04 October 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్ దీక్షకు మునుకోటి కుటుంబం మద్దతు

Written By news on Saturday, October 10, 2015 | 10/10/2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తిరుపతిలో ఆత్మాహుతి చేసుకున్న మునుకోటి కుటుంబసభ్యులు.. ఇప్పుడు అదే డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు.

మునుకోటి ఆత్మహత్యపై ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన పాపాన పోలేదని వాళ్లు అన్నారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే తమను పరామర్శించారన్నారు. జగన్ దీక్షకు తాము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.

జగన్ దీక్షను పట్టించుకోకపోవడం శోచనీయం

కడప : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేపట్టిన పాదయాత్ర శనివారం కడప చేరింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 22వ తేదీన రాజధాని శంకుస్థానకు వస్తున్న ప్రధాని మోదీ పై అఖిల పక్షం తరఫున ప్రత్యేక హోదాపై ఒత్తిడి తీసుకోద్దామని ప్రతిపక్ష పార్టీలకు రామకృష్ణ సూచించారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ... ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అక్టోబర్ 8వ తేదీన అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ నెల 20న శ్రీకాకుళం జిల్లాలో పూర్తి కానుంది.

దీక్షకు సీపీఎం సంఘీభావం


చంద్రబాబు గురించి మాట్లాడకపోతే పొరపాటే..
గుంటూరు : ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహార దీక్షకు సీపీఎం సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం వైఎస్ జగన్ దీక్షా స్థలిని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు అలవికాని వాగ్దానాలు ఇచ్చి...అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తుంగలోకి తొక్కిన ఘటన చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుకోకపోవటం చాలా పొరపాటు     అవుతుందని, ముఖ్యమంత్రిగా ఆయనకు కనీసం నిజాయితీ కూడా లేదని విమర్శించారు. అప్పట్లో ప్రత్యేక హోదా తెస్తానన్న బాబు...ఇప్పుడు ప్యాకేజీతో సరిపెడతానంటున్నాడని మధు ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఓ రోజు అయితే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడో ఆ రోజే రాష్ట్రంలోని రైతులకు కష్టాలు మొదలైయ్యాయని మధు మండిపడ్డారు. ఏపీ రాజధాని శంకుస్థాపన అదిరిపోవాలంటున్న చంద్రబాబు....  రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ఎలా అదిరగొట్టాడో అందరం చూశామని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ చేయటానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు ...రాజధాని శంకుస్థాపనకు మాత్రం రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని  మధు నిప్పులు చెరిగారు. ఇదంతా ఎవడబ్బ సొమ్మని సభా ముఖంగా చంద్రబాబును నిలదీశారు.

ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం ....

గుంటూరు: 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినపుడు నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాని చెప్పాను. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరకు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలని, ప్రజలందరికీ మేలు జరగాలని నిరవధిక దీక్ష చేస్తున్నాడు. మీరు నా బిడ్డను ఆశీర్వదించండి' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. శనివారం గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులో దీక్ష శిబిరాన్ని సందర్శించి వైఎస్ జగన్ ను పరామర్శించారు. అనంతరం వేదికపై నుంచి వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. వైఎస్ విజయమ్మ ఇంకా ఏమన్నారంటే..
 
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు
  • ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని వెంకయ్యనాయుడు కోరారు
  • పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండాపోయింది
  • కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు
  • ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వస్తాయి.. అందరికీ మేలు జరుగుతుంది
  • ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు
  • ఇప్పుడేమో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అంటున్నారు
  • వచ్చే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు
  • దీనికి ఎవరు గ్యారెంటీ?
  • దివంగత నేత వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేయలేదు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఎందుకు పోరాడటం లేదు?
  • చంద్రబాబు పరిశ్రమలు తెస్తానంటూ విదేశాలు తిరుగుతున్నారు
  • విమానాశ్రయాలతో పేరుతో పేదల భూములు లాక్కొంటున్నారు
  • చంద్రబాబు ఎన్నికల హామీలను విస్మరించారు

వైఎస్ జగన్ ఆరోగ్యంపై విజయమ్మ ఆందోళన


వైఎస్ జగన్ ఆరోగ్యంపై విజయమ్మ ఆందోళనవీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరిన విషయం తెలిసిందే.  వైఎస్ విజయమ్మ శనివారం దీక్ష స్థలికి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.  కాగా దీక్ష కారణంగా వైఎస్ జగన్ నీరసంగా కనిపిస్తున్నారని, ఆయన పల్స్ రేటు కూడా గంట గంటకు పడిపోతోందని వైద్యులు తెలిపారు.

మరోవైపు వైఎస్ జగన్‌ చేస్తున్న దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలుచోట్ల ప్రజలు, నేతలు... స్వచ్ఛందంగా దీక్షకు మద్దతుగా దీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకహోదా కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందంటున్నారు విద్యార్థినిలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక దీక్షకి కూర్చున్న ఆయనను పలువురు విద్యార్థినీ విద్యార్థులు కలిసి సంఘీభావం తెలిపారు.

YS Jagan's Indefinite Deeksha Enters 4th Day

జగన్ దీక్షకు వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతు



ఉద్యమిస్తున్న ఏపీ
జగన్ దీక్షకు వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతు

 గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి:  ‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. శుక్రవారం మూడో రోజుకు చేరుకున్న ఆయన దీక్షా శిబిరానికి జనం వెల్లువెత్తారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో దీక్ష చేస్తున్న జగన్‌ను పలకరించి, తమ మద్దతు ప్రకటించడానికి ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. గుంటూరు నగరంలో ఏకంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనా లెక్కచేయకుండా మహిళలు, యువకులు, వృద్ధులు తండోపతండాలుగా దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ప్రత్యేక హోదా కోసం మేమూ మీతో ఉన్నామంటూ... జగన్‌తో చేతులు కలిపి తమ పోరాట స్ఫూర్తిని చాటారు.

విద్యార్థినీ, విద్యార్థులు, నిరుద్యోగ యువకుల కోలాహలం దీక్షా వేదిక వద్ద ఎక్కువగా కనిపించింది. శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో రావడం ఆకట్టుకుంది. జగన్‌ను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉత్సాహం ప్రదర్శించారు. జగనన్నతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు తాపత్రయపడ్డారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు కూడా తరలి వచ్చారు. నిరాహారదీక్షకు ఉపక్రమించి మూడు రోజులైనా జగన్ ఓర్పుతో నిర్విరామంగా తనకు మద్దతు తెలపడానికి వచ్చిన వారందరినీ పలుకరించారు.

నల్లపాడు రోడ్డుకు ఓ వైపు నుంచి సత్తెనపల్లి, పల్నాడు ప్రాంతమైన నర్సారావుపేట, మాచెర్ల, గురజాల నియోజకవర్గాలు, మరోవైపు నుంచి గుంటూరు నగరంతో సహా పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. దీక్షా శిబిరం వైపునకు వచ్చే వాహనాలు, ముఖ్యంగా ఆటోలు ప్రయాణికులతో క్రిక్కిరిసి పోయాయి. జనం ఊరేగింపులుగా రావడం, ఆటోలు, వాహనాల రాకపోకల రద్దీతో దీక్షా శిబిరానికి అన్ని వైపులా ట్రాఫిక్ నిదానంగా ముందుకు సాగింది.

నిరాహారదీక్ష ప్రారంభమైన తొలి రోజున (బుధవారం) పెద్ద సంఖ్యలో గుంటూరుకు తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ మరుసటి రోజు నుంచీ తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రత్యేక హోదా సాధన ఉద్యమానికి మద్దతుగా స్థానికంగా రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులతో రాష్ట్రవ్యాప్తంగా హోదా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. విద్యార్థి, యువజన సంఘాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. విద్యావేత్తలు స్వచ్ఛందంగా జగన్ దీక్షకు తమ మద్దతు ప్రకటించి, ప్రత్యేకహోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమని జగన్ చేస్తున్న వాదనతో గొంతు కలుపుతున్నారు. 

 చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో..
 మూడు రోజులుగా ఆహారం లేకపోయినా ఆయన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ శిబిరంలోనే కూర్చుని జనంతో గడిపారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని, దీక్ష చేయడం పూర్తిగా సమర్థనీయమని ఆయన జగన్‌తో చెప్పారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు జగన్‌ను కలిసి దీక్షకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలున్నా భర్తీ చేయడంలేదని, త్వరగా నోటిఫికేషన్లు విడుదయ్యేలా ఒత్తిడి తేవాలని ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లడుగు గోవిందరాజు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూట ర్ విద్యను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం ద్వారా 12,600 మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంప్యూటర్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జగన్‌తో తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు.

 వేలల్లో సెల్ఫీలు...
 వేలాదిగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన జనం జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. యువతీయువకులు, విద్యార్థినీ, విద్యార్థులు, గృహిణులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో జగన్ పక్కన కూర్చుని సెల్ఫీలు తీసుకుని సంతోషించారు. ఇలా సెల్ఫీలు తీసుకున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ప్రతి ముగ్గురేసి సందర్శకుల్లో ఒక్కరైనా సెల్ఫీ తీసుకున్నారు. కొందరు మహిళలైతే తమ పిల్లా పా పలతో జగన్‌తో ఫొటోలు తీయించుకున్నారు.

 పార్టీ నేతల సంఘీభావం..
 పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యన్నారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి), ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కోనా రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్వేశ్వరరావు, రక్షణనిధి, పాయం వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు శిబిరానికి వచ్చి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు.

 యువత కోసమే జగన్ దీక్ష
  దీక్షా వేదికపైనుంచి శుక్రవారం పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించి  రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోరుతూ విపక్షనేత జగన్ చేపడుతున్న నిరవధిక దీక్ష లక్ష్యాన్ని, హోదా అవశ్యకతను సభికులకు వివరించారు. ఇలా దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జగన్ చేపట్టిన దీక్ష యువత భవితకోసమేనన్నారు. వారి కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయడం లేదన్నారు.విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయాల్సిందిగా రాజంపే ఎంపీ మిథున్ రెడ్డి తన ప్రసంగంలో కోరారు.రాష్ర్ట భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ప్రత్యేక హోదా సాధించాల్సిన అవసరమని ఘట్టమనేని శేషగిరిరావు అన్నారు. జగన్ దీక్షకు మద్దతు ప్రకటించి ఆయన బాటలో అందరూ ఉద్యమంలో పాల్గొనాలనీ అన్నారు.

హోదా కోసం నినదిస్తున్న రాష్ట్రం
  సాక్షి, విజయవాడ బ్యూరో:  ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అయ్యింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహారదీక్షతో ఉద్యమం విస్తరిస్తోంది. గుంటూరులో ఆయన చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతుగా నిలిచేం దుకు రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి వైఎస్సార్ పార్టీ శ్రేణులు, ప్రజలు, విద్యార్ధులు కదిలివస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్ష శుక్రవారం మూడవ రోజుకు చేరడంతో రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లోను ధర్నాలు, రాస్తారొకోలు, బైక్‌ర్యాలీలు, కేంద్ర కార్యాలయాల ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

 జగన్‌కు వైద్య పరీక్షలు
  బీపీ, షుగర్, పల్స్ సాధారణ స్థితిలోనేనన్న వైద్యులు
 గుంటూరు మెడికల్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారానికి మూడో రోజుకు చేరుకుంది. తొలిరోజు బుధవారం ఎలాంటి పరీక్షలు చేయలేదు. రెండోరోజు గురువారం జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేశారు. శుక్రవారం ఉదయం జీజీహెచ్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శనక్కాయల ఉదయ్‌శంకర్ వైద్య పరీక్షలు చేయగా, రాత్రి మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రీస్తుదాసు వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 9.55 గంటల సమయంలో బీపీ 110/70, షుగర్ 94, పల్స్ 80 ఉండగా, రాత్రి 7.40 గంటల సమయంలో బీపీ 130/80, షుగర్ 88, పల్స్ 66 ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్, పల్స్ అన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉన్నట్లు జీజీహెచ్ ఆర్‌ఎంవో డాక్టర్ అనంత శ్రీనివాసులు వెల్లడించారు.

