28 June 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పోలీసులతో నిర్బంధ అరెస్టులు చేయిస్తున్నారు

Written By news on Saturday, July 4, 2015 | 7/04/2015

గుంటూరు(మాచర్ల): టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలను వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలనసాగిస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాలపై పోలీసులను ప్రయోగిస్తూ నిర్బంధ అరెస్ట్‌లు చేయిస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. శనివారం గుంటూరు జిల్లా మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్‌బూత్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారన్నారు. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులే అక్రమంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయించడం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే జరిగిందని ఆరోపించారు.

గతంలో కూడా కర్నూలు కార్పొరేషన్ సమావేశంలో భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాలలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ పలు కుట్రలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. తనపై కూడా గతంలో చెన్నాయపాలెం భూముల విషయంలో అధికార పార్టీ వారు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.

భూమా ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం


'భూమా ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం'
కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆయనకు ఏదైనా జరిగితే జిల్లా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. భూమాపై అక్రమ కేసుల నమోదు, అరెస్టు, జైలుకు తరలింపు నేపథ్యంలో కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత, మణిగాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు మాట్లాడారు.

భూమా నాగిరెడ్డికి ఇప్పటికే గుండె శస్త్రచికిత్స జరిగిందని.. బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారన్నారు. అయినప్పటికీ పోలీసులు నిమ్స్‌కు తరలించేందుకు సెక్యూరిటీ ఇవ్వలేమంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు. మహిళా శాసనసభ్యురాలు అని కూడా చూడకుండా భూమా అఖిలప్రియతో పోలీసులు నువ్వు అని సంబోధిస్తూ అమర్యాదగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్‌తో పోలీసులు ప్రవర్తించిన తీరు, మహిళా ఎమ్మెల్యేతో వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా ప్రవేశపెడతామన్నారు.


కర్నూలు ప్రభుత్వాస్పత్రికి భూమా నాగిరెడ్డి
కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆరెస్ట్ చేసిన నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం సాయంత్రం ఆళ్లగడ్డ సబ్ జైలు నుంచి భూమాను కర్నూలుకు తీసుకెళ్లారు.

శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో భూమాపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు. భూమా నాగిరెడ్డికి గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో పాటు షుగర్, బీపీ ఉన్నాయి. కాగా మహిళా ఎమ్మెల్యే అయిన తన పట్ల అవమానకరంగా ప్రవర్తించిన పోలీసులను ప్రశ్నించినందుకే తన తండ్రి భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసు పెట్టారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చెప్పారు. తన తండ్రికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆమె హెచ్చరించారు.

పరిహారం ఇవ్వకపోతే న్యాయ పోరాటం


విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. విజయవాడ ఊర్మిళానగర్లో విద్యుత్ షాక్ తో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. విద్యుత్ ప్రమాదం ఘటనలో మృతిచెందిన సుబ్బారెడ్డి భార్య చిన్నక్క, తిరుపతి రెడ్డి భార్య రాధమ్మలను వైఎస్ జగన్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబానికి ఓ ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో విద్యుత్ శాఖపై న్యాయ పోరాటం చేస్తానంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ జగన్ నగరానికి బయలుదేరతారు. ఇటీవలే నిర్మాణంలో ఉన్న భవనం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా?


హైదరాబాద్ :ఒక మహిళా ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రం నుంచి ఎలా వెళ్లగొడతారు, తాను ఆమె వెంట లేనప్పుడు ఎలా మాట్లాడతారని తన తండ్రి భూమా నాగిరెడ్డి అడిగినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా నాగిరెడ్డి అరెస్టు, దాని పూర్వాపరాలపై ఆమె హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..


ఒక మహిళా ఎమ్మెల్యేని ఎలా అవమానిస్తారని నాగిరెడ్డి అడిగారు తప్ప.. అసలు ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు
నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, ఎందుకు కూతురితో మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేని ఎలా వెళ్లగొడతారని అడిగారు
రూల్ బుక్ చూపించాలని గట్టిగా అడిగారు
అంతే తప్ప అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా వాడలేదు
కానీ సంబంధం లేకపోయినా ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు
సండ్ర వెంకట వీరయ్య మీద కేసు ఉన్నప్పుడు చిన్న నొప్పి ఉందని రాజమండ్రి ఆస్పత్రికి పంపారు.
ఇప్పుడు నాన్న గుండె రోగి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. షుగర్ ఉంది, ఈ ఘటనతో ఆయనకు బీపీ వచ్చింది.
అయినా నిమ్స్ కు పంపడానికి బోలెడంత సీన్ క్రియేట్ చేశారు
గతంలో కూడా ముందు నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు, తర్వాత నిమ్స్కు పంపారు
ఇప్పుడు కలెక్టర్ ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్ జైలుకు పంపారు. వాళ్లు ఇచ్చే నివేదికను బట్టే నిమ్స్కు పంపుతారట
ఆ ముగ్గురిలో కార్డియాలజిస్టులు ఎవరూ లేరు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు
ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది, సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు
భూమా నాగిరెడ్డినే ఇబ్బందిపెడుతున్నాం, మిగిలిన వాళ్లు మాకొక లెక్కా అన్న సందేశాన్ని పంపుదామనుకుంటున్నారు
కానీ ఇలా చేస్తే ఆయన ఇంకా రైజ్ అవుతారు తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
అది ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది
నాన్న జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి
రేపు ఆయనకేమైనా జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అవుతుంది
ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను అడ్డుకున్నది కూడా పోలీసులే
డీఎస్పీ నాతో ఎలా మాట్లాడారో, మేం ఎలా చెప్పామో అన్నీ తెలుస్తాయి
మేం అసెంబ్లీలో హక్కుల తీర్మానం పెడతాం.

రైతులను నట్టేట ముంచేస్తున్నారు

దేవరపల్లి :చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేస్తోందని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆయన రైతులతో భేటీ అయ్యి, వారి సమస్యలపై చర్చించారు.

పొగాకును గతంలో 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దాన్ని కేవలం 80 రోజులకే పరిమితం చేశారని, అలాగే కేవలం 47 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలుచేసి.. రైతులను నిండా ముంచేశారని వైఎస్ జగన్ అన్నారు. అలాగే, ఆయిల్పామ్ టన్ను ధర 8267 రూపాయలు ఉంటే.. ఇప్పడు 6473 రూపాయలు మాత్రమే ఉందని, దాదాపు రెండు వేలు తగ్గిందని ఆయన చెప్పారు. చెరుకు మద్దతు ధర కూడా దారుణంగా ఉందని వైఎస్ జగన్ చెప్పారు. రైతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్యాక్టరీలకు వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. రైతులకు రవాణా ఖర్చులతో కలిపి రూ. 900 వరకు ఖర్చవుతుంటే, ఫ్యాక్టరీ వాళ్లు రూ. 700 మాత్రమే ఇస్తున్నారన్నారు. పాత సంవత్సరం బకాయిలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. ఇక అరటిపండ్లు గతంలో గెల రూ. 250-400 వరకు పలికితే, ఇప్పుడు కనీసం 50 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో ఊరికే పంచిపెడుతున్నారన్నారు. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని చెప్పబట్టి, రుణాలు తిరిగి కట్టొద్దన్నారు కాబట్టి వాళ్లు ఊరుకున్నారని, దానివల్ల గతంలో 3 లక్షల వరకు పావలా వడ్డీకే వచ్చే రుణాల మీద అపరాధ వడ్డీ రూపంలో 14-18 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారంటే.. అందుకు కారణం చంద్రబాబేనని చెప్పారు.

టీడీపీ ఆటలు సాగనివ్వం

'టీడీపీ ఆటలు సాగనివ్వం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యే భూమాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని బొత్స తప్పుబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స.. కర్నూలులో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూమా నాగిరెడ్డిని పోలీసు అధికారి ఉద్దేశపూర్వంగానే నెట్టారన్నారు.

తన నెట్టవద్దన్నందుకు భూమాపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా?అని ప్రశ్నించారు. టీడీపీ ఆటలు ఇక సాగవని బొత్స హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదని భూమాను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించలేదని.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఎమ్మెల్యే అఖిల ప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని జగన్  ప్రశ్నిస్తే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నట్లా? అని బొత్స ప్రశ్నించారు.

అలా అంటే..ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు

రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8 అంశాన్ని ముడిపెట్టే విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను గౌరవించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని ఆయన తెలిపారు.  కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలని,  రెండు రాష్ట్రాలు సామరస్య వాతావరణంలో పనిచేయాలని, దేశభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆకాంక్షించారు.

కోటిలింగాల పుష్కర ఘాట్ పరిశీలించిన వైఎస్ జగన్

కోటిలింగాల పుష్కర ఘాట్ పరిశీలించిన వైఎస్ జగన్
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం కోటిలింగాల పుష్కర ఘాట్ను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పుష్కరాల పనులకు టెండర్లు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో ఇష్టం వచ్చినవాళ్లకు ఇచ్చారు. అందినంత దోచుకుంటున్నారు, పుష్కరాలకు లక్షలాదిమంది భక్తులు వస్తారు. కోటిలింగాల రేవు కుంగిపోయిందని తెలిసి కూడా నాసిరకం పనులు జరుపుతున్నారు' అని మండిపడ్డారు.

కాగా వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

తుపాను హెచ్చరికల్లో ప్రభుత్వం విఫలం

♦ వేట నిషేధ సాయం అందించడంలో నిర్లక్ష్యం
♦ {పభుత్వ తీరుపై ఆగ్రహం
♦ మత్స్యకార కుటుంబాలకు జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ


 సాంబమూర్తినగర్ (కాకినాడ) :  సముద్రంలో తుపాను, అల్పపీడన ద్రోణి వంటి ఉపద్రవాలు ఏర్పడినప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి అల్పపీడనం కారణంగా సముద్రంలో చిక్కుకుని గల్లంతైన మత్స్యకార కుటుంబాలను శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఆయన పర్యటించారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం తుపాను హెచ్చరికలు చేయకుండా జిల్లాలో తొమ్మిది మంది మత్స్యకారులను హత్య చేసిందని ఆరోపించారు.

మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంలో ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ ఏడాది 60 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సాయం అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వేట నిషేధం ముగిసిన వెంటనే పొట్ట చేత పట్టుకుని సముద్రంపై చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల్లో జిల్లాకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుం బాలను పార్టీ తరఫున ఆదుకుంటామన్నారు.

 నిరుద్యోగ భృతి మాటేమైంది..?
 ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఆ మాటే మరిచారని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఆర్భాటంగా ప్రచారాలు చేశారని, చంద్రబాబు నాయుడు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలు, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. చేసిన అప్పులు తీరక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. పర్యటనలో భాగంగా స్థానికులు ఎక్కడికక్కడ కాన్వాయ్‌ను ఆపి తమ సమస్యలు విన్నవించుకున్నారు. పింఛన్లు రావడం లేదని, రేషన్ కార్డు లేదని, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదని ప్రజలు ఆయనకు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

 బాధిత కుటుంబాలకు పరామర్శ
 కాకినాడ పర్లోపేటలోని కంటుముర్చి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుడి భార్య కుమారి, కుమారుడు రాజు, కుమార్తెలు ఐశ్వర్య, స్వాతిలను ఓదార్చారు. పిల్లలు చిన్నవారు కావడంతో వారిని చదివించే బాధ్యత చూడాల్సిందిగా వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమలశెట్టి సునీల్‌కు సూచించారు.

 అక్కడి నుంచి కరప మండలం ఉప్పలంకలోని బొమ్మిడి పెద కామేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం పగడాలపేటలోని గేదెల తాతారావు, చెక్కా బుజ్జిబాబు, కామాడి నూకరాజు, కర్రి రాజు, దరిపల్లి సింహాద్రి, తిర్రి సత్తిబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కాకినాడ సిటీ, రూరల్ మండలాల్లో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు.

ఆదుకుంటామని అభయం

♦ జిల్లాలో రెండోరోజు సాగిన జగన్ పర్యటన
♦ బాధిత మత్స్యకార, గిరిజన కుటుంబాలకు ఓదార్పు
♦ పార్టీ తరఫున ఆదుకుంటామని అభయం
♦ ఆయనపై అడుగడుగునా ఉప్పొం
గిన అభిమానం
 
  కల్లోలితమైన కడలికి బలైన మత్స్యకారుల కుటుంబాల్లో కన్నీటి సంద్రాలే ఎగసిపడుతున్న వేళ.. పెళ్లి ముచ్చట్లను నెమరేసుకుంటూ వెళుతున్న వారిని వెన్నాడిన మృత్యువు సృష్టించిన విషాదం గుండెల్లో పుండై సలుపుతున్న వేళ.. ఓ ఆత్మీయ స్పర్శ వారికి ఉపశమనమైంది. అరుునవారిని పోగొట్టుకున్న దుఃఖం కుంగదీస్తున్న వేళ ఓ అభయం వారికి భరోసానిచ్చింది. వాయుగుండం వేళ సముద్రంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను, గతనెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ దుర్ఘటనలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అక్కున చేర్చుకుని ఓదార్చారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడుస్తూ..జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ రోజు పర్యటన శుక్రవారం కొనసాగింది. ఉదయం కాకినాడలో నిర్మల్ జైన్ నివాసం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏజెన్సీలో పర్యటన ముగిసే వరకు జగన్‌ను పలకరించేందుకు తరలివచ్చిన వారితో దారులు జనయేరులయ్యూరుు. మత్స్యకార ప్రాంతాలైన పర్లోపేట, పగడాలపేట, ఉప్పలంకల్లో మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించేందుకు పోటీ పడ్డారు. అడుగడుగునా ఉప్పొంగిన జనాభిమానానికి  అభివందనం చేస్తూ బాధిత కుటుంబాలను జగన్ అక్కున చేర్చుకున్నారు. అలుపెరగని బాటసారిలా ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడా విశ్రమించకుండా బాధిత కుటుంబాలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ఎక్కడికక్కడ వెల్లువెత్తిన జనాభిమానంతో జగన్ రాక ఆలస్యమైనా నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా అభిమాన నేత కోసం దారికిరువైపులా గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది.

 కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాలతోపాటు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ జగన్ పర్యటించారు. ఉదయం కాకినాడలోని నిర్మల్ జైన్ నివాసం నుంచి  పర్యటన ప్రారంభమైంది. తొలుత జైన దేవాలయాన్ని జగన్ సందర్శించారు. మార్వాడీలు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇటీవల సముద్రంపై వేటకు వెళ్లి వాయుగుండం ప్రభావంతో మృతిచెందిన తొమ్మిదిమంది మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చారు. పర్లోపేటకు చెందిన కంచుమట్ల వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లేదారిలో అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అభిమాన నేతను స్వాగతించారు.

వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను సాధకబాధకాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. నాగబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాకినాడ రూరల్‌నియోజకవర్గ పరిధిలోని పగడాలపేట, ఉప్పలంక ప్రాంతాల్లో మత్స్యకార బాధిత కుటుంబాల ప్రతి ఇంటికీ వెళ్లి వారిని ఓదార్చారు. జీవనాధారమైన వేటే అయినవాళ్లను దూరం చేసి అనాథల్ని చేసిందంటూ శోకసంద్రంలో మునిగిన బాధితులను అక్కున చేర్చుకుని ఓదార్చారు.  

 సర్కారు మెడలు వంచైనా సాయం అందిస్తాం..
 ప్రతి ఇంటి వద్దా జగన్ దాదాపు అరగంట సమయం బాధిత కుటుంబాలతో గడిపి  కష్టసుఖాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వాధినేత చంద్రబాబు స్పందించకపోవడాన్ని జగన్ ఎండగట్టారు. గల్లంతైనవారి ఆచూకీ కనుకొనడంలోగానీ, మృతుల కుటుంబాలకు సాయం అందించడంలో అలసత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సాయం అందేలా చేస్తానని, పార్టీ తరఫున అండగా ఉంటానని బాధితులకు భరోసానిచ్చారు.

సాయంత్రం ఏజెన్సీ పర్యటనకు బయలుదేరిన జగన్‌ను గ్రామగ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతించారు. సామర్లకోట, పెద్దాపురంలలో పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో, జగ్గంపేట, మల్లిసాల వద్ద జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో, ఏజెన్సీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.

 గిరిజనుల ఆదరణకు చలించిన జగన్
 పర్యటన సాగిన గ్రామాల పొడవునా జనం జగన్‌ను చూసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకే జగన్  ఏజెన్సీకి వెళ్లాల్సి ఉండగా చేరుకునే సరికి అర్ధరాత్రి 12 అయింది. అయినా గిరిజనులు అభిమానంతో నిరీక్షిస్తూ ఉండిపోయారు. జగన్ కూడా మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీలో రాత్రి పర్యటన క్షేమం కాదని పోలీసులు అన్నా గిరిజనుల అభిమానానికి స్పందించి పర్యటన కొనసాగించారు. ఎదురు చూసిన వారిని పేరుపేరునా  పలకరించడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. తొలుత కొత్తాడ, సూరంపాలెం గ్రామాల్లో వ్యాన్ బోల్తా దుర్ఘటనలో మరణించిన తొమ్మిది మంది కుటుంబాలను పరామర్శించారు.

పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, సంగిశెట్టి అశోక్, కర్రి నారాయణరావు, జి.వి.రమణ, వట్టికూటి సూర్యచంద్రశేఖర్, దంగేటి రాంబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, ఎం.ఎస్.రాజు, బొబ్బిలి గోవింద్, లింగం రవి, సంయుక్త కార్యదర్శులు పెంకే వెంకట్రావు, యువజన విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర కన్వీనర్ ఆర్.జె.వి.కుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మల కుమారి, రావిపాటి రామచంద్రరావు, శిరిపురపు శ్రీనివాసరావు, డాక్టర్ యనమదల గీతా మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు, పెట్టా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, అల్లి రాజబాబు, రాజమండ్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మానే దొరబాబు, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి జమీల్ తదితరులు జగన్ వెంట ఉతన్నారు.
 
 బాబులాంటి దగా నేతను జీవితంలో చూడలేదు
 
 నెల్లిపూడి సభలో జగన్ ధ్వజం
  సాక్షి ప్రతినిధి, రంపచోడవరం : ప్రజల్ని దగా చేసి గద్దెనెక్కిన చంద్రబాబులాంటి నాయకుడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి ధ్వజమెత్తారు. మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచే వారిని దేవుడుపై నుంచి చూస్తూనే ఉన్నాడని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.  ఏజెన్సీలో గంగవరం మండలం నెల్లిపూడిలో వైఎస్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం  జగన్ శుక్రవారం రాత్రి 12 గంటలకుగిరిజనులనుద్దేశించి మాట్లాడారు. పట్టపగలు దొంగతనం చేసి పట్టుబడ్డా వీడియో ఎందుకు తీశారని ప్రశ్నించడం చంద్రబాబు నైజానికి అద్ధం పడుతుందన్నారు.

  అధికారంలోకి రాక ముందు అందరికీ ఇళ్లు కట్టిస్తానని నమ్మించిన బాబు అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనంతరం ఖమ్మం నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో విలీనమైన మండలాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజనుల అవసరాలను తీర్చలేక సర్కారు చేతులెత్తేసిందన్నారు. రంపచోడవరంలో తమ పార్టీని ఆదరించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ అష్టకష్టాల పాలన చేస్తున్నారన్నారు. ఈ కష్టాలు ఎంతోకాలం ఉండవని, రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు.

ఇక్కడి గిరిజనులు ప్రమాదంలో మృతిచెందితే అధికారులు,  అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం పలకరించిన పాపానపోలేదని, జగన్ వస్తున్నాడని తెలిసి హడావిడిగా దొంగచాటున రూ.2లక్షల చెక్కులు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగితే యువకులు రాళ్లతో కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఇక్కడ వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేను చేసిన అనంత ఉదయభాస్కర్‌ను పోలీసులు రాజకీయ కుతంత్రాలతో కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని, అదే అనంతబాబుకు పోలీసులతోనే శాల్యూట్ కొట్టించే రోజులు తీసుకువస్తానని అన్నారు.

నాగబాబు కుటుంబానికి జగన్ పరామర్శ

కాకినాడ : పార్టీ ఆవిర్భావం నుంచి నగరంలో పటిష్టతకు మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ (నాగబాబు) చేసిన సేవలు ఎనలేనివని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఇటీవల నాగబాబు ఆనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కాకినాడలోని ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగబాబు భార్య విజయలక్ష్మి, కుమారుడు సురేష్, సోదరుడు కాంతారావులను ఓదార్చారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నాగబాబు మూడు దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలందించారన్నారు.

నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ప్రజలకు అండగా ఉండేవారని, అందుకే మూడు సార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా ప్రజలు గెలిపించారన్నారు. నాగబాబు మృతి కాకినాడ ప్రాంత ప్రజలతో పాటు తమ పార్టీకి తీరని లోటన్నారు. నాగబాబు చిత్రపటానికి జగన్‌మోహన్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ కాకినాడ పార్లమెంటు కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, కాకినాడకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జైన మందిరం సందర్శించిన జగన్

కాకినాడ : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కాకినాడ దేవాలయం వీధి విక్టరీ హౌస్ కాలనీలోని మార్వాడీల శీత్రి మందిర్‌ను  సందర్శించారు. పార్టీ అభిమాని నిర్మల్‌జైన్ నివాసంలో గురువారం రాత్రి బస చేసిన జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటకు బయలుదేరే ముందు అక్కడకు సమీపంలోని ఈ ఆలయానికి వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాకినాడలోని మార్వాడీలు, జైన్‌లు ఎంతగానో ఆదరించారని చెప్పారు. వీరంతా ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

కాకినాడ జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవర్‌లాల్ జైన్, సంఘ ప్రతినిధులు హంసరాజ్ జైన్, మహేందర్, కాంతిలాల్, ఈదారామ్‌చౌదరి, సామర్లకోట, పిఠాపురం జైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబాల్‌లాల్, తారత్‌మాల్ జైన్, పెద్దాపురంలోని జైన్ ప్రతినిధులు కూడా నిర్మల్‌జైన్ నివాసానికి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మార్వారీ యువమంచ్ ప్రతినిధులు కూడా జగన్‌ను కలిశారు.
 
 అధినేతతో కాకినాడ నగర నేతల భేటీ
 కాకినాడ వచ్చిన జగన్ మోహన్‌రెడ్డిని పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కలుసుకున్నారు. నిర్మల్‌జైన్ నివాసం వద్ద వీరందరినీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డికి పరిచ యం చేశారు. అధినేతను కలిసిన వారిలో పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, జిల్లా వక్ఫ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, మీసాల దుర్గాప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి జోగా రాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కె.ఆదిత్యకుమార్ తోపాటు వివిధ డివిజన్లకు  చెందిన మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా నాగిరెడ్డి

ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్ జైల్లో ఉన్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించనున్నారు.

అది బాబు చేసిన ఖూనీ

అనంతపురం యువ రైతు ఆత్మహత్యపై జగన్
రైతుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం
ప్రజాకంటక సర్కారుకు పోయే రోజులు దగ్గర పడ్డారుు
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.

ఇది నూటికి నూరుశాతం చంద్రబాబు చేసిన ఖూనీయేనని మండిపడ్డారు. కాకినాడలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో జగన్ కొద్దిసేపు మాట్లాడారు. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెబుతూ వచ్చిన చంద్రబాబు వారిని పచ్చిమోసం చేశారన్నారు. వడ్డీ మాఫీ కాకపోగా ఇప్పుడు 14 నుంచి 16 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో యువరైతు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు.

డ్వాక్రా రుణాలకు సంబంధించి పైసా కూడా మాఫీ చేయకుండా అక్కచెల్లెళ్ళను నిలువునా దగా చేశారని చెప్పారు. ప్రజాకంటక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు పోయే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నింటిపైనా అన్ని వర్గాల పక్షాన తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
 
తప్పించుకోవడానికే తెర మీదకు సెక్షన్-8
పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరాల్సిందేనని తమ పార్టీ తర ఫున అనేక పర్యాయాలు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి నివేదించామని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి తెలంగాణ లో ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాని నుంచి తప్పించుకునేందుకే సెక్షన్-8ని  తీసుకొచ్చారని విమర్శించారు.
 
జగన్ హెచ్చరికతో కదలిన ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: ధవళేశ్వరం ప్రమాద బాధితులకు నాలుగు రోజుల్లో పరిహారం ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించడంతో సర్కారు దిగి వచ్చింది. మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.2లక్షల పరిహారాన్ని శనివారం పంపిణీ చేయాలని నిర్ణయించింది.
 
పొగాకు రైతులతో నేడు జగన్ భేటీ
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి  సందర్శించనున్నారు. అక్కడి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడతారు. ఈ రైతులు గిట్టుబాటు ధర లభించక నానాఅవస్థలు పడుతున్నారు. పాలకులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు  జగన్  వెళ్తున్నారు.
 
వెన్ను తట్టి.. ధైర్యం చెప్పిన జగన్
* వాయుగుండం, వ్యాన్ ప్రమాద బాధితులకు ఓదార్పు
* బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో వాయుగుండం వేళ సముద్రంలో చిక్కుకుని మరణించిన మత్స్యకారుల కుటుంబాలను, పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ ప్రమాదంలో మత్యువాత పడ్డ వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వేట నిషేధ కాలం ముగిసిన వెంటనే అల్పపీడనం ఏర్పడినా ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు చేయకపోవడంవల్లే మత్స్యకారులు వేటకు బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.

దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీపరంగా అండగా నిలుస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందించేలా ఒత్తిడి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి మృతుని ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యులను  పలకరించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు.శుక్రవారం కాకినాడ పర్లోపేటకు చెందిన మత్స్యకారుడు కంటుముర్చి వెంకటేశ్వర్‌రావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

జగన్ హెచ్చరికతో బాధితులకు పరిహారం

Written By news on Friday, July 3, 2015 | 7/03/2015

విశాఖపట్నం: ‘దవళేశ్వరం వద్ద ప్రమాదంలో 22మంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగి 18 రోజులు అయినా బాధితులకు పరిహారం ఇవ్వరా?... ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా... నాలుగు రోజుల్లో పరిహారం ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అల్టిమేటం. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన ప్రభుత్వానికి ఈమేరకు హెచ్చరించారు. వై.ఎస్.జగన్ హెచ్చరికతో ప్రభుత్వ దిగివచ్చింది. రూ.2లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించి ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వంలో కదలిక వచ్చింది.

మతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.2లక్షల పరిహారాన్ని శనివారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శనివారం మధ్యాహ్నం బాధిత కుటుంబాలకు ఈ మేరకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ‘వై.ఎస్.జగన్ రాకతోనే ప్రభుత్వం దిగివచ్చింది... ఇంతకాలం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడైనా పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ రాకపోయి ఉంటే మాకు పరిహారం దక్కేదే కాదు. ఆయన వచ్చి ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించారు ’ అని బాధిత కుటుంబాల సభ్యులు చెబుతున్నారు.

డిప్యూటీ సీఎం ప్రకటన మేరకే మాపై కేసులు

కర్నూలు: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటన మేరకే తమపై కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలంతో పోలీసు కేసులు పెట్టి  వైఎస్సార్ సీపీని అణిచేస్తామని గతంలో డిప్యూటీ సీఎం బహిరంగంగా ప్రకటన చేశారని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అందరిమీదా కేసులు పెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇటీవల ఓ ఫ్లెక్సీ కాల్చారని ఆరోపిస్తూ డోన్ ఎమ్మెల్యే  బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మోహన్ రెడ్డి తెలిపారు.
 
జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని..  దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందన్న ఆక్రోశంతో నాయకులను భయపెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఇలా కేసులు బనాయిస్తుందన్నారు. అంతకుముందు భూమా నాగిరెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టారని.. ఇంతలోనే మళ్లీ కేసు పెట్టారన్నారు.  తప్పుడు ఫిర్యాదుతోనే భూమాపై కేసు పెట్టారన్నాడు. ప్రభుత్వోద్యోగి మీద నేర పూరితంగా ఏమైనా చేస్తేనే సెక్షన్- 353 నమోదు చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారని.. ఎందుకలా చేశారని అడిగితే అరిచి ఏం చేద్దామనుకుంటాన్నావని నాగిరెడ్డిని  ఏకవచనంతో సంబోధించారన్నారు. అరెస్టు చేయమంటావా అని బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నాగిరెడ్డి కూడా దీటుగా మాట్లాడారే తప్ప వాళ్లను తిట్టింది లేదన్నారు.
 
ప్రభుత్వం పెట్టే కేసులకు కర్నూలు జిల్లాలో ఏ నాయకుడూ, కార్యకర్తా కూడా భయపడరని తెలిపారు. కేసులకు భయపడే వాళ్లు ఈ జిల్లాలో రాజకీయాల్లో రారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాను అసెంబ్లీ హక్కుల తీర్మానాన్నిప్రవేశపెడతామన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టుపై శనివారం ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.

బాబును నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే


బాబును నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టు అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నిలదీశారు. జీడిపల్లి రిజర్వాయర్ వద్ద శుక్రవారం ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో బాబు సమీక్ష నిర్వహించారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సీఎం ఆదేశించారు.

గతేడాది ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురానికి కేవలం 15 టీఎంసీల నీరే వచ్చిందని, ఒక్కో టీఎంసీకి రూ.15 కోట్లు ఖర్చు చేశారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే జిల్లాకు వచ్చిన నీటిని ఎందుకు దుర్వినియోగం చేశారో చెప్పాలని సీఎం బాబును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నిలదీశారు. జిల్లాలో 3.5 లక్షల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అవసరాలు తీరిన తర్వాతే నీరు తీసుకెళ్లాలని బాబుకు ఆయన స్పష్టం చేశారు.

నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు


'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'వీడియోకి క్లిక్ చేయండి
కర్నూలు : పోలీసులు తనను అకారణంగా దూషించి, తమను రెచ్చగొట్టి మరీ తన తండ్రిపై కేసు పెట్టారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు బనాయించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. అఖిలప్రియ ఏమన్నారో ఆమె మాటల్లోనే...

ఓటు వేయడానికి నేను, నాన్నగారు కలిసి వెళ్లాం. నాన్నగారు చిన్న పనిమీద బయటకు వచ్చారు.
క్యూ ఎక్కువగా ఉందని పది నిమిషాలు కూర్చోమని పోలీసులే చెప్పడంతో కూర్చున్నాం.
నాన్న బయటకు వెళ్లగానే పోలీసులు ఒకేసారి డీఎస్పీ, ఏఎస్పీ వచ్చి.. వెంటనే నన్ను ఓటు వేసి వెళ్లిపొమ్మన్నారు
నాన్న వస్తే ఇద్దరం కలిసి ఓటేసి వెళ్లిపోతాం అని చెప్పాను
నేను ఓటర్లతో మాట్లాడిందీ లేదు, కదిలింది కూడా లేదు
అయినా ఓటు వేయాల్సిందేనని బలవంతం చేశారు
పది నిమిషాల్లో ఓటేసి వెళ్లిపోతానని చెప్పినా, వాళ్లు రూడ్ గా మాట్లాడారు.
టీడీపీ ఏజెంట్లు పోలీసుల దగ్గరకు వెళ్లి, మమ్మల్ని పంపేయాలని చెప్పడంతోనే పోలీసులు వచ్చారు
పోలింగ్ కేంద్రం వద్ద నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు డీఎస్పీ నా దగ్గరకు వచ్చి రూడ్ గా మాట్లాడారు.
గౌరు చరిత ఎవరు, ఆమెకేం సంబంధమని కూడా ఆయన అన్నారు
దాంతో నాన్న ఒక తండ్రిగానే రియాక్ట్ అయ్యారు, కూతురు ఒక్కరే ఉన్నప్పుడు అలా మాట్లాడతారా .. రూల్స్ చూపించండి అన్నారే తప్ప వాళ్లను తిట్టలేదు
వీళ్లు ఏ కేసు పెట్టినా సిల్లీ రీజన్లకే పెడుతున్నారు.
పోలీసులతో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా
వాళ్లు అత్యుత్సాహం చూపించారు. గతంలో ఎలా చేశారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు
అక్కడ పోలీసులు మాట్లాడినదానిపై మేం ఏమైనా చర్యలు తీసుకోగలమా అని చూస్తున్నాం.

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ ఆయన మీద కేసు పెట్టారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. తనతో పాటు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఇలా ఎందుకు జరుగుతోందని భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. ఓటు వేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన సందర్భంలో పోలీసు అధికారులు ఆమెను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు భూమా నాగిరెడ్డికి సమాచారం అందింది. యువ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని, కావాలని రెచ్చగొట్టే ధోరణిలో కామెంట్లు చేయడం సరికాదని అక్కడున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.
అయితే.. జరిగిన అన్యాయంపై అలా ప్రశ్నించినందుకే.. పోలీసు అధికారులను దూషించారంటూ కేసులు పెట్టారు. ఆయనపై 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్ కు తరలించినట్లు తెఇసింది. దీంతో ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, కారణం ఉన్నా లేకపోయినా తమ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయన్న సూచనలు రావడం వల్లే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. గతంలో కూడా భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి.

నువ్వు అరిస్తే ఏమీ కాదు..


'నువ్వు అరిస్తే ఏమీ కాదు.. '
హైదరాబాద్: ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పట్ల డీఎస్పీ అగౌరవంగా మాట్లాడారని డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఉన్న భూమా నాగిరెడ్డిని 'నువ్వు అరిస్తే ఏమీ కాదు' అంటూ డీఎస్పీ ఏకవచనంతో మాట్లాడారని, ఎమ్మెల్యేలతో మాట్లాడేతీరు ఇదేనా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డితో అగౌరవంగా మాట్లాడిన విషయం వీడియో రికార్డులో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. భూమా కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలా ప్రవర్తించడం సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ విషయంపై పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకే భూమా నాగిరెడ్డిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని రాజేంద్రనాథ్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబును అరెస్ట్ చేయకపోవటం దారుణం: వైఎస్ జగన్

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది.  తుఫాన్ కారణంగా మృతి చెందిన మత్స్యకారుడు పి.వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన శుక్రవారం పర్లోపేటలో పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఇన్నిరోజులు అయినా మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.  మత్స్యకారుల ప్రాణాలను చంద్రబాబే తీశారని, వాతావరణ పరిస్థితులపై కనీస హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఎలాంటి సాయం అందటం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే సెక్షన్-8 ఎందుకు అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్-8 అన్నది ఒక భాగం మాత్రమే అని వైఎస్ జగన్ అన్నారు. చట్టంలో హామీలు అమలు చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను పలుమార్లు కలిశామని, మొత్తం చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినట్లు వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

విషయాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఇప్పుడు సెక్షన్-8 అంటున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. లంచాలు తీసుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నిస్తున్నారని, బహుశా దేశచరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇవ్వడానికి యత్నించి పట్టుబడ్డారని, నల్లధనంతో వారిని కొనుగోలు చేయడానికి నేరుగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడరని, వీడియోల్లో దొరికినా చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. సిగ్గుమాలిన చంద్రబాబు...ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సెక్షన్-8 ప్రస్తావిస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎన్డీ తివారీ విషయంలో చెప్పిన నీతిని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆచరించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీ తివారీకి  ఓ నీతి...చంద్రబాబుకు మరో నీతా అని వైఎస్ జగన్ నిలదీశారు.

అనంతరం ఆయన కాకినాడ  జగన్నాథపురం బయల్దేరి వెళ్లారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తదుపరి కాకినాడరూరల్ నియోజకవర్గం పగడాలపేట వెళతారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కాకినాడ నుంచి బయలుదేరి ఏజెన్సీలోని గంగవరం మండలం  పాతరామవరం చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు.

పాతరామవరం నుంచి పి. నెల్లిపూడి, సీహెచ్. నెల్లిపూడి, కొత్త నెల్లిపూడి మీదుగా కొత్తాడ చేరుకుంటారు. కొత్తాడలో మృతుడు శారపు అబ్బులుదొర కుటుంబాన్ని ఆయన ఓదారుస్తారు. అనంతరం కొత్తాడ నుంచి సూరంపాలెం చేరుకొని ఎనిమిది మంది మృతుల కుటుంబాలను , క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం సూరంపాలెం రిజర్వాయర్ సమీపంలో రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

Popular Posts

Topics :