13 December 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకెళ్తా

Written By news on Saturday, December 19, 2015 | 12/19/2015


అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకెళ్తా
హైదరాబాద్ :
ఎమ్మెల్యే రోజా అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన స్వయంగా నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే రోజాను పరామర్శించారు. ఈ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాగ్వాదం చోటుచేసుకుంది. అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. స్పృహ తప్పిన ఎమ్మెల్యేను... అందునా మహిళా ఎమ్మెల్యేను అంబులెన్సు లేకుండా పోలీసు జీపులో ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్సు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాత్రమే పోలీసులు అంబులెన్సు తెప్పించి, రోజాను నిమ్స్‌కు తరలించారు. అంతకుముందు కూడా ''కావాలని మీరు ఈ ప్రాంతమంతా కవర్ చేస్తున్నారు. ఫొటోలు, కెమెరాలను అనుమతించడంలేదు. ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారోనని జనం ఆందోళన చెందుతున్నారు'' అని పోలీసులకు వైఎస్ జగన్ చెప్పారు.


కాగా రోజా అరెస్టు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు విషయంలో పోలీసుల దారుణంగా వ్యవహరించారు. నిరసన వ్యక్తం చేయడానికి రాలేదు, వైఎస్ఆర్‌సీఎల్పీ కార్యాలయాలనికి వెళ్లేందుకే వచ్చానని చెప్పినా వినలేదు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఓ సమయంలో ఆమె స్పృహ కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. మార్షల్స్ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యేలంతా తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంత పాలనా అని నిలదీస్తున్నారు.

రోజా పరిస్థితి కుదుటపడుతోంది: వైఎస్ జగన్


రోజా పరిస్థితి కుదుటపడుతోంది: వైఎస్ జగన్
హైదరాబాద్ :
ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుట పడుతోందని, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజాను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
 • రోజమ్మ పరిస్థితి మీద డాక్టర్లతో విచారించాం
 • ఇక్కడకు వచ్చినప్పుడు బీపీ 180/100గా ఉందని చెప్పారు
 • హైబీపీతో ఉన్న రోజమ్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు
 • ఆమె పరిస్థితి కుదుట పడుతోందని చెప్పారు
 • ఇంతకుముందు కూడా తిరుపతి స్విమ్స్‌లో 9 రోజులు అడ్మిట్ అయ్యారు
 • ఆ కేసు హిస్టరీ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు
 • కానీ ఈవాళ ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభకు వస్తే వైఎస్ఆర్‌సీఎల్పీ కార్యాలయానికి వస్తే, ఆమె స్పీకర్ ఛాంబర్ వద్దకు వచ్చి ఒక నోట్ కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదు
 • శాసన సభలోకి రాకూడదు గానీ, కనీసం నోట్ కూడా ఇవ్వనివ్వలేదు
 • స్పీకర్‌కు ఇదే విషయాలు చెబుతూ రూల్ 340 ప్రకారం ఎమ్మెల్యేను ఏడాదిపాటు ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేసే అధికారం లేదని చెప్పాము
 • అసెంబ్లీ ఆ సమావేశాలు కొనసాగినంత కాలం మాత్రమే సస్పెండ్ చేయాలని ఉంది
 • అదే రూల్స్ వినిపించినా, మాది అరణ్య రోదనే అయింది
 • అధికారపక్షం ఏం చెబితే అదే చేస్తాం అన్నట్లు తయారైంది
 • అధికారపక్షం రోజుకో కాంట్రవర్సీ తెచ్చి ప్రజాసమస్యల మీద చర్చ జరగకూడదన్నట్లు వ్యవహరిస్తోంది
 • తొలుత అంబేద్కర్‌ను తీసుకొచ్చారు.
 • ముందు మేం సెక్స్ రాకెట్ మీద వాయిదా తీర్మానం ఇస్తే.. పట్టించుకోలేదు
 • ఎలాంటి సందర్భం లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత అంబేద్కర్‌ అంశాన్ని తీసుకొచ్చారు.
 • కావాలనే వివాదం సృష్టించారు..
 • అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చనివాళ్లను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం మొదలుపెడితే శాసనసభమీద ప్రజలకున్న విశ్వాసం పోతుంది.
 • అసెంబ్లీలో ఇప్పుడున్నది రెండే పార్టీలు
 • బీజేపీవాళ్లు సగం టీడీపీ కండువాలు కప్పుకొన్నారు
 • ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు.. దీన్ని నొక్కేస్తున్నారు
 • ఇలా చేస్తే ప్రజలు నష్టపోతారన్నది వీళ్లకు అర్థం కావట్లేదు
 • దేవుడు, ప్రజలు మొట్టికాయలు వేస్తారు
 • నా దగ్గర బలం ఉంటే స్పీకర్ మీద అవిశ్వాసం మూవ్ చేసేవాళ్లం
 • మా ఖర్మ ఏమిటంటే.. మేం ఏదైనా అవిశ్వాసం మూవ్ చేసినా అది నిలబడదు కాబట్టి ఊరుకుంటున్నాం
 • కచ్చితంగా దీనిమీద పోరాడతాం, రూలింగ్ మీద కోర్టుకు కూడా పోతాం

రోజాకు వైఎస్ జగన్ పరామర్శ


రోజాకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి వైఎస్ జగన్ నిమ్స్ కు వెళ్లారు. రోజాను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వెళ్లిన రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో రోజా కిందపడిపోయారు. గాయపడిన రోజా స్పృహ కోల్పోయారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రోజాను నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో రోజాకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరంపై గోళ్ల గాట్లు పడ్డాయని, వాంతులు చేసుకున్నారని తెలుస్తోంది. హై బీపీతో ఉన్న రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

నిబంధనలు కాలరాసి రోజాను ఎలా సస్పెండ్ చేస్తారు


► అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటి ప్రశ్న
► 340 నిబంధన ప్రకారం సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ పరిమితం కావాలి
► మేం కూడా రేపు అలాగే చేస్తే ఇక ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదు
► సభ నుంచి సస్పెండ్ చేస్తే కనీసం వైఎస్ఆర్సీఎల్పీలోకి కూడా రానివ్వరా


హైదరాబాద్:
మహిళా ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన సభలో మాట్లాడారు. 340 నిబంధనలో ఏముందో ఆయన చదివి వినిపించారు. ఒక సెషన్ కంటే ఎక్కువ కాలం సస్పెండ్ చేయకూడదని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా, దాన్ని ఉల్లంఘించి ఎలా సస్పెండ్ చేశారో అర్థం కాని విషయమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..

సభ మొత్తం నిబంధనలకు అనుగుణంగానే నడవాలని, ప్రచురిత పుస్తకంలోనే స్పష్టంగా ఉంది
ఈ రోజు మాకు జరగచ్చు, రేపు మీకు జరగొచ్చు
మనమే తప్పుడు సంప్రదాయాలు పాటిస్తే.. రేపు మేం కూడా ఇలాగే నిబంధనలు పక్కన పారేస్తే ఇక ఏమీ ఉండదు
లేని అధికారాలు ఉపయోగించి ఎలా చేయగలరు
ఎవరు మారినా రూల్స్ మాత్రం మారవు
సభలో ఉన్న రూల్ పుస్తకంలో రూల్ ఉన్నా, లేని అధికారాన్ని వాడుకుంటూ మహిళా శాసన సభ్యురాలిని
అన్న మాటల్లో ఎలాంటి దోషం లేకపోయినా ఆమెను సస్పెండ్ చేస్తున్నారు
అచ్చెన్నాయుడి లాంటి వ్యక్తులు ఏమన్నారో, ఆ గూండా గాడైతే పాతేస్తామని అన్నా తప్పులేదు
సాక్షాత్తు చంద్రబాబు అంతు చూస్తా అని వేలు పైకెత్తి చూపించినా సస్పెండ్ చేయరు
అచ్చెన్నాయుడు అన్న మాటలు చెప్పాలంటే బాధాకరంగా ఉంటోంది
అన్నేసి మాటలన్నా కూడా ఆయననూ సస్పెండ్ చేయరు
రోజా అన్న మాటలు ఏమాత్రం తప్పుకాదు
నిరసన చెప్పడమే తప్పన్నట్లు ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
లేని అధికారంతో సస్పెండ్ చేయడం సరికాదు, దయ ఉంచి రివోక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
లేకపోతే మా శాసన సభ్యులందరినీ కూడా అలాగే సస్పెండ్ చేసుకోండి
కాదంటే మాత్రం మేం నిరసన వ్యక్తం చేస్తాం.. సభను జరగనిచ్చేది లేదు
స్పెసిఫిక్ రూల్.. రూల్ పుస్తకంలో లేనప్పుడు మాత్రమే రెసిడ్యువల్ పవర్స్ వాడచ్చు అని రూల్ పుస్తకంలో ఉంది
దయ ఉంచి, మేం స్పీకర్‌కు వ్యతిరేకమన్న భావన తీసుకురావద్దు
సెక్రటరీ సలహా వల్లో, మరేదైనా కారణంతోనో పొరపాటు జరిగి ఉండొచ్చు
రేపు మేం వచ్చిన తర్వాత కూడా ఇదే మాదిరిగా సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం విఫలమయ్యే ప్రమాదం ఉంది
అలాంటి పరిస్థితి తీసుకురావద్దని కోరుతున్నాం
రోజాను అసెంబ్లీ బయట ఆపారు. సభ నుంచి సస్పెండైతే సీఎల్పీ ఆఫీసులోకి కూడా రాకూడదా?
ఆమె శాసనసభ్యురాలు కూడా కాకుండా పోయిందా?
సభలోకి రాకూడదంటే సరే.. కానీ మా ఆఫీసులోకి కూడా రానివ్వకపోతే ఎలా
అసెంబ్లీ గేటు బయట ఎలా ఆపుతారు.. ఇది కరెక్టు కాదు

ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న టీడీపీ నేత

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015

రేపల్లె (గుంటూరు) : ప్రభుత్వ అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె పురపాలక సంఘంలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై తెలుగు దేశం పార్టీ నేత, కాంట్రాక్టర్ గోగినేని శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం దాడికి దిగారు.

బిల్లులకు సంబంధించిన విషయంలో ఏఈతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాసరావు.. ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అధికారిని అడ్డుకుని ఆయనపై దాడి చేశాడు. దీంతో ఆయన కణత వద్ద గాయం అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ వర్గాలు అక్కడికి చేరుకుని ఇద్దరికి రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నాయి.

http://www.sakshi.com/news/home-latest-news/tdp-leader-attacks-government-officer-298884?pfrom=home-latest-story

భయంతోనే నన్ను సస్పెండ్ చేశారు: రోజా


భయంతోనే నన్ను సస్పెండ్ చేశారు: రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాల్ మనీ వ్యవహారం గురించి ప్రశ్నిస్తానన్న భయంతోనే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రూల్స్ ను పక్కనబెట్టి కక్షపూరితంగా తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు.

శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి ఏడాది పాటు  సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. సభ నుంచి తనను సస్పెండ్ చేసినపుడు, కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూసి రాష్ట్ర ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

ఆ అధికారం వారికి లేదు


'ఆ అధికారం వారికి లేదు'
హైదరాబాద్:అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సభ నడుస్తున్నంతసేపు మాత్రమే ఒక ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అంతకుమించి సస్పెండ్ చేయాలనుకుంటే సభా హక్కుల సంఘానికి నివేదించాలని నిబంధనలు చెప్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. సస్పెండ్ చేసిన నేతలు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. ఇంతటి దుర్మార్గపు పాలన ఇక్కడ కొనసాగుతుందన్నారు.
 
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి ప్రతిపాదన మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కాల్ మనీ వ్యవహారంపై వైఎస్ జగన్ చర్చను ప్రారంభిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
 
వైఎస్ జగన్ ఏమన్నారంటే..

*ప్రజల మాన, ప్రాణాలతో టీడీపీ నేతలు ఆడుకుంటున్నారు
* వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి
*అలాంటి వారితో సీఎంకు, టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయి
*అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు
*మ్యానీ ఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు
*ఒక్క ఫోన్ చేస్తే చాలు మహిళలు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు
* ఇప్పుడు నిందితులను కాపాడేందుకు సీఎం పడుతున్న అగచాట్లు చూస్తే బాధిస్తోంది
* డ్వాక్రా రుణాలను రూ.10 వేల కోట్ల రుణాలను ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు
* ఇచ్చింది మాత్రం రూ.3,600 కోట్లు
* కాల్ మనీ వ్యవహారంపై మూలం ఏమిటో తెలిసినా.. మభ్య పెడుతున్నారు
* ఏపీలో అప్పులు కూడా పుట్టడం లేదు
* అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు
* 16 లక్షల 25 వేల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉన్నా 70 వేల మందికి ఇచ్చారు
* బీసీ ఫెడరేషన్ ద్వారా లక్షా 3 వేల మందికి రుణాలు ఇవ్వాల్సి ఉన్నా.. 1,020 మందికి మాత్రమే ఇచ్చారు
*ప్రభుత్వం మాట తప్పింది కాబట్టే ప్రజలు అప్పులు చేస్తున్నారు
*కాల్ మనీ సెక్స్ రాకెట్ లో అధికార పార్టీ నేతలే ఎక్కువ మంది ఉన్నారు
*కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితుడితో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్లారు
*విదేశాల నుంచి ఎమ్మెల్యే బోడె వచ్చారు కానీ.. నిందితుడు రాలేదు
*నిందితుడితో కలిసి విదేశాల్లో తిరిగిన బోడె ప్రసాద్ ను పోలీసులు కనీసం ప్రశ్నించలేదు
*ఎమ్మెల్యేను అరెస్ట్ చేయలేదు, ఏ-5 నిందితుడి ఆచూకీ లేడు
*కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో ఫోటోలు దిగాడు
*ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న సోదరుడికి సెక్స్ రాకెట్ తో సంబంధంముంది
*ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా ఎమ్మెల్యే బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేయరు
*రాజేష్ తో నేనే ఫోటో దిగానంటున్నారు.. ఆయన కాంగ్రెస్ వ్యక్తి అని సీఎం స్టేట్ మెంట్ లోనే చెప్పారు
*అధికార పార్టీ నేతలు కాల్ మనీ కింద అప్పు ఇచ్చి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు
*కాల్ మనీ విషయాన్ని పకడ్భందీగా పక్కదారి పట్టిస్తున్నారు
*కాల్ మనీ అంశాన్ని చర్చించకుండా అంబేద్కర్ అంశాన్ని ఎజెండాలో చేర్చారు
*సెక్స్ రాకెట్ లో తమ వాళ్లను తప్పించడానికి కుట్ర చేస్తున్నారు
*వడ్డీ వ్యాపారుల లెక్కలు చెబుతూ పార్టీలకు లింకు చేస్తున్నారు
*సెక్స్ రాకెట్ చేస్తున్నది ఎవరు?టీడీపీ నేతలు కాదా?
*తప్పు చేసిన వారిని రక్షించడం చంద్రబాబుకు అలవాటు
*తహసీల్దార్ వనజాక్షిని దూషించిన ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోలేదు
*రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోలేదు
*అంగన్ వాడీ మహిళలను దూషించిన ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోలేదు
*వీటిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
*ఇవన్నీ చంద్రబాబుకు కనిపించడం లేదు
*కాల్ మనీ సెక్స్ రాకెట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
*సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది

అప్పుడలా... ఇప్పుడిలా...!


అప్పుడలా... ఇప్పుడిలా...!
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నయితే వ్యతిరేకించిందో... ఈనాడు అధికారంలో అదే చేసింది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్ కె రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చకు అంగీకరించకపోవడంతో నిరసనగా పోడియం వద్ద నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నెపంతో అధికార పార్టీ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేయాలని తీర్మానం పెట్టడం, అది కూడా ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎలాంటి చర్చకు తావివ్వకుండానే వెనువెంటనే సస్పెండు చేశారు.
 
ఆరు నెలల పాటు కరణం సస్పెన్షన్
శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరిగిన సందర్భం లేదు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని ఉద్దేశించి సభా మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న అంశంపై టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండు చేశారు.
 
అయితే అప్పట్లో దీనికి ఒక పద్ధతిని పాటించారు. కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ఫిర్యాదు చేయగా, స్పీకర్ దాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీకి సిఫారసు చేయగా, ఆ కమిటీ పూర్వాపరాలు తెలుసుకుని అవసరమైన సాక్ష్యాధారాలను పరిశీలించింది. స్వయంగా కరణం బలరాం వాదనలను కూడా విన్నది. ఆ తర్వాత కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయాలని సిఫారసు చేసింది. విచిత్రమేమంటే... దానిపై శాసనసభలో కరణం బలరాంకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లభించింది.
 
నాడు చంద్రబాబు ఏమన్నారంటే...
ఇంత జరిగిన తర్వాతే కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయగా, ఆరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదొక దుర్ధినం అనీ, కక్ష సాధింపు చర్య అంటూ దుయ్యబట్టారు. సభలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి అసెంబ్లీ ఆవరణలోకి గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. కరణం బలరాం కక్ష సాధింపు చర్యకు దిగారంటూ ఆరోజు ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
 
పార్లమెంటరీ చరిత్రలోనే...
ఒక పార్టీ నుంచి ఎంపికైనా సభ్యుడు మరో పార్టీలోకి ఫిరాయించినట్టు బహిరంగంగా స్పష్టమైన సందర్భాల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వారి వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించారు. సభ్యుల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి.
 
రోజా విషయంలో...
కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో సూత్రధారులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తూ రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చేస్తోంది. దానిపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వడం, అది తిరస్కరించడంతో ముందు దానిపైనే చర్చ జరగాలని పట్టుబట్టింది. శుక్రవారం కూడా ఇదే అంశంపై పోడియం చుట్టుముట్టి నిరసనగా నినాదాలు చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అలా నినాదాలు చేయడంపై ఆ తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన తర్వాత ఉన్నట్టుండి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని టీడీపీ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర కోరడం, వెనువెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం... క్షణాల్లో రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేస్తున్నట్టు ప్రకటించారు.
 
ఏం తప్పు చేశారని...
రోజా ఏం తప్పుచేశారని సస్పెండు చేశారని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేచి ప్రశ్నించినప్పటికీ మాట్లాడటానికి సభలో అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో సభలోనే ఉన్న రోజాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైగా సస్పెండైన రోజా సభ నుంచి నిష్ర్కమిస్తే తప్ప మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశమివ్వబోమని స్పీకర్ తేల్చిచెప్పారు.

ఆయన కనుసైగ చేస్తేనే మైక్ ఇస్తున్నారు


'ఆయన కనుసైగ చేస్తేనే మైక్ ఇస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన కాల్ మనీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా విమర్శించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వాలని పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై ఎదురుదాడికి దిగడమే ఇందుకు నిదర్శమని రోజా తెలిపారు.
సభా నిబంధనలంటూ కాల్ మనీ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఎవరికి మైక్ ఇవ్వాలన్నది చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతుందని రోజా మండిపడ్డారు. అసలు అసెంబ్లీ తరహాలోనే సభా సమావేశాలు సాగకపోవడం నిజంగా సిగ్గుచేటన్నారు.

 
రోజా ఇంకా ఏమన్నారంటే....
* చంద్రబాబు సైగ చేస్తేనే స్పీకర్ మైక్ ఇస్తున్నారు
* రోజాకి  మైక్ ఇవ్వకుండా మహిళల్ని కించపరిచారు
* గతంలో నీకు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ కే మైక్ ఇవ్వకుండా అడ్డుకున్న చరిత్ర నీది
* సెక్స్ రాకెట్ అనేది మహిళల మానానికి, ప్రాణానికి సంబంధించినది
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇది తలదించుకునే వ్యవహారం
* మేము స్టేట్ మెంట్ ఇస్తామని బుల్ డోజ్ చేస్తున్నారు
* కాల్ మనీ- సెక్స్ రాకెట్ లో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తో పాటు, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు
* అందుకు ఆ వ్యవహారాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు
* రాజ్యానికి తూట్లు పొడిచే చంద్రబాబు.. గుడి, మసీదు, చర్చిలోకి వెళితే మంచివాడు అయిపోడు
* అంబేద్కర్ జయంతి వేడుకల్ని, వర్ధంతి వేడుకల్ని కూడా ప్రభుత్వం జరపడం లేదు
* రాజ్యాంగ నిర్మాతనే విస్మరించారు
* వంగలపూడి అనితను అడ్డుపెట్టుకుని నన్ను తిట్టిస్తున్నారు
* అంగన్ వాడీ మహిళల్ని మగ పోలీసులచే కొట్టిస్తే ఈ మహిళా ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా?
* ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న మహిళా ఎమ్మార్వో వనజపై టీడీపీ నేతలు దాడి చేస్తే పీతల సుజాత ఏం చేశారు
*ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం మాఫియా, కాల్ మనీ -సెక్స్ రాకెట్ మాఫియాల్లో టీడీపీ నేతలు ఉండటంతో తప్పించే యత్నం చేస్తున్నారు
* ఓటుకు కోటుకు కేసు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ తో చంద్రబాబు సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు
* అన్ని తప్పులు చేసిన చంద్రబాబు అందరి కాళ్లు పట్టుకుని తప్పించుకుంటారు
* సెక్స్ రాకెట్ లో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందే

ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్


ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు  సస్పెండ్ చేశారు. శుక్రవారం ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి ప్రతిపాదన మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రోజమ్మ ఏ తప్పు చేసిందని సస్పెండ్ చేశారని ప్రశ్నించారు.


రోజాపై సస్పెన్షన్ వేటు వేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజాను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి తమను దూషిస్తే చర్యలు తీసుకోరా  అని నిలదీశారు. శాసనసభలో కాల్ మనీ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు, అధికార పక్ష సభ్యులు నేరుగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు.

ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా?


ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా?
హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటనపై వైఎస్ జగన్ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి తన పాటికి తాను ప్రకటనను చదువుకుంటూ వెళ్లారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించి సభ్యుల హక్కును కాలరాస్తున్నారు. ఇలాంటి శాసన సభను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ సభ్యుల హక్కు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ్యులకు అవకాశం ఇవ్వకుండా కౌరవ సభను నిర్వహిస్తుంటే ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి కాల్ మనీపై స్టేట్ మెంట్ ఇవ్వడం, దానిపై మాట్లాడటానికి సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో నిందితులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇక్కడే ఉన్నారు. వారిని అరెస్ట్ చేయలేదు. మరి బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. వారిపై దాడి జరుగుతున్న చిత్రాలను ప్రదర్శించిన ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నందుకు ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.

తన పాపం బయటపడుతుందనే ఇలా...


'తన పాపం బయటపడుతుందనే ఇలా.. '
అసెంబ్లీ నుంచి సస్పెండైన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ''నిన్నటి బిజినెస్ ఎజెండా చూడండి.. ఈ జాబితాలో అంబేద్కర్ గారి గురించి ఎక్కడా లేదు. ఆ అంశం మీద చర్చ జరుగుతుందని ఎక్కడైనా ఒక్క చోటైనా ఉందా అని అడుగుతున్నా. తొలిసారి వాయిదా పడినప్పుడు అంబేద్కర్ అంశం లేదు. రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన చర్చ జరగకూడదని, జరిగితే తాను చేసిన పాపం బయటపడుతుందని భావించారు.

చంద్రబాబుతోను, ఇంటెలిజెన్స్ డీజీతోను నిందితుడు పిచ్చాపాటీ మీటింగ్ పెట్టుకున్నాడు. సీఎం అండదండలు లేకపోతే ఇలా కూర్చోగలడా? ఇక ఓ టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ అనే నిందితునితో విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. తర్వాత ఎమ్మెల్యే తిరిగొస్తాడు గానీ నిందితుడు మాత్రం విదేశాల్లోనే ఆగిపోతాడు. ఆ నిందితుడు ఎక్కడున్నాడని పోలీసులు ఎమ్మెల్యేను ప్రశ్నించరు, కేసులు పెట్టరు. మరో ఎమ్మెల్సీ చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన సొంత అన్న.. కాల్‌మనీ కేసులో నిందితుడు. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. అయినా ఈ ఎమ్మెల్సీ మీద కేసు పెట్టరు, కస్టడీలోకి తీసుకోరు, ప్రశ్నించరు.

ఇవన్నీ చంద్రబాబు దీవనెలతో జరుగుతున్నాయి. ఆయన కొడుకు ఆశీస్సులు కూడా దీనికి ఉన్నాయి. ఈ చర్చను తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులందరి మీద దాడులు చేస్తారు. ఇదేదో మామూలు వడ్డీ వ్యాపారమని తేల్చేయడానికి చూస్తారు. కృష్ణాజిల్లాలో అతి హేయంగా ఆడవాళ్ల మానప్రాణాలతో ఆడుకుని, వారిని అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేశారు. 200 పైచిలుకు వీడియో సీడీలు దొరికాయి. ఆడవాళ్లకు ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చి, అవి తీర్చలేదని వాళ్ల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్లను శాశ్వతంగా వేశ్యవృత్తిలోకి దింపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాకెట్‌లో చంద్రబాబు నుంచి ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా ఉన్నారు.

ఇంత ముఖ్యమైన అంశం మీద అసెంబ్లీలో చర్చ రాకుండా చేసేందుకు అంబేద్కర్ గారిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు గట్టిగా అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకున్నారు. పార్లమెంటులో రెండురోజులు చర్చిస్తే చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నవంబర్ 26న పార్లమెంటు చర్చించిందంటే, అది రాజ్యాంగ రచన పూర్తిచేసిన రోజు. అందుకే అప్పుడు పార్లమెంటులో దాని గురించి రెండు రోజులు చర్చించారు. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. అంబేద్కర్ జయంతి, వర్ధంతి, రాజ్యాంగసభ తొలి సమావేశం, రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించిన రోజు.. ఈ రోజుల్లో ఎప్పుడూ చంద్రబాబుకు ఆయన గురించి చర్చ జరపాలని గుర్తుకు రాలేదు. ఈవాళ మాత్రం.. డిసెంబర్ 17, 18 తేదీల్లో గుర్తుకొస్తున్నారు. సెక్స్ రాకెట్ కేసులో తాను, తన వాళ్లు నిండా మునగడంతో బయట పడేందుకు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఒకసారి చూడండి.. ఆ విగ్రహాలను క్లీన్ చేయించాలన్న ఆలోచన కూడా లేదు. దుమ్ము, ధూళితో ఉన్నాయి. దండ ఎండిపోయింది. లోపల అసెంబ్లీలో మాత్రం అంబేద్కర్‌ను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇంత రాక్షస పాలన ఎక్కడా ఉండదు. సెక్స్ రాకెట్‌లో ఉన్నవాళ్లు పేదలు కారా, అంబేద్కర్ బిడ్డలు కారా అని అడుగుతున్నా. వాళ్లను కాపాడే కేసును నీరుగార్చడానికి మీరు చేస్తున్నది కరెక్టేనా అని అడుగుతున్నా'' అన్నారు.

రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కూడా వాడుకోవడం దుర్మార్గమని ఇతర ఎమ్మెల్యేలు అన్నారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని చర్చించాలని అడిగినందుకు తమను మార్షల్స్‌తో బలవంతంగా బయటకు తరలించారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మందబలంతో ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ప్రజలంతా చూశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. అత్యంత ముఖ్యమైన కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చించడానికి అధికారపక్షానికి తీరికలేదా అని ప్రశ్నించారు.

బాబుగారి డాక్టరేట్ అసలు కథ ఇదీ!


బాబుగారి డాక్టరేట్ అసలు కథ ఇదీ!
హైదరాబాద్ :
చంద్రబాబుకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హల్‌చల్ చేస్తోంది. అమెరికాలో ఒక సాధారణ యూనివర్సిటీ మాత్రమే ఆయనకు డాక్టరేట్ ఇస్తుండగా, టీడీపీ.. దాని అనుకూల మీడియా మాత్రం ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన షికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టు కథనాలు ప్రచురించాయి. అసలు సంగతి ఏమిటంటే, అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో, షికాగో స్టేట్ యూనివర్సిటీ అని రెండు ఉన్నాయి.

నిజానికి చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నది యూనివర్సిటీ ఆఫ్ షికాగో కాదు... షికాగో స్టేట్ యూనివర్సిటీ మాత్రమే. యూనివర్సిటీ ఆఫ్ షికాగో అయితే.. అమెరికాలోని టాప్ టెన్‌ విశ్వవిద్యాలయాల్లో ఉంటుంది. షికాగో స్టేట్ యూనివర్సిటీ మాత్రం అమెరికాలోనే అత్యంత తక్కువ ర్యాంక్ ఉన్నవాటిలో ఒకటి. మరో కీలక అంశం ఏమిటంటే చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్న షికాగో స్టేట్ యూనివర్సిటీలో తెలుగువాడైన దేవీశ్రీ వి. పొట్లూరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా ఈ యూనివర్సిటీని సందర్శించారు. ఆ సమయంలో అక్కడి ప్రొఫెసర్ రవి అచంట మంత్రితో పాటు దగ్గరుండి సమన్వయం చేశారు.

కింజరాపు వారే అతి పెద్ద వడ్డీ వ్యాపారులు


► వారి ఇళ్లలో సోదాలు చేయాలి
► వైఎస్సార్ సీపీ నేత దువ్వాడ డిమాండ్
టెక్కలి: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యాపారంలో భాగంగా ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబీకులే అతి పెద్ద వడ్డీ వ్యాపారస్తులని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీకు చెందిన నేతలే అధికంగా ఉన్నారని వారిని రక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని దువ్వాడ పేర్కొన్నారు.
అయితే సుమారు 25 ఏళ్ల క్రితం వందల కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్రలో టిడీపీ నేత  కింజరాపు ఎర్రన్నాయుడుతో ఈ వడ్డీ వ్యాపారం ప్రారంభమైందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల్లో పలు షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, రైస్ మిల్లులు తదితర వ్యాపారాలతో పాటు పలువురు నేతలతో ఎర్రన్నాయుడు వడ్డీ వ్యాపారాలు సాగించారని దువ్వాడ చెప్పారు. అసలు నేరస్తులను విడ్చిపెట్టి సామాన్య వ్యాపారులపై పోలీసులు దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. కింజరాపు కుటుంబీకులు చేసిన వడ్డీ వ్యాపారాలపై మంత్రి అచ్చెన్నాయుడు నోరు విప్పాలని దువ్వాడ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సామాన్య వ్యాపారులపై దాడులు చేయడం కాదని కింజరాపు కుటుంబీకుల ఇళ్లల్లో సోదాలు చేసి వారిపై కేసులు నమోదు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంపై సస్పెన్షన్ వేటు


ప్రతిపక్షం మొత్తాన్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి తమ చర్చ తాము జరుపుకోడానికి అధికార పక్షం కుట్ర పన్నింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరినీ అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. కాల్ మనీ అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టడం, అయినా వినిపించుకోకుండా అధికార పక్షం యథా ప్రకారం అంబేద్కర్ అంశంపైనే చర్చను కొనసాగిస్తుండటంతో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.

దాంతో యనమల మొత్తం ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ స్పీకర్‌ను కోరారు. దాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటిస్తూ, అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు మొత్తం ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు అందరి పేర్లను చదివి ప్రకటించారు.
అయినా కొద్దిసేపటి పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలోనే ఉండి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెండైన సభ్యులందరూ వెంటనే సభను వదిలిపెట్టి వెళ్లిపోవాలని స్పీకర్ పదేపదే చెప్పారు. సభలో అనుచిత ప్రవర్తన మానుకోవాలని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో స్పీకర్ కోడెల తన సీటు నుంచి లేచి వెళ్లిపోగా, ప్యానల్ స్పీకర్ విష్ణుకుమార్ రాజు అధ్యక్ష స్థానంలోకి వచ్చారు. ఆయన మార్షల్స్‌ను పిలిచి, విపక్ష సభ్యులను బయటకు పంపాల్సిందిగా సూచించారు.

మరో రెండు రోజులు పొడిగించి..


ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఇలా ఉంది
హైదరాబాద్ :
ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఎవరైనా, చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఇస్తారు గానీ, ప్రకటన తర్వాత చర్చ అనేది తాను ఎక్కడా వినలేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతోందని చెప్పారు. ''సీఎం ప్రకటన చేసేసిన తర్వాత ఇక చర్చించడానికి ఏముంది? కామన్ సెన్స్ ఉండాలి. చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఉండాలి. అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, ఐదురోజులే ఎందుకు పెట్టారు, అది కూడా మధ్యాహ్నం వరకే ఎందుకు? మరో రెండు రోజులు పొడిగించి, ఆ రెండు రోజులు అచ్చంగా అంబేద్కర్ గారి మీదే చర్చిద్దాం. చంద్రబాబు, ఆయన కొడుకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సెక్స్ రాకెట్‌లో ఉన్నారు. డీజీ ఇంటెలిజెన్స్ ఈ మాదిరిగా నిందితులతో కూర్చుంటున్నారు. ఇంత ముఖ్యమైన టాపిక్ మీద చర్చ జరగకుండా చూసుకోడానికి అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు'' అని ఆయన అన్నారు.

చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు

చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌ను కూడా వాడుకున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు.

ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజ్యాంగ ఆమోద దినాన్ని కూడా కేవలం వైఎస్ఆర్‌సీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిందని చెబుతున్నారు. అసెంబ్లీని ఐదు రోజుల పాటే నిర్వహిస్తూ దాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని ఊరుకోబోమని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడిగించి.. ఐదు రోజుల పాటు అంబేద్కర్ మీద చర్చ జరపాలని, మిగిలిన కాలాన్ని కాల్‌మనీ సెక్స్ రాకెట్ మీద చర్చించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
 • అంబేద్కర్ వద్దకు వచ్చి, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ను సైతం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే తీరును వ్యతిరేకించాం.
 • ఆయనకు నివాళులు అర్పించాం.
 • ఎంత హేయమైన పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉందంటే, మొత్తం రాష్ట్రం తలదించుకునేలా విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోంది.
 • విజయవాడలో అధిక వడ్డీకి ఆడవాళ్లకు డబ్బులిచ్చి, ఆ వడ్డీలు కట్టలేని ఆడవాళ్లు, పేదవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే అధ్వాన పరిస్థితి విజయవాడలో జరుగుతోంది.
 • ఆడాళ్లను అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వాళ్లను శాశ్వతంగా వ్యభిచారంలో ముంచేసేలా చేస్తున్నారు.
 • ఈ నేరంలో సాక్షాత్తు చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ భాగస్వామ్యం ఉంది.
 • వాళ్లంతా దోషులుగా నిలబడాలి.
 • కానీ చంద్రబాబు నిన్న అసెంబ్లీలో హేయంగా ప్రవర్తించారు.
 • ఈ టాపిక్ బయటకు రాకూడదన్న ఉద్దేశంతో, ఎజెండాలో లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడినప్పుడు సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు.
 • అసెంబ్లీ జరిగేది ఐదు రోజులు, అదికూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈ ఐదు రోజుల్లో సెక్స్ రాకెట్ మీద చర్చించాలన్న ఆలోచన లేదు.
 • చివరకు అంబేద్కర్‌ను కూడా వదల్లేదు
 • నిజానికి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, వర్ధంతి డిసెంబర్ 6న.
 • ఆయన అధ్యక్షత వహిచంఇన రాజ్యాంగ సంఘం తొలి సమావేశం డిసెంబర్ 9, 1946
 • రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26న
 • చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు. అప్పుడు నివాళులు అర్పించాలని అనుకోలేదు
 • డిసెంబర్ 17న ఏమీ లేనప్పుడు మాత్రం అసెంబ్లీలో అంబేద్కర్ గురించి చర్చిస్తామంటారు
 • ఇప్పుడు కూడా ఆయన ఏంచేయబోతున్నాడు, అసెంబ్లీలో ప్రకటన ఇస్తాడట. అది ఇంకా దారుణం.
 • స్టేట్‌మెంట్‌కు, చర్చకు చిన్న తేడా ఉంది. సీఎం స్టేట్‌మెంట్ ఇస్తే, ఇక చర్చ జరగదు. ప్రకటన మీద రెండు మూడు నిమిషాలు స్పష్టత ఇస్తారు
 • ఆయన ఇచ్చే ప్రకటన కూడా విజయవాడ అంశాన్ని దారి మళ్లించేందుకే.  
 • అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయిస్తున్నాడు
 • ఇదేదో సాదాసీదా వడ్డీ వ్యాపారంగా చిత్రీకరించి, సెక్స్‌ రాకెట్‌లో తాను, తనవాళ్లను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
 • సెక్స్ రాకెట్ చర్చను దారి మళ్లించేందుకు అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు
 • రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ విన్నపం చేస్తున్నా
 • చంద్రబాబు వల్ల ఎక్కడా రూపాయి అప్పు పుట్టడంలేదు
 • సున్నా వడ్డీకి అప్పులు దొరకట్లేదు
 • అధికవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది.
 • అలా అప్పు తీసుకున్న ఆడాళ్లను వేశ్యవృత్తిలోకి దించుతున్న ఈ రాకెట్‌ను మనంతా కలిసి అడ్డుకోవాలి.
 • లేకపోతే ఈ వ్యవస్థ ఇక బాగుపడదు. అంతా కలిసి ఒక్కటవుదాం.
 • చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ చట్టం ముందుకు తీసుకొద్దాం
 • ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి అయినా సరే అంబేద్కర్ మీద చర్చ జరపాలని కోరినందుకు ఆయనకే విన్నవించుకుంటున్నాం
 • మీరు పోయిన తర్వాత ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చూడాలని కోరాం
 • పేద మహిళల కోసం మేం పోరాటం చేస్తుంటే, దానిపై చర్చ జరగనివ్వకుండా, అంబేద్కర్‌ను తెరమీదకు తెచ్చారు.
 • ఆయన వైఖరికి దేవుడు, ప్రజలు బుద్ధి చెబుతారు.

అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు


అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు
వైఎస్సార్‌సీపీ నిర్ణయం
 • హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
 సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను టీడీపీ అసెంబ్లీ వేదికగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ముత్తిరేవుల సునీల్ ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని చర్చకు రానీయకుండా అంబే డ్కర్ మహాశయుని గురించి, రాజ్యాంగం గురించి చర్చిద్దామని ఉన్నపళంగా టీడీపీ ప్రతిపాదించడంపట్ల వారు తీవ్రంగా మండిపడ్డారు. అంతేగాక వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డికి, తమ పార్టీ ఎమ్మెల్యేలకు అంబేడ్కర్ అంటే గౌరవం లేదంటూ టీడీపీ నేతలు మాట్లాడుతుండడాన్ని తప్పుపట్టారు.

తమకు, తమ నేత జగన్‌కు అంబేడ్కర్ అంటే అపారమైన గౌరవముందని, ఆ మహాశయుడు రచించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గతనెల 26న రాష్ట్రవ్యాప్తంగా జరిపి ఆయన ఆశయాల్ని స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. నిజానికి అంబేడ్కర్‌ను రాజకీయంగా వాడుకోజూసింది టీడీపీయేనని వారు స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతికి అంబేడ్కర్ తపించార ని, అలాంటి మహానుభావుడ్ని అడ్డంపెట్టి మహిళల మాన,ప్రాణాలను భక్షించిన కాల్‌మనీ రాకెట్‌పై చర్చించకుండా అడ్డుపడ్డారని వారన్నారు. వాస్తవానికి కాల్‌మనీపై చర్చించి దోషుల్ని శిక్షించేలా నిర్ణయం తీసుకునిఉంటే అది అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అయ్యేదన్నారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇరుక్కుని చిక్కుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు అంబేడ్కర్‌ను అడ్డు పెట్టుకున్నది టీడీపీయేనన్నారు. ఇటీవలి జనచైతన్యయాత్రల సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో మంత్రి రావెల కిషోర్‌బాబు బూటుకాళ్లతోనే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారని(కల్పన ఆ ఫొటోను చూపుతూ..) దీన్ని బట్టి టీడీపీ వారికి ఆ మహనీయుడంటే ఎంత భక్తి, గౌరవముందో అర్థమవుతోందన్నారు. రావెల, పీతల సుజాత ఇద్దరూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

 నేడు అంబేడ్కర్ విగ్రహానికి జగన్ పాలాభిషేకం
 ఇదిలా ఉండగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లడానికి ముందు ఉదయం 8.15 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పాల్గొంటారని సునీల్ తెలిపారు. పార్టీ  ఎమ్మెల్యేలందరూ హాజరవుతారన్నారు.
 

మంత్రి కోరింది... ఒక్కరోజు..

మంత్రి కోరింది... ఒక్కరోజు..
మంత్రి కోరింది... ఒక్కరోజు..
స్పీకర్  సస్పెండ్ చేసింది రెండు రోజులు!
 హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై అసెంబ్లీలో గురువారం చర్చకు పట్టుబడుతూ నిరసన తెలిపిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో బి.శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండురోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానంలో మాత్రం ఒక రోజే అని పేర్కొన్నా ఎమ్మెల్యేలపై స్పీకర్ రెండు రోజుల సస్పెన్షన్‌ను విధించడం గమనార్హం.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే అధికార పక్షం ముందస్తు వ్యూహంతో ఈ చర్యకు దిగింది. స్పీకర్ కంటే ముందే చీఫ్ విప్, శాసనసభ వ్యవహారాల మంత్రి పదేపదే హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత స్పీకర్ వారి పేర్లను ప్రస్తావించడం, ఆ వెంటనే తీర్మానం, సస్పెన్షన్ చకచకా జరిగిపోయాయి.

ఇలా మొదలైంది...

రెండో సారి వాయిదా అనంతరం తిరిగి 12.14 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమైన వెంటనే కాల్ మనీపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇంతలో సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి యనమల, జి.సూర్యారావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై అవాకులు, చెవాకులు పేలారు.

ఈ దశలో స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నడిచింది. సభలో నినాదాలు మిన్నంటడంతో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని గందరగోళం నెలకొంది. అప్పుడు యనమల జోక్యం చేసుకుంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు ‘సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
 
ఒక రోజా, రెండ్రోజులా?
ఈ గొడవ మధ్యలోనే మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సభలో కెమెరాలకు ఆటంకం కలిగించినందుకు బి.శివప్రసాదరెడ్డి, డి.రామలింగేశ్వరరావును ఒక రోజు పాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. దీన్ని స్పీకర్ మూజువాణీ ఓటుతో ఆమోదింపజేస్తూ ఆ ఇద్దర్నీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అధికారపక్షం తీరుతో ప్రతిపక్ష సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు.
 
తీర్మానానికి విరుద్ధంగా స్పీకర్ సస్పెండ్ చేయవచ్చా?
శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల స్పష్టంగా ఒక్కరోజు సస్పెండ్ చేయమని తీర్మానాన్ని ప్రతిపాదిస్తే స్పీకర్ మాత్రం రెండు రోజులు చేయడం వివాదాస్పదమైంది. సభా నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, స్పీకర్ చర్చకు పెట్టి ఓటింగ్ నిర్వహించడం మాత్రమే చేయాలి. కానీ, గురువారం సభలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ఆక్షేపించినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ లేకపోయింది.

టీడీపీ నేతలే సూత్రధారులు!


టీడీపీ నేతలే సూత్రధారులు!
కాటేసిన ‘కాల్’ నాగులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అక్రమాలు బయటపడ్డ ప్రతిసారీ చంద్రబాబు వేళ్లు ప్రత్యర్థులవైపే చూపిస్తాయి. తనపైనా, టీడీపీ నేతలపైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎదురుదాడి చేయడం ఆయన నైజం. అదే పంథాను ‘మనీ-సెక్స్’ రాకెట్‌లోనూ బాబు అవలంభిస్తున్నారు. కాల్‌మనీ ముఠా సాగించిన అకృత్యాలు వెలుగులోకి వచ్చిన వెంటనే కఠినచర్యలకు ఆదే శించాల్సిన ఏపీ ముఖ్యమంత్రి.. ఆ పని చేయకుండా విపక్షాలను ఆ బురదలోకి లాగే ప్రయత్నం చేస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ సెక్స్ రాకెట్ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్న ఏడుగురిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు లేదా ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నవారే అయినప్పటికీ.. వాస్తవాన్ని అంగీకరించకుండా ఎప్పటిలాగే అడ్డంగా బుకాయిస్తున్నారు. ఈ కేసులో నిందితులు కొందరికి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పేందుకు మచ్చుకు కొన్ని రుజువులు..

     కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఏ1 (మొదటి) నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి (రాము). ఇతనికి టీడీపీ నగర నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఒక పార్టీయే ఇందుకు నిదర్శనం. ఈ వేడుకకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఏ1 రాము కూడా ఇందులో పాల్గొనడం, రామ్మోహన్‌కు ఒకవైపున నిలబడి ఫొటో కూడా దిగడం తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ నేతలతో రాముకున్న సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.

     ఏ2 గా ఉన్న భవానీ శంకర్ బౌన్సర్. ఇతను.. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడైన కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్‌కు అత్యంత సన్నిహితుడు. కాగా శంకర్ బాగా ఖరీదైన జాగ్వార్ (ఏపీ 16డీఏ 5111) కారును ఉపయోగిస్తున్నట్టు.. ఆ కారుతో అతను దిగిన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కారును శంకర్‌కు రవికుమార్ ఇచ్చాడని చెబుతున్నారు. ఎంత సన్నిహితుడు కాకపోతే అంతటి ఖరీదైన కారు ఇస్తాడని అంటున్నారు.

    నాలుగో నిందితుడు సత్యానందంకు నేరుగా చంద్రబాబుతోనే సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ఇప్పటికే స్పష్టమయ్యింది. ఆయన చంద్రబాబుతోనూ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోనూ కలసి దిగిన ఫొటోలు కూడా వెలుగుచూశాయి. చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న సత్సంబంధాల కారణంగానే సత్యానందం గతంలో నందిగామ టిక్కెట్ కోసం ప్రయత్నించారు.

    ఏ5 వెనిగళ్ల శ్రీకాంత్‌కు టీడీపీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. శ్రీకాంత్‌తో కలసి ప్రసాద్ గతంలో పలుమారు విదేశీ పర్యటనలకు వెళ్లారు. తాజాగా మనీ-సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చినప్పుడు కూడా వీరిద్దరూ విదేశంలోనే ఉన్నారు. బ్యాంకాక్‌లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలు కూడా హల్‌చల్ చేశాయి. అంతేకాదు శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్త అని, పార్టీ కార్యక్రమాలన్నిటిలో చురుగ్గా పాల్గొంటాడని తెలిసింది.

   ఆరో నిందితుడు పెండ్యాల శ్రీకాంత్  కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్త కావడం గమనార్హం.. కాగా ఏడో నిందితుడు దూడల రాజేశ్ గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయినా ప్రస్తుతం రాము బ్యాచ్‌లోనే ఉన్నాడని, టీడీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని సమాచారం ఉంది.

టార్గెట్ వైసీపీ..


టార్గెట్ వైసీపీ..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కుంభకోణాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపిన పాలకులు ఇప్పుడు వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా ఆర్థిక దాడులకు, వేధింపులకు తెగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపే పేరిట పోలీసులు కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులనే టార్గెట్ చేస్తున్నారు. ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలు ఎస్టీడీ వడ్డీలతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నా వారి జోలికి వెళ్లే సాహసం చేయలేని పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు ఒక్కరోజు వ్యవధిలో చోటుచేసుకున్న ఘటనలే తార్కాణం.

 గుండాల ఇంట్లో చేష్టలుడిగి..
 ఏలూరు నగరంలోని చేపల తూము సెంటర్‌కు చెందిన ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండాల దుర్గారావు(జీడీఆర్) ఇంటికి మంగళవారం రాత్రి తనిఖీలకు వెళ్లిన సీఐ ఎన్.రాజశేఖర్, పోలీసు సిబ్బందికి ఆ కుటుంబ సభ్యులు చుక్కలు చూపించారు. పోలీసులని కూడా చూడకుండా చెలరేగిపోయారు. నానాయాగీ చేసి దుర్భాషలాడారు. దుర్గారావుకుమార్తె వెంటనే ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ఫోన్ చేస్తే.. ఆయన అర్ధరాత్రి  2గంటల సమయంలో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ‘ఇప్పుడేంటి హడావుడి.. తర్వాత చూద్దాం వెళ్లండి’ అనగానే మారుమాట్లాడకుండా పోలీసులు వెనక్కి వచ్చేశారు.

 పిల్లంగోళ్ల ఇంట్లో పోలీస్ షో
 అదే  సీఐ రాజశేఖర్, పోలీసులు గురువారం ఏలూరు కర్రల వంతెన  సమీపంలో ఉంటున్న వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఇంటికి సోదాలకు వెళ్లారు. వాస్తవానికి శ్రీలక్ష్మి తండ్రి రంగారావుకు వడ్డీ వ్యాపారం ఉన్నా ఆమెకు, ఆమె భర్తకు ఈ వ్యాపారంతో ఎటువంటి సంబంధాలు లేవు. అయితే, ఎన్నో చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్న కేఆర్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదును సాకుగా చూపించి గురువారం శ్రీలక్ష్మి ఇంట్లో పోలీసులు హల్‌చల్ చేశారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో కేవలం ఒక మహిళా కానిస్టేబుల్‌ను వెంట పెట్టుకుని సీఐ, ఎస్సై, 10మంది కానిస్టేబుళ్లు  ఇంట్లో అణువణువూ సోదా చేశారు. బెడ్‌రూమ్‌లు, వంట గదులే కాదు.. చివరకు బాత్‌రూమ్‌లలోనూ తనిఖీలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు లభ్యం కాకపోవడంతో వెనక్కివెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే అండ ఉన్న గుండాల దుర్గారావుపై ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణ చేపట్టకుండా వాస్తవాలను తొక్కిపెడుతున్న పోలీసులు... తండ్రి వ్యాపారంతో సంబంధం లేని పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని మాత్రం టార్గెట్ చేయడం చూస్తుంటేనే ఖాకీల పనితీరు ఏమిటో అవగతమవుతోంది.

దమ్ముంటే విజయవాడ కాల్‌మనీ నిందితులను శిక్షించండి


ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యానికి పరాకాష్టగా నిలిచిన విజయవాడ కాల్‌మనీ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులైన టీడీపీ నాయకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అవసరానికి అప్పు తీసుకున్న పేద మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, వారిని అసభ్యంగా చిత్రించి వీడియోలను బయట పెడతామని బెదిరింపులకు పాల్పడడం టీడీపీ నాయకులకు తప్పుగా అనిపించకపోయినప్పటికీ, సభ్య సమాజం ఈ విషయం తెలుసుకుని ఛీత్కరించుకుంటోందన్నారు.
 
  చంద్రబాబు ప్రభుత్వం అటువంటి వారందరినీ వెనకేసుకు వస్తూ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తలవంపులన్నారు. టీడీపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నేరస్తులున్నారనడానికి విజయవాడ సంఘటనే నిదర్శనమన్నారు. వీరిని కేసుల నుంచి తప్పించి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ప్రభుత్వం అమాయకులైన చిరు వ్యాపారులపై దాడులకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. అసలు నేరస్తులను విడిచిపెట్టి వైఎస్సార్ సీపీ నాయకులను నేరస్తులుగా చిత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సుబ్బారాయుడు హితవు పలికారు. అమాయకులైన చిరు వ్యాపారులను వదిలేసి టీడీపీలోని నేరస్తులైన నేతలను అరెస్టు చేయడం ద్వారా చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని, ప్రజా సంఘాలు, బాధితులతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు

లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్?

Written By news on Thursday, December 17, 2015 | 12/17/2015


చంద్రబాబుకు డాక్టరేటా?
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఏం సాధించారని షికాగో యూనివర్సిటీ చంద్రబాబునాయుడుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. 19 నెలల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్ అని ధ్వజమెత్తారు. ఇలాంటి డాక్టరేట్‌లు ఇక్కడి పాలనలో మగ్గుతున్న ప్రజలు ఎలాగో ఇవ్వరు, అందుకే సప్త సముద్రాల అవతల ఉన్న వర్సీటీ నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు 300కి పైగా వాగ్దానాలు చేసి , ఏ ఒక్క హామీ నెరవేర్చనందుకు డాక్టరేట్ ఇచ్చారా అని రోజా ప్రశ్నించారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ లాంటిది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు కాబట్టి ఈ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నారా అన్నారు.. ఓటుకు నోటు కేసులో దొరికినందుకు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వడంతో షికాగో విశ్వవిద్యాలయ స్థాయి ఇంతగా తగ్గిపోయిందా అన్న అనుమానం, బాధ కలుగుతోందని రోజా వ్యాఖ్యానించారు. మూడు వందలకు పైగా వాగ్దానాలు  చేసి ఏ ఒక్కటీ అములు చేయకపోవటం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏనాడూ కనీవినీ ఎరుగని సంఘటన అని అందుకే ఈ డాక్టరేట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.  

అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సీపీ పాలాభిషేకం

టీడీపీ నేతలు అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని అవమానపరిచారని.. అందువల్ల శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఉప్పులేటి కల్పన పిలుపునిచ్చారు.

శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నట్లు ఆమె తెలిపారు. అసెంబ్లీకి వెళ్లే ముందుగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్, రాజ్యాంగంపై చర్చకు అసెంబ్లీ సమావేశాలను మరో అయిదు రోజుల పాటు పొడిగించాలని ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు.

ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదు


ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదు
హైదరాబాద్ :
ఆడవారి మానప్రాణాలతో టీడీపీ నేతలు చెలగాటం అడి వీడియోలు తీశారని, ఆ సెక్స్ రాకెట్ ముఠాను చంద్రబాబు కాపాడుతున్నారని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇక ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
 • సెక్స్ రాకెట్‌కు సంబంధించి స్పష్టంగా ఆధారాలున్నాయి
 • చంద్రబాబు ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోంది
 • ఆ నిందితులు చంద్రబాబుతో, ఇంటెలిజెన్స్‌ డీజీతో టీడీపీ ఎమ్మెల్యేలతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి.
 • నిందితులను విదేశాల్లో వదిలేసి బోడె ప్రసాద్ వచ్చినా ఆయన్ను విచారించలేదు
 • మరో ఎమ్మెల్సీ సొంత తమ్ముడే ఈ కేసులో నిందితుడు
 • ఎమ్మెల్సీతో పాటు ఆయన సోదరుడు ఒకే ఇంట్లో ఉంటారు
 • అయినా ఆ ఎమ్మెల్సీ తనకేమీ తెలియదంటాడు
 • అయినా టీడీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి కేసులుండవు, విచారణ జరగదు
 • అతి దారుణమైన సంఘటనను ప్రశ్నించిన మాపార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు
 • కేసును నీరుగార్చేందుకు వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు
 • సెక్స్ రాకెట్ కేసును దారి మళ్లించేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలు చూస్తుంటే.. ఇంత దారుణమైన సీఎం దేశంలో ఎక్కడా లేరనిపిస్తోంది
 • చంద్రబాబుకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదు
 • మా పార్టీ వైఖరిని బీఏసీలో స్పష్టంగా చెప్పినా అబద్ధాలు ఆడుతున్నారు
 • చంద్రబాబు కాల్‌బాబు, మనీబాబు, సెక్స్‌రాకెట్ బాబు అని అనచ్చు
 • చంద్రబాబుకు సడన్‌గా అంబేద్కర్ గుర్తుకొచ్చారు
 • అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమే
 • నా జీవితంలో ఇంత దారుణమైన వ్యక్తిని చూడలేదు
 • సభలో ఒకరోజు సస్పెండ్ చేయమని చెబితే, రెండు రోజులు సస్పెండ్ చేశారు
 • ఇలాంటి దుశ్శాసన, దుర్మార్గపు కౌరవ సభ ఇంకోటి ఉండదు
 • తప్పుచేసిన ఎమ్మెల్యేను ప్రశ్నించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు
 • వనజాక్షి, రిషితేశ్వరి కేసులో ఒక్కరిని కూడా నిలదీసిన పాపాన పోలేదు
 • లాండ్, శాండ్, లిక్కర్, సెక్స్ మాఫియాలో చంద్రబాబు భాగం

ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణం


హైదరాబాద్ : బీసీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ... దాడిశెట్టి రాజా ఏం తప్పు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం ద్వారా బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. బీసీలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి.
అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పట్టుపట్టింది. అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి చర్చకు పట్టుపట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ క్రమంలో కెమెరాలకు అడ్డువస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు శివప్రసాద్ రెడ్డితోపాటు దాడిశెట్టి రాజాలను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

Popular Posts

Topics :