06 December 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు

Written By news on Saturday, December 12, 2015 | 12/12/2015


'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు'
హైదరాబాద్: తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నవారిని తప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన కాపాడతారనే నమ్మకంతోనే తెలుగు తమ్ముళ్లు పేట్రేగి పోతున్నారని ధ్వజమెత్తారు.

విజయవాడకు చంద్రబాబు మకాం మార్చిన తర్వాత నేరాలు పెరిగాయని తెలిపారు. విజయవాడను నేర రాజధానిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

టీడీపీ కక్ష సాధింపు చర్యలకు...


ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై కేసులు నమోదు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిడ్డి ఈశ్వరీపై పోలీసు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ... మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
505 1(బి), 506 2, 124(ఎ), 307 ఆర్/ డబ్ల్యూ 511 సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరకులో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గురువారం విశాఖ జిల్లా చింతపల్లి భారీ సభ నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలపై టీడీపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ నేతలపై అధికార టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని  వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అరకులో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 97ను  జారీ చేసింది. ఈ జీవోపై ప్రతిపక్షాలతోపాటు పలు  ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ఈ జీవోను ప్రభుత్వం నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు  బాక్సైట్ అనుమతుల కోసం చంద్రబాబు  కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ జీవో జారీపై చంద్రబాబుకు ఏమీ తెలియదని  ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  కామినేని శ్రీనివాస్ వెల్లడించడం కొసమెరుపు.

నల్లధనం ఎంతో అంచనాల్లేవు


నల్లధనం ఎంతో అంచనాల్లేవు
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం

 సాక్షి, న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లోని నల్లధనం మొత్తాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అధికారిక అంచనాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దేశ విదేశాల్లోని నల్లధనం మొత్తాలను, వెనక్కి తెచ్చేందుకు చేపట్టిన చర్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మరో ఎంపీ లక్ష్మీనారాయణ యాదవ్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బదులిచ్చారు. దేశ, విదేశాల్లో లెక్కకు రాని ధనాన్ని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ఎన్‌ఐపీఎఫ్‌పీ, ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎంల నివేదిక అందిందని, దానిపై పరీక్షిస్తున్నట్టు తెలిపారు.

నిరుద్యోగులపై టీడీపీ గూండాల దాడి దారుణం


నిరుద్యోగులపై టీడీపీ గూండాల దాడి దారుణం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

 హైదరాబాద్: నర్సారావుపేటలో శుక్రవారం సీఎం చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో తమ గోడు వెళ్ల బోసుకోవడానికి వచ్చిన నిరుద్యోగులపై టీడీపీ గూండాలు కిరాతకంగా దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై వెంటనే న్యాయవిచారణ జరిపి, దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ‘బాబు వస్తేనే జాబు వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. అది వచ్చే వరకూ ప్రతి ఇంటికీ రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని ప్రచారం చేసి చంద్రబాబు మాట తప్పారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టిన బాబు


'వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టిన బాబు'
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడి18 నెలల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిప్పులు చెరిగారు. శనివారం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... 65 ఏళ్లుగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థ పరపతిని చంద్రబాబు తన 18 నెలల పాలనలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
గతంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మహిళల పొదుపు విధానం చంద్రబాబు హయాంలో విచ్ఛిన్నం అయిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు బ్యాంకుల ముందు దోషులగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ 18 నెలల్లో వీధి వీధిన రెట్టింపు బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ధర్మాన మండిపడ్డారు.

లింగాయపాలెం రైతుకు వైఎస్ఆర్ సీపీ నేతల భరోసా

Written By news on Friday, December 11, 2015 | 12/11/2015

గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూములివ్వని వారిపై ప్రభుత్వ దాష్టికానికి పరాకాష్ఠగా నిలిచిన.. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో సీఆర్ డీఏ అధికారులు ధ్వంసం చేసిన అరటితోటను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. బాధితుడు రైతు రాజేష్ కు వైఎస్ఆర్ సీపీ నేతలు భరోసా ఇచ్చారు.
ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇవ్వనందుకు గూడ రాజేష్ అనే రైతుకు చెందిన ఏడెకరాల అరటి తోటను అధికారులు రాత్రికి రాత్రే దున్ని జేసీబీలతో చదును చేయించారు. అధికారుల చర్యపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
 

అసెంబ్లీలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తారా?


అసెంబ్లీలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తారా?
బేతంచెర్ల: టీడీపీ నాయకులు బడి, గుడి, ప్రభుత్వ కార్యాలయాలనే తేడా లేకుండా పార్టీ జెండాలను ఎగరవేస్తుంటే అధికారులు అవేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం చూస్తుంటే శాసనసభ మధ్యలో కూడా టీడీపీ జెండాను ఎగురవేశేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
 
ప్రస్తుతం టీడీపీ నాయకులు బడి ముందు జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాల బయటకు వస్తే జాతీయ జెండాను చూడాలా లేక టీడీపీ జెండాలను చూడాలా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పార్టీలు మార్చే వ్యక్తినంటూ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై విమర్శలు చేసిన కేఈ ఎన్ని పార్టీల తీర్థం పుచ్చుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వకపోతే వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని అనలేదా అని ఆయన గుర్తు చేశారు. 

ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం


ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం
హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సీమాంధ్ర...స్కాముల రాష్ట్రంలా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ శుక్రవారం పార్టీ కేంద్ర కారాల్యయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పంచభూతాలను కూడా కబ్జా చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు.
 
సింగపూర్ కంపెనీ ప్రతిపాదనలు నష్టదాయకమని, ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన భూములు ఇస్తారని ఆయన అన్నారు. తాము గతంలోనే సింగపూర్ సంస్థలకు భూముల ప్రతిపాదనను వ్యతిరేకించామని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇసుక నుంచి ప్రతిదీ కుంభకోణాలమయంగా మారిందని ఆయన విమర్శించారు.

తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..?


తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..?
బహిరంగ సభావేదికపై గిరిపుత్రుల హెచ్చరిక
వైఎస్ జగన్‌తో ముఖాముఖి


 సాక్షి, విశాఖపట్నం: ‘‘లక్షల గొంతులు ఒక్కటై మాకొద్దీ బాక్సైట్ అంటున్నా చంద్రబాబుకి జ్ఞానోదయం కావడం లేదు. బాక్సైట్ మైనింగ్ ఎందుకు వద్దో మీరే చెప్పండి.’’అంటూ విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో గురువారం జరిగిన బాక్సైట్ వ్యతిరేక సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులను అడిగారు. ‘ఆనాడు తెల్లదొరల్నే తరిమికొట్టిన జాతి మాది.. మా జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న చంద్రబాబుకు కూడా అదే శాస్తి చేస్తాం’ అని గిరిపుత్రులు హెచ్చరించారు. బాక్సైట్ జోలికొస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. బహిరంగ సభా వేదికపై వైఎస్ జగన్‌తో వారి ముఖాముఖి విశేషాలు...

 (కోండ్రుపల్లికి చెందిన వృద్ధుడు మండలం చిన్నబ్బాయి జగన్ పిలుపునందుకుని ప్రసంగించారు.)
 ‘‘నా తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే బతికారు.. ఇక్కడే చచ్చారు. నేను ఇక్కడే కొండపై వ్యవసాయం చేసుకుంటూ దుంపలు తిని జీవిస్తున్నా..రైతు బిడ్డలం. మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో పెడతామంటే అక్కడ ఏం చేసి బతకాలి.’’
 (జర్రెల పంచాయతీ సర్పంచ్ అడపా విజయకుమారితో జగన్ మాట్లాడారు.)
 జగన్: మీరే కదా జర్రెల సర్పంచ్
 కుమారి: అవునండి
 జగన్: మీ పేరు
 కుమారి: విజయకుమారి
 జగన్: బాక్సైట్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారమ్మా.?
 కుమారి: బాక్సైట్ తవ్వితే మా బతుకులు పోతాయండి.
 జగన్: జర్రెల గ్రామ సభలో బాక్సైట్‌కు అనుకూలంగా తీర్మానం చేశారని చంద్రబాబు చెబుతున్నారు. 2011లో గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తీర్మానం చేయలేదని చెప్పారు. ఇప్పుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో తీర్మానం చేశారని అంటున్నారు. అసలు తీర్మానం చేశారా తల్లీ.!
 కుమారి: ప్రజలందరూ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాల రికార్డులు మా పంచాయతీ పుస్తకాల్లో ఉన్నాయి. అంతేకాని అనుకూలంగా చేసినట్లుగా ఎలాంటి తీర్మాన పత్రాలు ఎక్కడా లేవు.
 విష్ణుమూర్తి(గిరిజన నాయకుడు): శ్వేతపత్రం విడుదల కాగానే పంచాయతీ రికార్డులు తిరగేశాం. చంద్రబాబు చెబుతున్నట్లు అక్టోబర్ 2న జర్రెల పంచాయతీలో గ్రామసభ జరిగినట్లు, తీర్మానం చేసినట్లు ఎక్కడాలేదు.
 జగన్: గ్రామ సభ జరగలేదు.. తీర్మానం జరగలేదు అయినా అబద్ధాలతో చంద్రబాబు ముం దుకువెళుతున్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు వేయలేదు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే దానిలో మూడో వంతు గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలని చట్ట ం చెబుతోంది. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాల్లో ఆరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. కమిటీ వేస్తే వాళ్లే సభ్యులుగా ఉంటారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌వారు బాక్సైట్‌ను వ్యతిరేకిస్తారు కాబట్టి కమిటీ వేయటం లేదు. ఇది ఎంతోకాలం సాగదు. గట్టిగా ఒత్తిడి చేస్తాం. కమిటీ వేయిస్తాం.
 (తర్వాత గిరిజన మహిళ రత్నాబాయి జగన్‌తో మాట్లాడారు)
 జగన్: తల్లీ బాక్సైట్ తవ్వితే మీకు కలిగే నష్టం ఏమిటి?
 రత్నాబాయి: మేం అంతరించిపోతాం జగన్ బిడ్డా..మా అడవి తల్లి ఇచ్చిన కూరలు, దుంపలు ఉడకబెట్టి తిని, చెంబుడు నీళ్లు తాగి బతుకుతున్నాం. వందల కిలోమీటర్లు కొండ తవ్వేస్తే మేము ఏం తినాలి. చంద్రబాబు నాయుడు వచ్చేసి మా అడవిని తవ్వేసుకుంటాడా, తెల్లదొరల్నే తరిమికొట్టాం. ఈ చంద్రబాబు లెక్కకాదు. మా జోలికొస్తే ఊరుకోం. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 10 ఎకరాలిస్తానని ఆనాడు దేవుడు వైఎస్ అన్నారు. ఆయనే ఉంటే ఈ కష్టాలు వచ్చేయే కాదు.

 (బూదరాళ్ల సర్పంచ్ సుమర్ల సూరిబాబుతో జగన్ మాట్లాడారు)
 జగన్: బాక్సైట్ తవ్వితే  ఏమవుతుంది?
 సూరిబాబు: ప్రజల మనుగడ దెబ్బతింటుందన్నా. ఇదే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 1/7 చట్టం ప్రకారం నీ భూమి మీద నీకే హక్కు చూసుకో బిడ్డా అని మాట ఇచ్చిన వ్యక్తి వైఎస్. ఇప్పుడు చంద్రబాబు మా బతుకులు బుగ్గి చేయాలనుకుంటున్నారు. అదే జరిగితే ఎంతటికైనా తెగించి పోరాడతాం.

 (అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును జగన్ అడిగారు)
 జగన్: సర్వేశ్వరరావును అడుగుదాం..అన్నా బాక్సైట్ తవ్వితే ఇక్కడ నీటికి, ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది.
 సర్వేశ్వరరావు: బాక్సైట్ కొండలు తవ్విన గోతుల్లో పడిన వర్షం నీరు కలుషితమవుతుంది. ఇక్కడ గోపురం, చింతపల్లి, సీలేరు,అరకు వేలి కొండల్లో పడిన నీరు రిజర్వాయర్లకు వెళుతోంది. 21 నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. గిరిజనులకే కాకుండా విశాఖ, తూర్పు, విజయనగరం జిల్లాల ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇవి కలుషితమైతే కొత్త కొత్త జబ్బులు వస్తాయి. జాతి అంతరించిపోతుంది. డయాబెటిస్‌ను నయం చేసే పాతాళగరడ అనే వేరు ఇక్కడే దొరుకుతుంది. ఇలాంటి మూలికలు దూరమవుతాయి. సీలేరు, మాచ్‌ఖండ్‌లలో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అది కూడా పోతుంది.

 జగన్: చంద్రబాబు నాయుడికి, ఈ మీటింగ్ చూస్తున్న దేశానికి తెలియాలి. బాక్సైట్ మైనింగ్‌ను వ్యతిరేకించేవాళ్లంతా చేతులు పెకైత్తండి. చంద్రబాబుకు అర్థం కావాలి మన్యం ఏమంటోందని..(సభలో ఉన్న అశేష జనవాహిని చేతులు పెకైత్తి బాక్సైట్ తవ్వకాలను తాము వ్యతిరేకిస్తున్నామంటూ నినదించారు.)

బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్


బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరిక

♦ తక్షణం జీవో 97 రద్దు చేయాలి
♦ గిరిజన సలహా మండలిని నియమించాలి
♦ బాక్సైట్‌ను అంగుళం కూడా కదలనివ్వం
♦ చంద్రబాబు మోసాలను సాగనివ్వం
♦ గిరిజనులకు అండగా ఉండి పోరాడతాం
♦ ప్రతిపక్షంలో ఉండగా ఓమాట..
♦ సీఎం అయ్యాక మరోమాట గతంలో సీఎంగా ఉండగా దుబాయ్ కంపెనీతో బేరాలు
♦ బాబుకన్నా మోసగాడు దేశంలోనే లేడు
♦ గిరిజనుల మనోభావాలు గమనించి మైనింగ్ యత్నాలు ఆపేసిన వైఎస్‌ఆర్
♦ వాస్తవాలను వక్రీకరిస్తూ బాబు శ్వేతపత్రం

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు పూనుకుంటే ఊరుకునేది లేదని విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. బాక్సైట్ మైనింగ్‌పై ఇచ్చిన జీవో 97ను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గనులు తవ్వడానికి ప్రయత్నిస్తే ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి బాక్సైట్‌ను బైటకు పోనిచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు. గిరిజనులకు అన్ని రకాలుగా అండగా  ఉంటామని, కలసికట్టుగా పోరాడతామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును మించిన మోసగాడు దేశంలోనే లేడని జగన్ విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో  ‘విశాఖ బాక్సైట్ గిరిజనుల హక్కు’ అనే నినాదంతో గురువారం సదస్సును నిర్వహించింది.

సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన జగన్ అనకాపల్లి, తంగేడుల మీదగా చింతపల్లి చేరుకున్నారు. అశేష గిరిజనులతో క్రిక్కిరిసిన ఈ సదస్సులో అల్లూరి సీతారామరాజు వేదికపై నుంచి  ఆయన ప్రసంగించారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న ప్రభుత్వ కుట్రను అడ్డుకుని తీరుతామన్నారు. బాక్సైట్ మైనింగ్ వద్దు అని లక్షల గొంతులు ఒక్కటై చెబుతున్నా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావడం లేదని విమర్శించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే....

 ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట... సీఎం అయ్యాక మరో మాట
 చంద్రబాబు మొదటిసారి  సీఎంగా ఉన్నప్పుడే బాక్సైట్ మైనింగ్ కోసం ప్రయత్నించారు. మైనింగ్ చట్టాలు సవరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. తరువాత ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ మైనింగ్ జరగనివ్వనని మాటలు చెప్పారు. గ్రామసభలు కూడా  జరగలేదు అని 2011లో గవర్నర్‌కు లేఖ రాశారు. అదే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో మాటమార్చేశారు. గ్రామసభలు జరిగాయట. బాక్సైట్ మైనింగ్ కావాలని జెర్రెల గ్రామసభ తీర్మానించిందని శ్వేతపత్రంలో  చెప్పారు. ఇప్పుడు విజయకుమారమ్మ జెర్రెల సర్పంచ్‌గా ఉన్నారు.

ఇప్పుడు విజయకుమారమ్మను అడుగుతున్నా... గతంలో బాక్సైట్ మైనింగ్ కోసం తీర్మానం చేశారా ( విజయకుమారమ్మ తమ గ్రామసభలో ఎలాంటి తీర్మానం చేయలేదని చెప్పారు. తాను రికార్డులు పరిశీలించానని తీర్మానం చేసినట్లు ఎక్కడా లేదని అన్నారు). గతంలో టీడీపీకి చెందిన వెంకటరమణ సర్పంచ్‌గా ఉండేవారు. ఆయన ప్రస్తుతం చింతపల్లి మార్కెట్‌కమిటీ డెరైక్టర్ కూడా. ఆయన కూడా బాక్సైట్ మైనింగ్ కోసం ఆనాడు గ్రామసభ తీర్మానం చేయలేదని చెబుతున్నారు.  గ్రామసభలు జరిగి ఉంటే పుస్తకాల్లో రాసి ఉండాలి. కానీ ఆ పుస్తకాల్లో గ్రామసభలు జరిగినట్లు లేదని సర్పంచ్ చెబుతున్నారు.

 దుబాయోళ్లకు ఇచ్చేందుకు ఆనాడే బాబు కుట్ర  
 చంద్రబాబు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్‌గనులను తవ్వడానికి ప్రయత్నించారు. అప్పట్లో ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకునేట్లు చేశారు.  గనుల తవ్వకాలు జరపాలంటే రాష్ట్రప్రభుత్వానికి, గిరిజనులకు మాత్రమే హక్కు ఉందని యాక్ట్ చెబుతోంది. కానీ చంద్రబాబు 24-5-2000లో ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అందులోని తన ఎమ్మెల్యేల చేత బలవంతంగా ఓ తీర్మానం చేయించారు. గనులు గిరిజనులే కాదు.. ఎవ్వరైనా తవ్వుకోవచ్చనేదే ఆ  తీర్మానం. అలా బాక్సైట్ గనులను దుబాయోళ్లకు ఇచ్చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అంతేకాదు మైనింగ్ చట్టాలను మార్చాలని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాస్తో కూస్తో వెనుకడుగు వేయబట్టి సరిపోయింది. ఆ తరువాత బాబు పాలన పోయింది కాబట్టి బాక్సైట్ మైనింగ్ జరగలేదు.

 గిరిజనుల మనోభావాలు గుర్తించిన వైఎస్సార్
 ప్రభుత్వం మైనింగ్ జరపడం వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి చంద్రబాబు చేసినా... రాజశేఖరరెడ్డి చేసినా జగన్మోహన్‌రెడ్డి చేసినా తప్పు తప్పే అవుతుంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడచుకోవాలి. ఆ రోజు వైఎస్సార్ కాస్తో కూ స్తో ముందుకు వెళ్లినా ప్రజల మనోభావాలు గుర్తించిన తరువాత బాక్సైట్ మైనింగ్ ఆపించేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాను చెప్పినట్లు చేస్తుందని తెలిసినా కూడా బాక్సైట్ గనుల సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ కోసం ప్రయత్నించ లేదు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఆయన బాక్సైట్ మైనింగ్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వైఎ స్సార్ చేయాలనుకుని ఉంటే ఆ రోజే బాక్సైట్ మైనింగ్ జరి గేది. గిరిజనుల మనోభావాలను గౌరవించారు కాబట్టే ఆయన ముందడుగు వేయలేదు. అందుకే ఆయన హయాంలో బాక్సైట్ మైనింగ్ జరగలేదు.

 కేంద్రంపై ఒత్తిడిచేసి అనుమతి సాధించిన బాబు
 వైఎస్సార్ చనిపోయిన ఆరేళ్ల తరువాత చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇవాళ బాక్సైట్ మైనింగ్ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ గనులకు వ్యతిరేకంగా తానే పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. 2011లో గిరిజన ప్రాంతానికి ‘జేసీ కాలా’ చైర్మన్‌గా నలుగురు సభ్యుల హైలెవెల్ కమిటీ వేసిన మాట వాస్తవం కాదా?  అపుడు చంద్రబాబు గవర్నర్‌కు లేఖరాయడం నిజం కాదా? ఆ  జేసీ కాలా కమిషన్ ఇక్కడకు వచ్చి నివేదిక ఇస్తే ఆ నివేదికను కేంద్రం పక్కన పెట్టింది. సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఇపుడు మళ్లీ బాక్సైట్ మైనింగ్ అంశాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాలుగుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. 10-5-2014, 23-02-15, 21-07-15, 5-8-15తేదీల్లో లేఖలు రాశారు. చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినందునే 17-8-15న కేంద్రప్రభుత్వం బాక్సైట్ మైనింగ్‌కు అనుమతి ఇచ్చింది.

 జీవో అబయన్స్‌లో పెట్టామంటూ మోసం
 బాక్సైట్ మైనింగ్ కోసం జీవో 97 జారీచేసింది చంద్రబాబే. గిరిజనులు ఆందోళనలు  చేస్తుంటే తనకు తెలియకుండానే జీవో వచ్చిందని అంటారు. ఆ  జీవోను పెండింగ్‌లో పెట్టాను, అబయన్స్‌లో పెట్టాను అంటారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా చేయాలంటే  జీవో ఇస్తుంది. వద్దు అనుకుంటే ఆ జీవోను ఉపసంహరించుకుని రద్దు చేస్తుంది. కానీ ఇలా  పెండింగ్‌లో పెట్టాను... అబయన్స్‌లో పెట్టాను అని ఏ ప్రభుత్వమూ చెప్పదు. అబద్దాలు  మోసాలతో బతికే ఈ మనిషి చివరికి ఈ జీవో కూడా అబయన్స్‌లో పెట్టాను అని ప్రజలను మోసం చేస్తున్నారు.  చంద్రబాబుకు  చిత్తశుద్ధి ఉంటే ఈ జీవోను ఉపసంహరించుకుని బాక్సైట్‌మైనింగ్‌ను రద్దు చేస్తున్నాను అని ఎందుకు చెప్పడం లేదు.

 చంద్రబాబు జీవితమంతా మోసం
 ‘చంద్రబాబు జీవితమంతా మోసం... మోసం ... మోసం అనే మూడు పదాల మీదే జరుగుతోంది. ఎన్నికల ముందుకు వెళితే... ఇంటికి వెళ్లి టీవీ ఆన్‌చేయగానే మనకు కనిపించిందేమిటి?... వినిపించిందేమిటి?... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్నారా లేదా...  డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని అన్నారా లేదా... జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారా లేదా... జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారా లేదా... తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే బాక్సైట్‌మైనింగ్‌ను తీసేస్తానని అన్నారా లేదా.... (సభకు హాజరైన వేలాదిమంది గిరిజనులు  రెండు చేతులు ఎత్తి అవును అవును అని నినదించారు).

చంద్రబాబు నాయుడు ఇంతవరకు చెప్పింది ఒక్కటైనా చేశారా? (గిరిజనులు అంతా లేదు లేదు అని గట్టిగా చెప్పారు). ఇంతకన్నా మోసగాడు దేశంలో ఎవరూ ఉండరు.  డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాదైంది. తల్లిదండ్రులు తమ ఆస్తులు అమ్మి మరీ ఫీజులు కట్టారు. పిల్లలు నగరాలకు వచ్చి హాస్టళ్లలో ఉండి ట్యూషన్లు చదువుతూ పరీక్షలు రాశారు. కానీ ఏడాదైనా వారికి ఉద్యోగాలు ఇవ్వనేలేదు. సరికదా క్లస్టర్‌విధానమని ఉన్న స్కూళ్లను కూడా మూసివేస్తున్నారు. ఇప్పుడు 7వేల మంది టీచర్లు ఎక్కువగా ఉన్నారని ఆ పోస్టులు తీసేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థుల తరపున గట్టిగా పోరాడతాం’.

 గిరిజన సలహా మండలిని ఎందుకు నియమించలేదు
 గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్) ఎందుకు వేయలేదని చంద్రబాబును  నిలదీస్తున్నా. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5ఏ ప్రకారం గిరిజన సలహామండలి ఏర్పాటు చేయడం గిరిజనుల రాజ్యాంగ హక్కు. ఆ కౌన్సిల్‌లో మూడొంతుల మంది సభ్యులుగా గిరిజన ఎమ్మెల్యేలే ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో 7 గిరిజన శాసనసభ స్థానాలు ఉంటే అందులో ఆరింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. గిరిజన సలహా మండలి వేస్తే అందులో  వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉంటారు. బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తారు. అదే జరిగితే బాక్సైట్ గనులు తవ్వుకోవాలన్న బాబు కుట్ర సాగదు. కాబట్టే అసలు గిరిజన సలహామండలినే వేయకుండా చంద్రబాబు  వాయిదా వేస్తున్నారు. అయితే అది ఎక్కువ రోజులు సాగదు. గట్టిగా ఒత్తిడి తెస్తాం.ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ వేయిస్తాం. అందులో బాక్సైట్ మైనింగ్‌ను గట్టిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తాం.

టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు

Written By news on Thursday, December 10, 2015 | 12/10/2015


నందికొట్కూరు (కర్నూలు) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఐజయ్య సమక్షంలో గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బీరం కాంతారెడ్డి ఆధ్వర్యంలో బీరం శేషారెడ్డి, వెంకటరామిరెడ్డితో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

ఎన్ని లక్షల గొంతులు వద్దంటున్నా.

ఎన్ని లక్షల గొంతులు తమకు బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా.. చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఆయన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేంద్రం చెబితే ఒకసారి కాస్త వెనక్కి తగ్గిన చంద్రబాబు.. ఆ తర్వాత మళ్లీ గ్రామసభలు జరిగాయంటూ అబద్ధాలు చెప్పి బాక్సైట్ తవ్వకాల విషయంలో ముందుకెళ్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • ఈవాళ ఎన్నివేల మంది ఎంతో దూరం నుంచి నడిచైనా సరే ఇక్కడకు వచ్చి.. ఆ కష్టాన్ని మాత్రం ఏ ఒక్కరి మొహంలో ఎక్కడా చూపించకుండా, కష్టం అనిపించినా, దూరం నుంచి వచ్చామన్న తలంపును సైతం పక్కనపెట్టి, ఎండను లెక్క చేయకుండా, భోజనానికి వెళ్లాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను పంచిపెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
  • ఈవాళ బాక్సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ లక్షల గొంతులు ఒక్కటై ఇక్కడ బాక్సైట్ మైనింగ్ మాకొద్దని గట్టిగా చెబుతున్నా కూడా చంద్రబాబు నాయుడికి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు
  • బాక్సైట్ ఎందుకు వద్దంటున్నాం, దానివల్ల మనకు జరిగే నష్టాలేంటో నేను మాట్లాడే ముందు మీకు మైకిస్తా.. చంద్రబాబుకు అర్థం అయ్యేలా మీ నోట్లోంచి మీరే చెప్పండి. చంద్రబాబుకు గట్టిగా బుద్ధొచ్చేలా గడ్డిపెట్టేలా మాట్లాడండి.
  • ఇన్నివేల మంది ముందుకొచ్చి బాక్సైట్‌పై పోరాటానికి గొంతుకలిపారు. అయినా చంద్రబాబుకు మాత్రం కనిపించడం లేదు.
  • మన్యం ఏమంటోందో చంద్రబాబుకు అర్థం కావాలి.
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి ప్రయత్నం చేసి, తర్వాత వెనకడుగు వేశారు.
  • ఎన్నికలు అయిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని చెప్పారు
  • ఇక్కడ గ్రామసభలు కూడా జరగలేదని, గ్రామసభలు ఒప్పుకోలేదని 2011లో గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు
  • ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక మొన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసి, అందులో మాట మార్చేశారు. గ్రామసభలు జరిగాయని, అవి బాక్సైట్ మైనింగ్ కావాలంటూ తీర్మానించాయని అన్నారు.
  • ఇంతకుముందు సర్పంచిగా ఉన్న వెంకటరమణ గ్రామసభలో తీర్మానం చేశారా.. (లేదంటూ ప్రజలు చేతులు ఊపారు).
  • తాను తీర్మానం చేయలేదని వెంకటరమణ చెబుతున్నా, చంద్రబాబు మాత్రం ఆరోజే తీర్మానం జరిగిపోయిందని చెబుతున్నారు.
  • గ్రామసభ జరిగి ఉంటే పుస్తకాల్లో ఉండాలి.. అవి కూడా ఏమీ లేవని ప్రస్తుత సర్పంచి చెప్పారు.
  • గ్రామాలు ఏవీ అంగీకరించకపోయినా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్లిపోతున్నారు.
  • ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా
  • కారణం ఏమిటంటే, రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు 5లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియామకం రాజ్యాంగ హక్కు. అందులో మూడొంతుల మంది గిరిజన శాసన సభ్యులు అయి ఉండాలని చెబుతున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన స్థానాలుంటే ఆరింటిలో వైఎస్ఆర్‌సీపీ సభ్యులున్నారు. కమిటీ వేస్తే, అందులో అంతా వైఎస్ఆర్‌సీపీ సభ్యులే ఉంటారు కాబట్టి, బాక్సైట్‌కు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి గిరిజన సలహా కమిటీ నియామకాన్ని కూడా వాయిదా వేస్తున్నారు
  • కానీ మీరు చేసేదేమీ ఎక్కువ రోజులు సాగదు. ఒత్తిడి తెచ్చి, గిరిజన సలహా కమిటీ వేయించి, అందులో గట్టిగా వ్యతిరేకిస్తాం
  • చంద్రబాబు జారీ చేసిన జీవోను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలని ఇన్ని గొంతులు పోరాడుతున్నాయి
  • చంద్రబాబు ఏం చేశారో, రాజశేఖరరెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసు. తర్వాతి సీఎంలు ఏం చేశారో, అధికారంలోకి మళ్లీ వచ్చాక చంద్రబాబు.. ఏం చేశారో కూడా తెలుసు.
  • రాజశేఖరరెడ్డి చనిపోయి ఆరేళ్లవుతున్నా.. ఆయనను తప్పుపడుతూ కొత్తగా బాక్సైట్ తవ్వకాలకు జీవో విడుదల చేస్తున్నారు
  • చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, లేదా జగన్ మోహన్ రెడ్డి లేదా మరే ముఖ్యమంత్రి అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ల గుండెల్లో స్థానం ఉంటుంది.
  • బాక్సైట్ గనులు ఇచ్చే క్రమంలో చంద్రబాబు గిరిజన సలహా కమిటీచేత అడ్డగోలు నిర్ణయాలు తీయించే కార్యక్రమాలు చేయించాడు
  • బాక్సైట్ గనులు ఏమైనా చేయాల్సి వస్తే గిరిజనులు మాత్రం, లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేయాలి.
  • కానీ అప్పట్లో, 24.5.200న చంద్రబాబు.. బలవంతంగా గిరిజన సలహా కమిటీ నియమించి తన ఎమ్మెల్యేలతో బలవంతంగా రుద్దించే ప్రయత్నం చేశాడు
  • అందులో.. ఇక్కడ గనులు వీళ్లు కాదు.. ఎవరైనా తవ్వుకోవచ్చని దుబాయ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబు తీర్మానం చేయించాడు
  • ఈవాళ అదే చంద్రబాబు ఆరోజు అంతటి గట్టి ప్రయత్నాలు చేసి, మైనింగ్ చట్టాలను కూడా మార్చాలని కేంద్రంమీద ఒత్తిడి తెచ్చారు
  • గిరిజనులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని కేంద్రం చెప్పడంతో మనం బతికిపోయాం
  • తర్వాత చంద్రబాబుకు అధికారం పోయింది.. రాజశేఖరరెడ్డి వచ్చారు.
  • ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపడితే గిరిజనులు ఇబ్బంది పడతారని, ప్రభుత్వంతో చేయించాలని.. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని.. ఒక అడుగు ముందుకేశారు.
  • తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పాలి. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఆరోజు కాస్త ముందుకు వెళ్లినా, తర్వాత దాన్ని ఆపించేశారు.
  • తానేం చెప్పినా పార్టీ ఒప్పుకొంటుందని తెలిసినా, గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని అర్థమైన తర్వాత నుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే ఆయన హయాంలో జరగలేదు..
  • ఆయన మరణించిన ఆరేళ్ల తర్వాత, చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పుడు జరుగుతోంది.
  • చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు చెప్పాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడాడు.
  • రాజశేఖరరెడ్డి గారు చనిపోయాక.. ఇప్పుడు మళ్లీ ఆయన గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
  • 2011 సంవత్సరంలో ఇదే గిరిజన ప్రాంతానికి జేసీ కాలా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్ వేసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాను.
  • వాళ్లిచ్చిన నివేదికను కేంద్రం కూడా పక్కన పెట్టేస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఒకటి కాదు, రెండు కాదు.. 10.2.2015న ఒకటి, 23.2.2015, 21.7.2015, 5.8.2015న ఇంకోటి లేఖలు కేంద్రానికి రాసి, ఒత్తిడి తెస్తే కేంద్రం అనుమతి ఇచ్చింది.
  • ఇదే చంద్రబాబు కాలా కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్‌కు లేఖ రాశాడు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తవ్వకాలకు తానూ వ్యతిరేకం అన్నారు.
  • సీఎం అయిన తర్వాత బాక్సైట్ గనులకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్లేటు ఫిరాయించాడు.
  • ఒక శ్వేతపత్రం విడుదల చేశాడు. అందులో రకరకాల మాటలు మాట్లాడాడు. అన్నీ అబద్ధాల పుట్ట.
  • జేరాల గ్రామ పంచాయతీ ఆరోజే తీర్మానం చేసిందని అంటాడు.
  • అప్పుడు గవర్నర్‌కు చెప్పేది ఈయనే, ఇప్పుడు ఈ మాట అనేదీ ఈయనే.
  • తనకు అనుకూలంగా ఉంటే ఒకమాట, లేకపోతే మరోమాట చెబుతాడు.
  • ఈ గ్రామానికే అప్పట్లో వెంకటరమణ సర్పంచి. ఆయనే గ్రామసభ జరగలేదని స్వయంగా చెబుతున్నాడు. అయినా చంద్రబాబు మాత్రం సభ జరిగిందని శ్వేతపత్రంలో రాస్తున్నాడు.
  • ఇదే చంద్రబాబు జీవో 97 అని కేంద్రం నుంచి క్లియరెన్సు వచ్చాక విడుదల చేశాడు.
  • గిరిజన ప్రాంతంలో అలజడి మొదలయ్యేసరికి ఈ జీవో ఎలా వచ్చిందో తనకు తెలియదని, దాన్ని అబెయెన్స్‌లో పెట్టానని అంటాడు
  • ప్రభుత్వం జీవో ఇస్తే చేస్తుంది, ఉపసంహరించుకుంటే చేయదు. మధ్యలో పెండింగులో పెట్టడం ఏ ముఖ్యమంత్రి దగ్గరా వినలేదు
  • ఈరోజు కూడా చంద్రబాబు కనీసం ఒకటి చేసినా... చేశానని చెప్పుకొనే దమ్ము, ధైర్యం లేవు.
  • చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను ఎందుకు ఉపసంహరించుకోవట్లేదని గట్టిగా అడుగుతున్నా.
  • 15.8.2015న కేంద్రం రెండోస్థాయి పర్యావరణ అనుమతి ఇస్తూ.. గ్రామసభలు మళ్లీ జరగాలని ఒక క్లాజు పెట్టింది. గిరిజన సలహా మండలి సిఫార్సు కూడా ఉండాలని మరో క్లాజు పెట్టింది.
  • అయినా గిరిజన సలహా మండలిని ఎందుకు వేయడం లేదని చంద్రబాబును అడుగుతున్నా
  • చంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం.. అన్న మూడు పదాల చుట్టే తిరుగుతుంది.
    ఎన్నికలకు ముందు టీవీలు ఆన్ చేస్తే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇళ్లకు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా లేదా, జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా.. లేదా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారా లేదా?
  • ప్రతి విషయంలో మోసం, దగా, అబద్ధాలు. ఈరోజు చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పాలి.
  • చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతున్నాం.
  • బాక్సైట్ తవ్వకాలకు ఆయన అనుమతి ఇచ్చినా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు
  • నువ్వు నిజంగా మంచోడివైతే, మాటమీద నిలబడే తత్వం ఉంటే వెంటనే జీవోను రద్దు చేసి, మాట నిలబెట్టుకోండి.
  • కనీసం ఈ మాటైనా నిలబెట్టుకోవాలని గట్టిగా అడుగుతున్నాం.
  • అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం.
  • చంద్రబాబు మన వెంట్రుక కూడా పీకలేడని చెబుతున్నాం
  • మీకు అన్నిరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
  • అన్ని రకాలుగా మనం గట్టిగా పోరాడుదాం.

    ఇక్కడున్న యువకులు డీఎస్సీ పరీక్షలు రాసి సంవత్సరం అయిపోయింది. పిల్లలు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ప్రభుత్వోద్యోగాలు కదా అని చెప్పి, ఇంట్లో నుంచి తల్లిదండ్రులు పుస్తెలమ్మి డబ్బులు పంపితే హాస్టళ్లలో ఉండి చదువుకుని డీఎస్సీ రాస్తే.. వాళ్లకు ఉద్యోగాల మాట దేవుడెరుగు, క్లస్టర్ స్కూళ్లని కొత్త విధానం తెస్తున్నాడు. దాంతో ఉన్న స్కూళ్లు కూడా మూసేసి.. 7వేల మంది టీచర్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా బుద్ధి రావాలి, బుద్ధి వచ్చేవరకు పోరాడుదాం.

వైఎస్ జగన్ ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం యలమంచిలి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన చింతపల్లిలో బాక్సైట్ వ్యతిరేక  సభలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. అంతకుముందు అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వైఎస్ జగన్ ను తుమ్మపాల కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు కలిశారు. ఫ్యాక్టరీ ఆధునీకరించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని ఆయనకుకి కార్మికులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బకాయిలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
అలాగే వల్లూరు లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితులు కూడా వైఎస్ జగన్ ను కలిశారు. తమకు నష్టపరిహారం చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారంటూ వారు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వక్తం చేశారు. ఈ అంశంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వైఎస్ జగన్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట


'అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట'
చింతపల్లి: తన బంధువులు, టీడీపీ నాయకులకు లాభం చేకూర్చేందుకే ఏపీ సీఎం చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

విపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆమె గుర్తు చేశారు. తవ్వకాల వల్ల గిరిజనులకు, పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని 2011లో ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారని, నిన్నమొన్నటివరకు ఈ లేఖ టీడీపీ వెబ్ సైట్ లోనూ ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి బాక్సైట్ తవ్వకాలు తప్పుకాదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

97 జీవో విడుదల చేసి గిరిజనుల అభివృద్ధి కోసమేనని చెప్పడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిజంగా గిరిజనులపై ప్రేమవుంటే గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బాసటగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని హామీయిచ్చారు.

విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం


విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.  విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ అనకాపల్లి బయల్దేరారు. అక్కడ నూకాలమ్మ ఆలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు.
 
అనంతరం అక్కడ నర్సీపట్నం మీదుగా చింతపల్లి వెళతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు నిరసనగా జిల్లాలోని చింతపల్లిలో ఇవాళ బహిరంగ సభ జరగనుంది. 'విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు' అనే నినాదంతో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. బాక్సైట్ ఖనిజ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ కార్యచరణను ఆయన ప్రకటిస్తారు.

చైనా దిగుమతులపై పరిశీలన

Written By news on Wednesday, December 9, 2015 | 12/09/2015


చైనా దిగుమతులపై పరిశీలన
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

 సాక్షిప్రతినిధి, ఖమ్మం: చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న సెకండ్‌హ్యాండ్ నిర్మాణ పరికరాల నియంత్రణకు కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు ఐసీఈఎంఏ(ఇండియన్ కన్‌స్ట్రక్షన్ ఎక్యూప్‌మెంట్ మా న్యుఫ్యాక్చర్ అసోసియేషన్) కూడా విజ్ఞప్తి చేసిం దని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జి.ఎం. సిద్ధేశ్వర చెప్పారు. దీనిపై పరిశీలన జరిపి, అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పార్లమెంట్‌లో చైనా సెకండ్‌హ్యాండ్ నిర్మాణ పరికరాల నియంత్రణకు ఐసీఈఎంఏ కేంద్రానికి ఏమైనా నివేదిక ఇచ్చిందా..కేంద్రం ఒకే పోర్టు ద్వారా దిగుమతుల నియంత్రణకు ఏమైనా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అంగీకరించిందా.. అని అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

వైఎస్సార్ సీపీ విజయం ఖాయం


వైఎస్సార్ సీపీ విజయం ఖాయం
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగాల నామినేషన్


 ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన లింగాల కమల్‌రాజ్ గెలుపు ఖాయమని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి కమల్‌రాజ్‌తో ఎంపీ పొంగులేటి మంగళవారం నామినేషన్ వేయించారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బాబూరావుకు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు వాహనాల్లో కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, బూర్గంపాడు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటుహక్కు విషయమై జేసీని అడిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థి కమల్‌రాజ్ గెలుపు ఖాయమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీ ఎవరితో కలిసి పనిచేస్తే వారితో తాము కలిసేది లేదని ముందుగానే చెప్పామన్నారు. అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదన్నారు. అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా?


మేం రాగానే సంపూర్ణ మద్యనిషేధం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటన

 సాక్షి, విజయవాడబ్యూరో: తమ ప్రభుత్వం రాగానే రాష్ర్టంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని విపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన విజయ వాడలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని వివిధ ఆసు పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులనూ ఆయన పరామర్శించారు. సంఘటన వివరాలను వారిని అడిగి తెలుసు కున్నారు. అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి స్తుండడం విచారకరమన్నారు. షాపుల్లో ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరలను అనుమతి స్తూ కల్తీని ప్రోత్సహిస్తు న్నారని, అందుకోసం కిందిస్థాయి నుంచి సీఎం వరకు మామూళ్లు అందుతున్నాయని జగన్ విమర్శించారు.... వివరాలు ఆయన మాటల్లోనే...

 వచ్చేది ప్రజాప్రభుత్వమే.. వెంటనే నిషేధం
 ‘‘చంద్రబాబుకు బుద్ధి ఉంటే మద్య నిషేధం అమలు చేయాలి. రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వమే వస్తుంది. ప్రజల ప్రభుత్వం వస్తుంది. అపుడు రాష్ర్టంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో పర్మిషన్ ఇస్తే పరవాలేదు. బాగా డబ్బులున్నోడు.. సూట్లు బూట్లు వేసుకుని స్టార్ హోటల్‌లో తాగి పడిపోయినా ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా చదువుకునే పిల్లల చదువు నాశనమౌతోంది. దారి తప్పుతున్నారు. పదో తరగతి పాసవుతూనే పిల్లలు మద్యం షాపుల వైపు చూస్తున్నారు. పిల్లలు చదువుకునే చోట ఎదురుగా మద్యం షాపులు పెడుతున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.  రాష్ర్టంలో ఎక్కడా మద్యం లేకుండా పూర్తిగా నిషేధం విధిస్తామని చెబుతున్నా.

 ఆరింటికే షాపులు రెడీ...
 ఇంత దారుణమైన పరిస్థితి మధ్య మాట్లా డాలంటేనే బాధ అనిపిస్తోంది.. సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదో కానీ మద్యం షాపుల తాళాలు మాత్రం కరెక్ట్‌గా ఆరింటికి తెరుస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట, తెల్లవారుజామున 3 గంటల వరకూ మద్యంషాపులు తెరిచి అమ్ముతున్నారు.. ప్రజలతో ఎంత ఎక్కువ తాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండటం మన దౌర్భాగ్యం.. తాగించడం ఎలా అని ప్రభుత్వం లెక్కలు కడుతోంది.. ఈ నెల ఇంతే తాగారా? వచ్చే నెల ఇంకా ఎక్కువ తాగించాలంటే ఎలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది.. మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తుంటే దానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా?.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలను, కల్తీని ప్రోత్సహిస్తున్నారు.. ఇందుకు ప్రతీ షాపు నుంచి అధికారులు, పై అధికారులు, మంత్రులు, సీఎం, ముఖ్యమంత్రి కొడుక్కి మామూళ్లు అందుతున్నాయ్.. సాక్షాత్తూ సీఎం ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలుచేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మిస్తున్నారంటే పాలన ఎలా ఉందో తెలుస్తోంది. కల్తీ మద్యం వ్యవహారాలపై అసెంబ్లీలోనూ నిలదీస్తాం.

 బెల్టుషాపులనూ వేలం వేస్తున్నారు..
 బెల్ట్‌షాపులు తొలగిస్తామని ప్రమాణస్వీకారం నాడు సంతకం చేసిన సీఎం ఇప్పుడు అదే బెల్ట్‌షాపుల కోసం వేలంవేసే పరిస్థితిని తీసుకొచ్చారు. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి సొంత నియోజకవర్గంలోని కరఅగ్రహారంలో బెల్ట్‌షాపునకు వేలం నిర్వహించారు. రాష్ట్రంలో 4,300 మద్యం షాపులు ఉంటే ఒక్కో మద్యం షాపునకు ఏకంగా 15 నుంచి 20 బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఆడవాళ్లు బయట తిరిగే పరిస్థితి లేదు. అన్నింట్లోనూ చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఆయన చెప్పేదొకటి  చేసేదొకటి. రూ.87 వేల కోట్ల రైతు రుణమాఫీ, బాబొస్తే జాబొస్తుంది, రూ.2వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ.. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు మోసం చేశాడు. బెల్ట్‌షాపులు తీస్తానంటాడు.. యూటర్న్ తీసుకుంటాడు. ఇసుక మొదలుకొని అన్ని ఆదాయాలూ చంద్రబాబు, ఆయన కొడుకుకే చేరుతున్నాయి.

 రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి
 కేవలం ఐదులక్షలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదం. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చెవులుపట్టుకుని ఈ ప్రభుత్వం గుంజీలు తీయాలి. అపుడే ఆ బాధిత కుటుంబాలు కాస్తో కూస్తో ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తాయి. ఐదుగురు చనిపోయి 24 గంటలు గడిచినా ఆ మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం కాలేదు. రికార్డులు తిరగరాసి, మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోవడం, మరెంతోమంది ఆస్పత్రిపాలు కావడానికి పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన ఐదు మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబసభ్యులను జరిగిన ఘటనపై ఆరా తీశారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్యం బాధితులను పరామర్శించారు. సెంటిని, ఆంధ్రా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న వారిని కలిసి వారికి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా ప్రతాప అప్పారావు, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, సామినేని ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

 వీఆర్‌ఏల డిమాండ్లు న్యాయమైనవి
 దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన వైఎస్‌జగన్

 ‘పే స్కేల్ కావాలని, రెగ్యులరైజ్ చేయాలని వీఆర్‌ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్దమైనవి, వారికి పూర్తిగా మద్దతిస్తున్నా’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో 37 రోజులుగా వీఆర్‌ఏలు ఆందోళనలు, రిలే దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షా శిబిరాన్ని జగన్ మంగళవారం సందర్శించి మద్దతు ప్రకటించారు.

 ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా?

 గుజరాత్‌లో మద్యం అమ్మకాలు లేక పోయినా ఆ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. బిహార్‌లో నితీష్ కుమార్ కూడా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. మన రాష్ర్టంలో మాత్రం ప్రజలతో విచ్చల విడి గా తాగించి ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన దారుణంగా ఉంది. డిస్టి లరీ లెసైన్సులు తమ వాళ్లకే సెలక్టివ్‌గా ఇస్తున్నారు. మద్యం అమ్మకాల్లో 2014లో రూ.6,632 కోట్లు వస్తే. ఈ ఏడాది అక్టోబర్ వరకు 7 నెలల్లోనే రూ.7,050 కోట్లు దాటిం ది. ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు మద్యం ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రజలతో తాగిస్తోంది. రానున్న 5 నెలలకు రూ.5 వేల కోట్లు కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.12వేల కోట్లు మద్యం తాగించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది.

కరువు రాష్ట్రంగా ప్రకటించండి


కరువు రాష్ట్రంగా ప్రకటించండి: వైఎస్సార్‌సీపీ
హైదరాబాద్: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి, వెంటనే సహాయ చర్యలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కేంద్ర బృందానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం సచివాలయంలో కేంద్ర బృందానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరిట పార్టీ నేతలు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు.

రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, పాడి పశువులకు దాణా సరఫరా చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి వలసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలని, రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

కరువును ఎలా సమీక్షించారు
కేంద్ర బృందం ఒకటిన్నర రోజుల్లోనే కరువు పరిస్థితులను ఎలా సమీక్షిస్తుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ 15 నిమిషాల్లోనే రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులను కేంద్ర బృందానికి ఎలా వివరించారన్నారు. కరువుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

అన్నా.. మద్యం మానుకోండి..


అన్నా.. మద్యం మానుకోండి..
♦ కల్తీ మద్యం బాధితులతో వైఎస్ జగన్
♦ పేరుపేరునా పలుకరించిన ప్రతిపక్షనేత
♦ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వేదనను వెళ్లగక్కిన బాధితులు
♦ అధైర్యపడకండి అండగా ఉంటానంటూ బాధిత కుటుంబాలకు భరోసా

 సాక్షి, విజయవాడ బ్యూరో: ‘అన్నా మళ్లీ మద్యం తాగకు.. ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు... నీ కుటుంబాలను మద్యం ఇబ్బంది పెడుతోంది.. ఇకనైనా మద్యం మానేయండి’ అంటూ కల్తీమద్యం బాధితులకు విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో మృతదేహాలను పరిశీలించి, అక్కడకు చేరిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, సెంటిని, ఆంధ్రా హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. వారి వేదనను ఓపిగ్గా విని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. ఒక్కొక్కరిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆంధ్ర హాస్పిటల్ ఎండీ రమణమూర్తి, సెంటిని హాస్పిటల్ ఈడీ ఆనందశ్రీనివాస్ మద్యం బాధితుల వివరాలను జగన్‌కు వివరించారు.

 మాకు దిక్కెవరు దేవుడా..
 ‘కల్తీమద్యం కాటుకు మా వాళ్లను పోగొట్టుకున్నాం.. ప్రభుత్వం విచారణ, పరిహారం అంటూ కాలం గడిపేస్తోంది.. ఇంక భవిష్యత్ ఎలా గడిచేది..  మాకు దిక్కెవరు దేవుడా’ అం టూ మృతుల కుటుంబాల వారు వైఎస్ జగన్ వద్ద భోరున విలపించారు. గతంలోనే తల్లిని పోగొట్టుకుని, ఇప్పుడు తండ్రి కోల్పోయిన మునగాల శంకరరావు కుమార్తె శాంతిప్రియ మాట్లాడుతూ తనకు వచ్చిన కష్టం ఏ ఆడబిడ్డకు రాకూడదని విలపించింది. మీసాల మహేష్ భార్య లక్ష్మి మాట్లాడుతూ తన భర్త మరణంతో దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని వాపోయింది.  తన భర్త నరసా గోపి కల్తీ మద్యానికి బలైపోయాడని భార్య మంగమ్మ బావురమంది.

 ఆక్సిజన్ అంది ఉంటే మానాన్న దక్కేవాడు..
 ‘అంబులెన్సుల కోసం ఫోన్ చేసినా సకాలంలో అవి రాలేదు.. కనీసం ఆసుపత్రికి త్వరగా తీసుకొచ్చి ఆక్సిజన్ అందించి ఉంటే మా నాన్న మాకు దక్కేవాడు’ అంటూ మృతుడు మాదాసు నాంచరయ్య కుమారుడు నాగదుర్గాప్రసాద్ కన్నీరుమున్నీరయ్యాడు. మీ నాన్న ఎలా చనిపోయాడంటూ వైఎస్ జగన్ అడగడంతో ఆ యువకుడి వేదన కట్టలు తెచ్చుకుంది. ప్రభుత్వం సరఫరా చేసిన కల్తీ మద్యానికే తన తండ్రి బలైపోయాడని, నీరు కలుషితం అని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయాడు. స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, బార్‌లోనే మద్యం తాగి కుప్పకూలిపోయిన తన తండ్రిని బార్‌లోని వాళ్లు సకాలంలో ఆసుపత్రికి తరలించలేదన్నాడు. స్వర్ణ బార్ బోర్డు కూడా లేకుండా నిర్వహిస్తున్నా అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరించారని వాపోయాడు. ఎన్ని లక్షలిచ్చినా తన తండ్రి తిరిగిరాడని, అదే మంత్రుల ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా జరిగితే ఇలాగే కమిటీలు వేసి కాలయాపన చేస్తారా? అని వాపోయాడు.

 సకాలంలో వైద్యం అందితే బతికేవారు.. .
 స్వర్ణ బార్‌లో మద్యం తాగి ఒక్కొక్కరు వరుసగా కుప్పకూలిపోతున్నా బార్ నిర్వాహకులు పట్టించుకోలేదని.. స్థానికులు, తాము మానవత్వంతో అందుబాటులో ఉన్న వాహనాలపై ఆసుపత్రికి తరలించామని జగన్‌కు కార్పొరేటర్ పల్లెం రవి వివరించారు.. అంబులెన్సులు సకాలంలో రాలేదని..ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టక, వెంటిలేటర్లు సరిగ్గా లేక చనిపోయారని ఆయన తెలిపారు. కాగా సెంటినీ హాస్పటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎం.అక్కునాయుడు(35), సీహెచ్ రజనీకుమార్(40), పి.రమేష్(35), ఎం.బుసిరెడ్డి(32)లను మంగళవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ పరామర్శించారు.

 24 గంటలయ్యాక పోస్టుమార్టమా? ప్రభుత్వం కావాలని చేస్తోందా?
 ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు జగన్ ప్రశ్న

 ‘ఐదుగురు చనిపోయి 24గంటలు దాటాక పోస్టుమార్టం చేస్తే మృతికి గల వాస్తవ కారణాలు ఎలా గుర్తిస్తారు? వాస్తవాలు వెలుగు చూడకుండా ప్రభుత్వమే కావాలని జాప్యం చేస్తోందా?’ అని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యకుమారిని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చనిపోయిన కొన్ని గంటలకే పోస్టుమార్టం చేస్తే సరైన ఫలితమొచ్చే అవకాశం ఉంది.. సకాలంలో పోస్టుమార్టం చేయాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. పోస్టుమార్టం జాప్యం వల్ల మృతదేహాల్లో అవయవాలు పాడై మృతికి గల కారణాలు ఎలా గుర్తిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు పంచనామా రిపోర్టు ఇవ్వనందువల్లే పోస్టుమార్టం ఆలస్యమైందని సూపరింటెండెంట్ వివరించారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలందించే పరికరాలు, సిబ్బంది ఉన్నారా? అని ఆయన ప్రశ్నించగా అన్నీ బాగానే ఉన్నాయని ఆమె బదులిచ్చారు. దీంతో పక్కనే ఉన్న పార్టీ నాయకులు, బాధితులు జోక్యం చేసుకుని ఆసుపత్రిలో  సౌకర్యాలు లేవని, ఉన్న 9 వెంటిలేటర్గు పనిచేయడం లేదని, ఆక్సిజన్ అందని దుస్థితి నెలకొందని తెలిపారు.

మేం వస్తే సంపూర్ణ మద్యనిషేధం

Written By news on Tuesday, December 8, 2015 | 12/08/2015


మేం వస్తే సంపూర్ణ మద్యనిషేధం: వైఎస్ జగన్
విజయవాడ :  'ఇంతటి దారుణమైన పరిస్థితి మధ్య మాట్లాడాలంటేనే బాధ అనిపిస్తుంది. సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదో కానీ, మద్యం షాపుల తాళాలు మాత్రం కరెక్ట్ గా ఆరింటికే తెరుస్తున్నారు. రాత్రి ఒంటిగంట, తెల్లవారుజాము మూడు గంటల వరకూ షాపులు తెరుస్తూనే ఉన్నారు. ప్రజల చేత ఎంత ఎక్కువ తాగించాలనే ఉద్దేశం  ప్రభుత్వానికి ఉండటం మన దౌర్భాగ్యం. తాగించడం ఎలా ప్రభుత్వం లెక్కలు కడుతోంది. ఈ నెల ఇంతే తాగారా? వచ్చే నెల ఎంత తాగించాలని ఆలోచిస్తోంది.
 
మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది.  మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తుంటే దానికి ప్రభుత్వానిదే బాధ్యత. మరోవైపు  ఎమ్మార్పీ రేట్ల కన్నా ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ఇవన్నీ అధికారులకు తెలుసు. అందరికీ ముడుపులు అందుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యం, మద్యాన్ని అమ్మిస్తున్నారని' ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఆయన వెల్లడించారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే...
* 2014 మద్యం అమ్మకాలు రూ.6,632 కోట్లు దాటింది.
* ఈ ఏడాది అక్టోబర్ వరకూ రూ.7,050 కోట్లు దాటింది.
* 7 నెలలకు రూ.7,050 కోట్ల చొప్పున ప్రతినెల వెయ్యి కోట్లు.
* ఈ ఏడాది చివరినాటికి రూ.12 వేల కోట్లు తాగించాలని సర్కార్ డిసైడ్ అయింది.
* తన వారికే మద్యం తయారీ లైసెన్స్ లు.
* బెల్డ్ షాపులు తొలగిస్తామని సంతకం చేసి ఇప్పుడు అదే బెల్ట్ షాపుల కోసం వేలం వేస్తున్నారు.
* గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఉండే తీరు చూస్తే ఈ సొసైటీలో ఆడవాళ్లు తిరిగే పరిస్థితి లేదు.
* సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి సొంత గ్రామంలోనే బెల్ట్ షాపుకు వేలం నిర్వహించారు.
* స్కూళ్లు, దేవాలయాల ఎదుటే మద్యం షాపులా?.
* ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్తీ మద్యం విక్రయాలు.
* మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

తండ్రీకొడుకులు కోట్లు గడిస్తున్నారు


తండ్రీకొడుకులు కోట్లు గడిస్తున్నారు
బెజవాడ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత: వైఎస్సార్‌సీపీ నేత అంబటి

 గుంటూరు (పట్నంబజారు): రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకే శ్‌లు మద్యం, మైనింగ్‌లను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని కోట్లు గడిస్తున్నారని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపిం చారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పెద్ద అవినీతిపరుడు కావడంతో ప్రభుత్వ శాఖలన్నీ లంచాల శాఖలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించిన కొందరు మృత్యువాత పడటం, మరికొందరు అస్వస్థతకు గురైన ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు.

ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తన పదవికి రాజీనామా చేసి విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు. విజయవాడ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గేషియా ప్రకటించాలని డి మాండ్ చేశారు.

బాక్సైట్ జీవో రద్దుపై అధికారిక ప్రకటన చేయాలి


బాక్సైట్ జీవో రద్దుపై అధికారిక ప్రకటన చేయాలి
♦ వైఎస్సార్ సీపీ నేత బొత్స డిమాండ్
♦ బాక్సైట్‌కు వ్యతిరేకంగా 10న చింతపల్లిలో వైఎస్ జగన్ సభ

 సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జారీ చేసిన జీవో 97ను రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన సోమ వారం విలేకరులతో మాట్లాడారు. జీవోను రద్దు చేయకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ కేబినెట్‌లో నిర్ణయించినట్టు కొందరు మంత్రులు చెప్పారని,  పూర్తిగా  రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయాలన్నారు. తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గిరిజనులకు మద్దతుగా ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటిగంటకు చింత పల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారని ఆయన తెలి పారు. ఈ సభ ద్వారా తవ్వకాలపై పార్టీ స్టాండ్.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారన్నారు.  బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరి జనుల మనోభావాలకు విరుద్ధంగా  ముందుకెళ్లాలని చూస్తే తీవ్ర  ప్రతిఘటన తప్పదన్నారు.

 లోకేశ్ స్నేహితునికి భూ సంతర్పణ
 విశాఖలో ఎకరా రూ.7 కోట్ల విలువైన 50 ఎకరాల భూముల్ని ఎకరా రూ.50 లక్షలకే  ధారాదత్తం చేశారని బొత్స విమర్శించారు. ఢీ సెంట్రిక్ సొల్యూషన్స్ పేరిట ఈ భూముల్ని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగికి కట్టబెట్టారని,  లోకేశ్ మిత్రుడు కావడమే ఆయనకున్న అర్హతన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికీ ఇదే రీతిలో విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట వద్ద 250 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా ఇచ్చేశారన్నారు. చిత్తూరులో 21 కోట్ల విలువచేసే భూమిని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు రూ.4 కోట్లకే కేటాయించారన్నారు. సోమవారం శ్రీకాకుళంలో ఓ హైస్కూల్లో జాతీయ జెండా కట్టిన పోల్‌ను లాక్కొచ్చి దానికి టీడీపీ జెండా కట్టి బాబు ఆవిష్కరించారని, జాతీయజెండాపై ఆయనకున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతోందని బొత్సా ఎద్దేవా చేశారు.

హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా!


హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా!
పాల వ్యాన్‌ను సీజ్ చేసిన పోలీసులు

 తిరుపతి రూరల్: ఎర్రచందనం తరలించేందుకు అనువుగా ఏర్పాటుచేసిన అరలతో కూడిన పాలవ్యాన్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్యాక్టరీ లోగో ఉండటం చర్చనీయాంశంగా మారింది. తిరుపతికి సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఎంఆర్ పల్లి పోలీసులు సోమవారం తనిఖీ చేస్తుండగా హెరిటేజ్ లోగో ఉన్న పాల వ్యాను నడుపుతున్న వ్యక్తులు పోలీసుల్ని చూిసి వాహనాన్ని వదిలి పారిపోయారు. అందులో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలున్నాయి. దీంతో వ్యానును ఎం.ఆర్.పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న వ్యాన్‌పై ఎపీ 03టీ 4959 అని నంబర్ ఉంది. ఇంజన్ నంబర్‌తో ట్యాలీ చేయగా వ్యాన్ నంబర్ దొంగదని తేలింది. ఈ వ్యాన్ చిత్తూరు వ్యక్తిదిగా గుర్తించారు. సమగ్ర విచారణ కోసం ఎస్‌ఐ ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఏర్పాట్లను చూస్తేపాలవ్యానులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానంగా ఉందని ఎం.ఆర్.పల్లి సీఐ తమ్మిశెట్టి మధు తెలిపారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పాలవ్యాన్‌కు హెరిటేజ్ కంపెనీతో సంబంధం లేదని కాశిపెంట్ల  హెరిటేజ్ ఫుడ్స్ డీజీఎం వంశీధర్‌రెడ్డి ఖండించారు.

http://www.sakshi.com/news/district/red-sandalwood-smuggling-behind-the-name-of-heritage-296381

నేడు బెజవాడకు వైఎస్ జగన్


నేడు బెజవాడకు వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ వెళ్లనున్నారు. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ కలవనున్నారు.

విజయవాడలోని కృష్ణలంకలోగల స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి మొత్తం 34 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మరణించగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

నారా లోకేష్‌ను నిలదీసిన మహిళలు

Written By news on Monday, December 7, 2015 | 12/07/2015

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్‌బాబుకు మహిళల నుంచి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్‌ను.. తమకు హుద్‌హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదంటూ అక్కడి మహిళలు నిలదీశారు. మరికొందరు మహిళలు తమకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు కాలేదని వాపోయారు. అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వటం లేదని మరికొందరు వృద్ధులు లోకేష్ కు తెలిపారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/nara-lokeshs-jana-chaitanya-yatra-in-chodavaram-296262

ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ

ఖమ్మం:  ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల భరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కమల్ రాజు పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కమల్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.

మోడ్రన్ అంటూ మోసం


'మోడ్రన్ అంటూ మోసం చేస్తున్నారు'
న్యూఢిల్లీ: విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలని గతంలో కేంద్రం చేసిన వాగ్దానం గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులను కాపాడుకునేందుకే టీడీపీ నేతలు నోరు విప్పడం లేదని చెప్పారు. మోడ్రన్ కేటగిరి అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు.

గ్రేటర్‌లో పార్టీ జెండా ఎగురవేయాలి

Written By news on Sunday, December 6, 2015 | 12/06/2015


గ్రేటర్‌లో పార్టీ జెండా ఎగురవేయాలి
టీఆర్‌ఎస్ కల్లబొల్లి కబుర్లను ప్రజలు నమ్మొద్దు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్

 సాక్షి, హైదరాబాద్ : 
 గ్రేటర్ పరిధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆ పథకాలే ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి శ్రీరామరక్ష అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ అన్నారు.  శనివారం వనస్థలిపురం పనామా చౌరస్తాలోని బొమ్మిడి లలితా గార్డెన్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎల్‌బీనగర్ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జీహెచ్‌ఎంసీని వైఎస్సార్ ఏర్పాటు చేశారని, మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు తదితరాలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్నారు. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పోటీలో కూడా లేని టీఆర్‌ఎస్ నేడు అధికారబలంతో అడ్డదారుల్లో మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతు పార్టీలో పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని, కార్పొరేటర్లుగా పోటీ చేయదలచిన వారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని సూచించారు. పార్టీ 150 డివిజన్లలో పోటీ చేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జి.సురేష్‌రెడ్డి నాయకులు రాఘవనాయుడు, వెంకటకృష్ణ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ యజ్దాని, సంయుక్త కార్యదర్శి దుబ్బాక గోపాల్‌రెడ్ది, మైనార్టీ నాయకులు మాసూమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జగన్, పొంగులేటి సమక్షంలో పార్టీలో చేరిన వరంగల్ టీడీపీ నేత


వైఎస్సార్‌సీపీలోకి దొమ్మాటి సాంబయ్య
జగన్, పొంగులేటి సమక్షంలో పార్టీలో చేరిన వరంగల్ టీడీపీ నేత
 ప్రజలకు టీడీపీ దూరమైపోయింది: సాంబయ్య
 సాక్షి, హైదరాబాద్:
వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేసిన దొమ్మాటి సాంబయ్య శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. జగన్ ఆయనకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ... ఒకప్పుడు బడుగుల పార్టీగా పేరున్న టీడీపీ ఇప్పుడు హైజాక్ అయిందని... బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజనులకు దూరమైందని చెప్పారు.
టీడీపీలోని కొందరు నాయకులు టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని.. ఆ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రజల నమ్మకం, విశ్వాసం కోల్పోయిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించి వేసే పనిలో కొందరు నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పొంగులేటిల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Popular Posts

Topics :