18 October 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మాయమాటలకు రూ.400 కోట్లు

Written By news on Saturday, October 24, 2015 | 10/24/2015


'మాయమాటలకు రూ.400 కోట్లు'
కర్నూలు: ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాటవేత ధోరణిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మండిపడ్డారు. మోదీ, బాబులు ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.
బాబు, మోదీలు మాయమాటలు చెప్పడానికి రూ.400 కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను నాయకులు మరచిపోయారని, రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించకపోవడం శోచనీయమని భూమా అన్నారు.

ఆ నివేదికలో ఏముందో చెప్పండి


'చంద్రబాబు.. ఆ నివేదికలో ఏముందో చెప్పండి'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పంపిన నివేదికలో ఏముందో బయటపెట్టాలని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు పంపిన నివేదికలో ప్రత్యేక హోదా అంశం ఉందో లేదో ప్రధాని కార్యాలయం నుంచి వివరణ ఇప్పించాలని కోరారు. శనివారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుకుంటుందో ముందే వివరణ అడుగుతారని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రధానిని ప్రత్యేక హోదా అడగబోయి తడబాటుతో ప్రత్యేక ప్యాకేజీ అడిగానంటూ చంద్రబాబు చెప్పారని, ఆయన ఎందుకిలా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను ఎన్నిరోజులు ఇబ్బందిపెడతారని నిలదీశారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం లాలూచీ పడకుండా, ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేకపోతే ప్రజలు క్షమించరని అన్నారు.  సొంత పార్టీ నేతలే చంద్రబాబును విమర్శిస్తున్నారని, ఇప్పుడు కూడా రెండు కళ్ల సిద్ధాంతమేనా అని బొత్స ప్రశ్నించారు.

అందుకే కేసీఆర్ ను అందలం ఎక్కించారు


అందుకే కేసీఆర్ ను అందలం ఎక్కించారు
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడిపై ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రధాని నరేంద్ర మోదీ చేత చంద్రబాబు మట్టి, నీళ్లు తెప్పించారని ఆయన శనివారం ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చంద్రబాబు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని  వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే కేసీఆర్ ను చంద్రబాబు అందలం ఎక్కించారని వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో చెరుకు పంటలు తగులపెట్టడంపై విచారణ జరిపేందుకు తమ పార్టీ తరపున ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా  శుక్రవారం గుర్తు తెలియని దుండగులు... రైతు గద్దె చంద్రశేఖర్‌ చెరకు పంటను తగలబెట్టారు. ఐదు ఎకరాల్లో ఉన్న చెరకును నాశనం చేశారు. మల్కాపురంలో ఈ ఘటన జరిగింది. రెండు ఎకరాల్లో చెరకు పంట పూర్తిగా, మూడు ఎకరాల్లో పాక్షికంగా ధ్వంసమైంది. రైతు చంద్రశేఖర్‌ ల్యాండ్‌ పూలింగ్‌లో రాజధానికి భూములు ఇవ్వలేదు. దీంతో కక్ షకట్టే ఈ చర్యకు పాల్పడి ఉంటారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్టీసీ చార్జీల బాదుడు


ఆర్టీసీ చార్జీల బాదుడు
- పల్లె ప్రజలపై 5 శాతం భారం
- డీలక్స్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ ప్రయాణికులపై 10 శాతం వడ్డన
- అర్ధరాత్రి నుంచి అమల్లోకి
- తెలుగు వెలుగు బస్సులో కిలోమీటరుకు
- 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులో 8 నుంచి 9 పైసలు పెంపు
- ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల భారం
- స్టూడెంట్ బస్సు పాస్‌ల చార్జీలు యథాతథం
- చార్జీలు పెంచబోమన్న ఎన్నికల హామీలు తుంగలోకి తొక్కిన బాబు సర్కారు
- డీజిల్ ధరలు తగ్గుతున్నా, ఆర్టీసీ చార్జీలు పెంచడంపై సర్వత్రా విస్మయం
- డిసెంబర్ 31లోగా జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లకు కొత్త హంగులు

సాక్షి, విజయవాడ :
 ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ప్రభుత్వం చార్జీల భారం మోపింది. వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపన, దసరా పండుగ ముగిసీ ముగియగానే ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల దెబ్బ వేసింది. రాష్ట్రంలో చార్జీలు పెంచబోమని గత ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

