ఫిబ్రవరి 2న జీహెచ్ ఎంసీ ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిబ్రవరి 2న జీహెచ్ ఎంసీ ఎన్నికలు

ఫిబ్రవరి 2న జీహెచ్ ఎంసీ ఎన్నికలు

Written By news on Friday, January 8, 2016 | 1/08/2016

హైదరాబాద్: ఎట్టకేలకు జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

ఈనెల 12వ తేదీన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 17వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఆ మరునాడు అంటే 18న నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. అయితే నామినేషన్ల ఉప సంహరణ గడవు  ఈ నెల 21వ తేదీతో ముగియనుంది.  ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంలో గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయపార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అయితే ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

అమలులోకి ఎన్నికల కోడ్..
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడటంతో గ్రేటర్‌ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లు దొర్లినట్లయితే ఫిబ్రవరి 4న రీపోలింగ్ నిర్వహిస్తామన్న ఆయన.. మొత్తం ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. 
Share this article :

0 comments: