15 November 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పార్టీ ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్

Written By news on Saturday, November 21, 2015 | 11/21/2015


పార్టీ ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన లోటస్ పాండ్‌ లో పార్టీ ఎంపీలతో సమావేశం అవుతారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎంపీలతో చర్చిస్తారు.
 
కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 26 నుంచి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. కాగా  ప్రత్యేక హోదాతో పాటు పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హమీలు, కరువు, అకాల వర్షాలు, కేంద్రసాయం, రాజధాని అంశంతో పాటు కీలక ప్రజాసమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తెలిపారు.

సత్తా చాటనున్న వైఎస్సార్‌సీపీ

పార్టీ అధినేత జగన్  ప్రచారంతో పెరిగిన బలం
మహానేత జ్ఞాపకాల్లో పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు

 
వరంగల్ :  వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ సత్తా చాటనుంది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారానికి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి స్పందన వచ్చింది. జగన్ ఈనెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు ప్రచారం నిర్వహించారు. ఈ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో వైఎస్సార్ సీపీ కొత్త ఉత్సాహం వచ్చింది. మహానేత వైఎస్ పథకాలు మరవని ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా జనం కేరింతలు కొట్టారు.

ఉప ఎన్నికలో తమకు తిరుగుండదని భావించిన రాజకీయ పార్టీలు.. జగన్ సభలకు వచ్చిన ప్రజా స్పందన చూసి డోలాయమానంలో పడ్డాయి. హామీల అమలులో అధికార పార్టీ తీరుపై జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. హన్మకొండలో నిర్వహించిన బహిరంగసభకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడం, టీఆర్‌ఎస్‌కు ఊపునిచ్చిన జిల్లాలో జగన్‌కు లభించిన ఆదరణ చూస్తే భవిష్యత్‌లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 

సహాయక చర్యల్లో ఘోర వైఫల్యం

Written By news on Friday, November 20, 2015 | 11/20/2015


సహాయక చర్యల్లో ఘోర వైఫల్యం
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బొత్స
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  తిండి లేక ప్రజలు అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం  విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాధిత ప్రజలకు సరఫరా చేస్తున్న ఆహారం బాగా పాడై విషతుల్యంగా మారుతోందని దానిని తినడానికే జనం భయపడి పోతున్నారని అన్నారు.

తుపాను  హెచ్చరికలు వెలువడగానే సహాయక చర్యల్లో భాగంగా నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వంటి చర్యలు చేపట్టాలని, అలాంటివేమీ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.అధికారుల మధ్య సమన్వయం లేదని, ప్రజా ప్రతినిధుల మధ్య కూడా అప్రమత్తత కొరవడిందన్నారు.

ఐదు రోజులుగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతుంటే  ఆ ప్రాంతాల్లో పర్యటించాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదన్నారు. బుధవారం చిత్తూరు మేయర్ అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్లారు కనుక పనిలో పనిగా కొంత సేపు ఏరియల్ సర్వే చేసి వాతావరణం అనుకూలించలేదని తిరిగి వచ్చేశారన్నారు. బుధవారం సరే.. గురువారమైనా పర్యటించవచ్చుకదా? అని బొత్స ప్రశ్నిం చారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌదురి బీరేంద్రసింగ్ రాష్ట్రంలో కరువు ఉన్నట్లే తమ దృష్టికి రాలేదని చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయాల్సిందేనన్నారు. గిరిజనులను దోచుకోవడానికే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఓటడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఉంది


కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి
వరంగల్ ఉపఎన్నిక ప్రచార సభలో వైఎస్ జగన్ పిలుపు

ఎన్నికల హామీలన్నీ అటకెక్కించారు.. చేతగాని పాలన సాగిస్తున్నారు
విడతలుగానే రుణమాఫీ అని ఎన్నికల ముందు చెప్పారా?
అపరాధ వడ్డీలు కట్టడానికే సరిపోతున్న మాఫీ సొమ్ములు
అన్నదాతల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా..?
* కొత్తగా ఒక్క 108 అంబులెన్సు కొన్నారా?
గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకే దిక్కులేదు
* 79 రోజులుగా ఆశవర్కర్లు నిరాహారదీక్ష చేస్తున్నా పట్టదా?
ఏడాదిన్నరలో 396 ఇళ్లు కట్టడమే కేసీఆర్ ఘనత
ఏడాదికి 10 లక్షల ఇళ్లు కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్‌ఆర్
ఈ పాలనలో నింగినంటిన నిత్యావసరాల ధరలు..
విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే
ఓటడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఉంది..
వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర

వరంగల్ నుంచి సాక్షిప్రతినిధి: ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 18 నెలలకు పైగా అవుతోంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాగ్దానాలు చేశారు.  18 నెలల పాలన ఎలా సాగింది?  ఆప్పుడిచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా? ఒక్కసారి పరిశీలించిన తరువాత మనం ఈ ఉప ఎన్నికలో ఓటు వేద్దాం. మనం వేస్తున్న ఈ ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సరైన సమాధానం వస్తే ఆయనకే మద్దతు తెలుపుదాం. ఒకవేళ ఆయన నుంచి సరైన సమాధానం రాకపోతే ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పిలుపునిచ్చారు.

వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విజయాన్ని కాంక్షిస్తూ  తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ముగించారు. స్టేషన్ ఘన్‌పూర్  బస్టాండ్ చౌరస్తాకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ఒక్క అంబులెన్సు కూడా కొనలేదు..

‘పేదవాడు అప్పులపాలు కావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయని వైఎస్‌ఆర్ భావించేవారు. హఠాత్తుగా ఏదైనా పెద్ద జబ్బు చేసినపుడు ఆ పేదవానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నుంచి బైటపడడానికి గాను ఎంత వడ్డీ అయినా పరవాలేదని చెప్పి లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినపుడు ఆ పేదవాడు అప్పులపాలైపోతాడు. వారికి ఆ పరిస్థితి రాకూడదని భావించిన వైఎస్‌ఆర్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు.

108కి ఫోన్‌చేస్తే 20నిమిషాల్లోనే పేదవాని ఇంటికి అంబులెన్సు వచ్చి రోగిని తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించే పథకం అది.  వైఎస్‌ఆర్ మనకు దూరమైపోయి ఆరేళ్లవుతోంది. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఇన్నేళ్లయి నా ఇవాళ్టికి కూడా ఒక్క కొత్త అంబులెన్సును ఎందుకు కొనలేకపోయారు? ఇప్పటికీ అవే పాతబడ్డ అంబులెన్సులు. వాటి కి కనీసం టైర్లు కూడా మార్చలేని పరిస్థితి.

ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెరగడం లేదు. దాంతో వాళ్లు సమ్మె చేస్తున్న పరిస్థితి. వారిని పట్టించుకునే నాథుడే లేడు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని కేసీఆర్‌ను అడగండి. మీ పరిపాలన ఇంత దారుణంగా ఉందని ఆయనకు చెప్పండి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ గతేడాది బకాయిలకే దిక్కులేదు..

పేదవాని బిడ్డ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు చదివినప్పుడే పేదరికం పోతుందని వైఎస్‌ఆర్ ఆలోచించారు. పెద్ద చదువుల కోసం పేదవాడు అప్పులపాలు కారాదన్న ఆలోచనతో ఆయన ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేశారు. ఈ పథకం కింద గతఏడాది (2014-15)కి రూ.2,452 కోట్లు అవసరం ఉంటే వాటిలో కేవలం 922 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 1,530 కోట్లు బకాయిలున్నాయి.

ఈ ఏడాది కాలేజీలు మొదలై ఇప్పటికే ఐదునెలలు గడచిపోయాయి. కాలేజీల్లో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం పూర్తయి సర్టిఫికెట్లు అడిగితే విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇదేం పరిపాలన కేసీఆర్‌గారూ అని గట్టిగా నిలదీయండి.
 
వాళ్లకు ఓటడిగే హక్కు లేదు..
టీఆర్‌ఎస్ పాలించడం చేతకాని పార్టీ కనుక దానికి ఓటేయవద్దు. కాంగ్రెస్ అత్యంత నీచమైన పార్టీ. అవసరమైతే దండలేస్తారు. అవసరం తీరాక బండలేస్తారు. బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వైఎస్‌ఆర్‌పై ఎలాంటి అభాండాలు వేశారో, ఆయన కుటుంబాన్ని ఎలా జైలుపాలు చేశారో మీ అం దరికీ తెలుసు. నాయకుడినే ఇబ్బందిపెట్టిన పార్టీకి ప్రజలు ఓ లెక్కా? ఎవరో సచిన్ పైలట్ అట. ఆయన వచ్చి మన దగ్గర మీటింగులు పెడుతున్నారు.

ఆయనకు తెలుగువస్తుం దా? ఇలాంటి తెలుగు మాట్లాడలేని, తెలుగు అర్ధం చేసుకోలేని వాళ్లు మన దగ్గరకు వచ్చి మీటింగులు పెడితే వారిని చూసి మనం ఓటె య్యాలంట. బీజేపీకి ఓటేయమని చంద్రబాబు అడిగితే.. ఆంధ్రలో దారుణమైన అబద్ధాల పాలన సాగిస్తున్న విషయం గుర్తుచేయండి. వెన్నుపోటు, అబద్ధాలు, మోసం పునాదుల పైనే ఆయన పాలన సాగిస్తున్న విషయం చెప్పండి.

విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడగండి. ఈ నాయకులకు బుద్ధి రావాలంటే, వారు నేలమీద నడవాలంటే మీ ఓటు ద్వారానే సాధ్యమౌతుంది. ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ను గుం డెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఓటడిగే హక్కు మాకే ఉంది. విలువలు, విశ్వసనీయత ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థికి అఖండ విజ యం చేకూర్చండి.’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

ఇంకా ఈ  కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం సమన్వయకర్త తలశిల రఘురాం, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్,  రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్,  డాక్టర్ పి. ప్రపుల్లారెడ్డి,  గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీ. రఘురాంరెడ్డి,  జి. రాంభూపాల్‌రెడ్డి, బిమయ్యగౌడ్, సంపత్, సలీం సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, బీష్వ రవీందర్, అమర్‌నాథ్‌రెడ్డి, సంజీవరావు, బొడ్డు సాయినాథ్‌రెడ్డి,  సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బీ శ్రీనివాసరావు, అజయ్‌వర్మ, నర్రా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఆశ వర్కర్ల గోడు పట్టదా?

ఆశవర్కర్లు 79 రోజు లుగా సమ్మె చేస్తున్నారు. నెలకు రూ.500 నుంచి రూ.1000 సంపాదించే ఆశావర్కర్లు కిలో కందిపప్పు రూ.230, కిలో టమోటా రూ.50 లకు కొని ఎలా బతగ్గలరు అన్న ఆలోచన చేయలేని అధ్వాన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. పత్తిని సీసీఐ కొనుగోలు చేయడంలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,500 కూడా దక్కడం లేదు.

వైఎస్ హయాంలో పత్తి క్వింటాల్‌కు రూ.6,700 పలికిన విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయం డి. ప్రతి దళితునికి మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్ 18 నెలల్లో 1,600 ఎకరాలు పంచారు. వైఎస్‌ఆర్ ఐదేళ్లలో 20.60 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన విషయం తెలియజేయండి.

ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు?

 ఎన్నికలకు ముందు బ్యాంకు రుణాలు కట్టొద్దన్నారు. పంటరుణాలన్నీ మాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చాక నాలుగు విడతల్లో రుణమాఫీ అం టున్నారు. మాట ఇచ్చి వెనక్కు తగ్గినందునే ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది.

రుణాలు రెన్యువల్ కాకపోవడంతో పంటల బీమా కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందువల్లే ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగువిడతలుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని కేసీఆర్‌ను నిలదీయండి.
 
వైఎస్ దేశంతో పోటీ పడ్డారు, మరి మీరు?
అధికారంలోకి వస్తే రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 18 నెలల కాలంలో ఆయన కట్టించిన ఇళ్లు కేవలం 396. అదే వైఎస్‌ఆర్  హయాంలో ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే వైఎస్‌ఆర్ ఒక్కరే మన రాష్ర్టంలో 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీ పడ్డారు. 18 నెలల్లో 396 ఇళ్లు కట్టించి అదేదో గొప్పగా చేసినట్లు పేపర్లలో రాయించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని కేసీఆర్‌ను గట్టిగా అడగండి.

బుట్ట పట్టుకొని మార్కెట్‌కు ఎపుడన్నా వెళ్లారా?

ఎపుడన్నా మార్కెట్‌కు వెళ్లారా.. సరుకులు కొన్నారా అని కేసీఆర్‌ను అడగండి. కిలో కందిపప్పు రూ.230 ఉంది. గత ఏడాది రూ.90కే వచ్చేది. కిలో మినప్పప్పు రూ. 170 నుంచి 200 ఉంది. గతేడాది రూ.85 ఉం డేది. ఉల్లిపాయలు రూ.40 పలుకుతున్నాయి. గతేడాది రూ.22కే దొరి కేవి. టమోటా కేజీ రూ. 45 నుంచి 50 ఉన్నాయి.

గతేడాది రూ.14 మాత్రమే. ఇలా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతుంటే ఎలా కొనాలి? ఎలా బతకాలి కేసీఆర్‌గారూ.. ఇదేనా మీరు ప్రభుత్వం నడిపేతీరు అని నిలదీయండి. ఒకవైపేమో రైతుకు కనీస మద్దతు ధర దొరకడం లేదు.

23, 24న నెల్లూరు, కడప జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Thursday, November 19, 2015 | 11/19/2015


23, 24న నెల్లూరు, కడప జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్: భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అతలాకుతలం అవుతున్న నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. 23, 24 తేదిల్లో నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరులో ఆయన పర్యటిస్తారు. ఆ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోగా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. వైఎస్‌ జగన్‌.. ఆయా జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు  జిల్లా అధ్యక్షులను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇప్పటికే సూచించారు.

వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలో నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి...బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు.

26న గుంటూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈ నెల 26న గుంటూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అవలంభించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితుల హక్కులను చంద్రబాబు ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని, తీరు మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.  

కేసీఆర్‌ పాలనను బంగాళాఖాతంలో కలపండి...


కేసీఆర్‌ పాలనను బంగాళాఖాతంలో కలపండి...
వరంగల్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికల ప్రచార సభలో గురువారం ఆయన మాట్లాడుతూ....వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తీసుకు వచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు.  

లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, అయితే ఇంతవరకూ ఎన్ని రుణాలను మాఫీ చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామంటున్నారని,  ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోంది. ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. ఇక  నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు ఏం కొనేటట్లు లేదని  వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....
*వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పత్తి క్వింటాల్ కు రు.6,700 పలికింది.
*ఇప్పుడు రూ.3 వేలు కూడా పలకడం లేదు.
* రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు 4 విడతల్లో మాఫీ చేస్తామంటున్నారు.
* ఏడాది క్రితం కందిపప్పు రూ.90 ఉంటే... ఇప్పుడు రూ.230 అయింది.
* పెసరపప్పు రూ.85 నుంచి రు.200 అయింది.
*టమాటాలు కేజీ రూ.14 నుంచి రూ.45 అయింది.
* 18 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టించారో కేసీఆర్‌ను అడగండి.
* వైఎస్ఆర్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు.
* కేసీఆర్ ఇప్పటివరకూ 394 ఇళ్లు మాత్రమే కట్టించారు.
* ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.
* ఇప్పటివరకూ ఎంతమందికి ఇచ్చారో కేసీఆర్‌ను అడగండి.
* కేసీఆర్ కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతలు దులపుకున్నారు.
*వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66 ఎకరాల భూమి పంపిణీ చేశారు.
* పేదలు పెద్ద చదువులు చదవాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేశారు?
*కానీ కేసీఆర్ సర్కార్ గతేడాది బకాయిలే రూ.1530 కోట్లు చెల్లించలేదు.
*పేదవారి వైద్య సేవల కోసం 108 వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు.
*వైఎస్ఆర్ కొన్న అంబులెన్స్‌లు తప్ప... ఈ ప్రభుత్వం ఒక్క కొత్త అంబులెన్స్ కొనలేదు.
*ఈ పాలకులకు బుద్ధి రావాలంటే రాజన్న రాజ్యం రావాలి.
* కాంగ్రెస్ అంత అన్యాయమైన పార్టీ ఎక్కడా ఉండదు
* ప్రాణాలు లెక్కచేయక వైఎస్ఆర్ ...కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే
జగన్ పార్టీ విడిచిపెట్టాక వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ జైలుకు పంపింది.
* కాంగ్రెస్ పార్టీకి విలువలు, విశ్వసనీయత లేదు.
* చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసం, వెన్నుపోటు.
* అధికారంలోకి వచ్చి 18 నెలులు అయినా, కేంద్రంలోని బీజేపీ సర్కార్
ఒక్క హామీ నెరవేర్చలేదు.
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉంది.
*వైఎస్ఆర్ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి మేలు చేశారు.
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓటు వేసి గెలిపించండి.
*ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

రాజకీయాలలో నిజాయితీ రావాలి


కేసీఆర్ దిమ్మతిరిగేలా తీర్పు
♦ హన్మకొండ ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
♦ లక్షలోపు రుణాలు మాఫీ చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు
♦ ఆ రుణాలపై రైతులు 14 శాతం అపరాధ వడ్డీ కడుతున్నారు
♦ ముఖ్యమంత్రి ఇచ్చేదాంట్లో మూడొంతులు వడ్డీకే పోతోంది
♦ కేసీఆర్ మాట తప్పడం వల్లే రైతు ఆత్మహత్యలు
♦ కందిపప్పు, టమోటా ఈ రోజు పేదలు కొనగలరా?
♦ వైఎస్సార్ పాలనలో క్వింటాల్ పత్తి రూ 6,700 పలికింది
♦ వైఎస్ ఏడాదికి 10 లక్షల ఇళ్లు కడితే కేసీఆర్ ఏడాదిన్నరలో 396 ఇళ్లు కట్టారు
♦ ఆ నాలుగు పార్టీలకు ఓటడిగే హక్కు లేదు
♦ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేతగాని ప్రభుత్వం
♦ కాంగ్రెస్ కన్నా నీచమైన పార్టీ మరొకటి లేదు
♦ పక్క రాష్ర్టంలో దారుణంగా పాలిస్తున్న టీడీపీ
♦ కేంద్రంలో గద్దెనెక్కినా ఒక్క హామీ నెరవేర్చని బీజేపీ
♦ విలువలు, విశ్వసనీయత ఉన్న పార్టీ మాదే
♦ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓటేస్తే రాజన్న రాజ్యం

 వరంగల్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘ఎన్నికలకు ముందు కేసీఆర్ బ్యాంకు రుణాలు కట్టొద్దు అన్నారు. అధికారంలోకి వస్తే లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చెస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోంది. ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి చేతగాని పాలన మనకొద్దు. టీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి   వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘నాన్న చనిపోయినపుడు చాలా బాధపడ్డా. అయితే ఆయన వెళ్లిపోతూ ఇంతపెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చారు. మీ అందరి గుండెల్లో ఆయన కొలువై ఉన్నారని తెలుసుకున్న తర్వాత నేను బాధపడడం మానేశా. అందుకే నా ముఖంలో చిరునవ్వు చెదరదు. అదే స్ఫూర్తితో..అదే ధైర్యంతో మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా. మీ అందరి చల్లని దీవెనలు, అశీస్సులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలి. మీ అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.  గీసుకొండలో వెల్లువెత్తిన జన ప్రవాహం రాష్ట్రం అంతటా విస్తరించి 2019 నాటికి  రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం అని జగన్ చెప్పారు.

వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం వైఎస్ జగన్  ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హన్మకొండలోని హయగ్రీవా చారి మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ, అంతకు ముందు గీసుకొండ మండల కేంద్రంలోనూఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వివరాలు ఆయన మాటల్లోనే....
 ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే తీరు
 ఆశా వర్కర్లు 78 రోజుల నుంచి సమ్మెలు, నిరాహార దీక్షలు  చేస్తున్నారు. వాళ్లు సంపాదించేది నెలకు రూ 500 నుంచి రూ1000. ఇవాళ కేజీ టమోట రూ 50, కంది పప్పు 230. ఎలా బతకాలని వాళ్లు ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ల గురించి ఆలోచన కూడా చేయలేని అధ్వాన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఇటువంటి పాలకులకు మనం బుద్ది చెప్పాలి. పత్తి పొలాల్లోకి ఒక్కసారి అడుగుపెట్టి రైతులు పడుతున్న కష్టాలు చూడమని కేసీఆర్‌ను అడగండి. క్వింటాల్ పత్తి ధర రు.3,500 కూడా పలకడం లేదు. దివంగత వైఎస్‌ఆర్ పరిపాలనలో క్వింటాల్ పత్తి రూ 6,700లకు పలికిన విషయం ఆయనకు గుర్తు చేయండి. రైతన్నల కన్నీళ్లు పట్టని పెద్ద మనిషి  ముఖ్యమంత్రి కుర్చీలో ఎలా కూర్చుంటున్నావయ్యా అని నిలదీయండి. ఎన్నడైనా మార్కెట్‌కు వెళ్లారా, సరుకులు కొన్నారా అని కేసీఆర్‌ను అడగండి.  ఇవాళ మార్కెట్‌కు వెళ్లి కంది పప్పు కొనాలంటే కిలో రూ 230 ఉంది.గత ఏడాది ఇదే కందిపప్పు రూ 90లకే దొరికేది. మినప్పప్పు రూ 170 నుంచి 200 పలుకుతోంది. గత ఏడాది రూ 85గా ఉంది. కేజీ టమోట రూ 45నుంచి రూ 50. గత ఏడాది రూ 14లకే టమోటా దొరికేది. ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే  ఎక్కడి నుంచి తెచ్చి కొనాలి కేసీఆర్.. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నడిపే తీరు అని నిలదీయండి.

 ఆ నాలుగు పార్టీలకు ఓటడిగే హక్కు లేదు
 కాంగ్రెస్ ఒక నీచమైన పార్టీ. అవసరం ఉంటే ఓ నేతకు దండలు వేస్తారు, అవసరం తీరాక అదే నేత మీద బండలు వేస్తారు. ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌పై ఎలాంటి అభాండాలు వేశారో, ఆయన కుటుంబాన్ని కేసులు మోపి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు.  కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం వైఎస్ మంచి వారే... ఆయన కొడుకు కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం కూడా వైఎస్ మంచివారే. కానీ వైఎస్ కొడుకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారో అప్పుడే వైఎస్ చెడ్డవారు అయిపోయారు. ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో వైఎస్ కుటుంబాన్ని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడని పార్టీ అది.

వైఎస్ వంటి నాయకుడినే ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టిన పార్టీకి ఇక ప్రజలు ఒక లెక్కా? ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లు మీటింగులు పెట్టాలంటే ఎవరెవరిని పిలుచుకుంటున్నారో తెలుసా? ఎవరో సచిన్ పెలైట్ అట.  మీరంతా అడగండి ఆ సచిన్ పెలైట్‌కు తెలుగు వస్తుందా అని. ఇలాంటి తెలుగు మాట్లాడలేని వాళ్లు, తెలుగు భాష అర్ధం చేసుకోలేని వాళ్లు  మన దగ్గరకు వచ్చి మీటింగులు పెడతారటా..వాళ్ల మీటింగులు చూసి మనం ఓటెయ్యాలట. చంద్రబాబు వచ్చి బీజేపీకి ఓటేయమని అడిగితే చెప్పండి. 18 నెలలుగా మీరు సాగిస్తున్న దారుణమైన పాలన చూస్తున్నాం. మీ కంటే అంతో ఇంతో కేసీఆర్ మేలు అని చెప్పండి.

మీరు చెప్పినవాళ్లకు ఎందుకు ఓటేయాలని అడగండి.. బీజేపీ వాళ్లను కూడా మీకు ఎందుకు ఓటెయ్యాలని అడగండి. ఎన్నికలప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? అని గట్టిగా నిలదీయండి. ఇక టీఆర్‌ఎస్‌ది చేతగాని ప్రభుత్వం. కేసీఆర్ చేతగాని పాలన సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కి ఓటేస్తే కేసీఆర్ తన పాలన బాగుందని భావించే ప్రమాదముంది. అపుడు పరిస్థితి ఇంతకన్నా దిగజారిపోతుంది. అందుకే ఈ నాలుగు పార్టీలకు ఓటడిగే నైతిక హక్కు లేదు.

 రాజకీయాలలో నిజాయితీ రావాలి
 ఇపుడు పరిపాలన ఒక మాదిరిగా ఉండగా చెబుతున్న మాటలు మరో విధంగా ఉంటున్నాయి. వీళ్లందరికీ బుద్ధిరావాలి. రాజకీయాలలో నిజాయితీ రావాలి. మాట ఇస్తే దానిపై నిలబడాలన్న ఆలోచన పెరగాలి. జవాబుదారీతనం రావాలి. అపుడే విశ్వసనీయత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం మన ఓటు మాత్రమే. మన ఓటు ద్వారా రాజన్న రాజ్యం తెచ్చుకున్నపుడే ఇవన్నీ సాధ్యమౌతాయి. విలువలు, విశ్వసనీయత ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. వైఎస్ ఎక్కడ ఉన్నారని అడిగితే ప్రజలు తమ గుండెలు చూపించి ఇక్కడున్నారని చెబుతున్నారు.

అందుకే ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. ఆ అధికారం, హక్కుతో అడుగుతున్నా మాకు ఓటేయండి. రాజన్న రాజ్యం తెచ్చుకుందాం.’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు,  ప్రోగాం సమన్వయకర్త తలశిల రఘురాం, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్  రాష్ట్ర నాయకులు ఎడ్మకిష్టారెడ్డి, రెహ్మాన్, గాదె నిరంజన్‌రెడ్డి, శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, మతిన్‌మజాదాది, కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్,   ముస్తాఫా ముజతబా, డాక్టర్ పి. ప్రపుల్లారెడ్డి, నర్రాభిక్షపతి,  గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీ. రఘురాంరెడ్డి,  జి. రాంభూపాల్‌రెడ్డి,ఎం విలియమ్, ఏ.కుమార్, భీమయ్యగౌడ్, సంపత్, సలీం సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, బీష్వరవీందర్, అమర్‌నాథ్‌రెడ్డి, సంజీవరావు, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి సురేశ్‌రెడ్డి, నేతలు ఉపేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బీ శ్రీనివాసరావు, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నేతలు బోయినపల్లి శ్రీనివాసరావు, అజయ్‌వర్మ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు సిద్దార్థరెడ్డి, ఏ శ్యాంసుందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 ఏ హామీ నెరవేర్చారు..?
 ప్రతి దళితునికి  3 ఎకరాల చొప్పున భూమి ఇస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాలు దళితులకు పంచారు? దళితులకు  కనీసం 1,600 ఎకరాలు కూడా ఇవ్వని అధ్వాన స్థితిలో కేసీఆర్ పాలన సాగుతోంది. వైఎస్సార్ హయాంలో 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని కేసీఆర్‌కు అర్ధం అయ్యేలా చెప్పండి. పేదలకు పెద్ద చదువులు అందుబాటులోకి తేవడం కోసం వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ సంవత్సరం సంగతి దేవుడెరుగు 2014-15 సంవత్సరానికి సంబంధించి  అంటే గత ఏడాదికి సంబంధించి రూ.2,452 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటుకు కావాల్సి ఉంటే  వాటిలో రూ 1,530 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. అధికారంలోకి వస్తే రెండు బెడ్‌రూంల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 18నెలల కాలంలో ఆయన కట్టించింది  కేవలం 396 ఇళ్లు మాత్రమే. అదే వైఎస్సార్ పేదలకు ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆ ఐదేళ్ల కాలంలో దేశం మొత్తమ్మీద మిగిలిన రాష్ట్రాల్లో కట్టించిన ఇళ్లు 48 లక్షలు.

నెలాఖరున అనంతలో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Wednesday, November 18, 2015 | 11/18/2015


అనంతపురం : ఈ నెలాఖరున అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఎన్నో ఉద్యమాలు చేశారని విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరవధిక దీక్ష చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.

వర్షప్రభావిత జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల అతలాకుతలం అవుతున్న జిల్లాల్లో త్వరలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పర్యటించనున్నారు. ఇప్పటికే ఏపీలోని అనేక జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోగా...వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. వైఎస్‌ జగన్‌.. ఆయా జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు  జిల్లా అధ్యక్షులను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
 
ఇప్పటికే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి...బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. వైఎస్‌ జగన్‌ పర్యటన రూట్‌ మ్యాప్‌ను ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు.

కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్


కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్
వరంగల్ : 'ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హఠాత్తుగా ఎవరైనా చనిపోయి ఉంటే... ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటే ఎవరికీ ఆక్షేపణ ఉండదు. నిజంగా కూడా గర్వపడేవారం. ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయంటే... కేసీఆర్ మోజు తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉన్న ఎంపీని ఆ పదవికి రాజీనామా చేయించి, ఆయనను మంత్రిని చేశారు. ఇవాళ ప్రజల నెత్తిన ఇంత భారం వేస్తున్నారు.

ఎన్నికలు ఎలాగూ వచ్చాయి కాబట్టి... ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాల్సి ఉంది. 18 నెలల పరిపాలన చూశాక, కేసీఆర్ కు ఓటు వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పొరపాటు కేసీఆర్ కు ఓటు వేస్తే...  నా పాలన బాగుంది అందుకే ఓటు వేశారనుకుంటారు. ఇప్పుడే పట్టించుకోవటం లేదు. ఇక ఉప ఎన్నికలో గెలిస్తే... ఇక అస్సలు పట్టించుకోరని' వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవాచారి స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు.

వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో  టీఆర్ఎస్‌ను ఓడించి.... సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వాలని  వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా సభ ప్రారంభమైనా ఎంతో ఓపిగ్గా వేచి ఉన్నందుకు అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు వైఎస్‌ జగన్‌కు ఓరుగల్లు ప్రజలు నీరాజనం పలికారు. పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌ తరపున వైఎస్‌ జగన్‌ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రతిచోట విశేష స్పందన లభిస్తోంది. అంతకుముందు గీసుకొండలో ప్రసంగించిన వైఎస్‌ జగన్‌... సీఎం కేసీఆర్‌ 18నెలల పాలనపై నిప్పులు చెరిగారు.
 
ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే!
 • మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు శిరస్సు వంచి పేరుపేరును కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా.
 • ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి
 • హఠాత్తుగా ఎవరైనా చనిపోయి ఉండి ఈ ఎన్నికలు జరిగి ఉంటే ఎవరికీ ఆక్షేపణ ఉండకపోయింది
 • లేక కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా ఈ ఎన్నికలు జరిపి ఉంటే గర్వపడేవాళ్లం
 • కానీ కేసీఆర్ మోజు తీర్చుకునేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి
 • మీ పార్టీలో మన జిల్లా నుంచి గెలిచిన దళిత ఎమ్మెల్యేలు ఎవరూ లేరా? అని కేసీఆర్ ను అడగండి
 • వరంగల్‌ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలున్నా, మోజుపడి ఎంపీతో రాజీనామా  చేయించి.. మంత్రిని చేశారు.
 • డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని పదవి నుంచి ఊడబెరికారు
 • తన మోజు తీర్చుకోవడానికి ప్రజల నెత్తిన ఈ ఎన్నికల భారాన్ని కేసీఆర్ మోపుతున్నారు
 • కేసీఆర్ 18 నెలల పాలన చూసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలి.
 • పొరపాటున మనం కేసీఆర్‌కు ఓటు వేస్తే.. నా పరిపాలన బాగుందన్న భావనతో ఆయన ప్రజల్ని అసలే పట్టించుకోరు
 • 18 నెలల పాలనలో 150 మంది రైతులు మన జిల్లాలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
 • కేసీఆర్ ఒక్కసారైనా పత్తిరైతుల పొలాల్లోకి వెళ్లారా? వాళ్ల కష్టాలను స్వయంగా చూశారా?
 • పత్తి క్వింటాలు మద్దతు ధర 4,500 చెప్పి.. ఆ కోత, ఈ కోత పేరిట రైతులకు రూ. 3,500 ధర కూడా చెల్లంచడం లేదు.
 • రైతు రుణమాఫీ అమలు విషయంలో మోసం చేశారు.
 • నాలుగు దఫాలుగా రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల అప్పడే ఎందుకు చెప్పలేదు?
 • రుణాలు చెల్లించకపోవడంతో రైతుల నుంచి బ్యాంకులు 14శాతం అపరాధ వడ్డీని వసూలుచేస్తున్నాయి.
 • దీంతో వచ్చే మాఫీ సొమ్ములో ముప్పావు వంతు అపరాధ వడ్డీకే వెళుతున్నది
 • దివంగత నేత వైఎస్‌ఆర్ పరిపాలన గుర్తుతెచ్చుకోండి అని కేసీఆర్‌కు చెప్పండి
 • సీఎం అంటే వైఎస్ఆర్‌ మాదిరిగా ఉండాలి
 • రెండు బెడ్‌రూంల కట్టిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారు
 • కానీ ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఇళ్లు కట్టించారు? అని కేసీఆర్‌ను ప్రశ్నించండి
 • రాష్ట్రం మొత్తంగా కేసీఆర్ 398 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు కట్టించారు
 • వైఎస్ఆర్‌ ఐదేళ్లలో ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు
 • ఏ రోజు అయినా మీరు మార్కెట్‌కు వెళ్లారా? కూరగాయలు కొనాలంటే రేట్లు షాకు కొడుతున్నాయని కేసీఆర్‌ను గట్టిగా నిలదీయండి
 • ఏడాది కిందట కేజీ కందిపప్పు రూ. 90 ఉంటే ప్రస్తుతం రూ. 230. రూ.85 ఉన్న మినపపప్పు ప్రస్తుతం 200 కేజీ టమాటా ధర రూ. 14 నుంచి 50 అయింది.
 • పేదరికం పోవాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కరన్నా డాక్టర్ కావాలి, ఒక్కరన్నా ఇంజినీర్‌ కావాలి అనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ఆర్‌ ఫీజు రీయింబర్స్ మెంట్‌ పథకాన్ని తెచ్చారు
 • ఇవాళ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు సరిగ్గా జరుగలేదు.
 • కాలేజీలు మొదలై కూడా ఐదు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ గత ఏడాది ఫీజు బకాయిలే ప్రభుత్వం విడుదల చేయలేదు.
 • ప్రతి దళితుడికి కూడా మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమి పంచారో కేసీఆర్‌ను అడగండి
 • వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66వేల ఎకరాల భూమిని పంచితే.. కేసీఆర్ 1600 ఎకరాలు మాత్రమే పంచారు.
 • విశ్వసనీయత రావాలంటే రాజన్న రాజ్యం రావాలి.
 • అందుకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా.

కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?


కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కొనసాగుతోంది. బుధవారం ఆయన గీసుకొండలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక ఎంత భూమిని పంపిణి చేశారనే విషయాన్ని కేసీఆర్‌ ను గట్టిగా నిలదీయాలని సూచించారు. కేసీఆర్ అధికారం చేపట్టి 18 నెలలు అవుతోందని, ఈ కాలంలో ఆయన ప్రజలకు పంచింది కేవలం 16వందల ఎకరాలు మాత్రమేనని వైఎస్ జగన్ అన్నారు.

ఇక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయారన్నారు. ఇక పత్తికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతన్న ఆరుగాలం శ్రమించి పత్తి పండిస్తే... ఇవాళ మార్కెట్‌లో కొనే నాధుడే లేరన్నారు. అది బాగోలేదు...ఇది బాగోలేదంటూ రైతుల వద్ద నుంచి పత్తిని కొనడం లేదని, ఈ విషయం కేసీఆర్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.

పత్తి పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు చూడాలని..., ఒకసారి పత్తి పొలాలకు వస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్ కి 4,100 వస్తుందని, అదే రాజశేఖరరెడ్డి హయాంలో రూ.6,700 వరకూ వచ్చిన విషయాన్ని గుర్తించాలని అన్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు ఓటు వేసి, ఆయన్ని గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు.

కాజీపేట దర్గాలో వైఎస్ జగన్ ప్రార్థనలు

వరంగల్ జిల్లా కాజీపేటలోని ప్రఖ్యాత హజరత్ సయ్యద్ షా దర్గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులతో కలసి దర్గాకు వచ్చారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రార్థనలు చేశారు.
వైఎస్ జగన్‌కు కు  కుసుర్‌ పాషా, ఇతర మత పెద్దలు స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముస్లింల కోసం రిజర్వేషన్లు సహా ఎంతో చేశారని వైఎస్ జగన్ చెప్పారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ముస్లింలు అందరూ తమ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలకాలని కోరారు. అనంతరం నేతలతో కలసి వైఎస్ జగన్ హన్మకొండకు వెళ్లారు.

పేర్నినానిని పరామర్శించిన బొత్స


మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం సబ్ జైలులో ఉన్న వైఎస్సార్ సీపీ నేత పేర్నినానిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ బుధవారం పరామర్శించారు. రైతుల తరఫున పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై టీడీపీ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన మండిపడ్డారు. అంతకు ముందు పేర్నినాని విడుదల కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో బొత్స మాట్లాడారు.

అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతుల కోసం చివరి వరకూ పోరాడతామని బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు.  పేర్ని నానిని పరామర్శించిన వారిలో పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. మచిలీపట్నం పోర్ట్, దాని అనుబంధ పరిశ్రమల కోసం 30 వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ రైతుల తరఫున ఉద్యమిస్తున్న పేర్ని నానిని పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.

పేదవాని గోడు అరణ్యరోదనా..?


కేసీఆర్‌ను నిలదీయండి
వరంగల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పిలుపు

 వరంగల్ నుంచి సాక్షిప్రతినిధి : ‘వరంగల్ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి..? వెఎస్ హయాంలో క్వింటాల్ రు.6,700 ఉన్న పత్తి మద్దతు ధర ఇపుడు రు. 3,500 మాత్రమే ఎందుకుంది? 18 నెలల పాలనలో దళితులకు కేవలం 1600 ఎకరాలు మాత్రమే ఎందుకు పంచారు? గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేకపోయారు? ఏడాదిన్నర కాలంలో కొత్తగా ఒక్క అంబులెన్సును కూడా ఎందుకు కొనుగోలు చేయలేదు? గత ఏడాది కన్నా ఇపుడు నిత్యావసరాల ధరలు ఎందుకు మండిపోతున్నాయి..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసినా...వేయక పోయినా కేసీఆర్ ప్రభుత్వం పడిపోదు.

ఎన్నికల్లో గెలిచినా..ఓడినా తేడా రాదు. కానీ  పొరపాటున గెలిచారంటే కేసీఆర్ తన పరిపాలన బాగుంది అనుకొని ప్రజలను పూర్తిగా మరిచిపోయే ప్రమాదం ఉంది.  రైతుల మీద ఇంకా పెద్దపెద్ద బండలు వేసే రోజులు వస్తాయనే విషయం మర్చిపోకూడదు. అందుకే టీఆర్‌ఎస్‌ను ఓడించాలి’ అని ఆయన అన్నారు.  వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావుకు మద్దతుగా తెలంగాణ రాష్ర్ట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి వైఎస్ జగన్ మంగళవారం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  రెండవరోజైన మంగళవారంనాడు హన్మకొండ నుంచి మొదలైన ఎన్నికల ప్రచార యాత్ర భూపాల్‌పల్లి  మీదుగా సాగి , పరకాల నియోజకవర్గ కేంద్రంలో ముగిసింది. పరకాల  బస్టాండు చౌరస్తాలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే....

 ‘ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని కోసం ఎంపీ చేత రాజీనామా చేయించి, అందువల్ల ఉప ఎన్నికలు వచ్చి ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అని మనందరం సంతోషపడేవాళ్లం. ఇదే వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లకు మాత్రం మంత్రి పదవులు ఇవ్వరట. ఎంపీ చేత రాజీనామా చేయించి మరీ మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. తాను కోరుకున్న వ్యక్తి  తన మంత్రి మండలిలో ఉండాలని కేసీఆర్ గారు మోజు పడ్డారు. అందుకే ఆయన మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తే  ఉప ఎన్నికలకు ఇదా కారణం అని గట్టిగా నిలదీయండి..

 పేదవాని గోడు అరణ్యరోదనా..?
 పేదరికం అంటే ఏమిటో తెలుసా? పేదవాడు ఎందుకు అప్పుల పాలు అవుతాడనే ఆలోచన చేశారా అని ముఖ్యమంత్రిని అడగండి.. పేదవాడు అప్పుల పాలు కావడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. ఒకటి అనారోగ్యం. రెండోది పెద్ద చదువులు. పేదవానికి హఠాత్తుగా ఏమైనా పెద్ద జబ్బు చేస్తే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. నూటికి రూ 2, నుంచి రూ 5 వడ్డీ అయినా ఫర్వాలేదని చెప్పి లక్షలు అప్పుచేసి వైద్యం చేయించుకుని పేదవాడు అప్పుల పాలైపోతాడు. అందుకే వైఎస్సార్ గొప్పగా ఆలోచన చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా  108 నెంబర్‌కు ఫోన్ కొడితే...20 నిమిషాల్లో పేదవాని ఇంటికి వెళ్లి రోగిని తీసుకొని పోయి పెద్దాసుపత్రిలో వైద్యం చేయించే విధంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.

ఇవాళ కేసీఆర్ వస్తే అడగండి..! వైఎస్సార్ చనిపోయి ఆరేళ్లు అవుతోంది. ఆయన ఆరోగ్య శ్రీ పథకం పెట్టి  ఎనిమిదేళ్లు దాటుతోంది. మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలవుతున్నా ఇవాళ్టికి కూడా ఒక్క కొత్త అంబులెన్స్‌ను కూడా ఎందుకు తేలేకపోయారు కేసీఆర్ గారూ అని ప్రశ్నించండి. ఇప్పటికీ అవే పాతబడ్డ అంబులెన్స్‌లు, వాటికి కనీసం టైర్లు మార్చడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితులు ఉన్నాయి. అంబులెన్స్‌ల్లో పని చేసే సిబ్బంది జీతాలు అడిగితే పట్టించుకునే నాథుడు లేడు.  జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు 77 రోజులుగా సమ్మెలు చేస్తుంటే వాళ్లను కనీసం పలుకరించే నాధుడు కూడా లేడు. అయ్యా..!  మీ పరిపాలన ఇంత దారుణంగా ఉందని కేసీఆర్‌కు చెప్పండి.

 గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల మాటేమిటి?
 పేదవాని బిడ్డ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్‌లాంటి పెద్ద చదువులు చదివినప్పుడే ఆ పేదరికం పోతుందని,  పేదవాడు అప్పుల పాలు కాకుండానే పెద్ద చదువులు చదవాలనే ఆలోచనతో ఫీజు రీఎంబర్స్‌మెంటు పథకాన్ని వైఎస్సార్ అమల్లోకి తెచ్చారు.  ఈ సంవత్సరం సంగతి దేవుడెరుగు.. గత ఏడాది(2014-15)కి సంబంధించి రూ.2,452 కోట్ల మేర ఫీజు రీఎంబర్స్‌మెంటుకు కావాల్సి ఉంటే  వాటిలో ఇంకా రూ.1,530 కోట్ల మేర బకాయిలుగా ఎందుకున్నాయి అని కేసీఆర్‌ను గట్టిగా నిలదీసి అడగండి. ఈ ఏడాది కాలేజీలు మొదలై  ఐదు నెలలు గడిచిపోయాయి. పాత బకాయిలే ఇంకా మిగిలి ఉన్నాయి.

నాలుగో సంవత్సరం పూర్తయినా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ప్రభుత్వం ఫీజులు కట్టలేదు.. మీరు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు యాజమాన్యం చెప్తోంది. ఇదేనా మీ పరిపాలన అని కేసీఆర్‌ను గట్టిగా నిలదీయండి. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంబిస్తున్నట్లు పేపర్లో అట్టహాసంగా ఇచ్చిన ప్రకటనలు చూశాం. కేసీఆర్ హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు ప్రారంభించారో తెలుసా?  కేవలం 396 ఇళ్లు మాత్రమే.  18 నెలల కాలంలో ఇవేనా మీరు కట్టించిన కొత్త ఇళ్లు అని కేసీఆర్‌ను అడగండి. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ ఒక్కడే తెలుగు రాష్ట్రాల్లో 48 లక్షల ఇళ్లు కట్టి చూపించి దేశంతో పోటీ పడ్డారు. ఆ విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయండి.

ఇంకా ఈ కార్యక్రమంలో  వైఎస్సాఆర్‌సీపీ శాసనసభా పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రోగాం సమన్వయకర్త తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  ఎడ్మ కిష్టారెడ్డి, ఎ.రెహ్మాన్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు భీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, పీ రాంరెడ్డి, బంగి లక్ష్మణ్, సుమిత్‌గుప్తా, వరంగల్‌జిల్లా నేతలు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జి.శివ, ఐ.వెంకటేశ్వర్ర్రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, కమల్‌రాజ్, ఎం.కళ్యాణ్‌రాజ్, కె.నరేందర్‌రెడ్డి  మెదక్‌జిల్లా నాయకులు నర్రాభిక్షపతి, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, సంజీవరావు, జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా నేతలు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరావు, అజయ్‌వర్మ,  నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 షాక్ కొడుతున్న నిత్యావసరాలు
 కేసీఆర్ గెలిచి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో మీరు ఎప్పుడైనా మార్కెట్‌కు వెళ్లారా అని కేసీఆర్‌ను అడగండి. అక్కడ సరుకులు ఎప్పుడైనా కొన్నారా అని  అడగండి. ఇవాళ మార్కెట్‌కు వెళ్లి కంది పప్పు కొనాలంటే కిలో కంది రూ 230 ఉంది. గత ఏడాది ఇదే కందిపప్పు రూ.70లకే వచ్చేది. మినప్పప్పు రూ. 170 నుంచి రూ. 200 ఉంది గత ఏడాది రూ 85 ఉంది. టమోట చూసుకుంటే ఇవాళ కేజీ రూ 50. గత ఏడాది రూ. 14లకే దొరికేది. ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎట్లా కొనాలి కేసీఆర్ గారూ ఇదేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నడిపే తీరు అని నిలదీయండి. ఒక వైపేమో రైతుకు కనీస మద్దతు ధర కూడా దొరకటం లేదు, వరి అమ్ముకోవాలంటే కనీస మద్దతు ధరకంటే రూ 200 తక్కువగా ఇస్తున్నారు.  ఇంకో వైపేమో వినియోగదారులకు మార్కెట్‌లో ధరలు షాక్‌కొట్టేటట్టున్నాయి.

 రైతుల బాధలు పట్టవా..?
 కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క వరంగల్‌జిల్లాలోనే 150 మంది రైతులు చనిపోయారు. అంతమంది రైతులు ఎందుకు చనిపోయారని కేసీఆర్‌ను అడగండి. పత్తి పొలాల్లోకి ఒక్కసారి అడుగుపెట్టాలని, రైతులు పడుతున్న బాధలు చూడాలని ముఖ్యమంత్రిని అడగండి.  కల్లాల నుంచి పత్తిని తీసుకొని పోతే కొనే నాథుడే లేడు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ 4,100 అని చెప్తారు కానీ ఆ కోత, ఈ కోత పెట్టి  రైతులకు మాత్రం రూ.3,500లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వైఎస్‌ఆర్ పరిపాలనలో క్వింటాల్ పత్తి రూ 6,700లకు పలికిన విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయండి. ఎందుకయ్యా మీరు పట్టించుకోవటం లేదు. ఎందుకయ్యా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయించడం లేదని  నిలదీయండి. ప్రతి దళితునికి  3 ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాలు దళితులకు పంచావయ్యా అని గట్టిగా కేసీఆర్‌ను నిలదీయండి. 18నెలల్లో ఆయన పంచింది కేవలం 1,600 ఎకరాలే. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేసిన విషయం  కేసీఆర్‌కు అర్థం అయ్యేలా చెప్పండి.

 ఓటడిగే హక్కు మాకే ఉంది..
  కాంగ్రెస్‌పార్టీకి ఓటేయకూడదు. ఎందుకంటే... అవసరం ఉంటే వాళ్లు ఒక నేతకు దండలు వేస్తారు, అవసరం తీరాక అదే నేత మీద బండలు వేస్తారు. వైఎస్సార్ బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్‌పార్టీ కోసం కష్టపడ్డారు. కాంగ్రెస్‌పార్టీకి ప్రాణం పోశారు. అదే నేత చనిపోయిన తరువాత చెడ్డవాడు అయిపోయాడు. ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో వైఎస్సార్ కుటుంబాన్ని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడని పార్టీ అది. వైఎస్ వంటి నాయకుణ్ణే ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టిన పార్టీకి ఇక ప్రజలు ఒక లెక్కనా?  చంద్రబాబు నాయుడు బీజేపీకి ఓటు వేయమని అడిగితే ఆయనకూ చెప్పండి, పక్కనే మీ ప్రభుత్వం నడుస్తోంది. 18 నెలలుగా మేం రోజూ చూస్తున్నాం. మీరు మా కేసీఆర్ కంటే ఇంకా దారుణమైన అబ ద్ధ్దాలు చెప్తున్నారని చంద్రబాబును నిల దీయండి.

వెన్నుపోటు, మోసం, అబద్దాలు అనే పునాదుల మీదనే చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ వాళ్లను కూడా మీకు ఎందుకు ఓటెయ్యాలని అడగండి. విభజన సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? అని గట్టిగా నిలదీయండి. ఒకే ఒకమాట చెప్తున్నా..!  నిజంగా ఓటు అడిగే హక్కు ఏ పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మాత్రమేనని గట్టిగా చెబుతున్నా. కారణం ఆ దివంగత నేత వైఎస్సార్ ప్రతి మనిషికి...ప్రతి కుటుంబానికి..ప్రతి గ్రామానికి..ప్రతిమండలానికి...ప్రతి జిల్లాకు మంచి చేశారు. ప్రతి గుండె చప్పుడు విన్న వ్యక్తి వైఎస్సార్. అందుకే ఆ మహానేత సువర్ణయుగాన్ని మనం మళ్లీ తెచ్చుకుందాం. అందుకే ఆ పాలన రావాలంటే ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలి అని మీ అందరినీ కోరుతున్నా’ అని జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

దీక్షలు చేయకు బిడ్డా.. ఆరోగ్యం ఆగమైతది

‘‘ఏంది బిడ్డా... తిండి తిప్పలు మాని దీక్షలు జేస్తున్నవు. ఆరోగ్యం ఆగమైంది బిడ్డా. నిన్ను అట్లా టీవీల జూస్తంటే మా పానం కొట్కలాడుద్ది. నాయిన ఉంటే నీకూ, మాకు ఈ కష్టాలు వచ్చేటియే కావు. చంద్రబాబు దొంగే జనాన్ని ఆగం జేస్తండు. ఆయన సంగతి దేవుడే జూసుకుంటడుగని నువ్వు దీక్షల మీద దీక్షలు చేయకు బిడ్డా..’’ అని వరంగల్ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లికి చెందిన వృద్ధురాలు నర్సమ్మ జగన్‌కు చెప్పింది. శాయంపేట మీదుగా కొప్పుల వైపు వస్తుండగా జోగంపల్లి శివారులోని పత్తి తోటల్లో పత్తి ఏరుతున్న మహిళలను జగన్ పలకరించారు. ఈ సందర్భంగా వారంతా వైఎస్సార్ ఉపాధి పని చూపెట్టాకే ఊళ్లలో రూ.100 కూలీ ఇస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్ వేసిన దారిలో ఇప్పటి నాయకులు మెరిగలు ఏరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్ మాటంటే మాటే.. రుణ మాఫీ చేస్తే మళ్లీ సూడకుండా మాఫీ అయినయి. కేసీఆర్ రుణ మాఫీ అన్నడుగాని బ్యాంకోళ్లతోటి తిప్పలు తప్పుతలెవ్వు. వడ్డీలు కట్టించుకుంటున్నరు..’’ అని సువర్ణ అనే మహిళ జగన్‌కు ఫిర్యాదు చేశారు.

జగన్ నేటి ప్రచార షెడ్యూల్‌లో మార్పులు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టే వరంగల్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మార్పుల ప్రకారం బుధవారం జగన్ జితేందర్‌నగర్, లక్ష్మినగర్, మచిలిబజార్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్, గొర్రెకుంట క్రాస్, ధర్మారం, కోనాయిమాకుల, గీసుకొండ, చింతల్ ఫ్లైఓవర్, మిల్స్‌కాలనీ పీఎస్, శంభునిపేట, ఉర్సు దర్గా, కరీమాబాద్, శివనగర్, హెడ్‌పోస్టాఫీస్‌ల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు.

అక్కడి నుంచి వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ములుగురోడ్, హన్మకొండ చౌరస్తా మీదుగా సాయంత్రం హన్మకొండకు చేరుకుని హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. గురువారం (19న) మాత్రం అంతకుముందు ప్రకటించిన ప్రచార షెడ్యూల్‌కు అనుగుణంగానే హన్మకొండ నుంచి బయలుదేరి న యీంనగర్, కేయూ క్రాస్‌రోడ్, ఖాజీపేట, మడికొండ, ధర్మసాగర్, ఎల్కుర్తి, పెద్దపెండ్యాల, చిన్నపెండ్యాల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. సాయంత్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్, కోమళ్ల, షాగల్, రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు.

వైఎస్ జగన్ పర్యటనకు భయపడే

Written By news on Tuesday, November 17, 2015 | 11/17/2015


'వైఎస్ జగన్ పర్యటనకు భయపడే'
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాల జీవోను శాశ్వతంగా రద్దు చేసేవరకు వైఎస్సార్ సీపీ ఉద్యమం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనకు భయపడే జీవోను చంద్రబాబు తాత్కాలికంగా నిలిపివేశారని ఎద్దేవా చేశారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని, గిరిజనులకు అండగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని ఈశ్వరి తెలిపారు.  

వైఎస్ జగన్ కు శారదా పీఠాధిపతి ఆశీస్సులు

హన్మకొండ: హిందూ ధార్మిక వ్యవస్థ, ఆలయ వ్యవస్థ రక్షణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. హన్మకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.

కార్తీకమాసం సందర్భంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహభాషణం చేస్తూ.. తండ్రి లాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ధార్మిక భావాలు కలవారని, ప్రజాసంక్షేమం కోసం ఏపీలో పోరాటం చేస్తున్నారని, ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వలే తెలంగాణలో దేవాదాయ శాఖకు సారవంతమైన భూములు లేవని, కేవలం వేతనాలపైనే అర్చకులు ఆధారపడుతున్నారని తెలిపారు.

వైఎస్ జగన్ ప్రచారంలో స్వల్ప మార్పులు

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో 18వ తేదీ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆ వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

మూడో రోజు 18వ తేదీ బుధవారం మొత్తం 45 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం సాగనుంది. బుధవారం ఉదయం జితేందర్ నగర్ లో ప్రారంభమై పెద్దమ్మగడ్డ, పోచమ్మ మైదాన్, గొర్రెకుంట క్రాస్, గీసుకొండ, శంభునిపేట జంక్షన్, శివ నగర్ మీదుగా సాయంత్రం హన్మకొండ చౌరస్తాకు ఎన్నికల ప్రచారం చేరనుంది. బుధవారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్స్ లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

చివరి రోజు 19వ తేదీ గురువారం మొత్తం 62 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం జరగనుంది. గురువారం ఉదయం హన్మకొండ లో ప్రారంభమై ధర్మాసాగర్, స్టేషన్ ఘనపూర్,  మీదుగా రఘనాథపల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి వైస్ జగన్ హైదరాబాద్ పయనమవుతారు. గురువారం స్టేషన్ ఘనపూర్ లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం నుంచి వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.

ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి అని కేసీఆర్‌ను నిలదీయండి


కేసీఆర్ ను గట్టిగా నిలదీయండి: వైఎస్ జగన్
పరకాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా రెండో రోజు వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పరకాలలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కేసీఆర్ మోజుతోనే వరంగల్ లోక్‌ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. ఎంపీకి మంత్రి పదవి ఇచ్చి ఉప ఎన్నిక తెచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ 18 నెలల పరిపాలనలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని వైఎస్ జగన్ విమర్శించారు. రైతు కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలపై కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రైతులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 5 ఏళ్లలో 45 లక్షల ఇళ్లు కట్టిస్తే... కేసీఆర్ 18 నెలల పాలనలో 396 ఇళ్లు మాత్రమే కట్టించారని తెలిపారు.

వరంగల్ లో టీఆర్ఎస్ గెలిస్తే తన పాలన అంతా బాగుందని కేసీఆర్ భావిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. టీడీపీ ఓటు అడిగే అధికారం లేదన్నారు. ఎన్నికల హామీలపై బీజేపీని నిలదీయాలని సూచించారు. ఓటు అడిగే అధికారం తమ పార్టీకే ఉందని వైఎస్ జగన్ అన్నారు. 
 
ఇంకా ఆయన ఏమన్నారంటే..
 • ఇవాళ  ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రజలు తమను తాము ప్రశ్నించుకోవాలి
 • ఒక సవాలు విసిరి ఎన్నికలు జరిపి ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అనేవాళ్లం
 • కానీ ఓ ఎంపీతో రాజీనామా చేయించడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయి.
 • మంత్రి పదవి కోసం వరంగల్‌ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వారికి మంత్రి పదవి ఇవ్వలేదు.
 • ఎంపీని రాజీనామా చేయించి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అందుకే ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
 • కేసీఆర్‌ పాలనలో కొచ్చిన 18 నెలల్లో ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 158 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
 • పత్తిరైతుల బాధను సీఎం కేసీఆర్ ఒక్కసారైనా ఆలకించారా?
 • పత్తి క్వింటాలుకు రూ. 4,500 మద్దతు ధర అని చెప్పి.. రూ 3,500లకు కూడా పత్తి కొనడం లేదు
 • దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు పత్తి క్వింటాలుకు రూ. 6,500 దాకా పలికింది.
 • కేసీఆర్‌ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాల భూమిని దళితులకు పంచారు?
 • ఈ 18 నెలల పాలనలో 1600 ఎకరాలు కూడా పంచలేదు
 • అదే వైఎస్ఆర్‌ హయాంలో 20లక్షల 60 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు
 • పేదవాళ్లు ఎందుకు అప్పులపాలు అవుతారని ఎప్పుడైనా కేసీఆర్ గారు ఆలోచించారా?
 • అనారోగ్యం, రోగాల చికిత్స కోసం వడ్డీలకు అప్పులు తేవడం వల్లే పేదవాళ్లు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు
 • అందుకే పేదలందరినీ ఆదుకునేందుకు దివంగత నేత వైఎస్‌ఆర్‌ 108 హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.
 • ఒక్క ఫోన్ కాల్‌ చేస్తే.. కుయ్యికుయ్యిమని అంబులెన్స్ వచ్చేలా ఏర్పాటు చూశారు.
 • ఒక్కపైసా ఖర్చు లేకుండా పెద్దాస్పత్రుల్లో వైద్యం చేసేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
 • కేసీఆర్ పాలనలో ఒక్క కొత్త అంబులెన్సును కూడా కొనలేదు.
 • 8, 9 ఏళ్లుగా వాడుతున్న పాత అంబులెన్సులనే తిప్పుతున్నారు.
 • ఈ రోజు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు
 • మీ పాలనలో ఎందుకీ పరిస్థితి అని కేసీఆర్‌గారిని ప్రజలు ప్రశ్నించాలి
 • చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకూడదని దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చారు.
 • ఈ సంవత్సరం మొదలై ఆరు నెలలైంది. విద్యార్థులు కూడా కాలేజీలకు కూడా వెళుతున్నారు. అయినా గత సంవత్సరం ఫీజు బాకాయిలనే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఫీజులు, స్కాలర్‌షిప్పులు విడుదల చేయడం లేదు.
 • ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి అని కేసీఆర్‌ను నిలదీయండి
 • మార్కెట్‌కు ఎప్పుడైనా వెళ్లారా? ఎప్పుడైనా కందిపప్పు కొన్నారా? కేసీఆర్‌ గారు? అని అడుగండి.
 • కందిపప్పు ధర ఇప్పుడు రూ. 200 దాటింది.
 • ఈనాడు నిత్యావసర వస్తువుల రేట్లని ఆకాశాన్నంటుతున్నాయి. ఎలా సరుకులు కొనాలి?
 • వరి కనీస మద్దతు ధర కన్నా తక్కువకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
 • ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ గారికి ఓటు వేసినా, వేయకపోయినా.. కేసీఆర్‌ ప్రభుత్వం పడిపోదు. కానీ పొరపాటున కేసీఆర్ పార్టీ గెలిస్తే మాత్రం తమ ప్రభుత్వ పాలన బాగుందని ఆయన ప్రజలను మరింతగా పట్టించుకోకుండా వదిలేసే అవకాశం ఉంది.
 • 18 నెలల పాలనలో అది హైదరాబాద్‌లో మాత్రమే అక్షరాల 3,090 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మాత్రమే ప్రారంభించారు.
 • ఇన్ని రోజుల పాలనలో మీరు కట్టించిన కొత్త ఇళ్లు ఎన్ని అని కేసీఆర్ గారు నిలదీయండి
 • దివంగత నేత వైఎస్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు.
 • ఈ ఉప ఎన్నికలో ఓడిపోతేనే కేసీర్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది.
 • కేసీఆర్‌ది చేతగాని పాలన
 • కాంగ్రెస్ అంత అధ్వాన్న పార్టీ దేశంలోనే ఉంది.
 • బతికున్నంతకాలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడ్డారు.
 • ఆయన బ్రతికున్నంతకాలం మంచివారిగా పేర్కొన్న కాంగ్రెస్‌కు ఆయన చనిపోగానే చెడ్డనేతగా మారారు
 • చంద్రబాబు ప్రభుత్వం కేసీఆర్ కన్నా దారుణమైన అబద్ధాలు చెపుతున్నది
 • చంద్రబాబు ప్రభుత్వం మోసం, దారుణం తప్ప మరేమీ కాదు
 • రాష్ట్రాన్ని విభజన సమయంలో బీజేపీ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.
 • కాబట్టి ఈ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే నైతిక అర్హత, విలువలు గల ఏకైక పార్టీ వైఎస్ఆర్‌సీపీ మాత్రమే.
 • వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఫ్యాన్‌ గుర్తుకు ప్రజలు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా.

వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఎన్‌ఆర్‌ఐ కమిటీల్లో భాగంగా యూకె, యూరోప్, సింగపూర్ కమిటీలను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్  జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీలను నియమించారు. యూకే-యూరోప్ కమిటీలో శివకుమార్ చింతన్, వెంకీ, అబ్బయ్య చౌదరి కొటారి, సందీప్ వంగల, పున్నారెడ్డి భీమానందం కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రవీంద్ర కందుల, పెరికల కనకాయ్, నవీన్‌రెడ్డిలను సలహా కమిటీ సభ్యులుగా నియమించారు. వీరితో పాటు 12 మందితో కార్యనిర్వహక కమిటీని ఏర్పాటు చేశారు.
 
పీసీ రావు (కోశాధికారి) వాసుదేవరెడ్డి మైరెడ్డి (గ్రేటర్ లండన్ ఇంచార్జీ), కిరణ్ పప్పుల (ఆపరేషన్ ఇంచార్జీ), కోటిరెడ్డి కల్లం (ఆపరేషన్స్ సపోర్ట్ సెల్), ప్రదీప్ చింత (కమ్యునికేషన్స్ ఇంచార్జీ), సతీష్ వనహరం (సోషల్ నెట్‌వర్క్ ఇంచార్జీ), భాస్కర్ మైలపాటి (టెక్నాలజీ సెక్రెటరీ), రవి మోచెర్ల (ఆర్గనైజింగ్ సెక్రెటరీ), సురేష్ ముదిరెడ్డి, ఓబుల్ రెడ్డి (యూత్ సెక్రెటరీ), జయంతి ఎస్ (మహిళా విభాగం), ప్రదీప్ కథి (మెంబర్‌షిప్ ఇంచార్జీ), రిజ్వాన్ దేవరకొండ (మైనారిటీ సెల్ ఇంచార్జీ) గా వ్యవహరిస్తారు.

ఈ కమిటీకి తోడుగా ఏడుగురిని ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా, మరో ఆరుగురిని కోర్ టీమ్‌గా ఏర్పాటు చేశారు. ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా విజయభాస్కర్ వైకుంఠం (హాంస్లో కో-ఆర్డినేటర్), మనోహర్ నక్కా (ఫెల్తం కో-ఆర్డినేటర్), భగవాన్ యనమల (ఈస్ట్ లండన్ కో-ఆర్డినేటర్), సుబ్బారెడ్డి ముప్పిడి (సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్ కో-ఆర్డినేటర్), మహేష్ వాసిపల్లి (కేంబ్రిడ్జి కో-ఆర్డినేటర్), సునీతా ముక్కు (ఆక్స్‌ఫర్డ్ వుమెన్ సెల్ ఇంచార్జీ), చింతపంటి జనార్ధన్ (మిల్టన్ కీనెస్ ఇంచార్జీ) నియమితులు కాగా కోర్ టీమ్‌లో తాటిరెడ్డి, కృష్ణమోహన్, శ్రీకాంత్ అడుసుమల్లి, భాస్కర్ అరుణ్‌కుమార్ పెట్ల, శివారెడ్డి సింగంరెడ్డి, రవి కిరణ్ చింతలు ఉన్నారు.

 20 మందితో సింగపూర్ కమిటీ

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 20 మందితో కూడిన సింగపూర్ కమిటీ కార్యవర్గాన్ని వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నియమించినట్టు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. సింగపూర్ కమిటీ కన్వీనర్లుగా (త్రిసభ్య కమిటీ) కోటిరెడ్డి కొమ్మిరెడ్డి, డి.జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్‌లు ఉన్నారు. కార్యదర్శులుగా రుద్ర భూంరాజ్, పేస మురళి, సుధాకర్ మారంరెడ్డి, వీరారెడ్డి వెన్న, బుచ మోహన్‌లను నియమించారు. కోశాధికారిగా చింతలపూడి గంగాధర్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా మరో 11 మందిని జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు. డి.ప్రకాష్, పి.వేణుగోపాల్, గుంటి రామ్, ఎ.సురేష్, ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్ మెరుగుమాల, శివరామిరెడ్డి వి, చినపన వెంకటేష్, సుగ్గు నీలాద్రి, శ్రీకాంత్‌రెడ్డి కల్లం, కె.లక్ష్మణ్‌లు నియమితులయ్యారు.

రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులా!

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
 
మచిలీపట్నం : టీడీపీ ప్రభుత్వం రైతుల భూములను లాక్కుని విదేశీ సంస్థలకు అప్పగిస్తుంటే అడ్డుకుంటున్న పేర్ని నానిపై అక్రమ కేసులు బనాయించారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కోర్టులో పేర్ని నానిని పలకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాల భూమిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని, భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌గా ఉన్న పేర్ని నానిని అరెస్టుచేస్తే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులపాలు చేస్తున్నారనడానికి గుడివాడ, మచిలీపట్నం సంఘటనలే ఉదాహరణలన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదన్నారు. పేర్ని నాని విడుదలైన అనంతరం అనుబంధ పరిశ్రమల పేరుతో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామన్నారు. భూములు కోల్పోయే రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. పేర్ని నాని అరెస్టుతో ప్రభుత్వ వైఖరితో పాటు మంత్రి కొల్లు వైఖరి కూడా వెల్లడైందన్నారు. టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తే దానికి తగ్గట్టు తామూ స్పందిస్తామని నాని స్పష్టం చేశారు.

రైతు రుణాలన్నీ మాఫీ అయ్యాయా?


బాబువన్నీ పచ్చి అబద్ధాలు
♦ రైతు రుణాలన్నీ మాఫీ అయ్యాయా?
♦ బ్యాంకుల్లో జమపడింది రూ.7,200 కోట్లే
♦ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలా కాదని అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా తాను చర్చకు రావడానికి సిద్ధమేనని చెప్పారు. నాగిరెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు. రూ.24,000 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, అది తొలి అవాస్తవమని విమర్శించారు.

తాకట్టులో ఉన్న మహిళల పుస్తెల తాళ్లు, దస్తావేజులను విడిపించి తెచ్చారా? రుణాలన్నీ మాఫీ అయ్యాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం రైతు రుణాలు రూ.87,000 కోట్లు ఉండగా వాటిపై వడ్డీ రూ.13,000 కోట్లు అయిందన్నారు. ఇందులో ఇప్పటివరకు రుణమాఫీ కింద బ్యాంకుల్లో జమ పడింది రూ.7,200 కోట్లేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు రూ.24,000 కోట్ల మేర రుణాలు మాఫీ అయిన రైతుల జాబితాను ప్రకటించాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. 4 లక్షల ఎకరాలకు భూసార పరీక్షలు చేసినట్లుగా మరో అబద్ధం చెప్పారని మండిపడ్డారు.

పట్టిసీమ నుంచి జూలైలోనే కృష్ణా డెల్టాకు నీళ్లిస్తామని ఒకసారి, ఆగస్టు 15 నాటికి ఇస్తామని మరోసారి ప్రకటించారని గుర్తుచేశారు. వాస్తవానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ డెల్టాలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా రైతులు దారుణంగా నష్టపోతున్నట్లు చంద్రబాబు అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయని వెల్లడించారు. కిలో కందిపప్పును చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం రూ.50కే ఇచ్చిం దని చంద్రబాబు పెద్ద అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా రూ.50కి కిలో కందిపప్పు అమ్మలేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓలోనే రూ.90కి కిలో కందిపప్పు విక్రయించాలని ఆదేశించారని, ఈ విషయం కూడా తెలుసుకోకుండా చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడారని నాగిరెడ్డి విమర్శించారు.

చేతగాని పాలనకు ఓటేయొద్దు


చేతగాని పాలనకు ఓటేయొద్దు
► వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
► ఎందుకు ఈ ఎన్నిక తెచ్చారో కేసీఆర్‌ను నిలదీయండి
► ఒక్కో దళితుడికి మూడెకరాలు ఇస్తామన్న హామీ ఏమైంది?
► రైతు ఆత్మహత్యలపై టీఆర్‌ఎస్ వాళ్లను నిలదీయండి
► వరంగల్‌లో మొదలైన జగన్ ప్రచారం..
► తొర్రూరులో భారీ బహిరంగ సభ


 వరంగల్ నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయడమంటే.. కేసీఆర్ చేస్తున్న ఈ చేతగాని పరిపాలనకు ఓటేయడమే! ఇలాంటి పరిపాలనకు ఓటేస్తే ఆయన మారరు. పైగా బాగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటారు. రైతుల మీద ఇంకా పెద్ద పెద్ద బండలు వేసే రోజులొస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్‌కు ఓటేయొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మోజు తీర్చుకోవడం కోసమే వరంగల్ ఉప ఎన్నికలు తెచ్చారని మండిపడ్డారు. నిజంగా ఓటడిగే హక్కు, అధికారం ఏ పార్టీకైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకేనని ఉద్ఘాటించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావుకు మద్దతుగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలిరోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి మొదలైన ప్రచారం వర్ధన్నపేట మీదుగా సాగి తొర్రూరు వద్ద ముగిసింది. తొర్రూరు బస్టాండ్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే...

 ఎన్నికలకు ఇదా కారణమని నిలదీయండి
 కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఆ ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని నిల దీస్తూ కేసీఆర్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే గర్వపడే వాళ్లమని, ఆ కారణంతో ఈ ఉప ఎన్నిక వచ్చి ఉంటే కాలర్ ఎగిరేసే వాళ్లమని టీఆర్‌ఎస్ నేతలకు చెప్పండి. కానీ కేసీఆర్ మోజు తీర్చుకోవడం కోసం ఈ ఎన్నిక వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని చెప్పండి. వరంగల్‌లో ఉప ఎన్నిక వచ్చినా ఫర్వాలేదుగానీ.. తాను కోరుకున్న అభ్యర్థి మంత్రిమండలిలో ఉండాలని కేసీఆర్ మోజు పడ్డారు. వరంగల్ జిల్లాలో తన పార్టీలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా.. వాళ్లను కాదని, ఆయన మోజుపడిన వ్యక్తి ఎంపీ అయినప్పటికీ ఆయనతో రాజీనామా చేయిం చారు. టీఆర్‌ఎస్ వాళ్లెవరైనా మిమ్మల్ని ఓటడగడానికి వస్తే ఉప ఎన్నికలకు ఇదా కారణం అని గట్టిగా నిలదీయండి.

 ఎస్సీలకు మూడెకరాల భూమి ఎక్కడ ?
 వైఎస్సార్ హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అం దాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108, ప్రతి నిరుపేదకు కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, ప్రతి పేద విద్యార్థి పెద్ద చదువులు చదివేందుకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలను అమలు చేసి చూపా రు. ప్రతి అక్కాచెల్లె ఆర్థికంగా ఎదిగేందుకు పావలా వడ్డీ రుణాలకు శ్రీకారం చుట్టారు. దేశం మొత్తం మీద నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు కట్టిస్తే వైఎస్సార్ ఒక్కరే తెలుగు రాష్ట్రా ల్లో 48 లక్షల ఇళ్లు కట్టి చూపించారు. దళితులకు 20.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. కేసీఆర్ మీకు ఎక్కడైనా కనిపిస్తే, టీఆర్‌ఎస్‌వాళ్లు మీ దగ్గరకు వస్తే అడగండి.. ‘అయ్యా..! ఎన్నికలప్పుడు ప్రతి దళితుడికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని చెప్పారు. ఇంత వరకు మీరు ఎన్ని ఎకరాల భూమి దళితులకు పంపిణీ చేశారు’ అని నిలదీయండి. 18 నెలల పరిపాలనలో దళితులకు కనీసం 1,600 ఎకరాలు కూడా ఇవ్వని అధ్వాన పరిస్థితి ఉంది.

 ఓరుగల్లులోనే 150 మంది రైతు ఆత్మహత్యలా?
 అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ఇదే కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పటిదాకా ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారని గట్టిగా నిలదీయండి. ఇప్పటి వరకు ఆయన కట్టించింది కేవలం 396 ఇళ్లు. అవి కూడా ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం చేశారు. అవి తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా కట్టించలేని అధ్వాన పరిపాలన రాష్ట్రంలో సాగుతోంది. ఒక్క ఓరుగల్లు జిల్లాలోనే 150 మంది రైతులు చనిపోయారు. వారి పరిపాలనలో అంతమంది రైతులు ఎందుకు చనిపోయారో ఒక్కసారి అడగండి. పత్తికి కనీస మద్దతు ధర రూ.4,100 ఇస్తున్నామని సీసీఐ చెప్తుంటే.. రైతులకు మాత్రం రూ.3,500 కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో పత్తి అమ్ముకుంటున్నారు. ఆ దివంగత నేత పరిపాలనలో రైతులు క్వింటాల్ పత్తి రూ.6,700కు అమ్ముకున్న రోజులను గుర్తు తెచ్చుకొమ్మని కేసీఆర్‌కు చెప్పండి.

 ఫీజు బకాయిలపై గట్టిగా అడగండి
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నడుపుతున్నారు. ఈ పథకానికి ఈ సంవత్సరం సంగతి దేవుడెరుగు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రూ.2,452 కోట్లు ఈ పథకానికి అవసరమైతే.. వాటిలో రూ.1,530 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని కేసీఆర్‌ను గట్టిగా నిలదీయండి. ఈ ఏడాది కాలేజీలు మొదలై 5-6 నెలలు గడిచిపోయింది. పాత బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి. కేసీఆర్ పరిపాలనను, దివంగత నేత వైఎస్సార్ పాలనను ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా సిన్సియారిటీ లేదు.. ఏ ఒక్కరికి కూడా నిజాయితీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండె ల్లో బతికే ఉండాలనే తపన, ఆరాటం ఏ ఒక్కరికి లేదు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడండి. కేసీఆర్‌కు ఓటేయడమంటే... ఆ యన చేతగాని పాలనకు ఓటు వేయడమే.

 కాంగ్రెస్.. దిక్కుమాలిన పార్టీ
 కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తే మీకెందుకు ఓటేయాలని గట్టిగా నిలదీయండి. ‘వైఎస్సార్ పాలన చూశాం.. ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ పథకాలు చూశాం.. ఆ పథకాలతో బాగుపడ్డాం.. ఆ పథకాలు కాంగ్రెస్ పథకాలేనని మీరు చెప్పుకుంటున్నారు. మరి అవి కాంగ్రెస్ పథకాలైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు’ అని నిలదీయండి. వైఎస్సార్ పాలనను తమ పాలన అని సిగ్గులేకుండా చెప్పుకునే దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్. తమ స్వార్థం కోసం ఎవరినైనా ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టడానికి కూడా వెనుకాడని నీచమైన పార్టీ కాంగ్రెస్.

 పక్క రాష్ట్రంలో చూసి రమ్మని చెప్పండి
 టీడీపీ వాళ్లు ఓట్లడగటానికి వస్తే.. వారికి బుద్ది చెప్పండి. ‘అయ్యా..పక్క రాష్ట్రంలో మీ పాలన చూస్తున్నాం. మీ పాలన ఎంత దారుణంగా ఉందో అక్కడి పాలన చూసి రండి’ అని వారికి  చెప్పండి. వెన్నుపోట్లు, మోసం, అబద్దాలు, దగా పునాదులపైనే టీడీపీ ఉంది. అలాంటి టీడీపీకి ఓటేస్తే బాగుపడే పరిస్థితి ఉండదు. బీజేపీ వారిని కూడా అడగండి. ఎన్నికలప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలిచ్చారు. ఆ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీయండి.

 ఓటడిగే హక్కు మాకే ఉంది
 ఈ ఎన్నికల్లో నిజంగా ఓటడిగే హక్కు, అధికారం ఏ పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పండి. ఎందుకంటే ఆ దివంగత నేత వైఎస్సార్.. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు మంచి చేశారు. ప్రతి గుండె చప్పుడు విన్న వ్యక్తి వైఎస్సార్. ఆయన సువర్ణ పాలనను మళ్లీ మనం తెచ్చుకుందాం. ఆ పాలన రావాలంటే కలిసికట్టుగా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మనందరం ఒక్కటై వైఎస్సార్ సువర్ణ యుగం మళ్లీ తెచ్చుకుందాం.

 రాజకీయ చరిత్ర తిరగరాస్తాం: పొంగులేటి
 చీఓరుగల్లు రాజకీయ చరిత్రను తిరగరాయడం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల బరిలో నిలబడిందని... ఈ ఎన్నికల్లో తమకు పోటీ ఎవరూ లేరని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన తొత్తును ఉప ముఖ్యమంత్రిగా తెచ్చుకునేందుకే వరంగల్ ఉప ఎన్నిక తెచ్చారని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెపాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకపై అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న స్పందన, స్వాగతంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌కు ఎవరూ కూడా పోటీలో లేకుండా పోతున్నారన్నారు.రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే బంగారు తెలంగాణనా అని ప్రశ్నించారు. సీఎం అయ్యాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.

వైఎస్ పథకాలను తుంగలో తొక్కి, ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీకి... ప్రజాప్రతినిధులను రూ. కోట్లతో అంగడిలో పశువుల్లా కొనుగోలు చేయాలని చూసిన టీడీపీకి.. రోజుకో విధంగా వేషం మారుస్తూ హమీలను ఒక్కటి కూడా అమలు చేయని బీజేపీకి ఓట్లు అడిగే అధికారం, హక్కు లేదన్నారు. వరంగల్ ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, ఎడ్మ కిష్టారెడ్డి, ఎ.రెహ్మాన్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు బీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, బంగి లక్ష్మణ్, సుమిత్‌గుప్తా, జి.శివ, ఐ.వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, కమల్‌రాజ్, ఎం.కల్యాణ్‌రాజ్, కె.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Popular Posts

Topics :