26 July 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు

Written By news on Saturday, August 1, 2015 | 8/01/2015


'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు'
హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలే టీడీపీ ఎంపీల గుడ్డలు ఊడదీస్తారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం తాపత్రయ పడుతూ.. రాష్ట్ర ప్రతిష్టను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్ర మంత్రి చెబుతుంటే.. మిగతా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా  పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఈనెల 10న దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నా కోసం ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు బొత్స విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

‘హోదా’ తప్పక అమలు చేయాల్సిందే..


‘హోదా’ తప్పక అమలు చేయాల్సిందే..
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తుందని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం రాష్ట్ర విభజన నాడు పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ అని, దాన్ని తప్పక అమలు చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిహార్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక మంత్రి ఇందర్‌జిత్ సింగ్ సమాధానమిస్తూ.. ఇక కొత్తగా ప్రత్యేక హోదా అనే ప్రశ్నే తలె త్తదని చెప్పడం బిహార్‌కు సంబంధించినది మాత్రమే అయి ఉంటుందని వైవీ పేర్కొన్నారు. కేంద్రం ఉద్దేశం ఏదైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై వైఎస్సార్‌సీపీ తగిన రీతిలో ఆందోళన చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రాన్ని నిలదీసేందుకు సోమవారం సభలో వాయిదా తీర్మానం కోసం నోటీసు ఇస్తామన్నారు.
 
బాధితుల విడుదలకు కేంద్రం చొరవచూపాలి :లిబియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు తీవ్రవాదుల బందీలుగా ఉన్న సంఘటన విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి చొరవచూపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అందరినీ క్షేమంగా విడుదల చేయించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

విభజన హామీలు నెరవేర్చండి : వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన హామీల మేరకు రైల్వేశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను సత్వరం పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి శుక్రవారమిక్కడ రైల్వేమంత్రిని కలసి పెండింగ్ అంశాలను గుర్తుచేశారు. రైల్వే జోన్ ఏర్పాటు, కొత్త రైళ్ల ఏర్పాటు తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

హంద్రీ నీవాను తాగునీటి పథకంగా మార్చే కుట్ర


హంద్రీ నీవాను తాగునీటి పథకంగా మార్చే కుట్ర
- చంద్రబాబు తీరుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
- సర్కారు వైఖరికి నిరసనగా 3న ఉరవకొండలో రైతు సదస్సు
అనంతపురం సెంట్రల్ : 
హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని మరోమారు తాగునీటి పథకంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నాడని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఉరవకొండ నియోజకవర్గంలో వేలాది మంది రైతులు వారి భూములను కోల్పోయారన్నారు. గత ప్రభుత్వ హాయంలోనే 96శాతం హంద్రీనీవా మొదటి దశ పూర్తయిందని, మూడేళ్లుగా జిల్లాకు నీళ్లొస్తున్నాయన్నారు. కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే తొలిదశలోని 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చునని వివరించారు.

అయితే ప్రభుత్వానికి ఆయకట్టుకు నీరివ్వాలనే ద్యాసే లేదని మండిపడ్డారు. ఎంతసేపూ చిత్తూరు జిల్లాలోని సీఎం సొంతనియోజకవర్గం కుప్పంకు నీటిని తరలించుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా 1 టీఎంసీ మాత్రమే కేటాయింపు ఉన్న కుప్పంకు 2 టీఎంసీలకు పెంచారని గుర్తు చేశారు. అయితే మొదటి దశలోని ఆయకట్టును కాదని రెండదశలో చివరనున్న చిత్తూరు జిల్లాలకు నీటిని తీసుకుపోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాలువగట్లు తెంచైనా సరే ఆయకట్టుకు నీరు విడుదల చేసుకుంటామని హెచ్చరించారు.

గతంలో ఎన్‌టీరామారావు సాగునీటి పథకంగా ప్రారంభిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు 5.5 టీఎంసీల తాగునీటి పథకంగా కుదించారని గుర్తుచేశారు. 2004లో అధికారం చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 40 టీఎంసీల సాగు,తాగునీటిప్రాజెక్టు మార్చారని వివరించారు. గడిచిన 18 ఏళ్లలో 14 సార్లు జిల్లాలో కరువు వ స్తే ఈ జిల్లా ప్రజలు ఎలా తట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు నగలు, ట్రాక్టర్లను వేలం వేసి రైతులను అవమానానికి గురి చేస్తున్నారని అన్నారు.

పుష్కరాలకు రూ. 1600 కోట్లు, పట్టిసీమకు రూ. 1000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను అందించిన అనంతపురం జిల్లా ప్రజల కోసం హంద్రీనీవాకు నిధులు విడుదల చేసి ఆయకట్టుకు నీరిస్తే ఆత్మహత్యలే ఉండవని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక 14 నెలల సమయంలో హంద్రీనీవాకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాలకు నీరిచ్చారు? కనీసం కరెంటు బిల్లులైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఎంతసేపు అరకొరగా చెరువులకు నీరిచ్చి జిల్లా మంత్రులు ‘షో’ చేస్తున్నారని విమర్శించారు. పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 50 వేల ఎకరాలు ఆయకట్టు అభివృద్ది గురించి పట్టించుకున్నారా? ప్రశ్నించారు.

సర్కారు ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా ‘హంద్రీనీవా ఆయకట్టు నీటి సాధన సమితి’ ఆధ్వర్యంలో  3న ఉరవకొండలో రైతు సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపక్షాల నుంచి మద్దతు వస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రజలు, అన్ని రాజకీయపార్టీల నాయకులు, మేదావులు, ప్రముఖులు విచ్చేసి రైతుసదస్సును విజయవంతం చేసి జిల్లా ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలిసొచ్చేలా గళం వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదాపై బాబు మోసం


ప్రత్యేక హోదాపై బాబు మోసం
వైఎస్సార్‌సీపీ నేత కొలుసు ధ్వజం
హోదా సాధ్యం కాదని బీజేపీ కేంద్రమంత్రులు చెబుతుంటే.. ఇంకా వారితో టీడీపీ చెలిమా?
కేంద్రం నుంచి తప్పుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారు?

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని దగా, మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీకార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రప్రభుత్వంలోని మంత్రులు స్పష్టంగా చెబుతుంటే.. ఇంకా వారితో టీడీపీ చెలిమి చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏపీకి అర్హతల్లేవని కేంద్రమంత్రులు చెప్పడం సరికాదన్నారు. ఏపీకి అర్హతలున్నాయా? లేదా? అని చూసి ప్రత్యేక హోదా ఇస్తామని ఆరోజు చెప్పలేదని, విభజన జరిగే రోజున ఈ రాష్ట్రానికి జరిగేనష్టాన్ని పూడ్చేందుకు రాజ్యసభలో సాక్షాత్తూ అప్పటి ప్రధాని హామీఇచ్చారని పార్థసారథి గుర్తుచేశారు. ప్రత్యేకహోదా అనేది ఏపీకున్న అర్హతలను బట్టో లేక దయాదాక్షిణ్యాలతోనో ఇచ్చేది కాదన్నారు. ఈ అంశంపై సీఎం రాష్ర్టప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి తప్పుకుంటామని, ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు.
 
పదేళ్లపాటు ఇస్తామన్న హామీని మరిచారా?
రాష్ట్రానికి ప్రత్యేకహోదాను పదేళ్లపాటు ఇస్తామని వెంకయ్యనాయుడు గతంలో రాజ్యసభలో విభజన బిల్లు విషయంలో చెప్పారని, ఇపుడు మాత్రం సాధ్యంకాదని చెబుతున్నారని పార్థసారథి తప్పుపట్టారు. ప్రత్యేక హోదాకోసం ప్రతిపక్షం పోరాడట్లేదని కొన్ని పత్రికలు, మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీని, ఆ పార్టీతో చెలిమి చేస్తున్న టీడీపీని వదిలేసి వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచీ ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నారని ఆయన తెలిపారు. తిరుపతి తుడా కార్యాలయం నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను తొలగించి ఆ స్థానంలో చంద్రబాబు తన ఫొటోను ఏర్పాటు చేసుకోవడం చౌకబారుతనానికి నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు.

రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ


 హైదరాబాద్: నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై నిగ్గు తేల్చడానికి వైఎస్సార్‌సీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కె.పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్.కె.రోజా, మేరుగు నాగార్జున, వంగవీటి రాధాకృష్ణ, గొట్టిపాటి రవికుమార్ ఇందులో ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ప్రిన్సిపల్, ఇతర నిందితుల ప్రమేయం, కులవివక్ష, దర్యాప్తులో ప్రభుత్వ వైఫల్యం, వర్సిటీలో బోధన సిబ్బంది కొరత తదితర అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి పార్టీ అధ్యక్షునికి నివేదిక సమర్పిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో ఆదుకుంటామన్నారుగా..


బాబు ముఖం చాటేస్తున్నారెందుకు?
రిషితేశ్వరి మరణంపై రోజా ప్రశ్న
మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో ఆదుకుంటామన్నారుగా..
ఇపుడు నోరెందుకు మెదపలేదు?

 
హైదరాబాద్: ప్రతిదానికీ మీడియా ముందుకొచ్చి ప్రచారంకోసం తాపత్రయపడే ఏపీ సీఎం చంద్రబాబు నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి విషయంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా నిలదీ శారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థిని ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిపోయి నిందితులైన విద్యార్థులకు అధికారపక్షం అండగా ఉందన్నారు. మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో వచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు బాబు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, అలాంటిదిపుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నిం చారు. రిషితేశ్వరి కేసులో నిందితుల్ని శిక్షించేలా చర్యలు తీసుకునేలా కోరడానికి ఆమె తల్లిదండ్రులు ఏపీ సీఎం వద్దకు వెళితే ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. న్యాయం చేయాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవడానికి వెళ్లిన విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు.

అసలిలాంటి విద్యా మంత్రి, సీఎం రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్సిటీకి వెళ్లిన విచారణ కమిటీ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడిస్తున్నారని ఆమె తప్పుపట్టారు. అక్కడ వ్యవహారమంతా కులాల కుంపటిగా చేశారని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని నిందితులుగా చేశారని, వాస్తవానికి వర్సిటీ వైస్‌చాన్సలర్‌ను తొలి ముద్దాయిగా, ప్రిన్సిపల్‌ను రెండో ముద్దాయిగా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోరాడుతున్న మహిళాసంఘాలు, విద్యార్థులపై టీడీపీ మద్దతుదారులు దాడులు చేసి ఉద్రిక్తతలకు కారణమైనందునే ఆ పార్టీ ప్రమేయముందని తాము చెబుతున్నామన్నారు. ర్యాగింగ్‌ను నివారించడానికి 2009, మే 8న సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందని, వాటిని వర్సిటీ అధికారులు పాటించలేదన్నారు. నిజనిర్ధారణ చేసి రిషితేశ్వరి కుటుంబం తరఫున పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ మహిళా, విద్యార్థి విభాగం, ఎమ్మెల్యేలు ఆగస్టు 6న నాగార్జున వర్సిటీకి వెళుతున్నామని వెల్లడించారు.

జర్నలిజానికే మచ్చ..: పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన అనని మాటల్ని అన్నట్లుగా ఓ పత్రిక రాయడం జర్నలిజానికే మచ్చని రోజా దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ వంటి అంశాల్ని చర్చించాంగానీ ఆ పత్రికలో రాసినట్లుగా మరే చర్చా జరగలేదన్నారు.

 
 

సెక్రటరీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా

Written By news on Friday, July 31, 2015 | 7/31/2015

హైదరాబాద్ : ఏసీ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను  కలవడానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణతో వారు మాట్లాడారు. స్పీకర్ కు వినతిపత్రం ఇవ్వాలని కోరుతు కార్యదర్శి చేతికి అందజేశారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరుతున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు.
చంద్రబాబు భయపడుతున్నారు

అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు బాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
అనంత ఆయుకట్టును నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను ఎట్టి పరిస్థితిలో సహించమన్నారు. అవసరమైతే కాల్వలను పగులకొట్టి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఈ అంశంపై ఆగస్టు 3న ఉరవకొండలో అన్ని రాజకీయా పార్టీల కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వై విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.

మార్చ్ టు పార్లమెంట్ భవన్


10న ఢిల్లీలో జగన్ ధర్నా
ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన
 పాల్గొననున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
 ధర్నా అనంతరం     ‘మార్చ్ టు పార్లమెంట్ భవన్’
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో ఆగస్టు 10వ తేదీన దేశ రాజధానిలో ఒక రోజు ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, పీఏసీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ధర్నాలో జగన్‌తోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో ఇతర నేతలు పాల్గొంటారని సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వెల్లడించారు.
 
ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ధర్నా సాయంత్రం 3 వరకూ జరుగుతుందని, ధర్నా ముగిశాక అందులో పాల్గొన్న వారందరితో ‘మార్చ్ టు పార్లమెంట్ భవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.
 
 ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి?
 
 పార్లమెంట్‌లో విభజన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా చాలదు, పదేళ్ల వరకూ ఇవ్వాలని కోరారని, ఆ మాటలు ఇపుడేమయ్యాయని బోస్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను సాధించాల్సిన బాధ్యత కేంద్రంలోని ఎన్డీయేతో చెలిమి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనే ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటించకపోయినా ఎందుకు మౌనంగా ఉన్నారో, ఈ హామీని సాధించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లినపుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ప్రధాని, ఇతర మంత్రులను కలిసినపుడు ఆయన ఈ అంశంపై చర్చిస్తున్నారని చెప్పారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, దీని నిర్మాణానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బోస్ గుర్తు చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీకి అనివార్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ గట్టిగా కోరుతోందని, అదే విషయాన్ని ఢిల్లీలో నినదిస్తుందని ఆయన తెలిపారు. బొత్స సత్యనారాయణ, ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, పినిపె విశ్వరూప్, ఎస్.రామకృష్ణారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని, ఎస్.దుర్గాప్రసాదరాజు, ముఖ్యనేతలు భేటీలో పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ పోరుబాట


ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
- కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల:
  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్‌సీపీ పోరాటం చేయనుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి పెద్ద ఎత్తున వైఎస్ జగన్ దీక్ష చేపడతారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగాఉన్నా చంద్రబా బు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిత్యం పోరాటాలు చేస్తూనే ఉందన్నారు.

రుణమాఫీ జరగక.. అప్పులు తీరక నిత్యం అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతోందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.1. 50లక్షలు మాత్రమే ప్రకటించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం కమిటీల పేరు తో కొన్ని లక్షల మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లలో కోత విధించిందన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ కేవ లం వడ్డీకి కూడా సరిపోక అన్నదాతలు అల్లాడుతున్నారన్నారు. ప్రజ లను అన్నివిధాలుగా మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు మరెంతో దూరం లేదన్నారు.  అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు

స్పీకర్ ను కలవనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు

హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను  కలవనున్నారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు కోరనున్నట్లు సమాచారం.

హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం

Written By news on Thursday, July 30, 2015 | 7/30/2015


హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం
అనంతపురం : రాయలసీమకు పట్టుగొమ్మ లాంటి హంద్రీనీవా ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమ కరువుకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.

అనంతపురం ఆయకట్టుకు నీరు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రాంతాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా సాధన కోసం రైతు సదస్సు ఏర్పాటు చేస్తామని, దీని కోసం ఎంతవరకైనా పోరాడతామని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా


ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా ఉంటుంది.

ఆ తర్వాత 'మార్చ్ టు పార్లమెంట్' కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు తదతరులు పాల్గొంటారు.


గ్రేటర్‌లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యం


గ్రేటర్‌లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యం
 కాజీపేట రూరల్ : వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణరుుంచింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి సమావేశమయ్యారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డితో మూడు గంటలపాటు చర్చించారు. పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఎంపీ, గ్రేటర్ ఎన్నికలలో ైవైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయూలని రాఘవరెడ్డి సూచించినట్లు జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ తెలిపారు.

 వచ్చే నెలలో షర్మిల పరామర్శ యాత్ర..
 జిల్లాలో ఆగస్టులో షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి వె ల్లడించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ తెలిపారు. షర్మిల యాత్రను జిల్లాలో విజయవంతం చేసేందుకు ైవైఎస్సార్ సీపీ నాయకులు కృషి చేయాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీలోకి సంగాల ఇర్మియా, సాల్మన్‌రాజ్
 హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఇర్మియా, సాల్మన్‌రాజ్ వైఎస్సార్ సీపీలో చేరినట్లు గ్రేటర్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సం యుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మం చె అశోక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ. ఖాదర్, ట్రేడ్ యూని యన్ జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్యగౌడ్, జిల్లా నాయకులు నెమలి పురి రఘు, షంషీర్ బేగ్, చల్ల అమరేందర్‌రెడ్డి, బద్రొద్దీన్ ఖాన్, బీంరెడ్డి రవితేజరెడ్డి, నాగవెల్లి రజనీకాం త్, రాజేష్, యాకూబ్, సుధాకర్, పిట్టల శ్రీను పాల్గొన్నారు.

జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం


జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం
33 రైతు కుటుంబాలకు పంపిణీచేసిన పరిహారం రీయింబర్స్
తొమ్మిది నెలలుగా కలెక్టర్ ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభుత్వం
ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగొచ్చిన బాబు సర్కార్
మిగతా రైతు కుటుంబాలకు పరిహారం అందించేందుకు మార్గం సుగమం
ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే పరిహారం మంజూరు
రూ.5 లక్షలు పరిహారం ఇస్తామంటూ జారీ చేసిన జీవో-62ను బేఖాతరు
రైతు కుటుంబాలను మళ్లీ మోసం చేస్తున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని, తమ ప్రభుత్వం రాగానే రూ.ఐదు లక్షలు చెల్లిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది.

తొమ్మిది నెలలుగా తొక్కిపట్టిన ఫైలుకు మోక్షం కలిగిస్తూ... ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున 33 రైతు కుటుంబాలకు చెల్లించిన రూ.49.50 లక్షల పరిహారాన్ని రీయింబర్స్‌మెంట్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించి రూ.1.50 లక్షలే పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
బాబు సర్కారు మళ్లీ మోసం..
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వస్తూనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి మానవీయ కోణంలో పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. బకాయిలు తీర్చడానికి రూ.50 వేలు, రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రూ.లక్షను కేటాయిస్తూ 2004 జూన్ ఒకటిన ఉత్తర్వులు (జీవో 421)ను జారీ చేశారు. శవపరీక్ష నివేదికలతో నిమిత్తం లేకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని అందించి ఆదుకున్నారు.

పదేళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం రైతుల పరిస్థితి మరింత దిగజారింది. వరుస కరువుల వల్ల ఆర్థికంగా కుంగి కుదేలైపోయారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం అందించాల్సిన అవసరముందని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అప్పులు తీర్చడానికి రూ.1.50 లక్షల.. రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రూ.3.5 లక్షలు మొత్తం రూ.ఐదు లక్షల వంతున పరిహారం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల వంతున పరిహారాన్ని మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19న ఉత్తర్వులు (జీవో 62) జారీ చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో వందలాది మంది రైతులు బలవన్మరణం చెందారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 83 మంది కర్షకులు ఆత్మార్పణం చేసుకున్నారు. కానీ వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ సభ్యులుగా ఉన్న కమిటీ అర్హులుగా తేల్చిన రైతు కుటుంబాలకు పరిహారం అందించడానికి కూడా నానా సాకులు చెప్తూ ఆలస్యం చేసింది. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 33 రైతు కుటుంబాలకు చెల్లించిన పరిహారం రీయింబర్స్‌మెంట్ చేస్తే మిగతా వారికి అందిస్తామని కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను తొమ్మిది నెలలుగా తొక్కిపట్టింది.

జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేస్తోన్న విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. తక్షణమే పరిహారం మంజూరు చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున 33 రైతు కుటుంబాలకు రూ.49.50 లక్షలను పరిహారంగా మంజూరు చేస్తున్నట్లు బుధవారం జీవో-690 జారీ చేసింది. అయితే రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవోనే బేఖాతరు చేస్తూ రూ.1.50 లక్షలు మాత్రమే మంజూరు చేయడంపై అధికారవర్గాలే మండిపడుతున్నాయి.

Popular Posts

Topics :