ఆర్‌ఐ ఛాంబర్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికే వారు కార్యాలయం లోపలికి చొరబడ్డారు. మొదట కొందరు ప్రసాద్ అనుచరుడు శివను కంప్యూటర్ గదిలో నిర్బంధించి.. తలుపు వేశారు. ఇంకొందరు ఆర్‌ఐ ఛాంబర్‌లోకి వెళ్లి తలుపులు మూసి.. వేటకొడవళ్లతో ప్రసాదరెడ్డిపై విరుచుకుపడ్డారు. మెడపై బలంగా నరికారు. రక్షించుకునే ప్రయత్నంలో ప్రసాదరెడ్డి చేయి అడ్డుపెట్టగా.. చేతివేళ్లు తెగిపోయాయి. ఆయన ఒక్కడే కావడం...ప్రత్యర్థులు భారీగా ఆయుధాలతో రావడంతో ఏమీ చేయలేకపోయారు. వారి దాడిలో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ప్రసాదరెడ్డికి కుమారుడు రమణారెడ్డి ఉన్నారు.
 
బోరున విలపించిన కుటుంబ సభ్యులు
హత్య విషయం తెలీగానే  ప్రసాదరెడ్డి భార్య సావిత్రి, సోదరుడు మహానందరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఘటన స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న ప్రసాదరెడ్డిని చూసి బోరున విలపించారు. ‘వస్తానని చెప్పి వెళ్లి ఇలా అయ్యాడే’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతలోనే భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రసాదరెడ్డి అనుచరులు అక్కడికి వచ్చారు. ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తహశీల్దార్ కార్యాలయంలోని ఫర్నీచర్‌తో పాటు రికార్డులను ధ్వంసం చేసి.. నిప్పటించారు. బైక్‌లకు నిప్పటించారు. మండల పరిషత్ కార్యాలయంలోకీ చొరబడి.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, నిప్పటించారు. దీంతో పోలీసు బలగాలను భారీగా రప్పించారు. ఎస్పీతో పాటు  పలువురు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్‌పార్టీ పోలీసులు చేరుకున్నారు.
 
ఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం వద్ద  ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరో దారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లడం కూడా తప్పేనా అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసులను నిలదీశారు. పది నెలల్లో చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, పోలీసులు ఏం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి నిలదీశారు.

డీజీపీ వచ్చిన రోజే పెద్దవడుగూరులో హత్య, అనంతపురం తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషాపై దాడి చేశారని గుర్తు చేశారు.  ఇవాల తహశీల్దార్ కార్యాలయంలోనే ప్రసాదరెడ్డిని హతమార్చారన్నారు. ఇవన్నీ మీ నిర్లక్ష్యంతోనే జరిగాయంటూ మండిపడ్డారు.  డీఎస్పీలు చివరకు జిల్లా ఎస్పీకి సమాచారాన్ని అందించారు.  ఎస్పీ  వచ్చి  ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామనడంతో వారు శాంతించారు.
 
పక్కా వ్యూహం ప్రకారం హత్య
ప్రసాదరెడ్డి హత్య పక్కా వ్యూహం ప్రకారం జరిగింది. ప్రసాదరెడ్డి బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వస్తారనే సంగతిని ప్రత్యర్థులు ముందే ఎలా పసిగట్టారనే దానిపై బోలెడు అనుమానాలు తలెత్తుతున్నాయి.కార్యాలయానికి ప్రసాదరెడ్డిని..తహశీల్దార్ హరికుమార్, ఆర్‌ఐ దివాకర్ ఫోన్ చేసి పిలిపించినట్లు ఆయన సోదరుడు మహానందరెడ్డి చెబుతున్నారు. పైగా ప్రత్యర్థులు ఆర్‌ఐ ఛాంబర్‌లోకి వచ్చిన తర్వాత అక్కడి బీరువాలో నుంచి వేటకొడవళ్లను తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అంటే పథకం ప్రకారమే వేటకొడవళ్లను బీరువాలో ఉంచి, హత్యకు రెవె న్యూ అధికారులు కూడా సహకరించారని తెలుస్తోంది.
 
