25 October 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

Written By news on Saturday, October 31, 2015 | 10/31/2015

 కువైట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో వక్తల పిలుపు

కడప కార్పొరేషన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలని ఆ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కువైట్‌లోని సాల్మియా ప్రాంతంలో ఉన్న అవంతీ ప్యాలెస్‌లో శనివారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు.

ప్రత్యేక హోదా వస్తే కొత్త పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిసినా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి మాట్లాడుతూ విభజనకు ముందు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడింది, ప్రస్తుతం ప్రజా సమస్యలపై, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సమావేశంలో కువైట్ ప్రతినిధి ఫయాజ్, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎం. మహేష్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, సయీద్ నజర్, షేక్ ఇనాయత్, రామచంద్రారెడ్డి, సురేష్‌రెడ్డి, రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి


రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక పోరుకి సిద్ధమైన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ....అభ్యర్ధి  ఎంపిక కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అభ్యర్ధి ఎంపికపై నేతలందరితో సమాలోచనలు జరిపి, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ....పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రచారానికి వైఎస్ జగన్‌తో పాటు ఆయన సోదరి షర్మిల వస్తారని తెలిపారు.  కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలే ఆయుధంగా ....ఎన్నికల బరిలో దిగుతామన్నారు.

ఉక్కుమనిషికి సెల్యూట్: వైఎస్ జగన్


ఉక్కుమనిషికి సెల్యూట్: వైఎస్ జగన్
హైదరాబాద్: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. భారత ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ కు సెల్యూట్ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

.

కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేరా?


కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘ప్రత్యేకహోదాపై గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగుతుందని పార్లమెంటు సాక్షిగా రాతపూర్వకంగా సమాధానమిచ్చింది.

కానీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వబోమని నేడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనీసం ఒత్తిడి తీసుకురాకపోవడం తప్పు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులను అలానే కొనసాగించడం మరో తప్పు. కనీసం అరుణ్ జైట్లీ ప్రకటనను ఖండిస్తూ ప్రకటన కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రి ఉండటం శోచనీయం’ అని జగన్ ట్వీట్ చేశారు.

ప్రజా సమస్యలపై పోరుబాట


ప్రజా సమస్యలపై  పోరుబాట
పార్టీ నేతలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్ సమావేశంలో పలు నిర్ణయాలు
భూ సేకరణపై న్యాయపోరాటానికి సమాయత్తం
ధరల నియంత్రణ కోరుతూ సోమవారం ధర్నాలు
సాగునీటి సరఫరాకు అధికారులపై ఒత్తిడికి నిర్ణయం

 
 గుంటూరు : జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగానే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, సాగునీటి కొరత, రాజధానిలోని భూ సేకరణ వంటి ముఖ్య అంశాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో గుంటూరు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో భూ సేకరణ
 విషయంలో న్యాయ పోరాటం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

 ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనం వ్యయం
 నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ధరల తగ్గుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

రైతుల పక్షాన ఆందోళనలు...
జిల్లాలో సాగునీటి కొరత కారణంగా రైతాంగం అనేక ఇబ్బందులు పడుతోంది. పల్నాడులో పత్తి, మిరప, ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయాయి. డెల్టాలో సాగునీటి సరఫరా లేక పొట్ట దశకు వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు  డీజిల్ ఇంజిన్ల సాయంతో కాల్వలోని నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని  సాగునీటి విడుదలకు జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు, అవసరమైతే ఇతర కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని గ్రామాల్లో భూ సేకరణ చేయనున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని రైతుల పక్షాన ఆందోళనలు, న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ నాయకులు కత్తెర సురేష్‌లు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తదితరులు జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.

రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం

Written By news on Friday, October 30, 2015 | 10/30/2015


ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూసేకరణపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో గుంటూరు జిల్లా నేతలతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాజధాని ప్రాంత రైతుల భూములు కాపాడేందుకు ఏం చేయాలి, ఎలా పోరాడాలనే అంశాలపై నేతలతో చర్చించారు.

ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరగకుండా చూడాలని, అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

196 మండలాలే కరువు ప్రాంతాలా?

Written By news on Thursday, October 29, 2015 | 10/29/2015


ఏపీ కరువుతో అల్లాడుతోంది
196 మండలాలే కరువు ప్రాంతాలా?: వాసిరెడ్డి పద్మ

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలూ కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే.. కేవలం 196 మండలాల్నే కరువు ప్రాంతాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించడం నయవంచన, మోసం తప్ప మరొకటి కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ధ్వజమెత్తింది. తక్షణమే యావత్ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సాయంకోసం కేంద్రం వద్దకు వెళ్లాలని, అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరువుపై ఏం కార్యాచరణ చేపట్టబోతున్నారో వారంరోజుల్లో వెల్లడించాలన్నారు. ఆగస్టు 18న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా చేసిన ప్రకటనలో రాష్ట్రంలో 325 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారని, అలాంటిది తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటనలో సగానికిసగం తగ్గించి 196 మండలాల్లోనే కరువుందని వెల్లడించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.

 ఎంత దారుణం..
 శ్రీకాకుళం మొత్తం కరువు విలయతాండవం చేస్తూంటే కేవలం 10 మండలాల్లోనే కరువు ఉందంటారా? ఎంత దారుణమని పద్మ ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ 8 లక్షల ఎకరాల్లో మరొక్క తడి నీరందకపోతే వరికంకులు మాడిపోతాయని, ప్రభుత్వం మాత్రం చుక్క నీరందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక జలసిరితో కళకళలాడుతుంటే.. దిగువ రాష్ట్రమైన ఏపీ, కృష్ణాడెల్టా, రాయలసీమ ఎండిపోతోందన్నారు. సీఎం చంద్రబాబు పొరుగురాష్ట్రమైన కర్ణాటకకు ఇక్కడి పరిస్థితి వివరించి కృష్ణా నీటిని విడుదల చేయాలని ఎందుకు కోరట్లేదని, ఈ విషయంలో కేంద్రంద్వారా ఎందుకు ప్రయత్నించట్లేదని ఆమె ప్రశ్నించారు. 

 ఇది మరో వంచన...
 ఇప్పటికే రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించి రైతుల్ని వంచించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కరువు మండలాల ప్రకటనలోనూ మరోసారి వంచించిందని పద్మ విమర్శించారు. ప్రతికూల వ్యవసాయ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాల వద్దకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళుతుంటే అధికారపార్టీ ఎగతాళి చేయడం దారుణమన్నారు. అసలు పంటలు తగులబడే పరిస్థితులు ప్రభుత్వమే కల్పిస్తున్నపుడు జగన్ తప్పక రైతులకు అండగా ఉంటారన్నారు.

జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు


జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు
విజయవాడ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. గౌతంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసిన ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు విషయాలపై చర్చించారు.

ఆర్టీసీ ఇటీవల పెంచిన బస్ చార్జీల పెంపు వల్ల ఇబ్బందులు, వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. గౌతంరెడ్డి సాక్షితో మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు అంశాలపై జగన్‌తో చర్చించానని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు.

రాజధాని ముసుగులో ‘రియల్’ దందా


రాజధాని ముసుగులో ‘రియల్’ దందా
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి  అంబటి ధ్వజం
 
 రేపల్లె :  రాజధాని ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పట్టణంలో మంగళవారం రాత్రి ఒక శుభ కార్యానికి హాజరైన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమి సేకరణకు మాత్రమే వ్యతిరేకమన్నారు. 3 వేల ఎకరాల్లో అన్ని హంగులతో రాజధానిని నిర్మించుకోవచ్చని తెలిపారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేందుకే ఏడాదికి మూడు పంటలు పండే బంగారు భూములను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.

ప్రపంచంలో ఎక్కడా జరగని కుంభకోణం రాజధాని ముసుగులో ఇక్కడజరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడిందంటూ సంక్షేమ పధకాలకు కత్తెర వేస్తున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపన పేరుతో రూ400 కోట్లు నీళ్ళప్రాయంగా ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఈ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోవటంతో మైలలో ఉన్న చంద్రబాబు కుప్పంలో మట్టి-నీరు ఎలా తీసుకువచ్చారన్నారు. మైలలో ఉండి మట్టి - నీరు తీసుకువచ్చి దేవునిపట్ల, ఆచారాలపట్ల అపచారం చేసిన చంద్రబాబు దేవుడికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి


శాశ్వత పరిష్కారం చూపాలి
♦ పొగాకు రైతుల సమస్యపై మోదీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. పొగాకు రైతుల సమస్యల్ని ఇంతకుముందు మీ దృష్టికి తీసుకొచ్చినపుడు వెంటనే స్పందించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని పంపించి రైతుల ఆత్మహత్యల వివరాలు తెలుసుకున్నారని, దీంతో సమస్య తీవ్రత మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నానని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. పొగాకు బోర్డు, పొగాకు కొనుగోలు చేసే కంపెనీల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆయన అన్నారు.

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో ఎక్కువమంది పొగాకు రైతులే ఉండటం బాధాకరమన్నారు. సీజన్ ప్రారంభంలోనే గిట్టుబాటు ధర కల్పించే విషయంపై పొగాకు బోర్డుతో పలుమార్లు మాట్లాడినా, పరిస్థితికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడంలో బోర్డు విఫలమైందన్నారు.

 కౌలు రైతులకూ నష్టపరిహారమివ్వాలి..
 పొగాకుబోర్డు వద్ద రూ.400-రూ.500 కోట్లు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఉందని, అందువల్ల రైతులకు బోర్డు నష్టపరిహారమివ్వాలని వైవీ అన్నారు. బ్యారన్ల యజమానులకే నష్టపరిహారమిస్తున్నారని.. కౌలు రైతులకు పరిహారమెందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పొగాకు సాగుచేసే రైతుకిస్తున్న వాటన్నింటినీ కౌలు రైతుకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నోఏళ్లుగా ఐటీసీ లాభాలార్జిస్తున్న నేపథ్యంలో బోర్డుకు ఎగుమతుల విషయంలో సాయపడాల్సిన అవసరముందన్నారు.

ప్రధానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ

Written By news on Wednesday, October 28, 2015 | 10/28/2015

ఒంగోలు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా రైతుల సమస్యలను వైవీ సుబ్బారెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
రైతు ఆత్మహత్యలు, సమస్యలపై ప్రత్యేకంగా లేఖలో ఎంపీ ప్రస్తావించారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. లేఖ కాపీని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, రాధా మోహన్ సింగ్ కు కూడా వైవీ సుబ్బారెడ్డి పంపారు.

