09 August 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

TIME TO FIGHT OUT FOR SPL. STATUS: YSRCP

Written By news on Saturday, August 15, 2015 | 8/15/2015

YSR Congress has demanded the TDP government to spell out its stand on the Special Status in wake of the letter Centre has written to YS Jagan Mohan Reddy which clearly states that the issue does not arise.

“In reply to the letter written by YS Jagan Mohan Reddy to the Prime Minister on the special status, the department of industrial policy and development has replied that the package was already included and the State does not fulfill the criteria for getting any special incentives,’ Party MP P.Mithun Reddy told reporters on Saturday.

The letter also said that industrial development is a state subject and the measures taken by the state will be supplemented on merits. This clearly shows that there is no special package for the state and the industrial incentives cannot flow into the State.

This is time to assert ourselves and fight for the rights which YSR Congress is doing. ‘Where does TDP stand on the issue needs to be known,” he said.

నారాయణ రెవెన్యూ మంత్రి కూడానా?


నారాయణ రెవెన్యూ మంత్రి కూడానా?
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో పరిపాలన కరువైందని, దోపిడి మాత్రమే కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)ధ్వజమెత్తారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు.. మంత్రి నారాయణ ఒక్కరికే రాజధాని బాధ్యతలు అప్పగించారని, జిల్లాకు చెందిన మంత్రులను సైతం పక్కనపెట్టి తమ దోపిడికి సహకరించేవారినే దరికి చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

మునిసిపల్ మంత్రిగా వున్న నారాయణ అది మరిచి రెవెన్యూ మంత్రిగా సర్వం ఆయనే అన్నట్లు వ్యవహరిస్తుండగా అసలు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఒక్కసారి పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకున్నాడా? అంటూ ఆగ్రహవ్యక్తం చేశారు.  రాజధాని ప్రాంతంలో రైతుకూలీలు,రైతులు, కౌలురైతులును పట్టించుకోవడం లేదన్నారు. అసైన్డ్‌భూములు తేలకపోగా భూములిచ్చిన రైతులకు భూముల కేటాయించకపోగా ఆభూములలో ఉద్యోగులకు ఇళ్ళుకట్టిస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు.

టీడీపీ పాలన ఎలా వుందంటే పార్టీ సృష్టికర్త ఎన్టీఆర్‌ను మరచి సర్వం నారాయణార్పణంగా మారిందని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో నిందితులుగా ఫోర్‌నిక్స్‌ల్యాబ్ నిర్ధారించినా ముఖ్యమంత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు ఏ చీకటిఒప్పందాలు చేసుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒక ప్రకటన చేస్తే పక్కనే వున్న చంద్రబాబు మరొకప్రకటన చేస్తూ రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు.

మంత్రులను స్టార్‌హోటళ్ళలో వుండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి తాను మాత్రం ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేయడంతో పాటు వాస్తు పిచ్చితో ప్రభుత్వభవనాలును మరమ్మత్తుల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేయడాన్ని నిషేదిస్తే ప్రజలకు ఉపయోగకరంగా వుంటుందన్నారు. అంతేకాక విజయవాడలో క్యాంప్ కార్యాలయానికి కోట్ల రూపాయలతో రీమోడలింగ్ చేయటమేకాక,దానికి కూతవేటు దూరంలో వున్న ఉండవల్లి కరకట్టపై విహారవిడిది కొరకు అక్రమ నిర్మాణాలను,సక్రమనిర్మాణాలు చేసిన ఘనతతో పాటు విహారవిడిది భవనాలుకు కోట్లరూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు.

యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : పొంగులేటి


యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : పొంగులేటి
యువత పార్టీకి వెన్నెముక లాంటి వారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం నేత భీష్వ రవీందర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు పొంగులేటి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతకు వైఎస్సార్ సీపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీలోకి ఎంపీ వారిని సాదరంగా ఆహ్వానించారు.

కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ నేతలు శేఖర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య


ఎస్సై వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య
♦ మనస్తాపంతో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్య
♦ మృతదేహంతో రాస్తారోకో
♦ పెదారికట్లలో మూడు గంటల పాటు ఉద్రిక్తత
♦ కొనకనమిట్ల ఎస్సైపై గ్రామస్తుల మండిపాటు

 పెదారికట్ల (కొనకనమిట్ల) : ఎస్సై వేధింపులకు తాళలేక వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెదారికట్లలో శుక్రవారం జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజాల నిమ్మారెడ్డి(18) తల్లిదండ్రులు ఇటీవల గ్రామంలో జరిగిన అన్నదమ్ముల కొట్లాట కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్నారు. కొనకనమిట్ల ఎస్సై మస్తాన్ షరీఫ్ కొట్లాట జరిగిన రోజు నుంచి గ్రామంలోకి వచ్చి తరుచూ నిమ్మారెడ్డిని బెదిరిస్తున్నాడు. మరో వైపు నిమ్మారెడ్డి వ్యతిరేక వర్గీయులకు ఎస్సై అండగా నిలిచాడు. భయపడటంతో పాటు, తీవ్రమస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని నిమ్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 మృతదేహంతో రాస్తారోకో
 నిమ్మారెడ్డి మృతదేహాన్ని పెదారికట్ల బస్టాండ్ సెంటర్‌లో ఉంచి బంధువులు రాస్తారోకో చేశారు. నిమ్మారెడ్డి మృతికి కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు. సీఐ రవిచంద్ర వచ్చి వివరాలు సేకరించారు. ఆందోళన ఉధృతం కావడంతో దర్శి డీఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డిలు పోలీసులతో మాట్లాడారు.

లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎస్సైపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోతో వాహనాలు ఇరువైపులా బారులు తీరాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, రేగడపల్లి సొసైటీ అధ్యక్షుడు కామసాని వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.

రైతన్నకు స్వాతంత్య్రం ఎప్పుడు?


రైతన్నకు స్వాతంత్య్రం ఎప్పుడు?
- వ్యాపారం కోసమే భూ సేకరణ
- ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి:
 నేటి పాలకుల తీరుతో  రైతులకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో ఇప్పటికే వేల ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వానికి ఇప్పడు మళ్లీ సేకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. గతంలో తాము చెప్పినట్లుగా  భూముల సేకరణ రాజధాని కోసం కాదని... వ్యాపారం కోసమేనన్న సంగతి రుజువైందన్నారు.  మంత్రి నారాయణ తాను ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేసి సమీకరణలో తీసుకునే ఎత్తుగడ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

భూసమీకరణపై రైతులు కోర్టుకు వెళ్లగా కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని,  ఆ రైతుల నుంచి భూ సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని పెద్దలకు కోర్టు తీర్పులు అంటే గౌరవం లేదని, రైతుల మనోభావాలతో పని లేదన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇప్పటివరకు రాజధానిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడ భూములు ఇస్తారో చెప్పలేదని, రైతు కూలీలు, కౌలు రైతులు పనులు లేక పస్తులతో విలవిలలాడుతున్నారన్నారు.  రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా వుండి కడదాకా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

కోటి ఆత్మార్పణతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

Written By news on Thursday, August 13, 2015 | 8/13/2015


కోటి ఆత్మార్పణతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలికోటి భార్యకు ఆర్థికసాయం అందిస్తున్న పెద్దిరెడ్డి , భూమన, నారాయణస్వామి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి, భూమన
- కోటి కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం
- గాయాలపాలైన శేషాద్రికి రూ. 50 వేలు అందజేత

తిరుపతి మంగళం: 
ముని కామకోటి ఆత్మాహుతితోనైనా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 8వ తేదీన మునికోటి నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే.

కోటి కుటుంబాన్ని మంగళవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సందర్భంగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ హామీ మేరకు వైఎస్ జగన్ ఆదేశాలపై కోటి కుటుంబానికి పెద్దిరెడ్డి, భూమన రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందించారు. బుధవారం ఉదయం కోటి ఇంటికి వెళ్లి అతని తమ్ముడు మురళికి రూ. 1.5 లక్షలు, కోటి భార్య దాక్షాయణికి రూ. 1.5 లక్షలు అందించారు. కోటిని కాపాడబోయి గాయాలపాలైన శేషాద్రికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని పెద్దిరెడ్డి, భూమన, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సంయుక్తంగా అందించారు.

వైఎస్ చిత్ర పటం తొలగింపు దుర్మార్గం

Written By news on Wednesday, August 12, 2015 | 8/12/2015


వైఎస్ చిత్ర పటం తొలగింపు దుర్మార్గం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడం దుర్మార్గమని, దుష్ట సంప్రదాయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధికారపక్షంపై ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్ చిత్రపటం లాంజ్‌లో ఉండాలా...’ అని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు హేళనగా మాట్లాడడం దారుణమని, పొట్టిశ్రీరాములు, ప్రకాశం పంతులు చిత్రపటాలను కూడా తొలగించామని గొప్పగా చెప్పుకోవడం ఏమిటని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్య విలువల్ని, సంప్రదాయాల్ని కాపాడాల్సిన శాసనసభ స్పీకర్ కూడా ఆ పదవికి తగినట్లుగా వ్యవహరించలేదని, తన పదవికున్న ప్రాముఖ్యతను పోగొట్టారని ఆయన విమర్శించారు. పదవిలో ఉంటూ మృతి చెందారు కాబట్టి వైఎస్ చిత్రపటాన్ని ఆనాటి అసెంబ్లీ స్పీకర్, నాటి సీఎం, బీజేపీతోసహా అసెంబ్లీలోని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా అంగీకరించి లాంజ్‌లో ఏర్పాటు చేశారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. పార్లమెంట్‌లో దివంగత స్పీకర్ బాలయోగి గౌరవార్థం ఆయన పేరును లైబ్రరీ హాలుకు పెట్టారని, ఎన్టీఆర్ విగ్రహాన్నీ పార్లమెంట్‌లో ఉంచారని తెలిపారు.

రేపు అధికారంలోకి మరో గిట్టని పార్టీ వచ్చి వాటిని తొలగించడం సరైన సంప్రదాయమవుతుందా? అని ప్రశ్నించారు. వైఎస్ చిత్రపటం ఫ్రేం లూజ్ అయితే తొలగించామని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణరావు తనకు ఫోన్‌లో అబద్ధం చెప్పారని, కానీ ఇపుడు చీఫ్ విప్ చెప్పాక అసలు విషయం తెలిసిపోయిందన్నారు. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం చెప్పినట్లల్లా తలూపుతున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలు ధర్నా చేసినపుడు రెండురోజుల్లో చిత్రపటాన్ని పెడతానని కార్యదర్శి హామీఇచ్చారంటూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు వైఎస్ చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టకపోతే తదుపరి కార్యాచరణను తమ నేత జగన్‌తో చర్చించి చేపడతామని గడికోట చెప్పారు.
 
టీడీపీ పర్పసెస్ కమిటీలా ఉంది...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలందరూ ఢిల్లీ ధర్నాకు వెళ్లింది చూసి అసాధారణ రీతిలో హడావుడిగా జనరల్ పర్పసెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడమేమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఈ కమిటీలో పార్టీల సంఖ్యాబలం ప్రాతిపదికన గాక ఏకపక్షంగా 22 మంది అధికారపక్షం వారినే నియమించుకున్నారన్నారు. వాస్తవానికిది టీడీపీ పర్పసెస్ కమిటీలాగా ఉందే తప్ప జనరల్ పర్పసెస్‌కోసం ఏర్పాటు చేసినట్లు లేదని దుయ్యబట్టారు.

పత్యేక హోదాతోనే నిజమైన నివాళి


నీ త్యాగం వృథా పోదు
{పత్యేక హోదాతోనే నిజమైన నివాళి
మునికోటి కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేసిన ముని కామకోటికి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుపతిలో మంగళవారం నివాళులర్పించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రాష్ట్ర ప్రజల గొంతుకను వినిపించిన జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా ఇక్కడికి వచ్చి మునికామకోటి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
      
తిరుపతి కార్పొరేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆత్మబలిదానం చేసిన బెంగళూరు బీ.మునికామకోటి అలియాస్ బీఎంకే కోటి కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా మధ్యాహ్నం తిరుపతిలోని మంచాల వీధికి చేరుకున్నారు.  ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన కోటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రావడంతో ఆయన చూసిన జనం  ‘‘కోటి అమర్ రహే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, జగన్‌తోనే ప్రత్యేక హోదా’’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోటి ఆత్మ త్యాగం ఊరికే పోకూడదని, కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేలా పోరాడాలని, ప్రత్యేక హోదా మీతో (జగన్)నే సాధ్యం కావాలని, మీ పోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ.. మంచాల వీధి ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం  బీఎంకే కోటి ఇంటికి జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. అక్కడ కోటి తమ్ముడు మురళి, వదిన లక్ష్మీ, మామ రామచంద్రయ్య, అక్క రాజ్యలక్ష్మీని ఆప్యాయంగా పలకరించారు. వారిని ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  కోటిని కాపాడబోయి గాయాలపాలైన శేషాద్రిని పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని ఓదార్చారు. అనంతరం రాజన్న పార్కు వద్ద ఉన్న బీఎంకే కోటి భార్య దాక్షాయణి(38), ఆమె తండ్రి గణపతి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు.

‘ఏం తల్లీ..ఏమి చేస్తున్నావ్, ఎలా ఉంటున్నావ్, కుటుంబ నేపథ్యం ఏమిటి? అంటూ పలకరించారు. వైఎస్ జగన్ ఓదార్పు మాటలతో దాక్షాయణి కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆయన స్పంది స్తూ ‘కోటి చేసిన త్యాగం ఊరికే పోదు, ఆ త్యాగానికి తగిన ప్రతిఫలం ప్రత్యేక హోదా సాధిస్తామ’ని అన్నారు. మీకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం కల్పించారు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి అన్నలకు చెప్పండి, అండగా ఉంటారు..’ అం టూ ఆమెను ఓదార్చారు.  ఈ కార్యక్రమం లో వైఎస్‌ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి, పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి పాల్గొన్నారు.
 
కోటి చేసిన త్యాగం ఊరికే పోదు.  ప్రత్యేకహోదా సాధనతోనే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. కోటి మాదిరి ప్రాణాలను బలి చేసుకోవద్దు.  కేంద్రం, సీఎం చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధిస్తాం.

నేడు తిరుపతికి జగన్

Written By news on Tuesday, August 11, 2015 | 8/11/2015

తిరుపతి: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుపతికి వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన ముని కామకోటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతి మంచాలవీధిలోని కోటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటి.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.

‘ఓటుకు కోట్ల’ నుంచి బయట పడేందుకే..


‘హోదా’ సాధించేదాకా ఆగదు పోరాటం
- ఢిల్లీ ధర్నాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
- కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కలిసికట్టుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి
- బాబు స్వార్థ ప్రయోజనాలకోసం ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు
- బీజేపీ నేతలది ఎన్నికలకు ముందో మాట, ఇప్పుడో మాట
- హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్డుపడుతోందని అబద్ధాలు చెబుతున్నారు
- అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా రాహుల్‌గాంధీ వైఖరి
- మునికోటి ఆత్మాహుతి ప్రజల భావోద్వేగానికి, ఆవేదనకు అద్దం పడుతోంది
- హోదావల్ల వచ్చే ప్రయోజనాలు మన నేతలకు తెలియకపోవడం మన ఖర్మ
- ప్రత్యేకహోదా వచ్చేవరకూ పోరాడతాం..     ఈ నెల 28న ఏపీ బంద్

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం మొదలుపెట్టిన పోరాటం ఇంతటితో ఆగదని, హోదా సాధించేవరకు కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా రాష్ట్రానికి అన్యా యం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్లమెంటు తలుపులు మూసేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే... ప్రత్యేకహోదాపై బీజేపీ నేతలు అప్పుడో రకంగా, ఇప్పుడో రకంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసులో విచారణ జరగకుండా తప్పించుకోవడానికే ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ లైన్’లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. తిరుపతిలో మునికోటి అనే యువకుని ఆత్మాహుతి ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు, ఆవేదనకు అద్దం పడుతుందన్నారు. అయినా బాబు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి 3 రోజులు ముందుగా.. అంటే ఈనెల 28న ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో బాబును కడిగేస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా సాధనకోసం సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో చేసిన ధర్నాలో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ధర్నాలో జగన్

ప్రసంగం సాగిందిలా...

నిరంకుశ వైఖరితో విభజించారు

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీఇచ్చి నెరవేర్చకపోవడంతో మనకు జరిగిన అన్యాయంపై స్వరం వినిపించేందుకు ఢిల్లీకి వచ్చాం. అసలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే 19 నెలలు వెనక్కువెళ్లాలి. రాష్ట్రాని విడగొట్టవద్దని మేం మొత్తుకుని చెప్పాం. 60 శాతం ప్రజలు అంగీకరించకపోయినా నిరంకుశ వైఖరితో రాష్ట్రాన్ని విభజించారు. లోక్‌సభ తలుపులు మూసి మరీ విభజన బిల్లుకు ఆమోదముద్ర వేయించారు.

రాష్ట్రాన్ని విభజించే బిల్లు ఆనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు.. విభజించవద్దన్నందుకు మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. లైవ్‌టీవీ ప్రసారాన్ని కూడా కత్తిరించిన బ్లాక్‌డేను రాష్ట్ర ప్రజలింకా మరిచిపోలేదు. విభజన బిల్లుకు అప్పటి ప్రతిపక్షం బీజేపీ, టీడీపీ(చంద్రబాబు) కూడా మద్దతు ఇచ్చాయి కాబట్టే.. బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ దాకా వెళ్లింది. రాజ్యసభలో మేం లేము. అక్కడ సుదీర్ఘంగా జరిగిన చర్చ మధ్య.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అన్న పదాన్ని పెట్టారు. ‘రాష్ట్రం విడిపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తోంది కాబట్టి.. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం మాకు తెలుసు.

హైదరాబాద్‌ను 60 సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా నిర్మించారు. అలాంటి హైదరాబాద్ దూరమైతే  70 శాతం పరిశ్రమలు దూరమవుతాయి. 95 శాతం సేవలు.. అంటే మొత్తం సాఫ్ట్‌వేర్ రంగం దూరమవుతుంది. కాబట్టే.. సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తాం. దానివల్ల పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి’ అని సాక్షాత్తూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. అదే రాజ్యసభలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభ్యులు.. ఐదు సంవత్సరాలు సరిపోదు.. 10 ఏళ్లు కావాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు పార్టీ రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపింది. విభజన బిల్లు మీద తామే తొలి ఓటు వేశామని టీడీపీ చెప్పడం మనందరికీ బాగా గుర్తుంది. సాక్షాత్తూ అధికార, ప్రతిపక్షాలు కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని విడగొడుతున్నాం.. కానీ ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు మాటిచ్చాయి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఆ మాటను ఇప్పుడు గౌరవించకపోతే సామాన్యులమైన మనం ఎవరి వైపు చూడాలి? భారతదేశంలో రాజ్యాంగం ఉందా? లేదా? అని అడగాల్సి వస్తుంది.

హోదాతో రెండు ప్రయోజనాలు...
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి నేతలకు కూడా తెలియకపోవడం దురదృష్టకరం. ప్రత్యేకహోదా వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి.. కేంద్రం నుంచి వచ్చే సహాయంలో 90 శాతం గ్రాంటు, 10 శాతం రుణం అవుతుంది. గ్రాంటుగా వచ్చే సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ప్రత్యేక హోదా లేకుంటే... కేంద్రం నుంచి వచ్చే గ్రాంటులు కేవలం 30 శాతమే. మిగతా 70 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 90 శాతం గ్రాంటుగా వస్తే.. ఆమేరకు నిధులు ఊరికే రాష్ట్రానికి వస్తాయి. రెండు.. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి పలు రకాల పన్నులు, సుంకాల నుంచి మినహాయింపు వస్తుంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వస్తే ఉత్సాహవంతులు, పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారు. ఫలితంగా పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి. యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయి. రాష్ట్రం బాగుపడుతుంది.

కానీ పార్టీలు ఏం చేస్తున్నాయి?
కానీ ప్రత్యేక హోదా కల్పించే విషయంలో పార్టీలు ఎన్నికలప్పుడు ఏమన్నాయో, ఇప్పుడు ఏమంటున్నాయో చూస్తుంటే బాధ కలుగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రం విడిపోయి 15 నెలలు అవుతుంటే.. కనీసం ఒక్కరోజు కూడా ఆయన రాష్ట్రం ముఖం చూడలేదు. పార్లమెంట్‌లో కూడా ఒక్కరోజు కూడా ప్రత్యేకహోదా గురించి ప్రశ్నించిన పాపానపోలేదు. అలాంటాయన ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి.. ప్రత్యేకహోదా కోసం పోరాడతానంటారు.

ఆయన తీరు ఎలా ఉందంటే.. అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా ఉంది. ఆ రోజు రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తుంటే... ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ఇస్తామని గట్టిగా చెప్పింది. మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ ఎన్నికల తర్వాత మాట మారుస్తున్నారు. బిహార్, ఒడిశా కూడా అడుగుతున్నాయని అడ్డుపుల్ల వేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చినప్పుడు ఒడిశా, బిహార్ లేవా?

14వ ఆర్థిక సంఘం మీద నెపం
ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపడం లేదని ప్రతి సందర్భంలోనూ బీజేపీ మంత్రులు, సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు చెబుతున్నారు. అందువల్లే ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కావడం లేదంటున్నారు. కానీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వమని, ఇవ్వద్దని సిఫారసు చేసే అధికారం ఆర్థిక సంఘానికి లేదు. కేంద్రానికి పన్నుల ద్వారా సమకూరే ఆర్జనను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలనే అంశాన్ని సూచించడమే దాని పని. ప్రణాళికేతర గ్రాంట్లు, రుణాలు ఎలా ఇవ్వాలో సిఫారసు చేస్తుందేతప్ప, ప్రణాళికా వ్యయంలో ఉన్న లోటు గురించి, ప్రణాళికా గ్రాంట్లు గురించి ఎలాంటి సిఫారసులు చేయదు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సాధారణ సాయం, ప్రత్యేక సాయం గురించి ఆర్థిక సంఘాలు ఎలాంటి సిఫారసులు, సూచనలు చేయవు. ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు.. ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపించడం గతంలోనూ ఆర్థిక సంఘాలు చేయలేదు. (ఈ మేరకు జగన్ అందులో పేర్కొన్న విషయాన్ని చదివి వినిపించారు). ప్రత్యేకహోదా కల్పన మీద నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నేతృత్వంలోని నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కే పూర్తి అధికారాలున్నాయి. కానీ నెపాన్ని 14వ ఆర్థిక సంఘం మీద నెట్టుతున్నారు.

చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?
పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే పార్టీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తూ.. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న  ప్రత్యేక హోదా ఉపసంహరించుకొనే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారని మంత్రి సమాధానం ద్వారా స్పష్టమైంది. అంటే ప్రత్యేక హోదా అమల్లో ఉన్నట్లే.

మరి ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ, టీడీపీకి వచ్చే నష్టం ఏమిటి? రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపిద్దామని బాబును అడిగాం. కానీ ఆయన స్పందించలేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి.. కేంద్రాన్ని గట్టిగా నిలదీద్దామని అడిగినా ఉలుకూ పలుకూ లేదు. హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారు? అని అడిగినా జవాబు లేదు.

లంచాలపై కక్కుర్తితో..
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 300 టీఎంసీలకు పైగా నీటిని వాడుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తీసుకెళ్లచ్చు. కానీ చంద్రబాబు లంచాలకు కక్కుర్తిపడి పోలవరాన్ని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో దినేష్‌కుమార్.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా పనులు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డిపెడుతూ కేంద్రం లేఖ రాసింది.

కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని లేఖలో రాస్తే, ఆ కాంట్రాక్టర్‌కు చంద్రబాబు సీఎం అయ్యాక రూ. 290 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. మరో రూ. 220 కోట్లు పనులు చేశారని ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టు మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ ఏమిటి చంద్రబాబూ? ఈ కాంట్రాక్టర్ బాగా పనిచేయడం లేదని ఇప్పుడు చెబుతున్నావు.. మరి ఆ విషయం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన నాడు గుర్తుకు రాలేదా? పోలవరం పనులు చేస్తున్నది టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ కాదా?

పోలవరం ప్రాజెక్టు పనులను నత్తనడకన చేయిస్తారు. నత్తనడకన పనులను సాకుగా చూపించి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తారు. దాని నుంచి కోట్లకు కోట్లు పిండుకుంటారు. ఇసుక కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. మాఫియా రూపంలో దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు తన సొంతానికి ప్రత్యేక హోదా ఇచ్చుకున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేశారు.

పోరుబాటలో వైఎస్సార్‌సీపీ
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ మొదటినుంచీ పోరాడుతూనే ఉంది. మంగళగిరిలో రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టింది. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. తిరుపతిలో కోటి అనే యువకుడు కాల్చుకొని చనిపోయాడు. 67 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తున్నాం. వేల మంది 40 గంటలపాటు రైళ్లలో ప్రయాణించి ఢిల్లీ వచ్చి నడిరోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం.

పోరాటం కొనసాగింపులో భాగంగా చంద్రబాబు, కేంద్రం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు.. శాసనసభ సమావేశాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు అంటే ఈ నెల 28న ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నాం. శాసనసభలో చంద్రబాబును గట్టిగా కడిగేస్తాం. ఈ పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది. ఇంతదూరం వచ్చి ధర్నా చేశాం. ఇక్కడనుంచి పార్లమెంట్ కొంచెం దూరమే. మనమంతా కూడా పార్లమెంట్‌కు మార్చ్ చేద్దాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో కూడా వినిపిద్దాం. రండి.. అందరం కలిసి పార్లమెంట్ వైపు నడుద్దాం..!
 
‘ఓటుకు కోట్ల’ నుంచి బయట పడేందుకే..
 ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు అడగడం లేదు? కేంద్రంలోని వారి మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవడం లేదు? అని నాకు వచ్చిన అనుమానమే ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ లైన్’కూ వచ్చింది. ఈమేరకు కథనం ప్రచురించింది. ఓటుకు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తూ వీడియో టేపుల్లో పట్టుబడ్డారు.

ఎమ్మెల్సీని గెలిపించుకోవాలనే దిక్కుమాలిన ప్రయత్నంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను రూ. 150 కోట్లకు బేరమాడి, ఒక ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా వీడియో టేపుల్లో పట్టుబడిన విషయాన్ని కథనంలో ప్రస్తావించారు. ఓటుకు కోట్ల కేసులో విచారణ జరగకుండా తప్పించుకోవడానికి చంద్రబాబు.. ప్రత్యేక హోదా గురించి గట్టిగా కేంద్రాన్ని నిలదీయడం లేదని స్పష్టంగా రాశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టినట్లు నేను చెబుతున్నది కాదు.. ‘బిజినెస్ లైన్’ చెప్పింది.

వాళ్లకు ఇచ్చినప్పుడు.. మాకెందుకు ఇవ్వరు?

Written By news on Monday, August 10, 2015 | 8/10/2015


వాళ్లకు ఇచ్చినప్పుడు.. మాకెందుకు ఇవ్వరు?
న్యూఢిల్లీ : రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు.. ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త బంద్ పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
  • రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సవ్యసాచుల్లా విచ్చేసిన ప్రతి అన్నకు, తమ్ముడికి, ప్రతి అక్కకు, చెల్లెలికి, ప్రతి అవ్వకు, తాతకు శిరసు వంచి, చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశంపై మనకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలిపేందుకు ఢిల్లీ వీధుల్లో మన స్వరం వినిపించేందుకు వచ్చాం.
  • రాష్ట్రాన్ని విభజించిన రోజు ఏం జరిగింది.. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టకండి అని మొత్తుకుని చెప్పాం
  • 19 నెలల క్రితం రాష్ట్ర విభజనను 60 శాతం మంది ప్రజలు ఒప్పుకోకపోయినా నిరంకుశంగా విభజించారు
  • లోక్ సభలో విభజన బిల్లును వ్యతిరేకించినందుకు మమ్మల్ని లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు
  • ఆరోజు లైవ్ టీవీ ప్రసారాలను కూడా కత్తిరించిన బ్లాక్ డే
  • రాష్ట్రంలో ఉన్నవాళ్లెవరూ ఆరోజును మర్చిపోలేరు
  • ఆ తర్వాత వాళ్లకున్న బలంతో.. బీజేపీ, చంద్రబాబుల మద్దతుతో బిల్లు ఆమోదం పొంది, రాజ్యసభకు వెళ్లింది.
  • ఆరోజు రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ మధ్య ప్రత్యేక హోదా అన్న పదాన్ని పెట్టారు
  • ఆరోజు పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి రాష్ట్రం విడిపోవడం దురదృష్టకరం.. రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తోంది కాబట్టి, సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం నాకు తెలుసు. హైదరాబాద్ దూరమైతే 70 శాతం పరిశ్రమలు, 95 శాతం సాఫ్ట్ వేర్ సేవలు అన్నీ దూరం అవుతాయన్నారు. కాబట్టే సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తాం అన్నారు. దాంతో సీమాంధ్రను బాగుపరుస్తాం, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు.
  • ఆరోజు అదే పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వాళ్లు.. ఐదేళ్లు కాదు, అలా అయితే పరిశ్రమలు పెట్టడానికే మూడేళ్లు పడుతుంది కాబట్టి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది
  • ఆరోజు రాజ్యసభలో టీడీపీ సభ్యులు కూడా రాష్ట్రాన్ని విభజించడానికి మద్దతు తెలిపి, ఓటు వేశారు.
  • మొదటి ఓటు మేమే వేశామని టీడీపీ ఎంపీలు విక్టరీ సింబల్ చూపించిన రోజులు మనకు గుర్తున్నాయి
  • ఆరోజు అధికారపక్షం, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులంతా కలిసి మాట ఇచ్చారు.
  • రాష్ట్రాన్ని విడగొడుతున్నాం గానీ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు
  • పార్లమెంటులో ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఒక మాట ఇస్తే.. ఆ మాటను మీరు గౌరవించకపోతే, ఇక సామాన్యులమైన ఏమం ఎటువైపు చూడాలని నిలదీస్తున్నా.
  • మన ఖర్మ ఏమిటంటే.. ప్రత్యేక హోదా అంటే ఏంటో చాలామంది నాయకులకు కూడా తెలియదు
  • దానివల్ల ప్రధానంగా రెండు మేళ్లు జరుగుతాయి
  • ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటులు వస్తాయి. 90 శాతం గ్రాంటు, 10 శాతం మాత్రమే రుణం అవుతుంది.
  • రాష్ట్రానికి ఊరికే డబ్బిస్తారు కాబట్టి రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది.
  • అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంటు కేవలం 30 శాతమే ఉంటుంది.
  • రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తారు. ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ టాక్స్, ఆదాయపన్ను లేకుండా పరిశ్రమలు పెట్టచ్చు
  • అలా అయితే ఉత్సాహవంతులు ముందుకొచ్చి.. పరిశ్రమలు నెలకొల్పుతారు.
  • దాంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి
  • వాటితో పాటు.. వాటి వల్ల రాష్ట్రం అంతా బాగుపడే పరిస్థితి వస్తుంది.
  • కానీ ఈవాళ అలాంటి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో పార్టీలు ఏమంటున్నాయి..
  • వీళ్లు చేస్తున్న రాజకీయాలు చూస్తే బాధ అనిపిస్తోంది
  • రాహుల్ గాంధీ మొన్న ఆంధ్రరాష్ట్రానికి వచ్చాడు.. 15 నెలల తర్వాత గుర్తుకొచ్చింది. పార్లమెంటులో ఈ వ్యక్తి ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు
  • ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడతానంటాడు.
  • అగ్గి పెట్టేసి, తర్వాత తానే వచ్చి నీళ్లు పోసి ఆర్పుతానంటాడు
  • పెద్దాళ్లు ఏదో చెబుతారు, సామాన్యులమైన మనం వినాలి
  • బీజేపీని అడుగుతున్నా.. ఆరోజు రాష్ట్రం గురించి మీకు బాగా తెలుసు
  • కాంగ్రెస్ అడ్డంగా విభజిస్తుంటే, వాళ్లు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఇదే పార్లమెంటు నుంచి.. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మీరు కాదా?
  • బీజేపీ మేనిఫెస్టోలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని రాసింది.
  • ఇదే బీజేపీ.. ఈరోజు ప్రత్యేక హోదా విషయానికొస్తే ఇవ్వకుండా పోతోంది.
  • బీహార్, ఒడిషా అడుగుతున్నాయని, 14వ ఆర్థికసంఘం అడ్డుపడుతోందని చెబుతున్నారు.
  • ఇదే ఒడిషా, ఇదే బీహార్ .. ఆరోజు మీరు విభజించినప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను.
  • 14వ ఆర్థిక సంఘం అంటే ఏంటో తెలుసా, అదేం చేస్తుందో మీకు తెలుసా?
  • అసలు ఆ సంఘానికి ప్రత్యేక హోదా గురించి రికమెండ్ చేసే పరిస్థితి ఉందా?
  • అలాంటి అధికారం అసలు 14వ ఆర్థిక సంఘానికి లేనే లేదు.
  • దేశంలో పన్నుల రూపేణా వచ్చిన డబ్బులను ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలోనన్న అంశాన్ని పరిశీలించడమే వాళ్లు చేసే పని
  • అది కాక.. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల గురించి మాత్రమే రికమండేషన్స్ చేస్తుంది.
  • కానీ ఇదే కమిషన్ కు.. ప్లాన్ లోటు గురించి గానీ, ప్లాన్ గ్రాంటు గురించి గానీ ఎలాంటి కేటాయింపులు చేసే అధికారం ఉండదు
  • నేషనల్ డెవల్ మెంట్ కౌన్సిల్ కు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చే, ఇవ్వకపోయే అధికారం ఉంటుంది
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు
  • ప్రత్యేక హోదా ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటని కేంద్రాన్ని, చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా
  • ఈశాన్య రాష్ట్రాలకు మీరిచ్చిన ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంటారా అని వైవీ సుబ్బారెడ్డి అడిగితే.. కొనసాగిస్తున్నామని పార్లమెంటులో సమాధానం ఇచ్చారు
  • మరి వాళ్లకు ఇచ్చేటప్పుడు.. మనకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా
  • రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు
  • రాష్ట్రం విడిపోయిన తర్వాత మేం పలు సందర్బాల్లో మిమ్మల్ని అడిగాం.
  • ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుదామని అడిగాం.. ఆయనేమీ స్పందించలేదు.
  • అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి.. కేంద్రాన్ని నిలదీద్దామని అడిగా.. దానికీ స్పందన లేదు
  • హోదా ఇవ్వరని తెలిసినప్పుడు కేంద్రంలో మీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారని అడిగాం. అయినా దానికీ స్పందించలేదు
  • మంగళగిరిలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశాం
  • ప్రత్యేక హోదా రాదని.. ఇక ఉద్యోగాలు రావన్న ఆవేదనతో మునికోటి అనే వ్యక్తి ఆత్మార్పణ చేశారు
  • 65 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేలాది మంది ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం.. ఇంతమంది ఆవేదన మీకు అర్థం కావడం లేదా చంద్రబాబూ?
  • ఓటుకు కోట్లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీడియో, ఆడియో టేపులున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ గెలుచుకోవాలని చేసిన దిక్కుమాలిన ప్రయత్నంలో.. డబ్బిస్తూ సూట్ కేసుతో సహా పట్టుబడితే.. చంద్రబాబును ఈరోజుకూ ఎందుకు అరెస్టు చేయలేదు?
  • ఈ విషయాన్ని నేను మాత్రమే కాదు.. బిజినెస్ లైన్ అనే జాతీయ పత్రిక స్వయంగా అడిగింది
  • చంద్రబాబు తన స్వార్థం కోసం ఆ విచారణ జరగకుండా చూసుకునేందుకు రాష్ట్రాన్నే పణంగా పెట్టారని బిజినెస్ లైన్ చెప్పింది
  • గోదావరి ఎప్పుడు పొంగినా.. పోలవరం ప్రాజెక్టుతో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • ఆ నీళ్లతో రాష్ట్రమంతా బాగుపడే అవకాశం ఉంటుంది
  • కానీ చంద్రబాబు లంచాలు, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు.
  • కేంద్రంలో దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ఓ లేఖ రాశారు.
  • పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ తప్ప ఏమీ జరగడం లేదని, పదే పదే దీని గురించి ప్రశ్నిస్తున్నా స్పందించడలేదని, ఎందుకు చేయడం లేదని కేంద్రం చంద్రబాబుకు గడ్డిపెడుతూ లేఖ రాసింది
  • ఎడమ కాలువలో కూడా కాంట్రాక్టర్ పనులు చేయట్లేదని రాశారు
  • చంద్రబాబు ఇదే కాంట్రాక్టరుకు 290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారు.
  • పోలవరం ప్రాజెక్టు మీద నువ్వు చూపెడుతున్న శ్రద్ధ ఏంటి.. కాంట్రాక్టరు బాగోలేదని ఈరోజు గుర్తుకొచ్చారా.. అడ్వాన్సు ఇచ్చేటప్పుడు గుర్తురాలేదా?
  • కాంట్రాక్టులు చేసేది రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన సంస్థ కాదా
  • పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో.. మరింత దోపిడీ జరుగుతోంది
  • చంద్రబాబు రాష్ట్రాన్ని పణంగా పెట్టారు. కేవలం తన సొంతూరికి మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చి.. తానే బాగుపడాలని చూస్తున్నాడు
  • చంద్రబాబు మీద, కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి అసెంబ్లీ జరగడానికి  మూడు రోజుల ముందు.. 28వ తేదీ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాం
  • ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. ఇంకా ముందుకు సాగుతుంది
  • ఇక్కడి నుంచి మనమంతా పార్లమెంటుకు మార్చ్ చేద్దాం. రండి కదులుదాం.. అంతా కలిసి పార్లమెంటు వైపు నడుద్దాం

పోలీసుల అత్యుత్సాహం


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఢిల్లీలో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ నుంచి ఆయనను విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ జగన్ పార్లమెంట్ కు బయలు దేరారు. భారీగా మొహరించిన సైనిక బలగాలు, పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

పోలీసులు అత్యుత్సాహంతో పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాయాలయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో వైఎస్ జగన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వైఎస్ జగన్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అమాయకులపై పోలీసులు ప్రతాపం చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు.

రైతు నేత తల పగలగొట్టిన పోలీసులు

:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మార్చ్ ఫాస్ట్ను అడ్డుకునే క్రమంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వాళ్లు విచ్చలవిడిగా లాఠీచార్జి చేయడంతో.. కడప జిల్లాకు చెందిన రైతు విభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయాలయ్యాయి. కమలాపురానికి చెందిన ప్రసాదరెడ్డి రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. పోలీసుల విచక్షణా రహితంగా కొట్టడంతో ఆయన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయి. ఆయన తలకు వెనుక భాగంలో తీవ్రంగా గాయమైంది. పార్టీ నాయకురాలు రోజా ఆయనను పరామర్శించి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ప్రసాదరెడ్డిని అక్కడినుంచి ఆస్పత్రికి తరలించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ నాయకత్వంలో మాత్రం నేతలు, కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోహరించి.. ఆయనను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మందితో వైఎస్ జగన్ పార్లమెంటు దిశగా ముందుకు నడుస్తున్నారు.

వైఎస్ జగన్ అరెస్టు.. ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ దిశగా మార్చ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఆయనను అరెస్టు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి నిరసనగా ఆయన పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. తర్వాత వైఎస్ జగన్ను పోలీసులు తమ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తదితరులను కూడా తీసుకెళ్లారు. అరెస్టు చేసేందుకు కొద్ది ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మరింతమంది అమాయకులు ఇబ్బంది పడకూడదని, పోలీసుల లాఠీచార్జిలో దెబ్బలు తినకూడదనే ఉద్దేశంతోనే తాను అరెస్టు అవుతున్నానన్నారు.


''ఏపీ నుంచి వచ్చిన 3వేల మంది, ఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన సానుభూతిపరులు అందరూ కలిసి 5 వేల మంది పార్లమెంటుకు మార్చ్ చేస్తామంటే.. కుదరదని పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు.. మిమ్మల్ని అరెస్టు చేయక తప్పదని అంటున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే తలదించుకోవాలి. ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలడం బాధాకరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకోడానికి కూడా బాధపడుతున్నాం'' అని ఆయన అన్నారు.

28న రాష్ట్ర బంద్కు పిలుపు


న్యూఢిల్లీ :ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి జరగబోతున్నాయని, దానికి మూడు రోజుల ముందు రాష్ట్రమంతా బంద్ పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగు దేశం పార్టీలను గట్టిగా నిలదీయాలని అన్నారు.

ఆనాడు వెంకయ్య అడగలేదా?:వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై  ఆనాడు రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ..  ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కు తగ్గుందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో సోమవారం జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది. దీనిలో భాగంగా ఏఎన్ఐతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఆనాడు ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడు..  నేడు ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదని అనడానికి కారణం ఏమిటని జగన్ ప్రశ్నించారు.  ఈ విషయంపై నాటి పెద్దల సభలో అరుణ్ జైట్లీ కూడా మాట్లాడిన సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీతో పాటు, కాంగ్రెస్, టీడీపీలు కూడా ప్రధాన కారణమని మండిపడ్డారు.
 
బీజేపీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటక పోవడానికి కారణం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టిన టీడీపీ.. అవినీతి డబ్బుతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికే  మొగ్గుచూపుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
 
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
 
*ప్రత్యేక హోదా కోసం మేము చేస్తున్న డిమాండ్ కొత్తది కాదు
* కాంగ్రెస్ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విడగొట్టింది
*ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక హోదా సరిపోదు.. పదేళ్లు కావాలని బీజేపీ నాడు డిమాండ్ చేసింది
*పార్లమెంట్ లో ఇచ్చిన మాటకు విలువ లేకపోతే ఎలా?
*ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు 14వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధం లేదు
*ప్రత్యేక హోదాను ఫైనాన్స్ కమిషన్ వద్దని సూచించడం దారుణం
*ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసే అధికారమున్న ప్రభుత్వాన్ని ఎందుకు ఆపుతున్నారు?
*15 నెలలుగా ఒక్కసారిగా కూడా పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిమాండ్ చేయలేదు
*రాజకీయం చేస్తున్నానని నన్ను అనడం అవివేకం
*ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు మేలు కలుగుతుందా?
*ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అడుగుతానంటే మేము ఎప్పుడూ అడ్డుపడలేదు
*అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని చంద్రబాబును కోరాం, కానీ స్పందించలేదు
*సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు
*తనపై ఉన్న కేసులు ఎక్కడ బయటపడతాయోనని భయం.. అందుకే చంద్రబాబు రాజీ పడుతున్నారు

ఆక్రమణ భూమిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి సన్నాహాలు!

గుంటూరులో వెయ్యి గజాలు లీజుకు తీసుకుని మరో 1,637 గజాలు ఆక్రమణ
 ఆక్రమణ భూమిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి సన్నాహాలు

 
 మైకు దొరికితే నీతి, నిజాయతీ గురించి మాట్లాడే చంద్రబాబు.. తాను అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు అక్రమ పునాదులు వేస్తున్నారు. చేతిలో అధికారం ఉందికదా అనే ధీమాతో ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 సాక్షి, గుంటూరు:  అధికార పార్టీ టీడీపీ వ్యవహారశైలి కంచే చేను మేసిన చందంగా తయారైంది. గుంటూరులో ఆ పార్టీ 16 ఏళ్ల క్రితం కబ్జా చేసిన కార్పొరేషన్ స్థలంలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న స్థలంతోపాటు చుట్టు పక్కల స్థలాలపైనా కన్నేసింది. గతంలో అధికారంలో ఉన్నపుడు 1999లో గుంటూరులోనే ఖరీదైన ప్రాంతం అరండల్‌పేట పిచుకులగుంటలో జిల్లా టీడీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. దీనికోసం టీఎస్ నంబరు 826లో వెయ్యి చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం 1999 జూలై 1న జీవో ఎంఎస్ నం. 325 ద్వారా 30 ఏళ్లపాటు ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఏడాదికి రూ. 25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తూ, ప్రతి మూడేళ్లకొకసారి లీజును రెన్యువల్‌తో పాటు 33 శాతం అద్దె పెంచాలని అందులో పేర్కొంది. అయితే లీజు స్థలం పక్కనే సర్వే నం 12/3లో మరో 1,637 చదరపు గజాల  స్థలాన్ని సైతం ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క చదరపు గజం స్థలం రూ.1.25 లక్షల వర కు ధర పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే మొత్తం స్థలం విలువ దాదాపు రూ.20 కోట్లు. అప్పట్లోనే ఈ ఆక్రమణను నగరపాలకసంస్థ గుర్తించినప్పటికీ టీడీపీ అధికారంలో ఉండటంతో దాని జోలికెళ్లలేదు. 2008లో తిరిగి దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో నగరపాలక సంస్థ అధికారులు కదిలారు. సిటీప్లానర్ విచారణ జరిపి ఆక్రమణ జరిగినట్లు తేల్చారు. ఆయన నివేదిక ఆధారంగా టీడీపీ జిల్లా కార్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. కార్యాలయం పక్కన గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఆక్రమించామని ఒప్పుకున్నారు. ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నగరపాలకసంస్థ అధికారులకు లేఖ రాశారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపలేదు. అయినా ఆ స్థలం టీడీపీ ఆక్రమణలోనే ఉండిపోయింది. లీజుకు తీసుకున్న స్థలానికి ఏడాదికి ప్రస్తుతం రూ. 89,881 చెల్లిస్తున్నారు. 16 ఏళ్లుగా టీడీపీ ఆక్రమణలో ఉన్న 1,637 గజాల ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. లీజుకు అనుమతి లేకపోవడంతోనే రుసుము  చెల్లించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. లీజుకు తీసుకున్న స్థలం ప్రకారం చూసినా ఆక్రమించిన స్థలానికి సంబంధించి కార్పొరేషన్ దాదాపు పన్నెండున్నర లక్షల ఆదాయం కోల్పోయింది.
 
 లోకేశ్ కనుసన్నల్లో సన్నాహాలు..
 
  రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని నిర్మాణ ప్రాంతం గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత తనయుడు లోకేశ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దాని కోసం స్థల పరిశీలనకు కొద్ది రోజుల క్రితం ఆయన గుంటూరుకు రావాల్సి ఉన్నా.. రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాట ఘటనతో  పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే లోకేశ్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేయించిన సిద్ధాంతి సైతం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించి కొలతలు తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైతే ఆ పార్టీ ఆక్రమించిన స్థలం సైతం పూర్తిగా వారి అధీనంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

http://www.sakshi.com/news/top-news/land-occupied-for-tdp-office-in-guntur-265405?pfrom=home-top-story

ఢిల్లీలో వైఎస్ జగన్ సమరభేరి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగనుంది.

ధర్న వేదిక వద్దకు భారీ సంఖ్యలో వైఎస్ ఆర్ సీపీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేలాదిమంది రాకంతో జంతర్ మంతర్ వద్ద రోడ్లు కిక్కిరిసిపోయాయి. ధర్నా కోసం ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు మద్దతుగా ఢిల్లీలోని తెలుగువారు తరలివచ్చారు. వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నాయకులు హాజరయ్యారు.

అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త!


అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త!
సాక్షి, హైదరాబాద్: అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధించడంలో తప్ప చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాల్లో మాత్రం అనేక ప్రత్యేకతలు సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా దుయ్యబట్టారు. ఆదివారమిక్కడఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టగానే రాష్ట్రానికి కరువు కాటకాలను తెచ్చి ప్రత్యేకత సాధించారని, రైతులు, డ్వాక్రా మహిళల రుణాల్ని మాఫీ చేయకుండా మోసగించడంలో ప్రత్యేకహోదా సాధించారని ధ్వజమెత్తారు.

జాతీయహోదా లభించిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని తుంగలో తొక్కి పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టి రూ.700 కోట్ల అవినీతి సొమ్మును కాజేయడంలో నంబర్‌వన్‌గా నిలవడం, ఇసుక దోపిడీలో టీడీపీ మంత్రులు, చీఫ్‌విప్‌లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం, ఆడపిల్లల అభద్రతలో నంబర్‌వన్, మద్యం అమ్మకాలు, బెల్ట్‌షాపుల్లో నంబర్‌వన్ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారని ఆమె దుయ్యబట్టారు.

గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొనడం ద్వారా చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి ప్రత్యేకతను సంతరింపజేసుకున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీఎంకే కోటి మృతికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
 
పోయి చేతులు కట్టుకున్నారు: బుగ్గన
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి వారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక తప్పులు చేసి వాటిలో కూరుకుపోయిన చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడిగే పరిస్థితిలో లేరన్నారు.హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్డు చెబుతోందని గాలి ముద్దు కృష్ణమనాయుడు చెప్పడం తగదన్నారు.

‘హోదా’ కోసం సమరభేరి


‘హోదా’ కోసం సమరభేరి
నేడు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించబోతోంది. రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై దాదాపు 15 నెలలవుతున్నా ఒక్క అడుగూ ముందుకు పడకపోగా ఈ విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ దోబూచులాడుతున్నాయి.

దీని ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతో ఈ అంశంపై తొలినుంచీ వివిధ మార్గాల్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఇదే అంశంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఢిల్లీ గడ్డపై సోమవారం ధర్నా చేపడుతున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న జంతర్‌మంతర్(పార్లమెంటు వీధి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో) వద్ద చేపడుతున్న ఈ ధర్నాలో ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, క్రియాశీల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు.

ఈ ధర్నాకోసం వైఎస్సార్‌సీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జోరువాన కురుస్తున్న నేపథ్యంలో ధర్నా వేదిక నిర్మాణ పనులను సాయంత్రం నుంచి చేపట్టి రాత్రికల్లా పూర్తి చేశారు. పార్లమెంటు వీధి మొత్తం భారీ హోర్డింగులు, పార్టీ జెండాలతో నిండిపోయింది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని హోర్డింగ్‌ల్లో రాశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటును పార్టీ నేతలు ధర్నాస్థలి వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు.
 
ఢిల్లీ చేరిన జగన్
ఇదిలా ఉండగా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పార్టీనేతలు, కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్  నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రికి దేశ రాజధాని నగరానికి చేరాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ధర్నాస్థలి నుంచి పార్లమెంట్‌కు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించనున్నారు.‘హోదా’పై ఏరాష్ట్ర విషయంలోనైనా చట్టం చేశారా?
వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశంపై చట్టం చేయాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మండిపడింది. ఆదివారం రాత్రి ధర్నా స్థలిని పరిశీలించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, తదితరులు జంతర్‌మంతర్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా  వారు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదన్న వెంకయ్య వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ‘వెంకయ్యనాయుడు పచ్చిగా మాట్లాడారు. గతంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను పార్లమెంటులో చట్టం చేసి ఇచ్చారా? వెంకయ్యనాయుడు అలా మాట్లాడడం సరికాదు. అలాంటప్పుడు ఆనాడు సభలో పదేళ్లు కావాలని ఎలా అడిగారు?  ఈ దేశ చరిత్రలో కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయం..’ అని పేర్కొన్నారు.

Popular Posts

Topics :