చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత బొత్స
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు సమయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రుల రక్షణకు సెక్షన్- 8 అమలు చేయాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ విషయమే ప్రస్తావనకు తీసుకురాకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మంత్రులు గవర్నర్‌పై విమర్శలు చేయకూడదని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ పెడచెవిన పెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బొత్స విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నేతల ప్రచారం నాటకీయంగా, తమాషాగా ఉందన్నారు. టీడీపీ సహా మిగిలిన పార్టీ నేతల హావభావాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి మహా నటుల నటననే మించిపోయాయని తెలిపారు.
సొంత సమస్యల నుంచి బయటపడడం కోసం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్న 50- 60 లక్షల మంది ఆంధ్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ‘నేను ఇక్కడే ఉంటాన’ని చంద్రబాబు హైదరాబాద్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్తున్నారని, ఆయనేమైనా ద్విపాత్రాభినయం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ వద్ద ఓటుకు కోట్లు కేసును ప్రస్తావిస్తే... గ్రేటర్ ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామన్నారని గుర్తు చేశారు. ప్రజలు అమయాకులనుకుంటూ ఏ సమయానికి ఆ మాటలు చెబుతున్నారా? అని దుయ్యబట్టారు.
కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే జీవోలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తట్టెడు మట్టి తీసే పనులు జరగడం లేదు కానీ, ఆ కాంట్రాక్టరుకు వందల వేల కోట్లు లబ్ది చేకూర్చుతూ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబరు-13ని జారీ చేసిందని బొత్స దుయ్యబట్టారు. ఈ జీవో ద్వారా కాంట్రాక్టరు అదనపు ప్రయోజనం చేకూర్చిన రూ. 2000 కోట్లలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అని ప్రశ్నించారు.

కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగే కాపు గర్జన సభలో తాను పాల్గొంటానని.. కులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ సమావేశంలో పాల్గొనాలని తాను కోరుకుంటున్నట్టు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చె ప్పుకుంటున్న ప్రభుత్వం ఆ కార్యక్రమ నిర్వహణకు ఎందుకు అటంకాలు కల్పిస్తోందని ప్రశ్నించారు
0 comments:
Post a Comment