చంద్రబాబు అత్తసొత్తు కాదు

Written By news on Monday, October 26, 2015 | 10/26/2015


'చంద్రబాబు అత్తసొత్తు కాదు'
ఉద్ధండరాయుడనిపాలెం: పేదవాళ్ల భూములను బలవంతంగా లాక్కునే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు చంద్రబాబు అత్తసొత్తు కాదని పేర్కొన్నారు. భూములు లాక్కుంటే పేదోళ్ల ఉసురు చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుడనిపాలెంలో రైతులతో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
  • పేదవాళ్ల భూములను చంద్రబాబు తన అత్తగారి సొత్తు అన్నట్లుగా తనకు ఇష్టం వచ్చినట్లు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు
  • అసైన్డ్ భూములను మనకు సంబంధం కూడా లేకుండా, మనం ఒప్పుకోకపోయినా ఇష్టం వచ్చినట్లు బలవంతంగా తీసుకున్నారు
  • ఈ విషయాన్ని మన గ్రామం ద్వారా దేశం మొత్తానికి చెప్పాలి
  • పేదల భూములను లాక్కునే అధికారం చంద్రబాబుకు కాదు కదా.. వాళ్ల నాయనకు కూడా లేదని కచ్చితంగా అర్థమయ్యేలా చెప్పాలి
  • భూములు ఇస్తున్నామని ఎవరూ సంతకాలు పెట్టకపోయినా భూములు లాక్కుంటున్నారు
  • రెవెన్యూ రికార్డులు మార్చేసి రైతులను భయపెడుతున్నారు
  • ల్యాండ్ పూలింగ్ కు సహరించకుంటే అసైన్డ్ భూములు లాక్కుంటామని ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు
  • 50 ఏళ్లు అసైన్డ్ భూముల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని చూస్తున్నారు
  • శ్మశానాలను కూడా వదలడం లేదు
  • బలవంతంగా భూములు లాక్కోవడం దారుణం
  • రైతులకు అన్నివిధాలా ఉండగా ఉంటాం
  • ఇష్టమొచ్చినట్టు భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకోం
  • బలవంతంగా భూములు లాక్కుంటే కోర్టును ఆశ్రయిస్తాం
  • లాక్కున్న భూములు వెనక్కు రాకపోతే మేము అధికారంలోకి వచ్చాక తిరిగిస్తాం
  • చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిసే రోజు దగ్గరలో ఉంది
  • అసైన్డ్ భూములను ఎవరూ లాక్కోకుండా చట్టాలను కూడా మారుస్తాం

భూములు ఇవ్వమని చెప్పినవారి జీవితాలను బుగ్గిపాలు చేస్తారా ?


'అధికారమదంతో రాక్షసుడు అవుతున్నాడు'బాధిత రైతు చంద్రశేఖర్‌తో వైఎస్ జగన్
గుంటూరు : అధికారమదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షసుడిగా మారాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇవ్వమని చెప్పినవారి జీవితాలను బుగ్గిపాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మల్కాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన చెరుకు తోటలను పరిశీలించి, రైతు గద్దె చంద్రశేఖర్ తదితరులను ఆయన సోమవారం ఉదయం పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..
  • శేఖరన్న చేసిన పొరపాటు ఏంటి..
  • ఆయన చేసిన తప్పంతా భూమిని ఇవ్వనని చెప్పడమే
  • అదేమైనా తప్పా అని అడుగుతున్నా
  • ప్రజాస్వామ్యంలో నా భూమి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది
  • బలవంతంగా తీసుకోవడం ఎంతవరకు ధర్మం
  • ఇవ్వకపోతే ఈ మాదిరిగా కాల్పించేయడం ఎంతవరకు న్యాయం
  • ఇది మొదటి సంఘటన కాదు, సంవత్సర కాలం నుంచి జరుగుతున్నాయి.
  • ఏ రైతు ఇవ్వనని అన్నారో, నా భూమి నా ఇష్టమని చెబుతున్నారరో.. వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంది.
  • గతంలో జరిగిన సంఘటనలో కూడా ఎక్కడా నిందితులను అరెస్టు చేయలేదు.
  • దగ్గరుండి చంద్రబాబు పురమాయిస్తున్నాడు, మంత్రులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు
  • చేసినవాళ్లు ఎవరో తెలిసినా కూడా ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. అసలు మొదట అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది చంద్రబాబునే
  • ఇదే మంత్రులు, చంద్రబాబుల భూముల్లోకి ఎవరైనా వచ్చి బలవంతంగా లాక్కుంటాం, ఇవ్వకపోతే తగలబెడతాం అంటే ఒప్పుకొంటారా
  • అలాంటప్పుడు.. ఒప్పుకోని రైతుల మీద.. శేఖరన్న లాంటి వ్యక్తుల మీద ఇలా చేయడం న్యాయమేనా?
  • మనుషులం.. రాక్షసులం అవుతున్నాం. చంద్రబాబు మానవత్వం అన్న గీత దాటి అధికారమదంతో రాక్షసుడు అయిపోయాడు
  • ఇలా దౌర్జన్యాలు చేయడం భావ్యం కాదు. ఇస్తామన్నవాళ్ల దగ్గర నుంచి తీసుకోండి
  • తగులబెట్టారని కాకుండా తగులబడింది అని కేసు పెట్టండి అన్నారట
  • డీఎస్పీ గారు సిగరెట్ పడి కాలిపోయిందని కేసు ఫైల్ చేయమన్నారట
  • ఫిర్యాదు చేసిన ప్రకారం పోలీసులు కేసులు పెట్టడం లేదు
  • బీహార్ లో జంగల్ రాజ్యంలాగా ఉంది.. ఆంధ్రప్రదేశ్
  • ఎవరైనా ఉంటే ఓసారి ఆంధ్రప్రదేశ్‌ను చూడండి బీహార్ ను మించిపోయినట్లుగా ఉంది.
  • పది నెలల్లో 13 ఘటనలు జరిగాయి
  • భూములు ఇవ్వని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
  • నిజంగా చంద్రబాబు భూములో మంత్రుల భూములో ఇలా చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది
  • చంద్రబాబు రాక్షసత్వం విడిచి మానవత్వంలోకి రావాలి.. మదం తగ్గించుకొని మనిషిలాగా మారాలి
  • బలవంతంగా లాక్కోవడాన్ని ఖండిస్తున్నాం
  • ఇప్పటికైనా మనసు మార్చుకుని రైతులకు అండగా ఉండకపోతే పరిస్థితులు చాలా సీరియస్‌గా ఉంటాయి
  • శేఖరన్నకు అన్నివిధాలా తోడుగా ఉంటాం. ఇలాంటి రైతులందరికీ కూడా అండగా ఉంటాం
  • కోర్టుల్లో కేసులు వేసి అయినా సరే బలవంతంగా భూములు లాక్కోవడాన్ని అడ్డుకుంటాం
  • ఇది ఎల్లకాలం జరగదు.. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు ఉంటుందో, మూడేళ్లు ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ఉండదు
  • తర్వాత మనం వస్తాం, బలవంతంగా లాక్కున్న భూములన్నీ ఆయా రైతులకు మళ్లీ ఇప్పిస్తాం

అనంతరం రైతు గద్దె చంద్రశేఖర్ మాట్లాడారు. తన భూమిని ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వబోనని చెప్పడం వల్లే చెరుకుతోట తగలబెట్టారని, ఇది నూటికి నూరుశాతం వాస్తవమని ఆయన చెప్పారు. తాము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేశామని, కానీ తమకీ దౌర్భాగ్య స్థితి కల్పించారని వాపోయారు. ఇప్పుడు తమ చెప్పులతో తమనే కొట్టుకోవాలని అనిపిస్తోందన్నారు.

తుళ్లూరు మండలంలో నేడు వైఎస్‌ జగన్ పర్యటన


తుళ్లూరు మండలంలో నేడు వైఎస్‌ జగన్ పర్యటన
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం తుళ్లూరు మండలం మల్కాపురం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కారణంతో మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చినచంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 4 ఎకరాల 79 సెంట్లలోని చెరకు తోటను కొందరు దుండగులు గురువారం రాత్రి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో రాజధాని నిర్మాణానికి భూములివ్వని అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.

గతేడాది డిసెంబర్‌లో భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించిన ఐదు గ్రామాలకు చెందిన 13 మంది రైతుల పొలాల్లో వారి వ్యవసాయ పరికరాలను దుండగులు తగులబెట్టారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆ కేసులో కూడా పోలీసులు ఎలాంటి చ ర్యలు తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం అగ్నికి ఆహుతైన పంట పొలాన్ని పరిశీ లించడమే కాకుండా బాధిత రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

రాజధాని రైతులకు ‘శంకుస్థాపన’ కష్టాలు


రాజధాని రైతులకు ‘శంకుస్థాపన’ కష్టాలుఉండవల్లి పరిధిలోని పొలాల్లో వేసిన రోడ్డును తొలగించుకుంటున్న రైతులు
♦ వేసిన రోడ్లు తొలగిస్తామని అప్పట్లో అధికారుల హామీ
♦ ఇప్పుడు తొలగిస్తున్న రైతులపై కేసులు

