06 September 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నేడు ఏడు కుటుంబాలకు ఓదార్పు

Written By news on Thursday, September 10, 2015 | 9/10/2015


జనహారతి
♦ వైఎస్సార్ స్మారక గార్డెన్‌ను ఆవిష్కరించిన షర్మిల
♦ మూడోరోజు ఆరు కుటుంబాలకు పరామర్శ
♦ నేడు ఏడు కుటుంబాలకు ఓదార్పు

 సాక్షి ప్రతినిధి, వరంగల్ : దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత సోదరి షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో భారీ స్పందన వచ్చింది. నర్సంపేట నియోజకవర్గంలో వేల మంది జనం పరామర్శ యాత్రకు తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి షర్మిల నర్సంపేటలో వైఎస్సార్ స్మారక గార్డెన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సంపేట వీధుల నిండా జనం పోగయ్యారు. షర్మిల వచ్చే సమయంలో చేతులు ఊపుతూ పలకరించారు. అందరి వైపు చూస్తూ, నవ్వుతో పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు.

మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం గూడూరు మండల కేంద్రంలో మొదలైన పరామర్శ యాత్ర నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, కొత్తగూడ, దుగ్గొండి మండలాల్లో జరిగింది. షర్మిల ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిలకు అన్ని గ్రామాల్లోనూ స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాజశేఖరరెడ్డి తనయను చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూశారు. దగ్గరికి వచ్చి చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు.


అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల పరామర్శ యాత్ర సాగించారు. వృద్ధులు, పిల్లలు కనిపించగానే అప్యాయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నర్సంపేట, నెక్కొండలో వాహనాల భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ మహిళలు రోడ్డు నిండా ముగ్గులు వేసి షర్మిలను ఆహ్వానించారు.

 అప్యాయంగా..

 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోరుున వారి కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల ప్రతి కుటుంబంలో అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గూడూరు నుంచి వెళ్లే దారిలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేశారు. నెక్కొండ మండలం వెంకటాపురంలో సూరం ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మంచిరోజులు వస్తాయని ఐలయ్య భార్యకు భరోసా కల్పించారు. అక్కడి నుంచి దీక్షకుంట్లకు చేరుకున్నారు. గ్రామంలోని బేతం చంద్రయ్య ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఇదే గ్రామంలోని కొమ్ముల మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దీక్షకుంట్ల నుంచి చెన్నారావుపేట మండలం జీజీఆర్‌పల్లి సమీపంలోని మామిళ్లపల్లిలో బూస నర్సయ్య భార్య కోమలను ఓదార్చారు. మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం ఓటాయితండాకు వెళ్లారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలే చనిపోయిన బానోత్ మంగిళి కుటుంబానికి భరోసా కల్పించారు. గిరిజన తండాకు వెళ్లినప్పుడు షర్మిలను వారు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. మూడోరోజు యాత్రలో చివరగా దుగ్గొండి మండలం మహ్మదాపురంలో మిట్టపెల్లి సంజీవ ఇంటికి వెళ్లారు. సంజీవ తల్లి సారమ్మను ఓదార్చారు. సారమ్మకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 గురువారం ఏడు కుటుంబాలు
 పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొంరమ్మ కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం జరిగే గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది.

 జనయాత్రలో నేతలు
  నర్సంపేట: జిల్లాలో మూడో రోజు షర్మిల పరామర్శ యాత్రలో ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుధవారం జరిగిన యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, విలియం మునిగాల, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాడెం శాంతికుమార్, షర్మిల సంపత్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ.మహిపాల్‌రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఎం.కళ్యాణ్‌రాజ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, వరంగల్‌సిటీ అధ్యక్షుడు కాగిత రాజ్‌కుమార్ యాదవ్, జిల్లా నాయకులు సంగాల ఇర్మియా, ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకులు కె.నరేందర్‌రెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి,నరసింహరావు, జిల్లా యువజన నాయకులు ఎం.సుమిత్‌గుప్తా, వరంగల్ జిల్లా ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ బి.రవితేజరెడ్డి, ఖమ్మం జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ కృషి


ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ కృషి
- తుంపెర కాలువలో స్కేలు ఏర్పాటుకు చర్యలు
- ఇక నుంచి పీబీసీ రైతులకు న్యాయం
- స్కేలు ఏర్పాటును పరిశీలించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి
లింగాల : 
గత 30 ఏళ్లుగా పీబీసీ రైతులకు తుంపెర డీప్‌కట్ కెనాల్‌లో ఏర్పాటు చేసిన నీటి సామర్యాన్ని చూపే స్కేలు వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది.  హెచ్‌ఎల్‌సీ అధికారులు తుంపెర కాలువకు వాల్వు గోడకు స్కేలు ఏర్పాటు చేసి నీటి విడుదల రీడింగ్ తీసేవారు. ఏడాది క్రితం పీబీసీ అధికారులు కాలువ మధ్యలో నిటారుగా మరో స్కేలు ఏర్పాటు చేశారు. గోడకు ఏర్పాటు చేసి న స్కేలు ద్వారా 472క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్లు, కాలువ మధ్య లో ఏర్పాటు చేసిన స్కేలు ద్వారా 355 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు చూపిస్తోంది. ఈ రెండింటి మధ్య 117 క్యూసెక్కుల నీటి వ్యత్యాసం ఉంది. దీనిపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్‌ఎల్‌సీ, ఐఏబీ సమావేశాల్లో అధికారులను గట్టిగా నిలదీశారు. దీంతో కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లేగాక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులలో చలనం కలిగి మేల్కొన్నారు.

దీంతో కాలువలో నీటి ప్రవాహం, సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి స్కేలు ఏర్పా టు చేసేందుకు, గేజ్ మేనేజ్‌మెంటు అధికారులు, హెచ్‌ఎల్‌సీ, పీబీసీ అధికారు లు బుధవారం ఉదయం తుంపెర డీప్‌కట్ కెనాల్‌కు చేరుకున్నారు. అధునాతన పరికరాలతో కాలువను అడ్డంగా కొలతలు నిర్వహించి 12పాయింట్లు గుర్తించారు. ప్రతి పాయింట్ వద్ద ఫిస్స ర్ వెయిట్ అనే యంత్రాన్ని నీటిలోకి దించి ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా నిమిషానికి ఎంత నీటి ప్రవాహం ఉందని గుర్తించారు. ఈ నివేదికలను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు నూతనంగా మరో స్కేలు ఏర్పా టు చేస్తామని రీసెర్చ్ ఆఫీసర్ ప్రభాకర్ శాస్త్రి తెలిపారు.

ఈ సందర్భంగా పులి వెందుల వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పీబీసీ రైతులకు ప్రతి ఏటా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తు తం ఏర్పాటు చేయనున్న స్కేలులో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గేజ్ మేనేజ్‌మెంట్ ఏడీ శరత్‌కుమార్, అనంతపురం ఈఈ హెలెన్, ఏఈఈ హేమలత, హెచ్‌ఎల్‌సీ లోకలైజేషన్ డీఈ నటరాజ్, పీబీసీ ఈఈ మురళీకృష్ణ, ఏఈఈ నరసింహారెడ్డి, పీబీసీ నీటిసంఘం మాజీ అధ్యక్షుడు చప్పిడి రమణారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రసూల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడు తెలుగువారి పోరాటానికి జగన్ మద్దతు


తమిళనాడు తెలుగువారి పోరాటానికి జగన్ మద్దతు
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
 

 సాక్షి, హైదరాబాద్ : తమిళనాడులోని తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న  పోరాటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మద్దతును ప్రకటించారని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్‌ను కలిసి ఆయన తమిళనాడులో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ‘వినుడు... వినుడు... తెలుగోడి గోడు’ అనే పేరుతో ఆందోళన చేపట్టిన విషయాన్ని తెలిపారు.

అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమ సమస్యలను ఉభయ రాష్ట్రాల తెలుగువారి దృష్టికి తెచ్చేందుకు ఈ నెల 10న(గురువారం)  ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నట్లు వివరించారు. తెలుగు చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా తమిళం నేర్చుకోవాలంటే ఇబ్బంది పడతారని ఇదే విషయాన్ని తాము జగన్ దృష్టికి తెచ్చామన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు

Written By news on Wednesday, September 9, 2015 | 9/09/2015


'ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వమ్ము చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఎందుకు పోరాడటం లేదని ధర్మాన ప్రశ్నించారు.
 
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మాత్రమే అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఈమేరకు ఈ నెల 26 వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో  చేపట్టే నిరవధిక నిరాహారదీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు ధర్మాన పిలుపునిచ్చారు.

అమెరికాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో బొత్స భేటీ

మేరీల్యాండ్: అమెరికాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.  మేరీ ల్యాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం బొత్ససత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు బొత్స పిలుపునిచ్చారు.   


ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ


ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ మూడోరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు

26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారు. బుధవారం హైదరాబాద్లోని లోటస్పాండ్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ఏపీలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు. పార్టీ కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ జగన్ పార్టీ నేతలను ఆదేశించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ ఇంతకుముందు నిర్ణయించారు. అయితే 17న వినాయక చవితి పండగ ఉండటంతో పార్టీ శ్రేణుల సూచన మేరకు దీక్ష తేదీని వాయిదా వేసుకున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పార్టీ నేతలతో చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు.

అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు


అప్రజాస్వామికంగా  సాగునీటి సంఘాల ఎన్నికలు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం

 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి సం ఘాల ఎన్నికలు అప్రజాస్వామికమైన రీతిలో జరుగుతున్నాయని, ఏకాభిప్రాయం పేరుతో నీటిసంఘాలపై పచ్చచొక్కాలకే పెత్తనం కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సాగునీటి సంఘాల సవరణ బిల్లును శుక్రవారం అసెంబ్లీలో హడావుడిగా ఆమోదింపజేసుకుని శని, ఆదివారాల్లో ఎవరూ కోర్టుకు పోకుండా చూసి సెప్టెంబర్ ఏడోతేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం అనేదంతా వ్యూహాత్మకంగా జరిగిందని విమర్శించారు.

ఇప్పటికే జన్మభూమి కమిటీలను నియమించి స్థానిక సంస్థల హక్కులను హరించిన చంద్రబాబు, ఇపుడు తాజాగా సాగునీటి సంఘాల్లో కూడా పెత్తనం కోసం అడ్డదార్లు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. నీటిపారుదల రంగంలో కీలకమైన సాగునీటి సంఘాల ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీ పెత్తనం సాగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలైన నీరు- చెట్టు వంటి కార్యక్రమాలతోపాటుగా ప్రాజెక్టు పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు వంటివన్నీ ఈ సాగునీటి సంఘాలే చేయాలి కనుక టీడీపీ వారి నేతృత్వంలో ఇవి ఉంటే ప్రజాధనాన్ని పూర్తిగా స్వాహా చేయవచ్చనే ఎత్తుగడతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చడంలో సిద్ధహస్తుడైన బాబు వ్యూహాత్మకంగా సాగునీటి సంఘాల ఎన్నికలను కూడా ఒక పద్ధతి, పాడూ లేకుండా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. 2003, 2007 నాటి ఓటర్ల జాబితానే నేటి ఎన్నికల నిర్వహణకు పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వం ఈ సంఘాలను తొలుత ఏర్పాటు చేసినపుడు రహస్యబ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలను నిర్వహించగా.. ఇపుడు చేతులెత్తే ప్రక్రియ ద్వారా అని మార్పు చేసిందని... చివరకు ఇపుడది కూడా లేకుండా పోయిందని చెప్పారు. అసలిది ఎలక్షనా? సెలెక్షనా? అనేది అర్థం కాకుండా ఉందన్నారు.

చాలాచోట్ల సర్వసభ్య సమావేశాలే నిర్వహించకుండా వచ్చిన వారి పేర్లు రాసుకుని సంతకాలు చేయించుకుని జిల్లా కలెక్టర్ నిర్ణయానికి వాటిని పంపుతున్నారన్నారు. అంటే అధికారపక్షం ఎవరికి చెబితే  వారిని నియమిస్తారనేది అర్థమవుతోందని విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేసే రైతులకు వైఎస్సార్‌సీపీ సహకరిస్తుందని ఆయన చెప్పారు.

నేరస్తులకు ప్రభుత్వ రక్షణ

Written By news on Tuesday, September 8, 2015 | 9/08/2015


నేరస్తులకు ప్రభుత్వ రక్షణ
మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. నేరస్థులకు అండగా నిలిచి మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర  ఉందని సాక్షాత్తూ మృతురాలి తండ్రి మొరపెట్టుకుంటున్నా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీలో తాము బాబూరావు పేరు ప్రస్తావించగానే టీడీపీ నేత ధూళి పాళ్ల నరేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డారన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లభించలేదని డీజీపీ జేవీ రాముడు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
 
దర్యాప్తులు లేవు, నివేదికలు రావు..
తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసిన కేసులో విచారణే ముందుకు సాగడంలేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇద్దరమ్మాయిల మరణంపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక రాలేదని, పుష్కరాల్లో మహిళల మరణాలపై ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదని, రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన బాలసుబ్రమణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని రోజా ధ్వజమెత్తారు.

2014 ఎన్నికల్లో మంత్రి నారాయణ టీడీపీకి మద్దతునిచ్చారు కాబట్టే ఆయన విద్యాసంస్థల్లో 11 మంది మృతి చెందినా సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించకుండా అండగా నిలిచారన్నారు. మంత్రి గంటాకు నారాయణ వియ్యంకుడు కావడంతో అక్కడ ఎంత మంది చనిపోయినా విచారణకు ఆదేశించరన్నారు.

కడప నారాయణ కాలేజీలో ఒకే రూంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతదేహాలపై గాయాలున్నందున రీపోస్ట్‌మార్టం జరపాలని ఆ విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై మహిళలు స్పందించాలని, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నపుడు వారిని నిలదీయాలని రోజా పిలుపు నిచ్చారు.

కాపుల సమస్యల పరిష్కారానికి కృషి


కాపుల సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్రంలోని కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాపునాడు-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలసి పలు అంశాలు తెలియజేయడంతో పాటు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. 2014 ఎన్నికల సమయంలో గెలుపు కోసం కాపులకు టీడీపీ అనేక హామీలిచ్చి ఆ తరువాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని వారు ప్రధానంగా జగన్ దృష్టికి తెచ్చారు.

కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చేలా తాను ప్రయత్నిస్తానని జగన్ వారికి చెప్పారు. రాష్ట్రంలో జనాభాలో అధికంగా ఉన్న కాపు కులానికి న్యాయం జరిగేలా, తమ సమస్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా కృషి చేయాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

వైఎస్‌ఆర్ సీపీలో పలువురి చేరిక


వైఎస్‌ఆర్ సీపీలో పలువురి చేరిక
కొడకండ్ల : మండలంలోని టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు షర్మిల రెండో విడత పరామర్శ యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.

మండల కేంద్రానికి చెందిన టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు గుగులోత్ రాంజీనాయక్, కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కర్ర అశోక్‌రెడ్డి, కొడకండ్లకు చెందిన మిట్ట అశోక్‌రెడ్డి, ముక్కెర సురేష్, వెంకన్న, నరేష్‌ల ఆధ్వర్యంలో 15 మంది వైఎస్సార్ సీపీలో చేరగా వారికి శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా నాయకుడు కాందాటి అచ్చిరెడ్డి, మండల నాయకులు నీలం లక్ష్మయ్య పాల్గొన్నారు.

తొలిరోజు షర్మిల పరామర్శయాత్ర

Written By news on Monday, September 7, 2015 | 9/07/2015


తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర
వరంగల్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించారు. సోమవారం ఉదయం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు.

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయల్దేరారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సోమవారం రోజు పరామర్శయాత్రలో భాగంగా 63కిలోమీటర్లు పర్యటించారు. ఈ పరామర్శయాత్రలో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

ప్రమాణం చేయగలరా

ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని దేవుడి ముందు తన కొడుకుపై ప్రమాణం చేస్తానని వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు తాను ఆ ప్రమాణాలు చేస్తానని, అదే.. ఆ గొంతు మీది కాదని మీరు లోకేష్పై ప్రమాణం చేయగలరా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చగానే అక్కడ పిడుగులు పడి.. 20 మంది చనిపోయారని తమ్మినేని అన్నారు. ఏపీలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు.. రైతు రుణమాఫీ పేరు చెప్పి రైతులకు ఒక్క రూపాయి కూడా కొత్త రుణాలు ఇవ్వలేదని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సందర్భాలలో రైతులకు మీరిస్తున్న హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఒక్కసారైనా సమీక్షించుకున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. సోమవారం లోటస్పాండ్లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే..
  • మీరు రుణమాఫీ చేశానని చెబుతున్నారు గానీ, రైతులు గుండెమంటలతో రగిలిపోతున్నారు
  • మీరు చాలా హామీలిచ్చారు.. వాటిని ప్రస్తుతానికి వదిలేద్దాం.
  • సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూద్దాం
  • రుణమాఫీ పేరుతో కొత్తరుణాలు లేకుండా చేశారు
  • దానికి బాధ్యత మీరు వహిస్తారా.. సింగపూర్ లాంటి ఏజెన్సీ ఏదైనా బాధ్యత వహిస్తుందా
  • ఈ సంవత్సరం పీఈసీఎస్ల నుంచి ఒక్కరూపాయి కూడా రైతుకు కొత్త రుణం ఇవ్వలేదు
  • దీనికి మంత్రులు గానీ, సీఎం గానీ సమాధానం ఇవ్వాలి
  • ఇలాంటి పరిస్థితుల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకపోతే ఏం చేస్తారు?
  • 692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అన్నారు.. ఒక్కరూపాయైనా విడుదల చేశారా?
  • మీరు చేసిన సందర్భం ఉంటే చెప్పండి..
  • శ్రీశైలం డ్యామ్కు సంబంధించి నీటిమట్టం డెడ్ స్టోరేజి లెవెల్ కంటే కిందకు పడిపోయింది.
  • దాంతో ఎక్కడా పంటలకు చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు
  • పైనున్న కర్ణాటక దామాషా ప్రకారం నీరు వదలడం లేదు.
  • కేంద్రంలో కూడా మీ మంత్రులున్నారు కాబట్టి ఢిల్లీ వెళ్లి రైతుల దుస్థితి గురించి, నీళ్ల సమస్య గురించి మాట్లాడారా
  • దానివల్ల ప్రకాశం బ్యారేజిలో నీళ్లు లేవు, ఏలేరు రిజర్వాయర్, తుంగభద్ర నుంచి వచ్చే కాలువలకు కూడా నీళ్లు లేవు. వంశధారలో నీళ్లు లేవు, తోటపల్లిలోకూడా నీళ్లు లేని పరిస్థితి.

షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు..

Written By news on Sunday, September 6, 2015 | 9/06/2015


ఇచ్చిన మాట కోసమే..
షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు..
31 కుటుంబాలకు పరామర్శ
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి

తొర్రూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని నల్లకాల్వలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట కోసమే ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు.

శనివారం తొర్రూరు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాల పరామర్శ కోసం వరంగల్ జిల్లాలో రెండో విడత యాత్ర ఈ నెల 7న పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని గంట్లకుంట గ్రామంలో ప్రారంభమై, 11న భూపాలపల్లి మండలంలోని ఇసిపేటలో ముగుస్తుందన్నారు.  పరామర్శ యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు.

రాజకీయాలకు అతీతంగా పాల్గొనండి..
షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మునిగాల విలియమ్స్, గుడూరు జయపాల్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, జిడిమేట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. కార్యకర్తల ఆందోళన

వీడియోకి క్లిక్ చేయండి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తిమ్మన్నపాలెంలో గుర్తుతెలియని దుండగులు దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఎవరు బాబూ.. సైకో?


ఎవరు బాబూ.. సైకో?
‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిన టీడీపీనా?

♦ {పజాసమస్యలు ప్రస్తావించిన వైఎస్సార్‌సీపీనా?
♦ ఓటుకు కోట్లు ఇవ్వజూపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా
    ఓ సీఎం దొరకడం దేశచరిత్రలో ఇదే  మొదటిసారి...
♦‘ఓటుకు కోట్లు’పై సమాధానం చెప్పే ధైర్యంలేని చంద్రబాబు...
     {పతిపక్ష నేతపై విమర్శలా?
♦ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం

 సాక్షి, హైదరాబాద్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, ఏం చేయాలో పాలుపోక వైఎస్సార్‌సీపీపై, ఆ పార్టీ అధినేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంబద్ధ ప్రేలాపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడటం, ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో 22సార్లు ప్రస్తావించడాన్ని అంబటి గుర్తుచేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకమైన నీచ చర్యలకు పాల్పడటం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమమని పేర్కొన్నారు.

ఆడియో టేపుల్లో సంభాషణ సరైనదేనని ఫోరెన్సిక్ నివేదిక కూడా ధ్రువీకరించిందన్నారు. ఓ ఎమ్మెల్యే ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోవడమూ దేశంలో ఇదే ప్రథమమని అన్నారు. ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అంశం అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చే సరికి వైఎస్సార్‌సీపీపై సైకో ముద్ర వేయడానికి ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 సైకో అంటే అర్థం తెలుసా?
 ‘‘వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా మాట్లాడే, భిన్నంగా ప్రవర్తించే వ్యక్తులను సైకో వ్యాధిగ్రస్తులుగా పిలుస్తారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తానే నిర్మించానని చంద్రబాబు చెబుతున్నారంటే దాన్ని ఏమంటారు? సెల్ ఫోను నేనే తెచ్చా... ప్రపంచానికి ఐటీని తానే పరిచయం చేశానంటున్నారు. ఈ మాటలు ఏ కోవకు వస్తాయి’’ అని అంబటి ప్రశ్నించారు. శాసనసభలో పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను అంబటి ప్రస్తావించారు. ‘మీ అంతు చూస్తాం... మీకు పిచ్చి పట్టింది... ఇదేమన్నా లోటస్‌పాండ్ అనుకున్నారా... మిమ్మల్ని వదిలిపెట్టం’... అంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన ప్రసంగ వీడియోను అంబటి రాంబాబు మీడి యా ముందు ప్రదర్శించారు.

వీడియోతోపాటు వివిధ సందర్భాల్లో అధికారులు, వ్యక్తుల పట్ల చంద్రబాబు దురుసుగా ప్రవర్తించిన తీరు, కొందరిని కొడుతున్న ఫొటోలనూ మీడియాకు చూపిస్తూ ‘ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును ఏమనుకోవాలి’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబంలో సైకో లక్షణాలు ఉన్నాయా.. లేక జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో ఆ లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటే మంచిదన్నారు. ఇలాంటి ప్రస్తావన తెస్తున్నందుకు క్షమించాలంటూనే ‘ఇప్పుడు చంద్రబాబు తమ్ముడి పరిస్థితి ఏమిటి’ అని ప్రశ్నించారు.

 ప్రజాసమస్యలపై నిలదీసినందుకే వ్యక్తిగత ఆరోపణలు...
 ‘ఓటుకు కోట్లు’ సహా అనేక ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ సభలో చర్చకు పట్టుబడితే... ముఖ్యమంత్రి సభాప్రాంగణంలోని తన చాంబర్‌లోనే ఉండి సభలోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక, చర్చించే దమ్ములేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై, ప్రతిపక్ష నేత  జగన్‌మోహన్‌రెడ్డిపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాలు జరిగిన ప్రతిరోజూ సైకో, రౌడీ, క్రిమినల్ అం టూ వ్యక్తిగత ఆరోపణలు చేయడానికే పరిమితమయ్యారన్నారు. 67మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీ అధినేత, ఏకైక ప్రధానప్రతిపక్షంపై అధికార పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా..! అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీ అదనంగా తెచ్చుకున్న ఓట్లు కేవలం ఐదు లక్షలు మాత్రమేనని టీడీపీ నేతలకు గుర్తు చేశారు. అనేక వైఫల్యాలలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యంలేకనే వర్షాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులకు పరిమితం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది మూడు నెలల కాలంలోనే పట్టిసీమ, జీవో నం. 22, పారిశ్రామిక రాయితీలు, వివిధ ప్రాజెక్టుల్లో లంచాల రూపంలో దోచుకున్న డబ్బుతో తెలంగాణ ఎమ్మెల్యేని కొనుగులు చేసే వ్యవహారంలో చంద్రబాబే స్వయంగా టెలిఫోను మాట్లాడుతూ, ఓటుకు కోట్లు ఇస్తూ ఓ ఎమ్మెల్యే ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిన విషయాలను రాష్ట్ర ప్రజలందరూ టీవీల ద్వారా చూశారన్నారు.

 కోర్టులో ఉందని సాకు చూపి..
 ‘ఓటుకు కోట్లు అంశం కోర్టులో ఉందంటూ సాకు చూపుతూ మంత్రులు ఈ అంశంపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుపడ్డారు.. చంద్రబాబు అసలు సభకే రాకుండా తన చాంబర్‌కే పరిమితమయ్యారు...  కోర్టులో ఉన్న అంశాలకు సంబంధించి అదే మంత్రులు  వైఎస్ జగన్‌పై ఇష్టమొచ్చినట్టు ప్రతి రోజూ విమర్శలు చేశారు’ అని అంబటి ధ్వజమెత్తారు. సభలో జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించినా రెండు మూడు నిమిషాలకే అచ్చెన్నాయుడో, ఇంకో మంత్రో స్పీకర్ ద్వారా మైక్ తీసుకొని ఇష్టమొచ్చిన తీరున తమ అధినేతపై ఆరోపణలు గుప్పించడమేంటని ప్రశ్నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సహా టీడీపీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా మాట్లాడితే వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని, పద్ధతి మార్చుకోక ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Popular Posts

Topics :