ప్రజలపై భారం మోపబోమంటూ అప్పట్లో చంద్రబాబు ఊరూ వాడా తిరిగి హామీ ఇచ్చారు. దానిని విస్మరించి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి చార్జీల భారం మోపారు. కొద్ది నెలల క్రితం బస్సు చార్జీలను పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం కారణంగా పంటలు పండక, కరువు పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మరోసారి చార్జీలను పెంచింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి, డీజిల్ ధరలు తగ్గుతుండగా, రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే తెలుగు వెలుగు, డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల చార్జీలను పెంచింది. అత్యంత ధనికులు మాత్రమే ప్రయాణించే వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెరిగిన చార్జీల వివరాలను వెల్లడించారు. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తెలుగు వెలుగు బస్సుల చార్జీలను ప్రస్తుతం ఉన్న రేటుపై 5 శాతం అంటే కి.మీ.కు 3 పైసలు పెంచామని చెప్పారు.

ఎక్స్‌ప్రెస్,  డీలక్స్ బస్సులకు ప్రస్తుతం ఉన్న చార్జీలపై 10 శాతం అంటే 8 నుంచి 9 పైసలు పెంచామని వెల్లడించారు. ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల చార్జీలను కూడా 10 శాతం పెంచినట్లు తెలిపారు. వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు ఉపయోగించుకుంటున్నారని, అందువల్ల వాటి చార్జీలు పెంచలేదని తెలిపారు. పెరిగిన చార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.300 కోట్ల భారం పడుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.595 కోట్లు నష్టం వచ్చిందని, దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల మరో రూ.660 కోట్లు ఆర్థిక భారం పడిందని ఎండీ వివరించారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రయత్నించామని, అయినప్పటికీ రూ.1,200 కోట్లకు పైగా నష్టం రావడంతో ప్రజలపై భారం మోపక తప్పలేదని చెప్పారు. ఆర్టీసీ ఆఖరుసారిగా 2013 నవంబర్‌లో చార్జీలు పెంచిందని వివరించారు.

ఆర్టీసీని ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో 14,000 గ్రామాలకు సేవలందిస్తోందని వివరించారు. విద్యార్థుల బస్ పాస్‌లకు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.280 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంటుందని, మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ విధించడం వల్ల ఆర్టీసీపై ఏడాదికి రూ.395 కోట్లు భారం పడుతోందని వెల్లడించారు. దీన్ని మాఫీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. గతంతో పోల్చితే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగిందని, గతంలో 52 శాతం ఉండగా, ప్రస్తుతం 72 శాతానికి చేరిందని చెప్పారు. కొన్ని బస్సుల్లో నూరు శాతం ఉండగా, కొన్నింటిలో 44 శాతం కంటే పెరగడం లేదని చెప్పారు.

'హంగామా, భూదందాకు వ్యతిరేకం

Written By news on Monday, October 19, 2015 | 10/19/2015


'హంగామా, భూదందాకు వ్యతిరేకం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరపు ఆడంబరాలు చేస్తున్నారని విమర్శించారు.  వైఎస్సార్ సీపీ నేతలు పార్థసారధి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
 • ఆహ్వానపత్రికలు పంపొద్దని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 అంశాలతో బహిరంగ లేఖ రాశారు
 • వీటిలో ఒక్కదానికి కూడా ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేదు
 • ప్రశ్నించిన మమ్మల్ని మంత్రులు నోటికి వచ్చినట్టు తిట్టారు
 • రాష్ట్రానికి రాజధాని అవసరం, దానికి మేము వ్యతిరేకం కాదు
 • శంకుస్థాపన పేరుతో చేస్తున్న దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం
 • మీరు చేస్తున్న హంగామా, భూదందాకు వ్యతిరేకం
 • రాష్ట్రాన్ని సింగపూర్ కు తాకట్టు పెడుతున్న కార్యక్రమానికి వచ్చి సాక్షి సంతకాలు పెట్టాలా?
 • ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరపు ఆడంబరాలు చేస్తున్నారు
 • మాతో పాటు సీపీఎం, లోక్ సత్తా పార్టీలు కూడా ఇదే మాట చెబుతున్నాయి
 • ఇప్పుడే ప్రతిపక్ష పార్టీలు గుర్తుకు వచ్చాయా?
 • భూమి పూజ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు పిలవలేదు
 • బలవంతపు భూసేకరణ వద్దని చెప్పినా పట్టించుకోలేదు
 • కేసీఆర్ తో చంద్రబాబు ఏం చర్చించారో చెప్పాలి

Popular Posts

Topics :