01 November 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు గవర్నర్ కు లేఖ ఇవ్వడం అబద్దమా?

Written By news on Saturday, November 7, 2015 | 11/07/2015


చంద్రబాబు గవర్నర్ కు లేఖ ఇవ్వడం అబద్దమా?
విశాఖపట్నం: ఇకపై బాక్సైట్ కోసం ప్రతి గిరిజనుడు ఆయుధాలతో పోరాడుతాడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే(పాడేరు) గిడ్డి ఈశ్వరి అన్నారు.
మా ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ ను కాపాడుకుంటామని ఆమె చెప్పారు. విశాఖలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన్యం బంద్ కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బంద్ ప్రారంభం మాత్రమేనన్నారు.
2011లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తవ్వకాలు ఆపాలంటూ గవర్నర్ కు లేఖ ఇవ్వడం అబద్దమా.. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండని అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ లేఖను నిన్నటికి నిన్న వెబ్ సైట్ లోంచి తొలగించేశారని ఎమ్మెల్యే వివరించారు. జీవో 97ను జారీ చేసినందుకు ఏ కార్యక్రమం తలపెట్టినా చంద్రబాబుకు గిరిజనుల ఆగ్రహం తప్పదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ

► బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ
►ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు
►భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదు
►ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య (ఎల్బీనగర్‌ నియోజకవర్గం) నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు... ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు.
ఏపీలో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గ్రూప్1, 2,3, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. బాబు వస్తే ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో తొలగించిన 125 మంది కాంట్రక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

16 నుంచి వరంగల్‌లో జగన్ ప్రచారం


16 నుంచి వరంగల్‌లో జగన్ ప్రచారం
♦ వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి వెల్లడి
♦ సీఎం కేసీఆర్‌వి ప్రజావ్యతిరేక విధానాలని ధ్వజం
♦ పాలనాపరంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు విఫలమని మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీ అభ్యర్థి నల్ల సూర్యప్రకాశ్‌కు మద్దతుగా లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో జగన్ ప్రచారం చేపడతారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కె.శివకుమార్, భీమా శ్రీధర్‌లతో కలసి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు వైఎస్సార్ ఎలా భరోసానిచ్చారో రాబోయే రోజుల్లో తెలంగాణలోని ప్రజలకు భరోసా కల్పించేలా జగన్ ప్రచారం నిర్వహిస్తారన్నారు.

జగన్‌కు ఉన్న ప్రజాభిమానంతో విపక్షాలు చిత్తుచిత్తుగా ఓడిపోతాయని... పార్టీ శ్రేణులు గెలుపుపై విశ్వాసంతో ఉన్నాయన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రచారంలో పాల్గొనే ప్రముఖుల పర్యటన వివరాలను ప్రకటిస్తామన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ-టీడీపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అభివృద్ధి నినాదంతో ప్రచారం చేస్తుందని పొంగులేటి చెప్పారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పేదవాడు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తున్నాడన్నారు. నిండు మనసుతో అభిమానిస్తున్నాడని పొంగులేటి అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక రాష్ర్టవ్యాప్తంగా ఎంతో మంది మర ణిస్తే వారిలో అత్యధికంగా 73 మంది వరంగల్ జిల్లాలోనే చనిపోయారన్నారు.

ఈ కుటుంబాలన్నింటినీ రాజన్న తనయ షర్మిల ఇటీవలే పరామర్శించారన్నారు. సీఎంగా వైఎస్సార్ రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలను సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్నారని... అలా వివిధ వర్గాల ప్రజలకు భరోసానిచ్చిన ఏకైక సీఎం వైఎస్సార్ అక్కరేనని అన్నారు. పరిపాలనాపరంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని... రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. వైఎస్సార్ మరణానంతరం ఇద్దరు కాంగ్రెస్ సీఎంలు జలయజ్ఞం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ ప్రభంజనంతో గెలిచి తీరుతాం

Written By news on Friday, November 6, 2015 | 11/06/2015


'వైఎస్ జగన్ ప్రభంజనంతో గెలిచి తీరుతాం'
హైదరాబాద్: వరంగల్ ఎంపీ స్థానం అక్కడి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కట్టబెడతారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ప్రభంజనం ముందు ఏ పార్టీ నిలవలేదని చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేశాడో ప్రజలందరికీ తెలుసని, అందుకే ఆయనకు రెండుసార్లు ముఖ్యమంత్రి పట్టంకట్టారని చెప్పారు.

వైఎస్ఆర్ పేదల, మైనార్టీలకోసం పనిచేసిన మహామనిషి అని ఆయన తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా చాలా చెత్తగా పరిపాలన చేశారని చెప్పారు. అందుకే వైఎస్ఆర్ మాదిరిగానే ఆయన కుమారుడు, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16, 17,18,19 తేదీల్లో వరంగల్ ఎంపీ స్థానంలో ఉన్న ప్రతి సెగ్మెంట్లలో జరిగే ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రచారంతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ సీపీ తరుపున నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి సూర్యప్రకాష్ నామినేషన్

Written By news on Thursday, November 5, 2015 | 11/05/2015


జన హోరు
అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి సూర్యప్రకాష్ నామినేషన్
ర్యాలీకి తరలివచ్చిన ప్రజానీకం యువకుల బైక్ ర్యాలీ
ఆకట్టుకున్న గిరిజన నృత్యాలు
ర్యాలీలో పాల్గొన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

 
కాజీపేట రూరల్ : వైఎస్సార్‌సీపీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ ర్యాలీ బుధవారం జనసందోహం నడుమసాగింది. కాజీపేట ఫాతిమానగర్ వంతెన వద్ద ఉదయం వైఎస్సార్‌సీపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు వేలాది మంది ర్యాలీకి సిద్ధమయ్యూరు. అక్కడికి పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ చేరుకున్న అనంతరం జిల్లా, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో నల్లా సూర్యప్రకాష్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మేహ ందర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ గట్టు శ్రీకాంత్‌రెడ్డిలతో ప్రత్యేక రథంతో ర్యాలీ సాగింది.

 ఆకట్టుకున్న సాంస్క­ృతిక కార్యక్రమాలు
 కాజీపేట బ్రిడ్జి, ఫాతిమానగర్ జంక్షన్‌ల మీదుగా డప్పుచప్పుళ్లతో గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ర్యాలీ సాగింది. అభ్యర్థికి సంఘీభావంగా నగర యువత బైక్‌ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ సినీనటుడు విజయ్‌చందర్ తలకు కాషాయపు రంగు టవల్ కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు ఉత్సాహంచూపారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలు కూడా ర్యాలీలో తీసుకెళ్లారు. ప్రత్యేక ప్రచార రథంపై తెలంగాణ, ైవె ఎస్సార్‌లపై వినిపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాజీపేట పోలీసులు కలెక్టరేట్ వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవిందర్, జనరల్ సెక్రెటరీ గాదె నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భగవాన్ రెడ్డి, ఇరుగు సునిల్ కుమార్, గవాస్కర్‌రెడ్డి, మునిగాల విలియం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, పూజారీ సాంబయ్య, సంగాల ఈర్మియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, జిల్లా నాయకులు మునిగాల కల్యాణ్‌రాజ్, అప్పం కిషన్, ఎర్రంరెడ్డి మహిపాల్ రెడ్డి, దుప్పటి ప్రకాష్, మంచె అశోక్, కౌటిల్‌రెడ్డి, అచ్చిరెడ్డి, గాందీ, నెమలిపురి రఘు, నాగపురి దయాకర్, రజనికాంత్, గౌని సాంబయ్య, ఆరెపెల్లి రాజు, దోపతి సుదర్శన్ రెడ్డి, ప్రతీక్‌రెడ్డి, బద్రుద్దీన్‌ఖాన్, బొడ్డు శ్రావన్, సంపత్, తిక్క శ్రీధర్, రవికుమార్, ఎం.అనిల్ లతో పాటు వర్థన్నపేట, పాలకుర్తి, పరకాల, హసన్‌పర్తి, నర్సంపేట తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చి పాల్గొన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేశ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం


మాపై నీచ ప్రచారం
 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేశ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి, తాను, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై ప్రాంతీయ ఉద్యమాన్ని లేవదీయబోతున్నామంటూ ఏబీఎన్  -ఆంధ్రజ్యోతి చానెల్ నీచమైన ప్రచారానికి తెర లేపిందని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో చానెల్ యజమాని రాధాకృష్ణ వైఖరిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ‘వాస్తవానికి నేను హైదరాబాద్‌లోనే లేను. నా నియోజకవర్గంలో ఉన్నా.

చంద్రబాబు హయాంలో మొత్తంగా 13 జిల్లాలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని, ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదాన్ని ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేము బహిరంగంగా ప్రజల దృష్టికి  తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మైసూరారెడ్డిని, నన్నూ ప్రస్తావిస్తూ ఈ రోజు ఇచ్చిన కథనం పూర్తిగా ఆ చానెల్ దిగజారుడు జర్నలిజానికి, చెంచాగిరీకి, కుట్ర పూరిత వ్యవహారానికి అద్దం పడుతోంది. తిరుపతిలో ఎకరం భూమి రూ.5 కోట్లు పలుకుతోంటే.. ఎక రా కేవలం రూ.80 లక్షల చొప్పున 1.5 ఎకరాల భూమిని చంద్రబాబు పభుత్వం ఈ చానెల్ యాజమాన్యానికి కట్టబెడుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం ఆమోదింప జేసుకుంది.

ఇది జరిగిన మరునాడే చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు ఇంతగా దిగజారి పోయి ఆ చానెల్ ఈ  కథనాన్ని అల్లింది. రాష్ట్రంలో ఒకపక్క కరువు నెలకొంది. అప్పుల తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. పట్టిసీమ నుంచి రాజధాని వరకు, ఇసుక నుంచి మైనింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, రాక్షస చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. అన్నింటికీ మించి వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న అంశంపై రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం అంతా అట్టుడుకుతోంది.

వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అప్పనంగా రూ.కోట్ల  ఆస్తిని కట్టబె ట్టిన చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే ఈ చానెల్ ఇంతగా దిగజారిపోయి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మీద, మైసూరారెడ్డిపైనా, చివరకు నామీద కూడా పాతాళపు స్థాయి నీచ రాజకీయానికి దిగింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మా పార్టీ వ్యతిరేకం. హైదరాబాద్ అనుభవాల నేపథ్యంలో అటువంటి పని చేయరాదన్నది మా విధానం. ఈ విషయంలో దాపరికం కానీ రాజీ గానీ ఉండబోదు..’ అని గడికోట తన ప్రకటనలో స్పష్టం చేశారు.

రైతు ఆత్మహత్యలు పట్టవా?


రైతు ఆత్మహత్యలు పట్టవా?
చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 

 సాక్షి, కడప : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.  పరిహారం అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. డబ్బులు ఇవ్వకుండా మాటల గారడీ చే స్తోందని ఎద్దేవా చేశారు.  ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం మోట్నూతలపల్లె గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాలగిరి రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం  వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.

‘రాజశేఖర్ సంఘటనే చూసుకుంటే ఆ రైతు ఆత్మహత్య చేసుకొని 18రోజులు గడిచాయి... పురుగుల మందు తాగి రాజశేఖరన్న చనిపోతే గవర్నమెంటోళ్లు ఈ పక్కకు తిరిగి చూడలేదంటే ఏమనాలి?’ అని ఆయన ప్రశ్నించారు. ఆ రైతు గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయలు, భార్య పేరు మీద డ్వాక్రా రుణం 20వేలు తీసుకున్నారని, అయితే ఏ రుణమూ మాఫీ కాలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న మూడు ఎకరాల పొలంతోపాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని 5బోర్లు వేశారని, కానీ ఒక్క బోరులో మాత్రమే అరకొర గా నీళ్లు వస్తాయన్నారు. బ్యాంకుల్లోనే కాకుండా బయట కూడా రాజశేఖర్ రూ.10లక్షలు వ్యవసాయంపై అప్పు చేసి అవి తీర్చలేక, బతికే దారిలేక మరణించినా ప్రభుత్వం కరుణ చూపకపోవడం దుర్మార్గమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతు కుటుంబాలు ఎలా బ్రతుకుతాయన్న ఆలోచన కూడా బాబుకు రాకపోవడం శోచనీయమన్నారు.

 ఒక్క అధికారి రాడు..
 ‘వ్యవసాయంపై చేసిన అప్పులు తీర్చే దారిలేక చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంఘటన జరిగిన తర్వాతనైనా ఒక్క అధికారి రాడు.. ఎందుకు రావడంలేదో నాకైతే అర్థం కావడంలేదు. చనిపోయిన రైతు రైతుగా కనిపించడంలేదా.. లేక చనిపోయింది పులివెందులలో కాబట్టి వివక్ష చూపుతూ రాలేదా’ అని వైఎస్ జగన్ నిలదీశారు. ‘రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా.. భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అనంతపురంలో 46మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లా.. అందులో 20కి పైగా ఇళ్లకు గవర్నమెంటోళ్లు పోలేదు. ఇప్పటికైనా ఏం జరుగుతుందో కళ్లు తెరిచి చూడాలి.’ అని ఆయన చంద్రబాబును కోరారు.

 పరిహారం అందించని ప్రభుత్వం
 రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆచరణలో ఏమీ అందించడంలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.1.50లక్షలు అప్పులోళ్లకిచ్చి మిగిలిన రూ.3.50లక్షలు బ్యాంకులో వేస్తామంటారు.. తీరా చూస్తే అకౌంటులో మాత్రం ఏమీ ఉండదు.. ఇలా ఎంతమంది రైతు కుటుంబాలను మభ్యపెడతారు’ అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ‘అసలు ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఎందుకు చేయలేకపోతోంది.. చనిపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదో చెప్పాలి’ అని జగన్ నిలదీశారు. ‘పులివెందుల మండలంలో చనిపోయిన రాజశేఖర్ కుటుంబాన్నే చూడండి.. అధికారులు కూడా రాలేదు.. కనీసం మీరైనా(మీడియా) చూడండి.. మానవత్వంతో పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా స్పందించండి’ అని కోరారు.

 పబ్లిసిటీ వస్తే తప్ప.. బాబు స్పందించరు..  
 ఇంత మంది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. పట్టించుకోని చంద్రబాబు ఏదైనా పబ్లిసిటీ వస్తుందంటే.. ముందు వరుసలో ఉంటారని జగన్ ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ వస్తుందంటేనే పరిహారం ఇవ్వాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఏ రైతు ఎక్కడ చనిపోయినా పరిహారం ఇవ్వాలని చంద్రబాబు మనసుకు తట్టేలా పనిచేయాలని మీడియాకు సూచించారు.

సీబీఐ విచారణకు సిద్ధమా?


సీబీఐ విచారణకు సిద్ధమా?
ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ సవాలు

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ పాలనలో సాగుతున్న విచ్చలవిడి అవినీతిపైన, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆస్తులపైన, మంత్రుల అవినీతిపైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరింది. చంద్రబాబు అవినీతికి పేటెంట్ తీసుకున్నారని, అసలు అవినీతి రాజ్యాన్ని రాష్ట్రంలో స్థాపించిందే ఆయనని, విచ్చలవిడిగా దోపిడీ సాగుతోందని తీవ్రంగా ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి బుధవారమిక్కడ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తాను చేస్తున్న అవినీతిని ఆయా ప్రభుత్వశాఖల అధికారులపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 3న మంగళగిరిలో దీక్ష చేసినప్పుడు ‘రాష్ట్రానికే మోసగాడు చంద్రబాబు’ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో 20 అవినీతి అంశాలను పేర్కొంటూ దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారని, ఇపుడు తాను కూడా అదేమాట అంటున్నానని బత్తుల అన్నారు.

 అవినీతి సూచీ పెడితే ఫస్ట్ ర్యాంక్ మీదే..
 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో గోదావరి పుష్కరాలు మొదలు పట్టిసీమ, పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మద్యం తయారీ విస్తరణకు లెసైన్సులు వంటి వాటిల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని బ్రహ్మానందరెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళల్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, దాన్నొక మాఫియాగా తయారుచేశారని చెప్పారు.

గవర్నర్‌కు జగన్ జన్మదిన శుభాకాంక్షలు


గవర్నర్‌కు జగన్ జన్మదిన శుభాకాంక్షలు
  ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని తన క్యాంపు కార్యాలయం నుంచి గవర్నర్‌కు ఫోన్ చేసిన జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?

Written By news on Wednesday, November 4, 2015 | 11/04/2015


'పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?'
కడప: పులివెందుల మండలం మోపట్నూతలపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రాజశేఖర్ చనిపోయి 18 రోజులైనా ఒక్క అధికారి కూడా వాళ్లింటికి రాలేదని వైఎస్ జగన్ విమర్శించారు. పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు.

పబ్లిసిటీ వస్తుందనుకుంటే ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుందని, ఇలాంటి పేద రైతును మాత్రం పట్టించుకోదని వైఎస్ జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలో తాను 46 రైతు కుటుంబాలను పరామర్శిస్తే.. వాటిలో 20 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచేలా మీడియా కూడా రైతుల దీనగాథలను ఆవిష్కరించాలని వైఎస్ జగన్ అన్నారు.

పెరిగిన ధరలు, ఎండిన పంటలపై చర్చేది?


పెరిగిన ధరలు, ఎండిన పంటలపై చర్చేది?
♦ భూములు దోచిపెట్టడంపైనే కేబినెట్‌లో చర్చించారు
♦ భూముల లీజును 99 ఏళ్లకు పెంచడం అత్యంత దుర్మార్గం
♦ వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి

 హైదరాబాద్: సాగునీరందక ఒకపక్క ఎండుతున్న పంటలు.. మరోవైపు సామాన్యుడు ఊహించనంత స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల.. రాష్ట్రమంతటా కరువుతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపై కనీసం చర్చ చేపట్టకపోవడాన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ పాలనా విధానమేంటో తెలిసిపోతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేబినెట్‌లో ఎలాంటి చర్చ జరగకుండానే చాపచుట్టేశారు.

ధరలపై సమగ్ర చర్చే లేదు. రైతుల సమస్యలపైనా చర్చలేదు.  అరుణ్‌జైట్లీ ప్రత్యేకహోదా శకం ముగిసిందంటూ వ్యాఖ్యలు చేసిన తరువాత రాష్ట్రానికి జరగబోయే అన్యాయంపై కనీసం చర్చ జరపలేదు. నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురుచూస్తుంటే.. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై చర్చలేదు. రైతులనుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి సంబంధించిన భూముల లీజులపై మాత్రం నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆమె తూర్పారబట్టారు. ప్రభుత్వ భూముల లీజు విషయంలో 33 ఏళ్లే సుదీర్ఘ గడువుగా భావిస్తుంటే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ గడువును 99 ఏళ్లకు పెంచడం అత్యంత దుర్మార్గమని పద్మ దుయ్యబట్టారు.

భూమిలేని నిరుపేద రైతులు ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకుంటామంటే పారిశ్రామికవేత్తల మాదిరి గా వారికీ 99 ఏళ్లపాటు లీజుకిస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో అందరికీ తెలిసిన విషయమేనని, సీఎం, మంత్రులకూ ఇది తెలిసినా.. ఏమీ తెలి యనట్టు అక్రమ రవాణా నివారణకు రూ.18 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాననడం మరో అవినీతికి పాల్పడడానికేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత రూ.100 కోట్లు ఇస్తామనడం అందరినీ మోసం చేసినట్టుగానే.. వారినీ మోసం చేయడమేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఇంతకాలం తరువాత కాపుల రిజర్వేషన్ల అంశం సర్కారుకు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.

హమీలు నెరవేర్చని అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు


వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
హమీలు నెరవేర్చని అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు: పొంగులేటి

 సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ  ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజారంజక, సంక్షేమ పాలనే తమ ఎజెండా అని... అలాంటి పాలనను కోరుకుంటున్న ప్రజలు తమ అభ్యర్థిని గెలిపిస్తారని పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు నల్లాసూర్యప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక ల కోసం అయ్యే వ్యయం కోసం పార్టీ తరఫున వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన రూ.25 లక్షల చెక్కును, బీ-ఫారాన్ని అందజేశారు.

అనంతరం పార్టీనాయకులు కె.శివకుమార్,కొండా రాఘవరెడ్డి, గుణ్ణం నాగిరెడ్డి, ముజ్తఫా, జయరాజ్‌లతో కలసి పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి, అందుకు కారణమేమిటో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఎన్ని హామీలిచ్చిందో, ఎన్ని నెరవేర్చిందో అందరూ చూస్తున్నారని... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తుంగలో తొక్కిన అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. దళితుల హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తిగా సూర్యప్రకాశ్‌కు ఎంతో పేరు, గుర్తింపు ఉన్నాయని, పార్టీ స్థాపించిన నాటి నుంచి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

  వైఎస్సార్ హయాం నాటి పాలనను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశీస్సులే తమ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని పొంగులేటి చెప్పారు. బుధవారం సూర్యప్రకాశ్ నామినేషన్ దాఖలు చేస్తారని.. ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలుపుదామని పొంగులేటి పిలుపునిచ్చారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న చిత్తశుద్ధి ప్రతిపక్షాలకు ఉంటే ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ముందుకు రావాలన్నారు.

అధికార పార్టీతో కొన్ని ప్రతిపక్షాలు కుమ్మక్కు కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీపై పోటీకి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలిపితే కుమ్మక్కయ్యారంటూ కొన్ని పార్టీలు, నాయకులు విమర్శించడం హాస్యాస్పదమని పొంగులేటి అన్నారు. టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. 13 ఏళ్ల పోరాట ఫలితంగా రాష్ట్ర విభజన అనంతరం టీఆర్‌ఎస్ గెలుపొందందని ఇప్పుడు అందుకు  భిన్నమైన తీర్పు వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పొంగులేటి చెప్పారు.

 ఒక కార్యకర్తకు గౌరవమిచ్చారు: నల్లా

 పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తగా తనకు వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమిచ్చి గౌరవించారని, ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సందర్భంగా సూర్యప్రకాష్ విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికలు ఒక సాధనమన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, దొర పోకడలను ఈ ఎన్నికల ప్రచారంలో ఎత్తిచూపుతామన్నారు.

వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కండువా కప్పుకుని మిత్రపక్షంగా పోటీ చేశారని... ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా విప్‌ను జారీ చేశారని మండిపడ్డారు. ఉపఎన్నికల్లో తనకు టికెట్ వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం: వైఎస్ జగన్

Written By news on Tuesday, November 3, 2015 | 11/03/2015


సీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం: వైఎస్ జగన్
కడప: రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని  ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టును మంగళవారం ఆయన సందర్శించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాలను ఒకేలా చూడకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి తాము అడ్డు కాదని... అభివృద్ధి అన్ని జిల్లాలకు విస్తరించాలన్నదే తమ అభిమతమన్నారు. హైకోర్టును రాజధానిలో కాకుండా మరో జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్థి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకృతం చేయడం వల్లే గతంలో ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయని, ఇప్పుడు మళ్లీ అలా జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని వైఎస్ జగన్ సూచించారు.

శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందుతాయని, విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి కిందికి నీరు విడుదల చేయడంతో రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పద్మావతి మెడికల్ కాలేజి సీట్లను రాయలసీమ వారికి దక్కకుండా చేశారనే భావన ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కరువు మండలాల ప్రకటన చంద్రబాబు పక్షపాత ధోరణికి నిదర్శనమని, కరువుతో అల్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోయినా, పులివెందుల నియోజకవర్గంలో ఒక్క మండలాన్నే ప్రకటించారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టులు 80 నుంచి 85 శాతం పూర్తయితే.. ఆయన మరణానంతరం 10 శాతం కూడా పూర్తికాలేదని అన్నారు.

సీఎస్ దత్తత గ్రామానికి ఎంపీ వైవీ నిధులు

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రకాశం జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తన ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేశారు. తన స్వగ్రామమైన పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామాన్ని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు దత్తత తీసుకున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో సామాజిక భవన నిర్మాణానికి ఎంపీ నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఇటీవల ఎంపీని కోరారు. సామాజిక భవన నిర్మాణానికి రూ.4.5 లక్షలను విడుదల చేస్తూ అంగీకార పత్రాన్ని మంగళవారం ప్రకాశం భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. కలెక్టర్‌కు అందజేశారు.

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌


రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌
వరంగల్‌: వరంగల్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శివకుమార్‌, గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, బిశ్వా రవీందర్‌, శ్యామ్‌సుందర్‌ రెడ్డి, గున్నా నాగిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా


అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో పొంగులేటి...నల్లా సూర్యప్రకాశ్‌కు బీ ఫాం అందచేశారు.
 
ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని నల్లా తెలిపారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల బలవన్మరణాలను కనీసం నమోదు కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళామన్నారు.

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్


వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
హైదరాబాద్ :  వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను బరిలోకి దించుతున్నట్లు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని తెలిపారు. నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి ఈ సందర్భంగా వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  కొంతమంది వైఎస్ఆర్ సీపీని విమర్శలు చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పొంగులేటి మండిపడ్డారు.

చంద్రబాబు మోసాలను ఎండగడదాం


చంద్రబాబు మోసాలను ఎండగడదాం
సాక్షి, కడప: ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటి. రుణమాఫీ నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసిన బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చివరకు అవ్వా తాతలను కూడా పింఛన్ పెంపు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి వారి ఉసురు తప్పక తగులుతుంది. ఎవరూ నిరాశ పడొద్దు.. మంచి రోజులు త్వరలోనే వస్తాయి. అందరం కలసి ఆయన మోసాలను ఎండగడదాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 వైఎస్‌ఆర్ జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సోమవారం ఆయన పర్యటించినపుడు పలువురు వృద్ధులు, మహిళలు వారి కష్టాలు విన్నవించుకోగా జగన్ పైవిధంగా స్పందించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తోందని  వివరించారు.సోమవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకున్న జగన్‌కు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం ప్రొద్దుటూరు అమ్మవారిశాలలోని శ్రీకన్యకాపరమేశ్వరిదేవిని దర్శించుకున్నారు.

నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Monday, November 2, 2015 | 11/02/2015

రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ఆయన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామంలోని నారాయణరెడ్డి సమాధి వద్ద పుష్పమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నారాయణరెడ్డి సతీమణి మల్లమ్మ, కుమారులు సూర్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను పరామర్శించారు. పార్టీ వారికి అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు.

వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి


వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి
ఇంటింటికీ వైఎస్సార్ పథకాలను ప్రచారం చేయూలి
రాజశేఖరరెడ్డి లేని పాలనను ప్రజలు గమనిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హన్మకొండలో పార్టీ జిల్లా విస్తృతస్థారుు సమావేశం
పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
 

కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమష్టిగా కృషిచేసి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తచాటాలని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. హన్మకొండలోని శ్రీ కళ్యాణి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల  సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయం గా పనిచేయూలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారం కోసం మెదక్‌లో ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యూరని, ఇప్పుడు.. ఒక  దళితుడిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి మరొక దళితునికి పదవి ఇవ్వడానికి వరంగల్ ఉప ఎన్నిక తీసుకువచ్చారని విమర్శించారు. ఇది.. కేసీఆర్ రాజకీయ వికృత చేష్టలకు నిదర్శమని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని, కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో హామీల వర్షం కురిసిస్తూ తెలంగాణ ప్రజలను మో సం చేస్తున్నాడని, ప్రజలు ఇది గమనించాలని పొంగులేటి కోరారు. వైఎస్సార్ పాలన లో అమలైన సంక్షేమ పథకాలను  ఇంటింటికీ తిరిగి ప్రజల కు వివరించి ఎన్నికలకు ఆయుధాలుగా వాడుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచిం చారు.

 4న పార్టీ అభ్యర్థి నామినేషన్
 వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా అందరికీ ఇష్టమైన వ్యక్తిని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తారని, ఆ అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ వేస్తాడని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధినే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అభ్యర్థిని గెలిపించుకొని వరంగల్‌లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలందరికీ న్యాయం చేశారని, ఆయన పాలన ఒక చరిత్ర అని అన్నారు. వైఎస్‌ఆర్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.   ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో జీవితాల్లో వెలుగులు నింపుకున్న ప్రజలు వైఎస్ కుటుంబంపై నమ్మకంగా ఉన్నారని, ఇటీవల తెలంగాణ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామార్శ యాత్రలో ప్రజలు సొంత ఇంటి బిడ్డగా ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు.

వరంగల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దొర, నవాబు పాలన చేస్తూ ప్రజలను అనేక విధాలుగా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త దళితుడిని సీఎం చేస్తానని చెప్పి దళిత డిప్యూటీ సీఎంను తొలగించాడని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ అంటే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు భయం పుట్టుకొస్తున్నదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత అందరికీ ఉన్నదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకుమార్, నాయకులు ఇరుగు సునీల్‌కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రైతు అధ్యక్షుడు కిష్టారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్య రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, పూజారి సాంబయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రె డ్డి, ముస్తఫా, మతిన్, జిల్లా నాయకులు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, మునిగాల కళ్యాణ్‌రాజ్, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, అప్పం కిషన్, దుప్పటి ప్రకాష్, సంగాల ఈర్మియా, గౌని సాంబయ్యగౌడ్, రాబర్ట్ విల్సన్, కౌటిల్‌రెడ్డి, దోపతి సుదర్శన్ రెడ్డి, చల్లా అమరేందర్ రెడ్డి, జి.సమ్మయ్య, పి.గాంధీ, బొడ్డు శ్రావన్, అచ్చిరెడ్డి, రజనీకాంత్, రాజేష్ రెడ్డి, ఎన్.దయాకర్, బద్రుద్దీన్‌ఖాన్, సుమిత్ గుప్తా, పవిత్రన్, ప్రతీక్‌రెడ్డి, ముజఫరుద్దీన్ ఖాన్, పి.సంపత్, సంగాల ఈర్మియా తదితరులు పాల్గొన్నారు.   

బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం


బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం
♦ హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన
♦ అభివృద్ధి అంతా అమరావతిలోనే అనడం సరికాదు
♦ {పజల్లో అసంతృప్తి, విభజనకు బీజాలు వేస్తున్నారు
♦ పెద్ద రాజధాని పేరుతో భ్రమలు కల్పించొద్దు
♦ హైదరాబాద్ ఉదంతం పునరావృతం కానీయొద్దు

 సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించే విధానంతో భవిష్యత్‌లో వెనుకబడిన ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయని, ఆ పరిస్థితి మరిన్ని అనర్థాలకు దారి తీస్తుందన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్లు పాటు ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ చేజారి పోయిన ఉదంతం నుంచి చంద్రబాబు గుణ పాఠం నేర్చుకోవడంలేదన్నారు.

ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సేకరించిన 33,500 ఎకరాలకు తోడు, అటవీ భూములను డీనోటిఫై చేయడం, భూసేకరణ చట్టం ప్రయోగించి రైతుల నుంచి తీసుకోవడం ద్వారా మొత్తం 60 నుంచి 70 వేల ఎకరాల్లో పెద్ద రాజధాని వస్తోందనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారని చెప్పారు. అసలు అంత పెద్ద రాజధాని ఎందుకు? దేశంలోకానీ, ప్రపంచంలోకానీ పెద్ద రాజధానుల వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాజధాని అంశాలపై అధ్యయనం చేసే పార్టీ కమిటీకి అధ్యక్షుని హోదాలో తాను ఇందుకు సంబంధించిన విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు.

చంద్రబాబు ఇపుడు అనుసరిస్తున్న వ్యూహం వల్ల వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు భవిష్యత్తులో దశాబ్దాల  పాటు అభివృద్ధి చెందకుండా ఉండిపోతాయనే భావన ప్రజల్లో కలుగుతుందని ధర్మాన అభిప్రాయపడ్డారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తే అన్నీ వాటిని అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. జిల్లాకొక సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. వెనుకబడిన శ్రీకాకుళం వాసులుగాని, రాయలసీమలోని ఒక జిల్లా వారు గాని తమకూ ఒక కేంద్రీయ సంస్థ కావాలని కోరుకుంటారు కదా అని ధర్మాన అన్నారు.

 హైదరాబాద్ అనుభవం ఏది?
 హెచ్‌ఎంటీ, బీడీఎల్, మిథాని, రక్షణ సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడే ఉపాధి అవకాశాలు పెరిగాయని, అందువల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన వివరించారు. దీంతో ఉపాధి కోసం హైదరాబాద్ వైపు చూడ్డం వల్ల ఊళ్ల నుంచి వలసలు పెరిగిపోయాయన్నారు. ఈ విషయం చంద్రబాబుతో సహా అందరూ చూశామన్నారు. అలాంటి నగరాన్ని కోల్పోయామనే ఆవేదన విభజన తర్వాత కూడా 13 జిల్లాల ప్రజల్లో ఉందని ధర్మాన చెప్పారు. అభివృద్ధి వెనుకబడి పోయింది 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. మళ్లీ 2000 సంవత్సరంలో అభివృద్ధి చెందిన తెలంగాణ ఫలాలు తమకే దక్కాలనే నినాదంతో ఉద్యమం వచ్చిందనే విషయం గుర్తించాలన్నారు. పలు రాష్ట్రాలు కేంద్రం తమకిచ్చిన సంస్థలను ఒక్క రాజధానిలోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం నెలకొల్పాయని, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే సంస్థలు పెట్టడం వల్ల మిగతా 13 జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇపుడు చంద్రబాబు చేస్తున్న పని వల్ల మళ్లీ తమ ప్రాంతాలు అభివృద్ధి చెందవేమోనన్న అనుమానాలు పలు జిల్లాల ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. అభివృద్ధి అంతా రాజధానిలోనే కేంద్రీకరిస్తే రాష్ట్ర ప్రజల్లో మరో విభజన ఆలోచన కొన్ని సంవత్సరాల తర్వాతైనా వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

 అది విజ్ఞత కాదు..
 ‘నైన్ ఇన్ ఒన్’ (ఒకే చోట తొమ్మిది అంశాల కేంద్రీకరణ) అనే పేరుతో పరిశ్రమలు, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఆరోగ్యం, వినోదం వంటివన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పడం విజ్ఞత గల రాజకీయవేత్తలు చేసే పనికాదని ధర్మాన అన్నారు. పెద్ద రాజధాని అనేది చక్రవర్తులు నిర్మించుకునేదని, అభివృద్ధికి మంచి పాలనే ఉండాలి తప్ప రాజధాని ఎంత పెద్దదనేది కొలమానం కాదన్నారు. ప్రైవేటు పెట్టుబడిదారులు ఊరికే తమ నిధులు వెచ్చించరని, వారు నిర్మించబోయే అమరావతిలోకి ఎంట్రీ ఫీజు మొదలు కారు నడిపినందుకు, పార్కింగ్, చివరకు టాయిలెట్  వినియోగించుకున్నందుకు కూడా ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.

పౌర సేవలకు ఫీజులు చెల్లించే నగరం నిజంగా పేదల రాజధాని అవుతుందా? అంటూ ప్రశ్నించారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించే విధానానికి చంద్రబాబు స్వస్తి చెప్పాలన్నారు. మిగతా ప్రాంతాలు అన్యాయానికి గురికాకుండా చూడాలని, భవిష్యత్తులో విభజన ఉద్యమాలు రాకుండా విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన చెప్పారు.  తర్వాత ప్రభుత్వాలు కూడా సరిదిద్దలేని తప్పు చంద్రబాబు చేస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. తాను చెప్పిన విషయాల్లో రాజకీయ ఉద్దేశ్యాలు లేవని, తీవ్రమైన ఆవేదనతోనే చెబుతున్నానన్నారు.

నేడు వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం

Written By news on Sunday, November 1, 2015 | 11/01/2015

వరంగల్ లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించనుంది. ఆదివారం మధ్నాహ్నం వైఎస్ఆర్ సీపీ తెలంగాణ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ చెప్పారు.

Popular Posts

Topics :