సాక్షి, విజయవాడ బ్యూరో/తాడేపల్లి రూరల్: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం.. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతుల పొలాల్లో ఆఘవేఘాలపై రోడ్లు వేసిన ప్రభుత్వ యంత్రాంగం పబ్బంగడుపుకుని దాన్ని వదిలేసింది. పంట వేసుకునే సమయం కావడంతో మందడం, పెనుమాక, వెంకటపాలెం గ్రామాల రైతులే వ్యయ ప్రయాసలకోర్చి రోడ్లను తొలగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. శంకుస్థాపకు వీఐపీ(ఏఏ, ఏ) పాస్‌లు ఉన్న వాహనాలు వెళ్లేందుకు కృష్ణా కరకట్టకు అనుసంధానంగా రైతుల పొలాల్లోంచి యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్లు వేశారు.

ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని తమ భూముల్లోంచి రోడ్డు వేయడంపై అప్పట్లో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అధికారులు రైతులకు నయానా భయానా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. కార్యక్రమానికి వీఐపీలు వచ్చేందుకు రోడ్డు వేస్తున్నామని, కార్యక్రమం పూర్తయ్యాక రోడ్డును తొలగిస్తామని హామీ ఇచ్చారు.

శంకుస్థాపన ముగిసి రోజులు గడుస్తున్నా రోడ్డు తొలగించకపోవడంతో తాము గుంటూరు ఎస్పీ నారాయణనాయక్‌ను కలిసినట్టు పెనుమాకకు చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఉల్లి పంటను వేసుకోవాల్సి ఉన్నందున పొలంలోని రోడ్డును తొలగించాలని కోరినట్టు వివరించాడు. పొలంలో వేసిన యాస్, మెటల్‌తో వేసిన రోడ్డును తొలగించి సాగుకు అనువుగా మలుచుకునేందుకు వ్యయప్రయాసలు తప్పడంలేదని ఆయన వాపోయాడు.

రైతులపై అధికారుల ఫిర్యాదు
శంకుస్థాపన సమయంలో రోడ్ల ఏర్పాటుకు బతిమిలాడిన అధికారులే.. ఇప్పుడు వాటిని తొలిగిస్తున్నారంటూ రైతులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు పెనుమాక రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే తమ పంటపొలాలను నాశనం చేసి రహదారులను నిర్మించార ని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నాశనం చేసినందుకు నష్ట పరిహారం ఇవ్వకపోగా, తమపై తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ల్యాండ్‌పూలింగ్‌కి తమ భూమలు ఇవ్వనందునే, పంచాయతీరాజ్ ఏఈ తమపై ఫిర్యాదు చేశారని వారు స్పష్టం చేశారు.

వివాహానికి హాజరైన వైఎస్ జగన్

Written By news on Sunday, October 25, 2015 | 10/25/2015


వివాహానికి హాజరైన వైఎస్ జగన్
అనంతపురం: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి, అరుణ దంపతుల కుమారుడు నరేన్ రామాంజులరెడ్డి, అదే జిల్లా చెన్నూరు వాసి రాజారెడ్డి వెంకటసుబ్బారెడ్డి కుమారై నవ్యతేజల వివాహానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వీరి వివాహం ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని గంగా నిలయం కల్యాణ మండపంలో జరిగింది. వైఎస్ జగన్‌తో పాటు సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి వైఎస్ జగన్ ఆశీర్వదించారు.

గుంతకల్లులోనే జరిగిన మరో వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరై నూతన వధూవరులు సింధు, అమరనాథరెడ్డిలను ఆశీర్వదించారు. అలాగే గుంతకల్లు మండలం ఓబుళాపురానికి చెందిన రామాంజనేయులు, సునీత కుమారుడికి రఘు అని పేరు పెట్టారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి విపక్షనేత రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, గుమ్మనూరు జయరాం, సాయిప్రసాదరెడ్డి, ఐజయ్య, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, గుంతకల్లు సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :