బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడం: చెవిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడం: చెవిరెడ్డి

బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడం: చెవిరెడ్డి

Written By news on Tuesday, January 19, 2016 | 1/19/2016


ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులన్నింటినీ కొట్టివేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి ఉద్యమకారులను అవమానిస్తున్నారని తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడం సిగ్గుచేటన్నారు.

ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము నిబద్ధత కలిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలమని, ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడమన్నారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణిపై ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: