24 May 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకే వైఎస్ జగన్ దీక్ష

Written By news on Saturday, May 30, 2015 | 5/30/2015


'ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకే వైఎస్ జగన్ దీక్ష'
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాహారదీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే వైఎస్ జగన్ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు,బాధితులంతా హాజరుకానున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగానే  మంగళగిరిలో వైఎస్ జగన్ చేపట్టబోతున్న దీక్షా ప్రాంతాన్ని శనివారం సుబ్బారెడ్డి పరిశీలించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి  టీడీపీ మహానాడులో  కనీసం తీర్మానం కూడా చేయకపోవడాన్ని సుబ్బారెడ్డి తప్పుబట్టారు. చంద్రబాబుకు అసలు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదనడానికి ఇదొక ఉదాహరణగా అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతుంటే ఇంకా ఏ ముఖం పెట్టుకుని విజయ యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు.

అంతర్జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే బాగుండేది


'అంతర్జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే బాగుండేది'
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ పార్టీ నిబంధనలు తెలియకుండానే బాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెవిరెడ్డి విమర్శించారు.  చంద్రబాబుకు జాతీయ పార్టీ నిబంధనలు అసలు తెలుసా?అని ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు రావాలన్న ఎన్నికల కమిషన్ నిబంధన బాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
 
జాతీయ పార్టీ అధ్యక్షుడికంటే.. అంతర్జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే బాగుండేదని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే వారికి భారతరత్న ఇస్తే.. దానికి చంద్రబాబు అర్హత సాధిస్తారన్నారు. చంద్రబాబు చీకటి పాలనకు సమరదీక్షతో చరమగీతం పాడతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని పట్టిసీమ కమీషన్లతోనే అంగరంగ వైభవంగా నిర్వహించారని విమర్శించారు.

చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి


'చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి'
విజయవాడ: అవినీతి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం బాధగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. స్వదేశీ సంపదను హవాలా రూపంలో సింగపూర్ తరలించి అక్కడ హోటళ్లు నిర్మించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. అవినీతి గురించి ప్రశ్నించే ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి హితవు పలికారు. అవినీతి ఆస్తులు పంచుతాననడం సంతోషమే, కానీ ముందు తను తరలించిన హవాలా ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంచాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. జూన్ 3,4 తేదీల్లో మంగళగిరిలో జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టనున్న సమర దీక్షను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలు, ప్రజలకు సూచించారు.
శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ అభ్యర్థి జి. అదిశేషగిరిరావు సమావేశమయ్యారు. టీడీపీ మహానాడులో శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డిపై విధంగా స్పందించారు. ఈ సమావేశంలో  కొడాలి నాని మాట్లాడుతూ... టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ జాతీయ పార్టీ కాదు... ఉప ప్రాంతీయ పార్టీనే అని కొడాలి నాని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలతో రైతులను, మహిళలను బాబు మోసం చేసి అధికారంలోకి వచ్చారని ... ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కవని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
కృష్ణాజిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ప్రముఖ నటుడు  జి. కృష్ణ సోదరుడు జి అదిశేషగిరిరావుని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అదిశేషగిరిరావు విజయం సాధించేందుకు విజయసాయిరెడ్డి, కొడాలి నాని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. 

రాజధాని కట్టలేమన్న అపనమ్మకంతోనే విపక్షాన్ని తిడుతున్నారు


రాజధాని కట్టలేమన్న అపనమ్మకంతోనే  విపక్షాన్ని తిడుతున్నారు
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం
టీడీపీ నేతలు తమను తాము పొగుడుకోవడానికే మహానాడు పరిమితమైందని ఎద్దేవా

 
హైదరాబాద్ : తన ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చే యలేనన్న అపనమ్మకంతోనే సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని విషయాల్లో చంద్రబాబు వ్యవహరించే తీరునే రాజధాని విషయంలోనూ ఊహాజనిత మాటలతో ప్రజల్ని మోసం చేయడంతప్ప ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద రాజధాని నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలకు వాటిని తాకట్టు పెట్టాలన్న బాబు ప్రభుత్వ ప్రయత్నాలపట్లే తమ పార్టీ తొలినుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.

ఈ విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మహానాడులాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే.. సాధారణంగా రాబోయే ఏడాది, రెండేళ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసే కార్యక్రమాలపై భవిష్యత్ ఎజెండాను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుందని, కానీ మహానాడు జరుగుతున్న తీరును చూస్తే తమను తాము పొగుడుకోవడానికే పరిమితమైందని తప్పుపట్టారు. చంద్రబాబు వారసుడి ఎంపికకు మహానాడును ఉపయోగించుకుంటున్నారేతప్ప ప్రజల అంశాలపై ఇందులో చర్చలు లేవని జ్యోతుల దుయ్యబట్టారు.
 

భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం!


ఔను..  ప్రైవేటు రాజధానే
రాజధాని నిర్మాణం కేవలం 2 వేల ఎకరాల్లోనే
5,200 ఎకరాలు 99 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు
కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే 34 వేల ఎకరాలు సేకరణ
మాస్టర్ డెవలపర్‌గా రహస్యంగా సింగపూర్ బిడ్ దాఖలు
స్విస్ చాలెంజ్ పేరుతో పనులు కట్టబెట్టనున్న సర్కారు
టీడీపీ మహానాడు తీర్మానంలో వెల్లడైన నిజాలు    

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో రైతులనుంచి పచ్చని పొలాలు బలవంతంగా గుంజుకుంది కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకేనని స్పష్టమైంది. ప్రజారాజధాని పేరుతో ‘ప్రైవేటు’ రాజధాని రాబోతోందని వెల్లడైంది. మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ఉచితంగా రూపొందించడం అబద్ధమేననీ... మాస్టర్ డెవలపర్‌గా పనులు కట్టబెట్టడమే తెరవెనుక విషయమనీ తెలిసిపోయింది. రాజధాని నిర్మించేది మాత్రం కేవలం రెండువేల ఎకరాల్లోనేననీ... అంతకు రెండింతల భూమి 5,200 ఎకరాలు సింగపూరు కార్పొరేటు సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమనీ బట్టబయలైంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని, 21వ శతాబ్దపు రాజధాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ మాయమాటలేనని... ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ఆయన అసలు లక్ష్యమనీ వెల్లడైంది. ఆ మాత్రం దానికి 34 వేల ఎకరాల పంటపొలాలను నాశనం చేయడమెందుకని మీరు ప్రశ్నిస్తే... రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రంకెలేస్తారు. అలాంటివారికి పుట్టగతులుండవని శాపనార్థాలూ పెడతారు. కానీ ‘ప్రపంచస్థాయి నగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం’ పేరుతో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆమోదించిన తీర్మానంలోకి వెళితే చంద్రబాబు ‘మనసులోని మాట’ తెలిసిపోతుంది.
 
భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం

‘అమరావతి’ నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులనుంచి అడ్డగోలుగా 34 వేల ఎకరాలు సేకరించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే... ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న విజన్‌తో తాము ముందుకుపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయించారు. రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కానీ నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలకు రెండువేల ఎకరాలు సరిపోతుందని మహానాడులో ఆమోదించిన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల నుంచి సమీకరించిన 34 వేల ఎకరాల్లో రోడ్లు, పార్కులు, సామాజిక సదుపాయాలకు కేటాయించగా మిగిలేది 7,200 ఎకరాలు మాత్రమేనని తెలిపారు. అయితే అందులో రెండువేల ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకోసం ఉపయోగించి మిగిలిన 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేస్తారట. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు  (జీవో నంబర్-110) జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జీవో ఆధారంగానే రాజధాని నగరంలో 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టబోతున్నారు. రాజధానిలో వాణిజ్య సముదాయాలు, ఇతర కార్యకలాపాల కోసం ఈ భూమిని కేటాయించాల్సిన అవసరముందని టీడీపీ తీర్మానంలో  పేర్కొన్నారు. అంటే కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వం భూసమీకరణ పేరిట పచ్చని పంటపొలాలను లాక్కొందన్నమాట. రాజధాని ప్రాంతంలో భూములు కావాలంటే ప్రైవేటు సంస్థలే కొనుగోలు చేసుకోవచ్చు. కానీ  రైతులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రభుత్వం చవకగా భూములను సమీకరించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు దక్కాల్సిన సొమ్మును తాము దక్కించుకునేందుకే సర్కారు పెద్దలు భూసమీకరణ తతంగం నడిపించారన్న వాదనలు  వినిపిస్తున్నాయి.

34,000  ఎకరాలు

రాజధాని పేరుతో ప్రభుత్వం సేకరించిన భూమి
 
2,000 ఎకరాలు
ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోయే భూమి
 
5,200 ఎకరాలు
99 ఏళ్ల పాటు ప్రభుత్వం సింగపూర్ కార్పొరేట్లకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన భూమి
 
రహస్యంగా రంగంలోకి మాస్టర్ డెవలపర్
 సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ వచ్చి రాజధాని రెండో విడత మాస్టర్ ప్లాన్ అందజేసిన సంగతి తెలిసిందే. ఆ రోజుకు కూడా మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయలేదని, స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి మహానాడులో చేసిన తీర్మానంలో... మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ బిడ్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. మాస్టర్ డెవలపర్‌గా ఏ ప్రాతిపదికన, ఎలాంటి నియమ నిబంధల ప్రకారం బిడ్ దాఖలు చేశారో, ఆ బిడ్‌లో ఏమేం కోట్ చేశారో ప్రభుత్వం రహస్యంగా ఉంచడం... సింగపూర్ బిడ్ దాఖలు చేసిందనీ, త్వరలోనే స్విస్ చాలెంజ్ విధానంలో త్వరలోనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తామని మహానాడు తీర్మానంలో పొందుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటికి తోడు సీఆర్‌డీఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి జపాన్ ముందుకొచ్చిందని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

సీఆర్‌డీఏ పరిధిలో అంటే రాజధాని కోర్ ఏరియా కాకుండా దాని బయట జపాన్ సంస్థలు వస్తాయని స్పష్టమవుతోంది. అలాగే రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి నిధుల సేకరణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు కూడా అందులో వివరించారు. రాజధాని నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వపరంగా పారదర్శకంగా జరగాల్సిన ఇలాంటి విషయాలను తెలుగుదేశం పార్టీ మహానాడులో బహిర్గతపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. ‘ప్రైవేట్’ రాజధాని శీర్షికతో సాక్షి ప్రచురించిన వార్త అక్షరసత్యమని టీడీపీ మహానాడు సాక్షిగా వెల్లడైంది. రాజధానికోసం రైతులనుంచి సేకరించిన పంటపొలాల్లో వేల ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు 99 ఏళ్లు ధారాదత్తం చేయనుందన్న వాస్తవం నిజమైంది. 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు మహానాడు తీర్మానాల్లో పేర్కొన్నారు.
 

ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన

Written By news on Friday, May 29, 2015 | 5/29/2015


నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 7 గంటలకు సత్తుపల్లి మండలంలోని గంగారంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించనున్న ఆదర్శ గ్రామ సమీక్షకు ఎంపీ హాజరవుతారు. శనివారం ఉదయం 8 గంటలకు గంగారంలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు.

రాక్షస స్వభావాలు, గుణాలు ఆయనకే సొంతం


'రాక్షస స్వభావాలు, గుణాలు ఆయనకే సొంతం'
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలను రాక్షసులతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాక్షస స్వభావాలు, రాక్షస గుణాలు చంద్రబాబు నాయుడుకే సొంతం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమీలేక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఇతరుల గురించి బాబు అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

బాబూ.. జాబు!

Written By news on Thursday, May 28, 2015 | 5/28/2015

♦ పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య
♦ టీడీపీ ఏడాది పాలనలో డీఎస్సీతో సరి
♦ జన్మభూమి కమిటీల సర్వేలో తేలిన నిరుద్యోగుల సంఖ్య 1,03,000
♦ వాస్తవంలో 8లక్షల పైమాటే
♦ నోటి మాటగా మారిన ఎన్నికల హామీ

 
 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి రూ.2వేలు.. జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారం నోటి మాటగానే మిగిలిపోతోంది. ఎన్నికల వేళ ఇలాంటి హామీలను ఊదరగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడా ఊసే మరిచారు. ముఖ్యమంత్రి సైతం ఉద్యోగాల మాట మరిచి.. ఉన్న ఉద్యోగులనూ ఇంటికి పంపుతున్నారు. ఏడాది పాలనలో ఒక్క డీఎస్సీ తప్పిస్తే.. ఇతరత్రా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం హామీల అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.90 లక్షల కుటుంబాలు ఉన్నాయి.

ఈ కుటుంబాల్లో సుమారు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 92వేలు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా చేయించిన సర్వేలో నిరుద్యోగుల సంఖ్య 1,03,000 మందిగా తేలింది. లెక్కల మాటల ఎలాగున్నా యేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం. 2014లో ఇంటర్ అర్హతతో నిర్వహించిన వీఆర్వో పరీక్షకు దాదాపు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది డిగ్రీ క్వాలిఫికేషన్‌తో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 4 లక్షల మంది హాజరయ్యారు. ఈ సంఖ్య నిరుద్యోగ భారతాన్ని తెలియజేస్తోంది.

 నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపు
 జిల్లాలోని నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల కాగా.. మొత్తం 700 పోస్టుల్లో దాదాపు 500 ఎస్జీటీవే. వీటికి బీఎడ్ అభ్యర్థులకు అర్హత లేకపోవడం నిరుద్యోగులను నిరాశపర్చింది. ప్రధానంగా జిల్లాలోని యువకులు పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీటి ఊసే లేకపోవడంతో వయస్సు పైబడిపోతుందని వాపోతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ తల్లిదండ్రులకు భారమవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఊడిన ఉద్యోగాలు
 చంద్రబాబు  ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణ, వ్యవసాయశాఖల్లో ఉద్యోగులను ఇంటికి పంపారు. వ్యవసాయ శాఖలో దాదాపు వంద మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, గృహనిర్మాణ శాఖలో 168 మంది ఉద్యోగులను తొలగించారు. వీరంతా ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు వయస్సు మీరిపోవడం.. ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్

Written By news on Wednesday, May 27, 2015 | 5/27/2015


చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆడుతున్న అబద్ధాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో రైతులు దారుణంగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రైతులు ఆశలు వదులుకోక ముందే వారి తరపున పోరాడతామని ట్విటర్ లో పేర్కొన్నారు. రైతుతో తాను మాట్లాడుతున్న ఫోటోను వైఎస్ జగన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

'అనంతపురం జిల్లాలో నెలకొన్న క్షేత్రస్థాయి వాస్తవాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలు.. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ వర్గాల గొంతుకగా నిలవడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది' అని అంతకుముందు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

ఏడాది పాలనలో ఏం చేశారు!

 రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు
  వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టాలనే స్థాయికి దిగజారారు
  పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తట్ట మట్టి కూడా తీయలేదు
  కలెక్టరేట్ వద్ద ధర్నాలో కొత్తపల్లి, నాయకుల ఆగ్రహం
 
 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ‘ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశార’ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో టీడీపీ వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని మహిళలే పట్టుపట్టడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీనినిబట్టే అర్థమవుతోందని అన్నారు.
 
 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న పెద్దమనిషి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడకొడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వారిపై కేసులు పెట్టండని పత్రికల్లో ప్రకటించే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మొత్తం సీట్లను కట్టబెట్టినప్రజల నోట్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మట్టి కొడతామంటున్నారని ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా పోలవరం ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే  భయంతోనే పనులను
 
 నీరుగార్చుతున్నారన్నారు.నిప్పులు చెరిగిన నాయకులు
 పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాల రాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున ఐదు సంతకాలు పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు, హత్యాకాండలతోనే టీడీపీ ఏడాది పాలన గడిచిందని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్ను మినహాయింపులు, రాయితీలు వచ్చేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
 
  గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.  ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు  మహిళల ఆత్మగౌరవాన్ని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి మాట్లాడుతూ నీరు- చెట్టు పథకం ద్వారా తెలుగు తమ్ముళ్లు రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు.
 
 ఆచంట కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ టీడీపీకి అధికారం ఎంతో కాలం ఉండదని గ్రహించి ఆ పార్టీ నాయకులు ఇప్పటినుంచీ అన్నీ చక్కబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దెందులూరు కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలని చంద్రబాబు ప్రకటించడం  దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. బాబు కన్నా ఫ్యాక్షనిస్టు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.కాశిరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్లు పార్టీ నాయకులు తానేటి వనిత, పుప్పాల వాసుబాబు, నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, కారుమంచి రమేష్, చలమోలు అశోక్‌గౌడ్, వి.విజయనరసింహరాజు, ముప్పిడి సంపత్‌కుమార్, చెల్లెం ఆనందప్రకాష్,  లంకా మోహన్‌బాబు, పోల్నాటి బాబ్జి, పెన్మెత్స సుబ్బరాజు పాల్గొన్నారు.

రైల్వే సమస్యలు పరిష్కరించండి

Written By news on Tuesday, May 26, 2015 | 5/26/2015


రైల్వే సమస్యలు పరిష్కరించండి
- దక్షిణ రైల్వే జీఎంకు ఎమ్మెల్యే రోజా వినతి
- తిరుపతి - చెన్నై మధ్య డీజీ రైలు
 పుత్తూరు:
నగరి నియోజకవర్గ పరిధిలోని రైల్వేస్టేషన్లల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె చెన్నైలోని సదరన్ రైల్వే జీఏం అశోక్‌కుమార్ అగర్వాల్, డీఆర్‌ఎం అనుపం శర్మలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మె ల్యే పేర్కొన్న ప్రధాన సమస్యలు ఇవీ..
- ప్రధానంగా ఏకాంబర కుప్పం రైల్వే గేటు వద్ద రాకపోకల సందర్భంగా రోడ్డు ఛిద్రమైపోవడంతో తరచూ ఇబ్బందులు  ఏర్పడుతున్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
-ప్రయాణికులకు షెల్టర్లు, పైనుంచి దిగే ప్రయాణికులకు వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలి. ఇక్కడ చెన్నై- ముంబై ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌కు చర్యలు తీసుకోవాలి.
- నగరి రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్లాట్ ఫాం పెంచాలి.
- సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు చెన్నై నుంచి తిరుత్తణి వరకు వచ్చే యూనిట్ ట్రైన్‌లను తిరుపతి వరకు పొడిగించాలి. -పుత్తూరు రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ రెండు షిప్టులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
- ప్రస్తుతం ఉన్న షెల్టర్లు ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడంలేదు. కొత్తగా షెల్టర్లు నిర్మించాలి.
- తాగునీటి సౌకర్యంతో పాటు వెయిటింగ్ హాల్‌లో అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి.
- పూడి రైల్వేస్టేన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. అక్కడ అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే ఏర్పాటుచేయాలి.
- ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్‌లైన్లు ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్‌తో పాటు పక్కనే ఉన్న ఊరికి 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
- పాత రైల్వేస్టేషన్ బిల్డింగ్‌ను వెయింటింగ్ హాల్‌గా మార్చాలి. అలాగే అప్రోచ్‌రోడ్లు వేయాలి.
- వేపగుంట రైల్వేస్టేషన్ వద్ద లిఫ్ట్ గేటు మరమ్మతులు చేపట్టాలి. ప్లాట్‌ఫాం పెం చడంతో పాటు ప్రయాణికులకు తాగునీ టి వసతి, ఇరువైపులా షెల్టర్లు నిర్మిచాలి.
- ఎమ్మెల్యే రోజాతో పాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్, నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె.శాంతికుమార్, వైఎస్‌ఆర్‌సీపీ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెజె.కుమార్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలుమలై(అమ్ములు)తో పాటు పుత్తూరు, నగరి నాయకులు రైల్వే ఉన్నతాధికారులను కలిసిన వారిలో ఉన్నారు.

తిరుపతి - చెన్నై డీజీ రైలు
తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడు తూ, తిరుపతి నుంచి పుణ్యక్షేత్రాల మీదుగా షిర్డీకి డీజీ రైలు నడపాలని గతంలో కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామని పేర్కొంటూ, మరికొద్ది రోజు ల్లో ఇది కార్యరూపం దాల్చబోతోందన్నారు. కేంద్రం పచ్చ జెండా ఊపడంతో త్వరలో ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట ైరె ల్వే స్టేషన్లలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.

సింగపూర్ ప్రభుత్వం మన మేనమామ కాదు..


సింగపూర్ ప్రభుత్వం మన మేనమామ కాదు..
వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి 
 సాక్షి, హైదరాబాద్ : రాజధాని మాస్టర్ ప్లాన్ ఫ్రీగా గీసీవ్వడానికి సింగపూర్ ప్రభుత్వమేమీ మన మేనమామ కాదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి  అన్నారు. సింగపూర్ సంస్థలు అందజేసిన రెండో విడత మాస్టర్ ప్లాన్‌పై ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి ప్రణాళికలను ఎవరూ ఉచితంగా గీయరని మైసూరారెడ్డి చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం గుణం మంచిది కాదని తెలిపారు. కాంట్రాక్ట్ పొలిటికల్ సిస్టమని చెప్పి చైనీయులు సింగపూర్‌ను  తరిమేశారన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ అంతగా గొప్పగా లేదని చెప్పారు.
 
 ఈ ప్లాన్ గీయడానికి డబ్బులు, టెక్నాలజీ, ప్రభుత్వం అవసరం లేదన్నారు. ఇదే ప్లాన్‌ను పార్టీ తరపున కూడా గీయవచ్చని చెప్పారు.  రాజధాని ప్రభుత్వం చేతుల్లో ఉండాలని, ప్రైవేటు చేతుల్లో పెట్టకూడదని చెప్పారు. బ్లూ ప్రింట్, మాస్టర్ ప్లాన్ అమలుకు అసలు సమస్య డబ్బని చెప్పారు.సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి నిధులిస్తామని విభజన బిల్లులో పొందుపచారని గుర్తు చేశారు. రాజధాని కోసం సమీకరించిన రైతుల భూములకు ప్రభుత్వం డెవలపర్ కాదని, కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుందన్నారు. దీనిని పారిశ్రామిక అవసరాలకు తీసుకునే దాంతో పోల్చలేమన్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు.
 
 దోచుకోవడానికే ‘మాస్టర్ ప్లాన్’: వాసిరెడ్డి పద్మ
 రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న పది వేల ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే రాజధాని మాస్టర్ ప్లాన్‌ను వారి నుంచి రూపొందింప జేశారని, తెలుగువారికి ఇదో దుర్దినమని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగపూర్ సంస్థల కుటుంబీకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన బినామీలు పరస్పరం దండుకునేందుకే ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు.
 
  పరస్పరం ఇది ఓ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లాంటిదన్నారు. తెలుగు వారి సంసృ్కతీ సంప్రదాయాలు, తెలుగుదనం ఉట్టిపడేలా నిర్మించాల్సిన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి తెలుగు వారిలో నిపుణులే కరవయ్యారా? అని ఆమె ప్రశ్నించారు.పది వేల ఎకరాలు సింగపూర్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలపై ఇప్పటి వరకూ చంద్రబాబు నోరు విప్పలేదని, అసలు విషయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబీకుల పర్యటనల వివరాలు బయట పెడితే ఆ దేశంలో వారికున్న ఆస్తులేంటో, వారికి అనుబంధం ఉన్న కంపెనీల వివరాలేంటో బయట పడతాయని ఆమె అన్నారు.

వైఎస్సార్‌సీపీ యూత్ నల్లగొండ జిల్లా కార్యవర్గం

Written By news on Monday, May 25, 2015 | 5/25/2015

 నల్లగొండ టుటౌన్  : వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ జిల్లా కార్యవర్గాన్ని పార్టీ అధిస్థానం ప్రకటించింది. గతంలోనే జిల్లా కొత్త అధ్యక్షున్ని నియమించిన పార్టీ అధినాయకత్వం సోమవారం పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించింది. మొత్తం 57 మందితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ పార్టీ కేం ద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
 
 జిల్లా నూతన కార్యవర్గం ఇదే...
 జిల్లా ప్రధాన కార్యదర్శులగా జశ్వంత్‌రెడ్డి (కోదాడ), సంద రవి (తుంగతుర్తి), తోకల శేఖర్‌యాదవ్ (భువనగిరి), చింత నవీన్‌కుమార్ (నల్లగొండ), సుక్క సుందర్‌రావు (సూర్యాపేట), తిరుగుమళ్ల సలీమ్‌రాజ్ (దేవరకొండ), పోకల అశోక కుమార్ (నకిరేకల్), కందుల బాలకృష్ణారెడ్డి (మిర్యాలగూడ), కంచర్ల రవీందర్‌రెడ్డి (హుజూర్‌నగర్)లను నియమించారు. అదే విధంగా జిల్లా యూత్ అధికార ప్రతినిధులుగా కె.శ్రీకాంత్, కొండూరి ఉపేందర్ (కోదాడ), గౌడిచెర్ల మహేష్ (తుంగతుర్తి), ఎండీ రఫీ (సూర్యాపేట), కుమ్మ ప్రమోద్‌రెడ్డి (మిర్యాలగూడ), తుమ్మలూరి ఆధిత్య (హుజుర్‌నగర్)లు నియమితులయ్యారు. జిల్లా కార్యదర్శులుగా గోవర్ధన్‌రెడ్డి, పి.వెంకటదుర్గారెడ్డి (కోదాడ), నల్లమాస సతీష్ (తుంగతుర్తి), జి.భానుప్రకాశ్‌రెడ్డి (భువనగిరి), మామిళ్ల జాన్ యాదవ్ (నల్లగొండ), యర్రంశెట్టి లక్ష్మణ్ (నకిరేకల్),
 
  బేసు మల్లేష్ గౌడ్ (సూర్యాపేట), ముడావత్ స్వామీ (దేవరకొండ), మహేశ్వరపురం బిక్షం (మిర్యాలగూడ), కర్నాటి వెంకట్‌రెడ్డి (హుజుర్‌నగర్)లను నియమించారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా వినోద్‌రెడ్డి, వి.ప్రవీణ్ (కోదాడ), ఏషమలన్ రమేష్, మామిడి లింగయ్య (తుంగతుర్తి), జి.బాలశేఖర్ (భువనగిరి), తాడెం అనిల్ కుమార్, తెల్సూరి సైదులుయాదవ్ (నల్లగొండ), పట్టేటి కిరణ్ కుమార్, పోతు సాగర్ (సూర్యాపేట), మాతంగి కరుణాకర్ (మిర్యాలగూడ), రెడపంగు ముక్తేశ్వర్‌రావు (హుజూర్‌నగర్), జిల్లా కార్యవర్గ సభ్యులుగా వి.శ్రీధర్,
 
 టి.సాయిప్రకాశ్‌రెడ్డి (కోదాడ), కడారి యల్లయ్య, వేముల రామదాసు (తుంగతుర్తి), మల్లె శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ బాబా, షేక్ గౌస్ పాషా, ఎస్. వెంకటేశ్వర్లు (సూర్యాపేట), ప్రభాదు రెడ్డి చంద్రారెడ్డి (మిర్యాలగూడ), తులూరి సాయి, జి.నరేందర్‌రెడ్డి (హుజూర్‌నగర్)లు నియమితులయ్యారు. అదే విధంగా పట్టణాధ్యక్షులుగా గోరెంట్ల సంజీవ (సూర్యాపేట), లంకెల కృష్ణారెడ్డి (కోదాడ), బబ్బూరి నరేష్‌గౌడ్ (భువనగిరి), సీహెచ్. సాయి చరణ్ (నల్లగొండ), తంగెళ్ల నరేందర్‌రెడ్డి (మిర్యాలగూడ), కొమ్మరాజు శ్రీను (హుజూర్‌నగర్)లను నియమించారు.  

నోరు నొక్కేస్తున్నారు : రోజా

చెన్నై : సమస్యలపై ఎవరు నోరు విప్పినా వారి గొంతు నొక్కేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని కోరుతూ చెన్నైలోని దక్షిణ రైల్వే జీఎం అశోక్ కే అగర్వాల్, రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఎస్‌ అనంతరామన్‌లతో.. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి రోజా సోమవారం భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అందరితో కలసి చర్చించి, అభిప్రాయాల సేకరణతో రాజధానిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల కడుపు కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి ఉందన్నారు. బలమైన పార్టీగా, ప్రతిపక్ష నేతగా ఉన్న తమ నేత జగన్ మోహన్ రెడ్డిని, పార్టీ వర్గాల్ని అణగదొక్కేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, శాంతి భద్రతల సమస్యలను సృష్టించడమే కాకుండా అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.

తెలుగు ప్రజలకు ఇది దుర్దినం


తెలుగు ప్రజలకు ఇది దుర్దినం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ మంత్రి విడుదల చేయడం బాధాకరమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈరోజు తెలుగుప్రజలకు దుర్దినమని ఆమె వ్యాఖ్యానించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించుకోలేని దీనస్థితిలో తెలుగు ప్రజలున్నారా అని ప్రశ్నించారు. పరిపాలన కూడా సింగపూర్ కో, జపాన్ కో ఇచ్చేయాలని ఎద్దేవా చేశారు.

ఇక్కడివారితో మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సింది పోయి విదేశీ సంస్థలతో రూపొందించడం ఏంటని నిలదీశారు. పేరుకే అమరావతి కానీ, మేడిన్ సింగపూర్ లా తయారుచేశారని ఆమె మండిపడ్డారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. మాస్టర్ ప్లాన్ వెనుక మీ ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆమె అన్నారు.

సేవాదళ్‌లోకి మహిళా శక్తి

 చెన్నై : వైఎస్‌ఆర్ సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు. మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేపట్ట దలచిన దీక్షకు చెన్నై నుంచి అభిమానులు తరలిరావాలని ఈసందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ సేవాదళ్ బలోపేతం లక్ష్యంగా  ఉపాధ్యక్షుడు జకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి మేడగం శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను ఏకం చేయడం, సేవాదళ్‌లోకి ఆహ్వానించే పనిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తాజా, మహిళా లోకం కదిలింది. సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు.
 
 ఆ దళ్ సంయుక్త కార్యదర్శి ఆబోతుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైకోర్టు మహిళా  న్యాయవాది కమలాపురం లక్ష్మీ శ్రీదేవి రెడ్డి నేతృత్వంలో పదిహేను మంది మహిళలు ఆదివారం సేవాదళ్‌లోకి చేరారు. మరో ముప్పై మంది డబ్బింగ్ ఆర్టిస్టులతో పాటుగా పలువు రు సేవాదళ్‌లోకి వచ్చారు.  అలాగే, సేవాదళ్ సేవలకు ఆకర్షితులైన ప్రముఖ కాస్మోటాలజిస్టు డాక్టర్ లత మా మలూరు తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. మహిళా లోకం : ఆళ్వార్ తిరునగర్ ఎంఎల్‌పీ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం సాయంత్రం సేవాదళ్ కార్యక్రమం జరిగింది. జకీర్ హుస్సేన్, మేడ గం శ్రీనివాస రెడ్డి, సైకం రామకృష్ణారెడ్డిల సమక్షంలో మహిళలతో పాటుగా మరో  ముప్పైమంది సేవాదళ్‌లోకి చేరా రు. న్యాయవాది లక్ష్మీశ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మీదున్న అభిమానంతో జగనన్నను సీఎం చేయాలన్న కాంక్షతో తాను సైతం సేవల్ని అందించేందుకు ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు.
 
 సేవాదళ్  బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. వైఎస్‌ఆర్‌సేవాదళ్ వేదికగా  తెలుగు వారికి న్యాయ పరంగా సేవల్ని అందించేందుకు ముందుకు సాగుతున్నాని పేర్కొన్నారు. డాక్టర్ లత మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి కుటుంబం మీద చిన్నప్పటి నుంచి తనకు అభిమానంగా పే ర్కొన్నారు. ఇక్కడి సేవాదళ్ కార్యక్రమాల్ని  పేస్ బుక్ ద్వారా తెలుసుకుని, తాను సైతం ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన వంతు సేవల్ని సేవాదళ్‌కు అందిస్తామన్నారు. మేడగం శ్రీనివాసరెడ్డి, సైకం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జూన్ మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా జరగనున్న అధ్యక్షులు జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు ఇక్కడి నుంచి అభిమానులు బయలు దేరనున్నామన్నారు. ఆ దీక్షకు మద్దతుగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.  
 
 సేవాదళ్ తరపున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలో న్యాయ పరంగా సేవల కల్పన, వైద్య పరంగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. సేవాదళ్ సంయుక్త కార్యదర్శులు ఆబోతుల శ్రీకాంత్, సిరిపురం నరేంద్ర, దర్శకుడు రోశిరాజు,  డబ్బింగ్ ఆర్టిస్టులు రవీంద్రనాథరెడ్డి, లక్ష్మి చిత్ర, డీవీ శ్రీనివాస్, ఏకరాజ్, ప్రసాద్ రాజు, మహిళ నాయకులు  రమణి,  ఎంకే లక్ష్మి, వి శైలజ, ఎస్ శ్రావణి, పాస్టర్ దేవసహాయం, ఐజాక్ ప్రేమ్‌కుమార్, సేవాదళ్ సభ్యులు కోటిరెడ్డి, సురవరపు కృష్ణారెడ్డి, సవిత వర్సిటీ విద్యార్థి నాయకుడు నరేంద్రనాథ్‌రెడ్డి, వలసరవాక్కం నాయకుడు మల్లేష్, పెద్ద ఎత్తున్న వైఎస్సార్ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

అండగా ఉంటాం.. ఆత్మహత్యలొద్దు


అండగా ఉంటాం.. ఆత్మహత్యలొద్దు
♦ రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు
♦ రైతు కుటుంబాలకు పరామర్శ
♦ జగన్‌ను కలిసిన పలువురు నేతలు


 సాక్షి, కడప : కష్టాలకు జడిసి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఏదైనా బతికే సాధించాలని, తాము అండగా ఉంటామని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. కరువు నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాలను, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.

జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా ఆదివారం పులివెందుల నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. లింగాల మండలం బోనాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు గంగాధర కుటుంబాన్ని తొలుత పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బోనాల గ్రామానికి చెందిన రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం గంగరాజు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకటనారాయణరెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ ఇళ్లకు వెళ్లి స్నేహపూర్వకంగా మాట్లాడారు.

కామసముద్రం గ్రామంలో ఇటీవలే అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు నాగభూషణం శ్రేష్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తర్వాత ఆర్.తుమ్మలపల్లె గ్రామంలో కె.రామచంద్రారెడ్డి అనే రైతు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లింగాల మండలం అంకేవానిపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, హరినాథ్, పరమేశ్వర, రవీంద్ర, కాటేశ్వర, జీవేశ్వర, వెంకటనారాయణరెడ్డి, భీముడు తదితరుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు.

 రింగ్‌బండ్ వరకు నీటిని ఉంచండి..
  పులివెందుల మున్సిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాల కోసం చిత్రావతి రిజర్వాయర్ నుంచి కామసముద్రం చెరువుకు నీరు వ చ్చిందని, ఆ నీటిని ఎస్‌ఎస్ ట్యాంకుకు మోటార్లతో తరలిస్తున్నారని కనీసం రింగ్‌బండ్ వరకైనా నీటిని ఉంచేలా అధికారులను ఆదేశించాలని కామసముద్రం గ్రామస్తులు వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన చెరువు ప్రతి ఏడాది ఒట్టిపోతోందని.. కనీసం కొంత నీరు ఉంచితే చుట్టుపక్కల పొలాల్లోని బోర్లల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు.

 నూతన జంటలకు ఆశీర్వాదం
 తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామంలో రెండు నూతన జంటలను ఆశీర్వదించారు. మాజీ ఎంపీపీ మునిరెడ్డి, మండల పరిశీలకుడు రామమునిరెడ్డి సోదరుని కుమారుడైన బాలమునిరెడ్డి, వరలక్ష్మిదేవిల వివాహం ఇటీవలే జరిగింది. వారిని జగన్ ఆశీర్వదించారు. ఇటీవలే వివాహమైన ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గంగా నీలావతి కుమార్తె దేవి, నగేష్‌లను ఆశీర్వదించారు.

 వైఎస్ జగన్‌ను కలిసిన నేతలు  
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదివారం పలువురు నేతలు కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.బి.అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్ బాషా, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, గురున్నాథరెడ్డి తదితరులు వివిధ అంశాలపై జగన్‌తో చర్చించారు.

లింగాల మండల నాయకులు కొండారెడ్డి, సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి బిదినంచర్ల బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వెంగముని, తొండూరు నాయకులు ఎర్ర గంగిరెడ్డి, రామమునిరెడ్డి, మునిరెడ్డిలతోపాటు పలువురు నాయకులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. పెద్దకుడాల, బోనాల చెరువు, అంకేవానిపల్లెలో మహిళలు జగన్‌కు హారతి పట్టారు. పలువురు రైతులు జగన్‌తో మాట్లాడారు. జగన్‌ను చూసేందుకు కామసముద్రంలో జనం మిద్దెలపైకి ఎక్కారు. అనంతరం ఆయన పులివెందులకు చేరుకొని తొండూరు మండలంలోని సంతకొవ్వూరు, పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లెలకు వెళ్లారు. అనంతరం ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.

మాఫీ పేరుతో మోసం


మాఫీ పేరుతో మోసంపులివెందులలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రైతు భరోసా యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం 
 సాక్షి, కడప: ‘‘రైతులకు రుణమాఫీ కాలేదు.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం డ్వాక్రా మహిళలకూ రుణాలు మాఫీ కాలేదు. ఉద్యోగం రాక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. కనీసం పండుటాకులైన అవ్వ, తాతలందరికీ పింఛన్ అందట్లేదు. అధికారంలోకి రాకముందు ప్రజలకు అన్నీ ఇస్తామని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఏదీ చేయడు. నమ్మించి బాగా మోసం చేస్తాడు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం బోనాలలో ఆదివారం రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలకెన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టి కూర్చొన్నారని ఎద్దేవా చేశారు. ఏమి చేయకున్నా.. గడిచిన ఏడాదిలో ఏదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసగించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ వచ్చే నెల 3, 4 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్య సమర దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా అండగా ఉండాలని, అందరి తరఫున తాను పోరాడతానని స్పష్టం చేశారు.  
 
 గంగాధర్ చనిపోయి మూడు నెలలైనా అతీగతీ లేదు..  
 ‘‘బోనాలకు చెందిన రైతు మన్యం గంగాధర అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మూడు నెలలైనా ఆయన ఇంటికి ఒక్కరూ వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. పంచాయతీ కార్యదర్శి వచ్చి రాసుకుని వెళ్లారట. ఇప్పటివరకు పైసా పరిహారమందలేదు. ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలిచ్చి ఆదుకుంటామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందేతప్ప.. అలా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్ వస్తున్నారని ఒక్క అనంతపురంలో మాత్రం కాస్తో.. కూస్తో ఇచ్చారు.

చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అందులో రూ.1.50 లక్షలు అప్పులవారికి పంచడం, మిగిలిన రూ.3.50 లక్షలను బ్యాంకులో జాయింట్ అకౌంటుద్వారా ఉంచడం.. తర్వాత ఏ ఆరు నెలలకో, ఎనిమిది నెలలకో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద పండుగకో.. పబ్బానికో కొంతఇచ్చి సరిపుచ్చుతున్నారు. ఆ బాధిత కుటుంబసభ్యులకు ఆ మొత్తం అందిస్తే కదా.. వారు ఏదైనా చేసుకుని బతికేది..’’ అంటూ జగన్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
 
 చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్
 టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌తోనే ముందుకు నడుస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రతి కార్యక్రమాన్ని పబ్లిసిటీతోనే నడిపిస్తారని, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పబ్లిసిటీ వస్తుందంటే ఎక్కడికైనా వస్తారన్నారు. పబ్లిసిటీ ఉండదని తెలిస్తే సమీప ప్రాంతాలకూ రారన్నారు. ప్రతి రైతును, అక్కా చెల్లెమ్మలను, అలాగే ఉద్యోగం పేరిట, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నిరుద్యోగులను మాటలతో గారడీ చేసిన చంద్రబాబును జనం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని జగన్ అన్నారు.
 
 డ్వాక్రా మహిళలైతే కనీసం రూ.10 వేలను కూడా కంతుల రూపంలో ఇస్తామని ప్రకటించిన బాబు తీరుపై శాపనార్థాలు పెడుతున్నారన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. లింగాల మండలం బోనాల, అంకేవానిపల్లె, కామసముద్రం, పులివెందుల, ఆర్.తుమ్మలపల్లె, సంతకొవ్వూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.బి.అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 ధైర్యంగా ఉండండి
 రైతు కుటుంబాలకు జగన్ భరోసా
 పులివెందుల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాల, కామసముద్రం, పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెలో అప్పులబాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదివారం జగన్ పరామర్శించారు.  ధైర్యంగా ఉండాలన్నారు.
 
 అందరివీ కన్నులు చెమర్చే బాధలే
 తొలుత నాగభూషణం శ్రేష్ఠి కుటుంబీకులను పరామర్శించగా వారు తమ ఇబ్బందులను పూసగుచ్చినట్లు చెప్పారు. చీనీ పంట సాగుకోసం వివిధ పద్దతుల్లో రూ.30లక్షల వరకూ అప్పులయ్యాయని తెలిపారు.అవి తీరే మార్గం లేక నాగభూషణం ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. రుణమాఫీ తమకు ఉపకరించలేదన్నారు.
 
 అదే విధంగా కోరా రామచంద్రా రెడ్డి కుటుంబీకులు రుణమాఫీని నమ్ముకొని దారుణంగా దెబ్బతిన్నామని జగన్ వద్ద బోరుమన్నారు. ప్రభుత్వం మోసం చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జగన్ గంగాధర్ కుటుంబీ కులను కలిశారు. వారు ఆయన వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు. నాలుగెకరాల్లో వేసిన చీనీ తోటల కోసం అప్పుల పాలయ్యామన్నారు.రుణ మాఫీ కాలేదని బయట అప్పు దాదాపు రూ.18 లక్షలు ఉందనీ తెలిపారు. తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచక గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

రామచంద్రారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Sunday, May 24, 2015 | 5/24/2015


రైతు రామచంద్రారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కడప: వైఎస్సార్ జిల్లాలోని ఆర్.తుమ్మలపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్.. అన్నివిధాలా అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

అంతకుముందు లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు.  డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వ్యవసాయంతో నష్టపోయి .. అప్పులు తీరే మార్గంలేక.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తున్నారు.




జన సమరంలో జగన్ వెంట సాగుదాం


 చెల్లూరు(రాయవరం) : ప్రజాసమస్యలపై నిత్యం పోరాట యోధుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ప్రజలపై ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం రాత్రి రాయవరం మండలం చెల్లూరులో ఎమ్మెల్సీగా ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహిం చారు. పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామన్నచౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారన్నారు.  
 
 ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బూటకపు హామీలతో అందరినీ మోసగించారన్నారు. 13జిల్లాల్లో 17లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలతో రాజకీయాలు చేస్తున్నారని, రైతులు అయినకాడికే ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. గృహ నిర్మాణానికి దాదాపు నీళ్లొదిలారన్నారు.
 
 నీతి, నిజాయితీలకు నిలువుటద్దం ‘బోస్’
 ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ నీతి, నిజాయితీ, విలువలకు నిలువుటద్దం అని జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు  ప్రశంసించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ జెడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, నీటి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ నేతలు కర్రి పాపారాయుడు, సిరిపురపు శ్రీనివాసరావు, మిందిగుదిటి మోహన్, నక్కా రాజబాబు,  ఆర్.వి.వి.సత్యనారాయణచౌదరి, బొడ్డపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడే వ్యక్తిగా బోస్‌ను కొనియాడారు. బోస్ పరిపాలనాదక్షుడని, మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన బోస్ జిల్లాకే గర్వకారణంగా పేర్కొన్నారు. అనంతరం బోస్‌ను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పూల కిరీటం, గజమాల, దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
 
 అలాగే పలు శెట్టిబలిజ సంఘాలు బోస్‌ను సత్కరించాయి.ఈ కార్యక్రమంలో కె.గంగవరం ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు పాలిక రాఘవగోవిందు, సత్తి సత్యవతిరామచంద్రారెడ్డి, అంపోలు సాయిలక్ష్మి, మేడపాటి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, కామిరెడ్డి తాతాజీ, సర్పంచ్‌లు వాసంశెట్టి అనంతలక్ష్మి రాధాకృష్ణ, పరంశెట్టి వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి(చినకాపు), సత్తి ఈశ్వరరెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, సత్తి వీర్రెడ్డి, సత్తి శంకరరెడ్డి,కట్టా సూర్యనారాయణ, పాలిక గోవిందు, గాదంశెట్టి శ్రీధర్, వి.లక్ష్మీనారాయణరెడ్డి, వల్లూరి రామకృష్ణ, పెంకే వెంకట్రావు, సత్తి వెంకటరెడ్డి, చిక్కాల శ్రీరాములు, దేవు శివానందం, వైట్ల వెంకటకృష్ణారావు, నైట్ శ్రీను, టేకి సాయి, కుక్కల శ్రీనివాస్, మేడిశెట్టి నరేష్‌కుమార్, రాయుడు ప్రసాద్, చోడె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

పార్టీకి ఓట్లేసిన వారికే పని చేస్తామని జీవో జారీ చేయండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అణగదొక్కేందుకు... పోలీసుల సాయం తీసుకుందామన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యలపై  ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ లో ఆర్కే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని విమర్శించారు.
ఐఏఎస్ లు, ఐపీఎస్ ల్లో కొంతమంది పచ్చచొక్కాలేసుకుంటే మంచిదని సూచించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి ఓట్లేసిన వారికే పనిచేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారణమన్నారు. టిడిపికి ఓట్లేసిన వారికే పనిచేస్తామని జీవో విడుదల చేయండి అంటూ ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాచరికమా ? అని ఆర్కే ఈ సందర్భంగా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు

ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు


'ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు'
కడప: సీఎం చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నది బూటకంగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు.  డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

అది నయవంచన దినం


'అది నయవంచన దినం'
హైదరాబాద్: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నవ నిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న దినోత్సవాన్ని నయవంచన దినోత్సవం అంటే బాగుంటుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఏడాది పాలనంతా వంచనలు, మోసాలతో సాగిందని దుయ్యబట్టారు.

తాను అనుభవజ్ఞుడినని, అధికారంలోకొస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి..  ఇప్పుడేమో ప్రజల్లో స్ఫూర్తి నింపాలని, కలసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రివర్గ సమావేశంలో చెప్పడమేంటని విస్మయం వెలిబుచ్చారు. రాజధాని నిర్మాణంతోసహా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తానని, ఆర్థిక పరిస్థితులపై అవగాహనతోనే ఈ మాటలంటున్నానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలంతా తలో చేయి వేస్తేగానీ ఏమీ చేయలేన నే స్థితికి దిగజారిపోయారని విమర్శించారు.

గద్దెనెక్కిన తొలిరోజున ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతు రుణమాఫీ జరక్కపోగా బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయీలు పెరిగిపోయాయన్నారు. ఒక్క పావలా కూడా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాలేదన్నారు. మద్యం బెల్ట్‌షాపుల్లో ఒక్కటినీ రద్దు చేయకపోగా వాటిని చట్టబద్ధంగా నిర్వహించుకోవడానికి అవసరమైన చర్యలను చంద్రబాబు ఈ ఏడాదిలో తీసుకున్నారన్నారు.

ఏ రోటికాడ ఆ పాట..
ఎన్నికలకు ముందు చంద్రబాబు తానూ నరేంద్రమోదీ కలసి రాజధానిని నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు చేస్తున్నదేమిటని రాంబాబు ప్రశ్నించారు. ‘‘ఏ రోటికాడ ఆపాట అన్నట్టుగా సింగపూర్ వెళితే అలాంటి రాజధాని కడతానని, చైనా వెళితే అక్కడి మాదిరిగా రాజధాని కడతానని చెప్పి.. చివరకు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి చూసొచ్చారు. తర్వాత హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మిస్తామన్నారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా తన అనుకూల పత్రికల్లో రాయించుకుంటున్నారు’’ అని దుయ్యబట్టారు.

మోసం.. దగా.. కుట్ర.. బాబు నైజం
విజయవాడ బ్యూరో: చేసిన వాగ్దానాలను నిలుపుకోలేక ప్రజలను మోసగించడం, అధికారం కోసం కుట్రలు చేసి చివరకు నమ్మిన ఓటర్లను దగా చేయడం సీఎం చంద్రబాబునాయుడు నైజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

చంద్రబాబు మోసాలకు సంబంధించి ప్రధానంగా ఐదంశాలపై ప్రశ్నిస్తూ మంగళగిరిలో జూన్ 3, 4 తేదీల్లో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమరదీక్షను పురస్కరించుకుని కృష్ణా జిల్లా పార్టీ శ్రేణులతో విజయవాడలో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఇందులో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టి ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే సమరదీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తేనే ప్రజలకు మేలు జరుగుతోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
 
వైఎస్సార్‌సీపీ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీకి కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావును ఎంపిక చేసినట్టు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది.

గుంటూరు నగరంలో సోమవారం వైఎస్సార్ సీపీ సమావేశం

గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం సోమవారం గుంటూరు నగరంలో జరగనుంది. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమరదీక్ష, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరవుతారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర సీనియర్లు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

 నేడు దీక్షా స్థలి పరిశీలన..
 మంగళగిరి : ఏడాదికాలంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ జగన్‌మోరెడ్డి జిల్లాలో జూన్ 03, 04 తేదీల్లో సమరదీక్ష చేపట్టనున్నారు. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి సమీపంలో ఎంపిక చేసిన సమరదీక్షా స్థలాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పరిశీలనున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అధైర్యపడొద్దు..అండగా ఉంటా


అధైర్యపడొద్దు..అండగా ఉంటా
 వేముల :  మీకు అన్నివిధాలా అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని.. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన ధనికెల రఘురాం ఈనెల 18వ తేదీన తోట వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్, కడప ఎంపీవైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిలతో కలిసి శనివారం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకున్నారు. మృతుడు ధనికెల రఘురాం భార్య భారతి, తండ్రి చిన్ననారాయణలను ఓదార్చారు.

యురేనియం ప్రాజెక్టులో రఘురాం కార్మికునిగా పనిచేస్తున్నాడని..అతని మృతితో కుటుంబం జీవనాధారం కోల్పోయిందని.. ప్రాజెక్టులో ఉద్యోగం వచ్చేలా చూడాలని బంధువులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్ రఘురాం కుటుంబాన్ని ఆదుకొనేందుకు అన్ని విధాలా ముందుంటానని.. ప్రాజెక్టులో మృతుడి భార్య భారతికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అలాగే ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తూ ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. మరొకరు పక్షవాతంతో బాధపడుతూ ఉద్యోగం కోల్పోయారని.. ఇప్పటి కీ ఆ కుటుంబాలకు యురేనియం ప్రాజెక్టులో ఉద్యోగం ఇవ్వలేదని.. వారికి ప్రాజెక్టులో ఉద్యోగాలు వచ్చేలా చూడాలని స్థానికులు, తోటి కార్మికులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మబ్బుచింతలపల్లె గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బొజ్జా నాగమల్లారెడ్డి, బొజ్జా శివశంకర్‌రెడ్డిలు ఇళ్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆ పార్టీ మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి,జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
 ముద్దనూరు : శాసనసభ ప్రతిపక్షనేత,వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం తెల్లవారుజామున ముద్దనూరు రైల్వేస్టేషన్‌లో ఘనస్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వైయస్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డితో కలిసి ముద్దనూరు రైల్వేస్టేషన్‌లో దిగి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్లారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ,వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

 నేడు పులివెందులలో రైతు భరోసా యాత్ర
 పులివెందుల : వ్యవసాయ జూదంలో ఓడిపోయి.. అప్పులు తీరే మార్గంలేక.. ప్రస్తుత టీడీపీ సర్కార్ ఆదుకోక.. దిక్కుతోచని స్థితిలో బలవ న్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదివారం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుటుంబాన్ని , లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన నాగభూషణంశ్రేష్టి కుటుంబాలన  పరామర్శించనున్నారు.

నేడు పులివెందులలో రైతు భరోసా యాత్ర

పులివెందుల : వ్యవసాయ జూదంలో ఓడిపోయి.. అప్పులు తీరే మార్గంలేక.. ప్రస్తుత టీడీపీ సర్కార్ ఆదుకోక.. దిక్కుతోచని స్థితిలో బలవ న్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదివారం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుటుంబాన్ని , లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన నాగభూషణంశ్రేష్టి కుటుంబాలన  పరామర్శించనున్నారు.

పోలీస్ అండతో వైఎస్సార్‌సీపీని అణగదొక్కుతాం

రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీని అణచివేసేందుకు అధికార తెలుగుదేశంపార్టీ ఎంతకైనా తెగిస్తుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ నేతలను అణగదొక్కేందుకు పోలీసుల సాయం కూడా తీసుకుంటామని సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మనసులో మాట బయటపెట్టేశారు. ఎక్కడ ఏ అధికారి కావాలో జాబితా ఇస్తే, అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకునేలా చంద్రబాబును ఒప్పిస్తానని మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు మద్దతునిచ్చారు.

కర్నూలు జిల్లా టీడీపీ మినీ మహానాడు సాక్షిగా టీడీపీ వ్యవహారశైలి బట్టబయలైంది. కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ కన్వెన్షన్‌లో శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేఈ మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలని మనసులో మాట చెప్పేశారు. ‘‘ఇది ఫ్యాక్షన్ జిల్లా. జిల్లాలో మంత్రాలయం, ఆదోని, బనగానపల్లె వంటి ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో పర్యటించి వాళ్లను ఎట్లా అణగదొక్కాలి? ఏ విధంగా పోలీసు సాయం తీసుకోవాలి? అనే విషయాల్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు.

వైఎస్సార్‌సీపీని  అణగదొక్కాలంటే ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. అలా జరిగేలా ఇన్‌చార్జి మంత్రి ప్రయత్నించాలని కోరారు. ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీటుగానే స్పందించారు. ‘‘మండలాల్లో ఏయే అధికారుల వల్ల ఇబ్బంది ఉంది, ఎవరు ఉండకూడదు, ఎవరు కావాలనే జాబితా ఇస్తే దానిపైనే నేను సంతకం పెట్టి అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అధినేతను కోరతా’’నని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల కష్టాల గురించి జాబితాలు సిద్ధంచేసి ఇస్తే అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

జిల్లాలో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల అనంతరం బాబును కలవడానికి ఎప్పుడు పోయినా... మీ జిల్లాలో మూడు సీట్లే గెలిచారు.. పశ్చిమగోదావరిలో 16కు 16 సీట్లొచ్చాయంటున్నారు. ఆయన దృష్టంతా పశ్చిమగోదావరిపైనే ఉంది. కర్నూలుపైన లేదు" అని చెప్పారు.

Popular Posts

Topics :