ఎస్‌ఐ నాగేంద్రప్రసాద ఆధ్వర్యంలోనే హత్య?
ప్రసాదరెడ్డి హత్యకు రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్  పూర్తిగా సహకరించారని మహానందరెడ్డి ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్ పక్కపక్కనే ఉన్నాయి. రెంటికీ ముళ్లకంచె మాత్రమే అడ్డు. పైగా హత్య జరిగిన ప్రదేశంలో ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. అది ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్‌ఐ కూడా హత్య జరిగే సందర్భంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు. నాగేంద్రప్రసాద్ ఇటీవలే  పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. టీడీపీ నేతలకు ఈయన పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను రాప్తాడుకు బదిలీ చేయించినట్లు ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు.
 
13 మందిపై కేసు : ప్రసాదరెడ్డి హత్యకు సంబం ధించి 13 మందిపై   కేసు నమోదు చేశారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.  
 
తలశిల రఘురాం పరామర్శ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రసాదరెడ్డి కుటుంబీకులను ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రసాదరెడ్డి తమ్ముడు మహానంద రెడ్డితో మాట్లాడారు.  
 
మృతదేహం తీసుకెళ్లకుండా ఆందోళన
ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్టీ కార్యకర్తలు, మిహ ళలు తహశీల్దార్ కార్యాలయం గేటు ఎదురుగా బైఠాయించి ఆందోళన చేశారు. చివరకు ఎస్పీ రాజశేఖర్‌బాబు.. ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి,మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించారు.

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. దీంతో ప్రసాదరెడ్డి వాహనంలోనే మృతదేహాన్ని  అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డితో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు.

చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం


చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం
సందర్భం
 
అమరావతి, బీజింగ్ మధ్య రక్తచందన మార్గం నిర్మించాలని చంద్రబాబు ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్ ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరడానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ?
 
చంద్రబాబు చైనా యాత్రలో సాధించిన విజయాల గురించి మీడియాలో రంగు రంగుల కథనాలు వచ్చాయి. వస్తున్నా యి. రాష్ర్టంలో అపారంగా ఉన్న  ఎర్రచందనం నిల్వల్ని  చైనాకు అమ్మడానికి  రంగం సిధ్ధమైందనీ, అలా సమకూరే నిధులతో కొత్త రాజధాని అమ రావతి నిర్మాణం చేపడతారనేది ప్రధానాంశం. కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపా యలు ఖర్చవుతుందని ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు అంచనా వేశారు. ఆ నిధుల్ని తాను మిత్రపక్షంగా ఉం టున్న నరేంద్రమోదీ ప్రభుత్వం అందిస్తుందని వారు ఇన్నాళ్లూ రాష్ర్ట ప్రజల్ని నమ్మిస్తూ వచ్చారు.

నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభు త్వ సహాయం, రైతుల రుణమాఫీ అనే రెండు అంశాలు చంద్రబాబు పక్షాన లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు భిన్నంగా ఉండేది. ఇప్పుడు కొత్త రాజ ధానికి కేంద్ర నిధుల వ్యవహారం కూడా అటకెక్కినట్టే కనిపిస్తోంది. అనుమానం ఉన్న వాళ్లు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సాక్షాత్తు పార్లమెంటులో ఇచ్చిన  డిజిటల్ డిస్‌ప్లేను చూడవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమూ లేదు. మాకు ఆ ఉద్దేశమూ లేదని వారు కుండబద్దలు కొట్టారు.
 ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు సమకూ ర్చుకోవడానికి బాబు దగ్గరున్న ఏకైక వనరు ఎర్రచం దనం నిల్వలే. గత ఏడాది రాష్ర్ట ప్రభుత్వం గ్లోబల్ టెం డర్ల ద్వారా 4,160 టన్నుల ఎర్రచందనం దుంగలను అమ్మకానికి పెట్టినపుడు సగటున టన్నుకు 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 750  కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఈ లెక్కన 5 లక్షల కోట్ల రూపా యల నిధుల సమీకరణకు రాష్ర్ట ప్రభుత్వం దాదాపు 30 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ యూని యన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ అంతరించిపో తున్న వృక్ష సంతతిగా పేర్కొన్న ఎర్రచందనాన్ని ప్రభు త్వం ఆ స్థాయిలో అమ్మకానికి పెట్టవచ్చునా? అనేది ఇంకో సందేహం.

2012 అక్టోబర్‌లో అంతర్జాతీయ బయోడైవర్సిటీ సదస్సు హైదరాబాద్‌లో జరిగినప్పుడే ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది.  పెళుసుగా ఉండే ఎర్ర చందనం కలప ఫర్నిచర్‌కు పనికిరాదనీ, దాన్ని అణు విద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారని చైనా గుట్టు విప్పారు. ఎర్రచందనాన్ని చైనా అణు విద్యుత్ కేంద్రా ల్లోనే వినియోగిస్తోందా? లేక అణ్వాయుధాల తయారీ లోనూ వినియోగిస్తోందా? అన్నది కూడా ఎవరికైనా రావలసిన సందేహమే. దీనికి సమాధానం రెండోది కూడా అయితే చైనా అణ్వాయుధ పాటవాన్ని పెంచుకో వడంలో మనం సహితం ఎర్రచందనం పేడు ఒకటి ధారబోస్తున్నామన్న మాట.

చైనాలో చంద్రబాబు 11 ఒప్పందాలు చేసుకున్నా రనే  వార్త వచ్చిన రోజునే చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోం దని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. కీలక మైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై చైనా ప్రభుత్వం నిఘా ఉంచిం దని ఆ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడి కీలక మైన సమాచారాన్ని సేకరిస్త్తున్నారన్నది దీని సారాంశం. భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియ త్నాం, మలేసియా, నేపాల్, సింగపూర్, ఇండోనేసియా లాంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూ ఢచర్యం సాగిస్తోందని ఆ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది.

బాబు ఇండియా విమానం ఎక్కిన మరునాడే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాకిస్తాన్ విమానం ఎక్కారు. నవాజ్ షరీఫ్‌ని ఆలింగనం చేసుకుని ‘మన స్నేహబం ధం కొండలకన్నా ఎత్తయినది, సముద్రాలకన్నా లోతై నది, తేనెకన్నా తీయనైనద’ని అన్నారు. ప్రపంచపటం మీద చైనా ఒంటరిగా ఉన్నప్పుడు బీజింగ్‌కు స్నేహ హ స్తాన్ని సాచింది ఇస్లామాబాద్ ఒక్కటేనని గుర్తు చేసుకు న్నారు. ఈ ఏడాది తన విదేశీ పర్యటనని పాకిస్తాన్‌తోనే మొదలు పెట్టానని గొప్పగా చెప్పుకున్నారు. అటు నవా జ్ షరీఫ్ కూడా జిన్ పింగ్‌కు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఈ -పాకిస్తాన్’తో సత్కరిం చారు. ఇది మన భారతరత్నతో సమానం.

ఒకవైపు, సాంస్కృతిక సారూప్యత రీత్యా ఏపీ కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని బాబు కోరి వస్తే, మరోవైపు చైనా తన దేశం నుంచి  మధ్యధరా సముద్రానికి చేరే  చారిత్రక సిల్క్ రూట్ పునరుద్ధరణకు పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంది.  రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ 3 వేల కిలోమీటర్ల కారిడార్ ప్రాజెక్టు వల్ల పాకిస్తాన్-చైనా మధ్య రోడ్డు లింకులు రైలు మార్గా లు, పైపులైన్లు నిర్మించనున్నారు.

అమరావతి బీజింగ్ మధ్య బాబు రక్తచందన మార్గం నిర్మించాలని ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్  ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేర డానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ?
 (రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
 మొబైల్ : 76749 99063
 - డానీ
http://www.sakshi.com/news/opinion/another-aspect-of-the-trip-to-china-on-chandrababu-234675?pfrom=home-top-story

Popular Posts

Topics :