వైఎస్ జగన్ బాగా నీరసించారు: వైద్యులు


వైఎస్ జగన్ బాగా నీరసించారు: వైద్యులు
గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి నాలుగోరోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆయనకు జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీక్ష కారణంగా వైఎస్ జగన్ బాగా నీరసించిపోయారని, పల్స్ రేటు గంట గంటకు పడిపోతుందని తెలిపారు.

నాలుగోరోజుకు చేరిన వైఎస్ జగన్ నిరవధిక దీక్ష

గుంటూరు:  ‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శనివారం నాలుగోరోజుకు చేరింది. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. విద్యార్థినీ, విద్యార్థులు, నిరుద్యోగ యువకుల కోలాహలం దీక్షా వేదిక వద్ద ఎక్కువగా కనిపిస్తోంది. బీపీ, షుగర్, పల్స్ సాధారణ స్థితిలోనే ఉన్నాయని శుక్రవారం రాత్రి వైద్యులు వెల్లడించారు. విద్యావేత్తలు స్వచ్ఛందంగా తమ మద్దతు ప్రకటించి, ప్రత్యేకహోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న వైఎస్ జగన్ అభిప్రాయంతో గొంతు కలుపుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను ధర్నాలు, రాస్తారొకోలు, బైక్‌ర్యాలీలు, కేంద్ర కార్యాలయాల ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులోని నల్లపాడులో బుధవారం నాడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన విషయం అందరికి విదితమే.

Y S Jagan Fight For People Problems

Written By news on Friday, October 9, 2015 | 10/09/2015

వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు


వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు
గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజులనుంచి దీక్ష చేస్తున్న జగన్‌ బాగా నీరసించారు.  ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని, కాకపోతే  బీపీ, షుగర్ (బీపీ: 110/70, షుగర్ లెవల్స్ : 94 ఎంజీ, పల్స్: 80) నార్మల్ గానే ఉన్నాయన్నారు. వెయిట్ లాస్ కూడా లేదని, కొంతవరకూ స్టేబుల్ గా ఉన్నట్లు చెప్పారు. అయితే దీక్ష ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 

కాగా గుంటూరు నల్లపాడు రోడ్డులో బుధవారం మధ్యాహ్నాం 2గంటల 15 నిమిషాలకు వైఎస్‌ జగన్‌ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వెల్లువలా వస్తున్న జనాన్ని పలకరిస్తూనే ఉన్నారు. మద్దతు తెలిపేందుకు దీక్షవేదిక వద్దకు ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. గంటగంటకూ పెరుగుతన్న జనం...ఆయన దగ్గర వచ్చేందుకు చేయి కలిపేందుకు ఉత్సాహం చూపటంతో అదుపు చేయటం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.

రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం


రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోందని వ్యాఖ్య

 
హైదరాబాద్: రైతులు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 10న రాష్ట్ర బంద్‌లో వైఎస్సార్‌సీపీ పాల్గొంటుందని పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు గతంలో కామారెడ్డిలో పార్టీ ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల పక్షాన నిలిచి బంద్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతలవారీగా చేయడం వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. అసెంబ్లీలో రైతుల పక్షాన నిలిచి ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీతో సహా ఇతర ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేసిందని మండిపడ్డారు.

గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కె.శివకుమార్, బీష్వ రవీందర్‌లతో కలిసి పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల పాపాలే తమకు శాపాలుగా మారాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల సందర్భంగా, తర్వాత ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పూర్తి చేయకపోవడం వల్లనే రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్ హయాంలో రైతు కుటుంబం యూనిట్‌గా గిట్టుబాటు ధరలు, ఉచిత విద్యుత్, ఇతర ప్రయోజనాలతోపాటు వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య, ఆరోగ్య సేవలు అందించారని, 2004 ముందు వరకు జరిగిన ఆత్మహత్యలను అరికట్టగలిగారన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

జననేత దీక్షకు వెల్లువెత్తిన మద్దతు

సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. రాష్ర్టవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఊరూవాడా ఏకమై ఉద్యమబాట పట్టాయి. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అంటూ దీక్షకు సంఘీభావంగా ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని ప్రజలు నినదిస్తున్నారు. హోదా సాధనకు కట్టుబడి రాష్ట్రాభివృద్ధికోసం ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు నల్లపాడు బాట పట్టారు. రెండోరోజైన గురువారం ఉదయంనుంచే దీక్షా శిబిరంవద్ద జనం పోటెత్తారు.
 
 బుధవారం రాత్రి శిబిరంలోనే పడుకున్న జగన్ ఉదయాన్నే తన స్థానంలో యథావిధిగా కూర్చున్నారు. అప్పటినుంచి వచ్చిన వారందరితో చేయి కలుపుతూ, అభివాదం చేస్తూ, పలకరిస్తూ గడిపారు. తమకోసం, తమ భవిష్యత్తుకోసం ప్రత్యేకహోదా కావాలని కృషిచేస్తున్న జగన్‌కు పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ ఉద్యోగాలకోసం తపిస్తున్న జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీయువకులు ఎగబడ్డారు. ఆ సెల్ఫీలను అక్కడికక్కడే సోషల్ నెట్‌వర్క్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా సంఘీభావం ప్రకటించారు.
 
మద్దతు తెలిపిన నేతలు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో దీక్షా ప్రాంగణానికి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షకోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అభినందించారు. హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలా ఉధృతం చేయాలని గద్దె పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఢిల్లీలో ఆశాభావం వ్యక్తంచేశారు.
 రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కొందరు తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌కు వివరించారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు, ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం కోసం రైతులు, ఇతర వర్గాలను ఇబ్బంది పెడుతున్నట్లు వివరించారు. వాటన్నింటినీ విన్న జగన్ ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను వివరించి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు నగర పాలక సంస్థ ఉద్యోగులు కూడా తాము పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గుంటూరుకు చెందిన న్యాయవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

 పారిశ్రామికవేత్తల సంఘీభావం

 ప్రత్యేక హోదాకోసం జగన్ నిరవధిక దీక్షపై పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకహోదా అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుందని ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్ జేఏ చౌదరి చెప్పారు. గతంలో ఐటీ రంగానికి పదేళ్లపాటు పన్ను రాయితీలు కల్పించడంవల్లే ఆ రంగం వేగంగా విస్తరించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా వస్తే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెడతారని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. హోదాపై స్పష్టత ఇవ్వకపోవడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ చిట్టూరి ఆందోళన వ్యక్తంచేశారు.

హోదాతోనే ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమని విశాఖ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న రాయలసీమలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందని ఫ్యాప్సియో రాష్ట్ర అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని రాయలసీమ గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ఉపాధ్యక్షుడు పి.సతీష్‌కుమార్ ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, దీనికోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం, ప్రభుత్వ వైఖరిపై గురించి చేసిన ఉపన్యాసాలతో ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్ష జరుగుతున్న నల్లపాడు ప్రాంగణం హోరెత్తింది. దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
 
 సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం
 అరండల్‌పేట (గుంటూరు): ప్రత్యేక హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువత, విద్యార్థులు, మహిళలు, ఉత్సాహం చూపుతున్నారు. గురువారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, మహిళలు జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తరలి వచ్చారు. వీరు జగన్‌కు సంఘీభావం తెలపడంతోపాటు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. వీరి ఉత్సాహాన్ని గమనించిన జగన్ సెల్ఫీలు దిగేందుకు వారికి అవకాశం కల్పించారు. చాలా మంది యువకులు వారు దిగిన సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేశారు. దీంతో వారి స్నేహితులు, బంధువులు, లైక్‌లు కొట్టడంతోపాటు, జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేయడం అభినందనీయమని కామెంట్లు పెడుతున్నారు.
 
 ఈతరం నేతకు ఇంటర్నెట్‌లో నీరాజనం
 సాక్షి, హైదరాబాద్: ఈతరం విద్యార్థుల కోసం, ఈతరం యువత కోసం పోరాడుతున్న ఈతరం నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇంటర్నెట్‌లో యువతరం నీరాజనాలు పడుతోంది. ప్రత్యేకహోదా అంశంపై యువతీయువకులు జగన్ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దీక్షా శిబిరంవద్ద కలసిన యువతీయువకులు తీసుకున్న సెల్ఫీలు, మరోవైపు జగన్‌కు మద్దతుగా ప్రపంచం నలువైపుల నుంచి తెలుగు వాళ్లు పంపుతున్న సెల్ఫీ వీడియోలతో తెలుగు వాళ్ల ఫేస్‌బుక్ పేజీలు నిండిపోయాయి. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా రెండోరోజూ ఇంటర్నెట్‌లో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ దీక్షతో ఇంటర్నెట్‌లో ‘ప్రత్యేకహోదా’ అంశంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా దక్కితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి, అవకాశాలు విస్తృతమయ్యే విధానం గురించి నెటిజన్లు పోస్టుల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగావకాశాల కోసం వేచి ఉన్న యువత జగన్‌కు మద్దతు పలకడం తమ బాధ్యతగా తీసుకున్నారు.  

 ఎన్‌ఆర్‌ఐల నుంచి వెల్లువెత్తిన మద్దతు
 ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్‌మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. సెల్ఫీ వీడియోల ద్వారా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారిలో ప్రవాసులే ఎక్కువమంది ఉన్నారు. తొలిరోజు మొదలైన ఈ ట్రెండ్ రెండో రోజుకు మరింత విస్తృతమైంది.  ఒకవైపు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ఉద్యమిస్తుంటే.. ఆయనపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు, మంత్రులపై నెటిజన్లు మండి పడుతున్నారు. వ్యంగ్యాస్త్రాలతో తెలుగుదేశం నేతలను ఎద్దేవా చేస్తున్నారు.  
 
 ఆ చిన్నారి పేరు విజయమ్మ..
 గుంటూరు రూరల్: ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారంనాడు ఊహించని అభిమానం ఉక్కిరిబిక్కిరి చేసింది. పొత్తిళ్లలో ఓ పసిబిడ్డను తీసుకువచ్చిన తల్లిదండ్రులు పేరుపెట్టాల్సిందిగా జగన్‌ను అభ్యర్థించారు. తమ బిడ్డను జగన్ చేతుల్లో ఉంచారు. గుండెల నిండా పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, విజయమ్మగారన్నా మీరన్నా మాకు ఎంతో అభిమానమని వారు జగన్‌కు వివరించారు. తమ బిడ్డకు విజయమ్మ పేరు పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. నెలరోజుల వయసు ఉన్న ఆ పాపకు విజయమ్మ అని జగన్ నామకరణం చేశారు. ఆ జంట గుంటూరు రూరల్ మండలంలోని స్వర్ణభారతి నగర్ కాలనీకి చెందిన షేక్ నాగుల్, మస్తాన్‌బీ. తమ కాలనీ వాసులతో కలసి జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తమను అభిమానిస్తున్న, ఆరాధిస్తున్న ఆ జంటకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
 
 వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు
 ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. 24 గంటలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుండటంతో రెండో రోజు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు.  ఉదయం 10.30 గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ షర్మిల పరీక్షలు చేయగా రాత్రి 8.30 గంటలకు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ వైద్య పరీక్షలు చేశారు. ఉదయం బీపీ 120/80 ఉండగా రాత్రి 130/90 ఉంది. ఉదయం షుగర్ 91 ఉండగా రాత్రి 85 ఉంది. బీపీ, షుగర్‌లు సాధారణంగా ఉన్నట్లు పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు.

Popular Posts

Topics :