08 November 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వారికి ఓటడిగే హక్కు లేదు

Written By news on Saturday, November 14, 2015 | 11/14/2015


వారికి ఓటడిగే హక్కు లేదు
♦ టీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపాటు
♦ తెలంగాణ, ఏపీ సీఎంలు ప్రజలకు చేసిందేమీ లేదు
♦ రైతులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు
♦16 నుంచి వరంగల్‌లో పార్టీ అధినేత జగన్ ప్రచారం

 కాజీపేట రూరల్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గద్దెనెక్కాక హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌కు, కేంద్రంలో బీజేపీకి వరంగల్ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు పాల్పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యూరని దుయ్యబట్టారు. శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు  భరోసా కల్పించారన్నారు. 2004 ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ రైతులతో పాటు అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసిందని, ఆ రోజుల్లో వైఎస్ మండుటెండల్లో పాదయాత్ర చేసి ప్రజల దీవెనలతో సీఎం అయ్యూరన్నారు. వైఎస్ ఆశయాల సాధనే లక్ష్యంగా స్థాపించిన వైఎస్సార్‌సీపీకే ప్రస్తుత ఎన్నికలో ఓటడిగే హక్కు ఉందని అన్నారు. వరంగల్‌లో తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు గెలిపించాలని కోరారు. తెలంగాణ కేబినెట్‌లో స్థానం కల్పించకపోవడాన్ని మహిళలు గమనిస్తున్నారని తెలిపారు.

 16 నుంచి 19 వరకు జగన్ ప్రచారం
 వరంగల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు ప్రచారం నిర్వహిస్తారని పొంగులేటి తెలిపారు. 16న హైదరాబాద్ నుంచి జనగామకు చేరుకోనున్న జగన్.. పాలకుర్తి, జఫర్‌గఢ్, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ మండలాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. 17న హన్మకొండ, ఆత్మకూరు, రేగొండ, భూపాలపల్లి, చెన్నరావుపేట, పరకాల మండలాల్లో, 18న హన్మకొండ, సంగెం, గీసుగొండ మండలాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. అదే రోజు హన్మకొండలో జగన్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. 19న హన్మకొండ, న యీంనగర్, కేయు క్రాస్‌రోడ్డు, కాజీపేట, మడికొండతో పాటు ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి మండలాలలో జగన్ ప్రచారం చేస్తారని వివరించారు.

 బ్రహ్మరథం పడుతున్న ప్రజలు: నల్లా
 ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే రోజా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. రోజా పర్యటనతో ఇతర పార్టీలకు భయం పట్టుకుందన్నారు. ఈ సమావేశంలో  పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు శివకుమార్, గున్నం నాగిరెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, మతిన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్ పాల్గొన్నారు.

16 నుంచి వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం


'16 నుంచి వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం'
వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని తెలంగాణలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైఎస్ జగన్ ఈ ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు.
శుక్రవారం విలేకర్ల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ, స్టేషన్ ఘన్ పూర్, తొర్రూర్, పరకాల బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తో పాటు పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

ఆ కంపెనీపై ఔదార్యంతో ..


ఇది సర్కారు వారి భూ బాగోతం
ఆ భూమికి సీసీఎల్‌ఎ-కలెక్టర్ కమిటీ నిర్ధారించిన ధర రూ. 363 కోట్లు...
ఆ కంపెనీపై ఔదార్యంతో ముఖ్యమంత్రి నిర్ణయించిన ధర రూ. 25 కోట్లు...
 

♦ విశాఖలోఐటీ కంపెనీకి భూ పందేరం..
♦ ఎకరా రూ.7.26 కోట్లకు ఏపీఎల్‌ఎంఏ కమిటీ సిఫార్సు.. రూ.50 లక్షలకే
     కేటాయించాలని సీఎం నిర్ణయం
♦ లోకేష్‌బాబుకు ఆ కంపెనీ అధినేత స్నేహితుడు కావడమే కారణం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. తొలుత ఈ భూములను తొలుత ఏపీఐఐసీకి కేటాయించేసి, ఆ తరువాత ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసేసేలా వ్యూహం రచించింది. అలా రూ.363 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని కేవలం రూ.25 కోట్లకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కారణం ఆ కంపెనీ అధినేత ‘చినబాబు’ లోకేష్‌బాబుకు సన్నిహితుడు కావడమే. ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కి చెందిన ‘పారడైం నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఐటీ కంపెనీకి విశాఖ జిల్లా మధురవాడలోని సింహాద్రి అప్పన్నకు చెందిన 50 ఎకరాల భూమిని ఎకరా రూ.లక్ష చొప్పున నామమాత్రపు లీజుకు కేటాయించేందుకు జూలై నెలలో జరిగిన  కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు తీసుకువెళ్లాయి.

అయితే ‘అప్పన్న భూములకు ఎసరు’ అనే శీర్షికన అదే రోజు ‘సాక్షి’ వార్తను ప్రచరించడంతోనూ, ఆ భూములను ఇచ్చేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అంగీకరించకపోవడంతోనూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేశారు. ఇప్పుడు అదే కంపెనీకి అదే ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా అప్పజెప్పేందుకు ఈ నెల 2వ తేదీన విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదట ఆ భూమిని 25 కోట్లకే ఏపీఐఐసీకి కేటాయించేశా రు. ఇక దానిని ఐటీ కంపెనీకి బదలాయించడమే మిగిలింది.

 తక్కువ ధరకు సీఎం సిఫార్సు...: విశాఖపట్టణం జిల్లా మధురవాడ గ్రామంలోని సర్వే నెంబర్ 409లో గల 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ.7.26 కోట్లు చొప్పున పరిశ్రమల పార్కు అభివృద్ధి కోసం ఏపీఐఐసీకి కేటాయించేందుకు విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఈ ఏడాది గత నెల 10వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థ (ఏపీఎంఎల్‌ఏ) గత నెల 16వ తేదీన సమావేశమైంది. ఈ సంస్థ సీసీఎల్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఎ కార్యదర్శి/ సంయుక్త కమిషనర్ సభ్యులుగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరం  రూ.7.26 కోట్లు చొప్పున పరిశ్రమల పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయించాలని సిఫార్సు చేసింది.

అయితే భూమి ధర ఎక్కువగా ఉందని, అంత ధరకు ప్రైవేట్ పెట్టుబడిదారులు రావడం కష్టమని, ధర తగ్గించాలని పరిశ్రమలశాఖతో పాటు ఐటీ శాఖ కూడాకోరాయి. దీంతో ఎకరం రూ.50 లక్షలకు కేటాయించాల్సిందిగా ఐటీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని ఫైలు సర్క్యులేషన్‌లో తీసుకుని ఈ నెల 2వ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీంతో 50 ఎకరాల భూమిని ఎకరం రూ.50 లక్షల చొప్పున ఏపీఐఐసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జె.సి.శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఐసీ త్వరలోనే ఈ భూమిని ఈ-సెంట్రిక్ సొల్యూషన్‌కు  బదలాయించనుంది. ఏపీఎంఎల్‌ఎతో పాటు జిల్లా కలెక్టర్ సిఫార్సులను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భూమికి తక్కువ ధరను నిర్థారించడం గమనార్హం.

 లోకేష్ స్నేహమే కారణం...: ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు గాది శ్రీధర్ రాజు. 2002లో నెలకొల్పిన ఈ-సెంట్రిక్  సొల్యూషన్స్‌కు అనుబంధంగా 2008లో పారాడైం నాలెడ్జ్ వెంచర్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలోనే విశాఖపట్నం ఎస్‌ఈజెడ్‌లో ఈ-సెంట్రిక్ సెంటర్‌ను ప్రారంభించిన శ్రీధర్ రాజు 21 కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉండటం గమనార్హం. అన్నిటికీ మించి ఆయ న ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు స్నేహితుడు. అందువల్లనే అత్యంత తక్కువ ధరకు భూమి కేటాయించేందుకు సర్కారు సిద్ధమైందని తెలుస్తోంది.

ఆ దమ్ము, ధైర్యం ఉందా?

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015


ఆ దమ్ము, ధైర్యం ఉందా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి ఖండించారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో అమరావతికి పంపేశారంటున్న చంద్రబాబు వందలకోట్లు ఆడంబరాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. మాయమాటలు, అబద్ధాలతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని పార్థసారధి విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందంటూనే ఆడంబరాలకు అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు హెచ్చిస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలకు కోతలు వేస్తున్నారని, ప్రజలపై ఆర్టీసీ చార్జీల భారం మోపారని ఆయన ధ్వజమెత్తారు.
 
ప్రబుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఆదాయ వ్యయాలపై ఆర్థికమంత్రి బహిరంగ చర్చకు రావాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవ ఆర్థిక పరిస్థితులు వివరించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వందలకోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. నేను ఇంకా హైదరాబాద్ లోనే ఉంటే ప్రజల తీర్పును అవమానించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి


వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియామితులయ్యారు. అలాగే, పార్టీ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా యల్లసిరి గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియామకాలు జరిగాయి.

డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ సభ


డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ సభ
సాక్షి, హైదరాబాద్: ‘బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల హక్కులు’ అనే అంశంపై డిసెంబర్ 2న పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో తవ్వకాలకు అనుమతించి దాదాపు 3,000 ఎకరాలు కట్టబెట్టడంపై మన్యం భగ్గుమంటోందని ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో గిరిజనుల న్యాయమైన అభిప్రాయాలను, వారి అనుభవాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు, బాక్సైట్ తవ్వకాలను నిరోధించేందుకు పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు పార్టీ తరపున 11 మందితో గిరిజన హక్కుల కమిటీని నియమించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, కె.రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, వంతల రాజేశ్వరి, పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు తెల్లం బాలరాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్-పార్టీ ప్రధాన కార్యదర్శి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ వి.విజయసాయిరెడ్డి సభ్యులుగా ఉంటార ని తెలిపారు.

ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు?


ప్రజల పక్షాన పవన్ ప్రశ్నించలేదేం?
♦ పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తిన అంబటి
♦ ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు?
♦ చంద్రబాబుకు అధికార ప్రతినిధిగా మారిపోయారా?

 సాక్షి, హైదరాబాద్: ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ఆవిర్భవించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రజా సమస్యలపై ఏమీ ప్రశ్నించకుండానే వెనుదిరగడం వెనుక కథ ఏమిటి? ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు? దీని వెనుక జరిగిన రసాయనిక చర్య ఏమిటి? ఆ లాలూచీ ఏమిటి? అని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తీరును దుయ్యబట్టారు.

‘‘సీఆర్‌డీఏ  ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు సంబంధించి రైతులపై రాక్షసపాలన సాగుతోంటే, పంటలను తగులబెట్టి భయోత్పాతం సృష్టిస్తోంటే ఎందుకు ప్రశ్నించలేదు? రూ. 1,350 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి నీళ్లు తెచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా చుక్క నీరు కూడా కృష్ణా డెల్టా రైతులకు ఇవ్వకుంటే ఎందుకు ప్రశ్నించలేదు? రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే వాటిపై ఎందుకడగలేదు?’’ అని సూటిగా ప్రశ్నించారు. పవన్ తన వద్ద డబ్బు లేదని చెప్పారు కనుక ఆయన్ను మోసుకొచ్చిన ప్రత్యేక విమానం ఖర్చు ప్రభుత్వం ఇచ్చిందా? లేక టీడీపీ దోచుకున్న సొమ్ము నుంచి ఇచ్చారా? చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన విస్తరణకు డబ్బు లేదన్న పవన్... తన వద్ద స్క్రిప్టు, డైలాగులే ఉన్నాయి కనుక నిర్మాతను వెతుక్కునే క్రమంలో బాబును కలిశారా? అని ప్రశ్నించారు.

 పవన్ తీరు అనుమానాస్పదం...
 పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబుకు అధికార ప్రతినిధిగా వ్యవహరించారనిపిస్తోందని, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఈ అంశం దివంగత వైఎస్  హయాంలోనే ప్రారంభం అయిందని చెప్పడం చూస్తే ఆయనకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదనే అనుమానం కలుగుతోందని అంబటి విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల అంశానికి తానే అంకురార్పణ చేశానని, దుబాయ్ కంపెనీకి ఇచ్చానని అయితే గవర్నర్ సలహా మేరకు, గిరిజనులు వ్యతిరేకించినందున రద్దు చేశానని చంద్రబాబు స్వయంగా డిసెంబర్ 24, 2011న గవర్నర్‌కు రాసిన లేఖలో స్వయంగా పేర్కొన్నారని చెప్పిన అంబటి ఆ ప్రతిని చూపించారు.  పవన్ ప్రశ్నించకుండా అధికారప్రతినిధిగా మాట్లాడటం చూస్తే జనసేన పార్టీని టీడీపీకి బీ-టీంగా తయారు చేసే పనిలో పవన్ ఉన్నారనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లుగా  పవన్ కూడా తన పార్టీని టీడీపీలో కలిపేస్తారని తాను భావించడం లేదని, పరిస్థితులు  ఆ అనుమానాలు నిజమనిపించేలా ఉన్నాయని అంబటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వంగవీటి రంగా హత్యతో బాబుకు సంబంధం ఉందని  హరిరామజోగయ్య ఇటీవల తన ఆత్మకథలో వెల్లడించిన అంశం ఇపుడు సర్వత్రా చర్చగా ఉందని, దాని నుంచి  ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉందని అంబటి ధ్వజమెత్తారు. కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని, రూ.5,000 కోట్లతో వారికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని బాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వాటిని పూర్తిగా విస్మరించడంతో కాపునేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పోరాటానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ భేటీ ఏర్పాటుకావడం గమనించాల్సి ఉందన్నారు.

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో సోదాలు

గుంటూరు: గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. నాదెండ్ల మండలం చందవరంలో వేకువ జామునుంచే పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

అయితే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతోనే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని, తమపై అకారణంగా కేసులు బనాయించి ఇబ్బందుకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సోదాలు నిర్వహించడం పట్ల పార్టీ పెద్దలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘గల్లా’కు భూ నజరానా!


‘గల్లా’కు భూ నజరానా!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని కారుచౌకగా ధారాదత్తం చేసింది. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్‌కు కట్టబెట్టింది. ఈ మేరకు ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు.

కరకంబాడి ప్రాంతం దాదాపుగా తిరుపతి నగరంలో కలసిపోయింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా లెక్కేసుకున్నా బహిరంగ మార్కెట్‌లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్‌కు ఎకరా రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం.

ఎన్నికల్లో చేసిన సాయానికి...
రాష్ట్రం విడిపోయేవరకూ కాంగ్రెస్‌లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడు గల్లా జయదేవ్‌ను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించడంద్వారా రాజకీయ అరంగేట్రం చేయించారు. ఆమెకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్, కుమారుడికి గుంటూరు లోక్‌సభ టికెట్ ఖరారు చేసినందుకు ప్రతిగా ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి ‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు భారీగానే సొమ్ము ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి.

‘కీలకమైన ఎన్నికల్లో పార్టీకి సాయం చేసినందుకు నజరానాగా ఇప్పుడు విలువైన భూమిని కారుచౌకగా మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం నెలన్నర రోజుల్లోనే భూకేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేసింది’ అని టీడీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం.

కేవలం 42 రోజుల్లో...
కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల ప్రక్రియ పూర్తవడాన్నిబట్టే ఫైలు ఎంత శరవేగంగా కదిలిందో అర్థమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న చిత్తూరు జిల్లా కలెక్టర్ మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపులకోసం ఫైలు పంపించారు. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) దాన్ని ఆమోదించింది. అక్కడినుంచి ఆగమేఘాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదం పొందిన ఈ ఫైలు ఈ నెల 2న రాష్ట్ర మంత్రివర్గ ఎజెండాలో చేరిపోయింది. మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది.

‘‘భూకేటాయింపులకోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతుంటాయి. అయితే ఇది అధికారపక్షానికి చెందిన కీలక నేతకు సంబంధించింది కావడంతో రాకెట్ వేగంతో వెళ్లి కేవలం 42 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం పొందింది’’ అని రెవెన్యూశాఖకు చెందిన కిందిస్థాయి అధికారి ఒకరు అన్నారు.
 
మంత్రిగా ఉండగా సాధ్యం కాని పని..
గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విలువైన భూమిపై కన్నేశారు. పారిశ్రామిక అవసరాలు సాకుగా చూపించి దీన్ని కైవసం చేసుకోవాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీనే భూ కేటాయింపులకోసం ప్రతిపాదన తెప్పించుకున్నారు.

అప్పట్లో సీఎంగా ఉన్న కె.రోశయ్య, తదుపరి సీఎంగా వచ్చిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ భూకేటాయింపునకు మౌఖికంగా అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన రెవెన్యూశాఖలో పక్కన పడిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ కలెక్టర్ నుంచి ఈ భూమికోసం ప్రతిపాదన తెప్పించుకున్న ‘గల్లా’.. సీఎంతో మాట్లాడి ఆగమేఘాలపై ఫైలు నడిపించి ఓకే చేయించారు.

ఒక్క హామీ నెరవేర్చారా?


ఒక్క హామీ నెరవేర్చారా?
♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన రోజా
♦ అధికార పార్టీ స్వార్థం వల్లే వరంగల్ ఎన్నిక
♦ రాజన్న రాజ్యం కావాలంటే వైఎస్సార్‌సీపీనే గెలిపించండని పిలుపు

 హన్మకొండ చౌరస్తా, పోచమ్మ మైదాన్, గీసుకొండ: అధికార పార్టీ రాజకీయ స్వార్థం వల్లే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఏపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడినే మొదటి సీఎంగా చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని విస్మరించడమేగాక దళిత డిప్యూటీ సీఎం రాజయ్యను రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారని విమర్శించారు. ఎన్నికల్లో బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పునే వరంగల్ ప్రజలు కూడా ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా గురువారం వరంగల్ నగరంతో పాటు, గీసుకొండ, పరకాల, హసన్‌పర్తి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఇది స్వార్థ రాజకీయూల కోసం వచ్చిన ఎన్నిక అని, దీంతో ప్రజలపై పన్నుల భారం పడుతుందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో 50 శాతం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రివర్గంలో చోటే లేదు. ఇదేనా మహిళలకు దక్కే గౌరవం? టీఆర్‌ఎస్ 17 నెలల పాలనలో 1,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా స్పందించలేదు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటున్నా ఇప్పటివరకూ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. దళితులకు మూడెకరాల భూమిస్తామన్న మాట ఎక్కడ పోయింది?’’ అని రోజా ప్రశ్నించారు.

 గడప గడపనా వైఎస్ పథకాలే
 గడప గడపలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే కనిపిస్తున్నాయి తప్ప.. టీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క పథకమూ అమలుకు నోచుకోవడం లేదని రోజా అన్నారు. ఎన్నికలు రాగానే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు చొప్పున తిరుగుతూ ఓటర్లను బతిమాలుతున్న మంత్రులకు.. రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అని నిలదీశారు. ఇద్దరు చంద్రులు 2 రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఉన్న ఏ ఒక్క సీఎం కూడా వైఎస్సార్ లాంటి పాలన అందించలేక పోయారన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు. రోజా వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

 దళితులను అవమానపర్చారు: నల్లా
 దళితుడినే సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చారని వరంగల్ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. మంత్రివర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసి దళితులను అవమానపర్చారన్నారు. ఎన్‌కౌంటర్లు లేని రాజ్యాన్ని తీసుకొని వస్తానని చెప్పి.. వరంగల్ జిల్లాలో ఇద్దరిని ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చారని దుయ్యబట్టారు. రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పి.. డబ్బు సంచులు ముట్టడంతో మిన్నకుండిపోయారని అన్నారు.

ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రోడ్ షోలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, బోరుునపెల్లి శ్రీనివాస్‌రావు, మునిగాల కల్యాణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారు?

Written By news on Thursday, November 12, 2015 | 11/12/2015


పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారు?
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తాడనుకున్న పవన్ కల్యాణ్....ఆయనకు అధికార ప్రతినిధిగా మాట్లాడారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  ప్రశ్నించడానికే పుట్టిందన్న జనసేన పార్టీ అధినేత... ప్రశ్నించడం మానేసి రాజీ ధోరణిలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ... దృష్టి మరల్చడానికే బాబు-పవన్ భేటీ అయ్యారన్నారు. వీరిద్దరి భేటీ అంతా డ్రామాగా ఉందని అంబటి రాంబాబు విమర్శించారు.  

చంద్రబాబు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడే స్థితికి పవన్ కల్యాణ్ ఎందుకు దిగజారారని, పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారని, ఆయన వెళ్లిన ప్రత్యేక విమానం ఖర్చు ఎవరిదో బయటపెట్టాలన్నారు. టీడీపీ అనుబంధ సంస్థగా జనసేను మార్చబోతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకాన్ని పవన్‌కు పంపుతామని, ఆ పుస్తకాన్ని చదివైనా అవగాహన చేసుకుని చంద్రబాబును ప్రశ్నించాలని అంబటి రాంబాబు సూచించారు.

పవన్ కల్యాణ్‌తో మాట్లాడేందుకు గన్నవరం విమానాశ్రయానికి రైతులు వచ్చారని, అయితే పవన్ మాత్రం ఫ్లైట్ దిగి నేరుగా కారులో చంద్రబాబు దగ్గరకు వెళ్లిపోయారన్నారు. రైతుల గోడు వినడానికి కూడా పవన్ ప్రయత్నించలేదని అంబటి దుయ్యబట్టారు. భేటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని ప్రాంత రైతులకు పవన్ నిరాశే మిగిల్చారన్నారు. రైతుల సమస్యలను చంద్రబాబుకు పవన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ఇక బాక్సైట్ తవ్వకాలపై పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదని, బాక్సైట్ తవ్వకాలకు తెర తీసిందే చంద్రబాబు అని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారా? అవగాహన లేక చేస్తున్నారా? అని అంబటి ప్రశ్నించారు.  ప్రశ్నించడానికే ఉన్నామన్న పవన్ కిందస్థాయికి దిగజారిపోయారని, జనసేన ఎందుకు మారిపోయిందో దాన్ని నమ్ముకున్న అభిమానులకు అర్థం కాని స్థితిలో ఉన్నారన్నారు.

2న పాడేరులో వైఎస్ జగన్ బహిరంగ సభ,11 మందితో గిరిజన హక్కుల కమిటీ


2న పాడేరులో వైఎస్ జగన్ బహిరంగ సభ
హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట పట్టింది. 'బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల హక్కులు' అనే అంశం పై డిసెంబర్ 2న పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. బాక్సైట్ తవ్వకాలను నిరోధించేందుకు 11 మంది సభ్యులతో గిరిజన హక్కుల కమిటీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.
 
ఈ కమిటీలో గిడ్డి ఈశ్వరి, కె.సర్వేశ్వరరావు, కే.రాజన్నదొర, పి. పుష్పశ్రీవాణి, వి. కళావతి, వంతల రాజేశ్వరి, తెల్లం బాలరాజా, గుడివాడ అమర్నాథ్, సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డిలను సభ్యులుగా నియమించారు.

చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే


చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే
గుంటూరు :
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం వెనక ఉద్దేశం ఏంటని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. రైతుల తరఫున పోరాటం చేయడానికి వెళ్లారా.. లేదా చంద్రబాబుతో రాజీ పడేందుకు వెళ్లారో పవనే స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన విషయం పవన్ కల్యాణ్‌కు గుర్తుందా లేదా అని కూడా ఆర్కే సూటిగా ప్రశ్నించారు.

అతిథిగృహం కేరాఫ్‌గా దోపిడీ

Written By news on Wednesday, November 11, 2015 | 11/11/2015


అతిథిగృహం కేరాఫ్‌గా దోపిడీ
భూ సంతర్పణపై బంధుప్రీతి ఎందుకో?
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం

మంగళగిరి: రాష్ట్రంలో జరుగుతోన్న భూ దోపిడీ, ప్రకృతివనరుల దోపిడీ, అవినీతి అక్రమాలకు ఉండవల్లి కరకట్టపై ఉన్న ముఖ్యమంత్రి అక్రమ అతిథిగృహం కేరాఫ్‌గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
నేటి వరకు తెలుగు తమ్ముళ్లకు మట్టి, ఇసుక వంటి ప్రకృతి వనరుల దోచిపెట్టి తన మార్క్‌ను చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు బంధువులకు భూ సంతర్పణ చేస్తూ బంధుప్రీతికి కోట్ల విలువ గల భూములు ధారాదత్తం చేయడం తగదన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రూ. 500 కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ. 5 కోట్లకు కట్టబెట్టడం ఆయన అవినీతికి పరాకష్ట అన్నారు.
మరో వైపు రాజధాని పేరిట రైతులను బెదిరించి, భయపెట్టి లాక్కున్న భూములను బంధువులు, బినామీలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు విదేశాల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతూ, దోపిడీ కొనసాగిస్తూ అవినీతి చక్రవర్తిగా చంద్రబాబు పేరు గడిస్తున్నారని ఆర్కే దుయ్యబట్టారు.

అధికారుల నిర్లక్ష్యం - వైఎస్సార్ సీపీ ధర్నా

చిత్తూరు : ఓ పక్క భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇక్కట్లకు గురైతుంటే.. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఏర్పేడు మండలం ఇసుకతగేలి చెరువుకు గండి పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. దీనికి జిల్లా ఏఈ జయకుమార్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.

ఆ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు


ఆ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు
మెట్రో ఇండియా కథనంపై మైసూరారెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్: ‘ఇక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం’ అన్న శీర్షికన మెట్రో ఇండియా అనే ఆంగ్ల పత్రిక తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురించిన వార్తతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వెల్లడించారు. అసలు తాను ఆ పత్రికకు చెందిన ఏ విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ ఆంగ్ల పత్రికలో తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురితమైన కథనాన్ని చూసి విస్మయం చెందానని, అందుకే వివరణ ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఆ పత్రికకు చెందిన ఏ విలేకరీ తనను ఇంటర్వ్యూ చేయలేదని, తనతో మాట్లాడకుండానే అంత పెద్ద ఇంటర్వ్యూను ఎలా ప్రచురించిందో చెప్పాలని నిలదీశారు. తనను సంప్రదించకుండా ఆ కథనం ప్రచురించినందుకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు

ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

Written By news on Tuesday, November 10, 2015 | 11/10/2015


ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ :  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి  ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రజలంతా మహానేత వైఎస్ పాలన కోరుకుంటున్నారు


కేసీఆర్ మాటల మాంత్రికుడు
♦ ప్రజలకు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు
♦ రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు..
♦ టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
♦ ప్రజలంతా మహానేత వైఎస్ పాలన కోరుకుంటున్నారు
♦ వరంగల్ జిల్లా రోడ్‌షోలో ఏపీ ఎమ్మెల్యే రోజా

 స్టేషన్ ఘన్‌పూర్ టౌన్/రఘునాథపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మాటల మాంత్రికుడని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కేసీఆర్ మాటల మరాఠీలా ప్రజల్ని మభ్యపెట్టే హామీలిస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి నల్లా సూర్యపకాశ్‌కు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రం, రఘునాథపల్లిలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలలో రోజా మాట్లాడారు. కేసీఆర్‌కు రైతుల సమస్యలు పట్టడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రోజా పేర్కొన్నారు.

తెలంగాణలో దళితులు, మహిళలకు గౌరవం లేకుండా పోయిందని, వారిని అవమానించే విధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. దళితుడైన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంగా చేసిన కేసీఆర్.. కొద్ది కాలంలోనే బర్తరఫ్ చేయడం అన్యాయమన్నారు. దీనిపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ఎన్ని కుటుంబాలకు భూములిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని ఆయన పక్కనపెట్టారని... కేసీఆర్ కుటుంబ సభ్యులే అధికారం అనుభవిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకపోవడం మహిళల్ని అవమానించడమేనన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చారని, మహిళా సంక్షేమంపై ప్రత్యేక చొరవ తీసుకొని అభయహస్తం, పావలా వడ్డీకే రుణాలు తదితర పథకాలు ప్రవేశపెట్టారని రోజా గుర్తుచేశారు. వైఎస్సార్ తన పాలనలో పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సు సేవలు, పేద విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, అర్హులైన వృద్ధులు, వికలాంగులందరికీ పింఛన్లు తదితర బృహత్తర పథకాలు చేపట్టారన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలు వైఎస్‌ఆర్ పాలన కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారని రోజా తెలిపారు. తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ స్థానికుడు కాదంటూ టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఇతర నియోజకవర్గాల నుంచి గెలిచిన వారు కాదా అని రోజా ప్రశ్నించారు.

నల్లా సూర్యప్రకాశ్ మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను గెలిపిస్తే వైఎస్‌ఆర్ పాలన తెస్తారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు బుద్ది చెప్పాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, నియోజకవర్గ ఇన్‌చార్జి మునిగాల విలియం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగా ల కల్యాణ్‌రాజ్, పార్టీ మండల అధ్యక్షుడు ఊరడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 చంద్రబాబు మూటల మాంత్రికుడు
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలన సాగిస్తూ మూటల మాంత్రికుడిగా మారారని రోజా దుయ్యబట్టారు. పుష్కరాలు, పట్టిసీమ పేరుతో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడి డబ్బులు దండుకున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన ఆయన జైల్లో కాకుండా సీఎంగా ఉండటం విచారకరమన్నారు. తెలంగాణలో రైతుల సమస్యలపై టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని...ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపించడాన్ని ప్రజలు మర్చిపోలేదని బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు ఏపీలో రైతాంగ సమస్యల్ని పట్టించుకోకుండా తెలంగాణలో రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 వైఎస్ పాలన తెచ్చుకుందాం: పొంగులేటి
 దివంగత మహానేత వైఎస్‌ఆర్ అందించిన తరహా పాలన తెచ్చుకునేందుకు వరంగల్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ తమ పార్టీని ఆదరించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను కోరారు. రఘునాథపల్లిలో రోజా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వైఎస్ కుటుంబం రుణం తీర్చుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు. వైఎస్ పాలనలో ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందాయని, గిరిజనుల కోసం పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు.

మైనారిటీలకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించి ఉన్నత చదువులకు బాటలు వేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ ఎంపీగా తనను గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానన్నారు.

హోదా కోసం కాకినాడలో యువభేరి


హోదా కోసం కాకినాడలో యువభేరి
హాజరుకానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 
తూర్పుగోదావరి జిల్లా నేతల సమావేశంలో నిర్ణయం


 సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఆఖరు వారంలో కాకినాడలో యువభేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై విద్యార్థులు, నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తూర్పు గోదావరి జిల్లా పార్టీ నేతల సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ఈ సభ జరిగే అవకాశం ఉందని, బహుశా కాకినాడలోనే నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన ప్రత్యేక హోదా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలపై నిరుద్యోగులు, విద్యార్థులకు సభలో వివరించి జాగృతం చేయాలని జగన్ సంకల్పించారన్నారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను కూడా ప్రజల దృష్టికి తెచ్చి హోదా కచ్చితంగా ఇవ్వాలని ఒత్తిడి తెస్తారని తెలిపారు. విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమొక్కటే మేలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ భావిస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని, కానీ చంద్రబాబు దోపిడీ చేయడానికే ప్యాకేజీ కావాలంటున్నారని విమర్శించారు.

 ఆందోళనలో రైతాంగం
 తూర్పుగోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట చేతికి వచ్చే తరుణంలో కేంద్రం లెవీ ఎత్తివేయడంతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై స్పష్టత లేదని, దీంతో రైతాంగం యావత్తూ ఆందోళనలో ఉందని ధర్మాన తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం టీడీపీ వారితో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల ఆగడాలు నియోజకవర్గాల్లో పెరిగిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.

పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నా, వీధిలైట్లు వేయాలన్నా వారి వద్ద నిధుల్లేకుండా చేశారన్నారు. 18 నెలల కాలంలో ఆరే డుసార్లు మంత్రివర్గ సమావేశాల్లో చర్చించినా ఇసుక ధరలు తగ్గలేదని, సామాన్యులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయడం, నిర్మించడం గానీ చేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమస్యలన్నింటినీ పార్టీ నేతలు జగన్ దృష్టికి తెచ్చారన్నారు. త్వరలో పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను నియమించాలని జగన్ వారిని ఆదేశించారని, ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యక్రమంపై కూడా చర్చించామని చెప్పారు. బాగా పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు ఆమోదిస్తారని, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండదని బీహార్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ధర్మాన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బంధువుల కోసం బరితెగించిన సీఎం


సర్కారు భూకట్నం రూ. 300 కోట్లు!
♦ బంధువుల కోసం బరితెగించిన సీఎం
♦ బాలకృష్ణ వియ్యంకుడికి 498.93 ఎకరాల భూమి అప్పగింత
♦ ఎకరా రూ.60 లక్షలు విలువ చేసే భూమి రూ.లక్షకే ధారాదత్తం
♦ సీఆర్‌డీఏ పరిధిలోనే భారీ కాలుష్య పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు
♦ పర్యావరణానికి ముప్పని నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినా బేఖాతరు

సాక్షి, విజయవాడ: ఆయన విశాఖపట్నంలో ప్రముఖ పారిశ్రామికవేత్త. దాదాపు 25 కంపెనీలకు, ఓ ప్రముఖ విద్యాసంస్థకూ అధిపతి. అన్నింటికీ మించి టీడీపీ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బినామీగా పేరున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సమీప దూరంలో ఓ కాలుష్య పరిశ్రమ నిర్వహించాలనే కోరిక కలిగింది. కుమారుడు సీఎండీ, డెరైక్టర్‌గా ఓ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలోని తన సమీప బంధువులైన నేతలను కలిశారు. అంతే... 498.93 ఎకరాల భూమి అత్యంత సులువుగా ఆయన పరమైంది. ఏపీఐఐసీకి చెందిన ఈ భూమి విలువ.. సమీపంలో రాజధాని రావడంతో ప్రస్తుతం ఎకరా రూ.60 లక్షలకు చేరింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పెద్ద మనసుతో ఎకరా రూ.లక్ష రూపాయలకే తన బినామీ, సమీప బంధువు, టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీ ఎస్ మూర్తికి కట్టబెట్టేశారు. అలా సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని రూ. 300 కోట్ల విలువైన భూమిని ఆయనకు దోచిపెట్టారు.

ఆగమేఘాలపై ఉత్తర్వులు..
విశాఖ బాట్లింగ్ కంపెనీ (వీబీసీ) చైర్మన్, విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి తన కుమారుడు ఎంఎస్‌పీ రామారావు సీఎండీ, డెరైక్టర్‌గా జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ పేరిట భారీ ఎరువుల కర్మాగారాలు పెట్టాలని సంకల్పించారు. అందుకోసం గత ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 23వ తేదీన ఏపీఐఐసీకి కేటాయించిన (జీవో 523) 498.93 ఎకరాలపై కన్నేశారు. ఆ భూమిని తమకు కేటాయించాలంటూ వీబీసీ 2013 అక్టోబర్ 4న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా పక్కన పడేసింది. అయితే గత ఏడాది జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అదే నెల 28వ తేదీన వీబీసీ సంస్థ ఆ భూమికోసం లేఖ రాసింది. చంద్రబాబు వెంటనే దానికి పచ్చజెండా ఊపేశారు.

దీంతో ఇండస్ట్రియల్ పార్క్‌కు ఉద్దేశించిన భూమిని వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ విభాగం ఆగమేఘాలపై సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌డీఏ పరిధిలో, రాజధాని అమరావతికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి ఎకరాకు కేవలం రూ.లక్ష ధర నిర్ణయించి భూ సంతర్పణ చేసింది. అలా ముఖ్యమంత్రి తన సమీప బంధువుకు రూ.300 కోట్ల భూమిని రాసిచ్చేశారు. రాజధాని రాకతో ఆ భూమి ధర భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పచ్చని పంటలు పండే ఆ ప్రాంతంలో విషం చిమ్మే ఎరువుల కర్మాగారాలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

ఇక్కడ రోజుకు 4,400 టన్నుల అమ్మోనియా, 7,700 టన్నుల యూరియా, 800 టన్నుల నైట్రిక్ యాసిడ్ ఉత్పిత్తి చేసే పరిశ్రమలతో పాటు 135 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి చేసే కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కర్మాగారాలు ఉత్పత్తి ప్రారంభిస్తే వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల నీరు కలుషితమవుతుందని, భూములు నిస్సారమై పంటలు పండవని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. ఆ పరిశ్రమల్లో వాడే రసాయనాలు ప్రమాదవశాత్తూ లీకైతే భోపాల్, ఢిల్లీలో జరిగిన దారుణాలు పునరావృతమవుతాయని హెచ్చరించినా బేఖాతరు చేశారు.

కేంద్రం నుంచి బొగ్గు అనుమతులు లేకుండానే... బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రాజెక్ట్‌లో పొందుపరిచి దానికి కేంద్ర ప్రభుత్వంతో ముద్ర వేయించారు. అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి, స్థానిక ప్రజాప్రతినిధి సహకారంతో... గత నెల ఏడో తేదీన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా కర్మాగారం ఏర్పాటుకు అనుకూలంగా ముగించారు. ఇక ఢిల్లీ అనుమతుల్లో పూర్తి బిజీగా ఉన్నారు. ఎంతదూరమైనా పోరాడి కర్మాగారాలు సాధించటమే ఎజెండాగా రెండు రాజకీయ పార్టీల్లోని నేతలు తెరచాటున ఏకమై కసరత్తు సాగిస్తున్నారు.

అంతా బంధువులే...
విశాఖ బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి చైర్మన్. ఆయన చంద్రబాబుకు బినామీ అని, అందుకే గతంలో గీతం యూనివర్సిటీకి కారుచౌకగా భూములు కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ఆయన కుమారుడు ఎంఎస్‌పీ రామారావు వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు సీఎండీ, డెరైక్టర్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు రామారావు స్వయానా అల్లుడు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వియ్యంకుడు. బాలకృష్ణ చిన్న కుమార్తెను రామారావు కుమారుడు పెళ్లి చేసుకున్నారు.

కావూరి సాంబశివరావు 2013 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలోనే ఆయన అల్లుడు రామారావు జయంతిపురంలో వీబీసీ కర్మాగారం ఏర్పాటుకు దరఖాస్తు చేశారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రామారావు మరోసారి పావులు కదిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని నేతలు ఆయనకు సమీప బంధువులు కావడంతో ఈసారి అత్యంత సులువుగా అనుమతులు సంపాదించేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిత్యం విమర్శలు చేస్తున్న బీజేపీ నేత కావూరి సాంబశివరావు... తెరవెనుక తన అల్లుడి ఫ్యాక్టరీకి అనుమతులు తెచ్చుకునేందుకు అదే చంద్రబాబుతో లాలూచీ పడుతున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇవ్వాల్సి అనుమతులన్నీ అధికార పార్టీ ముఖ్యనేత ఉదారంగా ఇచ్చేస్తుండగా... కేంద్రంనుంచి రావాల్సిన అనుమతులన్నీ ఆయన చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.

బాబు, కేసీఆర్ తోడు దొంగలు: రోజా

Written By news on Monday, November 9, 2015 | 11/09/2015

వరంగల్: వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ మాటల మాంత్రికుడు, చంద్రబాబు మూటల మాంత్రికుడు అని విమర్శించారు.

సోమవారం ధర్మసాగర్‌లో ఎన్నికల రోడ్ షో నిర్వహించిన రోజా మాట్లాడుతూ చంద్రబాబు, కేసీఆర్ తోడు దొంగలని, రైతులకు వారు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరువు దుర్భిక్షమే తాండవిస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ అహంకారం వల్ల వరంగల్ ఉప ఎన్నిక వచ్చిందని, ఉప ఎన్నిక పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు.

రాజీనామా చేస్తా


రాజీనామా చేస్తా -  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైఎస్సార్ సీపీ నేత గిడ్డి ఈశ్వరి సోమవారం ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని పాడేరు ఎమ్మెల్యే సందర్శించారు. తన పదవికి రాజీనామా చేసి తానే మళ్లీ నిలబడతానని, తనతో పోటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, టీడీపీకి చెందిన మరెవరైనా పోటీ చేయవచ్చని చెప్పారు.
బాక్సైట్ మైనింగ్ ఎజెండాగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం బాక్సైట్ గనుల జోలికి రాకపోవడం మంచిదని హెచ్చరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ తదితర నేతలు పాల్గొన్నారు.

బాబు సవాల్ స్వీకరించిన అనంత వెంకట్రామిరెడ్డి


బాబు సవాల్ స్వీకరించిన అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం : రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్‌ను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్వీకరించారు. టీడీపీ హయాంలో రాయలసీమకు జరిగిన అన్యాయంపై బాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడు పిలిచినా తన వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. సాగునీరు, కేంద్ర సంస్థల కేటాయింపుల్లో సీమకు అన్యాయం జరిగిందని, చంద్రబాబు విధానాల వల్లే సీమ ఉనికికే అన్యాయంగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్యాయంపై ప్రశ్నించడం లేదని, బాబు సీమలో 25సార్లు పర్యటించినా ఒరిగిందేమీ లేదని అనంతర వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా రాయలసీమ వెనుకబాటుకు స్థానిక నాయకులే కారణమని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను సీమ బిడ్డనేనని, రాయలసీమకు తన కంఠంలో ప్రాణం ఉండగా అన్యాయం జరగనివ్వనని కర్నూలు పర్యటనలో ఆయన సోమవారం అన్నారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీమకు అన్యాయం జరిగిందనేవారు బహిరంగ చర్చకు రావచ్చని ఆయన డిమాండ్ చేసిన విషయం విదితమే.

జీవో 97ను ఉపసంహరించుకోవాలి


జీవో 97ను ఉపసంహరించుకోవాలి
♦ మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి డిమాండ్
♦ బాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల్ని
వ్యతిరేకించింది నిజమా? కాదా? అని నిలదీత

 సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని 1,220 హెక్టార్లభూమిలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జారీచేసిన జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో జారీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ 2011, డిసెంబర్ 24న అప్పటి గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారని ఆయన గుర్తుచేస్తూ.. ఈ విషయం వాస్తవమో కాదో స్పష్టం చేయాలన్నారు. అధికారంలోకొచ్చాక బాక్సైట్ తవ్వకాలకు అనుమతివ్వటంలోని ఆంతర్యం, గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో మార్పుకు దారితీసిన పరిస్థితులను వివరించాలన్నారు.

 బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొని అధికారంలోకొచ్చాక అందుకు విరుద్ధంగా జీవో జారీచేయటం ఆత్మవంచనతోపాటు గిరిజనులను వంచించటమేనని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు.

సుజనా చౌదరి వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి

Written By news on Sunday, November 8, 2015 | 11/08/2015


గుంటూరు: మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలకు గాను ఆయన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేసిన ఆయన.. మహిళల పట్ల ఇలా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బిహార్ ఫలితాలపై బొత్స మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కెటాయించకపోతే బీజేపీకి ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని అన్నారు.

నితీశ్‌, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు


నితీశ్‌, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్‌లో నితీశ్, లాలుకు అభినందనలు తెలిపారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జత నితీశ్, లాలు  అపూర్వ విజయాన్ని సాధించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సందర్భంగా నితీశ్, లాలును వైఎస్ జగన్ అభినందించారు

ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు


ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హామీలను పూర్తిగా విస్మరించారని, రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులకు ఒకే విడతలో రూ.లక్ష రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీ, వ్యవసాయానికి 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి అని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ విషయూన్ని విస్మరించారన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో గిరిజనులకు వారు సాగుచేస్తున్న భూములకు హక్కు పత్రాలను ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం వారి భూములను లాక్కుంటూ గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ విధానాలు ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, వైఎస్ అనంతరం పనిచేసిన సీఎంలు సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని పొంగులేటి అన్నారు. టీడీపీ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ఇక్కడ టీఆర్‌ఎస్ పాలన కన్నా ఘోరంగా ఉందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో తిరిగి వైఎస్‌ఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే వైస్ పాలన వస్తుందన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నిక ఇందుకు సరైన వేదికగా నిలుస్తుందని, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీలకు తగిన బుద్ది చెపుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అనంతరం అభ్యర్థి సూర్యప్రకాష్‌తో కలిసి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండల కేంద్రంలో  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నియోజక వర్గ ఇన్‌చార్జి మునిగాల విలియం, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలిపురి రఘు తదితరులు పాల్గొన్నారు.

అడ్డొచ్చారో.. ఈడ్చి పడేయిస్తా


అడ్డొచ్చారో.. ఈడ్చి పడేయిస్తా
♦ మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని
♦ కొల్లేరు అభయారణ్యంలో అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం
♦ అటవీ అధికారులపై దౌర్జన్యం..
♦ కైకలూరు స్టేషన్‌లో సిబ్బంది ఫిర్యాదు

 కైకలూరు (కృష్ణా): దెందులూరు అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి శివాలెత్తిపోయారు. ఆయన అక్రమ దందా పశ్చిమ నుంచి కృష్ణాకు పాకింది. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి ఘటన మరువకముందే అటవీశాఖ అధికారులపై చింతమనేని ప్రతాపం చూపి హంగామా సృష్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణాజిల్లా ఆటపాక నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక చేరడానికి ఆటపాక పక్షుల కేంద్ర చెరువు గట్టు మార్గంగా ఉంది. అభయారణ్య పరిధిలోని ఈ గట్టుపై కొల్లేరు 120 జీవో ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్న చింతమనేని.. తన అనుచరగణంతో చెరువు గట్టుపై గ్రావెల్ రోడ్డును దగ్గిరుండి వేయించారు. అడ్డొచ్చిన అటవీ అధికారులను అనుచరగణంతో ఈడ్చి పారేయించారు. ఆ సమయంలో అక్కడి ప్రజలెవరూ రాకుండా కాపలా ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి సుమారు 70 ట్రాక్టర్ల గ్రావెల్‌ను ఆటపాక రహదారి నిర్మాణానికి తరలించారు.

 బీట్ ఆఫీసర్ ఈడ్చివేత..: విషయం తెలుసుకుని ఆపడానికి వచ్చిన అటవీశాఖ ఫారెస్టు బీట్ ఆఫీసర్ బి.రాజేశ్‌ను అక్కడి నుంచి విచక్షణారహితంగా ఈడ్చిపారేశారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా నిలపిన సిబ్బంది వాహనాన్ని అనుచరులు పక్కకు నెట్టేశారు. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, పనులు ఆపకపోతే తన ఉద్యోగం పోతుందని రాజేశ్ బతిమలాడినా లెక్క చేయలేదు. తనపై కేసు పెట్టుకోవాలపి.. రోడ్డు పనులను ఆపితే  ఊరుకోబోనని చింతమనేని హెచ్చరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.ఈశ్వరరావు, బేస్‌క్యాంపు సిబ్బంది ఆర్.నరేశ్‌ను ఎమ్మెల్యే అనుచరులు తోసేశారు. ఓ వైపు వివాదం నడుస్తుండగానే మరోవైపు రోడ్డు నిర్మాణం రాత్రి 3.30 గంటలకు పూర్తయింది. అనంతరం చింతమనేని తమ వాహనాల్లో అనుచరగణంతో సహా వెళ్లిపోయారు.

 అక్రమ మేతల రవాణాకు రాచమార్గం..
 వివాదానికి కారణమైన కోమటిలంక గ్రామం.. చింతమనేని నియోజకవర్గ పరిధిలో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిలంక కొల్లేరు అభయారణ్యంలో వందలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వెలిశాయి. చింతమనేనికి బినామీ పేరుతో 360 ఎకరాల  చెరువులు ఉన్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి నుంచి మేతలు రవాణా చేయాలంటే రహదారి సౌకర్యం లేదు. ఆటపాక పక్షులు దొడ్డిగట్టు నుంచి మాత్రమే తరలించే అవకాశం ఉంది. దీంతో స్థానికుల ఆకాంక్షను ముందు పెట్టి ఆక్రమార్కులకు అవసరమైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారనే విమర్శలున్నాయి. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్  నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం  చర్చనీయాంశమైంది.

 పోలీసులకు ఫిర్యాదు.. : తమ విధులను అడ్డుకుని, సిబ్బందిపై దౌర్జన్యం చేశారని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోమటిలంక సర్పంచి జొన్నలగడ్డ శ్యాంబాబు, ఎంపీటీసీ గడిదేసి డేవిడ్‌రాజు, గ్రామపెద్దలు మంగర నాగరాజుపై అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసరు (డీఆర్వో) జి.ఈశ్వరరావు కైకలూరు టౌన్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసు కేసుతో పాటు, అభయారణ్య చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

 చింతమనేనిపై అటవీశాఖ కేసు నమోదు
 అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, ఎలాంటి అనుమతులు లేకుండా అభయారణ్య పరిధిలో రోడ్డు వేయడంపై అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు ఫిర్యాదు మేర కు వ్యణ్యప్రాణి అభయారణ్య చట్టం-1972 ప్రకారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై శనివారం కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్ 27, 29, 51 ప్రకారం కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే కైకలూరు టౌన్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి అటవీశాఖ అందించిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్‌ను వివరణ కోరితే  ఇటు ఫారెస్టు, అటు పోలీసు కేసు నమోదుపై ఉన్నతాధికారుల సలహాలను కోరుతున్నామని చెప్పారు.

http://www.sakshi.com/news/district/again-misbehaved-tdp-mla-chintamaneni-289606?pfrom=home-top-story

Popular Posts

Topics :