27 September 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ ఉంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది

Written By news on Saturday, October 3, 2015 | 10/03/2015


వైఎస్ ఉంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది
♦ కరీంనగర్ జిల్లా పరామర్శయాత్రలో షర్మిల
♦ ఏ ఒక్క చార్జీ పెంచకుండానే అద్భుతంగా పాలించిన గొప్ప నేత
♦ ఆయన ఆశయాలను మనమే బతికించుకోవాలి
♦ చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపు
♦ రాజన్న బిడ్డను చూసేందుకు బారులు తీరిన జనం

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పేదప్రజల పెన్నిధి  వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండుంటే రాష్ట్రం లోని ప్రతీ ఇల్లు కళకళలాడేదని... రైతులంతా సంతోషంగా ఉండేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆయన మరణించి ఆరేళ్లయినా కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా కొలువై ఉన్నాడని చెప్పారు. వైఎస్సార్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర... శుక్రవారం కరీంనగర్ జిల్లాలో రెండో విడత కొనసాగింది. శుక్రవారం హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు.

ఈ సందర్భంగా జమ్మికుంట, కరీంనగర్ పట్టణాల్లో షర్మిలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తా వద్ద భారీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కుమార్ తదితరులతో కలసి షర్మిల ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు షర్మిల మాటల్లోనే..

 ‘‘ఒక నాయకుడు చనిపోతే దానిని జీర్ణించుకోలేక కొన్ని వందల గుండెలు ఆగిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవు. ఒక్క రాజశేఖరరెడ్డి విషయంలోనే అది జరిగింది. ఎందుకంటే.. ఆయన ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టాడు. ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, రైతులకు పూర్తి రుణ మాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేసి రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలకు భరోసా కల్పించాడు. ఏ చార్జీ పెంచినా, ఏ పన్ను పెంచినా ఆ భారం మహిళలపై పడుతుందనే ఉద్దేశంతో ఐదేళ్ల పాలనలో కరెంటు, గ్యాస్, ఆర్టీసీ సహా ఏ చార్జీలను పెంచలేదు.

ఆయన బతికుంటే ప్రతి పేదవాడి ఇల్లు కళకళలాడేది. రైతులంతా సంతోషంగా ఉండేవారు. ప్రతి ఇంటికీ నీరుండేది. ఉచిత విద్య అందేది. మనిషిని మనిషిలా గౌరవించిన మహనీయుడు ఆయన. ఆయన ఆశయాలను మనమే బతికించుకోవాలి. అందుకోసం మీరు, మేము చేయి, చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం..’’ అని షర్మిల పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంద రాజేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలోనూ షర్మిల మాట్లాడారు.

 వైఎస్‌నే గుర్తుచేస్తున్నారు: పొంగులేటి
 పరామర్శయాత్రలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా అందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలననే గుర్తుచేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ పాలనలోనే తామంతా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో షర్మిల యాత్ర చేశామని, కొద్దిరోజుల్లోనే మిగతా జిల్లాల్లోనూ పరామర్శ యాత్ర చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు, అక్కెనపెల్లి కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, షర్మిల సంపత్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కె.నగేష్, సెగ్గెం రాజేష్, నగర అధ్యక్షుడు సిరి రవి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిర, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్‌రెడ్డి, కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి సందమల్ల నరేష్, సొల్లు అజయ్‌వర్మ, మంద రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

విచ్చలవిడి అవినీతి


విచ్చలవిడి అవినీతి
- ఏపీ సర్కారు నిర్వాకం..
- ప్రణాళికా శాఖ సర్వేలో వెల్లడి
- ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంలో సర్కారు విఫలం
రాష్ర్ట ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని సాక్షాత్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో చెప్పింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 32.5 శాతం మంది అవినీత రహిత పాలన అందించాలని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అవినీతి లేదని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా చెప్పకపోవడం విశేషం. సర్వే తీవ్రతను బట్టి చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అవగతమవుతోంది. ప్రజల మౌలిక అవసరాలకు సంబంధించి కీలకమైన 12 అంశాలపై జనాభిప్రాయం కోరగా.. అందులో ఎనిమిదింటిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోయిందని సాక్షాత్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖే తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది. అవినీతితోపాటు ప్రజలను అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. రాష్ట్రంలో అవినీతి పెరిగినట్లు 75 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వేలో వెల్లడైంది. తొలి త్రైమాసికం సర్వే వివరాలతో ప్రణాళికా శాఖ ముద్రించిన ‘అసెస్‌మెంట్ అండ్ వే ఫార్వర్డ్’ పేరుతో పుస్తకాలను ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పంపిణీ చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలానికి సంబంధించి జూలైలో మొత్తం 12 అంశాలపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 8 అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తాగునీటి సరఫరా, రోడ్లు, ఇళ్ల నిర్మాణం, జీవనోపాధి, సాగునీటి పారుదల, విద్యుత్ సరఫరా, వైద్య ఆరోగ్యం, ఆధార్ సేవలు, అవినీతి, పారదర్శకత, ప్రభుత్వ పనితీరు వంటి సమస్యాత్మకమైన విషయాలపై సర్వే నిర్వహించినట్టు ప్రణాళిక శాఖ తన 60 పేజీల నివేదికలో పేర్కొంది. అయితే, టీడీపీ అధికారంలోకి రావడానికి అత్యంత ప్రధానమైన హామీలు... రైతు రుణమాఫీ, డ్వాక్రా సహాయ సంఘాలకు రుణాల మాఫీ, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వంటి కీలక అంశాలను ఈ సర్వే నుంచి మినహాయించడం గమనార్హం.

 802 గ్రామాల్లో సర్వే: ఈ ఏడాది జూలైలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుర్తించిన 802 గ్రామాల్లోని 18,000 మందితో సర్వే నిర్వహించారు. అనేక సామాజిక అంశాలతోపాటు ప్రభుత్వ సేవలు అందించడంలో మరింత మెరుగు పరచడమే లక్ష్యంగా సర్వే నిర్వహించినట్లు ప్రణాళికా సంఘం పేర్కొంది. సర్వేలో అవినీతి పెరిగిపోయిందని 75 శాతం మంది అభిప్రాయపడగా, అవినీతిలేని పాలన అందించాలని 32.5 శాతం మంది పేర్కొన్నారు. ఆ తర్వాత 14.9 శాతం మంది ప్రభు త్వ రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని 7.7 శాతం మంది సూచించారు.

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా 7.5 శాతం మంది తెలిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని 5.9 శాతం, సంక్షేమ పథకాల అమలుకు 5.5 శాతం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలని 5.2 శాతం మంది సర్వేలో చెప్పారు. మెరుగైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని 3.2%, మెరుగైన సాగునీటి వసతి కల్పించాలని 2.9%, మహిళా సంక్షేమ అమలుకు 2.9% మంది సూచించారు.

సర్వేలో 93% మంది సమస్యల చిట్టాను వెల్లడించారు.తాగునీటి సమస్య పట్టిపీడిస్తోందని 33%, రహదారులు లేవని, ఉన్నా అస్తవ్యస్థంగా ఉన్నాయని 17.5% మంది పేర్కొన్నారు. మహిళలతోపాటు ఇతరులు జీవనోపాధి లేక ఇక్కట్లు పడుతున్నట్లు 10.7 శాతం, ఉండేందుకు గూడు లేక అవస్థలు పడుతున్నట్లు 10.7 శాతం మంది పేర్కొన్నారు. సాగునీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నట్లు 10.3 శాతం, విద్యుత్ సమస్యతో 5.6 శాతం, ఆరోగ్య సమస్యలతో 4.8 శాతం మంది సతమతమవుతున్నట్లు ప్రణాళికా సంఘం సర్వేల్లో వెల్లడైంది.

ఏడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ

Written By news on Friday, October 2, 2015 | 10/02/2015


ఏడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండో రోజు శుక్రవారం హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో ఏడు కుటుంబాలను ఆమె పరామర్శించారు. మొత్తం 131 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. షర్మిల వెంట ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు ఉన్నారు. మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు ప్రతిపల్లెలోనూ ఘన స్వాగతం లభించింది. రాజన్న బిడ్డను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు


'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'
కరీంనగర్ :  ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రాజన్నగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో ఉన్న ఆమె శుక్రవారం హుజురాబాద్, మానకొండూరులో ఏడు కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద వైఎస్ షర్మిల మాట్లాడుతూ  వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు అందేదని, పేదలకు ఇళ్లు, ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదని అన్నారు. అలాగే రైతులకు 9గంటల కరెంట్ వచ్చేదని వైఎస్ షర్మిల అన్నారు.

5న భోగాపురానికి వైఎస్ జగన్


5న భోగాపురానికి వైఎస్ జగన్
విజయనగరం: గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో జగన్ పర్యటిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో సుజయ్‌కృష్ణ రంగారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు గురువారం పర్యటించారు. సుజయ్‌కృష్ణ రంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... 5వ తేదీన  జగన్ రాజాపులోవ జంక్షన్ నుంచి ప్రారంభమై కవులవాడ, ఎ.రాయివలస, గూడపువలస గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. గూడపువలసలో బహిరంగసభలో మాట్లాడుతారన్నారు.

వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి


వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి
- వైఎస్సార్‌సీపీ డిమాండ్
- ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోలు ధరలు

సాక్షి, హైదరాబాద్:
 రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై పెంచిన 4 రూపాయల వ్యాట్‌ను తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలున్నాయన్నారు. ఏపీలో లీటరు డీజిల్ ధర రూ.53.97గా ఉంటే భువనేశ్వర్, బెంగళూరులో రూ.47, చెన్నైలో రూ.46గా ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికంగా పన్నులు వేసిందని, మరోవైపు రాష్ట్రప్రభుత్వం లీటరుపై రూ.4 చొప్పున వ్యాట్‌ను పెంచిందని ఆయన విమర్శించారు.  
 
రైతులపై లాఠీచార్జీయా?: గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులపై జరిగిన లాఠీచార్జిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతోందని బొత్స అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులపై దాడులు, లాఠీచార్జిలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇబ్బందుల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలన్నింటికీ ఆర్థిక పరిపుష్టి చేకూర్చి బాగా నడిచేలా చేస్తామని హామీఇచ్చారని, అధికారంలోకొచ్చాక  ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేసి వాటన్నింటినీ లాభాల్లోకి వచ్చేలా చూశారని గుర్తుచేశారు. సహకార షుగర్ ఫ్యాక్టరీల్ని నష్టాలొస్తున్నాయన్న సాకుచూపి కొన్నింటిని తన వందిమాగధులకు చంద్రబాబు గతంలో అమ్మేశారని, ఇపుడూ అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 
జగన్ దీక్షపై ప్రధాని స్పందిస్తారని ఆశిస్తున్నాం
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్ష ఈ నెల ఏడోతేదీ ఉదయం ప్రారంభమవుతుందని బొత్స తెలిపారు. ఈ నెల 22న రాష్ట్రానికొస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. తమ పార్టీ అధినేత చేసే దీక్షకు స్పందించి ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...


కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...
- హుస్నాబాద్‌లో తొలి రోజు 8 కుటుంబాలకు పరామర్శ
- ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే...
- పంటల్లేక, అప్పులపాలై బోరున విలపించిన వైనం
- అధైర్య పడొద్దంటూ ధైర్యం చెప్పిన షర్మిల
- వైఎస్ తనయను అక్కున చేర్చుకున్న కరీంనగర్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 
కరీంనగర్ జిల్లాలో కరువు సీమగా పేరొందిన హుస్నాబాద్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తొలి రోజు పరామర్శ యాత్ర ఉద్విగ్నభరితంగా సాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన ఎనిమిది మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాక సాగిన యాత్రలో ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక అయినవారు చనిపోయారనే బాధతో బతుకీడుస్తున్న వారిపై రెండేళ్లుగా కరువు పగబట్టింది.

కుటుంబ పెద్దను కోల్పోయి బతుకు బండి నడపలేక సతమతమవుతున్నది కొందరైతే, కన్నపేగును కోల్పోయి దిక్కులేని పక్షులైన వారు మరికొందరు. అందరివీ రెక్కాడితే  గానీ డొక్కాడని కుటుంబాలే. పంటలెండి, అప్పులపాలై, వాటిని తీర్చే మార్గంలేక దుర్భరంగా బతుకీడుస్తున్నామని వారంతా షర్మిలతో గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దంటూ వారందరినీ ఆమె ఓదార్చారు. ‘‘మంచి రోజులొస్తాయి. మీకు అండగా మేముంటాం’ అంటూ భరోసా ఇచ్చారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన షర్మిలకు కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి వద్ద పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రేణుల డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలతో ఘన స్వాగతం లభించింది. అక్కడినుంచి ఆమె కోహెడ మండలం వరుకోలులో పెంటపర్తి సాహితి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆస్తిపాస్తులేమీ లేని సాహితి తండ్రి రమణారెడ్డి, కూతురిని కోల్పోయి అనాథలా బతుకుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.

సాహితి కుమార్తెలిద్దరిని పలకరించిన షర్మిల, ఏం చదువుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి అక్కడినుంచి కదిలారు. కూరెల్లలో ల్యాగల లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కోహెడలో మధ్యాహ్న భోజనం తర్వాత ధర్మసాగర్, నందారం, పోతారం, మల్లంపల్లి, కొత్తపల్లి, దామెర గ్రామాల్లో శ్రీనివాస్, అజ్మీర తుక్యానాయక్, బత్తిని ఎల్లయ్య, బూడిద లస్మమ్మ, వేల్పుల ప్రభాకర్, జక్కుల సులోచన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతి కుటుంబంతో అరగంటకు పైగా గ డిపారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు అంతా సకాలంలో వానల్లేక పంట ఎండిందని, బతుకు దెరువు కోసం వలస పోతున్నామని, ఆర్థికంగా ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి 9 గంటలకు పరామర్శ యాత్ర ముగించి హుజూరాబాద్‌లో షర్మిల  బస చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్‌రెడ్డి, కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కినపల్లి కుమార్ , వేముల శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సెగ్గెం రాజేశ్, రాష్ట్ర యువజన కార్యద ర్శులు గోవర్దనశాస్త్రి, మంద వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు ముసుకు వెంకటరెడ్డి, డి.వేణుమాధవరావు, పి.వేణుగోపాల్‌రెడ్డి, సింగిరెడ్డి ఇందిరా భాస్కర్‌రెడ్డి, జీడికంటి శివ, సొల్లు అజయ్‌వర్మ, శంకర్, కాసారపు కిరణ్, గండి శ్యామ్, రాజమణి, పద్మ, వరంగల్ జిల్లా నాయకులు ఎం.కల్యాణ్‌రాజ్, ఎ.మహిపాల్‌రెడ్డి, సుమిత్ గుప్తా, రాజ, మెదక్ జిల్లా నాయకులు తడాకా జగదీశ్వర్‌గుప్తా, వీరరాజు, గురునాథ్, హైదరాబాద్ నగర నాయకులు ఎండీ.మజీద్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ

Written By news on Thursday, October 1, 2015 | 10/01/2015


గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి గుంటూరులో తాను తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈనెల 7వ తేదీ నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే.

పండుగకు పంచె, చీరె కొనుక్కోలేని స్థితిలో వారున్నట్లు అనుకుంటున్నారా


కోట్లాది రూపాయల భూములకు పంచె , చీరేనా!
* రైతు కూలీలు, చేతి వృత్తులవారు, కౌలు రైతులు పండుగ చేసుకోరా!
* మంగళగిరి చేనేత వస్త్రాలను పంపిణీ చేయాలి
రాజధాని శంకుస్థాపన రోజునే ఎయిమ్స్‌కూ శంకుస్థాపన చేయాలి
మంగళగిరి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల భూములను అమాయక రైతులను మాయచేసి, మభ్యపెట్టి, బెదిరించి, మోసం చేసి లాక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగ రోజు పంచె, చీరె పంపిణీ చేస్తామని చెప్పడం రైతులను అవమానపరచడమేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు.

పండుగకు  పంచె, చీరె కొనుక్కోలేని స్థితిలో వారున్నట్లు అనుకుంటున్నారా అని మండిపడ్డారు.  బుధవారం ఎమ్మెల్యే సాక్షితో మాట్లాడుతూ  అదే ప్రాం తంలో ఉపాధికోల్పోయి అల్లాడిపోతున్న రైతుకూలీలు, కౌలు రైతులు, చేతి వృత్తుల వారు, లంకభూములు, అసైన్డ్, దేవాదాయ శాఖ భూములు సాగుచేసే రైతులు కనిపించలేదా? అని ప్రశ్నించారు.  వారు మాత్రం పండుగ చేసుకోరా? అని అడిగారు. ఒక వేళ చీరె, పంచెలను పంపిణీ చేయదలిస్తే, మంగళగిరిలో చేనేత కార్మికులు నేసిన వస్త్రాలనే పంపిణీ చేసి నేతన్నలను ఆదుకోవాలని కోరారు. ఆప్కో కొనుగోలు చేయకపోవడంతో లక్షలాది రూపాయల నేత వస్త్రాలు నిల్వలు పేరుకుపోయాయని, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేయాలని సూచించారు.
 
టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మంగళగిరి శానిటోరియంలో ఎయిమ్స్(అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ) నిర్మాణం జరుగుతుందని ప్రచారం చేశారన్నారు.  కార్పొరేట్ ఆస్పత్రులకు తొత్తులుగా మారిన ప్రభుత్వం దాని నిర్మాణం నిలిపివేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజధానికి శంకుస్థాపన రోజే ఎయిమ్స్‌కు కూడా శంకుస్థాపన చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు.

ఒకవైపు నీటిపారుదల శాఖ ప్రకాశం బ్యారేజిపై భారీ వాహనాలు తిరిగితే ప్రమాదం అని వాటిని నిషేధిస్తే,  అక్రమంగా నిర్మించిన సీఎం విశ్రాంతి గృహం అవసరాల కోసం భారీ వాహనాలు తిప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు రాజధాని ప్రాంతంలోని అధికారులతో పాటు సీఆర్‌డీఏ కమిషనర్ నుంచి అటెండర్ వరకు రోజంతా చంద్రబాబు  అవినీతి సంపాదనకు మార్గా లు వెతుకుతూ ప్రజాసమస్యలను, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.

విదేశీయులను ఆహ్వానించాలంటే  కేంద్రప్రభుత్వం ద్వారా ఆహ్వానించాలని,  చంద్రబాబు మాత్రం దేశంలో తనకంటే ఎవరు గొప్పఅనే రీతిలో వ్యవహరిస్తూ కేంద్రప్రభుత్వాన్ని పక్కనపెట్టి తానే విదేశీ నాయకులను ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కుమారుడు ఆస్తులు వెల్లడించిన దానిలో నిజమెంతుందో అందరికీ తెలిసిపోయిందన్నారు.  రాజధానిని నిర్మించేది తానొక్కడినేనంటున్న బాబు తన కొరకు, తన వందిమాగదుల కొరకు ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు.  ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని ఆర్కే హెచ్చరించారు.

నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర


నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
కరీంనగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుం బాలకు అండగా ఉంటానంటూ నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుం బ ప్రతినిధిగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్న విషయం విదిత మే. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో పర్యటించి 12 కుటుంబాలను షర్మిల పరామర్శించారు.

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోగా మిగిలిన 18 కుటుంబాలను పరామర్శించేందుకు గురు వారం నుంచి మలిదశ పరామర్శ యాత్ర కొనసాగించనున్నారు. మూడు రోజులపాటు జిల్లా లో పర్యటించనున్న షర్మిల మొత్తం 481 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిస్తారు. ఇందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 యాత్ర కొనసాగేదిలా...
 గురువారం ఉదయం 8.30 గంటలకు షర్మిల హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. కరీం నగర్ జిల్లా తోటపల్లి వద్ద వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాష్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్‌లు షర్మిలకు ఘన స్వాగతం పలకనున్నారు. అక్క డినుంచి నేరుగా కోహెడ మండలం వర్కోలు వెళ్లి పెంట పర్తి సాహితీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం కూరెల్ల, ధర్మసాగర్, నందా రం, పోతారం, మల్లంపల్లి, కొత్తపల్లి, దామెర గ్రామాల్లో ల్యాగల లక్ష్మారెడ్డి, మోత్కుల శ్రీని వాస్, అజ్మీర తుక్యానాయక్, బత్తిని ఎల్లయ్య, బూడిద లస్మమ్మ, వేల్పుల ప్రభాకర్, జక్కుల సులోచన కుటుంబాలను కలుసుకుంటారు. తొలిరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పర్యటించి మొత్తం 8 కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి హుజారాబాద్‌లో బస చేస్తారు.

 రెండోరోజైన శుక్రవారం హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. అందులో భాగంగా హుజారాబాద్ మండలం సిర్సపల్లి, రాంపూర్, జమ్మికుంట మండలం ధర్మారం, గండ్రపల్లిలో ఎడ్ల వెంకటనర్సు, సుంచు తిరుపతి, పసుపుల మొగిలి, గాదె ఉప్పలయ్య కుటుంబాలను కలుస్తారు. అనంతరం కేశవపట్నం, లక్ష్మీపూర్, బంజేరుపల్లిలో కాసరాజుల లక్ష్మయ్య, ఎడ్ల శ్రీనివాస్, రేణికుంట కొమురయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి కరీంనగర్‌లో బస చేస్తారు.

 మూడోరోజైన శనివారం బోయినిపల్లి మండ లం స్తంభంపల్లి, సిరిసిల్ల మండలం మండేపల్లి, చీర్లవంచలో చంద్రగిరి నర్సమ్మ, కొమ్మెట లచ్చయ్య, ఈసరి లచ్చవ్వ కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం జిల్లాలో యాత్ర ముగించి కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శ యాత్రకు బయలుదేరి వెళతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు?


రైతులు సుఖంగా ఉన్నారా..
వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు?
చంద్రబాబును నిలదీసిన  ఎమ్మెల్యే చాంద్‌బాషా


 సాక్షి, హైదరాబాద్ : తన పాలనలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటూ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ‘రైతుకోసం చంద్రన్న యాత్ర’ విజయోత్సవ ముగింపు సభను జరుపుకోవడం దురదృష్టకరం, బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాషా అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అనంతపురం జిల్లాలో ముగింపుసభ ఎందుకు పెట్టారు? ఏ జిల్లాలో లేనివిధంగా 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా?’’ అని ఆయన సీఎంను ప్రశ్నించారు. ఆత్మహత్యల గురించి ప్రస్తావించకుండా, వారికెలాంటి భరోసా ఇవ్వకుండా రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని ఎలా చెబుతారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

 ప్రగల్భాలు చెప్పుకోవడమేంటీ?
 ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు ఇచ్చిన నివేదికలో రైతుల రుణాలు రూ.94 వేల కోట్లుంటే కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే చెల్లించి రుణమాఫీ చేసేశామని ప్రగల్భాలు చెప్పుకోవడం ఏమిటని చాంద్‌బాషా నిలదీశారు.

 అనంత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన ఘనత బాబుదే..
 తమ జిల్లాలో రైతులకివ్వాల్సిన 2013-14 సంవత్సరానికి సంబంధించిన రూ.603 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకొచ్చాక ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికారమిషన్ నుంచి ఒక్క రైతుకూ సాయం చేయడంగానీ, ప్యాకేజీ ఇవ్వడంగానీ చేయలేదని దుయ్యబట్టారు.

పోరు ఆగదు


పోరు ఆగదు
♦ టంగుటూరు పొగాకు ధర్నాలో వైఎస్ జగన్
♦ రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబు
♦ రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్న వైఎస్సార్

 సాక్షి, టంగుటూరు : పొగాకు రైతులకు న్యా యం జరిగే వరకూ ఈ పోరు ఆగదని, వారికి తుదివరకూ అండగా నిలబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న, గుండె ఆగి మరణించిన రైతు కుటుంబాలను ఆయన బుధవారం పరామర్శించారు. అనంతరం టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో పొగాకు వేలం జరుగుతున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పొగాకు బోర్డు పనితీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత రైతులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నపుడు రెండుసార్లు ప్రభుత్వం తరఫున పొగాకు రైతులను ఆదుకున్న విషయం గుర్తు చేశారు. గిట్టుబాటు ధర రాక కడుపు మండుతుంటే కడుపు కాల్చుకుని ధర్నాలో పాల్గొన్న రైతన్నలందరికీ... కడుపునిండా బాధ ఉన్నా, కష్టమనిపించినా రైతన్నల ఆక్రోశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలకు చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అనుకున్నది సాధిద్దామని రైతులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం ఆయన మాటల్లోనే....

 అధ్వాన్నంగా పొగాకు బోర్డు పనితీరు
 రాష్ట్రంలో పొగాకు బోర్డు నడుస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. పొగాకు వేలం జనవరిలో మొదలుపెట్టి జూన్‌కు ఆపేయాలి. కానీ అక్టోబర్ నెల వస్తున్నా వేలం పూర్తి కాలేదు. రైతన్నలు మూడునెలల్లో పండించిన పంటను అమ్ముకోవడానికి పది నెలలు పడుతోంది. జూన్ దాటిన తర్వాత వర్షాలు పడతాయి, దీనివల్ల పొగాకులో తేమ శాతం పెరిగి పొగాకు రంగు మారి, ధర తగ్గిపోతుందని తెలిసి కూడా అక్టోబర్ వరకూ పొగాకు అమ్మకాలు జరిపిస్తున్నారు. ఈ రోజు పొగాకు ధరలు పరిశీలించేందుకు టంగుటూరు వేలం కేంద్రానికి వెళ్లా. అక్కడ నా కళ్లముందే వేలం నిర్వహించారు. వేలం జరిగేటప్పుడు మన అందరికీ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఉదయం నేను రాకముందు ఎఫ్-9 గ్రేడ్ పొగాకు ధర రూ.34 అని బోర్డుపైన కనపడుతూ ఉంది. వేలం వద్ద నేను నిలబడ్డా.

అదే గ్రేడ్ పొగాకును నా కళ్లెదుటే రూ.65కు పాడారు. ఇదే గ్రేడ్ పొగాకు గతేడాది కిలో రూ.80 పలికిందని అధికారులు చెప్పారు. జిల్లాలో గత ఏడాది కిలో పొగాకు రూ.109 పలికితే, ఈ ఏడాది సగటు ధర రూ.90.90 మాత్రమే. రూ.109కి రూ.90.90 పోలికెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఇదే పొగాకు ధర సగటున రూ.101.16 అని చెబుతున్నారు. ప్రస్తుతమున్న 172 మిలియన్ కిలోల లక్ష్యాన్ని 120 మిలియన్ కిలోలకు తగ్గించాం కాబట్టి వచ్చే ఏడాది పొగాకు ధర బావుంటుందని బోర్డు చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు చెబుతున్న ఈ లెక్కలు నిజమే అయితే... గత ఏడాది 213 మిలియన్ కిలోలుగా ఉన్న లక్ష్యాన్ని 172 మిలియన్ కిలోలకు తగ్గించినా ధర ఎందుకు తగ్గింది? ఇప్పుడు 120 మిలియన్ కిలోలకు తగ్గిస్తే ధర పెరుగుతుందని మొసలి కన్నీరెందుకు కారుస్తున్నారని ప్రశ్నిస్తున్నా.

 రుణమాఫీ చేయని చంద్రబాబు
 రైతులు ఏడెకరాలకు ఒక బ్యారన్ పెడతారు. కనీసం ఐదెకరాలకు ఒక బ్యారన్ పెడితే, ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 50 క్వింటాళ్లు పండితే, బ్యాంకులు రూ.ఐదు లక్షల రూపాయల వరకూ రుణం ఇస్తున్నారు. ఇప్పుడు లక్ష్యాన్ని 172 మిలియన్ కిలోల నుంచి 120 మిలియన్ కిలోలకు తగ్గించి, బ్యారన్‌కు 30 క్వింటాళ్లు లక్ష్యంగా పెడితే బ్యాంకులు రూ.3లక్షలకు మించి రుణాలివ్వవు. మరోవైపున బేషరతుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలముందు ఊరూరా హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ పని చేయలేదు. రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు అన్నాడా లేదా? (అన్నాడని అందరూ చేతులెత్తారు.) మరి రుణమాఫీ పూర్తిగా చేశాడా? (లేదు లేదంటూ అందరూ చేతులెత్తి సమాధానం చెప్పారు.) రుణాలు మాఫీ కాలేదు.

బ్యాంకుల్లో ఉన్న బంగారం వేలం వేస్తున్నారు. గతంలో రూ.లక్ష వరకూ రుణం వడ్డీ లేకుండా వచ్చేది. మూడు లక్షల రూపాయల వరకూ రుణం పావలా వడ్డీకి వచ్చేది. ఇప్పుడు 14 నుంచి 18 శాతం వరకూ అపరాధ రుసుం విధిస్తున్నారు. చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రుణాలున్నాయి. వాటిపై ఇప్పటికి రూ.18 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది. చంద్రబాబునాయుడు గత ఏడాది రూ.4600 కోట్లు, ఈ ఏడాది రూ.2800 కోట్లు మొత్తం కలిసి రూ.7400 కోట్లు మాఫీ చేశారు. రెండేళ్లలో ఆయన వేసిన ముష్టి రూ.7400 కోట్లకు వడ్డీ కూడా మాఫీ కాలేదు.

రాష్ట్రంలో రైతులకు కష్టకాలం
 రాష్ట్రంలో ఏ రైతు పరిస్థితి చూసినా ఇలానే ఉంది. పామాయిల్‌కు గిట్టుబాటు ధర రూ.9 వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.5,400 కు కూడా కొనడంలేదు. ధాన్యానికి రూ.1400 ఎంఎస్‌పీ ప్రకటిస్తే రైతుకు రూ.1100 కూడా దక్కడం లేదు. పత్తికి కనీస మద్దతు ధర రూ.4,500 ప్రకటిస్తే రూ.3,500 కూడా రావడం లేదు. పట్టుగూళ్లుకు రూ.300 నుంచి రూ.350 ధర రావాల్సి ఉండగా ఇప్పుడు రూ.150 కూడా రావడంలేదు. పసుపు కిలోకు రూ.150 నుంచి రూ.250 వరకూ గిట్టుబాటు ధర రావాల్సి ఉండగా, రూ.70 కూడా రావడంలేదు.

చెరుకు టన్ను రూ.2300 కాగా రూ.1540 మాత్రమే వస్తోంది. మొక్కజొన్నకు రూ.1310  గాను రూ.900  కూడా పలకడం లేదు. ఇక సుబాబుల్, జామాయిల్ విషయానికి వస్తే రూ.4,400, రూ.4600 గిట్టుబాటు ధర ఇవ్వాల్సి ఉండగా రూ.3500 కూడా అందడం లేదు. రైతు బతుకే కష్టంగా మారింది. ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ పోరాటం ఆగదు. నష్టపోయిన ప్రతి రైతుకు తోడుగా ఉంటాం. కష్టమైనా ఒత్తిడి తెచ్చేందుకు అందరం ఒకటవుదాం. మనకి కావాల్సింది సాధించుకుందాం.

ధర్నాలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణి, నియోజకవర్గ ఇన్‌చార్జులు వరికూటి అశోక్‌బాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, యెడం బాలాజీ, గొట్టిపాటి భరత్, వెన్నా హనుమారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 మూడు కుటుంబాలకు పరామర్శ
 జిల్లాలో అత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతులు బొలినేని కృష్ణారావు, నీలం వెంకటరావు, గిట్టుబాటు ధర రాక వేలం కేంద్రంలోనే గుండె ఆగి చనిపోయిన మిడసల కొండలరావు కుటుంబాలను జగన్ పరామర్శించారు.  ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినా అధైర్యపడకుండా ముందుకు సాగాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిగ్రీ చదువుతున్న ఆడపిల్ల చదువు మాన్పించవద్దని కొండలరావు కుటుంబానికి చెప్పారు.

 పొగాకు రైతులను ఆదుకున్న వైఎస్సార్
 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు పొగాకు రైతులు ఇలానే సంక్షోభంలో ఉంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపి సొసైటీల తరఫున పొగాకు కొనుగోలు చేయించారు. దీనివల్ల పోటీ పెరిగి పొగాకుకు మంచి ధర వచ్చింది. ఆయన ఐదేళ్లలో రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్నారు. కానీ ఇదేపని చంద్రబాబు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. చంద్రబాబూ నీకు బుద్ధీ జ్ఞానం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రిగా పొగాకు రైతులను ఆదుకోవాలన్న బుర్ర, ఆలోచన లేకుండా పోయాయి.

172 మిలియన్ కిలోల పొగాకు పండుతుందని తెలిసినప్పుడు మార్కెట్ సంక్షోభంలో ఉన్నపుడు జనవరి నుంచి జూన్ వరకూ రూ.400 కోట్లు ఖర్చు పెట్టి 30 మిలియన్ కిలోలు కొని ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారా? లోగ్రేడ్ పొగాకు కిలోకు రూ.62 నుంచి రూ.67 వరకూ ధర ఇస్తామని మూడు వారాల కిందట మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం రూ.34 పలుకుతోంది. రూ.67 కంటే తక్కువకు ఎవరి వద్ద కొన్నారో వారందరికీ మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పుడు రైతులకు కొంతైనా ఊరట కలుగుతుంది.

నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష

Written By news on Wednesday, September 30, 2015 | 9/30/2015


నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష స్థలాన్ని నిర్ణయించినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారమిక్కడ వెల్లడించారు.  వైఎస్ జగన్ వచ్చే నెల 7వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించిన విషయం విదితమే.

నేడు టంగుటూరులో నిరసన


సర్కారుపై సమర శంఖం
- పొగాకు రైతులకు జగన్ అండ
- నేడు టంగుటూరులో నిరసన

సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం పొగాకు రైతుల పాలిట శాపంగా మారుతోంది. పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో రైతాంగం ఊపిరి ఆగిపోతోంది. బోర్డు నిర్దేశించిన మేరకే పండించినా కొనే దిక్కు లేక ఉరికొయ్యలను, పురుగు మందులను ఆశ్రయించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుగురు పొగాకు రైతులు కన్ను మూసినా పాలకులు కళ్లు తెరవడం లేదు.

మరో ‘టంగుటూరు ఉద్యమం’

రాష్ట్రంలో పొగాకుకు మద్దతు ధర దక్కడం లేదు. తక్కువ రకం(లో-గ్రేడ్) పొగాకును కిలోకు రూ.60 నుంచి రూ.67 మధ్య చెల్లించి, పూర్తిగా కొనుగోలు చేయిస్తామని, ట్రేడర్లు మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కేంద్రం రూ.15, రాష్ట్రం రూ.5 అదనంగా ఇస్తాయంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నీటి మీద రాతగానే మిగిలిపోయింది. తక్కువ రకం పొగాకు ధర కిలోకు రూ.35 నుంచి రూ.40 మధ్యే పలుకుతోంది. రైతుల వద్దనున్న పూర్తి పొగాకును కొనుగోలు చేయిస్తామన్న హామీ నెరవేరలేదు. అన్ని విధాలా చితికిపోతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్నారు.

రైతుల వద్ద ఉన్న లో-గ్రేడ్ సహా అన్ని రకాల పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో నిరసన చేపట్టనున్నారు. రైతాంగంలో ఆత్మస్థైర్యాన్ని నింపి, బతుకుపై భరోసా కల్పించాలని జగన్ సంకల్పించారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిస్తున్నారు. 1983లో పొగాకు వ్యాపారుల మోసాన్ని ఎదిరించి వేలం కేంద్రాల ఏర్పాటుకు రైతులు ‘టంగుటూరు ఉద్యమం’ నడిపారు. అదే ప్రాం తంలో జగన్ మరో పోరాటం చేయనున్నారు.

రైతుల కుటుంబాలకు నేడుపరామర్శ  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ నిర్వాకం కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించనున్నారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బొలినేని కృష్ణారావు, నీలం వెంకట్రావ్ కుటుంబాలతోపాటు పొగాకు వేలం కేంద్రం లోనే గుండె ఆగి మరణించిన మిడసల కొండలరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం బాధిత రైతుల సమస్యలపై టంగుటూరులో నిరాహార దీక్ష చేపడతారు.

పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పామాయిల్, పొగాకు రైతులు మంగళవారం జగన్‌ను కలసి,  సమస్యలను వివరించారు. రైతుల సమస్యలను విన్న జగన్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు నేతృత్వంలో జగన్‌ను రైతులు కలిశారు.

హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా?

Written By news on Tuesday, September 29, 2015 | 9/29/2015


హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా?
హైదరాబాద్  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. నారా లోకేష్ ప్రకటించిన ఆస్తులపై  చంద్రబాబు విచారణకు సిద్ధమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇండిపెండెంట్ ఆడిటర్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని అంబటి రాంబాబు మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు.


మీ ఆస్తుల విలువ నిజమైతే ఈ ఛాలెంజ్ స్వీకరించాలని సూచించారు. పాలు, కూరగాయలు అమ్మి కోట్లు గడించేవారు ఉన్నారా అని అంబటి ప్రశ్నలు సంధించారు. హెరిటేజ్ ఆవులు ఏమైనా బంగారు పాలు ఇస్తున్నాయా? అని ఆయన ఎద్దేవా చేశారు. లోకేశ్ ప్రకటించిన ఆస్తుల లెక్కలను కనీసం వాళ్ల కుటుంబ సభ్యులు గానీ, నందమూరి వంశంలో వాళ్లు గానీ, వాళ్ల పార్టీ కార్యకర్తలు గానీ ఎవరూ నమ్మడం లేదని అంబటి వ్యాఖ్యానించారు.

రేపు పరామర్శ యాత్ర


బాధితులకు బాసటగా...
- పొగాకు రైతులకు అండగా జగన్
- రేపు జిల్లాలో పరామర్శ యాత్ర
- అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఓదార్పు
- టంగుటూరు వేలం కేంద్రం ఎదుట ధర్నా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
 గిట్టుబాటు ధర లేక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు, పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 6 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు.

అక్కడి నుంచి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరి పొందలవారిపాలెంలో  ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి టంగుటూరు చేరుకుని వేలం కేంద్రం ఎదుట గిట్టుబాటు ధర కోసం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొంటారు. ధర్నా అనంతరం జరుగుమిల్లి మండలం చింతలవారిపాలెం వెళ్లి వేలం కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందిన మిడసల కొండలరావు కుటుంబాన్ని, వలివేటివారిపాలెం మండలం కొండసముద్రంలో ఆత్మహత్య చేసుకున్న నీలం వెంకట్రావు కుటుంబాలను పరామర్శిస్తారు. టంగుటూరులో నిర్వహించే ధర్నాలో పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
ట్రాక్ పై తీగలు - నిలిచిన రైళ్లు
కంభం : రైలు పట్టాలపై విద్యుత్తు తీగలు తెగిపడడంతో సోమవారం అర్ధరాత్రి వరకూ రైళ్లకు అంతరాయం ఏర్పడిన ఘటన కంభం మండలంలోని సైదాపురం సమీపంలో చోటుచేసుకుంది. తొలుత సాయంత్రం కొన్ని విద్యుత్ తీగలను అతికష్టం మీద పక్కకు లాగి గుంటూరు - డోన్ ప్యాసింజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ మరో తీగ రాత్రి 7.30 గంటలకు పడడంతో కంభం రైల్వేస్టేషన్‌కు వచ్చిన కాచిగూడ - గుంటూరు ప్యాసింజరు రాత్రి 9.40 నిమిషాల వరకూ కదలలేకపోయింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వివాదానికి దిగారు.  9 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్,  గుంటూరు -కాచిగూడ ప్యాసింజరు,  అమరావతి, ప్రశాంతి, ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
 
రూ 27.11కోట్ల ముద్రా రుణాలు జిల్లా కలెక్టర్ సుజాతశర్మ వెల్లడి
ఒంగోలు టౌన్:  ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద జిల్లాలో 10100 మందికి 27.11కోట్ల రూపాయల ముద్రా రుణాలు ఇవ్వనున్నట్టు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ముద్రా రుణ మెగా క్యాంపు నిర్వహించారు.  ఏపీఐఐసీ ద్వారా ఏకగవాక్ష విధానం అమలులో ఉందని, పరిశ్రమల కోసం కొత్తగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి విద్యుత్, పంచాయతీ, అగ్నిమాపక శాఖల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.  

నిష్పక్షపాతంగా, నిజాయితీగా అమలు చేయాలని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజుసూచించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా రుణం పొందే సౌలభ్యం ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహారావు, సిండికేట్ బ్యాంకు డివిజనల్ మేనేజర్ రామ్మూర్తి, డీఆర్‌డీఏ పీడీ మురళి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ డాక్టర్ బీ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యాంకు చెక్కులను అందజేశారు.

వారి ఆత్మహత్యలెందుకో తెలియదా?


వారి ఆత్మహత్యలెందుకో తెలియదా?
 సీఎంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు

 రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా తెలియదా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సోమవారంనాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భేషరతుగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, ఎవరూ కట్టక్కరలేదని ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు రుణమాఫీ చేయనందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వాటిపై ప్రతిరోజూ పేపర్లలో వస్తున్న వార్తలు చదవడం లేదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

బ్యాంకుల్లో పేరుకు పోయిన పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక దిక్కు తోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తెలిసి కూడా రైతుల ఆత్మహత్యలకు వేరే కారణాలున్నాయని చెప్పాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అధ్యయన కమిటీలు వేయాలని నిర్ణయించారని పద్మ దుయ్యబట్టారు.సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థలకు ఇక్కడి భూములను అప్పగిస్తున్న చంద్రబాబు అందుకు ప్రతిఫలంగా అక్కడ (సింగపూర్)లో ఎలాంటి లబ్ధి పొందుతున్నారో చెప్పాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని ఆమె విమర్శించారు. రాజధాని శంకుస్థాపన , ప్రచారార్భాటాల కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు కోట్లు ముట్టచెబుతున్నారని విమర్శించారు.

అబద్ధాల్లో తండ్రిని మించిన వారసత్వం..

అబద్ధాల్లో తండ్రిని మించిన వారసత్వం..
 
రెండెకరాల నుంచి అక్రమార్జనతో వేల కోట్లకు
ఏ విచారణా జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డ బాబు
విచారణ జరిగితే కదా... దోషులో నిర్దోషులో తేలేది
కొనుగోలు విలువలంటూ ఆస్తులపై అడ్డంగా బుకాయింపులు
కిలో వెండి విలువ కూడా రూ.3,400కు కొన్నట్టు చెప్పిన లోకేశ్
ఇప్పటి ధర రూ.35,000. లోకేశ్ చెప్పిన ధర ఎప్పుడుందో మరి...?
ఇసుక నుంచి బొగ్గు దాకా... పోలవరం నుంచి పట్టిసీమ దాకా అక్రమార్జనే
ముడుపుల సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిన బాబు
అయినా సరే బుకాయిస్తూ... ఆస్తుల ప్రకటన పేరిట డ్రామాలు
నేను వేసిన కేసును కూడా నీరుగార్చిన తీరు గుర్తుకొస్తోంది
బాబు ఆస్తుల ప్రకటనపై ‘సాక్షి’కి లేఖ రాసిన నందమూరి లక్ష్మీపార్వతి

 
నారా లోకేశ్ తన ఆస్తులు, తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఆస్తులంటూ చేసిన ప్రకటన చూశాక అనేక మంది పాత్రికేయులు, భిన్న రంగాల నిపుణులతో చర్చించాను.  కొంత సమాచారాన్నీ సేకరించాను. దాదాపు దశాబ్దం క్రితమే చంద్రబాబు నాయుడి ఆస్తులపై ఏసీబీకి నేనిచ్చిన ఫిర్యాదు... తదుపరి కోర్టులో కొనసాగిన కేసు... ఆ కేసు దర్యాప్తు జరగక ముందే వేరే కారణాల వల్ల పక్కకుపోయిన విధానం... అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై న్యాయస్థానం కాదు కదా...  కనీసం కానిస్టేబులు విచారణ కూడా జరగలేదు. రెండెకరాల నుంచి వేల కోట్లకు ఇంటా బయటా పడగలెత్తిన ఈ కుటుంబం అధికారంలోకి వచ్చిన తరవాత పట్టిసీమ మొదలు రాజధాని వరకు, ఇసుక మొదలు మద్యం లెసైన్సుల వరకు అధికారమే పెట్టుబడిగా చేస్తున్న సంపాదనను యావత్ తెలుగుజాతీ గమనిస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కోట్లు ధారపోసి కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన వైనాన్ని మొత్తంగా దేశం అంతా చూసి నివ్వెరపోయింది. వారి లెక్క ప్రకారమే నలుగురు ఎమ్మెల్యేలను కొనాలన్నా రూ.20 కోట్లు పెట్టి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆస్తులు మొత్తం ఎంతంటే కేవలం రూ.42 లక్షలని లోకేశ్ చెపుతున్నాడు. తండ్రి ఆస్తులకు తనయుడు ఇస్తున్న ఈ సర్టిఫికెట్‌ను చూస్తే చంద్రబాబు నాయుడు లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వారసుడు వచ్చాడని మాత్రం రూఢి అవుతోంది. కాబట్టే, తమ ఆస్తులంటూ ఏటా చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో భిన్న వాస్తవాలను, వారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలను ఈ రూపంలో సాక్షికి సమర్పించాను.

కన్న తల్లిదండ్రులంటే ఎవరికైనా గౌరవమే. ఏవైనా చేయకూడని పనులు చేసేటపుడు వాళ్లకు తెలియకూడదనే అనుకుంటారు. కానీ తల్ల్లి పేరిటే చట్ట విరుద్ధమైన పనులు చేయగలిగేది మాత్రం చంద్రబాబు నాయుడే. తల్లి పేరిట ఆస్తులు కొని... తన అక్రమ సంపాదనకు ఆమెనే బినామీని చేసిన చరిత్ర ఆయనది. 1979లో బాబు ఎమ్మెల్యే కాక ముందు ఆయన తండ్రి ఖర్జూర నాయుడికున్న ఆస్తి కేవలం 20 గుంటలు. అంటే అర ఎకరం. తల్లి అమ్మణ్ణమ్మ ఆస్తి రెండున్నర ఎకరాలు. బాబు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎనిమిదేళ్లు గడిచాక... 1988 నాటికి ఈ భూమి 77 ఎకరాలయింది. ఇంకో పదేళ్ళకు.. అంటే 1994 నాటికి 19 కోట్ల రూపాయలకు చేరింది. అలా పెరుగుతూ... 2004లో రూ.39 కోట్లకు... 2009లో ఏకంగా రూ.51 కోట్లకు చేరిపోయింది. కాకపోతే ఇవన్నీ స్వయంగా చంద్రబాబు ప్రమాణపూర్వకంగా చెప్పిన అఫిడవిట్ లెక్కలు. వాటి వాస్తవ విలువలు... బినామీల పేరిట ఉన్న ఆస్తులు చూసినా అవెప్పుడో కొన్ని వేల కోట్ల రూపాయల్ని దాటిపోయాయి.

తల్లి పేరిట బినామీ ఆస్తులు...
 చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మకు పసుపు కుంకుమలుగా పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి రెండున్నర ఎకరాలు. దానిపై వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోదు. అలాంటి అమ్మణ్ణమ్మ 2000వ సంవత్సరంలో రూ.75 లక్షలు పెట్టి ఆస్తులు కొన్నారు. హైటెక్ సిటీ సమీపంలోని మదీనాగూడలో రూ.40 లక్షలు పెట్టి ఐదెకరాల స్థలాన్ని... బంజారాహిల్స్‌లో రూ.35 లక్షలు పెట్టి 1,135 చదరపు గజాల స్థలాన్ని కొన్నారు. మళ్లీ ఏడాది తిరక్కుండానే ఆ రెండింటినీ చంద్రబాబు తనయుడైన లోకేశ్‌కు ప్రేమతో గిఫ్ట్‌గా ఇచ్చేశారు. అమ్మణ్ణమ్మ తన సొంత సొమ్ముతో ఆ ఆస్తుల్ని కొని ఉంటే... తన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలను వదిలిపెట్టి లోకేశ్ ఒక్కడికే బహుమతిగా ఎందుకిస్తారు? అవి బాబు అక్రమాస్తులని చెప్పటానికి ఇది చాలదా?

మనీ లాండరింగ్ లావాదేవీలు..
 మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఐదెకరాలు కొన్నది బాబు బినామీగా, బాబు కంపెనీల్లో డెరైక్టర్‌గా వ్యవహరించిన నాగరాజానాయుడి బంధువుల నుంచే. ఎందుకంటే ఆ 5 ఎకరాల్ని ఆనుకుని ఉన్న మరో ఐదెకరాల్ని తన బంధువుల నుంచే నాగరాజానాయుడి భార్య సుధాశారద కొన్నారు. తరవాత ఆమె దాన్ని చంద్రబాబు భార్య భువనేశ్వరికి విక్రయించేశారు. అలా... మొత్తం పదెకరాల భూమీ చంద్రబాబు చేతికి వచ్చేసింది. అలాగే అమ్మణ్ణమ్మ రూ.35 లక్షలు పెట్టి బంజారాహిల్స్‌లో కొన్న స్థలాన్ని లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చాక... ఆయన దాన్ని నాగరాజా నాయుడి మామ సత్యనారాయణకు విక్రయించారు. ఏడాది తిరక్కుండానే ఆయన దాన్ని నాగరాజానాయుడి భార్యకు బహుమతిగా ఇచ్చేశారు. ఇవన్నీ బినామీ, మనీలాండరింగ్ లావాదేవీలని తెలియటం లేదా?
 
ఆది నుంచీ అబద్ధాలే..
 1988లో కర్షక పరిషత్‌కు బాబు నియామకాన్ని సవాలు చేస్తూ రైతు నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి పిటిషన్ వేశారు. దానికి జవాబుగా బాబు అఫిడవిట్ వేశారు. ‘‘నేను సంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాక నేను స్వయంగా కూలీల్ని పెట్టి సాగు చేశా. ఏడాదికి రూ.36,000 ఆర్జించా’’ అని దాన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టడం... ఎన్టీఆర్ కుమార్తెను వివాహమాడటం తప్ప బాబుకు ఇతర వ్యాపారాలేవీ లేవు. అలాంటిది 1992-93 నాటికి హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. ఏడాదికి రూ.36,000 ఆర్జించిన బాబు ఆరేళ్లలో అంత డబ్బెలా సంపాదించారు? భువనేశ్వరి కార్బయిడ్స్ కంపెనీ పెట్టి దివాలా తీసి, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారు తప్ప ఏ వ్యాపారంమీదా రూపాయి కూడా సంపాదించిన దాఖలాలు లేవు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది?

 1999 నాటికి రూ. 7.7 కోట్లకు చేరిన ఆస్తి!
 1994లో ముఖ్యమంత్రి అయిన బాబు... 1999లో తన ఆస్తుల్ని స్పీకరు ఎదుట ప్రకటించారు. తనకు రూ.7.79 కోట్ల ఆస్తులున్నట్లు దాన్లో వెల్లడించారు. అన్ని కోట్లు ఎలా సంపాదించారు? అప్పట్లో హెరిటేజ్ ఫుడ్స్ కూడా నష్టాల్నే నమోదు చేసింది. మరి బాబు ఆస్తులెలా పెరిగాయి?

 2009 నాటికి రూ. 60 కోట్లకు..
 ఫిక్స్‌డ్ డిపాజిట్ రెట్టింపు కావాలంటే ఆరేళ్లు తప్పనిసరి. కానీ బాబు ఆస్తులు ఎంత వేగంగా పెరిగాయంటే... 2004 నాటికి రూ.20 కోట్లకు చేరాయి. 2009 నాటికి ఏకంగా 60 కోట్లయ్యాయి. ఇవన్నీ బాబు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పినవే!! అది కూడా బాబు తాను కొనుగోలు చేసిననాటి విలువలను మాత్రమే చెప్పారు. మరి మార్కెట్ విలువ 30 రెట్లు ఎక్కువేనన్నది అబద్ధమా? అంటే 2009 నాటికే బాబు ఆస్తి దాదాపు రూ. 2 వేల కోట్లకు చేరింది. అన్ని కోట్లు ఎలా పోగేశారు మరి?

ఇంకా ఎన్నాళ్లు ఈ లెక్కలు?
 తాము కొనుగోలు చేసిన విలువలు... అంటూ పచ్చి అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడి వారసత్వం అబద్ధాలు చెప్పటంలో ఆయన కొడుకు నారా లోకేశ్‌కి ఎంచక్కా అబ్బేసింది. లోకేశ్ చెప్పిన ప్రకారం ఆస్తుల లెక్కలివీ...

చంద్రబాబు    42 లక్షలు
భువనేశ్వరి     33.07 కోట్లు
లోకేశ్    7.67 కోట్లు
బ్రాహ్మణి    4.77 కోట్లు
నిర్వాణ హోల్డింగ్స్    1.37 కోట్లు  (అప్పులు పోను విలువ)

ఈ లెక్కన చూస్తే కుటుంబం మొత్తం ఆస్తి దాదాపు 46.5 కోట్లు. అయితే ఒక్క మదీనాగూడలోని 10 ఎకరాల స్థలం విలువే దాదాపు 200 కోట్లు పైగా చేస్తుంది. ఇక హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ విలువ రూ.905 కోట్లు. దీన్లో 60 శాతం వరకూ వాటా చంద్రబాబు, ఆయన కంపెనీలు, బినామీలదే. అంటే దీని విలువే దాదాపు 550 కోట్లు. అంటే ఈ రెండు ఆస్తుల విలువే ఏకంగా 750 కోట్లు. మరి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోను, విదేశాల్లోను ఉన్న భూములు, భవనాలు, ఇతర ఆస్తుల విలువ కూడా కలిపితే ఎన్ని వేల కోట్లవుతుంది? చంద్రబాబు నాయుడుకు విదేశీ ఆస్తులు భారీగా ఉన్నాయని షాపింగ్ కాంప్లెక్సులు, హోటళ్ళు సింగపూర్, మలేసియా దేశాల్లో ఉన్నాయని ఏనాడో తెహల్కా రాసింది. ముఖ్యమంత్రి అయ్యింది మొదలు చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు సింగపూర్ వెళ్ళి వచ్చారు. రాజధానిలో సింగపూర్ కంపెనీకి కట్టబెడుతున్న వాటా రైతులనుంచి తీసుకున్న 10,000 ఎకరాల భూమి అని గతంలో ఒక ఆంగ్ల పత్రిక రాసింది. గతంలో విదేశీ ఆస్తులకు ఇప్పుడు సింగపూర్‌లో ఇంకెన్ని సంపదలు జత కలిశాయో ఊహకు అందని విషయం. దీన్నిబట్టి ఏటా తండ్రి పాడుతున్న పాటకే లోకేష్ కూడా దరువేశాడని అర్థమవటం లేదా?

అసలు లోకేశ్ సంపాదించిందెప్పుడు?
 లోకేశ్‌ని చూస్తే అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ యూనివర్సిటీల్లో చదవటం మినహా పెద్దగా వెలగబెట్టిన ఉద్యోగాలేవీ లేవు. ఇంటర్మీడియెట్ అత్తెసరు మార్కులతో పాసైనా అక్కడ సీట్లు వచ్చాయంటే కోట్ల రూపాయల మేర డొనేషన్లు కట్టడం వల్లే. ఆ డొనేషన్లను సైతం రామలింగరాజు అప్పట్లో సర్దుబాటు చేశారనేది అందరూ చెప్పే మాటే. అంతో ఇంతో పెద్ద ఉద్యోగమంటే ఆయన చేసింది, చేస్తున్నది హెరిటేజ్‌లోనే. మరి అలాంటి లోకేశ్ 2006-07లో ముంబై శివార్లలో 8.42 ఎకరాలు, బెంగళూరు దగ్గర 3.17 ఎకరాలు ఎలా కొన్నాడు? హెరిటేజ్‌లో వాటాలతో చూస్తే ఈయన ఒక్కడి ఆస్తే మార్కెట్ విలువల ప్రకారం 400 కోట్లకు పైగా ఉంటుంది. ఇది బాబు అక్రమార్జన కాదా?
 
ఈ కుంభకోణాలకు అంతం ఉందా?
 హైటెక్ సిటీ తరహాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటించే ముందు అక్కడ తన కుటుంబీకులు, బినామీలు, బంధువుల పేరిట భారీగా భూములు కొని... ఆ తరవాత ప్రాజెక్టును ప్రకటించటం... పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటం గురించి ఈ రాష్ట్రంలో తెలియనివారెవరైనా ఉన్నారా?

బినామీ చేత ‘ఐఎంజీ భారత’ అనే డొల్ల కంపెనీ పెట్టించి... దానికి ఆగమేఘాల మీద 850 ఎకరాలిచ్చేసి... భవిష్యత్తు హక్కుల్ని కూడా ఆ సంస్థకు రాసిచ్చేసింది బాబు కాదా? ఎకరా 2 కోట్లు పలుకుతున్న చోట రూ.50 వేల చొప్పున... అదీ 850 ఎకరాల్ని ఎవరైనా ఇచ్చేస్తారా? అంతకు మూడేళ్ల కిందటే తన భార్య పేరిట అక్కడున్న భూమిని ఎకరా రూ.కోటికి విక్రయించింది బాబు కాదా?

 {పభుత్వ చక్కెర కర్మాగారాలకు, స్పిన్నింగ్ మిల్లులకు, డెయిరీలకు నష్టాల ముసుగు తొడిగి... విలువైన భూములు, భవనాలు, ఆస్తులతో సహా వాటిని చెనక్కాయలకు, పప్పుబెల్లాలకు ఇచ్చేసినట్లుగా తన బినామీలకు పంచింది బాబు కాదా? ళీ ఐటీ రిటర్న్‌ల ప్రకారం చంద్రబాబు భార్య భువనేశ్వరి 2010-11లో 13.50 కోట్లు... 2009-10లో  6.58 కోట్లు... 2008-09లో 13.00 కోట్లు ఆదాయం సంపాదించారు. దానిపై రూ.7 కోట్ల పన్ను కూడా కట్టారు. మరి లోకేశ్ ఆమె మొత్తం ఆస్తుల విలువ 33 కోట్లని చెప్పారు. ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా?

అదే ఐటీ రిటర్న్‌ల ప్రకారం 2008-09 లోకేశ్ ఆదాయం రూ.86,350. దానిపై కట్టిన పన్ను రూ.4,280. తరవాత హెరిటేజ్ ఫుడ్స్‌లో చేరటంతో జీతం మొదలైంది. 2009- 10లో రూ.29.27 లక్షలు, 2010-11లో రూ.37.18 లక్షలు ఆదాయంగా చూపించారు. మరి  మైనర్‌గా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో మొదలెట్టి... మదీనాగూడ, కొండాపూర్. బెంగళూరు, ముంబైలలో ఎకరాలకు ఎకరాలు లోకేశ్ ఎలా కొన్నారు. అది చంద్రబాబు అక్రమ సంపాదన కాదా?

ఎన్టీఆర్ ట్రస్టు కూడా బాబు ఆస్తేగా?

బాబు కుటుంబం ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆస్తుల ఊసే రాదు. ఎందుకంటే అది ట్రస్టు కనక. కానీ బంజారాహిల్స్‌లో భారీ భవంతితో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నది దీని పేరిటే. ఈ ట్రస్టుకు చంద్రబాబు శాశ్వత ట్రస్టీ. ఆయన భార్య భువనేశ్వరి, వారి కుటుంబ ఆడిటర్ దేవినేని సీతారామయ్య మిగిలిన ట్రస్టీలు. బంజారాహిల్స్‌లో భవంతిలోని కార్యకలాపాలు సాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ ఈ ట్రస్టుకు ఏటా కొంత రుసుము కూడా చెల్లిస్తోంది. సీఎంగా ఉన్నపుడు తన ట్రస్టుకు తనే భూమిని కేటాయించుకుని, తనే సెట్లర్‌గా, తనే ట్రస్టీగా రాసుకుని చంద్రబాబునాయుడు స్వయంగా ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ ఇది. దీన్లోని మిగిలిన ట్రస్టీల్ని బయటకు పంపేసి చివరికి తన కుటుంబం చేతుల్లోకి తెచ్చుకున్నారు.  దీన్ని బాబు ఆస్తిగా ఎందుకు లెక్కబెట్టకూడదు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యపట్టణాలన్నింటిలో ట్రస్టు పేరిట భూములు స్వాహా చేసే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతోంది.
 
అవినీతి సొమ్ముతో దేనికైనా రెడీ...
అధికారంలోకి రావటం... ఎడాపెడా అవినీతికి పాల్పడి దేశంలోను, విదేశాల్లోను భారీ ఆస్తులు కూడబెట్టడం... బినామీలకు దోచిపెట్టడం... అధికారం నిలబెట్టుకోవటానికి, మళ్లీ అధికారంలోకి రావటానికి ఆ బినామీల డబ్బును విచ్చలవిడిగా వెదజల్లటం... ఇదే బాబు వ్యవహార శైలి. పట్టిసీమ ప్రాజెక్టులో దక్కిన ముడుపులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదాకా కొట్టుకు వచ్చాయంటే ఏమనుకోవాలి? పట్టిసీమ నుంచి పోలవరం దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, ఎంపిక చేసిన వారికి పారిశ్రామిక రాయితీలు మొదలు కొందరికే మద్యం ఉత్పత్తి పెంపు లెసైన్సుల వరకు ప్రతి ఒక్క అంశంలోనూ విచ్చలవిడిగా పుచ్చుకున్న ముడుపులతో వందల కోట్లు కుమ్మరించి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవటం నిజం కాదా? దాన్ని కప్పి పుచ్చుకోవటానికి పైస్థాయిలో తెలిసిన వాళ్ల కాళ్లు పట్టుకుని, నానా యాతనా పడుతూ బయటకు బీరాలు పోవటం తెలియని విషయమా? అంతెందుకు! ఈ బాబు ఇసుక మాఫియాకూ లీడరే. కృష్ణా జిల్లాలో టీడీపీ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ఇసుక దందాను అడ్డుకోబోయిన మహిళా తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశారంటే వీళ్ల దారుణాల గురించి ఏమని చెప్పుకోవాలి? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉండే తుని నియోజకవర్గంలో ఇసుక దందాను అడ్డుకున్నందుకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఏకంగా దాడికే దిగారు.

పట్టిసీమ, పోలవరం పేరిట కోట్లు దండుకుంటున్నారు. ఇక ప్రాజెక్టుల్లో మేత కోసం జీవోలు సైతం విడుదల చేస్తున్నారు. రాజధాని పేరిట మళ్లీ సింగపూర్ మంత్రం పఠిస్తూ బినామీలకు భూములు, కాంట్రాక్టులు పందేరం చేయడానికి సిద్ధమయ్యారు. కమిషన్ల కోసం పారిశ్రామిక వేత్తలకు ఏకంగా రూ.2,067 కోట్ల మేర నజనారాలు ప్రకటించారు. ఏం! వీటిలో మీ పార్టీ వాళ్లకు ప్రాధాన్యమివ్వటం నిజం కాదా? ఎంపిక చేసిన కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మద్యం ఉత్పత్తి పెంచుకోవచ్చంటూ జీవో ఇచ్చేశారు. బెరైటీస్ టెండర్లలో మార్పులతో భారీ కుంభకోణానికి టెంకాయ కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతూ పొంతూ ఉందా? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా గడవలేదు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడ్డారు. పెపైచ్చు మాకెలాంటి అవినీతి మకిలీ అంటలేదు... మేం చాలా సత్యహరిశ్చంద్రులం అన్నట్టుగా ఏడాదికోసారి నాలుగు కాగితాలు చెప్పి ఆస్తుల్ని ప్రకటించటం!!. అసలు మీకేమైనా చిత్తశుద్ధి ఉందా? ఉంటే మీ ఆస్తుల తాలూకు నిజమైన విలువలు చెప్పొచ్చుగా? మార్కెట్ విలువలు చెప్పొచ్చుగా? ఎప్పుడో 1995లో మీరొక ఇల్లు 23 లక్షలు పెట్టి కొన్నారని ఇప్పటికీ దాని విలువ 23 లక్షలే అని చెబితే నమ్మేదెవరు? రూ.50 కోట్లు విలువ చేసే ఆ బిల్డింగ్‌ను ఎవరైనా రూ.50 లక్షలిస్తామంటే మీరు అమ్మేస్తారా? ఎందుకిన్ని అబద్ధాలు? ఎన్నాళ్లీ అబద్ధాలు? ఇలా చెబితే మీ కుటుంబాన్ని నమ్మేదెవరు బాబూ?
http://www.sakshi.com/news/sakshi-special/assets-of-nara-lokesh-babu-279981?pfrom=home-top-story

30న ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పరామర్శ యాత్ర

Written By news on Monday, September 28, 2015 | 9/28/2015

ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ  అండగా నిలవాలని నిర్ణయించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఈ నెల 30న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.  గిట్టుబాటు ధరలేక బలవన్మరణాలకు పాల్పడ్డ పొగాకు రైతుల కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నట్లు ఆపార్టీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. అనంతరం టంగుటూరులో రైతు సమస్యలపై  వైఎస్‌ జగన్‌ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
 
ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొగాకు రైతుల వరుస ఆత్మహత్యలు  రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అశోక్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి

పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. బేగంపేటలో పుష్పగిరి భారతి వేద పాఠశాలలో ఉంచిన భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం 3.45కి బషీర్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో భారతీస్వామి తుది శ్వాస విడిచారు. కడప జిల్లా పుష్పగిరిలోని కేంద్ర స్థానంలోమంగళవారం శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు జరుగుతాయని స్వామి వ్యక్తిగత కార్యదర్శి ఎన్.భారతీస్వామి తెలిపారు.

కడపజిల్లా చెన్నూరులో 1940లో జన్మించిన భారతీస్వామి 1957లో పుష్పగిరి పీఠం బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారత దేశంలోనే సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు కొనసాగిన ఏకైక పీఠాధిపతిగా ఘనతకెక్కారు. పీఠాధిపతిగా అరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘షష్ట్యబ్ది ఉత్సవం’ చేయాలని పూనుకున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

పామాయిల్ రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్తాం

Written By news on Sunday, September 27, 2015 | 9/27/2015


పామాయిల్ రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్తాం
కేంద్ర మంత్రుల్ని కలిసి సమస్యల్ని వివరిస్తాం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి


 అశ్వారావుపేట : అధికారులు, రాజకీయ నాయకుల కుట్రలకు బలవుతున్న పామాయిల్ రైతులు నష్టాల పాలవకుండా ఉండేందుకు వారిని కేంద్రమంత్రుల వద్దకు తీసుకుని వెళతానని  వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. పామాయిల్ గెలలను దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఎంపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ పంటకు ఇతర రాష్ట్రాలతో సమానంగా గిట్టుబాటు ధరను, కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీని ఇవ్వాలన్నారు.

కేవలం రాజకీయాల కోసం కొందరు అశ్వారావుపేట ప్రాంతంలో  నాలుగేళ్లుగా రెండో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా కుట్రలు పన్నడం సిగ్గుచేటన్నారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అన్యాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఫ్యాక్టరీకి వెళ్లి మేనేజర్ హరినాథ్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గెలలను ఎందుకు దిగుమతి చేసుకోవట్లేదని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఫోన్‌చేసి ఇక్కడి సమస్యను వివరించారు.

వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్ర


రాజమండ్రి టూ విజయవాడ
- వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్ర
- దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
 విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా రాజమండ్రికి చెందిన పలువురు పార్టీ నాయకులు మహా పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు సుమారు 180 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ర్ట కార్యదర్శి గిరిజాల వీర్రాజు (బాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర విజయవాడ దుర్గగుడి టోల్‌గేటు వద్దకు చేరుకోగా పార్టీ యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ వారికి స్వాగతం పలికారు. వైఎస్ జగన్ కోసం యూత్ విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేసినవారిని పేరుపేరునా ఆయన పలకరించి అభినందనలు తెలిపారు.  

అనంతరం టోల్‌గేటు వద్ద కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధనకు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు మొక్కుకున్నారు. రాష్ర్ట యువత మేలు కోసం జగన్ దీక్ష చేస్తే, ఆయనకు ఎక్కడ పేరు వచ్చేస్తుందోనని అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టి దీక్షకు అనుమతి నిరాకరించడం సిగ్గుచే టని వీర్రాజు పేర్కొన్నారు. ఈ నెల 22ఉదయం కడియం నుంచి సుమారు 100 మంది పార్టీ నేతలు, వివిధ విభాగాల నాయకులు పాదయాత్రగా బయలుదేరామని, ఐదు రోజుల పాటు యాత్ర సాగిందని వివరించారు.  పలు గ్రామాల ప్రజల నుంచి ఆదరణ లభించిందని, జననేతకు మద్దతుగా చేపట్టిన పాదయాత్రకు స్వాగతం పలికారని చెప్పారు. పాదయాత్రలో రాష్ర్ట బీసీ సెల్ కార్యదర్శి దాసరి శేషగిరి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాకా సతీష్, బీసీ నాయకులు లావేటి రమేష్, కుడేటి సురేష్, యార్లగడ్డ సత్తిబాబు, బత్తిన శ్రీధర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రాజధాని పేరిట రైతుల భూములతో పక్కా రియల్ వ్యాపారం


రియల్ దోపిడీ
♦ రాజధాని పేరిట రైతుల భూములతో పక్కా రియల్ వ్యాపారం
♦ నిర్మాణ పురోగతిపై నివేదిక ఇస్తేనే తదుపరి నిధుల మంజూరు
♦ రాజధానికి 2వేల ఎకరాలు సరిపోతుందని మహానాడులో తీర్మానం
♦ మొదట 33,400 ఎకరాలు.. తాజాగా మరో 2,600 ఎకరాలకు ఎసరు
♦ రాజధానిలో రైతుకు కేటాయించే భూమి ఎక్కడిస్తారో చెప్పని వైనం..

 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబోతోంది. సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న పూర్వ పరిచయాల దృష్ట్యా ఉచితంగా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మింపజేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి లాక్కొన్న భూములను రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్ సంస్థలకు అప్పనంగా అప్పగించి.. అన్నదాతలను నిలువు దోపిడీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రైతుల నుంచి సమీకరించిన భూముల్ని ఎలాంటి టెండర్లు లేకుండా ఆ దేశ సంస్థలకు ధారాదత్తం చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి దాగి ఉందనేది స్పష్టమవుతోంది. ముక్కారు పంటలు పండే భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థలకు అప్పగించడం వెనుక  కేవలం తన స్వప్రయోజనాల కోసం, కమీషన్ల కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది.

 కోట్లాది నిధులిచ్చినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం...
 రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1,850 కోట్లు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నయాపైసా ఖర్చు చేయలేదు. కనీసం ఒక్క ఇటుకైనా సమకూర్చలేదు. కేంద్రం కేటాయించిన నిధుల్ని సీఎం చంద్రబాబు కన్సల్టెన్సీల సేవలంటూ ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. రాజధానికి కేంద్రం ఇదివరకే రూ.1,500 కోట్లు ఇవ్వగా, తాజాగా మరో రూ.350 కోట్ల మంజూరు చేసింది. కేంద్రం ప్రకటించిన నిధులతో సచివాలయం,అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు తదితర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఇప్పటికే మొదలు పెట్టి ఉంటే ఈపాటికే కొంత పురోగతి ఉండేది. కేంద్రంపైనా ఒత్తిడి పెరిగేది.

తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాబట్టడానికి అవకాశం ఉండేది. కేంద్రం రాజధాని నిర్మాణం కోసం అంగీకరించిన రూ.5 వేల కోట్లు అందించేది. దీంతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడేవి. సహజంగానే భూమి రేట్టు పెరిగేవి. ఇలాంటప్పుడు సమీకరించిన భూములను జోనింగ్ చేసి ఉంటే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టడం వల్ల రూ.2 కోట్లు పలుకుతున్న ఎకరం భూమి విలువ రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు చేరేది. తద్వారా రైతులకు లబ్ధి చేకూరేది. కానీ, కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన నిధులకు సంబంధించి పనుల పురోగతిపై నివేదికలు(యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పిస్తే తప్ప తదుపరి నిధులు మంజూరు చేయదు.

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలిసినా, అందరూ అనుకున్నట్లే.. ప్రతిపక్షాలు మొదట్నుంచీ చెబుతున్నట్లుగా భూములన్నిటినీ సింగపూర్ సంస్థలకు కారుచౌకగా ధారాదత్తం చేయడానికి ముఖ్యమంత్రి పక్కా ప్రణాళిక రచించారు. సింగపూర్ సంస్థలకు బహుళ ప్రయోజనాలు కల్పించడంవ్యూహం వెనుక తన స్వప్రయోజనాలూ దాగి ఉండటం వల్లే ముఖ్యమంత్రి ఈ వైఖరిని ఎంచుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

 టీడీపీ మహానాడులో చెప్పిందొకటి... ఇప్పుడు చేసేది మరొకటి
 రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ఇప్పటికే 33,400 ఎకరాల పంట భూములను ప్రభుత్వం లాగేసుకుంది. రాజధాని ప్రాంతంలో అసైన్డ్, దేవాదాయ, అటవీ భూములన్నీ కలిపి 52 వేల ఎకరాల వరకు భూమి ఉంది. సమీకరించిన 33,400 ఎకరాలు సరిపోదని, మరో 2,600 ఎకరాలు అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే, సమీకరణకు రైతులు ముందుకు రాకపోవడంతో భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రయోగించింది. రాజధాని నిర్మాణానికి 2వేల ఎకరాలు సరిపోతుందని టీడీపీ మహానాడులో చేసిన తీర్మానంలోనూ పేర్కొన్న విషయం తెలిసిందే.

అందుకు భిన్నంగా, రైతుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో భూములు సమీకరించడం వెనుక ‘రియల్ ఎస్టేట్’ ప్లాన్ స్పష్టంగా కనబడుతోంది. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించిన సమయంలో అనుసరించిన విధంగానే ఇప్పుడూ వ్యవహరిస్తున్నారు. హైటెక్ సిటీ నిర్మించినప్పుడు ఏపీఐఐసీ(ప్రభుత్వ వాటా)కి 11 శాతం, డెవలపర్‌గా నిర్మాణం సంస్థ ఎల్‌అండ్‌టీకి 89 శాతం కట్టబెట్టారు. హైటెక్ సిటీకి అవసరమైన భూమితోపాటు 24 గంటల విద్యుత్, మంచినీరు సౌకర్యం, పలు రాయితీలు ఇచ్చారు. ఇంత చేసినా సర్కారు వాటా కేవలం 11 శాతం మాత్రమే. అదే పద్ధతిన స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థలకు రైతుల భూములను అప్పగించేస్తున్నారు.

 వంచన చక్ర బంధంలో అన్నదాత...
 ఎకరాకు 4,840 గజాలు. వుడా(విజయవాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నిబంధనల ప్రకారం ప్రభుత్వమే జోనింగ్ చేసి లేఔట్ వేస్తే 35 శాతం రోడ్లు, మార్టిగేజ్, ఇతర మౌలిక అవసరాలకు పోతుంది. అంటే ఎకరాకు వచ్చే 4,840 గజాల్లో 1,694 గజాలు మౌలిక వసతులకు పోతుంది. రైతుకు 3,146 గజాలు మిగులుతుంది. ఇందులో రైతులు తన ఇష్టానుసారం నిర్మాణమో, వ్యాపారమో, వ్యవసాయమో చేసుకునేవారు. ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూములకు జరీబు, మెట్ట భూములుగా లెక్కించి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

జరీబు భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ కలిపి 1,450 గజాలు, మెట్ట భూములకు 1,200 గజాలు మాత్రమే రైతులకు దక్కుతుందని ప్రకటించింది. పైగా ప్రభుత్వం పరిహారం కింద అందించే భూమిని ఎక్కడ ఇస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు సీడ్ కేపిటల్ ప్లానింగ్‌లో రైతు తనకు కేటాయించిన భూమిలో స్వయంగా వాణిజ్య సముదాయాన్ని గానీ, నివాసాన్ని గానీ నిర్మించుకోలేని దుస్థితి కల్పించింది. భవన సముదాయాలు(అపార్టుమెంట్లు) నిర్మించుకోవాలని తేల్చి చెప్పింది. ఇలాంటి పెద్ద నిర్మాణాలను రైతులు స్వయంగా నిర్మించుకోలేరు కాబట్టి, డెవలపర్‌ను ఆశ్రయించాల్సిందే.

అదే జోనింగ్ చేస్తే రాజధాని నిర్మాణం వల్ల ఒనగూరే గరిష్ట ప్రయోజనం నేరుగా రైతుకే దక్కుతుంది. రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసినందుకు ఫలితమూ దక్కుతుంది. ఎకరా లేఔట్‌కు పోనూ మిగిలే 3,146 గజాల్లో 70 శాతం రైతుకు, 30 శాతం డెవలపర్‌కు వాటా నిష్పత్తిగా రైతుకు అదనపు ప్రయోజం కలిగేది. ఈ వాటా నిష్పత్తి ప్రకారం 3,146 గజాల్లో 70 శాతం అంటే 2,202 గజాలు రైతుకు, 943 గజాలు డెవలపర్‌కు దక్కుతుందన్నమాట.

రోజూ భోంచేసి నిరాహారదీక్ష చేశా రా?


7 నుంచి వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
చంద్రబాబు 2010లో హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో నిరాహార దీక్ష ఎలా చేశారు? ప్రతిపక్ష నేతగా, సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఈ మాత్రం తెలియ దా..’ అని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో చేసిన దీక్షలు చావడం కోసమే చేశా రా? లేక రోజూ భోంచేసి నిరాహారదీక్ష చేశా రా? అని బొత్స తీవ్రంగా మండిపడ్డారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి  భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ ఇతర నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 చంద్రబాబు దీక్షలు ఎలా చేశారు?
 ‘చస్తానని దరఖాస్తు చేసుకుంటే అనుమతివ్వాలా? దీక్ష చేయడం చట్టబద్ధం కాదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ‘నిరవధిక నిరాహారదీక్ష చేయడమనేది చట్టబద్ధం కాదా?

హోదా కోసం దీక్ష చేయాల్సింది రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో అని బాబు చెప్పడం పిచ్చి మాటలని, తమ పార్టీ ముందుగా ఢిల్లీలో ధర్నా చేసిన విషయం ఆయనకు తెలియదా.. అని ఢిల్లీలో జగన్ చేసిన దీక్షను బొత్స గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల కోసం, నిరుద్యోగ యువత భవిత కోసం ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందుల ను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమని అం దుకే దీక్ష విషయంలో ఒక మెట్టు దిగి ప్రదేశాన్ని వేరే చోటుకు మార్చుకుంటున్నామని చెప్పారు. పోలీసులు చెప్పిన విధంగా ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషిస్తున్నామని వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనుమతిని ఇవ్వాలన్నారు.

 రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు: సీఎంపై అనంత ధ్వజం
 రాష్ట్రం 16 నెలల పసిపాప అని చెబుతున్న సీఎం చంద్రబాబు ఆ పసిపాప ఏమీ చేయలేదని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శిం చారు. రాజధాని పేరుతో బాబు  రైతుల నుంచి లాక్కున్న భూములను సింగపూర్ ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసి తద్వారా ఇక్కడ పచ్చచొక్కాలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం 2014-15లో కేంద్రం రూ.1,500 కోట్లు ఇస్తే  ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు.హోదా కోసం ప్రధాని మోదీపైఒత్తిడి తేవాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఈ వ్యవహారాన్ని జగన్‌తో సహా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నందుకే బాబు అందరిపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.

Popular Posts

Topics :